Sri Scanda Mahapuranamu-3    Chapters   

పదకొండవ అధ్యాయము

మూ|| సూత ఉవాచ -

పింగలానామయావేశ్యామయాపూర్వముదాహృతా | శివభక్తారచనాత్‌పుణయాత్త్యక్త్వాపూర్వకలేవరం || 1 ||

చంద్రాంగదస్యసాభూయఃసీమంతిన్యామజాయత | రూపౌదారయగుణోపేతానామ్నావైకీర్తిమాలినీ || 2 ||

భద్రాయురపి తత్రైవరాజపుత్రోవణిక్పతేః | వవృధేనదనేభానుఃశుచావివమహాతపాః || 3 ||

తస్యాపివైశ్యనాధస్యకుమారస్త్వేక ఉత్తమః | సనామ్నాసునయఃప్రోక్తోరాజసూనోఃనఖా7భవత్‌ || 4 ||

తావుభౌవరమస్నిగ్థౌరాజవైశ్యకుమారకౌ | చిత్రక్రీడాపుదారాంగౌరత్నాభరణమండితౌ || 5 ||

తస్యరాజకుమారస్యబ్రాహ్మణౖఃసవణిక్పతిః | సంస్కారాన్‌కారయామానస్వపుత్రస్యాపివిస్తరాత్‌ || 6 ||

కాలేకృతోపనయనౌగురుశుశ్రూషణరతౌ | చక్రతుఃసర్వవిద్యానాంసంగ్రహంవినయాన్వితౌ || 7 ||

అధరాజకుమారస్యస్రాప్తేషోడశహాయనే | సఏవఋషభోయోగీతస్యవేశ్మన్యుపాయ¸° || 8 ||

సా రాజ్ఞీవకుమారశ్చశివయోగిసమాగతం | ముహుర్ముహుఃప్రణమ్యోభౌపూజయామాసతుర్ముదా || 9 ||

తాభ్యాంచపూజితఃసో7ధయోగీశోహృష్టమానసః | తంరాజపుత్రముద్దిశ్యబభాషేకరుణార్థ్రధీః || 10 ||

శివయోగ్యువాచ -

కచ్ఛిత్తేకుశలంతాతత్వన్మాతుశ్చాప్యనామయం | కచ్చిత్త్వంంసర్వవిద్యానాంఆకార్షీశ్చప్రతిగ్రహం || 11 ||

కచ్చిద్గురూణాంపతతంశుశ్రుషాతత్పరోభవాన్‌ | కచ్చిత్స్మరసిమాంతాతతవప్రాణప్రదంగురుం || 12 ||

ఏవంవదతియోగీశారాజ్ఞీసావినయాన్వితా | స్వపుత్రపాదయోస్తస్యనిపాత్యైసముభాషత || 13 ||

ఏక్షపుత్రస్తవగురోత్వమన్యప్రాణదఃపితా | ఏషశిష్యస్తుసంగ్రాహ్యోభవతాకరుణాత్మనా || 14 ||

అతోబంధుబిరుత్సృష్టమనాధంపరిపాలయ | అసై#్మసమ్యక్‌తాంమార్గంఉపదేష్టుంత్వమర్హసి || 15 ||

ఇతిప్రసాదితోరాజ్ఞ్వాశివయోగీమహామతిః | తసై#్మరాజకుమారాయసన్మార్గముపదిష్టవాన్‌ || 16 ||

తా || సూతులిట్లన్నారు - పింగళఅనే ఏవేశ్యనుగూర్చి నేను ముందుచెప్పానో, శివభక్తార్చనవల్ల ఆపుణ్యంవల్ల పాతశీరీరాన్ని వదలి (1) తిరిగి ఆమెచంద్రాగదునిభార్య యందు జన్మించింది రూపఔదార్యగుణములతో కూడింది. కీర్తిమాలిని అనిపేరు (2) భద్రాయువుకూడా అక్కడే రాజపుత్రుడైనాడు. మహాతపస్సంపన్నుడు శుచిలో ఉన్నట్లు ఆపణిక్‌పతి ఇంట్లో ఆతడు సూర్యునిలాపెరిగాడు (3) ఆ వైశ్యనాధునకు ఒక కుమారుడు ఉత్తముడు ఉన్నాడు ఆతని పేరు సునయుడు రాజసూనునకు స్నేహితుడైనాడు (4) వాళ్ళిద్దరు మిక్కిలి స్నేహంగలవారు ఆరాజ, వైశ్యకుమారులు. రకరకాల ఆటలు ఆడేవారు, ఉదారమైన ఆకారంగలవారు, రత్నాభరణాలు గలవారు (5) ఆరాకుమారునకు ఆవణిక్పతి బ్రాహ్మణులతో సంస్కారములు చేయించాడు తనపుత్రునకుగూడా విస్తారంగా చేయించాడు (6) వారు సకాలంలో ఉపనయనాన్ని పొంది గురుశుశ్రూషయందు ఆసక్తులైనారు. వినయంగలవారై అన్నివిద్యలనుసమకూర్చుకున్నారు. (7) రాజకుమారునకు పదహారు సంవత్సరాలు వచ్చాక తిరిగి ఆ ఋషభయోగి ఆఇంటికి వచ్చాడు (8) ఆరాణి ఆ రాకుమారుడు వచ్చినశివయోగిని మాటిమాటికి నమస్కరించి ఇద్దరు ఆనందంతో పూజించారు (9) వారు పూజించగా ఆయోగి ఆనందించి, కరుణగలవాడై రాజపుత్రునితో ఇట్లన్నాడు (10) శివయోగివచనము - నీవు కుశలంగా ఉన్నావా ఓ తండ్రి ! మీ తల్లిగారు కూడా క్షేమంగా ఉన్నారా. నీవు అన్ని విద్యలను స్వీకరించావా (11) నీవు గురువులకు నిరంతరం శుశ్రూషచేస్తున్నావా. నన్నుస్మరిస్తున్నావా, ఓ కుమార నీకు ప్రాణప్రదమైన గురువును కదా (12) అని యోగీశ్వరుడు పలుకగా ఆరాజ్ఞి వినయంగలదై ఆమెతన కొడుకును ఆతని పాదములపై వేసి ఆయోగితో ఇట్లా పలికింది (13) ఈ కొడుకునీవాడు. ఓ గురు ! నీవీతనికి ప్రాణమిచ్చినగురువువు. ఈ శిష్యుణ్ణిమీరు కరుణతో అనుగ్రహించాలి (14) బంధువులంతా విడిచి పెట్టిన ఈతనిని అనాధను పాలించండి. ఈతనికి బాగా సజ్జనమార్గాన్ని మీరు ఉపదేశించండి (15) అని రాణి ప్రార్థించగా మహామతిశివయోగిఆరాకుమారునకు సన్మార్గాన్ని ఉపదేశించాడు(16)

మూ || ఋషభఉవాచ -

శ్రుతిస్మృతి పురాణషుప్రోక్తాధర్మంసనాతనః | వర్ణాశ్రమానురూపేణనిషేవ్యఃసర్వదాజనైః || 17 ||

భజవత్ససతాంమార్గంసదేవచరితంచర | సదేవాజ్ఞావిలంఘేధాః మాకార్షీఃదేవహేలనం || 18 ||

గోదేవగురువిప్రేషుభక్తిమాన్భవసర్వదా | చాండాలమపినంప్రాప్తంసదాసంభావయాతిధిం || 19 ||

సత్యంసత్యజసర్వత్రప్రాప్తో7పిప్రాణసంకటే | గోబ్రాహ్మణానాంరక్షార్థంఅసత్యంత్వంపదక్వచిత్‌ || 20 ||

పరస్వేషుపరస్త్రీషు దేవబ్రాహ్మణవస్తుషు | తృష్ణాంత్యజమహాబాహోదుర్లభేష్వపివస్తుషు || 21 ||

సత్కధాయాంసదాచారేసద్ర్వతేచసదాగమే | ధర్మాదిసంగ్రహెనిత్యంతృష్ణాంకురుమహామతే || 22 ||

స్నానేజపేచహోమేచస్వాధ్యాయేపితృతర్పణ | గోదేవాతిధిపూజానునిరాలస్యోభవానఘ || 23 ||

క్రోధంద్వేషంభయంశాఠ్యంపైశున్యమనదాగ్రహం | కౌటిల్యదంభముద్వేగంయత్నేనపరివర్జయ || 24 ||

క్షాత్రధర్మరతో7పిత్వంవృధాహింసాంపరిత్యజ | శుష్కవైరంవృధాలాపంపరనిందాంచవర్జయ || 25 ||

మృగయాద్యూతపానేషుస్త్రీషుస్త్రీవిజితేషుచ | అత్యాజహారమతిక్రోధమతినిద్రామతిశ్రమం || 26 ||

అత్యాలాపమతిక్రీడాం సర్వదాపరివర్జయ || 27 ||

అతివిద్యామతిశ్రద్ధాంఅతిపుణ్యమతిస్మృతిం | అత్యుత్సాహమతిఖ్యాతింఅతిదైర్యంచసాధయ || 28 ||

సకామోనిజదారేషునక్రోధోనిజశత్రుషు | సలోభఃపుణ్యనిచయేసాభ్యసూయోహ్యధర్మిషు || 29 ||

నద్వేషోభవపాఖండేసరాగఃసజ్జమేవచ | దుర్బోధోభవదుర్మంcత్తేబధిరఃపిశునోక్తిషు || 30 ||

ధూర్తంచండం శఠంక్రూరంకితపంచపలంఖలం | పతితంనాస్తికం జిహ్మందూరతః పరిపర్ణయ || 31 ||

ఆత్మప్రశంసాం మాకార్షీఃపరిజ్ఞాతేంగితోభవ | ధనేసర్వకుటుంబేచ వాత్యాసక్తఃసదాభవ || 32 ||

పత్న్యాఃపతివ్రతాయాశ్చజనన్యాఃశ్వశురస్యచ | సతాంగురోశ్చవచనేవిశ్వాసంకురుసర్వదా || 33 ||

తా || ఋషభునివచనము - శ్రుతిస్మృతిపురాణములలో సనాతనధర్మముచెప్పబడింది. జనులు ఎల్లప్పుడు వర్ణాశ్రమానుసారంగాఆచరించాలి (17) ఓ కుమార సజ్జనులమార్గాన్ని అనుసరించు. మంచివారి మార్గంలో నడువు. దేవ ఆజ్ఞనుదాటొద్దు దేవహేళనము చేయొద్దు. (18) గోదేవగురు విప్రులవిషయంలో ఎల్లప్పుడూ భక్తితోఉండు. అతిధిగా చండాలుడువచ్చినా ఎప్పుడూ గౌరవించు (19) సత్యంవిడువద్దు. ప్రాణసంకటంవచ్చినాసరే. గోబ్రాహ్మణుల రక్షణకొరకు ఎక్కడైనా నీవు కొంచం అసత్యం మాట్లాడు (20) పరులవస్తువులపై, పరస్త్రీలపై, దేవబ్రాహ్మణుల వస్తువులపై ఆశ##పెట్టుకోకు. ఓ మహానుభావ ! దుర్లభ##మైన వస్తువులపైగూడా ఆశ##పెట్టుకోకు. (21) సత్కధయందు, సదాచారమందు సద్ర్వతమందు సత్‌ఆగమమందు ధర్మాదులసంగ్రహమందు ఎప్పుడూ ఆశపడు ఓమహామతి ! (22) స్నానము, జపము, హోమము, స్వాధ్యాయము, పితృతర్పణము, గోదేవఅతిధిపూజలు వీనియందు ఆలస్యంచేయొద్దు. ఓ పుణ్యాత్ముడ. (23) క్రోధము ద్వేషము, భయము, శార్యము, లోభత్వము, తగనికోపము, కౌటిల్యము, దంభము, ఉద్వేగము, వీటిని శ్రమించియైనా విడిచిపెట్టు (24) నీవు క్షత్రియ ధర్మమందున్న వాడవైనా వ్యర్థంగా హింసచేయొద్దు. వ్యర్తంగా తగాదా వ్యర్థంగా మాట్లాడటం, పరనింద, వీటిని విడిచిపెట్టు (25) వేటజూదముపానము స్త్రీలు, ఆడసొత్తులు వీనియందు (ఆశవద్దు) అధిక ఆహారం తినటం, అతిక్రోధము, అతినిద్ర, అతిశ్రమము (26) అధికంగా మాట్లాడటం, అతిగా ఆటలు, ఎల్లప్పుడూవిడిచిపెట్టు (27) అతివిద్యను, అతిశ్రద్ధను, అతిపుణ్యమును, అతిస్మరణమును, అతి ఉత్సాహమును, అతిఖ్యాతిని అతిదైర్యమును సాధించు (28) నీ భార్యలందు కామినిగి నిజశత్రువులందు కోపంగా ఉండు. పుణ్యనిచయమందు, లోభంకలిగి ఉండు. అదర్మమాచరించేవారియందు అసూయకలిగి ఉండు. (29) పాఖండులను ద్వేషించు సజ్జనులందు అనురాగం కలిగి ఉండు. చెడునీతియందు అర్థంకానట్లుగా ఉండు. పిసినారి మాటలందు చెవిటివాడివికా (30) ధూర్తుడు, చండుడు, శఠుడు, క్రూరుడు, కితవుడు, చవలుడు, ఖలుడు పతితుడు, నాస్తికుడు, వక్రుడు (బుద్ధి)వీరిని దూరంనుండే వదిలి పెట్టు. (31) తన ప్రశంసను చేసుకోవద్దు. ఇతరుల ఇంగితాన్ని తెలసుకో. ధనమందు, కుటుంబమందరియందు అత్యాసక్తు డవుగా ఎప్పుడూ కావద్దు (32) భార్య, పతివ్రత, తల్లి శ్వశురుడు, సజ్జనుడు, గురువు వీరిమాటలపై ఎప్పుడూ విశ్వాస ముంచు (33).

మూ || ఆత్మరక్షాపరోనిత్యంఅప్రమత్తోదృఢవ్రతః | విశ్వాసంనైవకుర్వీధాఃస్వభృత్యేష్వపికుత్రచిత్‌ || 34 ||

విశ్వస్తంమావధీఃకంచిదపిచోరంమహామతే | అపాపేషునశంకేధాఃసత్యాన్నచలితోభవ || 35 ||

అనాధంకృపణం వృద్ధం స్త్రియంబాలంనిరాగనం | పరిరక్ష ధనైఃప్రాణౖః బుధ్థాశక్త్యాబలేనచ || 36 ||

అపిశత్రుంవధస్యార్‌హంమావధీఃశరణాగతం | అప్యపాత్రంసుపుత్రంవానీచోవాపిమహత్తమ || 37 ||

యోవాకోనాపియాచేతతసై#్మదేహిశిరోపిచ | అపియత్నేసహాతాకీర్తిమేవసదార్జయ || 38 ||

రాజ్ఞాంచవిదుషాంచైవకీర్తిరేవహిభూషణం | సత్కీర్తిప్రభవాలక్ష్మీః పుణ్యంసత్కీర్తి సంభవం || 39 ||

సత్కీర్త్యారాజతేలోకశ్చంద్రశ్చంద్రికయాయథా | గజాశ్వహెమనిచయంరత్నరాశింనగోపమం | || 40 ||

అకీర్త్యోవహతంసర్వంతృణవన్ముంచసత్వరం | మాతుఃకోపంపితుఃకోపంగురోఃకోపంధనవ్యయం || 41 ||

పుత్రాణామపరాధంచ బ్రాహ్మణానాంక్షమన్వభోః | యధాద్విజప్రసాదఃస్యాత్‌తధాతేషాంహితంచర || 42 ||

రాజానంసంకటేమగ్నయుద్ధరేయుర్విజోత్తమాః | ఆయురయశోబలంసౌఖ్యంధనంపుణ్యంప్రజోన్నతిః || 43 ||

కర్మణాయేనజాయేతతత్సేవ్యంభవతాసదా | దేశంకాలంచశక్తించకార్యంచాకార్య మేవచ || 44 ||

సమ్యగ్‌ విచార్యయత్నేనకురుకార్యంచసర్వదా | స కుర్యాఃకస్యచిద్బాధాంపరబాధాంనివారయ || 45 ||

చోరాన్‌దుష్టాంశ్చబాధేథాః సునీత్యాశక్తిమత్తయా | స్నానేజపేచహోమేచదైవేపిత్ర్యేచకర్మణి || 46 ||

అత్వరోభవనిద్రాయాంభోజనేభవసత్వరః | దాక్షిణ్యయుక్తమశఠంసత్యంజనమనోహరం || 47 ||

అల్పాక్షరమసంతార్థంవాక్యంబ్రూహిమహామతే | అభీతోభవసర్వత్రవివక్షేషువివత్సుచ || 48 ||

భీతోభవబ్రహ్మకులేనపాపేగురుశాననే | జ్ఞాతిబంధుషువిప్రేషుభార్యాసుతనయేషుచ || 49 ||

సమభావేనవర్తెధాఃతధాభోజనసంక్తిషు || 49 1/2 ||

తా || ఎప్పుడూనిన్ను నీవు రక్షించుకో. అప్రమత్తుడవు, దృఢదీక్షగలవాడవుకా. తనభృత్యులందైనా ఎప్పుడైనా విశ్వాసముంచరాదు (34) విశ్వసించిన వానిని ఎప్పుడూచంపొద్దు. వాడు దొంగైనాసరే, ఓ మహామతి ! పావులు కాని వారిపై అనుమానంవద్దు. సత్యంనుండి చలించవద్దు (35) అనాధుడు, కృపణుడు, వృద్ధుడు, స్త్రీ, బాలుడు, తప్పుచేయని వాడు, వీరిని రక్షించు. నీధనంవెచ్చింది, నీ ప్రాణములనిచ్చి, నీ బుద్ధినివినియోగించి, నీశక్తిని బలాన్నిచూపి (36) శరణాగ డుతైన శత్రువు వధార్‌హుడైన వానిని చంపొద్దు. అపాత్రుడైన సుపాత్రుడైన నీచుడైన గొప్పవాడైన (37) ఎవడైనాసరే యాచిస్తేచాలువారికి నీతలనైనాఇవ్వు. వ్రతయత్నపూర్వకముగా ఎప్పుడూ కీర్తినేసంపాదించు (38) రాజులకు విద్వాంసులకు కీర్తియేభూషణము. మంచికీర్తివల్లలక్ష్మి లభిస్తుంది. సత్కీర్తివల్ల పుణ్యంవస్తుంది. (39) సత్కీర్తితో లోకం వెలిగి పోతుంది.వెననెలతో చంద్రునిలాగా ఏనుగులు గుఱ్ఱములు బంగారము, రత్నరాశి పర్వతమంత కుప్ప (40) అపకీర్తివల్ల వచ్చిందేదైనా త్వరగా వాటిని గడ్డిపోచలావిడిచిపెట్టు. తల్లికోపము, తండ్రికోపము, గురువుకోపము, ధననాశము (41) పుత్రులఅపరాధము, బ్రాహ్మణులఅపరాధము వీటిని క్షమించు, ద్విజులఅనుగ్రహంకలిగేట్టుగా వారికిమేలుచేయి (42) ద్విజోత్తములు, సంకటమందున్నరాజును ఉద్ధరించాలి. ఆయుస్సు, యశము, బలము, సౌఖ్యము, ధనము, పుణ్యము, ప్రజోన్నతి (43) వీటిని నీకర్మవల్ల లభించిన దానిని నీవుఎల్లప్పుడూ సేవించు. దేశము, కాలము, శక్తి కార్యము, అకార్యము (44) అన్ని బాగావిచారించి ఎప్పుడు కర్మనాచరించాలి, ప్రయత్నపూర్వకముగా ఎవరిని బాధించొద్దు. ఇతరులబాధనునివారించు. (45) శక్తివంతమైనమంచినీటితోచోరులను దుష్టులను బాధించు. స్నానము, జపము, హోమము, దైవపితృకర్మలు వీనియందు (46) తొందరవద్దు. నిద్ర, భోజనం వీనివిషయంలో తొందరుండనీ. దాక్షిణ్యముగల, అశఠమైన, సత్యవంతుడైన, జనులకు మనోహరమైన (47) అల్పాక్షరములుకల, అనంతార్థము గల మాట మాట్లాడు, ఓ మహామతి. అంతటభయంలేకుండా ఉండు, శత్రువులందు, ఆపదలందునూ (48) బ్రహ్మకులాన్ని చూచి భయపడు. పాపమైన గురుశాసనమైనాభయపడోద్దు. జ్ఞాతులందు, బంధువులందు, విప్రులందు, భార్యలందు, తనయులందు, (49) సమభావంతోవర్తించు అట్లాగే భోజన పంక్తిలోను సమానంగా వర్తించు (49 1/2)

మూ || సతాంహితోపదేశస్త్రషుతధాపుణ్యకధానుచ || 50 ||

విద్యాగోష్ఠీషుధర్మ్యాసుక్వచిన్మాభూఃపరాఙ్‌ముఖః | శుచౌపుణ్యజలస్యాంతేప్రఖ్యాతేబ్రహ్మసంకులే || 51 ||

మహాదేశేశివమయేపస్తవ్యంభవతాసదా | కులటాగణికాయత్రయత్రతిష్ఠతికాముకః || 52 ||

దుర్దేశేనీచసంబాధేకదాచిదపిమావన | ఏకమేవాశ్రితోపిత్వంశివంత్రిభువనేశ్వరం || 53 ||

సర్వాన్‌ దేవాన్‌ ఉపాసీథాః తద్దినానిచమాసయన్‌ | సదాశుచిఃసదాదక్షః సదాశాంతఃసదాస్థిరః || 54 ||

సదావిజితషడ్వర్గః సదైకాంతోభవానఘ | వి ప్రాన్‌వేదవిదఃశాంతాన్‌యతీంశ్చనియతోజ్జ్వలాన్‌ || 55 ||

యుగ్మం -

పుణ్యవృక్షాన్‌పుణ్యనదీః పుణ్యతీర్థం మహత్సరః | ధేనుంచవృషభంరత్నంయువతీంచపతివ్రతాం || 56 ||

ఆత్మనోగృహదేవాంశ్చసహసైవనమస్కురు | ఉత్థాయనమయేబ్రాహ్మెస్వాచమ్యవిమలాశయః || 57 ||

నమస్కృత్యాత్మగురవేధ్యాత్మాదేవముమాపతిం | నారాయణంచలక్ష్మీశంబ్రహ్మాణంచవినాయకం || 58 ||

స్కందంకాత్యాయనీందేవీంమహాలక్ష్మీంసరస్వతీం | ఇంద్రాదీనధలోకేశాన్‌పుణ్యశ్లోకాన్‌ఋషీనపి || 59 ||

చింతయిత్వాధమార్తండముద్యంతంప్రణమేత్సదా | గంధంపుష్పంచతంబూలంశాకంపక్వఫలాదికం || 60 ||

శివాయదత్వోసభుంక్ష్వభక్ష్యంభోజ్యప్రియంవనం|యద్దత్తంయత్కృతంజప్తంయత్న్సాతంయుద్ధృతంస్మృతం || 61 ||

యచ్చతప్తంతవఃసర్వంతచ్ఛివాయనివేదయ | భుంజానశ్చపఠన్వాపిశయానోవిహరన్నపి

పశ్యన్‌శృణ్వన్‌వదన్‌గృహ్ణన్‌శివమేవానుచింతయ || 62 ||

రుద్రాక్షకంకణలసత్కరదండయుగ్మోమాలాంతరాలధృతభస్మస్మితత్రిపుండ్రః

పంచాక్షరంపరిపఠన్‌పరమంత్రరాజంధ్యాయన్‌సదాపశుపతేశ్చరణంరమేథాః || 63 ||

ఇతిసంక్షేవతోవత్సకధితోధర్మసంగ్రహః | అన్యేషుచపురాణషువిస్తరేణప్రకీర్తితః || 64 ||

అధాపరంసర్వపురాణగుహ్యంనిః శేషపాపౌఘహరంపవిత్రం |

జయప్రదంసర్వవిపద్విమోచనంపక్ష్యామిశైవంకవచం హితాయతే || 65 ||

ఇతిశ్రీస్కాందేమహాపురాణ ఏకాశీతిసాహస్ర్యాంసంహితాయాంతృతీయేబ్రహ్మఖండేభద్రాయుంప్రతిఋషభోపదేశ వర్ణనంనామఏకాదశో7ధ్యాయః || 11 ||

తా || సజ్జనుహితోపదేశంలో, పుణ్యకథలందు సమభావంగా ఉండు (50) ధర్మసంబంధమైన విద్యాగోష్ఠులందు పరాఙ్‌ముఖుడవు కాకు. ప్రఖ్యాతమైన బ్రహ్మవంకులమైనశుచియైనపుణ్యజలంసమీపంలో (51) శివమయమైన మహాదేశ మందు నీవు ఎప్పుడూ ఉండాలి. కులట, గణిక ఉన్నచోట, కాముకుడున్నచోట (52) దుర్‌దేశము, నీచబాధగల ప్రదేశ ములందు ఎప్పుడూ ఉండొద్దు. త్రిభువనేశ్వరుడైన శివుణ్ణిఒక్కణ్ణనీవు ఆశ్రయించినా (53) అందరుదేవతలను ఉపాసించు. ఆరోజులను గౌరవించు. ఎప్పుడూ శుచిగా, ఎప్పుడూ దక్షునిగా, శాంతునిగా, స్థిరునిగా ఉండు. (54) అరిషడ్వర్గములను ఎల్లప్పుడూ జయించు. ఎప్పుడూ ఏకాంతంగా ఉండు. ఓ అనఘవేద విదులైనవిప్రులు, శాంతులు, యతులు, తప్పనికాంతి గలవారు (55) పుణ్యవృక్షములను, పుణ్యనదులను,పుణ్యతీర్థములను గొప్ప సరస్సులు, ధేనువు, వృషభమును రత్నము, పతివ్రతయైన యువతి (56) తన ఇంటిదేవతలు వీరిని త్వరగా నమస్కరించాలి. బ్రాహ్మ ముహూర్తమందులేచి, ఆచమించి, విమలమైనబుద్ధిగలవాడై (57) తనగురువునకు నమస్కరించి ఉమాపతిని ధ్యానించి నారాయణుని, లక్ష్మిని, బ్రహ్మను, వినాయకుని (58) స్కందుని కాత్యాయనీదేవీని మహాలక్ష్మీని, సరస్వతిని, ఇంద్రాదులను లోకేశులను పుణ్యశ్లోకులను ఋషులనుగూడా (59) జ్ఞప్తికితెచ్చుకొని, ఉదయిస్తున్నసూర్యుణ్ణి ఎప్పుడూ నమస్కరించాలి. గంధము, పుష్పము, తాంబూలము, శాకము, పండినపండ్లు మొదలగునవి (60) శివునకునివేదించి అనుభవించు, ప్రియమైన, కొత్తదైనభక్ష్య భోజ్యములను, దానమును, కర్మను, జపమును,స్నానమును, హోమమును, స్మరణను, (61) తపమును, అన్నింటిని శివునకు నివేదించు. తింటున్నా, చదువుతున్నా, నిద్రిస్తున్నా, విహరిస్తున్నా, చూస్తున్నా, వింటున్నా, మాట్లాడుతున్నా, స్వీకరిస్తున్నా శివునేఅనుసంధించు స్మరించు (62) రుద్రాక్షకంకణములను కరదండములరెండింట ప్రకాశిస్తుండగా మాలలమధ్యభస్మముతో తెల్లని త్రిపుండ్రములు ధరించి, పరమమంత్ర రాజమును పంచాక్షరమును పఠిస్తూ ఎప్పుడూ పశుపతి చరణములు ధ్యానిస్తూ ఆనందించు (63) అని సంక్షేపంగా ధర్మసంగ్రహాన్ని చెప్పాను, ఓకుమార! ఇతరపురాణాల్లో విస్తారంగా చెప్పబడింది (64) సర్వపురాణములలో రహస్యమైన పాపములన్నింటిని హరించే పవిత్రమైన, జయప్రదమైన, అన్ని ఆపదలను తొలగించే మరోశివకవచాన్ని నీక్షేమంకొరకు చెప్తాను (65) అని శ్రీస్కాందమహాపురాణమందు ఏకాశీతి సహస్రసంహితయందు మూడవదైన బ్రహ్మఖండ మందు భద్రాయువునకు ఋషభుని ఉపదేశవర్ణనమనునది పదునొకండవ అధ్యాయము || 11 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters