Sri Matsya Mahapuranam-1    Chapters   

షడశీతితమో7ధ్యాయః.

తిలపర్వతదానమ్‌.

ఈశ్వరః : అతఃపరం ప్రవక్ష్యామి తిలశైలం విధానతః l త్రత్పదానపరో యాతి విష్ణులోక మనుత్తమమ్‌. 1

ఉత్తమో దశభిర్ద్రోణౖ ర్మధ్యమః పఞ్చభి ర్మతః l త్రిభిః కనిష్ఠో విప్రేన్ద్ర తిలశైలః ప్రకీర్తితః. 2

పూర్వవ చ్చాపరా న్త్సర్వా న్విష్కమ్భా నభితో గిరీ& l దానమన్త్రం ప్రవక్ష్యామి యథావ న్మునిపుఙ్గవ. 3

యస్మా న్మధువధే విష్ణో ర్దేహదథ సముధ్బవాః l తిలాః కుశాశ్చ మాషాశ్చ తస్మాచ్ఛన్నో భవ త్విహ . 4

హవ్యకవ్యేషు యస్మాచ్చ తిలా ఏవాభిరక్షణమ్‌ l భవా దుద్ధర శైలేన్ద్ర తిలాచల నమోస్తు7తే. 5

ఇత్యామంత్ర్యచ యో దద్యా త్తిలాచల మనుత్తమమ్‌ l సవైష్ణవపదం యాతి పునరావృత్తి దుర్లభమ్‌. 6

ధీర్ఝమాయు రవాప్నోతి పుత్త్రవత్త్వంచ మానవః l పితృభి ర్దేవగన్ధర్వైః పూజ్యమానో దివం వ్రజేత్‌ . 7

ఇతి శ్రీమత్స్యమహాపురాణ తిలపర్వతదామాహాత్య్మకథనం

నామ షడశీతితమో7ధ్యాయః.

ఎనుబది ఆరవ అధ్యాయము.

తిలపర్వత దానము

ఈశ్వరుడు నారదునకు ఇట్లు చెప్పెను. ఇక మీదట తిలపర్వత దాన విధానమును తెలిపెదను. దీనినాచరించిన వారు సర్వోత్తమమగు విష్ణు లోకమును పొందుదురు. దీనికై పదికాని ఐదుకాని మూడుకాని ద్రోణముల తిలలు కావలెను. దీనియందు అన్ని యంశములును ధాన్య పర్వత దానమందమవలెనే. (దానమంత్రము.) శ్రీ మహా విష్ణువు మధు దానవుని వధించునపుడు ఆతని దేహమునుండి తిలలును కుశలును వినుములును జనించినవి . అట్టి తిలలు నాకు శాంతికలిగించు గాక! హవ్యకవ్య (దేవతా-పితృ దేవతా) కర్మములందు తిలలే అభిరక్షించునవి: అట్టి తిలల పర్వతమా! నన్ను సంసారమునుండి తరింపజేయుము. ఇట్లు ఆమంత్రించి (ఆ వాహనముచేసి) తిల పర్వత దానముచేయువాడు పునరావృత్తి రహితమగు విష్ణులోకమునుచేరి సుఖించును. ఇహలోకమునందును దీర్ఝాయువును పుత్త్రపౌత్త్రులను పొందును. పితరులును దేవతలును గంధర్వులును పూజించుచుండ స్వర్గమున సుఖించును.

ఇది శ్రీమత్స్య మహా పురాణమున తిల పర్వత దానమాహాత్మ్య కథనమను ఎనుబది ఆరవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters