Sri Matsya Mahapuranam-1    Chapters   

పంచస ప్తతితమో7ధ్యాయః.

విశోకస ప్తమీవ్రతమ్‌.

ఈశ్వరః : 

విశోకసప్తమీం తద్వ ద్వక్ష్యామి మునిపుఙ్గవ | యా ముపోష్య నరశ్శోకం న కదాచి దిహాశ్నుతే. 1

మాఖే శుక్లతిలై స్స్నాత్వా పఞ్చమ్యా ళుక్లపక్షతః | కృతామారః కృసరయా దన్తధావనపూర్వకమ్‌. 2

ఉపవాసవ్రతం కృత్వా బ్రహ్మచారీ భ##వే న్నిశి | తతః ప్రభాతే చోత్థాయ కృతస్నానజప శ్శుచిః. 3

కృత్వా తు కాఞ్చనం పద్మ మర్కాయేతి చ పూజయేత్‌ | కరవీరేణ రక్తేన రక్తవస్త్రయుగేన చ. 4

యథా విశోకం భువనం త్వయి చాదిత్య సర్వదా | తథా విశోకతా మే స్యాత్త్వద్భక్తిః ప్రతిజన్మని. 5

ఏవం సమ్పూజ్య షష్ఠ్యాం తు శక్త్యా సమ్పూజయే ద్ద్విజా& |

సుప్త్వా సమ్ర్పాశ్య గోమూత్ర ముత్థాయ కృతనైత్యకః. 6

సమ్పూజ్య విప్రా నన్నేన గుడపాత్రసమన్వితమ్‌ | తద్వస్త్రయుగ్మం పద్మం చ బ్రాహ్మణాయ నివేదయేత్‌.

అతై లలవణం భుక్త్వా సప్తమ్యాం మౌనసంయుతః | తతః పురాణశ్రవణం కర్తవ్యం బూతిమిచ్ఛతా. 8

అనేన విధినా సర్వ ముభయో రపి పక్షయోః | కుర్యా ద్యావ త్పున ర్మా ఘే శుక్లపక్షస్య సప్తమీమ్‌. 9

వ్రతాన్తే కలశం దద్యా త్సువర్ణకమలాన్వితమ్‌ |

శయ్యాం సోపస్కరాం దద్యా త్కపిలాం చ పయస్వినీమ్‌. 10

అనేన విధినా యస్తు విత్తశాఠ్యవివర్జితః | విశోకసప్తమీం కుర్యా త్స యాతి పరమాం గతిమ్‌. 11

యావజ్జన్మసహస్రాణాం సాగ్రం కోటిశతం భ##వేత్‌ |

తావ న్న శోకమమృతం సుఖం ప్రాప్నోతి మానవః. 12

యం యం ప్రార్థయతే కామం తం తం ప్రాప్నోతి పుష్కలమ్‌ |

నిష్కామః కురుతే యస్తు స పరం బ్రహ్మ గచ్ఛతి. 13

యః పఠే చ్ఛృణుయాద్వాపి విశోకాఖ్యాంచ చ స ప్తమీమ్‌ |

సో7పీన్ద్రలోక మాప్నోతి న దుఃఖీ జాయతే క్వచిత్‌. 14

ఇతి శ్రీమత్స్యమహాపురాణ విశోకస ప్తమీవ్రతకథనం నామ

పఞ్చస ప్తితమో7ధ్యాయః.

డెబ్బదియైదవ అధ్యాయము.

విశోక సప్తమీ వ్రతము.

ఈశ్వరుడిట్లనెను: మునిపుంగవా! ఇట్టిదేయగు విశోక సప్తమి విషయము చెప్పెదను: ఈ సప్తమినాడుపవాసమున ఎప్పుడును శోకమునందడు. మాఘశుక్ల పంచమినాడు దంతధావన పూర్వకముగా తిల (బూర్ణము-తైలము)లతో స్నానముచేసి పులగము మాత్రము తిని ఉపవసించి రాత్రియందు బ్రహ్మచర్యము పాటించవలయును. తెల్లవారి లేచి స్నాన జపములు చేసి శుచియై 'అర్కాయ నమః' అను మంత్రముతో ఎర్రని కరవీర పుష్పములతో రవిని పూజించి ఆయనకు ఎర్రని వస్త్ర ద్వయమునర్పించవలెను. ''మూడు లోకములకు విశోకత్వము (శోకము లేకపోవుట) కలిగించు ఆదిత్యా! నాకును విశోకత్వమును జన్మజన్మములందును నీయందు భక్తిని ప్రసాదింపుము.'' అను మంత్రముతో ప్రార్థించుచు షష్ఠినాడు రవిని పూజించి బ్రాహ్మణులను కూడ పూజించవలెను. ఆనాడు గోమూత్రము మాత్రము ఆహారముగా గడపి రాత్రి నిద్రించిలేచి సప్తమినాడుదయము నిత్యానుష్ఠానము ముగించుకొని విప్రుల నన్నదానపూర్వముగా ఆరాధించి ఆ వస్త్రద్వయమును బంగారు పద్మమును బ్రాహ్మణున కీయవలయును. మౌనవ్రతముతో తైలలవణ రహితముగా భుజించి పురాణ శ్రవణముతో ఆనాడు గడుపవలయును. ఇట్లు చేయుటచే సుఖమును ఐశ్వర్యమును కలుగును.

ఈ విధానమున అది మొదలు ప్రతి మాసమున పక్షద్వయమునను మరల మాఖశుక్ల సప్తమి వచ్చువరకు చేయవలయును. వ్రతాంతమున సువర్ణకమలముంచిన కలశమును అన్ని పరికరములతోడి మంచమును పాన్పును పాడి కపిల గోవును దానము చేయవలెను.

ఈ విధమున వి త్త శాఠ్యము (ధనలోభముతో కొంటెతనము) చేయక ఈ విశోక సప్తమీ వ్రతమును చేయు వాడు ఉత్తమ గతి చెందును. వేయినూరుకోట్ల (కోటి´1000´100) జన్ముల కాలము శోకరహితుడై అమృతత్వానందమును పొందును. కోరికతో చేసినవానికి కోరినదెల్ల సిద్ధించును. నిష్కాముడై చేసినవానికి పరబ్రహ్మ పదములభించును. దీనిని చదివినను వినినను ఇంద్రలోకమునందును. విశోకుడగును.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున విశోక సప్తమీ వ్రతకథనమను

డెబ్బదియైదవ యధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters