Sri Matsya Mahapuranam-1    Chapters   

త్రిషష్టితమో7ధ్యాయః.

రసకల్యాణతీతీయావ్రతమ్‌

ఈశ్వరః : 

ఆథాన్యామపి వక్ష్యామి తృతీయాం పాపనాశనీమ్‌ | రసకల్యాణినీ మేతాం పురాకల్పవిదో విదుః. 1

మాఘమా సేతు సమ్ర్పాప్తే తృతీయాం శుక్లపక్షకే | ప్రాత ర్గవ్యేన పయసా తిలై స్స్నానం సమాచరేత్‌. 2

స్నాపయేన్మధునా దేవీం తథై వేక్షుర సేనచ | గన్ధోదకేనతు పునః పూజయే త్కుఙ్కుమేనవై. 3

దక్షిణాఙ్గాని సమ్పూజ్య తతో వామాని పూజయేత్‌ | లలితాయై నమో దేవ్యాః పాదం గుల్ఫంచ పూజయేత్‌.

జఙ్ఘాం జానుం తథేశాన్యై తథైవోరుం శ్రియై నమః | మదాలసాయైతు కటిమపర్ణాయై తథోదరమ్‌. 5

స్తనం మదనవాసిన్యై ప్రమదాయై చ కన్ధరామ్‌ | తథా భుజాగ్రం మాధవ్యై కమలాయై శుచిస్మితే. 6

భ్రూలలాటంచ రుద్రాణ్యౖ శఙ్కరాయై తథా7లకా& | మకుటం విన్ధ్యవాసిన్యై పునః కా ళ్యై తథా7లకా&.

మదనాయై లలాటంతు మోహనాయై పునర్భ్రువమ్‌ | నేత్రం చన్ద్రార్ధధారిణ్యౖ తుష్ట్యైచ వదనం పునః. 8

ఉత్కణ్ఠిన్యై నమః కణ్ఠ మమృతాయై నమః స్తనమ్‌ | అభయాయై నమోబాహుం విశోకాయై నమః కరమ్‌.

హృదయం మన్మథధ్రాయై పాటలాయై తథోదరమ్‌ | కటిం సురతవాసిన్యై తథోరుం త్ర్యమ్బకప్రియే.

జానుజఙ్ఘే నమో గౌర్యై గాయత్ర్యై గుల్ఫ మర్చయేత్‌ | ధరాధరాయై పాదంతు వివోకాయై నమశ్శిః. 11

నమో భవాన్యై కామిన్యై వాసుదేవ్యై జగచ్ఛ్రియై | ఆనన్దదాయై నన్దాయై సుభద్రాయై నమో నమః. 12

ఏవం సమ్పూజ్య విధివ ద్ద్విజదామ్పత్య మర్చయేత్‌ | భోజయిత్వా7న్నపానేన మధురేణ విమత్సరః. 13

సలడ్డుకం వారికుమ్భం శుక్లామ్బర యుగదర్వయమ్‌ | దత్వా సువర్ణకమలం గన్ధమాల్యై రథర్చయేత్‌. 14

ప్రీయతా మత్ర కుముదా గృహ్ణీయా ల్లవణవ్రతమ్‌ | అనేన విధినా దేవీం మాసిమాసి సమర్చయేత్‌. 15

అరువది మూడవ అధ్యాయము.

రసకల్యాణ తృతీయావ్రతము.

ఈశ్వరుడు పార్వతికి ఇట్లు చెప్పెను: పాపనాశకమగు మరియొక తృతీయా వ్రతమును తెలిపెదను. పురాణములందు రసకల్యానినీతృతీయావ్రతమని దీనికి పేరు.

మాఘ శుక్ల తృతీయా తిథినాడు ఉదయమున ఆవుపాలతోను నూవుల (నూవు పిండి-నూవులనూనె)తోను స్నానము చేయవలయును. దేవిని తేనెతో చెరకు రసముతో పన్నీటితో స్నానమాడించి కుంకుమముతో పూజించవలెను. పూజను పాదాది శిరో7ంతముగా మొదట కుడి అవయవములను తరువాత ఎడమ అవయవములను పూజించవలెను.

పూజామంత్రము: 1. లలితాయైనమః (దక్షిణ) పాదం పూజయామి: దక్షిణ గుల్ఫం పూజయామి; 1. ఈశాన్యై నమః-దక్షిణ జంఘాం పూజయామి; దక్షిణ జాను పూజయామి. 3. శ్రియైనమః-దక్షిణోరుం పూజయామి; 4. మదాలసాయై నమః దక్షిణ కటిం పూజయామి; 5. అపర్ణాయైనమః-దక్షిణోదరం పూజయామి; 6. మదనవాసిన్యైనమః దక్షిణ స్తనం పూజయామి; 7. ప్రమదాయైనమః దక్షిణ కంధరాం పూజయామి; 8. మాధవ్యైనమః దక్షిణ భుజాగ్రం పూజయామి; వామ భుజాగ్రం పూజయామి; 9. కమలాయైనమః దక్షిణ భ్రువం పూజయామి; వామభ్రువం పూజయామి; 10. చంద్రార్ధ ధారిణ్యౖనమః-దక్షిణనేత్రం పూయామి; వామనేత్రం పూజయామి; 11. తుష్ట్యైనమః-ముఖం పూజయామి; 12. ఉత్కంఠిన్యైనమః వామకంఠం పూజయామి; 13. అమృతాయైనమః-వామ స్తనం పూజయామి; 14. అభయాయై నమఃదక్షిణబాహుం పూజయామి; వామబాహుం పూజయామి; 15. విశోకాయైనమః దక్షిణకరం పూజయామి; వామకరం పూజయామి; 16. మన్మథ ధ్రాయైనమః - హృదయం పూజయామి; 17. పాటలాయైనమః-వామోదరం పూజ యామి; 18. సురత వాసిన్యైనమం-వామకటిం పూజయామి; 19. త్ర్యంబకప్రియాయై నమః వామోరుం పూజయామి; 20. గౌర్యైననుః-వామజాను-వామ జంఘాంచ పూజయామి; 21. గాయత్ర్యై నమః-వామగుల్ఫం పూజయామి; 22. ధరా ధరాయైనమః-వామపాదం పూజయామి; 23. విశోకాయైనమః«శిరః పూజయామి;

భవాని-కామిని-వాసుదేవి-జగచ్ఛ్రీ-ఆనందదా నందా-సుభద్రా-శబ్ద వాచ్చురాలగు దేవికి నమస్కారము; అని ఇట్లు యథావిధిగ దేవిని పూజించి విప్రదంపతులను ఆదరించవలెను. మత్సరము మొదలగు భావవికారము లేవియు లేకుండ చిత్తశుద్ధితో వారికి మధురములగు అన్న పానీయములను లడ్డులను ఉదక కలశమును రెండు తెల్లని వస్త్రములను ఈయవలయును. బంగారు కమలమును గంధమాల్యములను అర్పించి అర్చించవలయును. దానము నిచ్చునపుడు

__________________________________

« మూలములో అంగ పూజా మంత్రములకు కొన్నిటికి వామ దక్షిణాంగములకు వేరువేరుగా మంత్రమున్నది. కొన్ని టికిలేదు. లేని చోట్ల రెండు పార్శ్వములకును ఒకే మంత్రమును అనువాదకుడు ఇచ్చుట జరిగినది.

'కుముదా ప్రీయతామ్‌' అను మంత్రమును చెప్పవలెను. లవణ వ్రతమును (ఉప్పులేని ఆహారమును తినుట) పాటించవలెను. ఈ విధానముతో దేవిని ప్రతిమాసమునను అర్చించుచుండవలెను.

లవణం వర్జయే న్మాఘే ఫాల్గువే తు గుడం పునః| తవరాజం తథా చైత్రే వర్జ్యంతు మధు మాధవే. 16

పానకం జ్యేష్ఠమాసేతు తథాషాఢేతు జీరకమ్‌ | శ్రావణ వర్జయే తీక్షరం దధి భాద్రపదే తథా. 17

ఘృత మాశ్వయుజే తద్వ దూర్జే వర్జ్యం చ మాక్షికం | ధాన్యకం మార్గశీర్షేతు పౌషే వర్జ్యాతు శర్కరా. 18

వ్రతాన్తే కరకం పూర్ణం మాసేమాసే తు దాపయేత్‌ | దద్యా ద్ద్వికాలవేళాయాం భక్ష్యపాత్రేణ సంయుతాః.

లడ్డుకాశ్శోకవర్తీశ్చ సంయావ మథ పూరికాః | ఘాటికా ఘృతపూరాంవ్చ పిష్టాపూపాంశ్చ మణ్డకా&. 20

క్షీరం శాకంచ దధ్యన్న మిణ్డుర్యః శోకవర్జితః | మాఘాదిక్రమశో దద్యా దేతాని కరకోపరి. 21

కుముదా మాలతీ గౌరీ రమ్భా భద్రా జయా శివా | ఉమా రతీ సతీ తద్వ న్మఙ్గలా రతిలాలసా. 22

క్రమా న్మాఘాది సర్వత్ర ప్రీయతామితి కీర్తయేత్‌ | సర్వత్ర పఞ్చగవ్యంచ ప్రాశనం సముదాహృతమ్‌.

ఉపవాసీ భ##వే న్నిత్య మశక్తౌ నక్త మిష్యతే |

ఆయా మాసములందు విడువవలసిన ఆహారములు: మాఘమున లవనమును పాల్గునమున బెల్లమును చైత్రమున తవరాజమును (యవలు మొదలగు వానినుండి తీసిన చక్కెర) వైశాఖమున తేనెను-జ్యేష్ఠమున పానకమును ఆషాఢమున జీలకర్రను శ్రావణమున పాలను భాద్రపదమున పెరుగును అశ్వయుజమున నేతిని కార్తికమున పుట్ట తేనెను మార్గశిరమున ధనియాలను పుష్యమున చక్కెరను విడువవలెను.

వ్రత విధాన పూజ కాగానే ప్రతి మాసమునను నిండు కరకమును (గరిగ అనెడు ఒక విధమైన మట్టిపాత్ర) భక్ష్య పాత్రమును ఆనాటి సాయం సంధ్యా కాలమున దానము ఈయవలెను. ఎట్లనగా కరకముపైని భక్షపాత్రను ఉంచవలెను. ఆ భక్ష పాత్రయందు మాఘమాసమున లడ్డులు-ఫాల్గునమున శోకవర్తులు చైత్రమున సంయావము (గోధుమ, రవ్వను పాలతో చక్కెరతో ఉడికించిన వంటకము) వైశాఖమున పూరీలు జ్యేష్ఠమున ఘాటికలు ఆషాఢమున ఘృతపూరము (బాదుషా అని ఈనాటి పేరు) శ్రావణమున బూరెలు భాద్రపదమున మండిగలు (గోధుమతో చేయు పిండివంట) అశ్వయుజమున పాలు కార్తికమున ఆకుకూర మార్గశిరమున పెరుగన్నము పుష్యమున శోకములేని ఇండు అను వంటకము-ఇవి నింపవలెను. (వీటిలో శోకవ ర్తికలు-శోకము-ఇండు-ఘాటికలు అనునవి ఈనాడు అంతగా తెలియనివి. ఆయా దేశ భాగములలో వేరువేరు పేరులుండవచ్చును. పెద్దలవలన తెలిసికొనవలెను. తెలియనిచో వీటికి మారుగా మరేదైన మధుర పదార్థము ఉంచవచ్చును.)

దానము ఇచ్చునపుడు మాఘమున 'కుముదా ప్రీయతాం'- ఫాల్గుణమున 'మాలతీ ప్రీయతాం' చైత్రమున 'గౌరీ ప్రీయతాం' వైశాఖమున 'రంభా ప్రీయతాం' జ్యేష్ఠమున 'భద్రా ప్రీయతాం' ఆషాఢమున 'జయా ప్రీయతాం' శ్రావణమున 'శివా ప్రీయతాం' భాద్రపదమున 'ఉమాప్రీయతాం' ఆశ్వయుజమున 'రతిః ప్రీయతాం' కార్తికమున 'సతీ ప్రీయతాం' మార్గశిరమున 'మంగళా ప్రీయతాం' పుష్యమున రతిలాలసా ప్రీయతాం' అను మంత్రమును చెప్పవలెను.

అన్ని మాసములందును వ్రతదినమున పంచగవ్యము ఆహారముగా ఉపవాన ముండవలెను. శక్తి లేనివారు పగలు ఉపవసించి నక్తమున (రాత్రి కాగానే) భుజించవచ్చును.

వునర్మా ఘేతు సమ్ప్రాప్తే శర్కరాం కరకోపరి. 24

కృత్వాతు కాఞ్చనీం గౌరీం పఞ్చరత్నసమన్వితామ్‌ | హైమ మఙ్గుష్ఠమాత్రంచ సాక్షసూత్రకమణ్డలమ్‌.

చతుర్భుజా మిన్దుయుతాం సితనేత్ర పటావృతామ్‌ | తద్వ ద్గోమిథునం శుక్లం సుపర్ణాఢ్యం సితామ్బరమ్‌.

సవస్త్రభాజనం దద్యా ద్భవానీ ప్రీయతా మితి | అనేన విధినా యస్తు రసకల్యాణినీవ్రతమ్‌. 27

కుర్యా త్స సర్వపాపేభ్య స్తతక్షణాదేవ ముచ్యతే | నవార్బదసహస్రంతు న దుఃఖీ జాయతే నరః. 28

అగ్నిష్టోమసహస్రేణ యత్ఫలం త ద వాప్ను యాత్‌ | నారీవా కురుతే యాతు కుమారీవా వరాననే. 29

విధవావా వరాకీవా సాపి తత్ఫలభాగినీ | సౌభాగ్యారోగ్యసమ్పన్నా గౌరీలోకే మహీయతే. 30

ఇతి పఠతి య ఇత్థం య శ్శృణోతి ప్రసఙ్గా త్సకలకలుషముక్తః వార్వ లోక మేతి |

మతిమపిచ నరాణాం యో దదాతి ప్రియార్థం విబుధపతిజనానాం నాయక స్స్యా దమోఘః. 31

ఇతి శ్రీమత్స్యమహాపురాణ మత్స్యమనుసంవాదే రసకల్యాణినీ

తృతీయావ్రతకథనం నామ త్రిషష్టితమో7ధ్యాయః.

(ఇట్లు మాఘమాసము మొదలు పుష్యమాసము వరకు చేసిన తరువాత) మరల మాఘమాసము రాగానే ఈ చెప్పబోవు విధమున దానము చేయవలెను. బొటనవ్రేలి పరిమాణముతో బంగారు గౌరీ ప్రతీమ చేయించవలెను. దానికి పంచరత్నములు తాపటము చేయవలెను. జపమాలయు కమండలువును ప్రతిమకు చేతియందుండవలెను. చతుర్భుజములు శిరమున చంద్రరేఖ తెల్లని వస్త్రపు మేలిముసుగు ఉండవలయును. కరక(గరిగ)పాత్రలో చక్కెర పోసి పాత్రపై భాగమున ఈ గౌరీ ప్రతిమ నుంచవలెను. అట్లే గోమిథున (అవు-ఎద్దు) ప్రతిమను తెల్లని రంగుతో (వెండితో) చేయించి బంగారు అలంకారములు తెల్లని వస్త్రపు పైకప్పడముతో చేయించవలయును. వస్త్రములను పాత్రములను వీటికి తోడుగా చేర్చవలయును. ఇవి అన్నియును 'భవానీ ప్రీయతామ్‌' అను మంత్రముతో ఆచార్యునకు దానము చేయవలయును.

ఈ విధానముతో ఈ రసకల్యాణినీ తృతీయావ్రతమును చేయువాడు తతక్షణమున సర్వపాపములనుండి ముక్తడగును. తొమ్మిదివేల అర్బుదముల సంవత్సరముల కాలము ఏ దుఃఖముల నెరుగక సుఖించును. వేయి అగ్నిష్టోమముల వలన కలుగు ఫలము నందును. స్త్రీలలో కూడ కన్యగాని సువాసిని కాని విధవ కాని అమాయికురాలు కాని ఎవరు చేసినను ఇంత ఫలమును పొంది సౌభాగ్యారోగ్య సంపన్నయై గౌరీలోకమున ఆదరపాత్రమై సుఖించును.

దీనిని చదివినను నకల కలుషముక్తుడై గౌరీలోకము చేరును. ఉత్తమ జ్ఞానము పొందును. దేవతలకును నాయకుడై ఎల్లరకును అజయ్యు డగును.

ఇది శ్రీమత్స్య మమాపురాణమున రసకల్యాణినీ తృతీయావ్రతమను అరువది మూడవ ఆధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters