Sri Scanda Mahapuranamu-3    Chapters   

పదవఅధ్యాయము

మూll శ్రీసూత ఉవాచ -

వేతాల వరదే తీర్థే నరః స్నాత్వాద్వి జోత్తమాః l తతఃశ##నైః శ##నైర్గచ్చేత్‌ గంధమాదన పర్వతం ll1 ll

యోంzబుధౌ సేతురూపేణ వర్తతే గంధమాదన ః l సమార్గో బ్రహ్మలోకస్య విశ్వకర్త్రా వినిర్మతః ll 2 ll

లక్షకోటి సహస్రాణి సరాంసిసరితస్తథా l సముద్రాంశ్చ మహాపుణ్యావనాన్య ప్యాశ్రమానిచ ll 3 ll

పుణ్యాక్షేత్ర జాతాని వేదారణ్యా దికానిచ l మునయశ్చవసిష్ఠాద్యాః సిద్ధచారణ కిన్నరా ః ll 4 ll

లక్ష్య్మాసహాధరణ్యాచ భవాన్‌ మధుసూదన ః lసావిcత్యాచ సరస్వత్యా సహైవచతురానన ll 5ll

హెరంబః షణ్ముఖశ్చైవ దేవాశ్చేంద్ర పురోగమాః అదిత్యాది గ్రహాశ్చైవ తథాష్టౌవసవోద్విజాః ll 6 ll

పితరోలోక పాలాశ్చతథాన్యే దేవతాగణాః మహాపాతక సంఘానాం నాశ##నేలోకపావనే ll 7 ll

దివానిశం వసంత్యత్ర పర్వతే గంధమాదనే l అత్రగౌరీ సదాతుష్టా హరేణ సహవర్తతే ll 8ll

అత్రకిన్నర కాంతానాం క్రీడా జాగర్తి నిత్యశఃl త స్యదర్ర్శనమాత్రేణ బుద్ధి సౌఖ్యం నృణాం భ##వేత్‌ ll 9ll

తన్మూర్థకృతావాసా ః సిద్ధ చారణయోషితః l పూజయంతి సదాకాలం శంకరం గిరిజాపతిం ll 10 ll

కోటయో బ్రహ్మ హత్యానాం అగమ్యాగమ కోటయఃl అంగలగ్నైఃవినశ్యంతి గంధమాదన మారుతైః ll 11 ll

అసాపుల్లాలకల్లోలేతిష్ఠన్మథ్యే మహాంబుధౌ l ఆ సీన్ముని గణౖః సేవ్యః పురావై గంధమాదనః ll12ll

తతోనలేన సేతౌత బద్ధే తన్మధ్యగోచర ఃl రామాజ్ఞయాఖిలైఃసేవ్యో బభూవ మనుజైరపి ll13ll

తాll శ్రీసూతులిట్లనిరి - ఓబ్రాహ్మణులారా ! వేతాల వరదతీర్థమందు నరులు స్నానంచేసి, పిదప మెల్లమెల్లగా గంధమాదన పర్వతమునకు వెళ్ళాలి. (1) సముద్రమందు సేతురూపంగా గంధమాదనముంది. ఆ మార్గమును, బ్రాహ్మలోకమునకు విశ్వకర్తనిర్మించాడు . (2)లక్షకోటి సహస్రముల సరస్సులు నదులు పుణ్యప్రదమైన సముద్రములు, వనములు, ఆశ్రమాలు (3)పవిత్రమైన క్షేత్ర సముహములు, వేదారణ్యాదికములు, విసష్ఠాదిమునులు, సిద్ధచారణ కిన్నరులు (4)లక్ష్య్మిభూదేవిలతో కూడిన విష్ణుముర్తి, సావిత్రి సరస్వతులతో కూడిన బ్రహ్మ, (5)గణపతి కుమారస్వామి ఇంద్రుడు మొదలుగా గల దేవతలు, అదిత్యాది గ్రహములు, ఎనిమిది మంది పుసువులు (6)పితరులు, లోకపాలురు, ఇతర దేవతాగణములు, మహాపాతక సంఘములను నశింపచేసే, లోకపావనమైన (7) గంధమాదన పర్వతమందు రాత్రింబవళ్ళు నివశిస్తున్నారు. ఇక్కడ గౌరీదేవి శివునితో కూడి ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది (8)ఇక్కడ ఎప్పుడూ కిన్నర కాంతల క్రీడ జరుగుతూ ఉంటుంది . దానిని చూచినంత మాత్రంలోనే నరులకు బద్ధి సౌఖ్యం కల్గుతుంది(9)దాని మూర్థమందు సిద్ధచారణ స్త్రీలు నివసిస్తూ గిరిజాపతియైన శంకరుని ఎల్లకాలము పూజిస్తూ ఉంటారు (10) కోట్లకొలది బ్రహ్మహత్యలు, కోట్లకొలది చేయరాని అక్రమ సంబంధాలు వీటి పాపం, గంధమాదనపు గాలులు శరీరానికి తగిలినంతలో పోతుంది (11)ఇది అత్యధికంగా కల్లోలమైన సముద్రం మధ్యలో ఉండి , పూర్వం ఈ గంధమాదనము మునిగణములతో సేవింపబడుతుండేది (12) పిదప నలుడు సేతువు నిర్మించాక దాని మధ్య కన్పిస్తూ రామాజ్ఞతో సమస్తమనుజులతో కూడా సేవించతగిందిగా ఐంది (13).

మూll సేతురూ పంగిరింతంతు ప్రార్థయేత్‌ గంధమాదనం l క్షమా దరమహాపుణ్య సర్వదేవ సమస్కృత ll 14 ll

విష్ణ్వాదయోపి యందేవాః సేవంతే శ్రద్ధయాసహ l తం భవంతమహం వద్య్భాం ఆక్రమామినగోత్తమ ll 15 ll

క్షమస్వపాదఘాతం మేదయయాపాపచేతన ః l త్వస్మూర్థనికృతా వాసంశంకరం దర్శయస్వమే ll 16 ll

ప్రార్‌ థయిత్వాసరస్త్వే వంసేతురూపంనగోత్తమం l తతోమృదుపదంగచ్చేత్‌ పావనంగంధమాదనం ll 17ll

అబ్ధౌతత్రనరః స్నాత పర్వతే గంధమాదనే l పిండదానంతతః కుర్యాత్‌ అపి సర్షపమాత్రకం ll 18 ll

తృప్తిం ప్రయాంతి పితర ః తస్యయావద్యుగక్షయః l శమదల సమానాన్వాదద్యాత్‌ పిండాన్‌ పితృన్‌ ప్రతి ll 19 ll

స్వర్గస్థామోక్షమాయాంతి స్వర్గం నరకవాసిన ః l తతస్తస్యో పరిమాహాతీర్థంలోకేషు విశ్రుతం ll 20 ll

సర్వతీర్థోత్తమంపుణ్యం నామ్నాపాపవినాశనం l అస్తిపుణ్యతమం విప్రాః పవిత్రేగంధమాదనే ll 21 ll

యస్య సంస్మరణాదేవ గర్భవాసోన విద్యతే l తత్ర్పాప్యతునర ః స్నాయాత్‌ స్వదేహ మలనాశనం ll 22ll

తత్రస్నానాన్నరోయాతి వైకుంఠం నాత్ర సంశయంః ll 22 1/2 ll

తాll సేతురూపైన ఆగంధమానద పర్వతాన్ని ప్రార్థించాలి. ఓ క్షమాధర ! మహాపుణ్య ! సర్వదేవతలచే నమస్కరింపబడేదాన ! (14)విష్ణ్వాది దేవతలు కూడా శ్రద్ధతో సేవించే నిన్ను నేను పాదములతో ఆక్రమిస్తున్నాను. ఓ పర్వత శ్రేష్ఠమో ! (15) పాప చేతస్కుడనైన నా పాదఘాతాన్ని దయతో క్షమించు. నీ శిరమందు నివాసమున్న శంకరుని నాకు చూపంచు (16)ఈ విధముగా సేతురూపమైన పర్వతశ్రేష్ఠమును నరుడు ప్రార్థించి, పిదప అడుగులు మెల్లగా వేస్తూ పవిత్రమైన గంధమాదనంపై వెళ్ళాలి(17)గంధమాదన పర్వతమందలి సముద్రపు నీటిలో నరుడు స్నానం చేసి అవగింజమాత్రమైనా పిడదానం చేయాలి. (18)యుగాంతమువరకు పితరులు తృప్తినందుతారు, శమీదలంతో సమానమైన వానినైనా పిండములను పితరుల గూర్చి ఇవ్వాలి (19) స్వర్గమందున్న వారు మోక్షానికి వెళ్తారు. నరకమందున్న వారు స్వర్గానికి వెళ్తారు. పిదప దానిపైన లోకంలో ప్రసిద్ధమైన గొప్ప తీర్థము (20) సర్వ తీర్థములలో ఉత్తమమైనది పుణ్యప్రదమైనది పాపనాశనము పేరుగలది పుణ్యతమమైనది పవిత్రమైన గంధమాదనంలో ఉంది (21) దానిని స్మరించిన మాత్రం చేతనే గర్భవాసము (జన్మ) ఉండదు. తమదేహమలాన్ని నశింపచేసే అక్కడికివెళ్లి నరుడు స్నానమాచరించాలి. అక్కడ స్నానం చేసి నరుడు వైకుంఠాన్ని పొందుతాడు అనుమానం లేదు (22)

మూll ఋషయ ఊ చుః-

సూతపాపవినాశాఖ్యతీర్థస్య బ్రూహివైభవంlవ్యాసేన బోధితస్త్వంహి వేత్సిసర్వం మహామునే ll23ll

శ్రీసూత ఉవాచ-

బ్రహ్మాశ్రమపదే వృత్తాం పార్శ్వే హిమవతఃశుభేlవక్ష్యమిబ్రాహ్మణశ్రేష్ఠాః యుష్మాకంతుకథాంశుభాం ll 24 ll

అస్యాశ్రమపదం పుణ్యం బ్రహ్మశ్రమపదే శుభే l నానా వృక్ష్యణాకీర్ణం పార్వ్యే హి మవత ః శుభే ll 25 ll

బహుగుల్మలతాకీర్ణం మృగ ద్విపనిషేవితం l సిద్ధచారణ సంఘుష్టం రమ్యం పుష్పితకాననం ll 26ll

వృతిభి ః బహుభిః కీర్ణం తాపసైరుప శోభితం l బ్రాహ్మణౖశ్చమహాభాగై ః సూర్యజ్వలన సంనిభైః ll 27 ll

నియమవత్రనంపన్నైః సమాకీర్ణం తపస్విభిఃl దీక్షితైః యాగహె తోశ్చయ తాహారై ఃకృతాత్మభిః ll 28 ll

వేదాధ్యయన సంపన్నైః వైదికైః పరివేష్టతం l వర్ణిభిశ్చ గృహస్థైశ్చ వానప్రస్థైశ్చభిక్షుభిః ll 29 ll

స్వాశ్రమాచారనిరతైః స్వపర్ణోక్తవిధాయిభి ః l వాలఖిల్యైశ్చమునిభిః సంప్రాపైశ్చమరీచిభిః ll30ll

తత్రాశ్రమే పురాకశ్చిత్‌ శూద్రో దృఢమతిర్ద్విజాః సాహపీ బ్రాహ్మణాభ్యాశం ఆజగామముదాన్వితః ll 31 ll

అగతోహ్యాశ్రమపదం పూజితశ్చతవస్విభి ః lనామ్నాదృఢమతిః శూద్రః సాష్టాంగం ప్రణనామవై ll 32 ll

తాన్సదృష్ట్యామునిగణాన్‌ దేవకల్పాన్‌ మహౌజసః కుర్వతో వివిధాన్‌ యజ్ఞాన్‌ సంప్రహృష్యచశూద్రకః ll 33 ll

అథాస్యబుద్ధి రభవత్‌ తపః కర్తుమసుత్తమం l తతోzబ్రవీత్‌ కులపతిం మునిమాగత్యతాపనం ll 34 ll

తాll ఋషులిట్లనిరి - ఓసూత! పాపవినాశమనే పేరు గల తీర్థముయొక్క వైభవాన్ని చెప్పండి. మీకు వ్యాసుడు అన్ని బోదించారు. ఓముని మీకంతా తెలుసు .అని (23) శ్రీసూతులిట్లన్నారు - హిమవత్‌ పర్వతం యొక్క పార్శ్వ భాగంలో బ్రహ్మ ఆశ్రమపదంలో జరిగిన శుభ##మైన కథను మీకు చెబుతున్నాను ఓబ్రాహ్మణ శ్రేష్ఠులారా! వినండి (24) హిమవంతుని పార్శ్వ భాగంలో బ్రహ్మ అశ్రమ పదంలో ఈతని అశ్రమమపవిత్రమైంది అనేక వృక్షముల సమూహంతో నిండింది (25)అనేక పొదలతో తీగలతో నిండింది . మృగములతో ఏనుగులతో సేవింపబడేది సిద్ధులతో చారణులతోకూడింది. అందమైనది పూలతోనిండిన అడవి కలది (26) ఎన్న తగినవారెందరితోనో కూడింది . తాపనులతో శోభిస్తుంది . సూర్యుని వెలుగులా ఉండే మహానుభావులైన బ్రాహ్మణులతో నిండింది (27)నియమవ్రతములు గల తపస్వులతో నిండింది . యాగకారణంగా దీక్షితులైన వారితో స్థిరమైన ఆత్మకలవారితో నియతమైన ఆహారం కలవారితో నిండింది (28) వేదాధ్యయనముతో కూడిన వైదికులతో చుట్టబడింది. బ్రహ్మచారులు గృహస్థులు వానప్రస్థులు, భిక్షులు (29) తమతమ ఆశ్రమములకు తగిన ఆచారములందు ఆసక్తి గలవారు, తమ వర్ణములకు చెప్పిన దానిని ఆచరించేవారు, వాల ఖిల్యమునులు, మరీచులు వీరందరితో కూడింది ఈ ఆశ్రమ పదము (30)ఆ ఆశ్రమంసకు పూర్వము ఒక శూద్రుడు దృఢమై నిశ్చయం కలవాడు, సాహసి, సంతోషంతో బ్రాహ్మణుల దగ్గర ఏదైనా కొంచెం తెలుసుకోవటానికి వచ్చాడు. (31)ఆశ్రమ ప్రాంతమునకు వచ్చి తపస్వులతో పూజింపబడి దృఢమతి అనుపేరుగల ఆశూద్రుడు వారికి సాష్టాంగ ప్రణామమ చేశాడు (32)ఆ మునులను దేవతలతో సమానమైన వారిని, గొప్ప తేజస్సు కలవారిని చూచి రకరకాల యజ్ఞాలను చేస్తున్న వాళ్ళను చూచి సంతోషించాడు . ఆశూద్రుడు (33)పిదప అతనికి గొప్పతపస్సు చేయాలనే కోరిక కలిగింది . అప్పుడు అశ్రమ పదకులపతియైన తాపసుని సమీపించి ఆమునితో ఇట్లా అన్నాడు (34).

మూ ll దృఢమతి ఉవాచ -

తపోధనసమస్తేస్తు రక్షమాంకరుణానిధే l తపప్రసాదాదిచ్ఛామి ధర్మం చర్తుం ద్విజర్షభ ll 35 ll

తస్మాదభిగతం మాంత్వం యాగే దీక్షయ సుప్రతl బ్రహ్మన్నవరవర్ణోzహం శూద్రోజాత్యస్మిసత్తమ ll 36 ll

శుశ్రూషాం కర్తుమిచ్ఛామి ప్రపన్నాయ ప్రసీదమే l ఏవముక్తేతు శూద్రేణ తమాహబ్రాహ్మణస్తదా కులపతిరువాచ - ll 37 ll

యాగే దీక్షయితుం శక్యోస శూద్రోహీన జన్మభాక్‌ l శ్రూయతాం యదితే బుద్ధిః శుశ్రుషా నిరతోభవ ll 38 ll

ఉపదేశోసకర్తవ్యోజాతిహీనస్య కర్హచిత్‌l ఉపదేశేమహాన్దోష ఉపాధ్యాయస్యవిద్యతే ll 39 ll

నాధ్యాపయేద్బుధః శూద్రం తథానైవచయాజయేత్‌ l నపాఠయేత్త థాశూద్రం శాస్త్రం వ్యాకరణాదికం ll 40 ll

కావ్యం వానాటకంవాపి తథాలంకారమేవచ l పురాణమిత హాసంచ శూద్రంనైవతుపాఠయేత్‌ ll 41 ll

యదిచోపదిశేత్‌ విప్ర ః శూద్రం చైతానికర్హచిత్‌ l త్యజేయుః బ్రాహ్మణావిప్రంతంగ్రామత్‌ బ్రహ్మసంకులాత్‌ ll 42 ll

శూద్రాయచోపదేష్టారం ద్విజం చండాలవత్‌త్త్యజేత్‌ l శూద్రం చాక్షర సంయుక్తం దూరతః వరివర్జయేత్‌ ll 43 ll

అతః శుశ్రూష భద్రతే బ్రాహ్మణాన్‌ శ్రద్ధయాసహ lశూద్రస్యద్విజశుశ్రూషా మన్వాదిభిరుదీరితా ll 44 ll

సహినైసర్గికం కర్మపరిత్యక్తుం త్వమర్హసి l ఏవముక్తస్తుమునినా సశూద్రోzచింతయత్తదా ll 45 ll

కింకర్తవ్యం మమాత్వద్యవ్రతే శ్రద్ధాహిమేపురా l యథాస్యాన్మమవిజ్ఞానం యతి ష్యేzహంతధాద్యవై lll46 ll

ఇతినిశ్చిత్యమన సాశూద్రో దృఢమతిస్తదా l గత్వాశ్రమ పదాద్దూరంకృత వానుట జంశుభం ll 47 ll

తాll దృఢమతి ఇట్లా అన్నాడు - ఓతపోధన ! నీకు నమస్కారము . ఓ దయానిది ! నన్ను రక్షించు . నీ దయవల్ల ధర్మాన్ని అచరించటానికి ఇష్టబడుతున్నాను (35) అందువల్ల మీదగ్గరకు వచ్చిన నన్ను యాగమందు దీక్షీతునిగా చేయండి ! ఓబ్రహ్మన్‌ ! నేను క్రింది వర్ణము వానిని శూద్రుడను జాతివల్ల (36)నేను శుశ్రూష చేయదలిచాను . శరుణవేడి నన్ను అనుగ్రహించడి . ఈరకముగా శూద్రుడు అన్నాక ఆ బ్రహ్మణుడు ఆతనితో ఇట్లా అన్నాడు . (37)కులపతి ఇట్లా అన్నాడు. హీన జన్మను పొందిన శూద్రుడు యాగదీక్షకుశక్తుడుకాడు నీకు నిజంగానే జ్ఞానం ఉంటే విను , శుశ్రూషా నక్తుడవుకా (38) జాతి హీనుడైనవానికి ఏరకంగానైనా ఉపదేశం చేయరాదు . ఉపదేశించినచో ఉపాధ్యాయునకే గొప్ప దోషము (39)బుధుడు శూద్రునకు ఉపదేశంచేయరాదు . అతనితో యజ్ఞం చేయించరాదు శూద్రునకు వ్యాకరణాది శాస్త్రములను చెప్పరాదు (40)కావ్య నాటక అలంకారములు, పురాణతి హాసములు, శూద్రునకు చెప్పరాదు (41) ఒకవేళ విప్రుడు శూద్రునకు ఇవన్నీ ఏదోరకంగా ఉపదేశించినచో బ్రాహ్మణులతో కూడిన ఆ గ్రామము నుండి ఆ బ్రాహ్మణుని వదిలి పెట్టాలి (42) శూద్రునకు ఉపదేశం చేసే బ్రాహ్మణుని చండాలునివలె వదిలిపెట్టాలి . చదువుకున్న శూద్రుని దూరం నుండే వదిలిపెట్టాలి . (43) అందువల్ల బ్రాహ్మణులకు శ్రద్ధతో శుశ్రుషచేయి. నీకు %ొభద్రం కలుగుతుంది . శూద్రులకు బ్రాహ్మణ శుశ్రుష మన్వాదులతో చెప్పబడింది . (44)నై సర్గికమైన నీకర్మను నీవు వదిలి పెట్టరాదు. ఈ రకంగా మునితో చెప్పబడి ఆ శూద్రుడు ఇట్లా ఆలోచించాడు (45)నేనిప్పుడేం చేయాలి . వ్రతమందు శ్రద్ధ నాకు ఎప్పటినుండో ఉంది . నా విజ్ఞానము పెరిగేటట్లుగా ప్రయత్నిస్తాను ఇప్పుడు (46) అని మనస్సులో నిశ్చయించుకొని దృఢమతి అనే ఆ శూద్రుడు , అశ్రమానికి దూరంగా వెళ్ళి శుభ##మైన పర్ణశాలను ఏర్పరచుకున్నాడు (47).

మూllతతవైదేవతాగారం పుణ్యాన్యాయత నానిచ l పుష్పారామాదికంచాపి తటాక ఖననాదికం ll 48 ll

శ్రద్ధయాకాం యామనతప ః సిద్ధ్యర్థమాత్మన ః l అభిషేకాంశ్చనియమా నుపవాసాదికానపి ll 49 ll

బలిం చకృత్వాహుత్వాచదైవతాన్యభ్యపూజయన్‌l సంకల్పనియమోపేతః ఫలాహారోజితేంద్రియః ll 50 ll

నిత్యంకంధైశ్చమూలైశ్చవుషై#్పరపితథాఫలైః l అతిథీన్పూజయామా సయథావత్‌ సముపాగతాన్‌ ll 51 ll

ఏవంహిసుమహాన్‌ కాలోవ్యతిచక్రామతస్యవై l అథాశ్రమమగాత్త స్యనుమతిర్నామనామతః ll 52 ll

ద్విజోగర్గకులోద్భూతః సత్యవాదీ జితేంద్రియః lస్వాగతేనమునిం పూజ్యతోషయిత్వాఫలాదికైః ll 53 ll

కథయన్వైకథాః పుణ్యాః కుశలం పర్యపృచ్ఛతl ఇత్థంసప్రణిపాతాద్యైః ఉపచారైస్తు పూజితః ll 54ll

అశీర్భిఃఆభినంద్యైనం ప్రతిగృహ్యచసత్ర్కియాం l తమావృచ్ఛప్రహృష్టాత్మాస్వాశ్రమంవునరాయమౌ ll 55 ll

ఏవందినేదినేవిప్రః శూద్రేస్మిన్పక్షపాతవాన్‌ lఆగచ్ఛదాశ్ర్‌మమ్‌తస్య ద్రష్టుంతంశూద్రయోనిజఃll 56 ll

బహుకాలంద్విజస్యాభూత్‌ సంవర్గః శూద్రయోనినా l స్నేహస్యవశమావన్న ః శూద్రోక్తంనాతి చక్రమే ll 57 ll

తాllఅక్కడఒక దేవాలయాన్నిపుణ్యమైనగృహములను, పూలతోటలుమొదలగునవి, చెరువుత్రవ్వించటంవగైరా (48)తనతపఃసిద్ధికొరకు శ్రద్ధతో చేయించాడు. అభిషేకములను ఉపవాసాది నియమములను కూడా (49)బలికూడా చేసి హోమంచేసి దేవతలను పూజించాడు. సంకల్ప నియమములు కలవాడై ఫలహారుడై ఇంద్రియములజయించి (50)రోజు కందములతో మూలములతో పుష్పఫలములతో, ఇంటికి వచ్చిన అతిథులను శాస్త్రప్రకారం పూజించసాగాడు (51)ఈ విధంగా అతనికి ఎంతో కాలంగా గడిచిపోయింది .అతని ఆశ్రముమునకు, సుమతి అనుపేరుగల బ్రాహ్మణుడు వచ్చాడు . (52)గర్గకులంలో పుట్టిన బ్రాహ్మణుడాతడు సత్యవాది, జితేంద్రియుడు. స్వాగత పూర్వకంగా మునిని పూజించి ఫలాదులతో సంతోషపరచి (53)పుణ్యకథలు వినిపిస్తూ కుశలమడిగాడు. ఈ విధముగా నమస్కారము మొదలగు ఉపచారములతో పూజింపబడి (54)ఆశీర్వాదములతో ఈతనిని అభినందించి సత్కారమును స్వీకరించి, పోయి వస్తానని చెప్పి ఆనందంగా ఆశ్రమానికి తిరిగి వచ్చాడు (55) ఈ విధముగా ప్రతిరోజు ఈ బ్రాహ్మణుడు శూద్రుని యందు పక్షపాతముకలవాడై ఆ శూద్రుణ్ణి చూడటానికి అతని ఆశ్రమానికి వచ్చేవాడు (56) ఈ బ్రహ్మణునకు చాలాకాలము ఆ శూద్రునితో సహవాసం ఏర్పడింది. స్నేహమునకధీనుడై శూద్రుడు చెప్పిన దానికి అతిక్రమించలేదు (57)

మూll అధాగతం ద్విజం శూద్రః ప్రాహస్నేహవశీకృతం l హవ్యకవ్య విధానంమే కృణ్స్నం బ్రూహిమునీశ్వర ll 58 ll

పితృకార్య విధానార్థం దేవకార్యార్థమేవచ l మంత్రాను పదిశత్వం మే మహాలయవిధింతథా ll 59 ll

అష్టకా శ్రాద్ధకృత్యంచ వైదికం యచ్చకించనl సర్వమేత ద్రహస్యం మేబ్రూహిత్వంవై గురుర్మతః ll 60 ll

ఏవముక్తః సశూద్రేణ సర్వమే తదుపాదిశత్‌lకారయామాసత స్యాయం పితృ కార్యాదికంతథాll 61 ll

పితృకార్యేకృతేతేన విస్పష్ణం సద్విజోగతః l అధ దీర్ఝేణ కాలేన పోషితః శూద్రయోనినా ll 62 ll

త్యక్తోవిప్రగణౖః సో 7యం పంచ త్వమగమత్‌ ద్విజః l వైవస్వతభాటైః నీత్వాపాతితో నరకే ష్వపి ll 63 ll

కల్పకోటి సహస్రాణి కల్పకోటి శతానిచ lభుక్త్వా క్రమేణ నరకాన్‌ తదంతే స్థావరో7భవత్‌ll64 ll

గర్థభస్తుతతోజజ్ఞే విడ్‌ వరాహస్తతఃవరం l జజ్ఞేథ సారమేయో7సౌ పశ్చాత్‌ వాయసంతాంగతః ll 65 ll

అధచండాలతాం ప్రాపశూద్రయోనిమగాత్తతః l గతవానే వైశ్యతాం వశ్చాత్‌ క్షత్రియస్త దనంతర ః ll 66 ll

ప్రబలై ః బాథ్యమనో 7సౌ బ్రాహ్మణో వైతదా7భవత్‌ lఉపనీతః నపిత్రాతువర్షే గర్భాష్టమే ద్విజః ll 67 ll

వర్తమానః పితుర్గేహె స్వాచారాభ్యాసతత్పరః గచ్ఛన్‌ కదాచిత్‌ గహనే గృహీతో బ్రహ్మరక్షసౌ ll 68 ll

రుదన్‌ భ్రమన్‌ స్ఖలన్‌ మూఢః ప్రహనన్‌ విలపన్నసౌ l శశ్వత్‌ దాహో తిచవదనే వైదికంకర్మసో 7త్యజత్‌ ll 69 ll

దృష్ట్వాసుతం తథాభూతం పితాదుఃఖేన పీడితః l సుతమాదాయచస్నేహాత్‌ అగస్త్యం య¸° ll 70 ll

తాll వచ్చిన బ్రాహ్మణునితో శూద్రుడు స్నేహవశుడై ఇట్లా అన్నాడు. ఓ మునీశ్వర ! నాకు హవ్యకవ్య విధానమంతా చెప్పు (58) పితృకార్యం చేసే కొరకు దేవకార్యం చేసే కొరకు నీవు నాకు మాంత్రాల నుపదేశించు అట్లాగే మహాలయ విధిని కూడా చెప్పు. (59)అష్టకాశ్రాద్ధమును, ఇంకావైదికమైనవన్ని ఈరహస్యమంతా నాకు చెప్పు. నీవే నాకు గురువువు. (60) ఈరకంగా శూద్రునితో చెప్పబడి బ్రాహ్మణుడు ఇదంతా ఉపదేశించాడు. అట్లాగే శూద్రుని పితృకార్యాదికమును చేయించాడు కూడా (61)పితృకార్యం చేయించాక ఆ శూద్రుడు వదిలతే ఈ బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు. ఈ విధముగా చాలా కాలము శూద్రునితో పోషింపబడి (62)బ్రాహ్మణ సమూహముతో విడువబడి ఈ బ్రాహ్మణుడు చనిపోయాడు. యమభటులతో తీసుకుపోబడి నరకంలో వేయబడ్డాడు (63) కల్పకోటి సహస్రములు, కల్పకోటి శతములు నరకములు అనుభవించి వాటి చివర స్థావరమైనాడు (64)ఆ పిదప గాడిదగా పిదప అడవిపందిగా కుక్కగా కాకిగా జన్మించాడు (65)పిదప చండాలుడై శూద్రయోనిలో జన్మించాడు . వైశ్యుడైనాడు పిదప క్షత్రియుడైనాడు . (66) బలవంతులతో బాదింపబడి ఆ పిదప బ్రాహ్మణుడైనాడు. గర్భాష్టమరదు తండ్రితో ఉపనయనం చేయబడి (67)తండ్రి దగ్గర ఉంటూ తన ఆచారములను అభ్యసిస్తూ ఉండగా, ఒకసారి అడవిలో ప్రయాణిస్తూ బ్రహ్మరాక్షసిచే, పట్టుకోబడ్డాడు (68) ఏడుస్తూ, తిరుగుతూ, పడుతూ నవ్వుతూ, దుఃఖిస్తూ ఈతడు ఎప్పుడూ కాల్చు అని అంటూ వైదికకర్మను ఈతడు వదిలాడు (69)కొడుకు అట్లా అవటం చూచి తండ్రి దుఃఖంతో బాధపడుతూ, స్నేహంగా పుత్రుణ్ణి తీసుకొని అగస్త్యుని శరణవేడాడు (70).

మూll భక్త్యామునిం ప్రణమ్యాసౌ పితాతస్యసుతస్యవైl తసై#్మనివేదయామాస స్వపుత్రస్య విచేష్టితం ll 71 ll

అబ్రవీచ్చతదా విప్ర ః కుంభజంమునిపుంగవం l ఏషమేతనయో బ్రహ్మన్‌ గృహీతో బ్రహ్మరక్షసా ll 72 ll

సుఖంనభజతే బ్రహ్మన్‌ రక్షతం కరుణాదృశా l నాస్తిమేతనయో7ప్యన్య ః పితౄణాం ఋణ విముక్తయే ll 73 ll

అస్యపీడా వినాశార్థం ఉపాయంబ్రూహికుంభజl త్వత్సమస్త్రిషు లోకేషు తపః శీలోన విద్యతే ll 74 ll

అగ్రణీః శివభక్తానాం ఉక్తస్త్వంహి మహర్షి భి ః l త్వాం వినాస్యపరిత్రాణం సమేపుత్రస్య విద్యతే ll75 ll

పిత్రేకృపాంకురుష్వత్వం దయాశీలాహి సాధవఃl

శ్రీసూత ఉవాచ -

ఏవముక్త స్తదాతేన కుంభజో ధ్యానా మాస్థితః ll 76 ll

ధ్యాత్వా తుసుచిరంకాలం అబ్రవీద్బ్రాహ్మణంతతః l

అగస్త్య ఉవాచ-

పూర్వజన్మనితే పుత్రోబ్రాహ్మణోయం మహామతే ll 77 ll

సుమతిర్నామ విప్రోయం మతిం శూద్రాయవైదదౌ l కర్మాణి వైదికాన్యేష సర్వాణ్యు పదిదేశ##వై ll 78 ll

అతో 7యం నరకాన్‌ భుక్త్వా కల్పకోటిసహస్రకం lజాతో భువితదం తేషుస్థావరాదిషుయోనిషు ll 79 ll

ఇదానీం బ్రాహ్మణోజాతః కర్మశేషేణ తేసుతః యమేన ప్రేషిపతే నాత్రగృహీతో బ్రహ్మరక్షసా ll 80 ll

క్రూరేణ పాతకేనాద్ధా పూర్వజన్మకృతేనవై l ఉపాయంతే ప్రవక్ష్యామి బ్రహ్మరక్షవినాశ##నే ll 81 ll

శ్రుణుష్వ శ్రద్ధయాయుక్తఃసమాధాయచమానసం l దక్షిణాంభోనిధౌ విప్రసేతురాపోమహాగిరి ll 82 ll

వర్తతే దేవతైః సేవ్యః పావనోగంధమాదనః l తస్యోపరిమాహాతీర్థం నామ్నాపాపవినాశనం ll 83 ll

అస్తిపుణ్యం ప్రసిద్ధంచ మహాపాతకనాశనం l భూతప్రేత పిశాచానాం వేతాల బ్రహ్మరక్షసాం ll 84 ll

మహతాం చైవరోగాణాం తీర్థంత న్నాశకం స్మృతం l సుతమాదాయగచ్ఛత్వం తత్తీర్థం సేతుమధ్యగం ll 85 ll

ప్రయతః స్నాపయసుతం తీర్థేపాపవినాశ##నే l స్నానేన త్రిదినంతత్ర బ్రహ్మరక్షవినశ్యతి ll 86 ll

నైవోపాయాంతరంతస్య వినాశేవిద్యతేభూవి l తస్మాచ్ఛీఘ్రం ప్రయాహిత్వం రామసేతుం విముక్తిదం ll 87 ll

తత్ర పాపవినాశాఖ్యతీర్థే స్నాపయతేసుతం l మావిలంబంకురుష్వాత్ర త్వరయాయాహీవైద్విజ ll 88 ll

ఇత్యుక్తః సద్విజో7గస్త్యం ప్రణమ్యభువిదండవత్‌ l అనుజ్ఞాతశ్చతేనాసౌ ప్రయ¸° గంధమాదనం ll 89 ll

తాll ఆ పిల్లవాని తండ్రి భక్తితో మునికి సమస్కరించి, తన కొడుకు చేష్టలను ఆతనికి నివేదించాడు (71)అగస్త్యమునితో ఆ బ్రాహ్మణుడు ఇట్లా అన్నాడు. ఓ బ్రహ్మ! ఈ నాకుమారుడు బ్రహ్మరక్షస్సుచేపట్టుబడ్డాడు (72)ఆపిల్లవానికి సుఖం లేకుండా పోతోంది . దయా దృక్కులతో ఆతనిని రక్షించండి, పితరుల ఋణవిముక్తి కొరకు నాకు మరోకుమారుడు కూడాలేడు (73)ఓ కుంభజ! ఈతని పీడానివృత్తికొరకు ఉపాయం చెప్పండి. నీతో సమానుడైన తపఃశీలుడు ముల్లోకములలో మరొకడు లేడు (74) శివభక్తులలో నీవు మొదటివాడివి . ఈ మాట మహర్షులు చెప్పారు. నీవుకాక నా పుత్రునకు దీని నుండి రక్షకుడు మరొకడు లేడు (75)తండ్రి మీద దయ చూపండి (నామీద) సధువులు దయాశీలురుగదా. శ్రీ సూతులిట్లనిరి -ఈ విధమగా బ్రాహ్మణుడు చెప్పగా కుంభజుడు కొంతసేపు ధ్యానంలో ఉన్నాడు (76)చాలాసేపు ధ్యానించి పిదప బ్రాహ్మణునతో ఇట్లా అన్నాడు.అగస్త్యుని వాక్కు- ఓమహామతి! ఈ పిల్లవాడు పూర్వజన్మలో నీకుమారుడే (77)సుమతి అనుపేరుగల బ్రాహ్మణుడు తన బుద్ధిని శూద్రునికిచ్చాడు. వైదికకర్మలనన్నిటిని ఈతడుపదేశించాడు (78) అందువల్ల ఈతడు నరకములను కల్పకోటి సహస్రముల కాలము అనుభవించి వాని చివర ఈతడు భూమిపై స్థావర యోసులలో జన్మించాడు (79)ఇప్పుడు కర్మశేషం వల్ల నీకుమారుడు బ్రాహ్మణుడైనాడు. యముడు ఇక్కడికి పంపగా వచ్చి బ్రహ్మరక్షస్సుతో పట్టుబడ్డాడు (80)పూర్వజన్మలో చేసిన కౄరపాతకంవల్ల పట్టుబడ్డాడు. బ్రహ్మరక్షనాశనం కొరకు నీకు ఉపాయం చెప్తాను (81)శ్రద్ధతో కూడివిను. మనస్సు సమాధానపరచుకో. దక్షిణ సముద్రంలో సేతురూపమైన పెద్ద పర్వతముంది (82)దేవతలతో సేవింపబడుతూ పవిత్రమైనది ఆగంధమాదన పర్వతము . దానిపై భాగంలో పాపవినాశనమనే తీర్థం ఉంది . (83)అది పుణ్యప్రదము ప్రసిద్ధమైనది . పాతకముల నశింపచేసేది . భూతప్రేత పిశాచములకు వేతాల బ్రహ్మరక్షస్సులకు చెందిన పాపనాశకము (84)గొప్ప రోగములను నశింపచేసేది ఆ తీర్థము. సేతు మధ్యంఉన్న ఆ తీర్థమునకు నీవు నీకుమారుని తీసుకొని వెళ్లు (85)పాపవినాశన తీర్థమందు నీకొడుకును ప్రయత్న పూర్వకంగానైనా స్నానం చేయించు. మూడురోజులు అక్కడ స్నానం చేస్తే బ్రహ్మరక్షస్సు నాశానమౌతుంది . (86)దాని నాశనంకు భూమిపై మరో ఉపాయం లేదు. అందు వల్ల ముక్తినిచ్చే రామసేతువునకు నీవు త్వరగా వెళ్ళు(87) అక్కడ పాపవినాశం అనే పేరుగల తీర్థంలో నీకొడుకును స్నానం చేయించు . ఇక్కడ ఆలస్యం చేయకు. ఓ బ్రాహ్మడ! తొందరగా వెళ్ళు (88) అని అగస్త్యునితో చెప్పాడ్డ ఆ బ్రాహ్మణుడు ఆతనికి దండమువలె నమస్కరించి అనుజ్ఞ తీసుకొని గంధమాదనమునకు ఈతడు వెళ్ళాడు. (89)

మూll సుతేనసాకం విప్రేంద్రో గత్వా పాపవినాశనం ! సంకల్పపూర్వం సంస్నాప్యదినత్రయ మసౌసుతం ll 90 ll

సస్నౌస్వయంచవిప్రేంద్రాః పితా పాపవినాశ##నే l అథతస్యసుతః తత్రవిముక్తో బ్రహ్మరక్షసా ll 91 ll

సమజాయతనీరోగః స్వస్థః సుందర రూపథృక్‌ l సర్వసంవత్సమృద్ధో7సౌ భూక్తా భోగాననే కశః ll 92 ll

దేహాంతే ప్రయ¸°ముక్తిం స్నానాత్‌ పాపవినాశ##నే l పితాపి తత్రస్నానేన దేహాంతే ముక్తి మాప్తవాన్‌ ll 93 ll

తేనోపదిష్టోయః శూద్రః సభుక్త్వా నరకాన్‌ క్రమాత్‌ l అనేకాసుజనిత్వాచకుత్సితా స్వపియోనిషు ll 94 ll

గృధ్రజన్మాభవత్‌ పశ్చాత్‌ గంధమాదన పర్వతే l సకదాచిత్‌ జలంపాతుం తీం% పాపవినాశ##నే ll 95 ll

సమాగతః పపౌతోయం పిషిచేచాత్మనస్తనుం l తదైవ దివ్యదేహ ః సన్‌ సర్వాభరణ భూషితః ll 96 ll

దివ్యమాల్యాంబరధరో రక్తచందన రూషితఃl దివ్యం విమానమారుహ్య శోభితః ఛత్రచామరైః ll 97 ll

ఉత్తమస్త్రీ పరివృతః ప్రయయాపమరాలయం ll ll 98ll (97 1/2)

శ్రీసూత ఉవాచ-

ఏవం ప్రభవమేత ద్త్వెతీర్థం పాపవినాశనం l స్వర్గదం మోక్షదం పుణ్యం ప్రాయశ్చిత్తకరంతదా ll 98 ll

బ్రహ్మ విష్ణు మహెశానైః సేవితం సురసేవితం ll 99 ll

పాపానాం నాశనాద్విప్రాః పాపనాశాబిధం హితత్‌ l శ్రేయోర్థీపురుషస్తస్మాత్‌ స్నాయాతే పాపవినాశ##నే ll 100 ll

ఇత్థం రహస్యంప కథితం మునీంద్రాఃl తద్త్వేభవం పాపవినాశసస్య

యత్రాభిషేకాత్‌ సహసావిముక్తౌ l ద్విజశ్చశూద్రశ్చ వినింద్యకృత్యౌ ll 101 ll

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయా తృతీయే బ్రహ్మఖండే సేతు మహాత్మ్యే గంధమాదన ప్రశంసాయాం పాపవినాశ ప్రభావ కథనం నమదశ##మె7ధ్యాయః ll 10ll

తాll విప్రేంద్రుడు కొడుకుతో పాటు పాపవినాశనమునకు పోయి సంకల్ప పూర్వకముగా మూడు రోజులు కొడుకును స్నానం చేయించి (90)పాపవినాశమునందు తండ్రి స్వయంగా స్నానం చేసినాడు. ఆతని కుమారుడు బ్రహ్మరక్షస్సునితో విముక్తుడై (91)రోగరహితుడై, ఆరోగ్యవంతుడై సుందరరూపధారియై అవిర్భవించాడు. సర్వసంవత్సమృద్ధుడై అనేక భోగమలను అనుభవించి (92)పాపవినాశస్నానం వల దేహాంతమందు ముక్తిని పొందాడు తండ్రికూడా అక్కడ స్నానం చేయటం వల్ల దేహాంతమందుముక్తిని పొందాడు (93)అతనితో ఉపదేశం పొందిన ఆ శూద్రుడు క్రమమగా నరకములను అనుభవించి కుత్సితమైన యోసులందు అనేకమైన వాటిలో జన్మించి (94)గృధ్రజన్మపొందాడు. పిదప గంధమదన పర్వతమందు, పాపవినాశన తీర్థమందు ఒకసారి నీరు తాగటానికి వచ్చి (95) నీరు త్రాగాడు. తన శరీరాన్ని తడుపుకొన్నాడు. వెంటనే దివ్య దేహధారియై, అన్ని ఆభరణములతో అలంకరింపబడి (96) దివ్యమాలలు వస్త్రములను ధరించి రక్తచందనము పూసుకొని దివ్య విమానాన్ని అధిరోహించి, ఛత్రాచామరములతో శోభితుడై (97)ఉత్తమ స్త్రీలతో చూట్టబడి స్వర్గలోకమునకు వెళ్ళాడు(98)శ్రీ సూతులిట్లనిరి-ఇటువంటి ప్రభావము కలదిఈ తీర్థము పాపవినాశతీర్థము స్వర్గాన్నిచ్చేది, మోక్షాన్నిచ్చేది పుణ్యప్రదమైంది ప్రాయశ్చిత్తకరమైనదికూడా . బ్రహ్మవిష్ణు మహేశ్వరులతో సేవించబడేది దేవతలతో సేవించబడేది (99) పాపములను నాశనం చేయటంవల్ల పాప నాశమని దానికి పేరు. శ్రేయస్సు కోరుకునే నరుడు పాప వినాశనంలో అందుకే స్నానం చేయాలి . (100)ఈ విధముగా పాప వినాశనము యొక్క రహస్యమైన వైభవమును చెప్పాను . నింద్యకృత్యములు గల బ్రాహ్మణుడు, శూద్రుడు అక్కడ స్నానం చేసి తొందరగా ముక్తులైనారు. అని శ్రీ స్కాందమహాపురాణమందు ఎనుబది ఒక్కవేల సంహితయందు మూడవధైన బ్రాహ్మండమందు సేతు మాహాత్మ్యమందు గంధమాదన ప్రశంస యందు పాపవినాశ ప్రభావకథన మనునది పదవ అధ్యాయము . (10)

Sri Scanda Mahapuranamu-3    Chapters