Sri Matsya Mahapuranam-1    Chapters   

సప్తనవతితమో7ధ్యాయః.

సజ్క్రాన్తుద్యాపనవ్రతమ్‌.

నన్దికేశ్వరః: అథాత స్సమ్ప్రవక్ష్యామి సఙ్క్రాన్తుద్యాపనంపరమ్‌ l

యదక్షయం వరే లోకే సర్వకామఫలప్రదమ్‌. 1

విషువే వా7యనేచాపి సఙ్క్రాన్తివ్రత మాచరేత్‌ l పూర్వేద్యు రేకభుక్తేన దన్తధావనపూర్వకమ్‌. 2

సఙ్క్రాన్తివాసరే ప్రాప్తే తిలైస్స్నానం సమాచరేత్‌ l

రవిసఙ్క్రమణ భూమౌ చన్దనేనాష్టపత్రకమ్‌. 3

పద్మం సకర్ణికం కుర్యా త్తస్మి న్నావాహయే ద్రవిమ్‌ l

ర్ణికాయాం న్యసే త్సూర్య మాదిత్యం పూర్వత స్తతః. 4

నమ స్సప్తార్చిషే యామ్యే7ర్యవ్ణు మృఙ్మణ్డలాయచ l తత స్సవిత్రే వారుణ్య మారుతే తపనాయవై. 5

మార్తాణ్డ ముత్తరే విష్ణుమైశాన్యాం విన్యసే త్తతః l గన్ధమాల్యఫలై ర్భక్ష్యై స్థ్సణ్డిలే పూజయేత్తతః. 6

ద్విజాయ సోదకుమ్భంతు ఘృతపాత్రం హిరణ్మయమ్‌ l కమలంచ యథాశక్త్యా కారయిత్వా నివేదయేత్‌. 7

చన్దనోదకపుషై#్పశ్చ దేవాయార్ఝ్యం న్యసే ద్భువి l విశ్వాయ విశ్వరూపాయ విశ్వధామ్నే స్వయమ్భువే. 8

నమో7నన్తాయ ధాత్రేచ యజుషాం పతయే నుమఃl అనేన విధినా సర్వం మాసి మాసి సమాచరేత్‌ . 9

సంవత్సరాన్తే ఘృతపాయసేన సన్తర్ప్య వహ్నిం ద్విజపుజ్గవాంశ్చ l కుమ్భాన్పున ర్ద్వాదశ##ధేనుయుక్తా న్త్సరత్నహైరణ్మయపద్మయుక్తా&. 10

పయస్వినీ శ్శీలవతీశ్చ దద్యా ద్ధేమాగ్రశృజ్గాశ్చ ఖురైశ్చ రౌప్యాః l గా స్సప్త పఞ్చాథ సంకాస్యదోహ మాల్యామ్బరా వా చతురో7ప్యశక్తః. 11

దౌర్గత్యయుక్తః కపిలా మథైకాం నివేదయే ద్ర్బాహ్మణపుఙ్గవాయ l హైమీంచ దద్యా త్పృథివీ మశేషా మాకార్య రౌప్యా మధవాపి తామ్రామ్‌. 12

పైష్టీ మశక్తస్తు తిలై ర్విధాయ సౌవర్ణ ¡సూర్యేణ సమం ప్రదద్యాత్‌ l న విత్తశాఠ్యం పురుషో7త్ర కుర్యా త్కుర్వ న్నధో యాతి న సంశయో7త్ర. 13

యావ న్మహేన్ద్ర ప్రముఖాచలేన్ద్రాః పృథ్వీచ సప్తాబ్ధియుతాచ యావత్‌ l తావ త్స గన్ధర్వగణౖ రశేషై స్సమ్పూజ్చ్యతే నారద నాకపృష్ఠే. 14

తతస్తు కర్మక్షయ మాప్య సప్తద్వీపాధిప స్స్యాత్కులశీలయుక్తః l సృష్టేర్ముఖే7వ్యఙ్గవవు స్సభార్యః ప్రభూతపుత్త్రాన్వయ lవన్దితాజ్ఝ్రిః. 15

ఇతి పఠతి శృణోతివా7థ భక్త్యా విధిమఖిలం రవిసఙ్క్రమేఘ పుణ్యమ్‌ l మతిమపిచ దదాతి సో7పి దేవై రమరపతే ర్భవనే7భిపూజ్యతే చ. 16

ఇతి శ్రీమత్స్యమహాపురాణ సఙ్క్రాన్త్యుద్యాపనవ్రతకథనం నామ సప్తనవతితమో7ధ్యాయః.

తొంబది ఏడవ అధ్యాయము.

సంక్రాంత్యుద్యాపన వ్రతము.

ఇక ఇప్పుడు సంక్రాంత్యుద్యాపన వ్రతమును తెలిపెదను. అది మేలయినది. ఇహమున సర్వకామ ఫలప్రదము; పరలోకమున అక్షయ ఫలదము. విషువము (రాత్రింబగళ్ళు సమముగనుండు దినము) నందుకాని అయన పుణ్యకాలము లందుగాని దీని నాచరించవలెను. ముందటి దినమున ఏక భుక్తముచేసి గడపి వ్రతదినమున దంత ధావనమయిన పిమ్మట తిలలతో (తిలలపిండి నూనెలతో) స్నానమాడవలెను. తదుపరి (గోమయముతో అలికిన) భూమిపై - చందనముతో అష్టదళ పద్మమును కర్ణికతోకూడ లిఖించి దానియందు రవినావాహనము చేయవలెను. కర్ణికయందు 'సూర్యాయ నమః' తూర్పున 'ఆదిత్యాయ నమః' ఆగ్నేయమున'సప్తార్చిషే నమః' దక్షిణమున 'అర్యవ్ణుె నమః' నైరృతమున 'ఋఙ్మండలాయ నమః' అని వ్రాయవలెను. తరువాత ఆ స్థండిలమునందు గంధమాల్యఫల భక్ష్యములతో రవినర్చించవలెను బ్రాహ్మణునకు ఉద కుంభమును ఘృత పాతమును సువర్ణకమలమును యథాశక్తిగ దానమీయవలెను. చందనోదక కుసుమములతో నేలపై రవి కర్ఝ్యము విడువవలెను. (అర్ఝ్య మంత్రార్థము); ''విశ్వుడు విశ్వరూపుడు విశ్వధాముడు స్వయంభువు అనంతుడు ధాత యజుస్సులకు అధిపతి అగు రవికి నమస్కారము.'' (సర్వము తానైనవాడును అన్నిటియందును తాను ప్రవేశించి యున్నవాడును విశ్వుడు; ప్రతియొకదాని రూపమును ప్రపంచ రూపమును తానైయున్నవాడు విశ్వరూపుడు; ప్రతియొక తేజోరూప తత్త్వమును తానైయున్నవాడు విశ్వధాముడు; తనకుతానై జనించినవాడును తనకుతానై మరియొకరితో పనిలేకయే నిలిచియున్నవాడు స్వయంభువు; అంతము లేనివాడు అనంతుడు; సర్వమును నిర్మించువాడు ధాత; యజ్ఞములను ఆచరించుటకుపయోగించు మంత్రములు యజుస్సులు: యజ్ఞములనాచరించుటవలని ఫలితము హిరణ్య గర్భోపాసనా ఫలితము అగు సూర్యలోకప్రాప్తియే; కావున రవి యజుస్సులకు అధిపతి.)

__________________________________________________________________________

¡శూర్పేణ lవన్దితాగ్నిః.

ఈవిధానమున ప్రతి మాసమునందును ప్రత్యంశమును ఆచరించవలయును. సంవత్సరాంతమున నేతి పాయసముతో (హోమముతో) అగ్నిని (భోజనములతో) ద్విజపుంగవులను సంతృప్తుల జేయవలెను. పండ్రెండు కడవలను పండ్రెండు రత్న (ఖండ)ములతో కూడ పండ్రెండు బంగారు పద్మములను బంగరు కొమ్ముల కొనలు వెండి గిట్టలు పాలు పిదుకుటకు కంచు పాత్రలు మంచి శీలము కలిగి పూలతో వస్త్రములతో అలంకరించియున్న పండ్రెండు పాడి ఆవులను శక్తి లేనిచో నాలుగు కాని ఒకటికాని ఇట్టి ఆవులను బ్రాహ్మణులకు వేరు వేరుగా దాన మీయవలెను. శక్తి ననుసరించి బంగారుతోనో వెండితోనో రాగితోనో నూవుల పిండితోనో చేసిన భూ ప్రతిమను కూడ బంగారు రవి ప్రతిమతోపాటు ఈయవలెను. ధనము విషయమున శాఠ్యము (కొంటె తనము) చేయరాదు; చేసినచో అధోగతి చెందును.

ఇది ఇట్లు చేసినవాడు నారదా! మహేంద్రాది పర్వతములును సప్తద్వీప సప్త సముద్రాన్విత పృథివియు ఉన్నంతవరకు స్వర్గమున అశేష గంధర్వ గణముల పూజలనందుకొనుచు సుఖించును. పిమ్మట పుణ్యక్షయము కాగా భూమిపై కులశీలయుక్తుడగు సప్తద్వీపాధిపతిగా జన్మించును. మరల సృష్టికి ఆదియందును అవికలాంగుడు యోగ్యులగు దారపుత్త్రులు మంచి వంశము కలిగి జన్మించి ఎల్లరు తన పాదములకు నమస్కరించుచుండ సుఖించును.

ఈ పుణ్యకరమగు రవి సంక్రాంత్యుద్యాపన వ్రతమును చదివినను వినినను ఇతరులకు వినిపించి తెలిపినను అట్టి వారును ఇంద్ర భవనమున దేవతల పూజలనందుకొనుచు ఆనందింతురు.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున సంక్రాంత్యుద్యాపన వ్రతమాహాత్య్మ కథనమను

తొంబది ఏడవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters