Sri Scanda Mahapuranamu-3    Chapters   

పన్నెండవ అధ్యాయము

మూ || ఋషభఉవాచ-

నమస్కృత్యమహాదేవంవిశ్వవ్యాపినమీశ్వరం | వక్ష్యేశివమయంవర్మసర్వరక్షాకరనృణాం || 1 ||

శుచౌదేశేసమాసీనోయథావత్కల్పితాసనః | జితేంద్రియోజితప్రాణఃచింతయేచ్ఛివమవ్యయం || 2 ||

హృత్పుండరీకాంతరసన్నివిష్టంస్వతేజసావ్యాప్తనభోవకాశం

అతీంద్రియంసూక్ష్మమనంతమాద్యంధ్యాయేత్పరానంద మయంమహెశం || 3 ||

ధ్యానావధూతాఖిలకర్మబంధఃచిరంచిదానందనిమగ్నచేతాః | షడక్షరన్యాససమాహితాత్మాశైవేనకుర్యాత్కవచేనరక్షాం || 4 ||

మాంపాతుదేవో7ఖిలదేవతాత్మాసంసారకూపేపతితంగభీరే

తన్నామదివ్యంపరమంత్రమూలంధునోతుమేసర్వమఘంహృదిస్థం || 5 ||

సర్వత్రమాంరక్షతువిశ్వమూర్తిఃజ్యోతిర్మయానందఘనశ్చిదాత్మా |

అణోరణీయానురుశక్తిరేకఃస ఈశ్వరః పాతుభయాదశేషాత్‌ || 6 ||

యోభూస్వరూపేణ బిభర్తి విశ్వంపాయాత్సభూమేఃగిరిశో7ష్టమూర్తిః |

యో7పాంస్వరూపేణనృణాంకరోతిసంజీవనంసో7పతుమాంజలేభ్యః || 7 ||

కల్పావసానేభువనానిదగ్థ్వాసర్వాణియోనృత్యతిభూరిలీలః |

సకాలరుద్రో7పతుమాందవాగ్నేఃవాత్యాదిభీతేరఖిలాచ్చతాపాత్‌ || 8 ||

ప్రదీప్తవిద్యుత్‌కనకావభాసోవద్యావరాభీతికుఠారపాణిః

చతుర్ముఖఃతత్పురుషస్త్రినేత్రః ప్రాచ్యాంస్థితంరక్షతుమామజస్రం || 9 ||

కుఠారవేదాంకుశపాశశూలకపాలఢక్కాక్షగుణాన్‌ధధానః |

చతుర్ముఖోనీలరుచిఃత్రినేత్రః పాయాదఘోరోదిశిదక్షిణస్యాం || 10 ||

కుందేందుశంఖస్ఫటికావభాసోవేదాక్షమాలావరదాభయాంకః |

త్యక్షశ్చతుర్వక్షఉరుప్రభావఃసద్యోధిజాతోపతుమాంప్రతీచ్యాం || 11 ||

వరాక్షమాలాభయటంకహస్తఃసరోజకింజల్కసమానవర్ణః |

త్రిలోచనశ్చారుచతుర్ముఖోమాంపాయాదుదీచ్యాందిశివామదేవః || 12 ||

వేదాభ##యేషటాంకుశటం పాశకపాలఢక్కాక్షకశూలపాణిః |

సితద్యుతిఃపంచముఖో7వతాన్మాంఈశానఊర్థ్వంపరమప్రకాశః || 13 ||

మూర్ఖాసమవ్యాన్మమచంద్రమౌలిఃఫాలంమమావ్యాదధఫాలనేత్రః |

నేత్రేమమావ్యాద్భగనేత్రహారీనాసాంసదారక్షతువిశ్వనాథః || 14 ||

పాయాచ్ఛ్రుతీమేశ్రుతిగీతకీర్తిఃకపోలమవ్యాత్సతతంకపాలీ |

వక్త్రంసదారక్షతుపంచవక్త్రోజిహ్వాంసదారక్షతువేదజిహ్వః || 15 ||

కంఠంగిరీశోపతునీలకంఠఃపాణిద్వయంపాతుపినాకపాణిః |

దోర్మూలమవ్యాన్మమధర్మబాహుఃవక్షఃస్థలందక్షమఖాంతకో7వ్యాత్‌ || 16 ||

మమోదరంపాతుగిరీంద్రధన్వామధ్యంమమావ్యాత్‌మదనాంతకారీ |

హెరంబతాతోమమపాతునాభింపాయాత్కటీధూర్జటిరీశ్వరోమే || 17 ||

ఊరుద్వయంపాతుకుబేరమిత్రోజానుద్వయంమేజగదీశ్వరో7వ్యాత్‌ |

జంఘాయుగంపుంగవకేతురవ్యాత్‌పాదౌమమావ్యాత్‌సురవందయపాదః || 18 ||

మహెశ్వరఃపాతుదినాదియామేమాంమధ్యయామే7వతువామదేవః

త్రియంబకఃపాతుతృతీయయామేవృషధ్వజఃపాతుదినాంత్యయామే || 1 9 ||

పాయాన్నిశాదౌశశిశేఖరోమాంగంగాధరోరక్షతుమాంనిశీధే |

గౌరీపతిఃపాతునిశావసానేమృత్యుంజయోరక్షతుసర్వకాలం || 20 ||

అతఃస్థిరంరక్షతుశంకరోమాంస్థాణుఃసదాపాతుబహిఃస్థితంమాం |

తదంతరేపాతుపతిఃపశూనాంసదాశివోరక్షతుమాంసమంతాత్‌ || 21 ||

తిష్ఠంతిమవ్యాత్‌భువనైకనాధఃపాయాద్ర్వజంతప్రమధాదినాధః |

వేదాంతవేద్యో7వతుమాంనిషణ్ణంమామప్యయఃపాతుశివఃశయానం || 22 ||

తా || ఋషభునివచనము - విశ్వవ్యాపియైన ఈశ్వరుని మహాదేవుని నమస్కరించి, శివమయమైన వర్మను, (కవచమును) నరులకు అన్ని విధముల రక్షణనిచ్చేదానిని చెప్తాను (1) శుచియైన ప్రదేశమందు కూర్చొని చెప్పిన విధంగా ఆసనం ఏర్పరచుకొని, జితేంద్రియుడై. ప్రాణములను ఆధీనమందుంచుకొని, అవ్యయుడైన శివుని ధ్యానించాలి. (2) హృత్పుండరీకం మధ్య యందున్న తన తేజస్సుతో ఆకాశ ఆవకాశాన్ని వ్యాపించిన అతీంద్రియుడైన సూక్ష్ముడైన అనంతుడైన ఆద్యుడైన సదానందమయుడైన మహేశుని ధ్యానించాలి. (3) ధ్యానంతో కర్మబంధములన్ని తొలగిపోయి, మనస్సు చిరకాలము చిదానందమందు నిమగ్నముకాగా, షడక్షర న్యాసమందు ఆత్మనుంచి శివకవచంతో రక్ష చేయాలి (4) అఖిల దేవాతాత్ముడైన దేవుడు గంభీరమైన సంసారకూపమందు పడిన నన్ను రక్షించని. ఆ నామము దివ్యమైంది. శ్రేష్ఠమంత్రమునకు మూలమైంది నా హృదయమందున్నది నా పాపములన్ని పోగొట్టని (5) విశ్వమూర్తి అంతటనన్ను రక్షించని, జ్యోతిర్మయుడు, ఆనందఘనుడు, చిదాత్మ అణువుకన్న అణువు, గొప్పశక్తి కలవాడు ఆతడు ఒక్కడే ఈశ్వరుడు అన్ని భయముల నుండి నన్ను రక్షించని (6) భూ స్వరూముతో విశ్వాన్ని భరిస్తున్నాడు. అష్టమూర్తి గిరీశుడు భూమి నుండి, నన్ను రక్షించని. నీటి రూపంలో ఉండి ప్రజలను బ్రతికిస్తున్న ఆ స్వామి జలము నుండి నన్ను రక్షించని (7) కల్ప అవసానమందు లోకములనన్నిటిని కాల్చి నాట్యం చేసే లీలా రూపి కాలరుద్రుడు దవాగ్ని నుండి సుడిగాలి మొదలగు వాటి భయం నుండి సమస్త తాపముల నుండి నన్ను రక్షించని (8) మండుతున్న మెరుపు, బంగారంలా వెలిగే, విద్యారులకు భయంలేకుండా గొడ్డలి చేత ధరించిన చతుర్ముఖుడు, తత్పురుషుడు త్రినేత్రుడు, ప్రాచియందు వున్న నన్ను ఎల్లప్పుడు రక్షించని (9) గొడ్డలి, వేదములు, అంకుశము, పాశము, శూలము, కపాలము, ఢక్క, అక్షమాల, అల్లిత్రాడు ధరించిన చతుర్ముఖుడు, నీలకాంతి గల వాడు త్రినేత్రుడు ఐన అఘోరుడు దక్షిణ దిక్కుయందు నన్ను రక్షించని (10) కుంద పుష్పము, చంద్రుడు, శంఖము, స్పటికము వీనివలె వెలిగేవాడు వేదములు అక్షమాల, వరద హస్తము అభయ చిహ్నము గలవాడు, త్రినేత్రుడు నాల్గు ముఖములు గల వాడు గొప్ప శక్తి కలవాడు అట్టి సద్యోఅధి జాతుడు నన్ను పడమటి దిక్కున రక్షింపని (11) శ్రేష్ఠమైన అక్షమాల, అభయహస్తము ఖడ్గము చేత ధరించిన, తామరలోని కింజల్కములు వంటి వర్ణముగల త్రిలోచనుడు, చతుర్ముఖుడు వామదేవుడు ఉత్తర దిక్కులో నన్ను రక్షించని (12) వేదములు, అభయము, యజ్ఞము, అంకుశము, కత్తి, పాశము, కపాలము, ఢక్క, అక్షకము శూలము వీటిని చేత ధరించిన, తెల్లని కాంతిగల పంచముఖుడు, పరమ ప్రకాశుడు ఈశానుడు పైన నన్ను రక్షించని (13) నా తలను చంద్రమౌళి రక్షించని భగనేత్రహారినా నేత్రముల రక్షించని విశ్వనాథుడు నానాసికను రక్షించని (14) శ్రుతులలో పొగడబడిన కీర్తిగల ఆతడు నా చెవులను రక్షించని. కపాలి ఎప్పుడ్రూ నాకపోలముల రక్షించని పంచవక్త్రుడు నా వక్త్రాన్ని రక్షించని వేద జిహ్వుడు నా జిహ్వను సదా రక్షించని (15) గిరీశుడు నీలకంఠుడు నా కంఠాన్ని రక్షించని. పినాకపాణి నా చేతులను రక్షించని ధర్మబాహువు నా బాహుమూలములను రక్షించని దక్షమఖ నాశకుడు నా వక్షః స్థలమును రక్షించని (16) గిరీంద్రమును ధనువుగా గలవాడునాధనువును రక్షించని. మదనాంతకశత్రువు నామధ్యభాగమును రక్షించని, హెరంబుని తండ్రి నానాభిని రక్షించని. దూర్జటిఈశ్వరుడు నాకటిని రక్షించని (17) కుబేర మిత్రుడు నా తొడలను రక్షించని. జగదీశ్వరుడు నా రెండు జానువులను రక్షించని. వృషభమును జండాలో గలవాడు నాజంఘలనురక్షించని, సురలతో నమస్కరించబడే పాదాలు గలవాడు నాపాదాలను రక్షించని దినంతొలి యామంలో నన్ను మహేశ్వరుడు రక్షించని, వాసుదేవుడు మధ్య యామమందు మూడవ యామమందు త్ర్యంబకుడు, దినాంతయామమందు వృషధ్వజుడు నన్ను రక్షించని (19) శశిశేఖరుడు నిశ ఆదులందు నన్నురక్షించని. నిశీధమందు గంగాధరుడు నన్నురక్షించని. నిశావసానమందు గౌరీపతినన్నురక్షించని ఎల్లప్పుడు మృత్యుంజయుడు నన్ను రక్షించని. చుట్టుముట్టు నన్నుఎల్లప్పుడు మృత్యుంజయుడు నన్నురక్షించని (20) శంకరుడు, లోపల ఉన్ననన్నురక్షించని బయట ఉన్న నన్ను స్థాణువు సదారక్షించని. వీటిమధ్యయందు పశుపతి నన్నురక్షించని. చుట్టు ముట్టునన్నుఎల్లప్పుడు శివుడు రక్షించని (21) నిల్చున్ననన్నుభువనములకు ఒకేనాధుడైనవాడు రక్షించని. వెళ్తున్ననన్ను ప్రమధఅధినాధుడు రక్షించని. కూర్చున్ననన్నువేదాంతవేద్యుడు రక్షించని. నిద్రించిన నన్ను అవ్యయుడుశివుడు రక్షించని (22)

మూ|| మార్గేషుమాంరక్షతునీలకంఠఃశైలాదిదుర్గేషు పురత్రయారిః |

అరణ్యవాసాదిమహాప్రవాసేపాయాన్మృగవ్యాధ ఉదారశక్తిః || 23 ||

కల్పాంతకాటోపపటుప్రకోపః స్ఫూటాట్టహాసోచ్చలితాండకోశః |

ఘోరారిసేనార్ణవదుర్నివారమహాభయాద్రక్షతు వీరభద్రః || 24 ||

పత్యశ్వమాతంగఘటావరూధనసహస్రలక్షాయుతకోటిభీషణం |

అక్షౌహిణీనాం శతమాతతాయినంఛింద్యాన్మృడోఘోరకుఠారధారయా || 25 ||

నిహంతుదన్యూన్‌వ్రలయానలార్చిర్జ్వలత్త్రిశూలంcతిపురాంతకస్య |

శార్దూలసింహర్‌క్షవృకాదిహింస్రాన్‌సంత్రాసయత్వీశధనుఃపినాకం | || 26 ||

దుఃస్వప్నదుఃశకునదుర్గతిదౌర్యనస్యదుర్భిక్షదుర్వ్యననదుఃసహదుర్యశాంసి

ఉత్పాతతావవిషభీతిమనద్గ్రహార్తివ్యాధీంశ్చనాశయతుమేజగతామధీశః || 27 ||

ఓంనమోభగవతే సదాశివాయసకలతత్వాత్మకాయ, సకలతత్వవిహారాయ, సకలలోకైక భ##ర్త్రే కర్త్రైసకలలోకైక భ##ర్త్రే సకలలోక హర్త్రే, సకలలోకైకగురవే, సకలలోకైక సాక్షిణ, సకలనిగమగుహ్యాయ, సకలవరప్రదాయ, సకలదురితార్తి భంజనాయ సకలజ గధభయంకరాయ, సకలలోకైక శంకరాయ, శశాంకశేఖరాయ, శాశ్వతనిజాభాసాయ, నిర్గుణాయ, నిరుపమాయ, నీరూపాయ, నిరాభాసాయ, నిరామయాయ, నిష్ర్పపంచాయ, నిష్కలంకాయ, నిర్ద్వంద్వాయ, నిఃసంగాయ, నిర్మలాయ, నిర్గమాయ, నిత్యరూప విభవాయ, నిరుపమ విభావాయ నిరాధారాయ, నిత్యశుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానందా ద్వయాయ పరమ శాంత ప్రకాశ##తేజో రూపాయ జయజయ మహారుద్ర, మహారౌద్రభద్రావతార దుఃఖ దావదారణ మహాభైరవ, కాలభైరవ, కల్పాంత భైరవ కపాల మాలాధర, ఖట్వాంగ ఖడ్గచర్మ పాశాంకుశడమరు శూలచాప బాణగదాశక్తి భిండిపాలతో మరము నలముద్గర పట్టిశ వరశు వరిఘ భుశుండీ శతఘ్నీ చక్రాద్యాయుధ భీషణ కర సహస్రముఖ దంష్ట్రా కరాల వికటాట్టాహాస విప్పారిత బ్రహ్మ మండల నాగేంద్ర కుండల నాగేంద్రహార, నాగేంద్ర వలయ, నాగేంద్ర చర్మధర, మృత్యుంజయ త్ర్యంబక త్రిపురాంతక, విరూపాక్ష విశ్వేశ్వర, విశ్వరూప వృషభవాహన, విష భూషణ విశ్వతో ముఖ సర్వతో రక్షరక్ష మాజ్వలజ్వల మహామృత్యు భయం అపమృత్యభయం నాశయ నాశయ,రోగభయ ముత్పాదయోత్పాదయ విషసర్పభయం శమయ శమయచోర భయం మారయ మారయ మమ శత్రూన్‌ ఉచ్చాటయోచ్చాటయ శూలేన విదారయ విదారయ కుఠారేణ బింధి భింది ఖడ్గేన ఛింధిచింధి ఖాట్వాంగేన విపోధయ విపోధయ మునలేన నిష్పేషయ బాణౖః సంతాడయ, సంతాడయ రక్షాంసి భీషయ భీషయ భూతాని విద్రావయ విద్రావయ కూష్మాండవేతాల మారీగణ బ్రహ్మరాక్షసాన్‌ సంత్రాసయ సంత్రాసయ మమా భయంకురుకురు విత్రస్తం మామా శ్వాసయా శ్వాసయ నరక భయాత్‌ మాముద్ధారయోద్థారయ సంజీవయ సంజీవయక్షుత్తృడ్‌భ్యాం మాం అప్యాయయాప్యాయయ దుఃఖాతురంమాం ఆనందయానం దయశివకంవచేన మాం ఆచ్ఛాదయా చ్ఛాదయ త్ర్యంబక సదాశివ నమస్తే నమస్తే నమస్తే.

ఋషభఉవాచ -

ఇత్యేతత్కవచంశైవంవరదంవ్యాహృతంమయా | సర్వబాధాప్రశమనంరహస్యంసర్వదేహినాం || 28 ||

యఃసదాధారయేన్మర్త్యఃశైవంకవచముత్తమం | సతస్యజాయతేక్వాపిభయంశంభోరనుగ్రహాత్‌ || 29 ||

క్షీణాయుఃమృత్యుమాపన్నోమహారోగహతో7సివా | సద్యఃసుఖమవాప్నోతిదీర్ఘమాయుశ్చవిందతి || 30 ||

సర్వదారిద్ర్యశమనం సౌమంగల్యవివర్థనం | యోధత్తే కవచంశైవంసదేవైరపిపూజ్యతే || 31 ||

మహాపాతకసంఘాతైః ముచ్యతేచోపపాతకైః | దేహాంతే శివమాప్నోతి శివవర్మానుభావతః || 32 ||

త్వమపి శ్రద్ధయా వత్స శైవంకవచ ముత్తమం | ధారయస్వమయా దత్తం సద్యః శ్రేయోహ్యవాప్స్యసి || 33 ||

సూత ఉవాచ -

ఇత్యుక్త్వా ఋషభోయోగీ తసై#్మ పార్థివ సూనవే | దదౌశంఖం మహారావం ఖడ్గం చారినిషూ దనం || 34 ||

పునశ్చభస్మ సంమంత్ర్యతదంగం సర్వతోస్పృశత్‌ | గజానాం షట్‌ సహస్రస్యద్విగుణంచబలందదౌ || 35 ||

భస్మప్రభావాత్‌ సంప్రాప్య బలైశ్వర్య ధృతిస్మృతీః నరాజపుత్రః శుశుభే శరదర్క ఇవశ్రియా || 36 ||

తమాహ ప్రాంజలింభూయః సయోగీ రాజనందనం | ఏషఖడ్గోమయాదత్తః తపోమంత్రానుభావతః || 37 ||

శితధారమిమం ఖడ్గంయసై#్మ దర్శయసి స్ఫుటం|నసద్యోమ్రియతేశత్రుః సాక్షాన్మృత్యురపి స్వయం || 38 ||

అస్య శంఖస్య నిర్‌ హ్రాధం యేశృణ్వంతి తవాహితాః | తేమూర్ఛితాః పతిష్యంతి న్యస్త శస్త్రావిచేతనాః || 39 ||

ఖడ్గశంఖావిమౌదివ్యౌ పరసైన్య వినాశినౌ | ఆత్మసైన్య స్వవక్షాణాం శౌర్యతేజో వివర్ధనౌ || 40 ||

ఏతయోశ్చ ప్రభావేన శైవేనకవచేనచ | ద్విషట్‌ సహస్ర నాగానాం బలేసమహతాపిచ || 41 ||

భస్మధారణ సామర్థ్యాత్‌ శత్రుసైన్యం విజేష్యసి | ప్రాప్యసింహాసనంపైత్ర్యం గోప్తాసి పృథివీమిమాం || 42 ||

ఇతిభద్రాయుషం సమ్యగను శాస్యసమాతృకం | తాభ్యాంసంపూజితః సో7థ యోగీసై#్వరగతిర్య¸°

తా ||మార్గమందు నీలకంఠుడు శైలాది దుర్గములందు త్రిపురారి, అరణ్య వాసాది మహా ప్రవాసమందు, ఉదారశక్తి గల మృగవ్యాధుడు నన్ను రక్షించని (23) కల్ప అంతకాలమందలి ఆటోపమువలె చాలాకోపంగల, స్ఫుటమైన అట్టహాసంతో బాగా కదలిన అండకోశములు (భువనములు) గల, ఘోరమైన శత్రుసేనా సముద్రంవల్ల కల్గినని వారింప శక్యంకాని మహాభయం నుండి వీరభద్రుడు నన్ను రక్షించని (24) కాల్బలము, గుఱ్ఱములు, ఏనుగులు, వీని సమూహములు పది లక్షల కోట్లు వీనితో భయంకరమైన అక్షౌహిణులు శతాన్ని ఆతతాయులను (చంపనుద్యుక్తు డైనవాడు) మృడుడు తన ఘోరకుఠార ధారతో ఛేదించనీ (25) ప్రళయ అనలం వలె కాంతులు గల, మండుతున్న త్రిపురాంతకుని త్రిశూలము దన్యులను చంపని. శార్దూలము, సింహము, ఎలుగుబంటు, తోడేలు మొదలగు హింసించే క్రూరజంతువులను ఈ శుని ధనువైన పినాకము బాధపెట్టని (26) దుః స్వప్నములు, దుశ్శకునములు, దుర్గతి, దౌర్మనస్యము, దుర్భిక్షము, దుర్వ్యసనములు, భరింపరాని దుష్కీర్తులు, ఉత్పాతములు, విషభయము, చెడుగ్రహముల బాధ వ్యాధులను నాకు కల్గే వీటన్నిటిని జగత్తునకు ఆధీశుడైన ఈశుడు నశింపచేయని (27) ఓం నమో భగవతే సదాశివాయ, సకలతత్త్వాత్మకునకు, సకలతత్త్వవిహారునకు సకల లోకముల ఒకే కర్తకు, సకల లోకములకు ఒకే భర్తఐన వానికి, సకలలోకములకు ఒకే హర్త ఐన వానికి, సకలలోకములకు ఒకే గురువైన వానికి, సకల లోకములకు ఒకే సాక్షిఐన వానికి సకల నిగమములకు రహస్యమైన వానికి, సకల వరములను ఇచ్చేవానికి, సకల దురితముల ఆర్తిని నశింపచేసే వానికి సకల జగత్తునకు అభయమిచ్చే వానికి సకల లోకములకు ఒకే, మంగళమును చేసే వానికి, శశాంక శేఖరునకు శాశ్వతమైన తన కాంతిగల వానికి నిర్గుణునకు, విరుపమునకు, రూపహీనునక, నిరాభానునకు, నిరామయునకు నిష్ర్ప పంచునకు నిష్కలంకునకు నిర్ద్వంద్వునకు నిస్సంగునకు నిర్మలునకు, నిర్గమునకు, నిత్యరూపవిభవునకు, నిరుపమ విభవునకు నిరాధారునకు, నిత్యశుద్ధబుద్ధ పరిపూర్ణ సచ్చిదానంద అద్వంద్వునకు పరమ శాంత ప్రకాశ##తేజో రూపునకు జయము జయము. మహారుద్ర మహారౌద్ర భద్రావతార దుఃఖదావదారణ మహాభైరవ కాలభైరవ కల్పాంతభైరవ, కపాలమాలధర, ఖట్వాంగ ఖడ్గచర్మ (డాలు) పాశ అంకుశడమరు శూలచాప బాణగదాశక్తి ఖిండివాల తోమర ముసలము ద్గర, పట్టిశ, పరశు పరిఘ, భుశుండి, శతఘ్నిచక్రము మొదలగు ఆయుధములతో భీషణమైన వేయి చేతులవాడము ఖదంష్ట్రా కరాళ, వికటాట్టహాసముతో విచ్చిన బ్రహ్మాండ మండలం కలవాడ, నాగేంద్రకుండలుడ, నాగేంద్రహార, నాగేంద్రవలయ, నాగేంద్రచర్యధర మృత్యుం జయత్ర్యం బక త్రిపురాంతక, విరూపాక్ష విశ్వేశ్వర, విశ్వరూప, వృషభవాహన, విషభూషణ, విశ్వతోముఖ, సర్వతః రక్ష, రక్ష (నన్ను రక్షించు, రక్షించు) జ్వల జ్వల మహామృత్యుభయాన్ని అపమృత్యు భయాన్ని నశింపచేయి, నశింపచేయి. రోగ భయాన్ని తొలగించు, తొలగించు, విషసర్ప భయాన్నితగ్గించు తగ్గించు చోరభయాన్ని చంపుచంపు. నాశత్రువులను శూలంతో ఉచ్చాటనచేయి, ఉచ్చాటనచేయి. గండ్రగోడ్డలితో చీల్చుచీల్చు. ఖడ్గంతో భేదించు భేదించు ఖట్వాంగముతో ఛేదించు ఛేదించు. ముసలంతో (రోకలి) చలింపచేయి, చలింపచేయి బాణములతో పొడిచేయి, పొడిచేయి (పిండిచేయి) రాక్షసులను కొట్టు, కొట్టు భూతములను భయపెట్టు, భయపెట్టు కూష్మాండ వేతాళ మారీగణ బ్రహ్మరాక్షసులను ద్రవింపచేయి, ద్రవింపచేయి, భయపెట్టు, భయపెట్టు. నాకు అభయం ఇవ్వు. బాగా భయపడిన నన్ను ఓదార్చు ఓదార్చు. నరక భయం నుండి నన్ను ఉద్ధరించు ఉద్ధరించు ఆకలి దప్పుల నుండినన్ను బ్రతికించు బ్రతికించు దుఃఖాతురుడైన నన్ను ఓదార్చు ఓదార్చు. నన్ను సంతోషపరచు సంతోషపరచు శివకవచంతో నన్ను కప్పివేయి కప్పివేయి. త్ర్యంబక సదాశివనమస్తే (నీకు నమస్కారము) నమస్తే తేనమః ఋషభుని వచనము | ఇది శివకవచము వరదము నేను చెప్పాను. అన్నిబాధలను శమింపచేసేది అన్ని ప్రాణులకిదిరహస్యమైనది (28) దీనిని ఎల్లప్పుడు ఎవరు ధరిస్తారో ఈ శివకవచాన్ని వారికి శివుని అనుగ్రహంవల్ల ఎక్కడాభయంకలగదు. (29) క్షీణాయులై మృత్యువునుచేరినవారు, మహారోగ హతులైనవారు వెంటనేసుఖాన్ని పొందుతారు. దీర్ఘాయుస్సును పొందుతారు. (30) ఇది అన్ని దారిద్ర్యములన శమింప చేసేది. సుమాంగల్యాన్నిపెంచేది. ఈశివకవచాన్ని ఎవరు ధరిస్తారో వారు దేవతలతోను పూజింపబడుతారు (31) మహా పాతక సంఘములనుండి, ఉపపాతకములనుండి ముక్తుడౌతాడు. దేహాంతమందు శివకవచప్రభావంవల్ల శివుని చేరుతాడు. (32) ఓ కుమార! నీవు కూడా శ్రద్ధతో ఈ ఉత్తమమైన శివకవచాన్ని, నేనిచ్చనదాన్ని ధరించు వెంటనే శ్రేయస్సును పొందుతావు. (33) సూతులిట్లన్నారు - ఆరాకుమారునకు యోగి ఋషభుడు ఇట్లా చెప్పిబాగా ధ్వనించేశంఖాన్ని శత్రువుల చంపేఖడ్గాన్ని ఇచ్చాడు (34) తిరిగి భస్మాన్ని మంత్రించి అతని శరీరాన్ని అంతాస్పృశించాడు. ఆరువేల ఏనుగుల బలానికి రెట్టింపుబలాన్ని ఆతనికిచ్చాడు. (35) భస్మప్రభావంవల్ల బలఐశ్వర్యధృతిస్మృతులు పొంది ఆరాజపుత్రుడు శరత్కాల మందలిసూర్యునిలా కాంతితో ప్రకాశించాడు (36) చేతులుజోడించిన ఆరాకుమారునితో మళ్ళా ఆయోగి ఇట్లన్నాడు ఈ ఖడ్గాన్ని నేను తపోమంత్రశక్తితో ఇచ్చాను (37) తీష్ణమైన అంచుగలదీనిని ఎవరికి చూపిస్తావో ఆతడు వెంటనే మరణిస్తాడు. ఆశత్రువునకు ఇది మృత్యువుకూడా సాక్షాత్తుగా, స్వయంగా (38) నీశత్రువులు ఈ శంఖ ధ్వనిని వింటేవారు మూర్చపోతారు, అస్త్రాలు విడిచి చైతన్యం లేకుండా (39) ఈఖడ్గశంఖములు దివ్యమైనవి. శత్రుసైన్యమును నశింపచేసేవి. ఆత్మసైన్యమునకు స్వపక్షమువారికి శౌర్యతేజములను పెంచేవి (40) వీనిప్రభావం వల్ల శివకవచంతో కూడా పన్నెండు వేల ఏనుగుల బలంతో కూడా (41) భస్మధారణ సామర్థ్యంవల్ల శత్రు సైన్యాన్ని జయిస్తావు. పితృసింహాసనాన్ని పొంది ఈభూమిని రక్షిస్తావు. (42) అని తల్లితోపాటు భద్రాయుస్సునకు బాగాచెప్పి వారి పూజను పొంది ఆయోగి సై#్వరగమనంగా వెళ్ళాడు (43) అని శ్రీస్కాందమహాపురాణమందు ఏకాశీతి సహస్రసంహితయందు తృతీయమైన బ్రహ్మోత్తరఖండమందు సీమంతిని మాహాత్మ్యమందు భద్రాయు ఉపాఖ్యానమందు శివకవచకధన మనునది పన్నెండవ అథ్యాయము || 12 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters