Sri Scanda Mahapuranamu-3    Chapters   

పదునాల్గవ అధ్యాయము

మూ || నూత ఉవాచ -

ప్రాప్త సింహాసనో వీరోభద్రాయుః సమహీపతిః | ప్రవివేశ వనం రమ్యం కదాచిత్‌ భార్యయా సహా || 1 ||

తస్మిన్‌ వికసితాశోక ప్రసూన నవ వల్లనే | ప్రోత్ఫుల్ల మల్లికా ఖండ కూజద్ర్భ మరసంకులే || 2 ||

నవకే సరసౌరభ్య బద్ధరాగి జనోత్సవే | సద్యః కోరకితాశోక తమాలగహనాంతరే || 3 |.

ప్రసూన ప్రకరా సమ్ర మాధవీ వనమండపే | ప్రవాలకుసుమోద్ధ్యోత చూతశాభి భిరంచితే || 4 ||

పున్నాగవన విభ్రాంత పుంస్కోకిల విరావిణి | వసంత సమయో రమ్యే విజహారస్త్రియాసహ || 5 ||

అథా విదూరే క్రోశంతౌ ధవంతౌ ద్విజదంపతీ | అన్వీయమానౌ వ్యాఘ్రేణ దదర్శసృసత్తమః || 6 ||

సాహిసాహి మహారాజహారాజన్‌ కరుణానిధే | ఏషధావతి శార్దూలో జగ్ధుమావాం మహారయః || 7 ||

ఏశ పర్వత సంకాశః సర్వప్రాణి భయంకర ః | యాపన్న ఖాదతి ప్రాప్యతావన్నౌ రక్షభూపతే || 8 ||

ఇత్థమాక్రందితంశ్రుత్య సరాజాథనరాదదె | తాపదాగత్య శార్దూలో మధ్యే జాగ్రాహతాం వధూం || 9 ||

హానాథ నాథ హాకాంత హాశంభో జగతః పతే | ఇతిరో రూయ మాణాంతాం యావజ్ఞ గ్రాహభీషణః || 10 ||

తావత్సరాజా ః నిశితై ః భ##ల్లెః వ్యాఘ్రమతాడయత్‌ | నచతైర్వివ్యథేకించిత్‌ గిరీంద్ర ఇవవృష్టిభిః || 11 ||

స శార్దూలో మహాసత్వో రాజ్ఞోసై#్త్ర రకృత వ్యధః | బలాదాకృష్యతాం నారీం అపాక్రా మత సత్వరః || 12 ||

వ్యాఘ్రేణా పహృతాంపత్నీం వీక్ష్య విప్రో7తి దుఃఖితః | రురోదహాప్రియో బాలేహాకాంతేహా పతివ్రతే || 13 ||

ఏవం మామిహసంత్యజ్య కథంలోకాంతరం గతా | ప్రాణభ్యోపి ప్రియాంత్యక్ష్యా కథం జీవితుముత్సహె || 14 ||

రాజన్‌ క్వతే మహాస్త్రాణి క్వతేశ్లాఘ్యం మహద్ధనుః | క్వతే ద్వాదశ సాహస్ర మహానాగాతి గంబలం || 15 ||

తా || నూతిలిట్లన్నారు - సింహాసనమును పొందిన వీరుడు భద్రాయు మహారాజు ఒకసారి భార్యతోకూడి, అందమైన అడవిలో ప్రవేశించాడు. (1) వికసించిన అశోకపు మొగ్గలు కొత్త చిగుళ్ళుగల, బాగా వికసించిన మల్లికాఖండము లందు కూస్తున్న భ్రమరములతో కూడిన (2) నవకేసరముల వాసనతో బద్దులైరాగి జనులు ఆనందించగా,అప్పుడే మొగ్గలేత్తిన అశోకతమాల గహనముల మధ్య (3) పూల గుత్తులతో వంగిన మాధవీ వనమంటపమందు పగడపు పూలతో ప్రకాశించే మామిడి కొమ్మలతో కూడిన (4) పున్నాగ వనములందు తిరిగే పుంస్కో కిలల ధ్వనిగల రమ్యమైన వసంత సమయమందు భార్యతో కూడి అతడు విహరించాడు. (5) కొద్ది దూరంలో ఏడుస్తున్న, పరుగెత్తుతున్న బ్రాహ్మణ దంపతులను, పులితో అనుసరింపబడుతున్న వారిని, రాజు చూచాడు. (6) ఓ మహారాజ రక్షించు, ఓ రాజ కరుణానిధి రక్షించు. ఈ పులి మమ్మల్ని చంపటానికి వేగంగా పరుగెత్తుకొస్తుంది. (7) ఇది పర్వతమంత ఉంది. సర్వప్రాణులకు భయంకరమైంది. మాదరికి వచ్చి మమ్మల్ని తినకముందే మమ్మల్ని రక్షించు ఓ భూపతి ! (8) అనే అరుపును విని ఆ రాజు ధనస్సును తీసుకున్నాడు. ఇంతలో పులి వచ్చి మధ్యలో ఆస్త్రీని పట్టుకుంది. (9) హానాథ, నాథ, ఓ కాంత! ఓ శంభు జగత్పతి! అని ఏడుస్తున్న ఆమెను భీషణంగా అది పట్టుకున్నంతలో (10) ఆరాజు తీక్షమైన భల్లములతో ఆ పులిని కొట్టాడు. వాటితో కొంచెము గూడా ఆ పులి వ్యధ చెందలేదు. వర్షంతో పర్వతం చలించనట్లుగా (11) ఆ పులి మహా బలం కలది రాజు ఆస్త్రముతో వ్యథ నొందక, ఆ నారిని బలవంతంగా పట్టుకొని త్వరగా పరుగెత్తింది. (12) పులి, భార్యను ఎత్తుక పోవటంచూసి విప్రడు చాలా దుఃఖితుడై ఓ ప్రియః ఓ బాల! ఓ కాంత! ఓ పతివ్రత! అని ఏడ్చాడు. (13) ఒంటరిగా నన్ను ఇక్కడ వదలి లోకాంతరానికి ఎట్లా వెళ్ళావు. ప్రాణముల కన్నా ప్రియమైన నిన్ను వదలి ఎట్లా జీవిస్తాను (14) ఓ రాజ! నీ మహాస్త్రాలేవి, నీ శ్లాఘ్యమైన ధనువేది. పన్నెండువేల మహా నాగులను మించిన నీ బలమేది(15).

మూ || కింతే శంఖేనఖడ్గేన కింతేమంత్రాస్త్రవిద్యయా|కించత్నేన కింప్రభావేణ భూయసా || 16 ||

తత్సర్వంవి ఫలంజాతం యచ్ఛాన్యత్‌త్వయితిష్టతి | యస్త్వం వనౌక సంజంతుం నివారయితు మక్షమః || 17 ||

క్షాత్రస్యాయం పరోధర్మః క్షతాద్యత్‌ పరిరక్షణం | తస్మాత్కులోచితే ధర్మే నష్టేత్వ జ్జీవితేనకిం || 18 ||

అర్తానాం శరణార్తానాం త్రాణం కుర్వంతి పార్థివాః | ప్రాణౖ రర్థెశ్చ ధర్మజ్ఞాః తద్విహీనామృతోపమాః || 19 ||

ధనినాందానహీనావాం గార్హస్థ్యాత్‌ భిక్షుతావరా | అర్థత్రాణ విహీనానాం జీవితాస్మరణం వరం || 20 ||

వరం విషాదనం రజ్ఞోవరమగ్నౌప్రవేశనం | అనాధానాం ప్రసన్నానాం కృపణానా మరక్షణాత్‌ || 21 ||

ఇత్థం విలపితంతస్యస్వ వీర్యస్యచ గర్హణం | నిశమ్యనృపతిః శోకాత్‌ ఆత్మన్వేవ మంచింతయత్‌ || 22 ||

అహోమే పౌరుషం నష్టం అద్యదైవ వివర్యయాత్‌ | అద్యకీర్తిశ్చమే నష్టాపాతకం ప్రాప్తముత్కటం || 23 |.

ధర్మః కాలోచితో నష్టోమందభాగ్యస్యదుర్మతేః | నునంమేనంపదోరాజ్యం ఆయుష్యం క్షయమేష్యతి || 24 ||

అవుంసాం సంపదోభోగాః పుత్రదారధనానిచ | దైవేన క్షణముద్యంతి క్షణాదస్తం ప్రజంతిచ || 25 ||

అత ఏకం ద్విజన్మానం హతదారం శుచార్దితం | గతశోకం కరిష్యామి దత్వాప్రాణాన పిప్రియాన్‌ || 26 ||

ఇతి నిశ్చిత్య మనసా భద్రాయుః నృపసత్తమః | సతిత్వా పాయోస్తస్య బభాషే పరిసాంత్వయాన్‌ || 27 ||

కృపాంకురు మయిబ్రహ్మన్‌ క్షత్రబంధౌహతౌజసి | శోకంత్య జమహాబుద్దే దాస్యామ్యర్థం తవేప్సితం || 28 ||

ఇదం రాజ్యం ఇయంరాజ్జీమమేదంచకలేవరం | త్వదధీనమిదం సర్వం కింతే7భి లషితం వద || 29 ||

బ్రాహ్మణ ఉవాచ -

కిమాదర్శేన చాంధన్య కింగృహైః భైక్ష్యజీవినః | కింపుస్తకే సమూర్ఖస్యహ్యస్త్రీ కన్యధనేనకిం || 30 ||

తా || నీ శంఖంతో ఖడ్గంతో మంత్ర ఆస్త్రవిద్యతో ప్రయోజనమేమి. అ ప్రయత్నంతోపనేమి అధికమైన ప్రభావంతో ప్రయోజనమేమి (16) ఇంకా నీలో ఏఏ శక శక్తులున్నాయో అవన్నీ వ్యర్థమైనాయి. నీవు వనంలో నివసించే జంతువును నివారించుటానికి అసమర్థుడివైనావు (17) క్షతము నుండి రక్షించటమనేది క్షత్రియునకు పరమమైనధర్మము కులోచిత ధర్మ మందు పనికి రాని నీ బ్రతుకుతో ప్రయోజనమేమి (18) రాజులు ఆర్తుల శరణార్థుల ప్రాణాల రక్షిస్తారు. ప్రాణముతో అర్థముతో ఉన్నవారే ధర్మజ్ఞులు. అవిలేనివారు మృతప్రాయులు. ప్రాణముతో అర్థముతో ఉన్నవారే ధర్మజ్ఞులు. అవి లేనివారు మృతప్రాయులు (19) గార్హస్థ్యులై ధనవంతులై దానహీనులైన వారికన్నా బిచ్చమెత్తటంమేలు. అర్తత్రాణ విహీనులైన వారికి బ్రతుకుకన్న చావుమేలు. (20) రాజు విషం తినటం ఉత్తమము. అగ్నిలో దూకంట ఉత్తమము. అనాథలు ప్రవన్నులు కృపణులు వీరిని రక్షించకపోవటంకన్న విషం తినటంమేలు (21) అని విలపిస్తున్న తన పరాక్రమాన్ని గర్హిస్తున్న ఆ మాటలు రాజువిని శోకంతో తనలోనే ఇట్లా చింతించాడు. (22) నా పౌరుషం నశించింది. ఈ రోజు అదృష్టం బాగాలేనందువల్ల ఈ వేళ నా కీర్తి నశించింది. అధికమైన పాపమొచ్చింది (23) కాలానికి తగిన ధర్మం నశించింది. మంద భాగ్యుణ్ణి ధుర్మతిని. నిజంగా నా సంపదలు, రాజ్యము, ఆయుష్యము నశిస్తాయి. (25) అందువల్ల ఈ బ్రాహ్మణుని, భార్యాహీనుని దుఃఖంతో బాధపడుతున్న వానిని నా ప్రియమైన ప్రాణములిచ్చైనా దుఃఖహీనుణ్ణి చేస్తాను (26) అని నిశ్చయించుకొని మనసులో ఆ భద్రాయువు నృవసత్తముడు నా మీద, దయచూపు, కాంతిహీనుణ్ణి క్షత్ర బంధువునునేను. ఓ మహాబుద్దిః ! దుఃఖాన్ని వదులు నీకు కావలసిన అర్థాన్ని ఇస్తాను (28) ఈ రాజ్యము, ఈ రాణి నాఈ శరీరము, ఇదంతదా నీ ఆధీనమే నీ అభిలాష ఏమిటో చెప్పు (29) బ్రాహ్మణ వచనమిట్లా - అంధునకు ఆదర్శాలతో పనేమి బిచ్ఛమెత్తి జీవించే వారికి ఇళ్ళతో పనేమి! మూర్ఖునకు పుస్తకంతో పనేమి, స్త్రీలేని వానికి, ధనంతో పనేమి (30).

మూ || అతో7హంగపత్నీకోభుక్తభోగోనకర్షిచిత్‌ | ఇమాంతవాగ్రమహిషీంకా మార్థందీయతాంమమ || 31 ||

రోజోవాఛ -

బ్రహ్మన్‌ కిమేష ధర్మస్తేకి మేతత్‌ గురుశాసనం | అస్వర్గ్యమ యశస్యంచ పరదారాభి మర్శనం || 32 ||

దాతారః సంతివిత్త స్యరాజ్యస్య గజవాజినాం | ఆత్మదేహన్యనా క్వాపి సకలత్రస్య కర్హిచిత్‌ || 33 ||

పరదారోప భోగేన యత్పావం సముపార్జితం సతత్‌ క్షాలయితుంశక్యం ప్రాయశ్చిత్త తైరపి || 34 ||

బ్రహ్మణ ఉవాచ -

అపి బ్రహ్మవధంఘోరం అపిమధ్య నిషేవణం | తవసానా శయిష్యామి కింపునః పారదారికం

తస్మాత్ర్పయచ్ఛమే భార్యాం ఇమాంత్వం ధ్రువమన్యధా || 35 ||

అరక్షణాద్భయార్తానాంగం తాసినిరయంధ్రువం | ఇతి విప్రగిరాభీతః చింతయా మాసపార్ధివః

అరక్షణాన్మహత్సావంపత్నీ దానంతతో వరం || 36 ||

అతః పత్నీం ద్విజాగ్ర్యాయ దత్వా నిర్ముక్తకిల్పిషః | సద్యోవహ్నిం ప్రవేక్ష్యామి కీర్తిశ్చనిహితా భావేత్‌ || 37 ||

ఇతి నిశ్చిత్య మనసానముజ్జ్వాల్య హుతాశనం |తంబ్రాహ్మణం సమాహూయ దదౌతపత్నీం సహోదకాం || 38 ||

స్వయంస్నాతః శుచిర్భూత్వాప్రణమ్యవిబుధేశ్వరాన్‌ | తమగ్నింద్విః పరిక్రమ్య శివందధ్యౌ సమాహితః || 39 ||

తమధాగ్నౌ పతిష్యంతం స్వపదానక్తచేతనం | ప్రత్యదృశ్యత విశ్వేశః ప్రాదుర్భూతో జగత్పతిః || 40 ||

తమీశ్వరం పంచవ్రక్త్రం త్రినేత్రం పినాకినం చంద్రకలావతం సం|

అలంబితాపింగ జటాకలాపం మధ్యంగతం భాస్కర కోటితేజసం || 41 ||

మృణాల గౌరంగజ చర్మ వానసం గంగా తరం గోక్షిత మౌలిదేశం |

నాగేంద్రహారావలికం కణోర్మికా కిరీట కోట్యం గదకుండలోజ్జ్వలం || 42 ||

త్రిశూల ఖట్వాంగ కుఠార చర్మ మృగాభ##యేష్టార్థ పినాక హస్తం |

వృషోపరిష్థం శితికంఠ మీశం ప్రోద్భూతమగ్రే నృపతి ర్దదర్శ || 43 ||

ఆథాంబరాత్‌ద్రుతంపేతుఃదివ్యాః కుసుమవృష్టయః | ప్రణదుః దేవతూర్యాణి దేవాశ్చన నృతుఃజగుః || 44 ||

తత్రాజగ్ముర్నార దాద్యాః సనకాద్యాఃసురర్షయః | ఇంద్రాదయశ్చలోకేశాః తథాబ్రహ్మర్షయో7మలాః || 45 ||

తేషాం మధ్యే సమసీనో మహాదేవః సహోమయా | వవర్ష కరుణా సారం భక్తిసమ్రే మహీవతౌ || 46 ||

తా|| అందువల్ల నేను భార్యలేని వాణ్ణి భోగాలేమీ అనుభవించలేదు. అందువల్ల నీ అగ్ర మహిషిని కామం కొరకు నాకివ్వు (31) రాజిట్లన్నాడు. - ఓ బ్రహ్మన్‌ ! ఈ నీ ధర్మమేమిటి. ఈ నీ గురుశాసన మేమిటి. స్వర్గమునకు దారి కాదు. అపకీర్తికరము. వరుల భార్యను కోరటము (32) ధనమునిచ్చే వాళ్ళు, రాజ్యమునిచ్చే వాళ్ళు ఏనుగులు గుఱ్ఱముల నిచ్చే వాళ్ళు ఉన్నారు. ఒకచో తమ దేహాన్నిచ్చే వాళ్ళు ఉన్నారు. కాని భార్యనిచ్చే వాళ్ళు లేరు. (33) పరదాలను అనుభవించటంవల్ల వచ్చే పాపంను నూరు ప్రాయశ్చిత్తములు చేసుకున్నాకడుగు కోలేము. (34) అనగా బ్రాహ్మణ వచనము - బ్రహ్మవధ ఘోరము. మధ్య పానము ఘోరము. ఐనా తపస్సుతో నశింప చేస్తాను పారదారికమైన పాపాన్ని నశింపచేయటం ఒక లెఖ్ఖా. అందువల్ల నాకు నీ భార్యను ఇవ్వు (35) లేకపోతే భయార్తులను రక్షించనందువల్ల నరకానికి తప్పకుండా పోతావు. అనే బ్రాహ్మణుని మాటలవల్ల భయపడి రాజు ఆలోచించసాగాడు. రక్షించనందువల్ల వచ్చే పాపం గొప్పది. దానికన్న పత్నీదానమేనయం (36) అందువల్ల బ్రాహ్మణ శ్రేష్ఠునకు పత్నిని దానం చేసి పాపం నుండి ముక్తుడనై వెంటనే అగ్నిలో దూకుతాను. దానివల్ల కీర్తకూడా వస్తుంది. (37)అని మనస్సుల్లో నిశ్చయించుకొని, అగ్నిని వెలిగించి ఆ బ్రాహ్మణుని పిలిచి తన భార్యను ఉదక పూర్వకముగా దానం చేశాడు. (38) స్వయంగా స్నానంచేసి శుచియై దేవతలకు నమస్కరించి ఆ అగ్నికి రెండుసార్లు ప్రదక్షిణంచేసి చక్కగా శివుని ధ్యానం చేశాడు (39) అగ్నిలో పడుతున్న తన పాదములందు మనస్సు నిలిపిన ఆ బ్రాహ్మణుని జగత్పతి ప్రత్యక్షమైనాడు విశ్వేశుడు అతనిని చూచాడు (40) ఆ ఈశ్వరునకు ఐదు వక్త్రములు మూడు నేత్రములు. పినాకము చంద్రకళతలపై ఉన్నాయి. పింగళ##మైన జడలు వేళాడుతున్నాయి. (41) తామరకాడవలె తెల్లగా, గజ చర్మం వస్త్రంగా కలిగి, తలలోగంగా తరంగములు ఓలలాడగా, నాగేంద్రములు హారములు కంకణములు, ఉంగరములు, కిరీటములు, అంగదములు కుండలములు వీటన్నిటితో ఉజ్జ్వలంగా ఉండగా చూచాడు (42) త్రిశూలము, ఖట్వాంగము గొడ్డలి, కవచము, మృగము అభయ వరద హస్తములు పినాకము ఇవన్ని చేతులలో కలవాడు ఆయన వృషభంపై కూర్చున్నాడు. శితి కంఠుడు ఈశుడు ఇట్లా ఎదురుగా కన్పిస్తే రాజుచూచాడు (43) అప్పుడు ఆకాశం నుండి దివ్యమైన పూలవాన వేగంగా పడింది. దేవ వాద్యాలు మ్రోగాయి. దేవతలు నాట్యం చేశారు. (44) గానం చేశారు. నారదులు సనకాదులు సురర్షులు వచ్చారు. ఇంద్రాది లోకేశులు అమలురైన బ్రహ్మెశులు (45)వచ్చారు. వారి మధ్య మహాదేవుడు ఉమతో కూడి కూర్చుని ఉన్నాడు. భక్తితో సమ్రుడైన రాజుపై కరుణాసారమును వర్షించాడు (46).

తద్దర్శనానంద విజృంభితాశయః ప్రవృద్ధభాష్పాంబు పరిప్లుతాంగంః | || 47 ||

ప్రహృష్టరోమాగలగద్గదాక్షరుంతుష్టాపగీర్భః ముకులీకృతాంజలిః రాజోవాచ-

సతోస్య్మహం దేవమనాథమవ్యయం ప్రధాన మవ్యక్తగుణం మహాంతం|

అకారణం కారణ కారణం పరం శివంచిదానంద మయం ప్రశాంతం || 48 ||

త్వంవశ్వసాక్షీజగతో7స్యకర్తావిరూఢదామాహృదినన్నివిష్టః | అతోవిచిన్వివంతివిధౌవిపశ్చితో యోగైరనేకైఃకృతచిత్తరోధైః || 49 ||

అతీంద్రియం సాక్ష్యుదయాస్తవిభ్రమంమనఃపథాత్‌సంహ్రియతే వదంతే || 50 ||

తంత్వాం దురావంవచసోధియాశ్చ వ్యపేతమోహం పరమాత్మ రూపం |

గుణౖకనిష్టాః ప్రకృతౌ విలీనాః కథంవపుఃస్తోతుమలంగిరోమే || 51 ||

తథాపి భక్త్యాశ్రయ తాముపేయుః తవాంఘ్రి పద్మం ప్రణతార్తి భంజనం |

సుఘోర సంసార దవాగ్ని పీడితో భజామి నిత్యం భవభీతి శాంతయే || 52 ||

సమస్తే దేవదేవాయ మహదేవాయశం భ##వే | సమస్త్రీమూర్తి రూపాయ సర్గస్తిత్యంత కారిణ || 53 ||

నమో విశ్వాదిరూపాయ విశ్వ ప్రథమ సాక్షిణ | నమః సన్మాత్ర తత్వాయ బోధానంద ఘనాయచ || 54 ||

సర్వక్షేత్రనివాసాయ క్షేత్ర భిన్నాత్మశక్తయే | అశక్తాయనమస్తుభ్యం శక్తాభాసాయ భూయసే || 55 ||

విరాభాసాయ నిత్యాయ సత్యజ్ఞానాంతరాత్మనే | విశుద్దాయ విదూరాయ విముక్తా శేషకర్మణ || 56 ||

నమో వేదాంత వేద్యాయ వేదమూలనివాసినే | నమో వివిక్త చేష్టయని వృత్త గుణవృత్తయే || 57 ||

నమః కల్యాణ వీర్యాదు కల్యాణ ఫలదాయినే | నమోసంతాయ మహతే శాంతా య శిరూపిణ || 58 ||

ఘోరాయ సుఘోరాయ ఘోరామౌఘ విదారిణ | భర్గాయ భవభీజానాం భంజనాయ గురియసే

నమో విధ్వస్త మోహాయ విశదాత్మ గుణాయచ || 59 ||

సాహిమాం జగతాం నాథసాహి శంకరశాశ్వత | పాహిరుద్ర విరూపాక్ష పాహి మృత్యుంజయావ్యయ || 60 ||

శంభోశశాంక కృతశేఖర శాంతమూర్తే గౌరీశ గోపతినిశాన హుతాశ##నేత్ర |

గంగాధరాం ధక విదారణ పుణ్యకీర్తే భూతేశ భూధర నివాస సదానమస్తే || 61 ||

నూత ఉవాచ -

ఏవంస్తుతః సభగవాన్‌ రాజ్ఞా దేవో మహేశ్వరః | ప్రసన్నః సహ పార్వత్యాప్రత్యువాచ దయానిధిః || 62 ||

తా || శివ దర్శనంలో కల్గిన ఆనందంతో కోరికలు విజృంభించగా అనందబాష్పాలు ఎక్కువై శరీరం తడిసిపోగా, రోమాంచము కలుగగా గొంతు గద్గదంకాగా మాట బొంగురు పోగా చేతులు జోడించి మాటలతో స్తుతించాడు. (47) రాజు వచనము - అనాథుడు (తనపై ఎవరులేరు అని) అవ్యయుడు, ప్రధానుడు, అవ్యక్తగుణుడు, మహత్తైన వాడు అట్టిదేవుని నమస్కరిస్తున్నాను. కారణంలేని వాడు, కారణములకు కారణమైనవాడు వరుడు శివుడు చిదానందమయుడు ప్రశాంతుడు (48) విశ్వసాక్షి ఐన నీకు నమస్సులు. ఈ జగత్తునకు కర్తవు. నీ స్థానమేదో తెలియదు. హృదయంలో ఉన్నావు. అందువల్ల విద్వాంసులు చిత్తమును నిరోధించి, అనేక యోగములతో విధిని వెతుకుతున్నారు. (49) ఏకాత్మను భావించే వారికి నీవు ఒకే రూపుడవు. ఈనేక రకాల బుద్ది గలవారికి అనేక రూపుడవు. ఇంద్రియాతీతుడవు. ఉదయ అస్తమయ విభ్రమములకు సాక్షివి. నీ అడుగు జాడ మనః పథము నుండి సంహరించిపోతుంది. (50) మాటలకు బుద్దికి అందరాని నిన్ను, మోహంలేని, పరమాత్మరూపుడవైన నిన్ను గుణౖక నిష్టులమై, ప్రకృతి యందు లీనమైన, కుత్సితమైన శరీరంగల నేను నా మాటలతో ఎట్లా స్తుతించగలను (51) అయినా భక్తితో ఆశ్రయించే వారికి పొందదగిన వినీపాద పద్మములు. అవి నమస్కరించిన వారి ఆర్తిని తొలగించేవి. ఘోరమైన సంసార దవాగ్నితో పీడితుడనై నేను నిత్యము సంసారభీతి శాంతి కొరకు నిన్ను సేవిస్తున్నాను (52) దేవదేవునకు నమస్కారము. మహదేవునకు శంభునకు త్రిమూర్తి రూపునకు సృష్టిస్థితి లయాకారునకు నమస్కారము (53) విశ్వపు అదిరూపునకు నమస్కారము విశ్వపు ప్రథమ సాక్షికి నమస్కారము. సత్‌ మాత్రమే తత్వముగా గలవానికి నమస్సులు. (54) సర్వక్షేత్రములందు నివసించే వానికి, క్షేత్రములందు భిన్నభిన్నముగా ఆత్మశక్తి గలవానికి, ఆశక్తునకు, శక్తి అభాసముగా గలవానికి, భూయసుడవైన నీకు నమస్కారము (55) ఆ భాసరహితునకు, నిత్యునకు సత్యజ్ఞానములు అంతరాత్మగాగల వానికి విశుద్దునకు, విదూరునకు, అశేష కర్మల నుండి ముక్తుడైన వానికి కర్మహీనుడు (56) వేదాంత వేద్యునకు, విదూరునకు, అశేష కర్మల నుండి ముక్తుడైన వానికి కర్మ వృత్తి నుండి నివృత్తుడైన వానికి నమస్కారము (57) కల్యాణ వీర్యునకు, కల్యాణ ఫలదాయికి నమస్కారము. అనంతునకు, మహత్తునకు, శాంతునకు, శివరూపునకు నమస్కారము (58) అఘోరునకు, సుఘోరునకు, ఘోరమైన పాపసమూహములను చీల్చువానికి, భర్గునకు భవబీజునకు భంజనునకు, గరీయనునకు నమస్కారము. ధ్వస్తమోహునకు, విశదమైన ఆత్మగుణం కలవానికి (59) నమస్కారము ఓ జగన్నాధ ! నన్ను రక్షించు, ఓ శంకర, శాశ్వత నన్ను రక్షించు. రుద్ర విరూపాక్ష, నన్ను రక్షించు మృత్యుంజయ, అవ్యయ నన్ను రక్షించు (60) ఓ శంబు, చంద్రశేఖర, శాంతమూర్తి, గౌరీశ, చంద్రుడు, సూర్యుడు అగ్ని వీటిని కన్నులుగా గలవాడ, గంగాధర, అంధక సంహారి పుణ్యకీర్తి, భూతేశ, భూ ధరమందు నివసించేవాడ నీకు ఎల్లప్పుడు నమస్కారము (61) నూతుని వచనముతో ఈ విధముగా రాజుదేవుని మహేశ్వరుని భగవంతుని ప్రార్థించగా అతడు, పార్వతిపాటు ప్రసన్నుడై అదయానిధి ఇట్లా పలికాడు (62).

మూ || ఈశ్వర ఉవాచ -

రాజంస్తేపరితుష్టో7స్మిభక్త్యాపుణ్యస్తవేనచ | అనన్యచేతాయోనిత్యంసదామాంపర్యపూజయః || 63 ||

తవభావపరీక్షార్థం ద్విజభూత్వాహమారత్వ | వ్యాఘ్రేణయాపరిగ్రస్తాసైషాదేవీగిరీంద్రజా || 64 ||

వ్యాఘ్రోమయామయోయ స్తేశ##రైరక్షత విగ్రహః | ధీరతాంద్రష్టుకామస్తే విత్నించు విరాహసనం 65

అస్యాశ్చకీర్తిమాలిన్యాస్తవవభక్త్యాచమానద | తుష్టో 7హంసంప్రయచ్ఛామిపరంపరయదుర్లభం || 66 ||

రాజోవాచ-

ఏషఏవవరోదేవయద్భవాన్‌పరమేశ్వరః | భవతాపపరీతస్యమమప్రత్యక్షతాంగతః || 67 ||

నాస్యంపరంపృణదేవభవతోవదర్షభాత్‌ | అహంచసేయంసారా జ్ఞీమమమాతాచమత్పితా || 68 ||

వైశ్యఃపద్మాకరోనామతత్పుత్రః మనయాభిదః | సర్వానేతాన్మహాదేవస దాత్వత్పార్శ్యగాన్‌కురు || 69 ||

సూత ఉవాచ -

అథరాజ్ఞీ మహాభాగా ప్రణతాకీర్తిమాలినీ | భక్త్యా ప్రసాద్య గిరిశం యయాచే పరముత్తమం || 70 ||

రాజ్ఞ్యువాచ -

చంద్రాంగదో మమపితా మాతా సీమంతినీచమే | తాయోర్యా చేమాహాదేవత్వత్పార్శ్యే సన్నిధింసదా || 71 ||

ఏవమస్త్వితి గౌరీశః ప్రసన్నో భక్త వత్సలః | తయోః కామవరం దత్వాక్షణాదంతర్హితో7భవత్‌ || 72 ||

సోపిరాజాసురైః సార్థం ప్రసాదం ప్రావ్యశూలినః | సహితః కీర్తి మాలిన్యాబు భుజే విషయాన్ర్పియాన్‌ || 73 ||

కృత్యవార్షాయుతం రాజ్యం అవ్యాహతబలోన్నతి ః | రాజ్యం పుత్రేషు విన్యస్య భేజేశంభోః పరంపదం || 74 ||

చంద్రాంగదోసి రాజేంద్రో రాజ్ఞి సీమంతి నీచసా | భక్త్యాసంపూజ్య గిరిశం జగ్మతుః శాంభవం పదం || 75 ||

ఏతత్పవిత్ర మఘునాశకరం విచిత్రం శంభోః గుణాసుకధనం పరమం రహస్యం |

యః శ్రావయేత్‌ బుధజనాన్‌ ప్రయతః పరేద్వాసం ప్రాప్య భోగవిభవం శివమేతి సోంతే || 76 ||

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయో బ్రహ్మోత్తర ఖండే భద్రయుశివ ప్రసాద కథనం నామ చతుర్ధశో7ధ్యాయః || 14 ||

తా || ఈశ్వరుని వచనము - ఓ రాజ! నీ భక్తితో, నీ స్తోత్రంతో సంతోషించాను. అనన్య చిత్తంతో, నిత్యము ఎల్లపుడూ నన్ను పూజించాను. అందుకు సంతసించాను (63) నీ భావం పరీక్షించే కొరకు బ్రాహ్మణుడనైన నేను వచ్చాను. పులితో తీసుకుపోబడిన అ దేవి పార్వతి (64) నీ బాణములతో గాయపడని పులి మాయమైనది. నీ ధర్మాన్ని పరీక్షించదలచి నీ భార్యను యాచించాను. (65) ఈ కీర్తి మాలిని యొక్క నీ యొక్క భక్తిచే సంతుష్టినందాను. ఓ మానద. వరమిస్తాను. దుర్లభ##మైన దైనా కోరుకో (66) అనగా రాజువచనము - ఓ దేవ ! నీవు పరమేశ్వరుడవై ఉండీ, భవతాపపరీతుడైన నాకు ప్రత్యక్షమైనావు. ఇదే నాకు వరము. (67) వరములనిచ్చే నీ నుండి మరో వరాన్ని కోరను ఓ దేవ! నేను నా రాణి, నా తల్లి, తండ్రి (68) పద్మాకరుడనై వైశ్యుడు. అతని పుత్రుడు సునయుడు వీరందరిని ఎప్పుడూ నీ ప్రక్కన ఉండేట్లుగా చేయి, ఓ మహదేవ ! (69) అని అనెను. సూతుని వచనము - మహాభాగ రాజ్ఞి కీర్తి మాలిని నమస్కరించి గరీశుని భక్తితో సంతోషపరచి ఉత్తమమైన వరాన్ని కోరింది (70) రాజ్ఞి వచనము - నా తండ్రి చంద్రాంగదుడు నా తల్లి సీమంతిని ఓ మహాదేవ ! వారు కూడా నీ ప్రక్కన ఉండేట్లు అనుగ్రహించు అని అనగా (71) గౌరీషుడు భక్త వత్సలుడు ప్రసన్నుడై అట్లాగే కానిమ్మని అన్నాడు. వారికి కావలసిన వరాలిచ్చి క్షణంలో అంతర్హితుడైనాడు (72) ఆ రాజు కూడా దేవతలతో పాటు, శివుని అనుగ్రహాన్ని పొంది, కీర్తి మాలినితో కూడి, ప్రియమైన సుఖాలను అనుభించాడు. (73) పదివేల సంవత్సరాలు, బలము ఔన్నత్యములకు ఎదురులేకుండా రాజ్యం పాలించి, రాజ్యాన్ని పుత్రులపై ఉంచి శివుని ఉత్తమ స్థానాన్ని చేరాడు (74) రాజేంద్రుడు చంద్రాంగదుడు రాజ్ఞి సీమంతిని గిరిశుని భక్తితో పూజించి శివ పదాన్ని చేరారు. (75) ఈ పవిత్రమైన పాపనాశకమైన విచిత్రమైన, శివుని గుణములను వివరించే పరమ రహస్యమైన దానిని ఎవరు బుధులకు విన్పిస్తారో, ప్రయత్నపూర్వకముగా చదువుతారో వారు భోగముల వైభవాన్నిపొంది చివర శివుని పొందుతారు (76) అని శ్రీ స్కాంద మహాపురాణ మందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయమైన బ్రహోత్తర ఖండమందు భద్రాయు శివప్రసాదాన్ని పొందటమనే కథ అనునది పదునాల్గవ అధ్యాయము || 14 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters