Sri Matsya Mahapuranam-1    Chapters   

అథ పంచమో7ధ్యాయః

దక్షసృష్ట్యాదివివరణమ్‌

ఋషయః: దేవానాం దానవానాం చ గన్ధర్వోరగరక్షసామ్‌ | ఉత్పత్తిం విస్తరేణాథ సూత బ్రూహి యథావిధి. 1

సూతః: సఙ్కల్పా ద్దర్శ నాత్స్పర్శా త్పూ ర్వేషాం సృష్టి రుచ్యతే!

దక్షా త్ప్రచేతసా దూర్ధ్వం సృష్టి ర్మైథునసమ్భవా. 2

ప్రజా స్సృజే త్యథాదిష్టః పూర్వం దక్ష స్స్వయమ్భువా | యథైవ చ ససర్జాదౌ తథై వ శృణుత ద్విజాః. 3

యథా తు సృజత స్తస్య దేవర్షిగణపన్నగాః | తే వృద్ధి మగమం ల్లోకా స్తథా మైథునయోగతః. 4

దక్షః పుత్త్రసహస్రాణి పఞ్చాశద్వా ప్యజీజనత్‌ | తాంస్తు దృష్ట్వా మహాభాగా న్త్సిసృక్షు ర్వివిధాః ప్రజాః. 5

నారదః ప్రాహ హర్యక్షా న్దక్షపుత్రా న్త్సమస్థితా9 | భూమేః ప్రమాణం తద్‌జ్ఞాత్వా అత ఊర్ధ్వం సమాసతః. 6

తత స్సృష్టిం విశేషేణ కురుధ్వ మృషినత్తమాః | తే తు తద్వచనం శ్రుత్వా ప్రయయు స్సర్వతోదిశమ్‌. 7

అద్యాపి న నివర్తన్తే సముద్రాదివ సిన్ధవః | హర్యక్షాదిషు నష్టేషు పున ర్దక్షః ప్రజాపతిః. 8

వైరిణ్యామేవ పుత్త్రాణాం సహస్ర మసృజ త్ప్రభుః | శబలా నామ తే విప్రా స్సమేతా స్సృష్టి హేతవః. 9

నారదో7నుగతః పశ్చా త్స పునః పూర్వవత్సుతా9|భువః ప్రమాణం సర్వత్రజ్ఞాత్వ భ్రాతౄ న్పునఃపునః.

తతః ప్రభృతి న భ్రాతుః కనీయా న్మార్గ మృచ్ఛతి| అన్విష్య దుఃఖ మాప్నోతి తేన తాం పరివర్జయేత్‌. 12

తత స్తేష్వపి నష్టేషు షష్టిం కన్యాః ప్రజాపతిః | వైరిణ్యాం జనయామాస దక్షః ప్రాచేతస స్తథా. 13

ప్రాదా త్స దశ ధర్మాయ కశ్యపాయ త్రయోదశ | సప్తవింశతి సోమాయ చతస్రో7రిష్టనేమయే. 14

ద్వే చైవ భృగుపుత్త్రాయ ద్వే కృశాశ్వాయ ధీమతే| ద్వే చైవాఙ్గిర సే తద్వ త్తాసాం నామాని విస్తరాత్‌. 15

శృణుధ్వం దేవమాతౄణాం ప్రజావిస్తర మాదితః | మరుత్వతీ వసు ర్జామీ రేవా భాను రరున్ధతీ. 16

సఙ్కల్పా చ ముహూర్తాచ సాధ్యా వై విశ్వభామినీ | ధర్మపత్న్య స్సమాఖ్యాతా స్తాసాం పుత్త్రాన్నిబోధత.

పంచమాధ్యాయము.

దక్షసృష్ట్యాది వివరణము.

ఋషులు సూతు నిట్లు ప్రశ్నించిరి: సూతా! దేవతలు దానవులు గంధర్వులు నాగులు రాక్షసులు మొదలగువారి ఉత్పత్తిని ఇకమీదట మాకు విస్తరించి చెప్ప వేడుచున్నాను.

సూతుడు ఇట్లు చెప్పనారంభించెను: దక్ష ప్రజాపతికంటె ముందు వారు చేసిన సృష్ఠి సంకల్పమున దర్సన మాత్రమున స్పర్శనము వలన జరిగెడిది. ప్రాచేతసుడగు దక్షుని మొదలుకొని సృష్ఠి స్త్రీపురుషుల సంయోగము వలన సంతానోత్పత్తి జరుగుటతో ఆరంభమయినది. స్వయంభువుని ఆజ్ఞానుసారము దక్షుడు సృష్టి జరిపిన విధము తెలిపెదను వినుడు. అతడు జరిపిన సృష్టిలో దేవతలు ఋషులు నాగులు మొదలగు వారందరును అన్ని ప్రాణులును మైథునము (స్త్రీ పురుషుల కూడిక) వల న జనించి వృద్ధి పొందిన విధమును తెలిపెదను. దక్షునకు మొదట ఏబదివేల మంది కుమారులు కలిగిరి. వారు వివిధ ప్రజలను సృష్టింపదలచియుండుట చూచి నారదు డు వారితో ఇట్లు పలి కెను. ఋషి సత్తములారా! మీరుమొదట భూమి పరిమాణమెంతయో పూర్తిగా తెలిసికొని పిమ్మట దానియందు సరిపోవునంత మంది ప్రజలను సృష్టించుడు. వారు ఆమాట విని అందులకై బయలుదేరి అన్నివై పులకు వెళ్ళిరి. సముద్రము లోనికి పోయిన నదులు మరలి రానట్లు హర్యక్షుడు మొదలగు ఆ దక్షుని కుమారులు ఇప్పటికిని మరలి రాకు న్నారు. అంతట దక్షుడు వైరిణి అను భార్యయందు వేయిమంది కుమారులను కనెను. శబలలు అను పేరుగల ఆదక్షపుత్త్రులు సృష్టికి హేతుభూతులై యుండిరి. నారదుడు వారికడకును వచ్చి మొదటి వలెనే ఇట్లు పలికెను. ఋషులారా! మీరు పోయి భూప్రమాణమును మీ అన్నల జాడను కూడ తెలిసికొనివచ్చి పిమ్మట సృష్టిని విశేషముగా ఆరంభించుడు. అనగా విని వారును అన్ని దిక్కులకును పోయిరి. కాని మరలి రాలేదు. అందు చేతనే లోకములో తప్పిపోయిన అన్నలజాడ కనుగొనుటకు తమ్ములు పోరు. అట్లు ఒక వేళ వెదకుటకు పోయినచో కీడు కలుగును. కనుక అట్లు చేయరాదు. శబలలు కూడను మరలి రాకపోగా ప్రాచేతసుడగు దక్షుడు వైరిణి యను భార్య యందు అరువది మంది కూతుండ్రను కనెను. వారిలో పదిమందిని ధర్మునకును పదుముగ్గురను కశ్యపునకును ఇరువది ఏడుమందిని సోమునకును నలుగురను అరిష్టనేమికిని ఇద్దరును భృగు పుత్త్రునకును ఇద్దరును కృశాశ్వునకును ఇద్దరు అంగిరసునకును ఇచ్చెను. ఈ దేవమాతల వలన జరిగిన ప్రజావిస్తరమును ఆదినుండి చెప్పెదను. వినుడు. మొదటి పదిమందియును మరుత్వతి వసువు జామి- రేవా భానువు అరుంధతి సంకల్ప ముహూర్త సాధ్యా విశ్వ అను వారు ధర్ముని భార్యలు.

విశ్వా న్దేవాంస్తు విశ్వా చ సాధ్యా సాధ్యా నజీజనత్‌ | మరుత్వత్వాం మరుత్వన్తో వసోస్తు వసవస్తథా. 18

భానోస్తు భానవ స్తద్వ న్ముహూర్తాయాం ముహూర్తకమ్‌ | రేవాయాం ఘోషనామానో నాగవీథ్యస్తు జామిజాః.19

పృథివీతలసమ్భూత మరున్ధత్యా మజాయత | సజ్కల్పాయాం తు సజ్కల్పో వసుసృష్టిం నిభోధత. వసుసన్తతిః.20

జ్యోతిష్మన్తస్తు తే దేవా వ్యాపకా స్సర్వతోదిశమ్‌ | వసవస్తే సమఖ్యాతా స్తేషాం సర్గం నిభోధత.21

ఆపో ధ్రువశ్చ సోమశ్చ ధర శ్చైవానిలో7నలః | ప్రత్యూషశ్చ ప్రభాసశ్చ వసవో7ష్టౌ ప్రకీర్తితాః.22

ఆపస్య పుత్త్రా శ్చత్వార శ్శాన్తో వై దణ్డ ఏవ చ | సామ్బోపి మణివక్త్రశ్చ యజ్ఞరక్షాధికారిణిః.23

ధ్రువస్య కాళః పుత్రస్తు వర్చా స్సోమా దజాయత | ధరస్య మారుతస్యాపి ధర్మపౌత్త్రా వుభౌస్మృతౌ.24

క ల్పానీక స్తతః ప్రాణో రమణ శ్శిశిరోపి చ | తతశ్చ హవ్యవాహస్య పుత్త్రత్రయ మభూ న్నృప.25

శాఖస్తు ప్రధమ స్తేషాం విశాఖస్తు తతఃపరమ్‌ | అపత్యం కృత్తికానాం తు కార్తికేయ స్తత స్స్మృతః.26

ప్రత్యూషస్య విభుః పుత్త్ర ఋషి స్తామ్రస్య దేవలః | విశ్వకర్మా ప్రభాసస్య పుత్త్ర శ్శిల్పిప్రజాపతిః.27

ప్రాసాదభవనోద్యానప్రతిమాభూషణాదిషు | అగారారామకూపేషు స్మృత స్సో7మరవర్థకిః.28

అజైకపా దహిర్భుధ్న్యో విరూపాక్షో7థ రైవతః | హర్యశ్వో బహురూపశ్చ ప్రబకశ్చ సురేశ్వరః.29

సావిత్రశ్చ జయన్తశ్చ పినాకీ చాపరాజితః | ఏతే రుద్రా స్సమాఖ్యాతా ఏకాదశ గణశ్వరాః.30

కోటయ శ్చతురాశీతి స్తత్ప్రాప్తాశ్చాక్షయా స్స్మృతాః | దిక్షు సర్వాసు యే రక్షాం ప్రకుర్వన్తి గణశ్వరాః.31

పుత్త్రాః పౌత్త్రా స్స్మృతా శ్చైతే పురాణా గర్భసమ్భవాః.

ఇతి శ్రీమత్స్య మహాపురాణ మత్స్యమనుసంవాదే దక్షసృష్టికథనం నామ పఇచ మో7ధ్యాయః.

విశ్వకు విశ్వదేవులు సాధ్యకు సాధ్యులు మరుత్వతికి మరుత్వతులు వసువునకు వసువులు భానువునకు భానువులు ముహూర్తకు ముహూర్తగణము రేవకు ఘోషులు అను దేవగణములు జామికి నాగవీథ్యాధులు అరుంధతికి పృథివీ తలమునందలి ప్రాణి సమూహము సంకల్పకు సంకల్పుడు అను వారు పుట్టిరి.

వీరిలో వసువుల సృష్టిని తె లిపెదను వినుడు. వీరు జ్యోతిష్మంతులు (ప్రకాశము కలవారు.) అన్ని దిక్కులందును వ్యాపించువారు. అంతట వ్యాపించి వసించువారు కనుకనే వారికి వసువులు అ ని వ్యవహారము. వారి పేరులు ఆపుడు ధ్రువుడు సోముడు ధరుడు అనిలుడు అనలుడు ప్రత్యూషుడు ప్రభాసుడు అనునవి. వీరిలో ఆపునకు శాంతుడు దండుడు సాంబుడు మణివక్త్రుడు అను నలుగురు కుమారులు. వీరు యజ్ఞరక్షకు అధికారులు. ధ్రువునకు కాళుడు సోమునకు వర్చసుడు ధరునకు కల్పానీకుడు ప్రాణుడు అనువారు అనిలునకు రమణుడు శిశిరుడు అను ఇద్దరు అనలునకు శాఖుడు విశాఖుడు కార్తికేయుడు (కృత్తికలయందు) అను ముగ్గురును ప్రత్యూషునకు దేవలుడు అను సమర్థుడగు ఋషి ప్రభాసునకు విశ్వకర్మయను ప్రజాపతియగు దేవశిల్పియు కుమారులు. ఈ విశ్వకర్మ ప్రసాదములు భవనములు ఉధ్యానములు ప్రతిమలు ఆభరణములు గృహములు ఆరామములు కూపములు మొదలైన వాని నిర్మాణములలో దేవతలకు వడ్లంగి.

ధర్ముని సంతానమే యగు అజైకపాద్‌ అహిర్భుధ్య్నుడు విరూపాక్షుడు రైవతుడు హర్యశ్వుడు బహురూపుడు ప్రబకుడు సురేశ్వరుడు సావిత్రుడు జయంతుడు పినాకి అనువారు ఏకాదశ రు ద్రులు. వీరు గణదేవతలు. వీరి బలగము ఎనుబదికోట్లు మంది కలరు. వీరువారికి అధిపతులై అన్ని దిక్కులయందు నుండి లోకరక్ష చేయుదురు. గర్భము నుండి జనించిన ఆది సంతానరూపమగు ప్రజాపతి పుత్త్ర పౌత్త్రుల వివరణము ఇది.

ఇది శ్రీ మత్స్య మహా పురాణమన దక్షసృష్టికథనమను పంచమాధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters