Sri Matsya Mahapuranam-1    Chapters   

పంచషష్టితమో7ధ్యాయః.

అక్షయతృతీయావ్రతమ్‌.

ఈశ్వరః : 

అథాన్యామపి వక్ష్యామి తృతీయాం సర్వకామదామ్‌ | యస్యాం దత్తం హుతం జప్తం సర్వం భవతి చాక్షయమ్‌. 1

వైశాఖశుక్లపక్షేతు తృతీయాయా ముపోషితః | అక్షయం ఫల మాప్నోతి సర్వస్య సుకృతస్యచ. 2

సా తథా బ్రమ్మణోపేతా విశేషేణతు పూజితా | తత్ర దత్తం హుతం జప్తం సర్వ మక్షయ ముచ్యతే. 3

అక్షయా న న్తతిస్తు స్యా త్తస్యాం సుకృత మక్షయమ్‌ | అక్షయైః పూజ్యతే విష్ణు స్తేన సాప్యక్షయా స్మృతా.

అక్షతైస్తు నర స్స్నాతో విష్ణో ర్దత్వా తథా7క్షతా&|

విప్రేషు దత్వా తానేవ తథాసక్తాం త్సుసంస్కృతా&. 5

తదన్నభు ఙ్మహాభాగ ఫల మక్షయ మశ్నుతే | ఏకామప్యుక్తవ త్కృత్వా తృతీయాం విధివ న్నరః. 6

ఏతా మనుతృతీయాయాం సర్వాసాంతు ఫలం లభేత్‌ |

తృతీయాయాం సమభ్యర్చ్య సోపవాసో జనార్దనమ్‌. 7

రాజసూయఫలం ప్రావ్య గతి మగ్ర్యాంచ విన్దతి. 7||

ఇతి శ్రీమత్స్యమహాపురాణ మత్స్యమనుసంవాదే అక్షయతృతీయా

వ్రతకథనం నామ పఞ్చషష్టితమో7ధ్యాయః.

అరువది ఐదవ అధ్యాయము

అక్షయ తృతీయా వ్రతము

ఈశ్వరుడు పార్వతికి ఇట్లు చెప్పెను: సర్వకామప్రదమగు మరియొక తృతీయా వ్రతమును చెప్పెదను. ఈ తృతీయా దినమున చేసిన దానము హోమము జపము ఏదియైనను అక్షయ ఫలప్రద మగును.

వైశాఖ శుక్ల తృతీయాతిథి బ్రహ్మదేవునితో చేరియుండునది. అందుచే విశేషించి పూజ్యమయినది. కనుక ఈనాడు ఉపవసించి ఏ పుణ్యకర్మ మాచరించినను అక్షయఫలము లభించును. ఈ తిథినాడు క్షయములేని శాశ్వతోపానరకులచే విష్ణువు పూజింపబడును. కావుననే దీనికి అక్షయ తృతీయ యని పేరు. ఈనాడు అక్షతోదకముతో స్నానముచేసి వాటిని విష్ణునిపై ఉంచి అర్చించి వాటిని చక్కగా సంస్కరించి బ్రామ్మణులకు దానముచేసి వాటి అన్నమునే తినినచో ఈ చెప్పిన ఫలము తప క లభించును.

ఇట్లు ఒక వైశాఖ శుక్ల తృతీయనాడైనను మానవుడు యథావిధిగా ఈ చెప్పినట్లు చేసి దాని తరువాత వచ్చు ప్రతి శుక్ల తృతీయయందును పండ్రెండు మాసముల శుక్ల తృతీయలందును ఉపవసించి విష్ణుని అర్చించినచో రాజసూయ యాగముచేసినంత ఫలమునంది ముక్తి నందును. (అక్షతలు అనగా ఏ మాత్రమును విరుగక శ క్తి తరుగక నిలిచియున్న బియ్యము-అవి వరి ధాన్యమునుండి కాని యవలనుండి కాని గోధుమలనుండి కాని తీసినవి కావచ్చును. ఇట్టి వరి బియ్యముతో కాని యవల గోధుమల పిండితో కాని సిద్ధపరచిన ఆహారము అక్షతాన్నము.)

ఇది శ్రీమత్స్య మహాపురాణమున అక్షయ తృతీయా వ్రత కథనమను అరువది ఐదవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters