Sri Matsya Mahapuranam-1    Chapters   

అశీతితమో7ధ్యాయః.

శుభస ప్తమీవ్రతమ్‌.

ఈశ్వరః : 

అథాన్యామపి వక్ష్యామి శోభనాం శుభస ప్తమీమ్‌ | యా ముపోష్య నరో భోగా న్ప్రాప్య దుఃఖా త్ప్రముచ్యతే. 1

పుణ్య చాశ్వయుజే మసి కృతస్నానజప శ్శుచిః| వాచయిత్వా తతో విప్రా నారభే చ్ఛుభస ప్తమీమ్‌. 2

కపిలాం పూజయే ద్భక్త్యా గన్ధమాల్యానులేపనైః | నమామి సూర్యసమ్భూతా మ శేషభువనాలయామ్‌. 3

త్వామహం శుభకల్యాణశరీరాం సర్వసిద్ధయే | అథ కృత్వా తిలప్రస్థం తామ్రపాత్రేణ సంయుతమ్‌. 4

కాఞ్చనం వృషభం కుర్యా ద్వస్త్రమాల్యగుడాన్వితమ్‌ | ఫలైర్నానావిధై ర్భక్ష్యై ర్ఘృతపాయససంయుతైః. 5

దద్వా ద్వికాల వేళాయా మర్యమా ప్రీయతామితి | పఞ్చగవ్యంతు సమ్ర్పాశ్య స్వ పే ద్భూమా మమత్సరః.

తతః ప్రభాతే సఞ్జాతే భక్త్యా స న్తర్పయే ద్ద్విజా& | అనేన విధినా దద్యా న్మాసిమాసి సదా నరః. 7

వాససీ వృషభం హైమం తద్వ ద్గోచన్దనం భ##వేత్‌ | సంవత్సరా న్తే శయన మిక్షుదణ్డగుడాన్వితమ్‌. 8

సోపధానకవిశ్రామ భాజనాసనసంయుతం | తామ్రపాత్రే తిలప్రస్థం సౌవర్ణవృషభం తథా. 9

దద్యా ద్వేదవిదే సర్వం వివస్వాన్ర్పీయతా మితి | అనేన విధినా విద్వా న్కు ర్యాద్య శ్శుభస ప్తమీమ్‌. 10

తస్య శ్రీ ర్వి మలా కీర్తి ర్భవే జ్జన్మనిజన్మని | అప్సరోగణగంధర్వైః పూ%్‌యమాన స్సురాలయే. 11

వసే ద్గణాధిపో భూత్వా యావదాభూతసవ్ల్పువమ్‌ | కల్పాదా వవతీర్ణస్తు స ప్తద్వీపాధిపో భ##వేత్‌. 12

బ్రహ్మహత్యాసహస్రస్య భ్రూణహత్యాశతస్య చ | నాశాయాల మిమాం పుణ్యాం పఠ్యతే శుభస ప్తమీమ్‌. 13

ఇమాం పఠే ద్య శ్శృణుయా న్మహూర్తం పశ్యే త్ర్పసఙ్గాదపి దీయమానమ్‌ |

సో7ప్యత్ర పర్వాఘవిముక్త దేహః ప్రాప్నోతి విద్యధరనాయకత్వమ్‌. 14

యావత్సమా స్సప్త నరః కరోతి య స్స ప్తమీ స్సప్త విధానయుక్తాః |

స స ప్తలోకాధిపతిః క్రమేణ భూత్వా పదం యాతి పరం మురారేః. 15

ఇతి శ్రీమత్స్యమహాపురాణ శుభస ప్తమీవ్రత కథనం నామాశీతితమో7ధ్యాధ్యాయః.

ఎనుబదవ అధ్యాయము

శుభ స ప్తమీ వ్రతము

ఈశ్వరుడు బ్రహ్మతో ఇట్లు చెప్పెను: ఉపవాస పూర్వకముగా ఆచరించినచో దుఃఖ విము క్తిని భోగములను కలిగించు శుభ స ప్తమీ వ్రతమును తెలిపెదను.

ఆశ్వయుజమాసము పుణ్యప్రదము. దాని శుక్ల స ప్తమినాడు స్నానజపములుచేసి శుచియై విప్రులచే పుణ్యాహ వాచనము చేయించవలెను. కపిలగోవును భ క్తి పూర్వకముగా గంధమాల్యాను లేపనముతో అర్చించవలెను. ''సూర్యుని వలన పుట్టినదియు సర్వ భువనములు నివాసస్థానముగా కలదియు శుభకల్యాణ శరీరము కలదియు అగు నీకు నమస్కారము.'' అని ఆ గోవును నమస్కరించవలెను. రాగి పళ్లెరములో కుంచెడు నూవులుపోసి వాని పై శ్వేతవస్త్రము వేసి వస్త్ర-మాల్య-గుడ-నానా విధ ఫల భక్ష్యఘృత పాయసములతో కూడ బంగారు వృషభ ప్రతిమనుంచి 'అర్యమా ప్రీయతామ్‌' 'రవి ప్రీతి నొందుగాక!' అనుచు సంధ్యాకాలమున విప్రునకు దాన మీయవలెను. ఆ పగ లుపవసించి పంచగవ్యమును ఆహారముగా తీసికొని రాత్రిని గడుపవలెను. మరునాటి యుదయము బ్రాహ్మణులకు భోజనములు పెట్టించి తానును భుజించవలయును. సంవత్సరము కాలము ఇట్లు చేసి వ్రతాంతమున ఈ చెప్పిన సామగ్రితోపాటు మంచమును పడకను

_______________________________________________

*విశ్వాత్మా

(సర్వ పరికములతోను) పాత్రలను ఆసనములను వేదవిదుడగు విప్రునకు 'వివస్వాన్‌ ప్రీయతామ్‌' 'రవి ప్రీతి నందుగాక! అనెడు మంత్రముతో దానము ఈయవలెను.

ఇట్లు చేయువాడు జన్మజన్మమునందును ఇహమున నిర్మలైశ్వర్యకీర్తులను పొంది వరమున స్వర్గమునందు అప్సరోగణ గంధర్వ గణములచే పూజలందుకొనుదు సుఖించి చివరకు దేవగణాధిపుడై కల్పాంతమువరకు ఉండి మరల కల్పాదియందు సప్త ద్వీపాధిపతియే జన్మించును. ఈ వ్రతకల్పమును చదివినందున కలిగిన పుణ్యము వేయి బ్రహ్మహత్యలను నూను భ్రూణ హత్యలను నశింపజేయును. (భ్రూణుడు-షడంగములతో వేదముల నధ్యయనము చేసిన విప్రుడు) దీనిని చదివినను ఇతరులకు తెలిపినను ముహూర్తకాలము ఈ వ్రతాచరణము చూచినను అట్టివాడు సర్వ పాప విముక్తుడై విద్యాధరనాయకుడగును.

దీనిని ఏడేండ్లు ఏడు వేరు వేరు విధానములతో ఆచరించిన వాడు క్రమముగా సప్తలోకములకుఅధిపతియై తుదకు ముక్తినందును.

ఇది శ్రీమత్స్యమహాపురాణము శుభ సప్తమీ వ్రత కథనమను ఎనుబదవ అధ్యాయము

Sri Matsya Mahapuranam-1    Chapters