Sri Matsya Mahapuranam-1    Chapters   

అష్టోశీతితమో7ధ్యాయః.

ఘృతపర్వతదానమ్‌.

ఈశ్వరః: అథాత స్సమ్ర్పదక్ష్యామి ఘృతాచల మనుత్తమమ్‌ l

తేజోమయం ఘృతం దివ్యం మహాపాతకనాశనమ్‌. 1

వింశత్యా ఘృతకుమ్భానా ముత్తమ స్స్యద్ఝృతాచలః l

దశభి ర్మధ్యమః ప్రోక్త స్త్వధమః పఞ్చభి స్స్మృతః. 2

అల్పవిత్తో7పి కుర్వీత ద్వాభ్యా మిహ విధానతఃl విష్కమ్భపర్వతాం స్తద్వ చ్చతుర్భాగేన కల్పయేత్‌ . 3

శాలితణ్డులపాత్రాణి కుమ్బోపరి నివేదయేత్‌ l కారయే త్సంహతా నుచ్చా న్యథాశోభం విధానతః. 4

వేష్టయే చ్ఛుక్లవాసోభి రిక్షుదండఫలాదిభిః l ధాన్యపర్వతవ త్సర్వం విధాన మిహ పఠ్యతే. 5

అధివాసనపూర్వంతు తద్వద్ధోమం సురార్చనమ్‌ l ప్రభాతాయాంతు శర్వర్యాంగురవే తన్ని వేదయేత్‌ . 6

విష్కమ్భపర్వతా స్తద్వ దృత్విగ్భ్య శ్శాన్తమానసః l

సంయోగా ద్ఝృత ముత్సన్నం యస్మా దమృతతేజసః . 7

తస్మాద్ఝృతార్చి ర్విశ్వాత్మా ప్రీయతా మత్ర శఙ్కరఃl

యస్మాత్తేజోమయం బ్రహ్మా ఘృతే తద్వ ద్వ్యవస్థితమ్‌. 8

ఘృతరూపేణ తస్మా త్త్వం పాహినః పర్వతా7నిశమ్‌l

అనేన విధినా యస్తు దద్యా ద్ఝృతమయం గిరిమ్‌. 9

మహాపాతకయుక్తోపి లోక మాప్నోతి శాఙ్కరమ్‌ lహంససారసయుక్తేన కిజ్కిణీజాలమాలినా. 10

విమానే నాప్సరోభిశ్చ సిద్ధవిద్యాధరై ర్వృతః l విహరే త్పితృభి స్సార్థం యావదాభూతసవ్ల్పువమ్‌ . 11

ఇతి శ్రీమత్స్యమహాపురాణ ఘృతాచలదానమాహాత్య్మ కథనం నామాష్టాశీతితమో 7ధ్యాయః.

ఎనుబది ఎనిమిదవ అధ్యాయము.

ఘృత పర్వత దానము.

ఈశ్వరుడు నారదునకు ఇట్లు చెప్పెను: ఇక మీదట ఘృతాచల దాన విషయము తెలిపెదను. ఇది సర్వోత్తమము. ఘృతము (నేయి) దివ్యమయిన పదార్థము; తేజోమయము; మహాపాతక నాశనము. దీనకై శక్తిననుసరించి ఇరువదికాని పదికాని ఐదుకాని కడవలనేయి కావలెను. శక్తి హీనులు రెండు కడవల నేతితోనైన చేయవచ్చును. మొత్తము నేతిలో నాలుగవ వంతుతో విష్కంభ పర్వతములను చేయవలెను. కుంభములపై మంచి తెల్లని బియ్యపుకడవల నుంచవలెను. వాటిని దగ్గరగా చేర్చి ఎత్తుగా నుండునట్లు చక్కగా అందముగా యథా విధానముగా ఆమర్చి తెల్లని వస్త్రములతో చెరకు గడలతో పండ్లతో కప్పుటయు చుట్టుటయు చేయవలెను. ధాన్య పర్వత విషయమునందువలెనే అధివాసమును దేవతౌ పూజను జరిపి ఉదయమున ఆచార్యునకు( పురోహితునకు) అవి సమర్పించవలెను. పైవలెనే విష్కంభ పర్వతములను ఋత్విక్కులకీయవలెను. (మంత్రము:) ''అమృతపు తేజపు సంయోగముచే ఘృతము (నేయి) ఉత్పన్నమయినది. కావున అమృత రూపుడును ఘృతతేజస్సే కిరణములుగా గలవాడును విశ్వరూపుడునగు శంకరుడు ఈ వ్రతముచే ప్రీతుడగుగాక ! తేజోమయమగు బ్రహ్మతత్త్వము ఘృతమునందే నిలిచి యున్నది . అట్టి ఘృతపు పర్వతమా! నన్ను నీవెల్లప్పుడును రక్షించుము.'' అని ఈ విధానముతో ఘృత పర్వత దానముచేసినవారెంటతి మహాపాతకులైనను పాపములు నశించి శంకరలోకము నందుదురు. హంసలు బెగ్గరులు (తెల్లని కొంగ జాతి నీటి పక్షులు) మ్రోయుచుండ చిరు గజ్జెల గుంపుల మాలలతో శోభించు విమానముపై అప్సరలు సిద్ధులు విద్యాధరులు తను కొలుచుచుండ పితృదేవతలతోకూడి కల్పాంతము వరకు విహరింతురు.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున ఘృత పర్వత దానమాహాత్మ్య కథనమను ఎనుబది ఎనిమిదవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters