Sri Scanda Mahapuranamu-3    Chapters   

ఎనిమిదవ అధ్యాయము

మూ || సూత ఉవాచ -

నిత్యానంద మయం శాంతం నిర్వికల్పం నిరామయం | శివతత్వమనాదయంతం యే విదుస్తే పరంగతాః || 1 ||

విరక్తాః కామ భోగేభ్యో యే ప్రకుర్వంత్యహైతుకీం | భక్తింపరాం శివే ధీరాస్తే షాం ముక్తిర్నసంసృతిః || 2 ||

విషయానభి నంధాయయే కుర్వంతి శివేరతిం | విషయైర్నాభి భూయంతే భుంజానాస్తత్ఫలాస్యపి || 3 ||

యేనకేనాపి భావేన శివభక్తి యుతోనరః | నవినశ్యతి కాలేన సయాతి పరమాంగతిం || 4 ||

ఆరురుక్షుః పరం స్థానం విషయాసక్త మాససః | పూజయే త్కర్మణా శంభుంభోగాంతే శివమాప్నుయాత్‌ || 5 ||

అశక్తఃకశ్చిదుత్ర్సష్టుం ప్రాయో విషయవాసనాం | అతః కర్మమయీపూజాకామధేనుః శరీరిణాం || 6 ||

మాయామయేపి సంసారేయేవిహృత్యచిరంసుఖః | ముక్తిమిచ్ఛంతి దేహాంతే తేషాం ధర్మోయమీరితః || 7 ||

శివపూజా సదాలోకేహెతుః స్వర్గాపవర్గయోః | సోమవారే విశేషేణ ప్రదోషాది గుణాన్వితే || 8 ||

కేవలేనాపి యేకుర్యుః సోమవారే శివార్చనం | నతేషాం విద్యతే కించిత్‌ ఇహాముత్రచ దుర్లభం || 9 ||

ఉపోషితః శుచిర్భూత్వా సోమవారే జితేంద్రియః | వైదికైః లౌకికైర్వాపి విధివత్పూజయేచ్ఛివం || 10 ||

బ్రహ్మచారీగృహస్థోవాకన్యా వాపినభర్తృకా | విభర్తృకావా సంపూజ్య లభ##తే పరమీప్సితం || 11 ||

అత్రాహం కథయిష్యామికథాం శ్రోతృమనోహరాం | శ్రుత్వాముక్తింప్రయాంత్యేవ భక్తిర్భవతి శాంభవీ || 12 ||

ఆర్యావర్తేనృపః కశ్చిత్‌ ఆసీద్ధర్మభృతాంపరః | చిత్రవర్మేతి విఖ్యాతో ధర్మరాజో దురాత్మవాన్‌ || 13 ||

నగోప్పతా ధర్మసేతూనాం శాస్తాదుష్పధగామినాం | యష్టాసమస్త యజ్ఞానాం త్రాతాశరణమిచ్ఛతాం || 14 ||

కర్తా సకల పుణ్యానాం దాతా సకల సంపదాం | జేతా సపత్న వృందానాం భక్తః శివముకుందయోః || 15 ||

సోను కూలానుపత్నీషులబ్ధ్వాపుత్రాన్మ హౌజనః | చిరేణ ప్రార్థితాం లేభే కన్యామేనాం పరాననాం || 16 ||

సలబ్థ్వాతనయాం దిష్ఠ్వాహి మవానివ పార్వతీం | ఆత్మానం దేవ సదృశం మేనే పూర్ణమనోరధం || 17 ||

తా || సూతుని వచనము | ఎల్లప్పుడు ఆనందమయమైనది, శాంతమైనది, నిర్వికల్పమైనది, నిరామయమైనది, అనాద్యమైన శివతత్వమును తెలుసుకున్నవారు వరమును పొందుతారు (1) కామభోగముల నుండి విరక్తులై అకారణమైన భక్తిని పరమైన దానిని శివుని యందు చేసిన వారికి ముక్తి తప్ప సంసారములేదు. వారు ధీరులు (2) విషయం తెలియకుండా (భోగములందు ఆసక్తి లేక) శివుని యందు ఎవరు ప్రేమను చూపుతారో వారు విషయములతో తిరస్కరింపబడరు, ఆ ఫలాలను అనుభవిస్తున్నాకూడా (3) ఏదో విధముగా ఏ భావనతోనైనా శివభక్తి కలిగిన నరుడు, కాలంతో పాటు మరణించడు, ఆతడు ఉత్తమ గతికి చేరుతాడు (4) విషయములందు లగ్నమైన మనస్సు కలవాడైనా ఉత్తమ స్థానాన్ని పొంద దలిస్తే తన కర్మలతో శివుని పూజించాలి. భోగముల చివర శివుని పొందుతాడు (5) విషయ వాసనలను వదలుటకు అశక్తులైన వారికి ఎవరికైన వారికి కర్మమయమైన కామధేనువు వంటిది (6) సంసారం మాయా మయమైనా వదలి చిరమైన సుఖాన్ని దేహాంతమందు ముక్తిని ఎవరు కోరుకుంటారో వారికి ఇది ధర్మంగా చెప్పబడింది. (7) స్వర్గ అపవర్గములకు ఎప్పుడూ ఈ లోకంలో శిపవూజ కారణము. సోమవారము, ప్రదోష కాలమందు విశేష కాలమందు ఉత్తమము. (8) ఒక్క సోమవారమునాడే శివార్చనను ఎవరు చేస్తారో వారికి ఈ లోకంలో కాని పైలోకంలో కాని దుర్లభ##మైనది ఏదీ లేదు (9) సోమవారం నాడు ఉపవసించి, శుచియై జితేంద్రియుడై శివుని వైదికమైన లేదా లౌకికమైన విధానములతో శివుని పూజించాలి విధి ప్రకారంగా (10) బ్రహ్మచారి గృహస్థుడు, కన్యక, ముత్తైదువ, విధవ ఎవరైనా శివుని పూజించి ఈప్సిత వరాన్ని పొందుతారు (11) ఇక్కడ నేనో కథ చెబుతాను విన సొంపైనది. వింటే ముక్తిని పొందుతారు. శివభక్తి కల్గుతుంది (12) ఆర్యావర్తనమందు ఒకరాజు ఉండేవాడు ధర్మవంతులలో శ్రేష్ఠుడు. చిత్రవర్మ అని అతనిపేరు. దురాత్ములకు ఆతడు యముడు (13) ధర్మసేతువును రక్షించేవాడు చెడు మార్గంలో వెల్ళే వారిని శాసించేవాడు. సమస్త యజ్ఞములను చేసినవాడు. శరణు కోరిన వారిని రక్షించేవాడు (14) సకల పుణ్యములను ఆచరించిన వాడు. అన్ని సంపదలను ఇచ్చినవాడు. శత్రు సమూహమును జయించినవాడు శివము కుందులకు భక్తుడు (15) ఆతడు అనుకూలురైన భార్యలందు శక్తి వంతులైన పుత్రులను పొంది చాలా కాలమునకు తాను కోరుకున్నట్లుగా సుందరమైన ముఖంగల ఒక కన్యను పొందాడు (16) అతడు అదృష్టవశాత్తు హిమవంతుడు పార్వతిని పొందినట్లు ఒకకూతురును పొంది తనను దేవన దృశునిగా, తన కోరికలు నెరవేరినట్లుగా భావించాడు (17).

మూ || స ఏకదాజాతకలక్షణజ్ఞానాహూయసాధూన్‌ద్విజముఖ్యవృందాన్‌

కుతూహలే నాభినివిష్టచేతాఃపప్రచ్ఛకన్యాజననే ఫలాని || 18 ||

అధతత్రా బ్రవీదే కో బహుజ్ఞో ద్విజసత్తమః | ఏషా సీమంతి నీనామ్నా కన్యాతప మహీపతే || 19 ||

ఉమేవ మాంగల్యవతీ దమయంతీ వరూపిణీ | భారతీవ కలాభిజ్ఞా లక్ష్మి రివ మహాగుణా || 20 ||

సువ్రజా దేవమాతేవ జానకీవ ధృతవ్రతా | రవిప్రభేవ సత్కాంతిః చంద్రికేవ మనోరమా || 21 ||

దశవర్ష సహస్రాణి సహభర్త్రాప్రమోదతే | ప్రసూయ తనయానష్టౌ పరం సుఖమవాప్స్యతి || 22 ||

ఇత్యుక్త వంతం నృపతిః ధనైః సంపూజ్యతం ద్విజం | అవాపరమాం ప్రీతిం సద్వాగమృత సేవయా || 23 ||

అధాన్యో7పి ద్విజః ప్రాహ దైర్యవానమితద్యుతిః | ఏషా చతుర్దశే వర్షే వైధవ్యం ప్రతి పత్స్యతి || 24 ||

ఇత్యాకర్ణ్యవచస్తస్య వజ్రనిర్ఘాత నిష్ఠురం | ముహూర్త మభవ ద్రాజాచింతా వ్యాకులమాననః || 25 ||

అథసర్వాన్‌సముత్సృజ్యబ్రహ్మణాన్‌ బ్రహ్మవత్సలః | సర్వందైవకృతంమత్వానిశ్చింతఃపార్థివో7భవత్‌ || 26 ||

సాపిసీమంతినీ బాలాక్రమేణ గతశైశవా | వైధవ్యమాత్మనోభా విశుశ్రావాత్మ సఖీముఖాత్‌ || 27 ||

వరం నిర్వేదమాపన్నాచింతయా మాసబాలికా | యాఙ్‌ఞవల్క్యమునేః పత్నీంమైత్రేయీంపర్యపృచ్ఛత || 28 ||

మాతస్త్వచ్చరణాం భోజం ప్రపన్నాస్మి భయాకులా | సౌభాగ్య వర్ధనం కర్మ మమ శంసితుమర్హసి || 29 ||

ఇతి ప్రపన్నాం నృపతేః కన్యాం ప్రాహమునేః సతీ | శరణం ప్రజ త స్వంగి పార్వతీం శివసంయుతాం || 30 ||

సోమవారే శివంగౌరీం పూజయస్వ సమాహితా | ఉషోషితావా సుస్నాతా విరజాం బరధారిణీ || 31 ||

యతవాఙ్‌నిశ్చలమనాఃపూజాంకృత్వాయధోచితాం | బ్రహ్మణాన్భోజయిత్వాధశివంసమ్యక్ర్పసాదయత్‌ || 32 ||

పాపక్షయోభిషేకేణ సామ్రాజయం పీఠ పూజనాత్‌ | సౌభాగ్య మఖిలంసౌఖ్యంగంధమాల్యాక్ష తార్పణాత్‌ || 33 ||

ధూపదానేన సౌగంధ్యం కాంతిర్దీప ప్రదానతః | నైవేద్యైశ్చ మహాభాగొ లక్ష్మీస్తాం బూలదానతః || 34 ||

ధర్మార్ధ కామమోక్షాశ్చ నమస్కారప్రదానతః | అష్టైశ్వర్యాది సిద్ధానాం జపఏవ హి కారణం || 35 ||

హోమేన సర్వకామానాం సమృద్ధిరుపజాయతే | సర్వేషామేవదేవానాం తుష్టిర్‌ బ్రాహ్మణ భోజనాత్‌ || 36 ||

తా || ఆతడొకసారి జాతక లక్షణములు తెలిసిన సాధువులను బ్రాహ్మణముఖ్యులను పిలిచి, కుతూహలంతో నిండిన మనస్సుగలవాడై కన్యపుట్టిన ఫలమును చెప్పమన్నాడు (18) అందులో, చాలా విషయాలు తెలిసిన ఒక బ్రాహ్మణుడు ఇట్లా చెప్పాడు. ఓ రాజ! ఈ నీసీమంతిని అనుపేరుగల కన్య (19) పార్వతివలె మాంగల్యముకలది, దమ యంతివలె రూపవంతురాలు. భారతివలెకళలోఆరితేరినది. లక్ష్మివలె మహాగుణములుకలది. (20) దేవతల తల్లి వలె మంచి సంతతిగలది. జానకి వలెనియమపాలనకలది. సూర్యకాంతివలెమంచి కాంతిగలది, చంద్రికవలెమనోహరమైనది (21) పదివేలసంవత్సరాలు భర్తతో కలిసి ఆనందిస్తుంది. ఎనిమిదిమంది తనయులను ప్రసవించిచాలాసుఖపడుతుంది. (22) అనిపలికిన బ్రాహ్మణుని రాజుధనముతోపూజించాడు. ఆతని వాగమృతాన్నివినిరాజు చాలా ఆనందపడ్డాడు (23) ఇకమరోబ్రాహ్మణుడుకాంతి వంతుడు దైర్యవంతుడు ఇట్లన్నాడు. ఈమె పదునాల్గవసంవత్సరములో వైధవ్యాన్ని పొందుతుంది. (24) అనే ఆతని మాటలను వజ్రమువలెకఠినమైన వానినివిని, క్షణంసేపు రాజు చింతావ్యా కులమానసుడైనాడు. (25) పిదప బ్రాహ్మణుల యందు దయగల ఆరాజు అందరిని పంపించి, ఇదంతా దైవలీల అని భావించి, ఆరాజు నిశ్చింతుడైనాడు (26) ఆ బాల సీమంతిని క్రమంగా శైశవాన్ని విడిచింది. తన చెలికత్తెల ద్వారా తనకు భవిష్యత్తులో వైధవ్యము రానున్నదని తెలుసుకున్నది (27) ఆ బాలిక చాలా నిర్వేదాన్ని పొంది చింతింపసాగింది. యాజ్ఞవల్క్యముని భార్యయైన మైత్రేయిని ఇట్లా అడిగింది. (28) ఓ తల్లి భయంతో నేను నీ పాదములను ఆశ్రయించాను. సౌభాగ్యాన్ని పెంపొందించే పనిని నాకు చెప్పండి. (29) అని ఆశ్రయించిన రాజుకూతురుతోముని పత్ని ఇట్లా అంది. ఓ తన్వంగి శివునితో కూడిన పార్వతిని శరణు వేడు (30) సోమవారమునాడు శివుని గౌరిని చక్కగా పూజించు. స్నానంచేసి ఉపవసించి, స్వచ్ఛమైన (విరజ) వస్త్రములు ధరించి (31) మాటలను అదుపులో ఉంచుకొని నిశ్చలమైన మనస్సుతో తగిన విధంగా పూజచేసి, పిదప బ్రాహ్మణులకు భోజనం పెట్టి శివుణ్ణి చక్కగా అనుగ్రహపరచుకో (32) అభిషేకంతో పాపక్షయము, పీఠపూజనం వల్ల సామ్రాజ్యము, గంధమాల్య అక్షతల అర్పణం వల్ల అఖిల సౌభాగ్యములు సౌఖ్యము 33) ధూప దానముతో సౌగంధ్యము, దీపదానమువల్ల కాంతి, నైవేద్యము వల్ల మహాభోగము తాంబూల దానమువల్ల లక్ష్మి (34) నమస్కారం వల్ల ధర్మార్థకామ మోక్షములు, జపం వల్ల అష్టఐశ్వర్యాది సిద్ధి (35) హోమంవల్ల సర్వకామసమృద్ధి కలుగుతాయి. బ్రాహ్మణ భోజనం వల్ల దేవతలందరికి ఆనందం కలుగుతుంది (36).

మూ || ఇత్థమారాధయశివం సోమవారే శివామపి | అత్యావదమపి ప్రాప్తానిస్తీర్ణాభి భవాభ##వేః || 37 ||

ఘోరాద్ఘోరం ప్రపన్నాపి మహాక్లేశం భయానకం | శివపూజా ప్రభావేణ తరిష్యసి మహాద్భయం || 38 ||

ఇత్థంసీమంతినీ సమ్యక్‌ అనుశాస్యపునః సతీ | య¸° సాపి వరారోహో రాజపుత్రీ తథా7కరోత్‌ || 39 ||

దమయ్యంత్యాంసలస్యాసీత్‌ఇంద్రసేనాభిధఃసుతః | తస్యచంద్రాంగదోనామపుత్రోభూచ్చంద్రసన్నిభః || 40 ||

చిత్రవర్మానృపశ్రేష్ఠఃతమాహూయ నృపాత్మజం | కన్యాంసీమంతినీంతసై#్మ ప్రాయచ్ఛత్‌ గుర్వనుజ్ఞయా || 41 ||

సో7భూన్మహోత్సవ స్తత్రతస్యాఉద్వాహకర్మణి | యత్ర సర్వమహీపానాంసమవాయో మహాసభూత్‌ || 42 ||

తస్యాఃప్రాణి గ్రహం కాలేకృత్వా చంద్రాగదః కృతీ | ఉవాస కతిచిన్మాసాంస్తత్రైవ శ్వశురాలయే || 43 ||

ఏకదాయమునా తర్తుం సరాజ తనయోబలీ | అరురోహతరీం కైశ్చిద్వ యసై#్యః సహలీలయా || 44 ||

తస్మిం స్తరతి కాలిందీం రాజపుత్రే విధేర్వశాత్‌ | మమజ్ఞ సహకై వర్తైః ఆవర్తాభి హతా తరీ || 45 ||

హాహెతి శబ్దః సుమహాన్‌ ఆసీత్త స్యాస్తటద్వయే | పశ్యతాం సర్వసైన్యానాం ప్రలాపోదివమస్పృశత్‌ || 46 ||

మజ్జంతో మమ్రిరేకేచిత్‌ కేచిత్‌ గ్రాహోదరంగతాః | రాజపుత్రాదయః కేచిత్‌ నా దృశ్యంత మహాజలే || 47 ||

తదుపశ్రుత్య రాజాపి చిత్ర వర్మాతి విహ్వలః | యమునాయాః తటం ప్రాప్యవిచేష్టః సమజాయత || 48 ||

శ్రుత్వాధరాజ పత్న్యశ్చ బభూవుః గతచేతనాః | సాచసీమంతినీ శ్రుత్వాప పాతభువి మూర్ఛితా || 49 ||

తధాన్యేమంత్రిముఖ్యాశ్చ నాయకాఃనపురోహితాః | విహ్వలాః శోకసంతప్తాః విలేవుః ముక్తమూర్ధజాః || 50 ||

ఇంద్రసేనోపి రాజేంద్రః పుత్రవార్తాంసు దుఃఖితః | ఆకర్ణ్య సహపత్నీభిః నష్టసంజ్ఞః వపాతహ || 51 ||

తన్మంత్రిణశ్చతత్సౌరాః తథాతద్దేశవాసినః | ఆ బాలవృద్ధ వనితాః చుక్రుశుః శోకవిహ్వలాః || 52 ||

శోకాత్కే చిదురోజఘ్నుః శిరోజఘ్నుశ్చకేచన | హారాజపుత్ర హాతాత క్వాపి క్వాసీతి బభ్రముః || 53 ||

ఏవం శోకాకులం దీనం ఇంద్రసేన మహీపతేః | నగరం సహసాక్షుబ్ధం చిత్రవర్మపురంతథా || 54 ||

తా || ఈ విధముగా సోమవారమునాడు శివుని పూజించి పార్వతిని గూడా పూజించి, గొప్ప ఆపదనైనా పొందితే దాని బాధ నుండి దాని నుండి తప్పిపోతావు (37) భయానకమైన ఘోరాతి ఘోరమైన మహాక్లేశమును పొందినా, శివపూజ ప్రభావంతో గొప్ప భయాన్ని తరించగలవు (38) ఈవిధంగా సీమంతినికి చక్కగా బోధించి తిరిగి ఆనతి వెళ్ళింది. ఆవరారోహ రాజపుత్రి అట్లాగే చేసింది (39) దమయంతి యందు నలునికి ఇంద్రసేనుడని కొడుకు పుట్టాడు. వానికి చంద్రసన్నిభుడైన చంద్రాంగదుడని పేరుగల కొడుకు పుట్టాడు (40) చిత్రవర్మరాజు ఆ రాకుమారుని పిలచి, పెద్దల అనుజ్ఞతో సీమంతిని కన్యను ఆతనికిచ్చాడు (41) ఆ వివాహ కర్మయందు అక్కడ పెద్ద ఉత్సవం జరిగింది. అక్కడ రాజులందరు గుమిగూడారు. (42) ఆమె వివాహాన్ని సకాలంలో చేసుకొని చంద్రాగదుడు కృతార్థుడైనాడు. కొన్ని మాసములు అక్కడే మామగారింట్లో ఉన్నాడు (43) బలవంతుడైన ఆ రాకుమారుడు ఒకసారి యమునా నదిని దాటడానికి, కొందరు స్నేహితులతో గూడి విలాసం కొరకు ఒక పడవ నెక్కాడు (44) అతడు కాళింది నదిని దాటుతుండగా విధివశంవల్ల సుడులతో కొట్టబడి పడవలో జాలరులతో సహ ఆ రాజపుత్రుడు మరణించాడు (45) ఆ నదీ తీరంలో హాహా కారాలు చెలరేగాయి. చూస్తున్న సైనికుల అరుపులు దేవలోకాన్ని స్పృశించాయి (46) కొందరు మునిగి వచ్చారు. కొందరు మొసళ్ళకు బలియైపోయారు. కొందరు రాజపుత్రాదులు మహాజలంతో కన్పించకుండా పోయారు (47) దానిని విని రాజు చిత్రవర్మ అతివిహ్వలుడై యమునా నది తీరానికి వచ్చి నిర్విచేష్టుడైనాడు (48) దీనిని విని రాజపత్నులు కూడా చైతన్యహీనులైనారు. దానిని సీమంతిని విని భూమిపై మూర్ఛతో పడిపోయింది (49) అట్లాగే ఇతర మంత్రిముఖ్యులు పురోహితులు నాయకులు విశ్వలులై శోక సంతప్తులై వెంట్రుకలు విరబోసికొని ఏడ్చారు (50) ఆ ఇంద్రసేన రాజు పుత్రుని వార్త విని చాలా దుఃఖితుడై విని భార్యలతో కూడి చైతన్యం కోల్పోయి పడిపోయాడు (51) ఆతని మంత్రులు ఆతని పౌరులు ఆ దేశ వాసులు, బాలులు వృద్ధులు వనితలు అంతా శోకవిహ్వలులై ఏడ్చారు (52) శోకంతో కొందరు రొమ్ములు బాదుకున్నారు. కొందరు తలలు బాదుకున్నారు. హారాజపుత్ర, హాతండ్రి ఎక్కడున్నావు, ఎక్కడున్నావు అంటూ తిరిగారు (53) ఈవిధముగా శోకాకులమై దీనమై ఇంద్రసేన మహీపతి నగరము త్వరగా క్షోభనందింది. చిత్రవర్మ నగరం కూడా అట్లాగే ఐంది (54)

మూ || అథవృద్ధైః సమాశ్వస్తః చిత్రవర్మా మహీపతిః |శ##నైర్న గరమాగత్య సాంత్వయా మాసచాత్మజాన్‌ || 55 ||

సరాజాం భసిమగ్నస్యజామాతుః తస్యబాంధవైః | ఆగతైః కారయా మాస సాకల్యా దౌర్ధ్యదైహికం || 56 ||

సాచసీమంతి నీ సాధ్వీ భర్తృలోకమతిః సతీ | పిత్రానిషిద్ధాస్నేహెన వైథవ్యం ప్రత్యపద్యత || 57 ||

మునేః వత్న్సో7పదిష్టంయత్‌ సోమవారప్రతం శుభం|సతత్యా జ శుభాచారావై ధవ్యం ప్రాప్తపత్యపి || 58 ||

ఏవంచ తుర్‌దశే వర్షే దుఃఖః ప్రాప్యసుదారుణం | ధ్యాయన్తీ శివపాదాబ్జం వత్సరత్రయమత్యగాత్‌ || 59 ||

పుత్రశోకాదివోన్మత్తమింద్రసేనం మహీపతిం | ప్రసహ్యతస్య దాయాదాః సప్తాంగం జహ్రురోజసా || 60 ||

హృతసింహాసనః శూరైః దాయాదైః సో7ప్రజోనృపః | నిగృహ్య కారాభవనే సపత్నీ కోనివేశితః || 61 ||

చంద్రాంగదో7పి తత్పుత్రో నిమగ్నో యమునాజలే | అధోధో మజ్జమానో7సౌ దదర్శోరగకామినీః || 62 ||

జలక్రీడాను సక్తాస్తా దృష్ట్వా రాజకుమారకం | విస్మితా స్తమథోనిన్యుః పాతాలం పన్నగాలయం || 63 ||

సనీయ మానస్త రసాపన్నగీభిః నృపాత్మజః | తక్షకస్య పురం రమ్యం వివేశ పరమాద్భుతం|| 64 ||

సోపశ్యదాజ తనయో మహేంద్ర భవనోపమం | మహారత్న పరిభ్రాజత్‌ మయూఖ పరిదీపితం || 65 ||

వజ్రవైడూర్య పాచాది ప్రాసాద శతసంకులం | మాణిక్య గోపుర ద్వారం ముక్తాదామభిరుజ్జ్వలం || 66 ||

చంద్రకాంత స్థలం రమ్యం హెమద్వారక పాటకం | అనేక శత సాహస్ర మణిదీప విరాజితం || 67 ||

తత్రావశ్యత్సభామధ్యే నిషణ్ణం రత్నవిష్టరే | తక్షకం పన్నగాధీశం ఫణానేక శతోజ్జ్వలం || 68 ||

దివ్యాంబరధరం దీప్తం రత్నకుండల రాజితం | నానారత్న పరిక్షిప్తముకుటద్యుతి రంజితం || 69 ||

ఫణామణి మయూఖాడ్యైః అసంఖ్యైః పన్నగోత్తమైః | ఉపాసితం ప్రాంజలిభిః చిత్రరత్న విభూషితైః || 70 ||

రూప¸°వన మాధుర్య విలాసగతిశోభినా | నాగకన్యా సహస్రేణ సమంతాత్పరి వారితం || 71 ||

దివ్యాభరణ దీప్తాంగం దివ్యచందన చర్చితం | కాలాగ్ని మివ దుర్ధర్షం దేజసాదిత్య సన్నిభం || 72 ||

తా || వృద్ధులతో ఓదార్చబడిన చిత్రవర్మరాజు మెల్లగా నగరానికి వచ్చి తనకూతురును ఓదార్చాడు (55) ఆరాజు నీళ్ళలో మునిగిన అల్లునకు ఆతని బంధువులతో, అక్కడికి వచ్చిన వారితో ఔర్ధ్వదైహిక క్రియలు పూర్తిగా చేయించాడు. (56) ఆ సీమంతిని సాధ్వి భర్తనేమతిలో కలది ఆ సతి తండ్రివద్దన్నా స్నేహంగా వైధవ్యాన్ని పొందింది (57) మునిపత్ని ఉపదేశించిన శుభ##మైన సోమవార వ్రతాన్ని ఆశుభాచార విడిచి పెట్టలేదు, వైధవ్యాన్ని పొందినప్పటికీ (58) ఈ విధంగా పదునాల్గవ ఏట చాలా దారుణమైన దుఃఖాన్ని పొంది శివుని పాదాలను ధ్యానిస్తూ మూడు సంవత్సరాలు గడిపింది. (59) పుత్రశోకంతో ఉన్మత్తుడైన ఇంద్రసేన మహీపతిని ఎదిరించి అతని పాలివారు పరాక్రమంత రాజ్యాన్ని ఆక్రమించారు. (60) శూరులైన పాలివారితో రాజ్యాన్ని కోల్పోయి సంతానం లేని ఆ రాజు బంధింపబడి భార్యతో గూడి కారాగారంలో ఉంచబడ్డాడు. (61) చంద్రాంగదుడు కూడా, ఆతని పుత్రుడు యమునా జలంలో మునిగాడు. క్రింది క్రిందికి మునుగుతూ ఈతడు, ఉరగ స్త్రీలను చూచాడు (62) జలక్రీడలందు సక్తులైన వారు రాజకుమారుని చూచి ఆశ్చర్యపడి ఆతనిని పన్నగాలయమైన పాతాళమునకు, క్రిందికి తీసుకెళ్ళారు (63) వేగంగా తీసుకుపోబడుతూ ఆ సర్పస్త్రీలతో ఆ రాకుమారుడు, పరమాద్భుతమైన రమ్యమైన తక్షకునిపురంలో ప్రవేశించాడు (64) ఆరాజు తనయుడు మహెంద్ర భవనంతో సమానమైన దానిని చూచాడు. మహారత్నములతో వెలిగేది, వెలుగులతో వెలిగిపోతున్నది (65) వజ్ర వైడూర్య ఇంద్రనీలాది మణులమేడలతో నూరులతో నిండినది.మాణిక్యములతో చేసిన గోపుర ద్వారములు కలది, ముత్యాల తోరణాలతో ఉజ్జ్వలమైంది (66) చంద్రకాంతస్థలముతో రమ్యమైన దానిని, బంగారు ద్వారములు తలుపులు కలది, అనేకములైన నూర్లవేల మణిదీపములతో వెలిగేది (67) ఆ భవనం ఆ సభాభవనం మధ్యలో రత్న సింహాసన మందు కూర్చున్న తనిని చూచాడు. పన్నగముల కధీశుడు అనేక నూర్ల పడగలతో వెలిగిపోతున్న తక్షకుని (68) దివ్యాం బరధరుని , వెలిగిపోతున్న వాణ్ణి, రత్నకుండలములతో ప్రకాశిస్తున్న వాణ్ణి, రకరకాల రత్నాలు కలిగిన కిరీటము కాంతితో వెలిగేవాణ్ణి (69) ఫణులలోని మణులతో వాని కాంతితో కూడిన లెక్కలేనంద మంది పన్నగోత్తముల కలవానిని చేతులు జోడించి ఉన్నవారు కలవానిని, చిత్రరత్నములతో అలంకరింపబడినవానిని (70) రూపము ¸°వనము మాధుర్యము విలాసమైన గతులతో శోభించే, వేలమంది నాగకన్యలత చుట్టూ చుట్టబడిఉన్నవానిని (71) దివ్య ఆభరణములు వెలిగే అవయవములు, కలవానిని దివ్య చందనముతో పూయబడిన వానిని కాలాగ్నివలె భరింపరాని తేజస్సుతో ఆదిత్యుని వలె వెలుగొందేవానిని (72) చూచాడు.

మూ || దృష్ట్వారాజసుతో ధీరః ప్రణిపత్య సభాస్థలే | ఉత్థితః ప్రాంజలిప్తస్య తేజసాక్షిప్తలోచనః || 73 ||

నాగరాజో7పితం దృష్ట్వా రాజపుత్రం మనోరమం | కోయం కస్మాదిహాయాత ఇతి వప్రచ్ఛపన్నగీః || 74 ||

తా ఊచుర్యమునాతోయే దృష్టో7స్మాభిర్యదృచ్ఛయా | అజ్ఞాతకులనామాయమానీత స్తపసన్నిధిం || 75 ||

అథవృష్టో రాజపుత్రః తక్షకేణమహాత్మనా | కస్మాపి తనయః కస్త్వం కోదేశః కథమాగతః || 76 ||

రాజపుత్రో వచః శ్రుత్వా తక్షకం వాక్యమ బ్రవీత్‌ | || 77 ||

రాజపుత్రఉవాచ -

అస్మిన్‌భూమండలేకశ్చిద్దేశో నిషధ సంజ్ఞకః | తస్యాధివో7భవద్రాజా నలోనా మమహాయశాః

స పుణ్యకీర్తిః క్షితిపోదమయంతీ పతిః శుభః || 78 ||

తస్మాద పీంద్రసేనాఖ్యః తస్యపుత్రో మహాబలః | చంద్రాంగదోస్మినా మ్నాహంస వోఢః శ్వశురాలయే

విహరన్‌ మయునాతోయే నిమగ్నోదైవచోదితః || 79 ||

ఏతాభిః పన్నగస్త్రీభిః ఆనీతోస్మి తవాంతికం | దృష్ట్వాహం తవ పాదాబ్జం పుణ్యౖః జన్మాంతరార్జితైః || 80 ||

అద్యధన్యో7స్మిధన్యో7స్మికృతార్థౌపితరౌమమ | యత్ర్పేక్షితో7హంకారుణ్యాత్‌త్వయాసంభాషితోపిచ || 81 ||

సూత ఉవాచ -

ఇత్యుదార మనం భ్రాంతం వచః శ్రుత్వాతిపేశలం | తక్షకః పునరౌత్సుక్యాత్‌ బభాషే రాజనందనం || 82 ||

తక్షక ఉవాచ -

భోభో నరేంద్ర దాయాద మాబైషీః ధీరతాంవ్రజ | సర్వదేవేషు కోదేవో యుష్మాభిః పూజ్యతే సదా || 83 ||

రాజపుత్ర ఉవాచ -

యోదేవః సర్వదేవేషు మహాదేవ ఇతిస్మృతః | పూజ్యతేసహి విశ్వాత్మా శివోస్మాభిరుమాపతిః || 84 ||

యస్యతేజోంశ##లేశేన రజసాచ ప్రజాపతిః | కృతరోపో7నృజ ద్విశ్వంసనః పూజ్యోమహెశ్వరః || 85 ||

యస్యాంశాత్సాత్వికం దివ్యంబలి భ్రద్విష్ఠుః సనాతనః | విశ్వంభి భర్తి భూతాత్మాశివో7స్మాభిః సపూజ్యతే || 86 ||

యస్యాంశాత్తామసాజ్ఞాతో రుద్రః కాలాగ్ని సన్నిభః | విశ్వమేతత్‌ హంత్యతే సపూజ్యో7స్మాభిరీశ్వరః || 87 ||

యోవిధాతా విధాతుశ్చ కారణ స్యాపి కారణం || 87 1 /2 ||

తేజసాంపరమంతేజః సశివోనః పరాగతిః || 88 ||

యోంతికస్థో7పిదూరస్థః పాపోవహతచేతసాం | ఆపరిచ్ఛేద్య ధామాసౌశివోనః పరమగాతిః || 89 ||

యో7గ్నౌతిష్ఠతియో భూమౌయో వా¸°నలిలేచయః | యాకాశేచ విశ్వాత్మా నపూజ్యోనః సదాశివః || 90 ||

యః సాక్షీసర్వభూతానాం యాత్మస్థోనిరంజనః | యస్యేచ్ఛా వశగోలోకః సోస్మాభిః పూజ్యతే శివః || 91 ||

తా || చూచి రాకుమారుడు ధీరడు సభాస్థలమందు నమస్కరించి లేచి చేతులు జోడించి ఆతని తేజస్సుతో కళ్ళు మూసుకుపోగా (73) నాగరాజు కూడా ఆ రాజపుత్రుని చూచి, ఈతడెవరు, ఇక్కడికెందుకొచ్చాడు అని ఆ నాగకన్యలను అడిగాడు. (74) వారిట్లా చెప్పారు. మేము ఈతనిని యమునా నది నీళ్ళలో అనుకోకుండా చూచాము. ఈతని కులము, పేరు మాకు తెలియదు. మీదరికి తెచ్చాము (75) అప్పుడు మహాత్ముడైన తక్షకుడు రాజపుత్రునడిగాడు, ఎవరి కుమారునివి, నీవెవరు, నీదేశ##మేది, ఎట్లా ఇక్కడికి వచ్చావు (76) అనగా రాజపుత్రుడు ఈ మాటలను విని తక్షకునితో ఇట్లన్నాడు (77) రాజపుత్రుని వచనము - భూమండలమందు నిషధ అని ఒకదేశము ఉంది. దానికి నలుడను పేరుగల కీర్తి గల అధిపుడు రాజైనాడు. ఆ రాజు పుణ్యకీర్తి దమయంతికి భర్త శుభుడు (78) ఆతనికి ఇంద్రసేనుడు అనుపేరు గల పుత్రుడు, మహాబలుడు ఆతని పుత్రుణ్ణి నాపేరు. చంద్రాంగదుడు. కొత్తగా పెళ్ళైశ్వశురాలయమందు ఉన్నాను. యమునాతో యమందు తిరుగుతూ దైవ ప్రేరణ వల్ల (79) ఈ నాగకన్యలతో మీదగ్గరకు తీసుకురాబడ్డాను. జన్మాంతరములలో సంపాదించిన పుణ్యముల వల్ల మీ పాదములను నేను చూచి (80) ధన్యుణ్ణౖనాను. నాతలిదండ్రుల కృతార్థులైనారు. మీరు దయతో నన్ను చూచారు.నాతో మాట్లాడారు (81) అని సూతులిట్లన్నారు - ఉదారమైన తడబాటులేని మృదువైన మాటలను విని తక్షకుడు తిరిగి ఔత్సుక్యంతో రాకుమారునితో ఇట్లా మాట్లాడాడు (82) తక్షకుని వచనము - ఓ నరేంద్రుని వారసుడ భయపడకు దైర్యాన్ని వహించు. మీరు దేవులందరిలో ఏదేవుని ఎల్లప్పుడు పూజిస్తారు. (83) రాజ పుత్రుని వచనము - ఏదేవుడు అందరు దేవులలో మహాదేవుడని పిలువబడు తున్నాడో ఆ విశ్వాత్మునే శివునే ఉమాపతినే మేము పూజిస్తాము (84) ఆతని తేజస్సు అంశ##లేశంతో ధూళితో ప్రజాపతి రూపం కల్పించి విశ్వాన్ని సృజించాడు ఆమహెశ్వరుడే మాకు పూజ్యుడు (85) ఆతని అంశతో దివ్యమైన సాత్వికతను పొంది సనాతనమైన విష్ణువున్నాడు. ఆతడు ఈ విశ్వాన్ని భరిస్తున్నాడు. భూతాత్ముడైన శివుని మేము పూజిస్తాము (86) ఎవని అంశతో తమస్సుతో కాలాగ్ని సన్నిభుడైన రుద్రుడు పుట్టాడు. అంతమందు ఈ విశ్వాన్ని ఆతడు హరిస్తాడు. ఆతడు ఈశ్వరుడు మాకు పూజ్యుడు (87) ఎవడు విధాతకు విధాతో, కారణమునకు కారణమో, తేజస్సులకు తేజస్సో, ఆ శివుడే మాకు ఉత్తమగతి. (88) ఎవడు దగ్గరుండి దూరమైనవాడో, పాపాత్ములకు, నశింపని స్థానము కలవాడెవడో ఆ శివుడు మాకు పరమగతి (89) అగ్నియందు, భూమియందు, వాయుజలములందు, ఆకాశమందు ఎవడు ఉన్నాడో, ఎవడు విశ్వాత్ముడో, ఆ సదాశివుడు మాకు పూజ్యుడు (90) సర్వభూతములకు ఎవడు సాక్షో, ఎవడు ఆత్మస్థుడో నిరంజనుడో, లోకము ఎవని ఇచ్ఛాధీనమో ఆ శివుని మేము పూజిస్తాము (91)

మూ || యమేకమాద్యం పురుషం పురాణః వదంతి భిన్నం గుణవైకృతేన

క్షేత్రజ్ఞ మేకేథ తురీయమన్యే కూటస్థమన్యే నశివోగతిర్నః || 92 ||

యం నా స్పృశం శ్చైత్యమచింత్య తత్వం దురంత బుూమా సమతత్స్వరూపం

మనోవచోవృత్తయ ఆత్మభాజాం న ఏష పూజ్యః పరమః శివోనః || 93 ||

యస్యప్రసాదం పర్తిలభ్య సంతోవాంఛంతి నైంద్రం వదముజ్జ్వలంవా |

నిస్తీర్ణ కర్మార్గల కాలచక్రాశ్చరంత్యభీతాః నశివోగతిర్నః || 94 ||

యస్యస్వరూప మఖిలం శ్రుతిభిర్వి మృగ్యం తసై#్మ శివాయ సతతం కర వామ పూజాం || 95 ||

యస్మూర్థ్ని లబ్ధ నిలయా సురలోక సింధుః యస్యాం గగా భగవతీ జగదంబికాచ |

యత్కుండలే త్వహహ తక్షక వాసుకీ ద్వౌసో7స్మాకమేవ గతిరర్థ శశాంకమౌలిః || 96 ||

జయతి నిగమ చూడాగరేషు యస్యాంఘ్రి పద్మం జయతిచ హృది నిత్యం యోగినాం యస్యమూర్తిః

జయతి సకల తత్వోద్భాసనం యస్యమూర్తిః సవిజిత గుణ సర్గః పూజ్యతే7స్మాభిరీశ || 97 ||

సూత ఉవాచ -

ఇత్యాకర్ణ్య వచస్త స్య తక్షకః ప్రీత మాననః | జాతభక్తిః మహాదేవే రాజపుత్ర మభాషత || 98 ||

తక్షక ఉవాచ -

పరితుష్టో7స్మి భద్రం స్తాత్త వ రాజేంద్ర నందన | బాలోపి యత్పరం తత్వం వేత్సిశైవం పరాత్పరం || 99 ||

ఏషరత్న మయోలోక ఏతాశ్చా రుదృశో7బలాః | ఏతే కల్పద్రుమాన్సర్వే వాప్నోమృతరసాంభవః || 100 ||

నాత్రమృత్యుభయం ఘోరం న జరారోగ పీడనం | యధేష్టం విహరాత్రైవ భుంక్ష్వ భోగాన్‌యధోచితాన్‌ || 101 ||

ఇత్యుక్తో నాగరాజేన నరాజేంద్ర కుమారకః | ప్రత్యువాచ పరం ప్రీత్యా కృతాంజలి రుదారధీః || 102 ||

కృతదారో7స్మ్యహం కాలే సువ్రతా గృహిణీ మమ | శివపూజా పరానిత్యం పితరావేక పుత్రకౌ || 103 ||

తేత్వద్యమాంమృతంమత్వాశోకేసమహతావృతాఃప్రాయఃప్రాణౖర్వియుజ్యంతేదైవాత్ర్పాణాన్‌వహింతివా || 104 ||

అతో మయా బహుతిధం నాత్రస్థేయం కథంచన | తమేవలోకం కృపయా మాం ప్రాపయితుమర్హసి || 105 ||

ఇత్యుక్తవంతం నరదేవపుత్రం దివ్యైః పరాన్నైః సురపాదపోత్థైః |

ఆప్యాయయిత్వా పరగంధవాసః న్రగ్రత్నదివ్యాభరణౖర్విచిcతైః || 106 ||

సంతోషయిత్వా వివిధైశ్చ భోగైః పునర్బ భాషే భుజగాధి రాజః |

యదా యదా త్వం స్మరసి త్వదగ్రేతదా తదా,విష్ర్కి యతే మయేతి || 107

తా || ఒక్కడు, ఆద్యుడు ఐన పురాణ పురుషుని గుణముల వికృతితో భిన్నభిన్నమని చెబుతారో, కొందరు క్షేత్ర జ్ఞుడని కొందరు చతుర్థుడని, కొందరు కూటస్థుడని ఎవరి నంటారో ఆ శివుడు మాకుగతి (92) ఏ ఆలయాన్ని ముట్టు కోలేరో, ఎవడు అచింత్యతత్వం కలవాడో, ఎవని స్థానము అంతములేనిదో, ఆస్వరూపమును నమస్కరించు. ఆత్మభాజులకు మనోవాక్కుల వృత్తి ఎక్కడో ఆ పరమశివుడు మాకు పూజ్యుడు (93) ఆతని ప్రసాదమును పొంది సజ్జనులు ఉజ్జ్వలమైన ఇంద్ర పదవిని కూడా కోరటంలేదు కర్మఅనే బేడి కాలచక్రములు దాటి, భయం లేకుండా ఎవని దయవల్ల తిరుగుతారో ఆ శివుడే మాకు గతి (94) పాప రోగములకు ఆయన స్మృతి విఘాతము, పుల్కస జన్మ పొందిన వారికి విఘాతం కల్గించేది వాని స్మృతి. ఆతని స్వరూపమును పూర్తిగా శ్రుతులు చెప్పలేవు. అట్టి శివునకు మేము ఎల్లప్పుడు పూజచేస్తాము. (95) ఆతని తలపై ఆకాశ గంగ స్థానం పొందింది. ఆతని శరీరంలో స్థానం పొందినది భగవతి జగదంబిక. ఆతనికి తక్షక వాసుకిలు కుండలములు. అట్టి అర్థ శశాంకమౌలి మాకుగతి (96) వేద శిఖరాగ్రములందు ఎవని పాదపద్మములున్నాయో యోగుల హృదయమందు ఎవని మూర్తి ఎప్పుడూ ఉందో, ఎవని రూపం సకల తత్వములను భావింప చేస్తుందో, అట్టి గుణ సర్గమును జయించిన ఈశుని మేము పూజిస్తున్నాము (97) సూతులిట్లన్నారు. ఆతని మాటలను తక్షకుడు విని ప్రీతి మానసుడై మహాదేవుని యందు భక్తి గల్గినవాడై రాజపుత్రునితో ఇట్లన్నాడు (98) తక్షకుని వచనము - నేను సంతసించాను. ఓ రాజేంద్ర నందన! నీకు మేలు కలుగని. బాలుడవైనా పరతత్వమైన, పరాత్పరుడైన శివుని తెలుసుకున్నావు (99) ఇది రత్నమయలోకం వీరు అందమైన చూపులు గల అబలలు వీరంతా కల్పద్రుమాలు, బావులు అమృతరసం నీరుగా గలవి. (100) ఇక్కడ ఘోరమైన మృత్యుభయము, జరారోగపీడలేవు యధేష్టంగా తిరుగు. యధోచితమైన భోగములను అనుభవించు (101) అని నాగరాజు చెప్పగా ఆ రాకుమారుడు, చేతులు జోడించి, ఉదారమైన బుద్ధికలవాడై చాలా ప్రీతితో ఇట్లా పలికాడు (102) నేను సకాలంలో వివాహం చేసుకున్నవాణ్ణి. నా భార్య సువ్రత. రోజు శివపూజ చేస్తుంది. ఆమె తలిదండ్రులకు ఒక్కతే కూతురు (103) వారు నేనీవేళ చనిపోయానని తలచి చాలా దుఃఖిస్తున్నారు. ఒకవేళ ప్రాణాలు విడిచారో కాక అదృష్టవశాత్తు ప్రాణాలతో ఉన్నారో (104) అందువల్ల చాలా రోజులు నేనిక్కడ ఉండరాదు. దయతో నన్ను ఆలోకానికి పంపించండి. (105) అని పలికే నరదేవపుత్రుని సురపాద పం నుండి వచ్చిన, దివ్యమైన శ్రేష్టమైన అన్నములతో, శ్రేష్ఠమైన గంధ వస్త్రములను మాలలు, రత్నములు విచిత్రమైన దివ్యాభరణములు ఇవ్వటం ద్వారాను సంతోషపరచి (106) వివిధ భోగములతో ఆనందపరచి భుజగముల అధిరాజు తిరిగి ఇట్లన్నాడు. ఎప్పుడెప్పుడు నీవు స్మరిస్తావో అప్పుడప్పుడు నేను నీ ఎదుట కనిపిస్తాను (107).

మూ || పునశ్చరాజ పుత్రాయ తక్షకోశ్వం చకామగం | నానా ద్వీప సముద్రేషు లోకేషు చ సరర్గలం || 108 ||

దత్తవాన్‌ రత్నాభరణ దివ్యాభరణ వానసాం | వాహనాయదదావేకం రాక్ష సంపన్నగేశ్వరః || 109 ||

తత్సహాయార్థమే కంచ పన్నగేంద్ర కుమారకం | నియుజ్జ్యతక్షకః ప్రీత్యాగచ్చేతి విననర్జతం || 110 ||

ఇతిచంద్రాం గదఃసో7థ సంగృహ్యవివిధఃధనం | అశ్వంకామగమారుహ్యతాభ్యాంసహవినిర్య¸° || 111 ||

సముహూర్తాదివోన్మ జ్యత స్మాదేవ సరిజ్జలాత్‌ | విజహారతటే రమ్యే దివ్యమారుహ్య వాజనం || 112 ||

అథాస్మిన్‌ సమయేతన్వీసాచసీమంతినీనతి | స్నాతుం సమాయ¸° తత్ర సఖీభీః పరివారితా || 113 ||

సాదదర్శన దీతీరే విహరంతం నృపాత్మజం | రక్షసానర రూపేణ నాగపుత్రేణ చాన్వితం || 114 ||

దివ్యరత్న సమాకీర్ణం దివ్యమాల్యావతం నకం | దేహెన దివ్య గంధేన వ్యాక్షిప్త దశయోజనం || 115 ||

తమపూర్వాకృతిం వీక్ష్యది వ్యాశ్వమధి సంస్థితం | జడోన్మత్తే వభేతేవ తస్థౌతన్న్యస్తలోచనా || 116 ||

తాంచ రాజేంద్ర పుత్రో7సౌ దృష్టపూర్వామితి స్మరన్‌ | నిర్ముక్త కంఠాభరణాం కంటసూత్ర వివర్జితాం || 117 ||

అసంయోజిత ధమ్మిల్లా మంగరాగ వివర్జితాం | త్యక్తనీలాం జనా పాంగీం కృశాంగీం శోక దూషితాం || 118 ||

దృష్ట్వా పతీర్యతురగాదు పవిష్టః సరిత్తటే | తామాహూయ వరారోహాం ఉపవేశ్యే దమ బ్రవీత్‌ || 119 ||

కాత్వంకస్య కలత్రం వాకస్యాసి తనయాసతీ | కిమిందంతే గనేబాల్యేదుః సహంశోక లక్షణం || 120 ||

ఇతిస్నేహెన సంవృష్టా సావధూరశ్రులోచనా | లజ్జితా స్వయమాఖ్యాతుం తత్సఖీ సర్వమబ్రవీత్‌ || 121 ||

ఇయంసీమంతి నీనామ్నాన్నుషా నిషధ భూపతేః | చంద్రాంగదస్య మహిషీ తనయాచిత్ర వర్మణః || 122 ||

అస్యాః పతిః దైవయోగాత్‌ నిమగ్నో7స్మిన్మహాజలే | తేనే యంప్రాప్తవైధవ్యా బాలాదుఃఖేన శోషితా || 123 ||

ఏవం వర్షత్రయం నీతం శోకేనాతి బలీయసా | అద్యేందు వారేనం ప్రాప్తే స్నాతు మత్ర సమాగతాః || 124 ||

తా || తిరిగి తక్షకుడు రాజపుత్రునకు స్వేచ్ఛగా వెళ్ళగలిగే గుఱ్ఱాన్ని నా నాద్వీప సముద్రములందు లోకములందు ఎదురులేని దానిని ఇచ్చాడు (108) రత్నాభరణములు, దివ్యాభరణములు, వస్త్రములు ఇచ్చాడు వాహనము కొరకు ఒక రాక్షసుని ఆ పన్నగేశ్వరుడు ఇచ్చాడు (109) అతనికి సహాయం కొరకు ఒక పన్నగేంద్ర కుమారకుని ఏర్పరచి, తక్షకుడు సంతోషంతో వెళ్ళుము, అని అతనిని విడిచి పెట్టాడు (110) అని చంద్రాగదుడు రకరకాలైన ధనమును పదిల పరచుకొని, కామగమనం గలగుఱ్ఱాన్నెక్కి వారితో కలిసి బయలు దేరాడు (111) క్షణకాలంలో ఆ సరిత్‌ జలము నుండి పైకి వచ్చి దివ్యమైన గుఱ్ఱాన్ని ఎక్కి రమ్యమైన ఆసరిత్‌ తటమందు విహరించాడు (112) ఆ సమయమందు ఆ స్త్రీపతి, సీమంతిని, చెలికత్తెలతో కూడి అక్కడికి స్నానం చేయటానికి వచ్చింది (113) ఆమె నదీ తీరంలో విహరించే రాకుమారుని చూచింది. ఆతని వెంట నరరూపుడైన రాక్షసుడు, నాగపుత్రుడు ఉన్నాడు (114) దివ్యరత్నములతో కూడినవాడు, దివ్యమాలలు శిరస్సు యందు గలవాడు. శరీరమందలి దివ్యమైన వాసన పదియోజనముల వరకు వ్యాసిస్తోంది. (115) ఆ అపూర్వాకృతిని చూచి, దివ్యమైన గుఱ్ఱముపై కూర్చున్న వానిని చూచి, జడమైనదై, పిచ్చిదానివలె భయపడ్డదానివలె, ఆతనినే చూస్తూ నిలిచిపోయింది (116) ఆమెను ఆ రాజేంద్రపుత్రుడు ఎక్కడో చూచానని స్మరిస్తూ ఉన్నాడు. ఆమెకు మెడలో ఆభరణములేదు. కంఠసూత్రములేదు (పుస్తె) (117) వెంట్రుకలు ముడివేసుకోలేదు. శరీరమునకు ఏసువాసన పూతలు లేవు. కళ్ళకు కాటుక లేదు. శరీరమంతా కృశించి ఉంది శోకంతో దూషితమైంది (118) ఆమెను చూచి గుఱ్ఱముపై నుండి దిగినది తీరమందు కూర్చున్నాడు. ఆవరారోహను పిలిచి కూర్చోబెట్టి ఇట్లా అన్నాడు (119) నీవెవరు, ఎవని భార్యవు, ఎవరి కూతురవు ఓనతి! ఓ అంగన! బాల్యంలోనే దుఃసహమైన ఈశోకలక్షణమేమిటి (120) అని స్నేహంతో ఆతడడుగగా ఆమె ఏడుస్తూ, స్వయంగా చెప్పటానికి సిగ్గుపడింది. ఆమె చెలికత్తె అంతా చెప్పింది (121) ఈమ సీమంతిని అని పేరుగలది. నిషధ భూపతికి కోడలు. చంద్రాంగదుని భార్య. చిత్రవర్మకూతురు (122) ఈమె భర్త దురదృష్టవశాత్తు ఈ మహాజలమందు మునిగిపోయాడు. అందువల్ల ఈమ వైధవ్యాన్ని పొంది బాల దుఃఖంతో చిక్కిపోయింది (123) ఇట్లా మూడు సవవత్సరాలు గడిచాయి. అతిబలీయమైన శోకంతో గడిచాయి. ఇవ్వాళ సోమవారం నాడు స్నానం చేయటానికి ఇక్కడికి వచ్చింది (124).

మూ || శ్వశురో7స్యాశ్చ రాజేంద్రోహృతరాజ్యశ్చశత్రుభిః | బలాద్గృహీతోబద్దశ్చ సభార్యః తద్వశేస్థితః ||125||

తథాప్యేషా శుభాచారా సోమవారే మహేశ్వరం | సాంబికం పరయా భక్త్యా పూజయత్యమలాశయా ||126||

సూత ఉవాచ -

ఇత్థం సఖీముఖేనైన సర్వమావేద్యసుప్రతా | తతః సీమంతి నీ ప్రాహస్వయమేవ నృపాత్మజం ||127||

కస్త్వం కందర్ప వంకాశః కావిమౌతవ పార్శ్వగౌ | దేవో నరేంద్రః సిద్దోవా గంధర్వోవా7 థ కిన్నర ః ||128||

కిమర్థంనుమతవృత్తాంతం స్నేహవానిన వృచ్ఛసి | కింమాంవేత్సిమహాబాహో దృష్టవాన్‌ కిముకుత్రచిత్‌ ||129||

దృష్ట పూర్వ ఇవాభాసి మయాచ స్వజనోయధా | సర్వం కథయతత్వేన సత్య సారాహి సాధవః ||130||

సూత ఉవాచ -

ఏతావదుక్త్వా సరదేవ పుత్రినభాష్ప కంఠం నుచిరంరురోద |

మొమోహ భూమౌ పతితా సభీభిః వృతానకించిత్కథితుం శశాక ||131||

శ్రుత్వాచంద్రాగదః సర్వంప్రియాయాః శోకకారణం | మూహూర్తమభవత్తూష్టీం స్వయం శోకసమాకులః ||132||

అథాశ్వాస్యప్రియాంతన్వీం వివిధై ః వాక్యనైపుణౖః | సిద్దానామవ యందేవాకామగా ఇతసో 7బ్రవీత్‌ ||133||

తతో బలాదివాకృష్య పాణిగ్రహణ శంకితాం | పులకాంచిత సర్వాంగీం తాంకర్ణేత్విదమ బ్రవీత్‌ ||134||

క్యాపిలోకే మయాదృష్ట ః తవ భర్తావరాననే | త్వద్ర్వ తాచరణాత్‌ ప్రీతః సద్యేవాగమిష్యతి || 135

అవనేష్యతి తేశోకం ద్విత్రేరేవదినైర్‌ ద్రువం | ఏతచ్ఛం సితుమాయాత స్తవభర్తు ః సఖా 7స్మ్యహం ||136||

అత్రకార్యవోనసందేహః శపామిశివపాదయో ః | తావత్‌ త్వద్ధృదయే స్థేయం న ప్రకాశ్యంత కుత్రచిత్‌ ||137||

సాతుతద్వచనం శ్రుత్వా సుధాధారా శతాధికం | సంభ్రమోద్భ్రాంతనయనాతమోవ ముహూరైక్షత ||138||

ప్రేమ బంధాను గుణితం వాక్యంచాహరసాయనం | విభ్రమోదార సహితం మధురాపాంగవీక్షణం ||139||

స్వపాణి స్పర్శనోద్భిన్న పులకాంచిత విగ్రహం | పూర్వ దృష్టాని చాంగేషు లక్షణాని స్వరాదిషు

వయః ప్రమాణ వర్ణంచ సరీక్ష్యై సమతర్కయత్‌ ||140||

ఏషఏవ పతిర్మే స్యాత్‌ ధ్రువం నాన్యో భవిష్యతి | అస్మిన్నేవ ప్రవక్తం మే హృదయం ప్రేమ కాతరం ||141||

తా || ఈమె మామగారు రాజేంద్రుడు అతని రాజ్యాన్ని శత్రువులు హరించారు. బలవంతంగా గ్రహించారు. అతనిని బంధించారు. భార్యతోపాటు వారి అధీనంలో ఉన్నాడు (125) ఐనా ఈ శుభాచార ! సోమవారం నాడు మహేశ్వరుని, పార్వతితో కూడిన వానిని నిర్మలమైన ఆశయం కలదై మిక్కిలి భక్తితో పూజిస్తోంది (126) సూతుడిట్లన్నాడు - ఈ విధముగా సఖుల ద్వారానే అంతా తెలియజేసి, అసువ్రత ! సీమంతిని పిదవ స్వయంగా రాకుమారునితో ఇట్లా అంది(127) నీవెవరు. మన్మధుని లాగున్నావు. నీ పక్కనున్న వీరెవరు. నీవు దేవుడివా, నరేంద్రుడివా సిద్దుడివా గంధర్వుడివా కాక కిన్నరుడివా(128) స్నేహం కలవానివలె నా వృత్తాంతాన్ని ఎందుకుడుగుతున్నావు. ఓ మహాభాహు! నన్నెరుగుదువా నీవు. ఎక్కడైనా నన్ను చూచావా(129) నీవు కూడా స్వజనంవలె ఉన్నావు. ఇంతకు ముందు నిన్ను చూచినట్లు అన్పిస్తోంది నాకు. నిజంగా అంతా చెప్పండి సాధువులు సత్యమే సారంగా గలవారు(130) సూతులిట్లన్నారు - ఈ మాత్రం పలికి రాకుమారి! కన్నీరు కంఠంలో నిండగాచాలాసేపు ఏడ్చింది. మోహాన్ని పొందింది. భూమిపై పడింది. సఖులు చుట్టుముట్టి ఉన్నారు. ఏమీ చెప్పలేకుండా ఉంది (131) చంద్రాంగాదుడిదంతా విని ప్రియురాలి శోకకారణాన్ని తెలుసుకొని స్వయంగా శోక సమకులుడై క్షణకాలం ఊరికే ఉండిపోయాడు. (132) ఆ పిదవ, రకరకాలైన నిపుణమైన వాక్యములతో తన ప్రియమైన స్త్రీని ఓదార్చి, మేము సిద్ధులనే దేవులము, కామ గులము అని అతడన్నాడు (133) పిదవ బలంతోఆకర్షింపబడి పాణి గ్రహణం ఐనట్టుగా ఆమెను అనుమానించి, పులకలతో సర్వావయవములు కలది ఐన ఆమె చెవిలో అతడిట్లన్నాడు. (134) ఓ వరానన! నీ భర్తలోకంలో నాకెక్కడైనా కన్పిస్తే, నీవ్రతాచరణంతో ప్రీతుడైతే వెంటనే నీదరికి వస్తాడు (135)నీ శోకాన్ని తీరుస్తాడు. రెండు మూడు రోజులలో తప్పదు. ఇది చెప్పటానికే వచ్చాను. నీ భర్తకు స్నేహితుణ్ణి నేను (136)ఇందులో అనుమానం లేదు. శివపాదముల మీద ఓట్టు. అప్పటిదాకా నీ హృదయంలోనే దాచుకో. ఎక్కడా బయటపెట్ట రాదు. (137) ఆమె అతనిని మాటను విన్నది. నూర్ల అమృధారలకన్న ఎక్కువైనది. ఆశ్యర్చంతో కన్నులు చలింపగా అతన్నే మాటిమాటికి చూసింది (138) ప్రేమబంధముతో కూడిన మధుర రసం కలవాక్యమును ఇట్లా అంది. విభ్రమ ఉదారములతో కూడి, మధురమైన అసాంగవీక్షణములు కలిగి (139) తన పాణిస్పర్శతో శరీరమంతా పులకాంకురములు గల వానిని సర్వాదులలో, అందములలో అది వరలో చూచిన లక్షణములు కలవానిని, వయస్సు, రంగు పరీక్షించి అతనిని ఇట్లా అనుకుంది (140)ఈతడే నా భర్త ఐయ్యుండవచ్చు. నిశ్చయము. వేరేవాడుకాదు. ఈతనియందే నామనస్సు లగ్నమైంది. ప్రేమతో చంచలమైంది (141).

మూ || వరలోకాదిహాయాతః కథమేవంస్వరూపథృక్‌ | ధుర్వాగ్యాయాః కథం మే స్యాద్భర్తుర్నష్టస్యదర్శనః ||142||

స్వప్నోయంకిమునస్వప్నో భ్రమో7యంకింతుసభ్రమ ః | ఏషధూర్తో 7థవాకశ్చిత్‌యక్షోగంధర్వఏవనా ||143||

మునిపత్య్నాయ దుక్తంమే పరమాపద్గతాపిచ| ప్రతమేతత్‌ కురుష్వేతి తన్యవా ఫలమేవవా ||144||

యోవర్షాయుత సౌభాగ్యం మమేత్యాహద్విజోత్తమః | నూనంతస్యవచః సత్యం కోవిద్యదీశ్యరం వినా ||145||

నిమిత్తాని చదృశ్యంతే మంగలాని దినేదినే | ప్రసన్నే పార్వతీనాథేకిమ సాధ్యం శరీరిణాం ||146||

ఇత్థం విమృశ్యబహుధాతాం పునర్ముక్త వంశయాం | లబ్జా సమ్రముఖీం కర్ణే శశం సాత్మ ప్రయోజనం ||147||

ఇమం వృత్తాం తమాఖ్యాతుం తత్పిత్రోఃశోకతప్తయోః | గచ్ఛామఃస్వస్తితే భ##ద్రేసద్యః పతిమ వాస్య్ససి ||148||

ఇత్యక్త్యాశ్వం సమారుహ్య జగామనృపనందనః | తాభ్యాం సహానిజం రాష్ట్రం ప్రత్యపద్యతత్‌క్షణాత్‌ ||149||

నపురోపవానాభ్యాశే స్థిత్వాతం ఫలిపుత్రకం | వినసర్జాత్మ దాయాదాన్‌ నృపాసనగతాస్ర్పతి ||150||

సగత్వో వాచతాన్‌శీఘ్రమింద్రసేనోవిముచ్యతాం | చంద్రాగతస్తస్యసుతః ప్రాప్తో 7యంపన్నగాలయాత్‌ || 151 ||

నృపాసనం విముంచంతు భవంతోన విచార్యతాం | నోచేచ్చం ద్రాగదాస్యాశు బాణాః ప్రాణాన్‌హరంతివః || 152 ||

సమగ్నోయమునాతోయే గత్యాతక్షకమందిరం | లబ్ధ్యాచతన్యసాహాయ్యం పునర్లోకాదిహాగతః || 153 ||

ఇత్యాఖ్యాత మశేషేణ తద్వృత్తాంతం విశ్వమ్యతే | సాధుసాధ్వితి సంభ్రాతాః శ శంసుపరివంధినః ||154||

అథేంద్రసేనాయనివేద్య సత్వరం నష్టస్యవ పుత్రన్య పునః సమాగమం |

ప్రసాద్యతం ప్రాప్త నరేశ్వరా వనం దాయా దముఖ్యాస్తు భయం ప్రపేదిరే || 155 ||

అథపౌరజనా ః సర్వేపురోద్యానే నృపాత్మజం | దృష్ట్యా రాజ్ఞేద్రుతం ప్రోచుః లేభిరేచ మహాధనం || 156 ||

అకర్ణ్య పుత్రమాయాంతం రాజానంద జలాప్లుతః | నవ్యజావాది మంలోకం రాజ్ఞేచ వరయాముదా || 157 ||

అథనాగరికా ః సర్వే మంత్రి వృద్ధా ః పురోధనః | ప్రత్యుద్గమ్య పరిష్వజ్య తమానిన్యుః నృపాంతికం || 158||

అథోత్సవేన మహతా ప్రవిశ్య విజమందిరం | రాజపుత్రః స్వపితరౌ ప పందే బాష్పముత్స్పజన్‌ || 159 ||

తంపాదమూలే పతితం స్వపుత్రం వివేద వాసౌ పృథి వీపతిః క్షణం |

ప్రభోధితో మాత్య జనైః కథంచిత్‌ ఉత్థవ్యక్లిన్నేహృదాలిలింగ || 160 ||

తా || పరలోకం నుండి ఇక్కడికి వచ్చాడు ఈ రూపం ఎట్లా వచ్చింది. నశించిన భర్తయొక్క ధర్శనము దురదృష్టవంతురాలికి నాకెట్లా ఔతుంది (142) ఇది కలా, కలకాదా, ఇది భ్రమా, భ్రమ కాదా. ఈతడు ధూర్తుడా కాక ఒకయక్షుడా, గంధేర్వుడేనా (143) పరమ ఆపదయందు న్నామునిపత్ని నాకేం చెప్పిందో, ఈ వ్రతాన్ని చేయి అని, దాని ఫలమేనా ఇది (144) ద్విజోత్తముడు, నీకు పదివేల సంవత్సరాల సౌభాగ్యమని అని అన్నాడో అతని ఆమాట సత్యమా, సత్యమే, ఈశ్వరుడు తప్ప ఎవరు తెలుసుకుంటారు. (145) ప్రతిదినము మంగళకరమైన సూచనలు కన్పిస్తాయి. పార్వతీనాథుడు ప్రసన్నుడైతే ప్రాణులకు సాధ్యంకానిదేది (146) అని బాగా ఆలోచించి అనుమానం తొలగిపోయిన ఆమెతో సిగ్గుతో తలవంచిన ఆమె చెవిలో తన ప్రయోజనానాన్ని చెప్పాడు (147) ఈ వృత్తాంతము చెప్పటానికి శోకతప్తులైన ఆ తలిదండ్రుల దగ్గరకు వెళ్తాము. ఓ భ్రదే | నీకు మేలు కలుగని, వెంటనే భర్తను పొందుతావు(148) అని పలికి గుఱ్ఱాన్ని ఎక్కిరాకుమారుడు వెళ్ళిపోయాడు. వారితో కలసి అక్షణంలోవనే తనరాష్ట్రాన్ని చేరుకున్నాడు. (149) అతడు నగర ఉద్యానప్రాంతమందు నిలిచి అఫణిపుత్ర కునిరాజనసింహంసనమందుకూర్చున్న, తన పగవారిపైకి వదిలాడు. (150) అతడు వెళ్ళిత్వరగా ఇంద్రసేనుని వదలిపెట్టండి. అనివారితో అన్నాడు. ఆతని కొడుకు చంద్రాంగదుడు ఆలయం నుండి వచ్చాడు (151) రాజసింహాసనాన్ని వదలిపెట్టండి, మీరు ఆలోచించకండి. లేని పక్షంలో చంద్రాంగదుని బాణములు త్వరగా మీ ప్రాణాలను హరిస్తాయి. (152) అతడు యమునానది నీటి యందు మునిగితక్షకమందిరమునకు వెళ్ళి అతని సహాయాన్ని పొంది తిరిగి అక్కడినుండి ఇక్కడికి వచ్చాడు. (153) అని చెప్పిన అవృత్తాంతాన్ని అంతావారు విని బాగుబాగు అని సంభ్రావంతులైన శ్రతువులు పొగిడారు. (154) ఇక ఇంద్రసేనునునకు, త్వరగా చనిపోయిన వారికుమారిని తిరిగిరాకను తెలిపిరి. నరేశ్వరుని అసనంకొరకై వచ్చిన అతనిని చూచి పగతురు భయపడ్డారు. (155) పౌరజనులంతా పుర్వోద్యానమందు రాకమారునిచూచి రాజుగారికి త్వరగా చెప్పారు. గొప్పధనాన్ని పొందారు. (156) కుమారుడు వచ్చిన మాటను వినిరాజు అనందభాష్పములు కలవాడై ఈ లోకంమరచిపోయాడు. రాజ్ఞికూడా చాలా ఆనందాన్ని పొందింది (157)నాగరికులంతా,మంత్రివృద్ధులు,పురోహితులు,ఎదురువచ్చి కౌగిలించుకొని అతనిని రాజుదరికి తీసుకువచ్చారు. (158) గొప్ప ఉత్సవంతో తనమందిరానికి ప్రవేశించి రాజపుత్రుడు, కన్నీరు కారుస్తూతనతలిదండ్రులకు నమస్కరించాడు (159) పాదములందు పడిన రాజుక్షణకాలము తెలుసుకోలేకపోయాడు. అమాత్యజనులు మేల్కొలుపగా (చెప్పగా) ఎట్లాగో లేచి క్లిన్నుడై హృదయానికి హత్తుకున్నాడు (160)

మూ || క్రమేణ మాతౄరభింద్యతాభి ః ప్రవర్థితాశీః ప్రణయాకులాభిః |

అలింగితః పౌరజనానశేషాన్‌ సంభావయామానస రాజసూనుః || 161 ||

తేషాంమధ్యేరసమాసీ నఃస్వవృత్తాంతమశేషతః | పిత్రేనివేదయామాన తక్షక స్యచమిత్రతాం || 162||

దత్తంభుజంగరాజేనరత్నాదిధ వనంచయం | దివ్యంతద్‌ రాక్షసానీతంపిత్రసర్వంస్య వేదయత్‌ || 163 ||

రాజపుత్రస్య చరితం దృష్ట్యాశ్రుత్యవా చవిహ్వలు ః | మనేన్నుషాయాః సౌభాగ్యం మహేశారాధనార్జితం || 164 ||

సామాంగల్యమయీంవార్తా మిమాంనిషధభూతి ః | చారైర్నివేదయామానచిత్రవర్మమహివతేః || 165 ||

శ్రుత్వా7మృత మాయీం వార్తాంస సముత్థాయసంభ్రమాత్‌ | తేభ్యోదత్వాధనంభూరిన సర్తానందవిహ్వల ః || 166 ||

ఆధాహూయస్వ తనయాం పరిష్వజ్యాశ్రులోచనః | భూషణౖః భూషయామాసత్యక్తవైధ్యవలక్షణాం || 167 ||

అధోత్సవోమహానాసీత్‌ రాష్ట్రగ్రామపురాదిషు | సీమంతన్యాఃశుభాచారంశశంసుఃసర్వతోజనాః || 168 ||

చిత్రవర్మాధనృపతిః సమాహుయేంద్రసేనజం | పునర్వివాహవిధివాసుతాంతసై#్మన్యవేదయత్‌ || 169 ||

చంద్రాగదో7పిరత్నాద్యైః అనీతైః తక్షకాలయాత్‌ | స్వాంపత్నీంభూషయాంచక్రే మర్త్యానామతిదుర్లభై ః || 170 ||

అంగరాగేణ దివ్వేసతప్తకాంచనశోభినా | శుశుభేసామగంధేనదశ యోజనగామినా || 171 ||

అవ్లూనమాలయాశశ్వత్‌పద్మకింజల్కవర్ణయా ః కల్పద్రుమోత్థ యాబాలాభూషితాశుభేనతీ || 172 ||

ఏవంచంద్రాగదః పత్నీమవాప్య సమయేశుభే | య¸° స్వనగరంభూయఃశ్వశురేణా సుమోదితః || 173 ||

ఇంద్రసేనో7పి రాజేంద్రోరాజేస్థాప్యనిజాత్మజం | తవసాశిపమారాధ్య లేభేనం యమినాంగతిం || 174 ||

దశవర్షసహస్రాణిసీమంతి న్యాస్వభార్యయా | సార్థంచంద్రాంగదోరాజాబుభుజేవిష్యాస్భహూన్‌ || 175 ||

ప్రొసూతతనయానష్టౌకాంవరానవాం | రేమేనీమంతినీ భర్త్రాపూజయంతీ మహేశ్వరం

దినేదినేచసౌభాగ్యం ప్రాప్తం చైనేందువాసరాత్‌ || 176 ||

సూత ఉవాచ -

విచిత్రమిదమాఖ్యాసంమయాసమనువర్ణితం | భూయో7పిపక్ష్యే మాహాత్మ్యం సోమవారవ్రతోదితం || 177 ||

ఇతి శ్రీ స్కాందమహాపురాణ ఏకాశీతి సాహస్య్రాంహితాయాంబ్రహ్మోత్తరఖండే సోమవారప్రతవర్జనంనామ అష్టమో7 ధ్యాయః

తా || వరుసగా తల్లులకు నమస్కరించి వారి ఆశీర్వాదాన్నిపొంది. ప్రేమాకులులైవారు అతనిని కౌగిలించుకోగా ఆ రాజుమానువు పౌరజనులందరిని గౌరవించాడు. (161)వారి మధ్యలో కూర్చొన తన వృత్తాంతాన్నంతా తన తండ్రికి నివేదించాడు. తక్షకుని మిత్రత్వాన్ని చెప్పాడు. (162) భుజంగ రాజు ఇచ్చిన రత్నాది దన సంచయమును ఆ రాక్షసుడు తెచ్చిన దివ్యమైన ధనాన్ని అంతా తండ్రికి నివేదించాడు (163)రాజపుత్రుని చరిత్రను విని, చూచి విహ్వలుడై, మహాశుని ఆరాధన వల్ల సంపాదించిన కోడలి సౌభాగ్యముగా తలచాడు (164) సుమంగళకరమైన ఈ వార్తను నిషథ భూపతి, చిత్రవర్మ మహీపతికి చారుల ద్వారా తెలియజేశాడు. (165) అమృతమయమైన వార్తను విని, సంభ్రమముగా అతడు లేచి వారికి అధికంగా ధనం ఇచ్చి ఆనంద విహ్వలుడై నాట్యం చేశాడు. (166) ఇక తన కూతురును పిలచి కౌగిలించుకొని కన్నీళ్ళు నింపుకొని, వైధవ్య లక్షణములు తొలగిన విధంగా భూషణములతో అలంకరించాడు. (167)రాష్ట్ర గ్రామపురాదులందు గొప్ప ఉత్సవం జరిగింది. జనులు అంతటా సీమంతిని యొక్క మంచి నడవిడికను ప్రశంసించారు. (168) చిత్రవర్మ నృపతి ఇంద్రసేనాపతి ఇంద్రసేనజుని పిలిపించి తిరిగి వివాహ విధితో కూతురును అతని కర్పించాడు. (169)చంద్రాంగదుడు కూడా తక్షకుని ఇంటి నుండి తెచ్చిన రత్నాదులతో, మర్త్యులకు అతి దుర్లభ##మైన వాటితో తన భార్యను అలంకరించాడు. (170) కాచిన బంగారంలా వెలిగే మైపూతతో దివ్యమైన దానితో అలంకరించాడు. (171) పద్మమందలి కింజల్కములవర్ణముగల, ఎప్పుడూ వాడని మాలతో, కల్పద్రుమం నుండి వచ్చిన దానితో ఆమె అలంకరింపబడి ఆసతి వెలిగి పోయింది. (172) ఈ విధముగా చంద్రాంగదుడు భార్యను పొంది శుభ సమయమందు మామగారితో అనుమతింప బడి తిరిగి తన నగరానికి వెళ్ళాడు (173)రాజేంద్రుడు ఇంద్రసేనుడు కూడా తన కుమారుని రాజ్యమందుంచి, తపస్సుతో శివుని పూజించి సంయముల స్థానాన్ని పొందాడు(174) పదివేల ఏండ్లు తన భార్య సీమంతినితో కూడి చంద్రాగదుడు రాజు అనేక సుఖములను అనుభవించాడు(175) ఎనిమిది మంది కుమారులను అందమైన ముఖ సౌందర్యము గల ఒక కూతురును పొందాడు. శివుని పూజిస్తూ ఆ సీమంతిని భర్తతో సుఖించింది. ఇందు వాసరం వల్ల ప్రతి రోజు సౌభాగ్యాన్ని పొందింది. (176) సూతుని వచనము - విచిత్రమైన ఈ కథను నేను మీకు చెప్పాను. సోమవార వ్రతం వల్ల కలిగే మాహాత్మ్యన్ని తిరిగి చెప్తాను. (177) అని శ్రీ స్కాంద మహాపురాణ మందు ఏకాదశీతి సహస్రసంహితయందు బ్రహ్మోత్తర ఖండ యందు సోమవార వ్రత వర్జన మనునది ఎనిమిదవ అధ్యాయము || 8 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters