Sri Matsya Mahapuranam-1    Chapters   

ఏకోనషష్టితమో 7మధ్యాయః.

ఆరామప్రతిష్ఠావిధిః.

ఋషయః : 

పాదపానాం విధిం సూత! యథావ ద్విస్తరా ద్వద | విధినా కేన కర్తవ్యం పాదపోద్యాపనం ఋధై ః. 1

యేచ లోకా స్స్మృతా స్తేషాం తానిదానీం వదస్వ నః | యత్ఫలం లభ##తే ప్రేత్య (నభూమినతటాకిషు). 2

తత్సర్వం శ్రోతు మిచ్చామో వక్తు మర్హసి సువ్రత |

సూతః : పాదపానాం విధిం వక్ష్యే తథైవోద్యానభూమిషు. 3

తటాకవిధివ త్సర్వ మాసాద్య జగదీశ్వర | ఋత్విఙ్మండల సమార్భరా నాచార్యం స్థాపయేద్భధః. 4

బ్రాహ్మణా న్పూజయేత్తద్వ ద్దేమవస్త్రానులేపనైః | సర్వౌషధ్యుదకై స్సిక్త్వా విటపాన్తవిభూషితా& 5

వృక్షా న్మాల్యై రలఙ్కృత్య వాసోభి ర్వేష్టయేత్తతః సూచ్యా సౌవర్ణయా కార్యం సర్వేషాం కర్ణవేధనమ్‌. 6

అఞ్జనంచైవ దాతవ్యం తద్వద్దేమశలాకయా | ఫలాని సప్త చాష్టౌవా కలధౌతాని కారాయేత్‌. 7

ప్రత్యేకం సర్వవృక్షాణాం సప్తధాన్యధివాసయేత్‌ | సప్తధాన్యే స్థితాన్‌కృత్వా వస్త్రగన్ధానులేపనైః. 8

ధూపానుధూపితా న్ర్ఛేష్ఠాం స్తామ్రపాత్రై రధిష్ఠితాన్‌|

కుమ్భా న్త్సర్వేషు వృక్షేషు స్థాపయిత్వా నరేశ్వర. 9

సహిరణ్యా నశేషాంస్తా న్కృత్వా బలినివేచనమ్‌ | యథాస్వం లోకపాలానా మిన్ద్రాదీనాం విధానతః. 10

వనస్పతేశ్చ విధివ ద్దోమః కార్వో ద్విజాతిభిః| తతశ్శుక్లామ్బరధరాం సౌవర్ణకృతశేఖరామ్‌. 11

సకాంస్యదోహనాం స్వర్ణశృఙ్గాఢ్యాం చ సుశీలినీమ్‌| పయస్వినీం దృక్షమధ్యా దుత్సృజేద్గాముదజ్ముఖీమ్‌. 12

ఏబది తొమ్మదవ అధ్యాయము

ఆరామ ప్రతిష్ఠా విధానము-వృక్షొరోపణ మహిమము.

వృక్షములను నాటి ఉద్యానవనము (అరామము)లను ప్రతిష్టించు (ప్రజల వినియోగమునకై నిలుపు) శాస్త్ర విధానమును దాని వలన కలుగు ఫలమును తెలుపుమని మునులడగ సూతుడినట్లు చెప్పనారంభించెను: వినుడు . తటాక ప్రతిష్ఠా విధానమునందు వలెనే సర్వ సంభారములను సమకూర్చుకొనవలెను. ఋత్విక్కులను ఆచార్యుని అట్లే నియమించు కొనవలెను. అట్లే పూజాలంకరణ సామగ్రితో వారిని అలకంరించి పూజించవలెను.

ప్రతిష్ఠించ-ప్రజలకు దత్తము చేయ-బోవు ఉద్యానమునందలి వృక్షములను సర్వౌషధుల- సర్వసుగంధముల- జలములతో తడుపవలెను. కొమ్మల చివరలను పూలమాలలతో వస్త్రములతో అలంకరించవలెను. బంగారు తీగతో చెవులు కుట్టవలెను. బంగారు కడ్డీలతో కాటుక పెట్టవలెను. ఏడెనిమిది బంగారు ఫలములను చేయించవలెను. అన్ని చెట్లను సప్తధాన్యములయందు ఆదివానము (మిశ్రిత ధాన్యములందు నిలుపుట) చేయవలెను. వస్త్రములతో గంధాను లేపనములతో అలంకరించి పొగవేసి తామ్రపాత్రలందు నిలుపవలెను. అన్నిచెట్ల దగ్గరను (నీటితో) కడవలను బంగారును ఉంచి వాటి కన్నిటికి ఇంద్రాది దేవతలనుద్దేశించి బలిని నివేదించవలెను. వనస్పతి దేవతలకును విప్రులచే హోమము జరిపించవలెను. తెల్లని వస్త్రముతో కప్పినది బంగారు శిరోలంకారము కలది బంగారు కొమ్ములు కలది పాలు పిదుకుటకు కంచుపాత్ర కూడ కలిగినదియగు పాడియావును ఉత్తరాదియగు పాడియావును ఉత్తరాముఖముగా చెట్ల నడుమగా విడువవలెను.

తతో7భిషేకమన్త్రేణ వాద్యమఙ్గళగీతకైః| బుగ్యజుస్సామమన్త్రైశ్చ వారుణౖ రభిత స్తథ 13

తై రేవకుమ్బై స్స్నపనం కుర్యు | ర్బాహ్మణపుఙ్గవాః | స్నాతశ్శుక్లామ్బరధరో యజమానో 7భిపూజయేత్‌. 14

గోభి ర్విభవత స్సర్వా నృత్విజ స్తా స్త్సమాహితః | హేమసూత్రై స్సకటకై రఙ్గుళీయైః పవిత్రకైః. 15

వాసోభి శ్శయనీయైశ్చ తథోపస్కరపాదుకైః | క్షీరేణ భోజనం దద్యా ద్యావద్దినచతుష్ఠయమ్‌. 16

హోమశ్చ సర్షపైః కార్యో యవైః కృష్ణతిలైరపి | పాలాశసమిధ శ్శస్తా శ్చతుర్థే 7 హ్ని తథోత్సవః. 17

దక్షిణా చ పున స్తేభ్యో దేయా తత్ర స్వశ క్తితః| యద్వదిష్టతమం కించి త్తత్తద్దద్యా దమత్సరః. 18

ఆచార్యే ద్విగుణం దత్వా ప్రణిపత్య క్షమాపయేత్‌ | అనేన విధినా యస్తు కుర్యా ద్వృక్షోత్సవం బుధః. 19

సర్కా న్కామా నవాప్నోతి పదం చానస్త్య మశ్నుతే | యశ్చైకమపి రాజేన్ద్ర వృక్షం సంస్థాపయే న్నరః.

సోపి స్వర్గే వసేద్రాజన్‌ «యావదిన్ద్రశతత్రయమ్‌ | భూతాన్భావ్యాం శ్చ మనుజస్తారయోద్ద్రు మనసమ్మితా &.

పరమాం సిద్దిమాప్నోతి పునరావృత్తిదుర్లభామ్‌ | శృణుయాన్నిత్యం శ్రావయేద్వాపి మానవః 22

సోపి సమ్పూజితో దేవై ర్ర్బహ్మలోకే మహియతే. 22||

ఇతి శ్రీ మత్స్యమహావురాణ మత్స్యమభనుసంవాదే వృక్షారోపణ

మహాత్మ్యకథనం నామైకోనషష్టిత మో7ధ్యాయః.

తరువాత బ్రాహ్మణులు ఋగ్యజుస్సామ వేదములనుండి వరుణ దేవతాకములైన అభిషేక (స్నాన) మంత్రములతో మంగళవాద్య ధ్వనుల నడుమ యజమానుని స్నానము చేయించగా అతడు తెల్లని మడుగు వస్త్రములు ధరించి ఋత్విజులందరను శ్రద్దతో యథాశక్తిగా గోవులతో దక్షిణలతో బంగారుతో చేసిన చేతి మురుగులు ఉంగరములు పవిత్రములు వస్త్రములు సర్వసామగ్రితో కూడిన పరుపులు మంచములు పాదకలు - ఇట్టివానితో పూజించును. వారికి నాలుగు దినముల వరకు పాలతో భోజనము పెట్టవలెను. నాలుగు దినములును అవలతో యవలతో నల్లని నూవులతో వలాశ సమిధలతో హోమము చేయవలెను. నాలుగవ దినమున ఉత్సవము వేడుకలు జరుపవలెను. ఋత్విక్‌ బ్రాహ్మణులకు మరల యథాశక్తిగ దక్షిణలను తనకు తోచిన మరేదైన నీయవలెను. ఆచార్యు (ప్రధాన ఋత్విక్‌)నకు మాత్రము ఒక ఋత్విక్‌కు ఇచ్చినదానికి రెండింతలీయవలెను. అతనిని క్షమాపణము వేడుకొనవలెను.

ఈ విధానమున వృక్ష ప్రతిష్ఠోత్సవమును జరుపు వివేకికి అన్ని కోరికలు తీరును. అనంత ఫలము కలుగును. (ప్రజల నిమిత్తమయి) ఒక వృక్షము నాటినను అతడు ముగ్గురింద్రుల జీవితకాలము స్వర్గమందు సుఖించును. తనకు పూర్వపు- అనంతరపు తరములవారిని - తాను నాటిన చెట్లంత మందిని తరింపజేయును. పునరావృత్తి రహితమగు మోక్షమును పొందును.

ఈ కల్పమును వినిన - వినిపించిన -వాడు దేవతలచే పూజలందుకొనుచు బ్రహ్మలోకమున సుఖించును. ఇది శ్రీమత్స్యమహాపురాణమున వృక్షారోపణ మహాత్మః కథనమను ఏబది తొమ్మిదవ యధ్యాయము.

__________________________________

*యావదిన్ద్రాయ తత్రయమ్‌

Sri Matsya Mahapuranam-1    Chapters