Sri Matsya Mahapuranam-1    Chapters   

సప్తచత్వారింశో7ధ్యాయః.

శ్రీకృష్ణవంశానువర్ణనమ్‌.

సూతః: అథ దేవో మహాదేవః పురా కృష్ణః ప్రజాపతిః | విహారార్థం స దేవేశో మాను షే ష్విహ జాయతే. 1

దేవక్యాం వసుదేవేన తపసా పుష్కరేక్షణః | చతుర్బాహుస్తు సఞ్జాతో దివ్యరూపోజ్జ్వల శ్ర్శియా. 2

శ్రీవత్సలక్షణం దేవం దృష్ట్వా దివ్యైశ్చ లక్షణౖః | ఉవాచ వసుదేవ స్తం రూపం సంహర వై ప్రభో. 3

భీతో7హం దేవకంసస్య తత స్త్వేత ద్ర్బవీమి తే | మమ పుత్త్రా హతా స్తేన జ్యేష్ఠాస్తే భీమవిక్రమ. 4

వసుదేవవచ శ్ర్శుత్వ రూపం సంహర దచ్యుతః | అనుజ్ఞాప్య తత శ్శౌరిం నన్దగోపగృహే7నయత్‌. 5

దత్వైనం నన్దగోపస్య రక్ష్యతా మితి చాబ్రవీత్‌ | అతస్తు సర్వకల్యాణం యాదవానాం భవిష్యతి. 6

అయం తు గర్భే దేవక్యాం జాతః కంసం హనిష్యతి | ఋషయః: క ఏష వసుదేవస్తు దేవకీచ యశస్వినీ. 7

నన్దగోపశ్చ క స్త్వేష యశోదా చ మహావ్రతా | యో విష్ణుం జనయామాస యం చ తాతే త్యభాషత. 8

యా గర్భం జనయామాస యా చైనం చాభ్యవర్ధయత్‌ |

సూతః: పురుషః కశ్యప స్త్వాసీ దదితిః స్త్రీచ యా స్మృతా. 9

బ్రహ్మణః కశ్యపశ్చాంశః పృథివ్యా స్త్వదితి స్తథా | అథ కామా న్మహాబాహు ర్దేవక్య స్సమపూరయత్‌. 10

యే తయా కాంక్షితా నిత్య మజాతస్య మహాత్మనః | సో7వతీర్ణో మహీం దేవః ప్రవిష్టో మానుషీం తనుమ్‌.

మోహయ న్త్సర్వభూతాని యోగాత్మా యోగమాయయా | నష్టే ధర్మే తథా యజ్ఞే విష్ణు ర్వృష్ణికులే ప్రభుః.

కర్తుం ధర్మస్య సంస్థాన మసురాణాం ప్రణాశనమ్‌ | రుక్మిణీసత్యభామా చ సత్యా నాగ్నజితీ తథా. 13

సుధామా చ తథా శైబ్యా గాన్ధారీ లక్షణా తథా | మిత్రవిన్దా చ కాళిన్దీ దవా జామ్బవతీ తథా. 14

సుసీమా చ తథా మాద్రీ కౌసల్యా విజయా తథా | ఏవమాదీని దేవీనాం సహస్రాణి తు షోడశ. 15

నలువది ఏడవ అధ్యాయము.

నారాయణుడు అవతారములెత్తుటకు హేతువును తెలిపెడు కథ.

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పసాగెను: ఇది ఇట్లుండ నిండు. దేవుడును మహాదేవుడును ప్రజాపతియు దేవేశుడునగు నారాయణుడు విహారార్థమయి ఈలోకమునందు మానవులనడుమ కృష్ణుడుగా జన్మించును. అని మత్స్యమూర్తి చెప్పినట్లే ఆయన వసుదేవుడుఆచరించిన తపస్సునకు ఫలముగా దేవకియందు పద్మనేత్రుడు చతుర్భుజుడుగా దివ్యరూపుడుగా కాంతిలో ఉజ్జ్వలుడుగా అవతరించెను. శ్రీవత్స లాంఛనము మొదలగు దివ్య లక్షణములు చూచి వసుదేవుడు 'ప్రభూ! నీ రూపము నుపసంహరింపుము. మహావిక్రములగు నా మొదటి కుమారు లందరను కంసుడు చంపెను. కనుక నేను వానికి భయపడుచున్నాను.' అని వసుదేవు డనగా అచ్యతుడు తన దివ్యరూపము నుపసంహరించెను. తరువాత భగవానుని అనుజ్ఞతో వసుదేవుడు శ్రీకృష్ణుని నందగోపుని గృహమునకు చేర్చి ఇతనిని అతని కిచ్చి ఈ శిశువును కాపాడుమని కోరెను. ఇతని వలన సర్వ యాదవులకును శుభము కలుగును. దేవకీ గర్భ సంజాతుడగు ఈతడు కంసుని చంపును. అనియు వసుదేవుడు నందునితో ననెను.

ఇది విని ఋషులు సూతు నిట్లు ప్రశ్నించిరి : వసుదేవుని కాని నందుని కానిభగవానడు నాయనా! అని పిలిచెను. దేవకి ఆయనను గర్భమున ధరించి కనెను. యశోద పోషించెను. ఇంత అదృష్టము పొందిన ఈనలుగురును ఎవరు? అనగా సూతుడు వారి కిట్లు చెప్పెను: ఆది ప్రజాపతి దంపతులు అదితియు కశ్యపుడును మీకు తెలియును గదా! కశ్యపుడు బ్రహ్మాంశము. అదితి పృథివ్యంశము. మహాబాహుడు అగు నారాయణుడు దేవకి కోరికలను పూరించెను. (ఏలయన కశ్యపుడే వసుదేవుడు. అదితియే దేవకి.)మ ఎన్నడును జననము నెరుంగని ఆ మహాత్ముడును జనన మందెను. ఆ యోగాత్ముడు యోగమాయచే సర్వభూతములను మోహ పెట్టితను తాను మానవునిగా చూపెను. యజ్ఞములను ధర్మమును నశించగా ఆ ప్రభువు వృష్టివంశమునం దవతరించి ధర్మ సంస్థాపనమును రాక్షస నాశమును జరిపెను. ఆయనకు రుక్మిణి సత్యభామ సత్య నాగ్నజితి సుధామ శై బ్య గాంధారి లక్షణ మిత్రవింద కాళింది-దవ - జాంబవతి-సుసీమ-మాద్రి-కౌసల్య-విజయ మొదలగు పదునారువేలమంది భార్య లుండిరి.

రుక్మిణీ జనయామాస పుత్త్రం రణవిశారదమ్‌ | చారుదేష్ణం మహావూరం ప్రద్యుమ్నంచ మహాబలమ్‌. 16

సుచారుం భద్రచారుంచ సుదేష్టం భద్రమేవచ | పరశు శ్చారుగుప్తశ్చ చారుభద్ర స్సుచారుకః. 17

చారుహాసః కనిష్ఠశ్చ కన్యా చారుమతీ తథా | జజ్ఞిరే సత్యభామాయాం భాను ర్ర్భమరవీక్షణః. 18

రోహితో దీప్తిమాంశ్చైవ తామ్రవక్త్రో జలన్ధరః | చతస్రో జజ్ఞిరే తేషాం స్వసారస్తు యవీయసః. 19

జామ్బవత్యా స్సుతో జజ్ఞే సామ్బ స్సమితిశోభనః | మిత్రవా న్మిత్రవిన్దశ్చ మిత్రవిన్దా వరాఙ్గనా. 20

మిత్రబాహు స్సునీతశ్చ నాగ్నజిత్యాః ప్రజా హి సా | ఏవమాదీని పుత్త్రాణాం సహస్రాణి నిబోధత. 21

అశీతిం చ సహస్రాణి వాసుదేవసుతా స్తథా | లక్ష మేకం తథాప్రోక్తం పుత్త్రాణాంతు ద్విజోత్తమాః. 22

ఉపసఙ్గస్యతు సుతౌ వజ్ర స్సంక్షిప్త ఏవచ | భూరీన్ద్రసేనో భూరిశ్చ గవేషణసుతా వుభౌ. 23

ప్రద్యుమన్న స్యతు దాయాదో వైదర్భ్యాం బుద్ధిసత్తమః | అనిరుద్ధో రణ7రుద్ధో యజ్ఞశ్చ మృగకేతనః. 24

కార్శ్యాశ్వతనయా సామ్బా ల్లేభే పత్త్రాం స్తరస్వినః | సత్యప్రకృతయో దేవాః పఞ్చ వీరాః ప్రకీ ర్తితాః. 25

తిస్రః కోట్యః ప్రవీరాణాం యాదవానాం మహాత్మనామ్‌ | షష్టి శ్శతసహస్రాణి వీర్యవన్తో మహాబలాః. 26

దేవాంశా స్సర్వ ఏవేహ ఉత్పన్నాస్తే మహౌజసః | దేవాసురే హతా యేచ అసురా యే మమాబలాః. 27

ఇహోత్పన్నా మనుష్యేషు బాధ న్తే సర్వమానవా& | తేషా ముత్సాదనార్థాయ ఉత్పన్నోయాదవే కులే. 28

కులానాం శతమేకంచ యాదవానాం మహాత్మనామ్‌ | సర్వ మేత త్కులం యావ ద్వర్ధతే వైష్ణవే కులే.

విష్ణు స్తేషాం ప్రణతా చ ప్రభుత్వే చ వ్యవస్థితః | నిదేశస్థాయిన స్తస్య కథ్యన్తే సర్వయాదవాః. 30

రుక్మిణికి రణవిశారదులు మహాశూరులు మహాబలులు నగు చారుదేష్ణుడు ప్రద్యుమ్నుడు సుచారుడు భద్రచారుడు సుదేష్ణకు భద్రుడు పరశుడు చారుగుప్తుడు చారుభద్రులు సుచారుకుడు చారుహాసుడు అను కుమారులును కడగొట్టుగా చారు మతి అనెడికన్యము కలిగిరి. సత్యభామయందు భానుడు భ్రమరవీక్షణుడు రోహితుడు దీప్తిమాన్‌ తామ్రవక్త్రుడు జలంధరుడు అను కుమారులును నల్గురు కుమా ర్తెలును కలిగిరి. జాంబవతికి యుద్ధ నిపుణుడగు సాంబుడును మిత్రవిందకు మిత్రవాన్‌ - మిత్రవిందుడు-నాగ్న జితికి మిత్రబాహు సునీతులు కుమారులైరి. ఈమొదలగు కుమారులు వేలకొలదిగ శ్రీకృష్నునకు కలిగిరి. వీరు మొత్తము ఒక లక్షయు ఎనుబదివేల మంది. వీరిలో ఉపసంగునకు వజ్రుడు సంక్షిప్తుడు-గవేషణునకు భూరీంద్రసేనుడు భూరి అనువారు-ప్రద్యుమ్ను నకు వై దర్భియందు బుద్ధిశాలియు రణమునం దెదురులేనివాడు నగు అనిరుద్ధుడు యజ్ఞుడు మృగకేతనుడు అనువారును సాంబునకు కార్శ్యాశ్వుని కూతువలన బలశాలురు సత్యస్వభావులు వీరులు దేవసదృశులునగు ఐదుగురు కుమారులు కలిగిరి. ఆనాడు యాదవులు మొత్తము మూడుకోట్లమంది వీరందరును దేవాంశరూపులును మహాబలులును వీర్యవంతులును మహాతేజస్సంపన్నులును. పూర్వము దేవాసుర యుద్ధములందు మరణించిన అసురులు మరల మానవులందు జన్మించి ఇతర మానవుల నందరను భాధింపసాగిరి. వారిని నశింపజేయుటకై విష్ణువు యాదవవంశమున పుట్టెను. అతనికితోడుగా నున్న ఈ యాదవులు మహాత్ములు నూటొక్క ప్రధానవంశములవారు. ఈ వంశము వైష్ణవ వంశ##మే. వారికి విష్ణువు నాయకుడై వారిని నడపెను. ఇటు సర్వ యాదవులును శ్రీకృష్ణుని యాజ్ఞయందు నడచిరి.

ఋషయః: సప్తర్షయః కుబేరశ్చ యక్షో మాణిహర స్తథా | శాలాకి ర్నారదశ్చైవ సిద్ధో ధన్వన్తరి స్తథా. 31

ఆదిదేవ స్తథా విష్ణు రేభిర్వై సప్తదైవతైః | కిమర్థం సప్తికా భూత్వాస్మృతా స్సమ్భూతయః కతి. 32

భవిష్యాః కతి చైవాన్యే ప్రాదుర్భావా మహాత్మనః | బ్రహ్మక్షత్త్రేషు శాన్తేషు కిమర్థ మిహ జాయతే. 33

యదర్థ మిహ సమ్భూతో విష్ణు ర్వృష్ణ్యన్ధకోత్తమః |

పునః పున ర్మను ష్యేషు త న్నః ప్రబ్రూహి పృచ్ఛతామ్‌. 34

సూతః: న్యస్య దివ్యాం తనుం విష్ణు ర్మానుషే ష్విహ జాయతే |

యుగే తత్ర పరావృత్తే కాలే ప్రశిథిలే విభుః. 35

దేవాసురవిమర్దేషు జాయతే హరి రీశ్వరః | హిరణ్యకశిపౌ నిత్యం త్రైలోకం ప్రా క్ర్పశాసతి. 36

బలినా7ధిష్ఠితే చైవ పురా లోకత్రయే క్రమాత్‌ | సంఖ్య మాసీ త్పరమకం దేవానా మసురై స్సహ. 37

యుగాఖ్యా దశ సమ్పూర్ణా హ్యాసీ దత్యాకులంజగత్‌ | నిదేశస్థాయినశ్చాపి తయోర్దేవాసురాస్సమమ్‌. 38

మృథో బలివిమర్దాయ సమ్ర్పవృద్ధస్తు దారుణః | దేవానా మసురాణాం చ ఘోరక్షయకరో మహాన్‌. 39

ధర్తుం ధర్మవ్యవస్థానం జాయతే మానుషే ష్విహ | భృగో శ్శాపనిమిత్తంతు దేవాసురకృతే తేథా. 40

దేవాసురయుద్ధప్రస్తావః.

ఋషయః : కథందేవాసురకృతే వ్యాహారం ప్రాప్తవాం స్తతః |

దేవవాసురం యథా వృత్తం తన్నః ప్రబూహి వృచ్ఛతామ్‌. 41

ఋషులు సూతునిట్లడిగిరి: కొందరు పెద్దలు ''సృష్టులు అన్నియు సప్తికారూపమయినవి. అవి స ప్తర్షులు కుబేరుడు మణిహరుడను యక్షుడు శాలాకి నారదుడు సిద్ధుడగు ధన్వంతరి-ఆదిదేవుడగు విష్ణువు అను సప్తదేవతలతోనే సమగ్రమగుచున్నది.'' అని చెప్పుదురు. ఆ సృష్ణులు ఎన్ని విధములు? ఆ మహాత్ముని ప్రాదుర్భావములు జరిగినవెన్ని? జరుగనున్నవెన్ని? ఆ మహానుభావుడు శాంత స్వభావులగు బ్రహ్మ క్షత్త్రియజాతులందును-అందునను వృష్ట్యంధక వంశ శ్రేష్ఠుడై యాదవులందును ఏల జన్మించవలసివచ్చెను? మరల మరల మానవులలో ఆయన ఏల జన్మించవలసివచ్చెను? ఇట్లడుగగా సూతుడు ఋషులకిట్లు చెప్పసాగెను: నిజమే! విష్ణువు తన దివ్యదేహమును విడిచి (మరుగుపరచి) ఈలోకమున మానవులందు జన్మించును. హేతువు చెప్పెదను. వినుడు. యుగధర్మము తలక్రిందులు కాగా కాల స్వభావము మిగుల శిథిలము కాగా దేవాసుర యుద్ధములు ప్రవర్తిల్లును. అట్టి సమయములందే ఈశ్వరుడగు హరి అవతరించును. ఎట్లన¾పూర్వము హిరణ్య కశిపుడును బలియు నను అసురులు లోకత్రయమును పాలించుచుండ ఆయా కాలములందు పది దివ్య యుగముల కాలము దేవాసురులకు మహా యుద్ధము జరిగెను. జగత్తులన్నియు అత్యాకులములయ్యెను. దేవతలు విష్ణుని నిదేశమునందును అసురులు బలి హిరణ్యకశిపుల నిదేశమునందును నిలిచి యుద్ధమును జరిపిరి. బలిని నశింపజేయుటకై జరిగిన యుద్ధము చాల భయంకరమును దేవతలకును అసురులకును నాశకరమును నయ్యెను. ఆ ప్రసంగమున కలిగిన భృగు శాపము నిమినత్తము కాగా శ్రీ నారాయణుడు మానవులం దవతరించుచుండును.

ఇట్లు చెప్పిన సూత వచనమును విని ఋషులిట్లు ప్రశ్నించిరి: దేవాసురుల యుద్ధము మూలమున విష్ణువు శాపము నేల పొందెను? దేవాసుర యుద్ధ మెట్లు జరిగి ఇట్టి స్థితికి హేతువయ్యెను? మాకు తెలుపుడు.

సూతః : తేషాం దాయనిమిత్తం తై స్సఙ్గ్రమస్తు సుదారుణః |

వారాహాద్యా దశ ద్వౌచ చణ్డామర్కాన్తరే స్మృతాః. 42

నామతస్తు సమాసేన శృణుతైషాం వివక్షతామ్‌ | ప్రథమో నారాసింహస్తు ద్వితీయశ్చాపి వామనః. 43

తృతీయస్తు వరాశ్చ చతుర్థో7మృతమన్థనః | సఙ్గ్రామః పఞ్చమశ్చైవ సఞ్జాత స్తారకామయః. 44

షష్ఠో హ్యాడీవధాఖ్యస్తు సప్తమ సై#్త్రపుర స్తథా | అన్ధకారో7ష్టమ స్తేషాం నవమో వృత్రఘాతకః. 45

ధాత్రశ్చ దశమః ప్రోక్తస్తతో హాలాహలః స్మృతః | ప్రథితో ద్వాదశ స్తషాం ఘోరః కోలామల స్తథా. 46

హిరణకశిపు ర్దైత్వో నరసింహేన సూదితః| వామనేన బలీ బద్ధ సై#్త్రలోక్యక్రమణ పురా.

హిరణ్యాక్షో హతో ద్వంద్వే ప్రతివాదేతు దై వత్తెః | దంష్ట్రయా తు వరాహేణ సముద్రస్తు ద్విధా కృతః.

ప్రహ్లాదో నిర్జితో యుద్ధే ఇన్ద్రేణామృతమన్థనే | విరోచనస్తు ప్రాహ్లోది ర్నిత్య మిన్ద్రమధోద్యతః. 49

ఇన్ద్రేణౖవ చ విక్రమ్య నిర్జిత స్తారకామయే | అసకృ ద్వసుదేవేషు నాససాద విరోచనః. 50

నిహతా దానవా స్సర్వే త్రైపుర్యే త్ర్యమ్బ కేణ తు | అసురాశ్చపిశాచాశ్చ దానవాశ్చాన్ధకే వధే. 51

హతా దేవమనుషై#్యశ్చ పితృభిశ్చైవ సర్వశః | సంసక్తో దానవై ర్ధాత్రో ఘోరో హాలాహలో మతః. 52

తదా విస్ణుసహాయేన మ హేన్ద్రేణ నివర్తితః | తతో ధ్వజో మహేన్ద్రేణ మాయాచ్ఛన్నస్తు యోగవిత్‌. 53

ధ్వజలక్ష్మా సమావిశ్య విప్రచిత్తి స్సహానుజః | దైత్యాశ్చ దానవాశ్చైవ సంయత్తాః కృష్ణసంయుతాః. 54

జయకోలాహలే సర్వా దేవైః పరివృతా స్తథా | యజ్ఞస్యావభృథే దృష్టౌ శణ్డమర్కౌతుదైవతైః. 55

ఏతే దేవాసురా వృత్తా స్సఙ్గ్రామా ద్వాదశైవ తు | దేవాసురక్షయవరాః ప్రజానాంచ హితాయవై. 56

అనగా సూతుడిట్లు చెప్పసాగెను: దాయభాగ నిమిత్తమున (త్త్రెలోక్యపాలనాధికారము ఎవరిదను విషయమున) దేవాసురుల నడుమ«శండామర్కాంతరము వరకు పండ్రెండు మారులు యుద్ధము జరిగినట్లు తెలుపబడియున్నది. ఇవి వరుసగా నారసింహము వామనము వరాహము అమృతమంథనము తారకామయము ఆడీవధము త్త్రెపురము అంధకారము వృత్రఘాతకము ధాత్రము హాలాహలము కోలాహలము అనునవి. వీనిలో నారసింహమున హిరణ్యకశిపుడు నరసింహునిచే చంపబడెను. వామనమున త్రివిక్రమమూర్తి యగు వామనునిచే బలి బంధింపబడెను. వరాహమున దేవతలతో హిరణ్యాక్షుడు చేసిన యుద్ధమున వరాహమూర్తి వానితో ద్వంద్వ యుద్ధమునాచరించి వానిని చంపెను. సముద్రమును రెండుగా చేసెను. అమృతమంథనమున ఇంద్రుడు యుద్ధమునందు ప్రహ్లాదుని జయించెను. తారకామయమున-ప్రహ్లాద కుమారుడు విరోచనుడు నిత్యము నింద్రుని చంపు పూనికతో నుండుటయు ఇంద్రుడు విక్రమించి వానిని జయించుటయు జరిగినది. ఆడీవధమున విరోచనుడు వసువులనెడి దేవతల బాణములకు గురియయ్యెను. త్త్రెపురమున త్ర్యంబకునిచేతిలో దానవులు అందరును మరణించిరి. అంధకారమున (అంధక-అర) (అంధకవధ యుద్ధమున) దేవతలును మనుష్యులును పితరులును అసురులను పిశాచులును దానవులను చాలవరకు చంపిరి. ధాత్రమను యుద్ధము దేవదానవులకు జరిగినట్టిది. హాలాహలమనెడి యుద్ధము ఘోరమయినది. దీనియందు విష్ణుని సహాయునిగాగొని ఇంద్రుడు దీనిని ముగియజేసెను. ఈ యుద్ధముననే ఇంద్రుడు యోగవేత్తయు మాయతో మరుగుపడు శ క్తి కలవాడునగు ధ్వజుడను వానిని జయించెను. ఇక పండ్రెండవదియగు (జయ) కోలాహల యుద్ధమున విప్రచి త్తి ధ్వజుని రూపము ధరించి (ధ్వజుని వలెనే మాయాచ్ఛన్నుడై) తన సోదరులతోను ఇతరులగు దానవులతోను అసురులతోను కూడి యుద్ధము చేసెను. దేవతలు కృష్ణునితో (విష్ణునితో) కూడి తమ శత్రువులను బంధించిరి. ఇట్లు యుద్ధములనెడు యజ్ఞములు ముగిసిన తరువాత దేవతలు అవభృథ (యజ్ఞ దీక్షాన్త) స్నానము చేసిరి. ఆ ప్రసంగమున వారు శండమర్కులను ధర్శించిరి.

_________________________________________

« శండా మర్కాంతరము అను పదమున కర్థము ఇచట అస్పష్టము. ఈ శండమర్కులు శుక్రుని కుమారులో శిష్యులో అని తోచును.

ఇట్లు దేవాసులరుల నడుమ జరిగిన పంద్రెండు యుద్ధములును ఈ ఇరుపక్షములవారికిని నాశము కలిగించినను తుదకు దేవతలకు జయము లభించి ప్రజలకు హితకరములయ్యెను.

హిరణ్యకశిపూ రాజా వర్షాణామర్బుదం విభో | ద్విసప్తతి స్తథా7బ్దానాం నియుతా న్యధికానితు. 57

అశీతించ సహస్రాణి త్త్రెలోక్యైశ్వర్యతాం గతః | పర్యాయేణతు రాజా7భూ ద్బలి ర్వర్షాయుతం పునః.

షష్టి ర్వర్షసహస్రాణి నియుతానిచ వింశతిః | బలే రాజ్యాధికారస్తు యావత్కాలం బభూవ హ. 59

తావత్కాలంతు ప్రహ్లాదో నివృత్తో మ్యసురై స్సహ | ఇన్ద్రస్తు ఏతే విజ్ఞేయా అసురాణాంమహౌజసః. 60

దైత్య సంస్థ మిదం సర్వ మాసీ ద్దశయుగం పునః | త్రైలోక్య మిద మవ్యగ్రం మ హేన్ద్రేణానుపాల్యతే.

అసమ్పన్న మిదం సర్వ మాసీ ద్దశయుగం పునః | ప్రహ్లాదస్య హృతే తస్మిం సై#్త్రలోక్యే కాలపర్యయే. 62

పర్యాయేణతు సమ్ప్రాప్తే త్త్రెలోక్యం పాకశాసనే | తతో7సురా న్పరిత్యజ్య శుక్రో దేవా నగచ్ఛత. 63

యజ్ఞే దేవా నథ గతం దితిజాః కావ్య మాహ్వయ& |

కిం త్వ న్నో మిషతాం రాజ్యం త్యక్త్వా యజ్ఞంపునర్గతః. 64

స్థాతుం న శక్నుమో హ్యత్ర ప్రవిశామో రసాతలమ్‌| ఏవ ముక్తో7బ్రవీ ద్దైత్యా న్విషణ్ణా న్త్సాన్త్వయ న్గిరా.

మాభీ ర్విధారయిష్యామి తేజసా స్వేన వో7సురాః | మన్త్రా శ్చౌషధయశ్చైవ రసాశ్చ వసు యత్పరమ్‌.

కృత్స్నాని మయి తిష్ఠన్తి పాద స్తేషాం సురేశ్వరైః |

తత్సర్వం వః ప్రదాస్యామి యుష్మదర్థే భృతం మయా. 67

తతో దేవాస్తు తాన్దృష్ట్వా భృతాన్కావ్యేన ధీమతా | సమ్మన్త్రయన్తి దేవా వై సంవిగ్నాస్తు జిఘృక్షయా.

కావ్యో హ్యసదృశం సర్వం వ్యావర్తయతి నో బలాత్‌ |

సాధు గచ్ఛామహే తూర్ణం యావ న్నాధ్యాపయన్తివై. 69

ప్రసహ్య హత్వా శిష్యాంస్తు పాతాళం ప్రాపయామహే | తతో దేవాస్తు సంరబ్ధా దానవా నుపసృత్య చ. 70

తత స్తే వధ్యమానాస్తు కావ్యమే వాభిదుద్రువుః | తతః కావ్యస్తు తా న్దృష్ట్వా తూర్ణం దేవై రభిద్రుతా&.

రక్షా కావ్యేన సంహృత్య దేవాస్తే7థాసురార్దితాః| కావ్యం దృష్ట్వా స్థితం దేవా నిర్విశఙ్కా7సురా న్జహుః.

శుక్రదానవసంవాదః.

తతః కావ్యో7నుచిన్త్యాథ బ్రహ్మణో వచనం హితమ్‌ | తా నువాచ తతః కావ్యః పూర్వవృత్త మనుస్మర&.

త్రైలోక్యం వో హృతం సర్వం వామనేన త్రిభః క్రమైః | బలిర్బద్ధో హతో జమ్భో నిహతశ్చ విరోచనః.

మహాసురా *ద్వాదశసు సఙ్గ్రామేషు సురై ర్హతాః | తైసై#్త రుపాయై ర్భూయిష్ఠం నిహతా వః ప్రధానతః. 75

కిఞ్చి చ్ఛిష్టా స్స యూయం వో యుద్ధం నాస్తీతి మే మతిః |

నీతయో వో విధాతవ్యా ఉపాస్యాః కాలపర్యయమ్‌. 76

యాస్యామో7థ మహాదేవం ప్రార్థితుం విజయావహమ్‌|అప్రతీపాం స్తతో మన్త్రా న్తేవాత్ర్పాప్య మహేశ్వరాత్‌.

యుద్ధ్యామహే పున ర్దేవాం స్తతః ప్రాప్స్యథ వై జయమ్‌ | తత స్తే కృతసంవాదా దేవాదీంశ్చ తథా7సురాః.

న్యస్తశస్త్రా వయం సర్వే నిశాన్నా హారవర్జినః | వయం తప శ్చరిష్యామ స్సంవృతా వల్కలై ర్వనే. 79

ప్రహ్లోదస్య వచ శ్ర్శత్వా సత్యాభివ్యాహృతం తు తత్‌ | తతో దేవా న్యవర్తన్త విజ్వరా ముదితాశ్చ తే. 80

హిరణ్యకశిపుడు ఒక అర్బుదముమీద డెబ్బదిరెండు నియుతములమీద ఎనుబదివేల సంవత్సరములు త్రైలోక్య పాలకుడయ్యెను. ప్రహ్లాదుడును బలియు ఒక్కొక్కరు ఇరువది నియుతముల డెబ్బదివేల సంవత్సరములు త్రిలోకపాలకులయిరి. మహౌజస్సంపన్నులగు వీరు అసురులలో నుండి వచ్చిన ఇంద్రులు (అసురులై యుండియు త్రైలోక్య పాలనముచేసి ఇంద్రులై నవారు.) మరల పది దివ్యయుగములపాటు ఈత్రైలోక్యము అసురుల క్రింద నుండుటయు మరి అంతేకాలము అది ఇంద్రుని వశమయి అతని ఏలుబడిలో నుండుటయు ఇట్లు పర్యాయక్రమమున జరుగుచుండును. ఇట్టి పర్యాయములలో ఒకమారు దేవతలకు త్రైలోక్యపాలనాధికారము వచ్చినప్పుడు శుక్రుడు (తన శిష్యులగు) అసురులను విడిచి (జయోత్సవ రూపమున యజ్ఞము చేయుచున్న) దేవతలకడకు పోయెను. ఇది చూచి దైత్యులు శుక్రుని కడకు పోయి ''అయ్యా! మేము జీవిచియుండగనే మమ్ములను విడిచి మారాజ్యమును విడిచి దేవతల యజ్ఞమునకు పోవుచున్నారే! మేము ఇచట నిలువలేము. రసాతలమున ప్రవేశింతుము.'' అనిరి. అది విని శుక్రుడు విషణ్ణులగు దైత్య దానవుల నోదార్చుచు ఇట్లు పలికెను: ''మీరు భయపడకుడు. మిమ్ములను నాతేజముచే మరల ఉద్ధరించగలను. మంత్రములు ఓషధులు రసద్రవ్యములు వివిధములగు (బంగారు మొదలగు) ధనములు నా యధీనమున సముద్రముగానున్నవి. అవి మీకొరకే నా దగ్గర దాచియముంచితిని. అదియంతయు మీ కిత్తును.'' నా దగ్గర నున్న ఈ వస్తుసంచయములో నాలుగవ వంతు మాత్రమే దేవతలకు గలదు. అనెను.

ఈ విషయము తెలిసికొని దేవతలు భయపడిరి. వారందరును దైత్య దానవులకు ఆ ధనాదికము పోకుండ తామే అది గ్రహింపగోరిరి. శుక్రుడు మన కడ నున్న ధనమును కూడ బలాత్కారమున లాగికొనుచున్నాడు. దానిని దైత్య దానవులు తమ అధీనము చేసికొనక ముందే ఈ శుక్ర శిష్యులను చావగొట్టి పాతాళమునకు పంపుదము. అని ఆలోచనము చేసిరి. క్రోధావేశముతో వారు దానవుల కడకు పోయి వారిని చావగొట్టసాగిరి. దానవులు తాళ##లేక శుక్రుని కడకు పరుగెత్తుకొని పోయిరి. శుక్రు డది చూచి అసురులకు రక్ష కల్పించెను: దానితో అసుఏరులే దేవతల బాధింపసాగిరి. కావ్యు డక్కడనే యుండుటయు అసురులు నిర్భయులుగా నుండుటయు చూచి దేవతలు వారిని విడిచి వెనుకకు మరలి వచ్చిరి.

తరువాత శుక్రుడు పూర్వము బ్రహ్మ చెప్పిన హితకరమగు వచనమును జ్ఞస్తికి దెచ్చికొని పూర్వ వృత్తాంతములను స్మరించుచు అసురులకును అవి జ్ఞాపకము చేయుచు ఇట్లు పలికెను: ''మహాసురులారా! వామనుడు మూడడుగులతో మీ త్రైలోక్య రాజ్యమును హరించెను. బలిని బంధించెను. జంభుడును విరోచనుడును చంపబడిరి. పండ్రెండు సంగ్రామములయందును మహాసురులెందరో ఆయా యుపాయములతో సురల చేతిలో మరణించిరి. మీలో కొలది మంది మాత్రము మిగిలినారు. ఇపుడు యుద్ధము చేయరాదు. నీతి మార్గముల ననుసరించవలయును. కాలపు మార్పునకై ఎదురు చూడ వలయును. విజయము ఇప్పింపగలవాడు మహేశ్వరుడు. అతని కడకు పోయి ఆయనను ప్రార్థింతము. ఎదురులేని మంత్రముల నాయననుండి సంపాదింతము. అపుడు దేవతలతో పోరి జయము సంపాదింతము.

___________________________________________

*ద్వాదశచ.

(శుక్రుని వచనమును విని ప్రహ్లాదాది దానవులు దేవతలతో ఒడంబడిక యొకటి చేసికొనిరి.) మే మందరమును ఆయుధములను వదలుచున్నాము. రాత్రులయందు ఆహారము కూడ తినము. వల్కలములను ధరించి వనమున తపమాచరింతుము. (మేము మరల వచ్చు వరకు మనకు యుద్ధము ఉండదు.)

ప్రహ్లాదుడు సత్యముతో శపథముచేసి చెప్పిన ఆ మాటను విని దేవతల సంతాపము వదలి సంతోషము కలిగి యుద్ధ ప్రయత్నములనుండి నివృత్తు లయిరి. ఇట్లు దేవాసురు లిరువురును ఆయుదములు దూరముగా పారవయిచి సంతుష్టులయిరి.

న్యస్తశ##స్త్రేషు నిర్వృత్తా స్తదా దేవాసురా స్తథా | తత స్తా నబ్రవీ త్కవ్యః కిఞ్చిత్కాల ముపాస్యథ. 81

నిరుత్సుకా స్తపోయుక్తాః కాలం కార్యార్థసాధకమ్‌ | పితు ర్మమాశ్రమస్థావై సమ్ర్పతీక్ష్యత దానవాః. 82

తత్సంవిశ్యాసురా న్కావ్యో మహాదేవ మపద్యత |

శుక్రకృతతపః.

శుక్రః: మన్త్రా నిచ్ఛా మ్యహం దేవ యేన సన్తి బృహస్పతౌ. 83

పరాభవాయ దేవానా మసురాణాం జయాయచ | ఏవముక్తో7బ్రవీ ద్దేవో వ్రతం త్వం చర భార్గవ. 84

పూర్ణే వర్షసహస్రేతు కణధూమ మవాక్ఛిరాః | యది పశ్యపి భద్రం తే తతో మన్త్రా నవాప్స్యసి. 85

తథేతి సమనుజ్ఞాప్య శుక్రస్తు భృగునన్దనః | పాదౌ సంప్పృశ్య దేవస్య బాఢ మిత్య బ్రవీ ద్వచః. 86

ప్రతం చరామ్యహ్యం దేవ త్వయాదిష్టోద్య వై ప్రభో | తతో7నుసృష్టో దేవేన కుణ్డధారో హ్యధూమకృత్‌. 87

తదా తస్మి న్గతే శుక్రే హ్యసురాణాం హితాయ వై |మన్త్రార్థం తస్య వసతి బ్రహ్మచర్యం మహేశ్వరే. 88

తం బుద్ధ్వా నీతిపూర్వంతు రాజ్యే న్యస్తం తదా7సురైః | అస్మిం శ్ఛిద్రే తదామర్షా ద్దేవాస్తే సమభిద్రుతాః. 89

ధన్వినో7స్త్రాయుధా స్సర్వే బృహస్పతిపురస్సరాః |

దృష్ట్వా7సురగణా& దేవాః ప్రగృహీతాయుధా మునే. 90

ఉత్పేతు స్సహసా తే వై సన్త్రస్తా స్తా న్వచో7బ్రువన్‌ |

న్యస్తశ##స్త్రే7భ##యే దత్తే ఆచార్యే వ్రత మాస్థితే. 91

దత్వా7భయం నో హ్యభయం సమ్ప్రాప్తా నో జిఘాంసయా |

అనాచార్యా వయం దేవ స్త్యక్తశస్త్రా హ్యుపస్థితాః. 92

చీరకృష్ణాజినధరా నిష్క్రియా నిష్పరిగ్రహాః | రణ విజేతుం దేవాశ్చ నశక్ష్యామః కథఞ్చన. 93

అయుద్దేన ప్రపశ్యామ శ్శరణం కావ్యమాతరమ్‌ | ప్రాపద్యన్త తతో భీతా స్తేభ్యో7దా దభయం తు సా.

న భేతవ్యం న భేతవ్యం భయం త్యజత దానవాః | మత్సన్నిధౌ వర్తతాం వో న భీర్భవితు మర్హతి. 95

తథా చాభ్యుపపన్నాం స్తా న్దృష్ట్వా దేవా అథాసురాన్‌ | అభిజఘ్నుః ప్రసహ్యైతే న విచార్య బలాబలమ్‌.

తత స్తా న్వధ్యమానాంస్తు దేవై ర్దృష్ట్వా7సురాం స్తథా |

దేవీ క్రుద్ధా7బ్రవీ ద్దేవా ననిన్ద్రా న్వః కరో మ్యహమ్‌. 97

సంశ్రిత్య సర్వసమ్భారా నిన్ద్రబాహ్యచరాం స్తథా | తా& స్తమ్భయ ద్యోగబలా ద్యోగయుక్తా తపోధనా.

తతస్తే స్తమ్భితం దృష్ట్వా ఇన్ద్రం దేవాస్తు మూకవత్‌ |

ప్రాద్రవన్త తతో భీతా ఇన్ద్రం దృష్ట్ర్వాతా7వశీకృతాః. 99

గతేషు సురసఙ్ఘేషు శక్రం విష్ణు రభాషత | మాం త్వం ప్రవిశ భద్రం తే వధిష్యే తాన్‌ సురోత్తమ. 100

తరువాత శుక్రుడు అసురులతో ''మీరు తహతహపడక తపస్సాచరించుచు కొంచెము కాలము ఓపిక పట్టుడు. కాలమే జరుగవలసిన పనులను చక్క పెట్టును. దానవు లందరును మా తండ్రి ఆశ్రమమం దుండి నాకై ఎదురుచూచుచుండుడు.'' అని వారిని నెమ్మది పరచి మహాదేవుని కడకు పోయెను. అత డీశ్వరునితో ''దేవా! నాకు బృహస్పతికి తెలియని మంత్రములు-దేవతలకు పరాజయమును దానవులకు జయమును కలిగించునవి - కావలయును.'' అనెను. అది విని మహాదేవుడు 'భార్గవా! నీవు తలక్రిందులుగా ఉండి వ్రత (నియమ) ముల ననుష్ఠించుము. వేయిఏండ్లు నిండుసరికి నీకు కణధూమము దర్శన మిచ్చినచో నీకు సిద్ధి కలుగును. మంత్రములు లభించును.' అనెను. శుక్రుడును సరే యనెను. దేవా! నీవు ఆదేశించిన వ్రతము నాచరింతును. అని ఆ దేవుని పాదములంటి పలికెను. ఈశ్వరుని అనుమతితో *కుండధారుడై ధూమకృత్‌-కాక వ్రతము నారంభించెను.

ఇట్లు శుక్రుడు ఆసుల వ్రతమునకై మంత్రముల కోరి మహేశ్వరునికడ బ్రహ్మచర్యము నాచరించుచుండుట దేవత లెరిగిరి. అసురులు శుక్రుని నీతి పూర్వకముగా రాజాధికారమునందు నిలిపిరనియు వారు తెలిసికొనిరి. ఈ అవకాశములో దేవతలు బృహస్పతిని ముందుంచుకొని ధనుర్ధరులై అస్త్రాద్యాయుధములు ధరించి అసహనముతో కోపముతో అసురుల పైకి పోయిరి. ఇది చూచి వారు భయపడి దేతలతో ''దేవతలారా! మే మాయుధముల విడిచి యున్నాము. మా ఆచార్యుడు తపోవ్రతమునకై పోయి యున్నాడు. మీరు మా కభయ మిచ్చియు మమ్ము చంపదలచి వచ్చి యున్నారు. మా ఆచార్యుడు దగ్గర లేడు. మే మాయుధముల వదలి యున్నాము. నారబట్టలు కృష్ణాజినములు ధరించి నిష్క్రియులమై ఏ సాధనములును పరివారమును లేక యున్నాము.'' అనిరి. ఐనను వారు వినలేదు. వా రపుడు 'మనము యుద్ధమునదేవతల జయించజాలము. యుద్ధము చేయలేనపుడు మనకు శుక్రుని మాతయే దిక్కు.' అని తలచి వా రామెను శరణువేడిరి. ఆమె వారికి అభయ మిచ్చెను. దానవులారా! మీరు భయపడకుడు. భయపడకుడు. నా సంనిధిలో నుండగా మీరు భయపడవలసిన పనిలేదు. అనెను. అప్పటికిని విడువక దేవతలు బలాబలములు విచారించక బలము నుపయోగించి దానవులను చావగొట్టసాగిరి. అది చూచి దేవియగు శుక్రమాత క్రోధముతో దేవతలారా! మిమ్ములను ఇంద్రుడు లేని వారినిగా చేయుదుననెను. సర్వ సంభారములతో నన్నద్ధులయిన దేవతలను ఇంద్రుని కూడ తపోధనము యోగయుక్తయు అగు ఆమో స్తంభింపజేసెను. ఇంద్రుడును స్తంభించి మూగవాడువలె నయ్యెను. అది చూచి దేవతలు అవశులై ఇంద్రునితో కూడ విష్ణుని కడకు పోయిరి. విష్ణువు దేవ సంఘముల స్థితి చూచి ఇంద్రునితో 'సురోత్తమా! నీవు నన్ను ప్రవేశించి దాగియుండుము. నే నసురుల నందర చంపుదు.' ననెను.

ఏవముక్త స్తతో విష్ణుంప్రవివేశ పురన్దరః | విష్ణునా రక్షితం దృష్ట్వా దేవీ క్రుద్ధా వచో7బ్రవీత్‌. 101

ఏష త్వాం విష్ణునా సార్ధం దహామి మఘవ న్బలాత్‌ |

మిషతాం సర్వభూతానాం దృశ్యతాం వై తపోబలమ్‌. 102

తథా7భిభూతౌ తౌ దేవా విన్ద్రవిష్ణూ బభూవతుః | కథం ముచ్యేవ సహితౌ విష్ణు రిన్ద్ర మభాషత. 103

ఇన్ద్రో7బ్రవీ జ్జహి హ్యేనాం యావ న్నౌ న దహేత్‌ ప్రభో |

విశేషా దభిభూతో7స్మి త్వత్తో7హమపి మా చిరమ్‌. 104

తత స్సమీక్ష్య విష్ణు స్స్వం స్త్రీవధా త్కృచ్ఛ్ర మాస్థితః |

అభిద్యాయ తత శ్చక్ర మాపదు త్తరణో త్తమమ్‌. 105

తతస్తు త్వరయాయుక్త శ్శీఘ్రకారీ భయాన్వితః |

జ్ఞాత్వా విష్ణు స్తత స్తస్యాః క్రూరం దేవ్యా శ్చికీర్షితమ్‌. 106

_________________________________________

* కుండధారణ యాతన అనుభవించుచుండియు దూమమును తన స్రోతస్సులలోనికి పోనీయక దానిని పరమాణువుల రూపమున దర్శించ యత్నించుట.

క్రుద్ధ స్స్వ మస్త్ర మాదాయ శిర శ్చిచ్ఛేద వై భయాత్‌ |

తం దృష్ట్వా స్త్రీవధం ఘోరం చుక్రోధ భృగు రీశ్వరః. 107

భృగుద త్తవిష్ణుశాపో భృగుభార్యోజ్జీవనం చ

తతో7భిశప్తో భృగుణా విష్ణు ర్భార్యావధే తదా | యస్మా త్తే జానతో ధర్మ మవద్యా స్త్రీ నిషుదితా. 108

తస్మా త్త్వం సప్తకృత్వో హి మానుషేషూపపత్స్యతే | తత స్తేనాభిశాపేన నష్టేధర్మే పునః పునః. 109

లోకస్య చ హితార్థాయ జాయతే మానుషేష్విహ | అనువ్యాహృత్య విష్ణుంచ తదాదాయ శిరో మునిః. 110

సమానీయ తతః కాయ మసౌ గృహ్యేద మబ్రవీత్‌ |

ఏష త్వాం విష్ణునా దేవిహతాం సన్ధారయా మ్యహమ్‌. 111

యది కృత్స్నో మయా ధర్మో జ్ఞాయతే చరితో7పి వా | తేన సత్యేన జీవస్వ యది సత్యం బ్రవీమ్యహమ్‌.

తత స్తాంప్రోక్ష్య శాన్తాభి రద్భి ర్జీవేతి సో7బ్రవీత్‌ | తతో7భివ్యాహృతే తస్య దేవీ సఞ్జీవితా తదా. 113

తతస్తాం సర్వభూతాని దృష్ట్వా సుప్తోత్థితా మివ | సాధు సాధ్వితి చక్రుస్తే వచసా సర్వతోదిశమ్‌. 114

ఏవం ప్రత్యాహృతా తేన దేవీ సా భృగుణా తదా | మిషతాం దేవతానాం చ తదద్భుత మివాభవత్‌. 115

అసమ్భ్రాన్తేన భృగుణా పత్నీ సఞ్జీవితా పునః | దృష్ట్వా చేన్ద్రో న లభత శర్మ కావ్యభయా త్పునః. 116

ఇంద్రు డట్లే చేసెను. ఇంద్రుడు విష్ణునిచే రక్షితుడగుట చూచి శుక్రమాత కోపించి 'ఇంద్రా! నా తపోబలము ఎట్టిదో తెలియునా? సర్వభూతములు సాక్షిగా నేను విష్ణునితో కూడ నిన్ను దహింతును.' అనెను. ఇట్లు శుక్రమాత తిరస్కార పూర్వకముగా పలుకగా ఇంద్ర విష్ణు లిరువురును కలవరపడిరి. ఇపు డీమెనుండి ఎట్లు తప్పించుకొనవచ్చును? అని విష్ణు వింద్రునితో ననెను. ప్రభూ! ఆమె నన్నును నిన్నును దహించక మునుపే ఈమెను నీవు చంపుము. నేను నీ కంటెను ఎక్కువగా కలవరపడుచున్నాను. అని ఇంద్రు డనెను. అంతట విష్ణువు బాగుగా ఆలోచించెను. ఇంద్రుడును తానును ఆత్మరక్షణ మొనరించుకొనవలెననిన స్త్రీ వధ చేయవలయును. లేనిచో తమకు కీడు తప్పదు. ఇట్టి ఇరకాటములో విష్ణువు పడెను. ఆపదుద్దరణమునం దుత్తమమగు చక్రమును వెంటనే విష్ణువు స్మరించెను. అప్పుడును విష్ణువు త్వరపడసాగెను. చేయదలచిని పని త్వరగా చేయవలెను. లేనిచో తమకు కీడు కలుగునను భయము కలుగుచుండెను. ఆ దేవి చేయదలచిన క్రూరకర్మము ఎరిగి విష్ణువు క్రుద్ధుడై ఒకవైపు భయపడుచునే భృగుపత్నీ శిరమును ఖండించెను.

ఘోరమగు ఈ స్త్రీ వధమును చూచి భృగుముని క్రోధము చెందెను. అతడు చేతకానివాడు కాదు. తన భార్యా వధమునకు కోపించిన అతడు విష్ణుని శపించెను. 'నీవు స్త్రీ అవధ్యురాలను ధర్మము నెరిగియుండియు స్త్రీని వధించితివి. కావున నీవు ఏడుమారులు మనుష్యులు నడుమ మానవుడుగా జన్మింతువు.' అని ఆయన విష్ణుని అభి శపించెను. ఆ శాపఫలముగా లోకమున ధర్మము నశించి నపుడెల్ల లోకహితమునకై శ్రీవిష్ణువు అనుష్యుడుగా లోకమున జనించుచుండును.

ఇట్లు పలికి భృగుముని వెంటనే తన పత్ని శిరమును తీసికొనెను. దానిని మిగిలిన శరీరముతో చేర్చెను. ఇట్లు పలికెను: 'దేవీ! విష్ణునిచేత చంపబడిన నిన్ను ఇదిగో! మరల ఒకటిగా కూర్చుచున్నాను. నేను ధర్మమును సమగ్రముగా ఎరిగినవాడ నైనచో ఆచరించినవాడ నైనచో- నేను పలుకునది సత్యమే యైనచో ఆ సత్యముతో నీవు జీవింతువు గాక!'' ఇట్లు పలికి మంత్రములతో శాంతి జరుపబడిన జలములతో ఆమె (శరీరమును)ను ప్రోక్షించి 'జీవించుము.' అనెను. ఆమె అతని ఆ మాటతోపాటే జీవితురాలయ్యెను. నిదుర మేల్కాంచినట్లు లేచిన ఆమెను చూచి సర్వదిశలనుండియు సర్వ భూతములును సాధువాదములు (చాల బాగుగా నున్నది అను పలుకులు) పలికిరి. ఇట్లు ఆ దేవిని ఆ సమయమున భృగుమహాముని జీవింపజేసెను. ఇది సర్వ దేవతలును చూచుచుండిరి. ఇది ఎంతయో ఆశ్చర్యకరమగు విషయ మయ్యెను. ఈ సందర్భములో భృగు మహాముని ఏ మాత్రమును కలవరపాటు చెందకుండుట మరియు ఆశ్చర్యకరము. ఇది చూచి ఇంద్రుడు ఇకముందు శుక్రుని వలన మరింకేమి కీడు మూడునోయని మరింత భయపడెను. అతని మనస్సునకు శాంతియే లేకపోయెను.

శుక్రం ప్రతి ఇన్ద్రప్రేరితజయన్త్యాగమనమ్‌.

ప్రజాగరే తత శ్చేన్ద్రో జయన్తీ మిద మబ్రవీత్‌ | సఞ్చిన్త్య మఘవా న్వాక్యం స్వాం కన్యాంపాకశాసనః.

ఏష కావ్యో7ప్యమిత్రాయ వ్రతం చరతి దారుణమ్‌ |

తేనాహం వ్యాకులః పుత్త్రి కృతో మతిమతా భృశమ్‌. 118

గచ్ఛ సంశ్రావయసై#్వనం శ్రమాపనయనై శ్శ్రతైః | తై సై#్త ర్మనో7నుకూలైశ్చ ఉపచారై రతన్ద్రితా. 119

కావ్య మారాధయ సై#్వనం యథా తుష్యేత్తు స ద్విజః |

గచ్ఛ త్వం తస్య దత్తా7సి ప్రయత్నం కురు మత్కృతే. 220

ఏవ ముక్తా జయన్తీ సా వచ స్సఙ్గృహ్య వై పితుః | అగచ్ఛ ద్యత్ర ఘోరం స తప ఆరభ్య తిష్ఠతి.

తం దృష్ట్యా ను పిబన్తం సాకణధూమ మవాఙ్ముఖం | యక్షేణ పాత్యమానం చ కుణ్డధారణయాతనమ్‌. 122

దృష్ట్వా చ తం పాత్యమానం దేవీ కావ్య మవస్థితా | స్వ స్వరూపధరం దృష్ట్వా వపుషా వృత్తి మాస్థితా.

పిత్రా యథాక్తం వాక్యం సా కావ్యే కృతవతీ తథా | గీర్భి శ్చైవానుకూలాభి స్త్సువన్తీ వల్గుభాషిణీ. 124

గాత్రసంవాహనైః కాలే సేవమానా త్వచ స్సుఖైః | వ్రతచర్యానుకులాభి రువాస బహులా స్సమాః. 125

పూర్ణే దూమవ్రతే తస్మిన్ఘోరే వర్షసహస్రకే | వరేణ చ్ఛన్దయామాస కావ్యంప్రీతో7భవత్తదా. 126

మహేశ్వరః : ఏత ద్ర్వతం త్వయైకేన చీర్నం నాన్యేన కేనచిత్‌ |

తస్మాద్వై తపసా బుద్ధ్వా శ్రుతేనచ బలేన చ. 127

తేజసాచ సురా న్త్సర్వాం స్త్వమేకో7భివిష్యసి | * యథాభిలషితం బ్రమ్మ న్విద్యతే భృగునన్దన. 128

ప్రతిపత్స్యసి తత్సర్యం నానువాచ్యంతు కస్యచిత్‌ | సర్వాభిభావీ తేన త్వం భవిష్యసి ద్విజోత్తమ. 129

ఏతా& దత్వా వరాం స్తసై#్మ భార్గవాయ భవః పునః | ప్రజేశత్వంధనేశత్వ మవధ్యత్వం చ వై దదౌ. 130

ఏతా న్లబ్ధ్వా వరా న్కావ్య స్సమ్ర్పహృష్టతనూరుహః | హర్షా త్ర్పాదుర్బభౌ తస్య దివ్యస్తోత్రం మహేశ్వరే.

తథా తిర్యక్థ్సితశ్చైవ తుష్టువే నీలలోహితమ్‌ |

ఇంద్రునకు నిదురయే పట్టలేదు. అతడు అదే పనిగా ఆలోచించి ఒక నిర్ణయమునకు వచ్చెను. తన కూతురగు జయంతితో ఇట్లు పలికెను: ''బిడ్డా! ఇదుగో! ఈ శుక్రుడు శత్రునాశమునకై దారుణ తపము ఆచరించుచున్నాడు. మహా బుద్ధిశాలియగు ఇతని వలన నెంతయో వ్యాకులుడ నగుచున్నాను. కనుక నీవు అతని కడకు పొమ్ము. అతని శ్రమమును పోగొట్టు శుశ్రూషలు చేసెదననుము. నీవు ఏ మాత్రమును ఏమరుపాటుగాని సోమరితనము కాని లేక ఆయా ఉపచారములతో ఇతనిని ఆరాధించుము. ఆ బ్రాహ్మణుని సంతోషపెట్టుము. నేను నిన్నతని కిచ్చుచున్నాను. నీవు వెంటనే పొమ్ము. నాపక్షమున ప్రయత్నము చేయుము.''

ఇట్లు పలికిన ఇంద్రుని వచనము విని జయంతి సరేయని శుక్రుడు తపమాచరించుచున్న చోటికి పోయెను. అతనిని చూచెను. శుక్రుడు అవాఙ్ముఖుడై కణ దూమమును త్రాగుచున్నట్లుండెను. యక్షుడు పెట్టుచున్న «కుండధారణ

________________________________________

* యచ్చ కిఞ్చిదపి.

« అగ్ని కుండమునందు ఘోరమగు అగ్ని కణములు కాలుచుండ దాని సెగ తగులునట్లు తలక్రిందులుగా వ్రేలాడ పట్టుకొని ఇదిగో దీనియందు పడవేయుచున్నానని భయ పెట్టుచు ఆ సెగ వేడిమిని భరించునట్లు చేయుట కుండధారణ యాతన.

యాతనను అనుభవించుచుండెను. జయంతి ఇంకను దగ్గరకుపోయి చూచెను. ఇన్ని బాధలు పడుచుండియు కావ్యుడు స్వస్వరూపము ఏమాత్రము వికారము పొందక యుండెను. అమె అతనికి తాను చేయవలసిన శుశ్రూష చేయసాగెను. తన తండ్రి చెప్పిన విధమున ఆమె శుక్రునకు పరిచర్యలు చేసెను. ఆమె సహజముగనే మధురముగా మాటలాడు స్వభావము గలది. ఆమె శుక్రుని మనస్సునకు అనుకూలముగా మాటలాడుచుండును. ఆవశ్యకమయిన ఆయా సమయములందు అతనికి స్పర్శ సుఖము గలుగునట్లు గాత్ర సంవాహనము (కాలుసేతులు వెన్ను మొదలగునవి నొప్పి తీరునట్లు ఒత్తుట) లచే అతనికిహాయి కలిగించుచుండును. అతని వ్రతానుష్ఠానమున కనుకూలములగు ఆచరణలు ఆచరించుచుండును. ఇట్లు ఆమె చాల సంవత్సములు శుక్రుని సేవించెను.

ఇట్లు వేయి సంవత్సరములు నిండెను. శుక్రుని ధూమ వ్రతము ముగిసెను. శివుడు శుక్రుని వరము కోరు కొమ్మనెను. ''ఈ వ్రతమును నీవు తప్ప మరియెవ్వరును ఆచరించలేదు. అందువలన తపస్సుచే కాని బుద్ధిబలముచే కాని శాస్త్ర జ్ఞానముచే కాని బలముచేకాని తేజస్సుచే కాని నీవు ఒక్కడవే దేవతలవందరను నీక్రింది వారినిగా చేసికొనగలవు. విప్రా! నీమనస్సునందు ఏఏ అభిలషితములు కలవో అవి ప్రతియొక్కటియు నీవు పొందెదవు. ఈ విషయము మరియెవ్వరికిని చెప్పకుము. ఈ వరముచే నీవు అందరను మించినవాడవు అగుదువు.''

శివుడు శుక్రునకు ఈ వరములతో పాటు ప్రజాపతిత్వమును కుబేరత్వమును అవధ్యత్వమును కూడ వరములుగా ఇచ్చెను. ఇట్టి వరములు పొందిన శుక్రునకు సంతోషముచే శరీరమున రోమాంచము కలిగెను. హర్షవశమున అతనికి శివుని విషయమున దివ్యస్తోత్రము చిత్తమున స్ఫురించెను. అతడట్లు తలక్రిందులుగా ఉండియే శివుని ఈ విధముగా స్తుతించెను.

శుక్రకృతమ హేశ్వరస్తుతిః.

శుక్రః: నమో7స్తు శితికణ్ఠాయ కనిష్ఠాయ సువర్చసే. 132

లేలిహానాయ కావ్యాయ *వత్సరాయాన్ధసంపత్యే | కపర్దినే కరాళాయ హర్యక్షవరదాయ చ. 133

సంస్తుతాయ స్తుతార్థాయ దేవదేవాయ రంహసే | ఉష్ణీషిణ సువక్త్రాయ సహస్రాక్షయ మీఢుషే. 134

వసురేతాయ రుద్రాయ తవసే ¨కృత్తివాససే | *హ్రస్వాయ వ్వుప్తకేశాయ సేనాన్యే రోహితాయ చ. 135

కపయే రాజవృక్షయ తక్షకక్రీడనాయచ | సహస్రబాహవే చైవ సహస్రనయనాయచ. 136

సహస్రశిరసే చైవ బహురూపాయ వేధసే | హరాయ బహురూపాయ శ్వేతాయ పురుషాయచ. 137

గిరీశాయ మనోజ్ఞాయ చిత్తినే సుక్షతాయ చ | స న్తృప్తాయ సుహస్తాయ ధన్వినే భార్గవాయచ. 138

(ఈ స్తోత్రము శివత్రిశతీ నామాత్మకమయినది. ఇది పరమేశ్వరుని విరాట్స్వరూపమును నమస్త జగదాత్మ కత్వమును సకల జగదధిష్ఠాతృత్వమును ప్రతిపాదించుచున్నది. ఇది సకలోపషత్సారమును నామత్రిశతీ రూపమై రుద్రాధ్యాయముతో సమానమునునై ఇహపరములందు సకల పురుషార్థములను సులభముగ సమకూర్చ గలిగియున్నది. దీని యర్థము నెరిగి దీనిని పారాయణము చేయుట సకలాభీష్ట ఫలదాయకము-అనువాదకుడు.) నల్లని కంఠము కలవాడు సూక్ష్మతమరూపుడు శోభనమగు తేజస్సు కలవాడు లయము చేయువాడు కావ్యస్వరూపుడు-సంవత్సరరూపుడు అన్నమునకు అధిపతి-జటాజూటము కలవాడు (దుష్టులకు) భయంకరుడు-హర్యక్షు (కుబేరు)నకు వరములొసగినవాడు చక్కగా స్తుతింపబడువాడు-స్తుతింపబడిన అన్ని అర్థములును తానైనవాడు-దేవదేవుడు-వేగరూపుడు-తలపాగ ధరించినవాడు-అందమయిన మోము కలవాడు-మేలకొలది ఇంద్రియములు కలవాడు-కోరికలను ఇచ్చు వాడు-ధనమునకు బీజము వంటివాడు-దుష్టులను ఏడిపించువాడు తపోరూపుడు చర్మము వస్త్రముగా కలవాడు-చాలపొట్టివాడు-గొరగబడిన వెంట్రుకలు కలవాడు (మహాయతి) సేనాపతిరూపుడు ఎర్రనివాడు సూర్యరూపుడు-రాజవృక్షరూపుడు-తక్షకనాగుని క్రీడింపజేయువాడు-

_______________________________________

* వత్సరాయవనస్పతే. ¨చిత్ర. *ఈశాయముక్త.

వేలకొలది భుజములు కలవాడు వేలకొలది కన్నులు కలవాడు-వేలకొలది శిరస్సులు కలవాడు అనేక రూపములు కలవాడు-సృష్టి సేయువాడు లోకములను హరించువాడు-అనేక దేహములు కలవాడు-తెల్లనివాడు-సర్వభూతముల దేహములయందును శయనించువాడు పర్వతమునుకు (వాక్కులకు) ఈశుడు మనోహరుడు - చిత్తముకలవాడు-క్షతులకు (దెబ్బతినిన వారికి) మేలుచేయువాడు-చక్కగా తృష్తి నొందియుండువాడు-చక్కని హన్తములు కలవాడు ధనవు ధరించిన వాడు-భార్గవ స్వరూపుడునగు వానికి నీకు నమస్కారము.

నిషఙ్గిణచ తారాయ «సాక్షాయ క్షపణాయచ | తామ్రాయచై వ భీమాయ ఉగ్రాయచ శివాయచ. 139

మహాదేవాయ శర్వాయ విరూపాయ శివాయచ | హిరణ్యాయ విశిష్టాయ జ్యేష్ఠాయ మధ్యమాయచ. 140

బభ్రవేచ పిశఙ్గాయ పిఙ్గళాయారుణాయచ | పినాకినే 0చేషుమతే చిత్రాయ రోమితాయచ. 141

దున్దుభ్యా యైకపాదాయ అహయే(అజాయ)బుధ్ని యాయచ|మృగవ్యాధాయ(శ)సర్వాయ స్థాణవే భీషణాయచ.

బహునేత్రాయ పథ్యయ సునేత్రా యేశ్వరాయచ | కపాలినే కవీరాయ మృత్యవే త్ర్యమ్బకాయచ. 143

వాస్తోష్పతే (తయే) పినాకాయ ముక్తయే కేవలాయచ|ఆరణ్యాయ గృహస్థాయ యతయే బ్రహ్మచారిణ. 144

సాఙ్ఖ్యాయచైవయోగాయ వ్యాధినే దీక్షితాయచ | +అన్తర్హితాయ శర్వాయ భ##వ్యేశాయ శమాయచ. 145

అమ్ముల పొదులు కలవాడు నక్షత్ర రూపుడు (ప్రణవ రూపుడు) ఇంద్రియములతో కూడినవాడు-లోకములను (దుష్టులను) నశింపజేయువాడు ఎర్రనివాడు భయంకరుడు తీవ్రరూపుడు శుభకరుడు మహాదేవుడు (దేవతలందరలో గొప్పవాడు) దుష్టులను హింసించువాడు వికృతరూపుడు శుభరూపుడు ప్రకాశించువాడు గొప్పవాడు పెద్దవాడు మధ్యముడు బభ్రువర్ణము వాడు పసిమి ఎక్కువ ఎరుపు తక్కువ కలిసిన వన్నెవాడు పసిమి తక్కువ ఎరుపు ఎక్కువ కలిసిన వర్ణమువాడు ఎర్రనివాడు పినాకధనువు కలవాడు బాణములు దాల్చినవాడు అనేక వర్ణములవాడు రోహిత (ముదురు ఎరుపు) వర్ణమువాడు దుందుభియందుండువాడు ఒకే పాదము కలవాడు జన్మములేనివాడు ఆహిర్‌ బుధ్నియుడు మృగములను వెంటాడు వ్యాధరూపమువాడు ప్రతియొకటియు తానైనవాడు కదలనివాడు భీతిగొలుపువాడు అనేక నేత్రములు కలవాడు హితము కలిగించువాడు శోభన నేత్రములు కలవాడు ఈశ్వరుడు కపాలము ధరించినవాడు ఒకే యొక వీరుడు మృత్యువు-మూడు కన్నులు కలవాడు గృహమున కధిపతియగువాడు పినాక ధనుస్స్వరూపుడు కేవలరూపుడు వాన ప్రస్థుడు గృహస్థుడు యతి బ్రహ్మచారి సాంఖ్యదర్శనము యోగదర్శనము నైనవాడు వ్యాధులు (బోయవారు) తన సేనగా కలవాడు దీక్షస్వీకరించి యుండువాడు అంతర్ధానము నొందియుండువాడు హింస కలవాడు శుభమగు ఈశుడు శమస్వరూపుడు అగువానికి నమస్కారము.

రోహితే చేకితానాయ బ్రహ్మిష్ఠాయ మహర్షయే | చతుష్పదాయ మేధ్యాయ రక్షిణ శీఘ్రగాయచ. 146

శిఖణ్ణినే కరాళాయ దంష్ట్రిణ విశ్వవేధసే | భాస్కరాయ ప్రదీప్తాయ దీప్తాయచ సుమేధసే. 147

క్రూరాయ వికృతాయైవ బీభత్సాయ శివాయచ | సౌమ్యాయ చైవ పుణ్యాయ ధార్మికాయ శుభాయచ. 148

అవధ్యాయామృతాయైవ నిత్యాయ శాశ్వతాయచ | వ్యావృత్తాయ యవిష్ఠాయ భరతాయచ రక్షసే. 149

క్షేమ్యాయ సహమానాయ సత్యాయచ ఋతాయచ | ·కాట్యాయ రాసభాయైవ శూలినే దివ్యచక్షుషే. 150

సోమపా యాజ్యపాయైవ దూమపా యోష్మపాయయ | శచయే పరిధానాయ సద్యోజాతాయ మృత్యవే. 151

పిశితాశాయ శర్వాయ మేఘాయ విద్యుత్యాయచ | వ్యావృత్తాయ వరిష్ఠాయ భరతాయచ రక్షసే. 152

రోహితవర్ణుడు చాల తెలివి కలవాడు బ్రహ్మజ్ఞులలో శ్రేష్ఠుడు మహర్షిరూపుడు-చతుష్పాదుడు పవిత్రుడు రక్షించు వాడు శీఘ్రముగా పోవువాడు జుట్టు ముడి కలవాడు నిమ్నోన్నత రూపుడుకోరలు కలవాడు విశ్వముల నృష్టించువాడు

కాంతుల నిర్మించువాడు తీవ్రముగా ప్రకాశించువాడు శోభనమగు గ్రంథధారణా సామర్థ్యము కలవాడు (శోభనమేధకలవాడు) క్రూరుడు వికృతరూపుడు అసహ్యము గొలుపువాడు శుభుడు నెమ్మదితనము కలవాడు పుణ్యరూపుడుధర్మము నెరిగినవాడు (ధర్మము ననుష్ఠించువాడు) శుభుడు-అవధ్యుడు అమృతుడు నిత్యుడు శాశ్వతుడు (సహజరూపుడు) తన లక్షణములు ఇంకెవరియందును లేనివాడు అందరికంటె కడగొట్టువాడు అందర భరించువాడు రక్షఃస్వరూపుడు క్షేమము కలిగించువాడు ఎవరినైనను ఏదైనను సహించువాడు సత్యరూపుడు ఋతరూపుడు ముండ్లతో నిండిన దుర్గమ ప్రదేశములందుండువాడు రాసభరూపుడు శూలి దివ్యనేత్రములు కలవాడు సోమపానము చేయువాడు ఆజ్యమును పానము చేయువాడు ధూమమును పానము చేయువాడు ఊష్మమును పానము చేయువాడు శుచిరూపుడు పరిధాన (ధరించు వస్త్రము) స్వరూపుడు తత్‌క్షణమే సాక్షాత్కరించువాడు మృత్యువును కలిగించువాడు పిశితము (పచ్చిమాంసము) ఆహారముగా తినువాడు శర్వుడు మేఘరూపుడు విద్యుద్రూపుడు అన్నిటినుండియు మరలియుండువాడు శ్రేష్ఠడు అందరను సోషించువాడు రక్షించువాడు అగువానికి నీకు నమస్కారము.

________________________________________

«పక్షాయ. 0వసుమతే. +అనాహితాయ. ·కర్త్రేపరాసవేచైవ.

త్రిపురఘ్నాయ ÷దీప్తాయ చక్రాయ రోమశాయచ | తిగ్మాయుధాయ దక్షాయ సమిద్ధాయ పుల స్తయే. 153

రోచమానాయ చణ్డాయ స్థితాయ ఋషభాయచ | వ్రతినే యుఞ్జమానాయ శుచయే చోర్ధ్వరేతసే. 154

అసుర ఘ్నే మఘఘ్నాయ మృత్యుఘ్నే చాన్తకాయచ | కృశానవే ప్రశాన్తాయ వహ్నయే కింశిలాయచ. 155

రక్షోఘ్నాయ పశుఘ్నాయ విఘ్నాయ శ్వసితాయచ | అనాహతాయ సర్వాయ వ్యాపినే తాపనాయచ. 156

అనాశ్రితాయ దేవాయ సమిత్యధిష్ఠితాయచ | కృష్ణాయచ జయన్తాయ లోకానా మీశ్వరాయచ. 157

హిరణ్యబాహవేచైవ పాశాయచ సమాయచ | సుకన్యాయ సుసస్యాయ ఈశానాయ సుచక్షుషే. 158

క్షిప్రేషనే సుధన్వాయ ప్రథమాయ శివాయచ | కపిలాయ పిశఙ్గాయ మహాదేవాయ ధీమతే. 159

మహాకామాయ దీప్తాయ రోదనాయ సహాయచ | దృఢధన్వినే కవచినే రథినేచ వరూథినే. 160

త్రిపురములను సంహరిచంఉవాడు ప్రకాశిచంచువాడు చక్రస్వరూపుడు-రోమములతో నిండినవాడు-తీక్షణములగు ఆయుధములు కలవాడు సమర్థుడు బాగుగా ప్రజ్వలించువాడు భక్తుల ఎదుట నిలుచువాడు బంగారువలె ప్రకాశించువాడు భయము గొలుపువాడు (భక్తుల నుద్ధరించుటకై) నిలువబడి యుండువాడు. ఋషభముని రూపుడు-వేదవ్రతముల ననుష్ఠించువాడు-పూనికతో నుండువాడు శుచియగువాడు ఊర్ధ్వరేతస్కుడు రాక్షసులను చంపువాడు యజ్ఞమును ధ్వంసముచేయువాడు మృత్యువును సంహరించినవాడు సర్వమును సమాప్తము చేయువాడు అగ్ని స్వరూపుడు ప్రశాంతుడు హవిస్సుడు మోసికొనిపోవువాడు కుత్సితములగు శిలలుకల ప్రదేశముల రూపమున నున్నవాడు-రక్షస్సుల చంపువాడు పశువుల (దుష్టజీవుల) చంపువాడు విఘ్నరూపుడు శ్వాసరూపుడు అనాహత నాదస్వరూపుడు సర్వరూపుడు వ్యాపించియుండువాడు తపింపచేయువాడు (సూర్యాగ్నిరూపుడు) దేనిని ఆశ్రయించక యుండువాడు దివ్‌ ధాతువునకు అర్థముగా నుండువాడు సమితులను (యుద్దములను-సమాజములను) అధిష్ఠించి యుండువాడు కృష్ణుడు జయంతుడు లోకములకు ఈశ్వరుడు హిరణ్యబాహుడు పాశరూపుడు సముడు శోభనములగు కన్యలు కలవాడు చక్కనిపైరుల రూపమున నుండువాడు జీవాత్మకును అధిష్ఠాతయగువాడు చక్కని నేత్రములు కలవాడు శీఘ్రముగా పోవు బాణములు కలవాడు శోభనమగు ధనువు కలవాడు మొట్టమొదటివాడు పరమాత్మరూపుడు కపిలవర్ణుడు పింగళవర్ణుడు మహాదేవుడు బుద్ధిశాలి గొప్ప సంకల్పములు కలవాడు ప్రకాశింపజేయువాడు దుష్టుల నేడిపించువాడు అందరనోడించువాడు దృఢ ధనువు గలవాడు కవచము కలవాడు రథము కలవాడు వరూథము (ఒక విధమగు కవచము-రథభాగము) కలవాడు అగు నీకు నమస్కారము.

__________________________________________

÷ తీర్థాయ.

భృగునాధాయ శుక్రాయ గహ్వరేష్ఠాయ వేధసే | అమోఘాయ ప్రశాన్తాయఅమృతాయ వృషాయచ. 161

నమోస్తు తుభ్యం భగవ న్మహతే కృత్తివాససే | పశూనాం పతయే తుభ్యం భూతానాంపతయే నమః. 162

ప్రణమ్య ఋగ్యజుస్సామ్నే స్వాహాయచ స్వధాయచ | వషట్కారాత్మనే చైవ తుభ్య మర్థాత్మనే నమః. 164

వసవేచైవ సార్థాయ రుద్రాదిత్యాశ్వినాయచ | నిర్గుణాయ గుణజ్ఞాయ వ్యాకృతాయ కృతాయచ. 165

స్వయమ్భువే ప్రజాయైవ అపూర్వప్రథమాయచ | ప్రజానాం పతయేచైవ తుభ్యం బ్రహ్మాత్మనే నమః. 166

ఆత్మేశాయాత్మవశ్యాయ సర్వస్యాతిశయాయచ | సర్వభూతాత్మభూతాయ తుభ్యం భూతాత్మనే నమః. 167

నిర్గుణాయ గుణజ్ఞాయ వ్యాకృతాయా7కృతాయచ | విరూపాక్షాయ మిత్రాయ తుభ్యం సాఙ్ఖ్యాత్మనే నమః.

పృథివ్యై చాన్తరిక్షాయ దివ్యాయచ మహాయచ | జన స్తపాయ సత్యాయ తుభ్యం లోకాత్మనే నమః. 169

అవ్యక్తాయ మహాన్తాయ భూతాదే రిన్ద్రియాయచ | ఆత్మజ్ఞాయ విశిష్టాయ తుభ్యం సర్వాత్మనే నమః. 170

నిత్యాయ చాత్మలిఙ్గాయ సూక్ష్మాయ చేతనాయచ | బుద్ధాయ విభ##వేచైవ తుభ్యం మోక్షాత్మనే నమః. 171

నమస్తే త్రిషు లోకేషు నమస్తే పరత స్త్రిషు | సత్యాతన్త్యేషు మహాన్త్యేషు చతుర్‌షుచ నమో7స్తుతే. 172

నామస్తోత్రే మయా హ్యస్మి న్యదపవ్యాహృతం భ##వేత్‌ |

మద్భక్త ఇతి బ్రహ్మణ్య తత్సర్వం క్షన్తు మర్హసి. 173

భృగువంశ రక్షకుడు-శుక్రాచార్యరూపుడు-హృదయ గుహయందుండువాడు-శాస్త్ర విధానముల చేయువాడు సఫలుడు ప్రశాంతుడు అమృతస్వరూపుడు సర్వభూతములను అమృతముతో తడుపువాడు భగవానుడు గొప్ప పరిమాణము కలవాడు గజచర్మము వస్త్రముగా గలవాడు జీవులకు అధిపతి సకల భూతములచే నమస్కరించపబడువాడు ఋగ్యజుఃసామ స్వరూపుడు స్వాహాకారరూపుడు వషట్కారరూపుడు ఆత్మరూపుడు అవధిరూపుడు సృష్టించువాడు నిర్మించువాడు సర్వము చేయువాడు పాపముల హరించువాడు దయాపరుడు దయనీయుడు (దీనుల రూపమున నుండువాడు) భూత వర్తమాన భవిష్యకాల రూపముల నుండువాడు కర్మరూపుడునగు నీకు నమస్కారము.

వసువులు సాధ్యులు రుద్రులు ఆదిత్యులు అశ్వినులు అను దేవతల రూపమున నుండువాడు నిర్గుణుడు త్రిగుణముల నెరిగినవాడు నామరూప విభాగమునొందినవాడు సృష్టిచేయబడిన ప్రపంచ రూపమున నుండువాడు తనకుతానై యుండువాడు (పుట్టిన) ప్రజల రూపముతో నుండువాడు పూర్వము ఎన్నడు లేనివాడు మొదటివాడు ప్రజాపతిరూపుడు బ్రహ్మరూపుడు తనకుతానే అధిపతియగువాడుతన అధీనమున తానుండువాడు అన్నిటిని అతిశయించినవాడు సర్వభూతములకు ఆత్మయగు వాడు భూతరూపుడునగు నీకు నమస్కారము.

నిర్గుణుడు గుణముల (తత్త్వము)ను ఎరిగినవాడు నామరూపాది విభాగము నొందినవాడు వేటిచేతను చేయబడనివాడు (స్వయంసిద్ధుడు) వికృతములగు (బేసి సంఖ్యగల) కన్నులు కలవాడు ఎల్ల భూతములకు మిత్రుడు (ఉదయించు సూర్యరూపమున నున్నవాడు) సాంఖ్య తత్త్వరూపుడునగు నీకు నమస్కారము. పృథివి అంతరిక్షము ద్యులోకము మహర్లోకము జన స్తవస్సత్యలోకములునను లోకముల రూపముననుండు నీకు నమస్కారము. నామ రూపాదికముతో వ్యక్తము కానివాడు మహద్‌రూపుడు భూతములకు ఆదియగువాడు ఇంద్రియరూపుడు ఆత్మ తత్త్వము నెరిగిన వాడు అన్నిటికంటెను గొప్పవాడు సర్వత త్త్వ రూపుడునగు నీకు నమస్కారము. నిత్యుడు ఆత్మలింగరూపుడు సూక్ష్ముడు చేతనరూపుడు బోధము (జ్ఞానము) పొందినవాడు సర్వవ్యాపియగువాడు మోక్షరూపుడునగు నీకు నమస్కారము. మూడు లోకములయందు ఉండు నీకు నమస్కారము. వీటికి పైగా ఉండు మూడు లోకములయందు ఉండు నీకు నమస్కారము. సత్యలోకముతో ముగియు నాలుగు లోకములయందును మహాలోకముతో ముగియు నాలుగు లోకములయందును ఉండు నీకు నమస్కారము.

బ్రహ్మజ్ఞుడవగు పరమేశ్వరా! ఈ నామస్తోత్రమునందు నేనేదైన పొరబాటులు పలికినను ఇది పలికిన ఇతడు నాభక్తుడేకదా యను దయతో నన్ను క్షమించ ప్రార్థించుచున్నాను.

సూతః: ఏవ మాభాష్య దేవేశ మీశ్వరం నీలలోహితమ్‌ |

బహ్వతిప్రణత స్తసై#్మ ప్రాఞ్జలి ర్వాగ్యతో7భవత్‌. 174

కావ్యస్య గాత్రం సంస్పృశ్య హస్తేన ప్రీతిమా న్భవః | నికామందర్శనం దత్వా తత్రైవా న్తరధీయత. 175

తత స్సో7న్తర్హితే తస్మి& దేవే సానుచరే తదా | తిష్ఠన్తీం పార్శ్వతో దృష్ట్వా జయన్తీమిద మబ్రవీత్‌. 176

శుక్రజయ న్తీసంల్లాపః.

శుక్రః: కస్య త్వం సుభ##గే కావా దుఃఖితే మయి దుఃఖితా |

మహతా తపసా యుక్తం కిమర్థం మాం జుగోపసి. 177

అనయా సంస్థితా భక్త్యా ప్రశ్రయేణ «యమేన చ | స్నే హేన చైవ సుశ్రోణి ప్రీతో7స్మి వరవర్ణిని. 178

కి మిచ్ఛసి వరారోహే కస్తే కామ స్సమృద్ధ్యతామ్‌ |

త త్తే సమ్పాదయా మ్యద్య యద్యపి స్యా త్సుదుర్లభమ్‌. 179

ఏవ ముక్తా7బ్రవీ దేనం తపసా జ్ఞాతు మర్హసి | చికీర్షితం హిమే బ్రహ్మం స్తం హి వేద యథాతథమ్‌.

ఏవ ముక్తో7బ్రవీ దేనాం దృష్ట్వా దివ్యేన చక్షుషా | మయా సహ త్వం సుశ్రోణి దశ వర్షాణి భామిని.

సర్వభూతై రదృశ్యా త్వం సమ్ర్పయోగ మిహేచ్ఛసి | దేవి ఇన్దీవరశ్యామే వరార్హే వామలోచనే. 182

ఏవం వృణోమి కామం త్వాం యది చే ద్వల్గుభాషిణి | ఏవం భవతు గచ్ఛావో గేహం మే మత్తకాశిని.

తత స్స గృహ మాగత్య జయన్త్యాః పాణి ముద్వహత్‌ | తయా సమభవ ద్దేవ్యా దశ వర్షాణి భార్గవః.

అదృశ్య స్సర్వభూతానాం మాయయా సంవృతః ప్రభుః |

కృతార్థ మాగతం జ్ఞాత్వాకావ్యం సర్వే దితే స్సుతాః. 185

అభిజగ్ము ర్గృహం తస్య ముదితా స్తే దిదృక్షవః | గతా యదా న పశ్యన్తి మాయయా సంవృతం గురుమ్‌.

లక్షణం తస్య తద్బుద్ధ్వా ప్రతిజగ్ము ర్యథాగతమ్‌ |

శుక్రుడు దేవేశుడును ఈశ్వరుడును నీలలోహితుడు నగు శివునితో ఇట్లు పలికి బహువారములు మిగుల ప్రణామములు చేసి దోసిలియొగ్గి మౌనము వహించెను. భవుడును ప్రీతుడై శుక్రుని శరీరమును స్పృశించి మిక్కిలి స్పష్టముగా తన దర్శనమునిచ్చి అచ్చటనే అంతర్ధానమునందెను.

తన అనుచరులతో కూడ ఆ దేవుడంతర్ధానమునందిన పిమ్మట తన సమీపమందున్న జయంతిని చూచి శుక్రుడిట్లు పలికెను: సుందరీ! ఎవ్వరిదానవు! ఎవరవు? నాదుఃఖములో పాలువంచుకొనుచున్నావు. నేను మహా తపస్సాచరించుచున్న కాలములో నన్ను కాపాడుచుంటివి. ఇటువంటి భక్తి వినయము ఇంద్రియ నిగ్రహము స్నేహము నా విషయమున చూపుచుండిన నీపై నేను ప్రీతుడనయితిని. నీకేమి కావలయును? చెప్పుము. అది ఎంత దుర్లభమయినను నీకోరిక నెరవేర్చెదను. అనగా ఆమె 'అయ్యా! దివ్యమగు తపశ్శక్తిచే కలిగిన జ్ఞాననేత్రముతో చూచి నాకోరికను మీరే ఎరుగ ప్రార్థించుచున్నాను.' అనెను. శుక్రుడు దివ్యదృష్టితోచూచి 'భామినీ! పది ఏండ్లపాటు నీవు భూతములకు వేనికిని అదృశ్యురాలవై నాతో కలిసియుండ గోరుచున్నావు. నల్ల కలువపూలవంటి చాయయు ఉత్తమ సుందర రూపమును మనోహర నేత్రములును మధురమగు వాక్కును కలదానవగుటచే నేనును నిన్ను కామించుచున్నాను. నీకోరికను తీర్చెదను. ఇంటికి పోవుదము రమ్ము. అనెను. తరువాతశుక్రుడు స్వగృహమునకు వచ్చి జయంతిని పెండ్లాడెను. అట్లే పదిఏండ్లు ఏ భూతములకును కనబడక జయంతితో కూడి దాంపత్యము ననుభవించుచుండెను.

___________________________________________

*దమేనచ

ఇట్లుండగా దైత్యులును తమ గురువగు శుక్రుడు తపస్సునందు కృతార్థుడై తిరిగి వచ్చెనని ఎరిగిరి. వారు సంతోషమునంది ఆయనను చూడగోరి అతని ఇంటికి పోయిరి. కాని శుక్రుడు మాయచే కప్పువడియున్నందున అతడు వారికి కనబడలేదు. అతడు మాయచే మరుగుపడియున్నాడని గుర్తెరిగి వారును మరలిపోయిరి.

దైత్యానాం కపటవేష గురుకృతవిద్యాభ్యాసః.

బృహన్పతిస్తు సంరుద్ధం కావ్యం జ్ఞాత్వా వరేణ తమ్‌. 187

ప్రీత్యర్థం దశ వర్షాణి జయన్త్యా హితకామ్యయా | గురు స్తద న్తరం లబ్ధ్వా దైత్యానా మిన్ద్రచోదితః. 188

కావ్యస్య రూప మాస్థాయ అసురా న్త్సముపాహ్వయత్‌ | తత స్తా నాగతా న్దృష్ట్వా బృహస్పతి రువాచ హ.

స్వాగతం మమ యాజ్వానాం ప్రాప్తో7హం వో హితాయ వై |

అహం వో7ధ్యాపయిష్యామి విద్యా ప్రాప్తా తు యా మయా. 190

తత స్తే హృష్టమనసో విద్యార్థ ముపపేదిరే | పూర్ణే కావ్యా త్తత స్తస్మి న్త్సమయే దశవార్షికే. 191

సమయాన్తే దేవయానీతతోత్పన్నా ఇతి శ్రుతిః | బుద్ధిం చక్రే తత స్సో వై యాజ్యానాం ప్రత్యవేక్షణ.

దేవి గచ్ఛామ్యహం ద్రష్టుం మమ యాజ్యా న్ఛుచిస్మితే | విభ్రాన్తప్రేక్షణ సాధ్వి «త్రివర్ణాయతలోచనే.

ఏవ ముక్తా బ్రవీ దేనం భజ భక్తా న్మహావ్రత | ఏష ధర్మ స్సతాం బ్రహ్మ న్న ధర్మం లోపయామి తే.

తతో గత్వా7సురా న్దృష్ట్వా దేవాచార్యేణ ధీమతా |

వఞ్చితా న్కావ్యరూపేణ తతః కావ్యో7బ్రవీత్తు తా&. 195

కావ్యం మాం వో విజానీధ్వ మయ మాఙ్గిరసో విభుః|

వఞ్చితా ·బత యూయం తే ర్వే శృణుత దానవాః. 196

శ్రుత్వా తథా బ్రువాణం తం సమ్భ్రాన్తా స్తే తదా7భవ& |

ప్రేక్షన్త స్తా పుభౌ తత్ర స్థిరాసీనౌ శుచిస్మితౌ. 197

నమ్ప్రమూఢా స్తత స్సర్వే ప్రాబుధ్యన్త న కిఞ్చన | అబ్రవీ త్సమ్ప్రమూఢేషు కావ్య స్తా నసురాం స్తదా.

ఆచార్యో వో హ్యహం కావ్యో దేవాచార్యో7య మఙ్గిరాః|అనుగచ్ఛన్తు మాందైత్యా స్త్యజతైనం బృహస్పతిమ్‌.

ఇత్యుక్తా మ్యసురా స్తేన తావుభౌ సమవేక్ష్యచ | యథా పురా విశేషం తు నజానన్త్యుభయో స్తయోః. 200

బృహస్పతి రువాచైనా నసమ్భ్రాన్త స్తపోధనః |

కావ్యో వో7హం ¨గురు ర్దైత్యా మద్రూపోయం బృహస్పతిః. 201

సమ్మోహయతి రూపేణ మామకేనైష వో7సురాః |

శ్రుత్వా తస్య వచ స్తే వై సమేత్యోచు ర్వచో ధ్రువమ్‌. 202

అయం నో దశ వర్షాణి సతతం శాస్తి వై ప్రభుః | ఏష వై గురు రస్మాక మన్తరేప్సు రయం ద్విజః.

తత స్తే దానవా స్సర్వే ప్రణిపత్యాభివాద్యచ | వచనం జగృహు స్తస్య చిరాభ్యాసేన మోహితాః. 204

ఊచు స్త మసురా స్సర్వే క్రోధా త్సంర క్తలోచనాః |

అయం గురు ర్యతో7స్మాకం గచ్ఛ త్వం నాసి నో గురుః. 205

ఖార్గవో వాఙ్గిరోవాపి భగవా నేష నోగురుః | స్థితా వయం నిదేశే7స్య సాధు త్వం గచ్ఛ మా చిరమ్‌. 206

ఏవ ముక్త్వాసురా స్సర్వే ప్రాపద్యన్త బృహస్పతిమ్‌ |

__________________________________________

«విస్తీ ·ఏవ యూయంవై ¨రుర్దైత్యాః కుహకో

శక్రుడు శివునివలన వరములను పొంది వచ్చెననియు ఐనను జయంతికిమేలు చేయగోరి పదిఏండ్లపాటు మాయతో ఆవృతుడై మరుగుపడియుండుననియు బృహస్పతి ఎరిగెను. ఈ అవకాశములో అతడు ఇంద్రుని ప్రేరణచే శుక్రుని రూపము ధరించి దైత్యులను తనకడకు పిలిచెను. వారు తనకడకు రాగా అతడు వారితో ఇట్లు పలికెను: ''నాకు యాజ్యులు (యజ్ఞాదులు చేయింపబడువారు) అగు మీకు స్వాగతము. నేను మీకు మేలు చేయగోరి వచ్చినాను. నేను సంపాదించి తెచ్చినవిద్యలను మీచే అధ్యయనముచేయింతును.'' వారును సంతోషముతో విద్యాధయనార్థము బృహస్పతిని ఆశ్రయించి యుండిరి.

కాలము గడచెను. పదిఏండ్లును నిండెను. ఆ సమయము ముగియుసరికి జయంతీ శుక్రులకు దేవయాని జన్మించెనని పరంపరలో వినుచున్నాము.

అంతట శుక్రుడు తన యాజ్యులగు దానవుల మంచిచెడ్డలను విచారించగోరెను. నేను నా యాజ్యులను చూడ బోయెదనని అతడు జయంతితో పలికెను. ''మహాతపస్వీ! నీభక్తులను అనుగ్రహించుము. సజ్జనుల ధర్మము ఇదియే కదా! నేను నీ ధర్మమునకు లోపము కలుగనీయను. అని జయంతి పలికెను.

దేవాచార్యుడగు శుక్రుడు పోయి దానవులను దైత్యులను చూచెను. బృహస్పతి శుక్రరూపమున వారిని వంచించెననిఅతడు ఎరిగెను. ''దైత్యలారా! నేను శుక్రుడనని గురుతించుడు. ఇతడు వివిధ రూపములు ధరించుటలో సమర్థడగు బృహస్పతి. ఇతడు మిమ్ము వంచించెను. నామాట వినుడు.'' అనెను. శుక్రుడు అట్లు పలుకుట విని దైత్యులు తడబాటు చెందిరి. వారు ఆ ఇరువురను చూచుచుండిరి. ఆ ఇరువురును పవిత్రమగు చిరునవ్వుతో స్థిరముగా కూర్చుండి యుండిరి. వారందరును మిగుల మూఢ చిత్తులయిరి. వారికి ఏమియు అర్థము కాకపోయెను. అట్టి దైత్య దానవులను చూచి శుక్రుడు మరల ''నేను మీ ఆచార్యుడనగు శుక్రుడను. ఇతడు దేవాచార్యుడు ఆంగిరసుడు (బృహస్పతి). మీరందరు నన్న నుసరించుడు. ఈ బృహస్పతిని విడువుడు.'' అనెను. అసురులును శుక్రుని ఈమాటలు వినిరి. వారు ఇద్దరను గమనించి చూచిరి. ఎంత చూచినను వారికి ఆ ఇద్దరకు గల భేదము ఏమియు గోచరించలేదు. తపోధనుడగు బృహస్పతి ఏమాత్రము తడబడక దానవులతో ఇట్లనెను. ''ధైత్యులారా! మీ గురుడనగు శుక్రుడను నేనే. ఇతడు (వాస్తవ శుక్రుడు) నా రూపము దాల్చిన బృహస్పతి. ఇతడు ఇట్లు మిమ్ములను మోసపుచ్చుచున్నాడు.'' అంతట దానవులందరును తమలోతాము సంప్రతించుకొనిరి. అందరు కలిసి గట్టిగా ఇట్లనిరి: ''ఇతడు పది సంవ్సరముల నుండి మనలను తన శిక్షణయందుంచుచున్నాడు. ఇతడే మనకు ప్రభువు (యోగక్షేమము కలిగింపగల సమర్థుడు.) ఇతడే మనకు గురువు. ఈ (రెండవ) బ్రాహ్మణుడు అవకాశము చూచుకొని వచ్చినవాడు.'' ఇట్లు పలికిన వారందరును మాయా శుక్రునికి చాగిలపడి నమస్కారము చేసిరి. చాల కాలమునుండి అలవాటు పడియున్నందున వారు సత్యమును గుర్తించలేకపోయిరి. అందుచే వారు బృహస్పతి మాటనే సత్యముగా గ్రహించిరి. వారు క్రోధముతో కండ్లెర్రజేసి శుక్రునితో ఇట్లు అనిరి: ''ఇతడే మా గురువు. కనుక నీవు వెళ్ళిపొమ్మ. నీవు మాకు గురువవుకావు. ఈతడు శుక్రుడో బృహస్పతియో మాకు అక్కరలేదు. ఈ భగవానుడే మాగురువు. మేమందరమును ఇతని ఆజ్ఞయందే ఉంటిమి. ఉన్నాము. ఉందుము. నీవు ఇటనుండి తిన్నగా వెళ్ళిపొమ్ము. తడవు చేయకుము.'' అనిరి. ఇట్లు పలికి దానవులు అందరను బృహస్పతిని గురునిగా ఆశ్రయించి ఉండిరి.

యదా న ప్రతిపద్యన్త కావ్యేనోక్తం మహ ద్ధితమ్‌. 207

చుకోప భార్గవ స్తేషా మవలేపేన తేన తు | బోధితా మాయయా యస్మాన్న మాం భజథ దానవాః. 208

తస్మా త్ప్రణష్టసంజ్ఞావై పరాభవ మవాప్స్యథ |

ఇతి వ్యాహృత్య తా న్కావ్యో జగామాథ యథాగతమ్‌. 209

శప్తాం స్తా నసురా& జ్ఞాత్వా కావ్యేన స బృహన్పతిః |

కృతార్థస్తు తదా హృష్ట స్స్వరూపం ప్రత్యపద్యత. 210

బుద్ధ్యాహతాసురా& జ్ఞాత్వా తత్రైవాన్తరధీయత | తతః ప్రణష్టే తస్మింస్తు విభ్రాన్తా దానవా7భవన్‌. 211

పున శ్శుక్రంప్రతి దానవాగమనమ్‌.

అహోధి గ్వఞ్చితా స్తేన పరస్పర మథా7బ్రువన్‌ |

పృష్ఠతో7భి ముఖాశ్చైవ తాడితా7ఙ్గిరసేన తు. 212

వఞ్చితా స్సాధునా తేన స్వకృత్యేనతు మాయయా|

తతస్తు పరిశుష్కాస్యా స్తమేవ త్వరితా యయుః. 213

ప్రహ్లాద మగ్రతః కృత్వా కావ్యస్యానుపదం పునః |

తతః కావ్యం సమాసాద్య తే7వతస్థు రవాఙ్ముఖాః. 214

ఆగతా న్త్స పున ర్దృష్ట్వా కావ్యో యాజ్యా నువాచ హ |

మయా సమ్బోధితా స్సర్వే యస్మా న్మాంనాభినన్దథ. 215

తత స్తేనావమానేన గతా యూయం పరాభవమ్‌ |

ఏవం బ్రువాణం శుక్రంతు బాష్పసన్దిగ్ధలోచనః. 216

ప్రహ్లోద స్తం తదోవాచ మా7స్మాం స్త్వం త్యజ భార్గవ |

స్వాశ్రయా న్భజమానాంశ్చ భక్తాంశ్చ భజ భార్గవ. 217

త్వ య్యదృష్టే వయం తేన దేవాచార్యేణ మోహితాః |

భక్తా న్నార్హసి వై హాతుం తపోదీర్ఘేణ చక్షుషా. 218

యది న స్త్వం న కురుషే ప్రసాదం భృగునన్దన |

అవజ్ఞాతా స్త్వయా హ్యద్య ప్రవిశామో రసాతలమ్‌. 219

తాను చెప్పిన అంతటి గొప్ప హితవచనమును దైత్యులు వినకపోవుటచేత శుక్రుడు వారిపై చాల కోపించెను. వారి గర్వము కూడ అతనికి కోపహేతువయ్యెను. ''మాయా బలమున బృహస్పతి చేసిన బోధనములు విని మీరు నన్నాశ్రయింపకున్నారు. కావున దానవులారా! మీరు తెలివి కోల్పోయి. పరాభవముల పాలగుదురుగాక!'' అని పలికి శుక్రాచార్యుడు తాను వచ్చిన త్రోవను పోయెను.

శుక్రునిచేత దానవులు శపింపబడినట్లు తెలియగనే బృహస్పతి తాను కృతార్థుడయ్యెనని తలచి హర్షము పొందెను. అసురులు బుద్ధి కోల్పోయినమాట అతనికి సంతోషము కలిగించెను. వెంటనే అతడు స్వరూపము ధరించెను. అంతర్ధనము కూడ పొందెను.

అతడట్లు అంతర్ధానము పొందగా దైత్యులు విభ్రాంతులయిరి. అయ్యా! ఛీ! అతడు మనలను మోసగించెనే! అని ఒకరితో మరియొకరనసాగిరి. ఈ ఆంగిరసుడు (బృహస్పతి) మనలను వెనుకనుండియు ముందునుండియు దెబ్బ తీసెనే! అతడు తన మాయ చేష్టలతో మనలను మోసగించెనే! అని చింతించిరి. అంతట వారు చింతచే నోళ్ళెండిపోవుచుండ ప్రహ్లాదుని ముందుంచుకొని శుక్రుని అడుగుల వెంటనే బయలుదేరి అతడు వెళ్ళిన మార్గముననుసరించి పోయిరి. చివరకు శుక్రుని సమీపము చేరిరి. తలవంచుకొని అతని ముందు నిలువబడిరి.

మరల తన ఎదుటికి వచ్చిన తన యాజ్యులైన దానవులను చూచి శుక్రుడు వారితో నేనెంత హెచ్చరించినను ''మీరందరును నామాట పై ఆదరము చూపక పోతిరి. నాపై మీరు చూపిన అవమాన దృష్టికి ఫలముగా మీరు అవమానము పొందితిరి.'' అనెను.

శుక్రాచార్యుడు ఇట్లు పలుకుచుండ ప్రహ్లాదుడు బాష్పములు క్రమ్మిన కన్నులతో ఇట్లు పలికెను: ''భార్గవా! మీరు మమ్ములను విడువవలదు. మాకు మీరే ఆశ్రయము. మేము మిమ్ము ఆశ్రయించుచున్నాము. మీకు భక్తులము. ఇట్టి మాకు మీరు ఆశ్రయము ఇండు. మీరు మాకు కనబడని సమయములో దేవగురువు మమ్ములను మోసగించెను. మమ్ములను మాయలో పడవేసెను. తపస్సుచే దీర్ఘములగు నేత్రములుగల మీరు ఎంతవరకైన మీదృష్టి ప్రసారము చేయగలరు. మీరే మామనస్సలలోనికి చూడుడు. మేము మీ భక్తులము. మమ్ములను విడువవలదు. భృగునందనా! మీరు మమ్ముల ననుగ్రహింపనిచో-మీరు మమ్ములను ఆలక్ష్యముగా చూచినచో-మేము ఇప్పుడే రసాతలమును ప్రవేశింతుము.

జ్ఞాత్వాకావ్యో యథాత త్త్వం కారుణ్యా దనుకమ్పయా |

ఏవం ప్రత్యనునీతో వై తతః కోపం నియమ్య సః. 220

ఉవాచై సం ; శుక్రః : న భేతవ్యం న గన్తవ్యం రసాతలమ్‌ |

అవశ్యం భావినో హ్యర్థాః ప్రాప్తా వో *మమ చాగ్రతః. 221

న శక్య మన్యథా కర్తుం దిష్టం హి బలవత్తరమ్‌ |

సంజ్ఞా ప్రణష్టా వో యాజ్యాః కాలేన ప్రతిపత్స్యథ. 222

దేవై ర్జితా న కుత్రాపి పాతాళం ప్రతిపత్స్యథ | ప్రాప్తః పర్యయకాలో వ ఇతి బ్రహ్మా7భ్యభాషత. 223

మత్ప్రసాదాచ్చ త్రైలోక్యం భుక్తం యుష్మాభి రూర్జితం |

యుగాఖ్యా దశ సమ్పూర్ణా దేవా నాక్రమ్య మూర్ధని. 224

ఏతావదేవ వః కాలం బ్రహ్మా రాజ్యం ప్రభాషత | రాజ్యం సావర్ణికే తుభ్యం పునః కిల భవిష్యతి. 225

లోకానా మీశ్వరో భావ్య స్తవ పౌత్త్రః పున ర్బలిః | ఏవం కిల మిథః ప్రోక్తః పౌ త్త్రస్తే విష్ణునా స్వయమ్‌.

తదా హృతేషు లోకేషు తా స్తా స్తన్యాభవ న్కిల |

యస్మా త్ప్రవృత్తయ శ్చాస్య సకాశా దభినన్ధితాః. 227

తస్మా దనేన ప్రీతేన కృత్స్నం దత్తం స్వయమ్భువా |

దేవరాజ్యే బలిర్భావ్య ఇతి మా మీశ్వరో7బ్రవీత్‌. 228

తస్మా దదృశ్యో భూతానాం కాలాపేక్ష స్స తిష్ఠతి |

ప్రీతేన చామరత్వం చ దత్తం తుభ్యం స్వయమ్భువా. 229

తస్మా న్నిరుత్సుక స్త్వం వై పర్యాయసహితో7సురైః |

న హి శక్యం మయా తుభ్యం పురస్తా ద్విప్రభాషితుమ్‌. 230

బ్రహ్మణా ప్రతిషిద్ధో7హం భవిష్య జ్జానతా7ప్యుభౌ |

ఇమౌతు శిఫ్యౌ ద్వౌమహ్యం సమ్మతౌ వై బృహస్పతేః. 231

దైవతై స్సహ సంయుక్తౌ సురాన్వై వారయిష్యథ | ఇత్యుక్తా హ్యసురా స్సర్వే కావ్యేనాక్లిష్టకర్మణా. 232

హృష్టా స్తథా యయు స్సర్వే ప్రహ్లాదేన సహాసురాః |

అవశ్యం భావ్య మర్థంతు శ్రుత్వా శుక్రేణ భాషితమ్‌. 233

శుక్రాచార్యుడు యథార్థమును తెలిసికొనెను. అతడు సహజముగానే కరుణాస్వభావుడు. భూతములపై అనుకంప కలవాడు. ప్రహ్లాదాది దైత్యులును తన్నెంతగానో బ్రతిమాలిరి. అందుచే అతడు తన కోపము అణచుకొని

______________________________________

*మయి జాగ్రతి

ప్రహ్లాదునితో ఇట్లు పలికెను: ''మీరు భయపడవలదు. రసాతలమునకు పోవలసిన పనిలేదు. అవశ్యము జరుగవలసిన విషయములు ఏవో మీకును జరిగినవి-నాకును జరిగినవి. దైవనిర్ణయము బలవ త్తరము. దానిని మనము మార్ఛజాలము. నాయాజ్యులగు మీకు దురదృష్టవశమున తెలివి తప్పినది. మరల తగిన కాలమున మీకు తెలివి వచ్చును. దేవతల చేతిలో మీరు ఓటమి పొంది పాతాళమునకు పోవలసిన అగత్యము ఎప్పటికిని రాదు. ఇప్పుడు మీకు ప్రతికూల సమయము వచ్చి ఇట్లు జరిగినది. అని బ్రహ్మ పలికియున్నాడు. నా యను గ్రహమున మీరు శ క్తి సంపత్సమృద్దమైన త్రైలోక్యరాజ్యమును అనుభవించితిరి. పది దివ్య యుగములపాటు దేవతల శిరస్సులపై మీ పాదముల నిలుపగలిగితిరి. మీ రాజ్యకాలము ఇంతమాత్రమే. అని బ్రహ్మ పూర్వము చెప్పియుండెను. మరల సావర్ణిక మన్వంతరమున నీకు (ప్రహ్లాదునకు) రాజ్యధికారము వచ్చును. తరువాత మీ మనుమడు బలి మరల త్రిలోకములకును ఈశ్వరుడగును. ఈ విషయమును రహస్యమును మీ మనుమడై న బలితో స్వయముగా విష్ణువే చెప్పియుండెను. విష్ణువు తాను బలినుండి వంచనచే లోకములను హరించిన సమయమున అంతవరకు బలి తన పాలిత ప్రదేశములందన్నిట ప్రవర్తిల్లజేసిన లోకప్రవృత్తులను గూడ మోసముచే తీసివేసికొనెను. అందుచే ప్రీతుడై విష్ణువు «బలికి ఈ వరమునిచ్చెను. అందుచే బలి మరలదేవరాజ పదము నలంకరించి తీరవలయును. అని ఈశ్వరుడే నాతో చెప్పియున్నాడు. అందుచేత బలి అంతవరకును ఏ భూతములకును అదృశ్యుడై మంచి కాలమునకు ఎదురు చూచుచుండును. అట్లే విష్ణువు నీకును అమరత్వమును వరముగనిచ్చియున్నాడు. అందుచే నీవు ఏమియు తహతహపడక పర్యాయక్రమములో (వంతుల ననుసరించి) దేవతల అధికారము తరువాత మీ అధికారకాలము వచ్చువరకు ఎదురు చూడవలయును. నేను నీముందు అసత్యము పలుకజాలను. ఈ విషయము నీతో ఇప్పటికే చెప్పవలసియుండెను. కాని బ్రహ్మ చెప్పవలదనుటచే నాకు ఈ భవిష్యత్‌ తెలిసియుండియు నీకు చెప్పియుండలేదు. ఈ నా శిష్యులిద్దరును (శండుడు మర్కుడుఉ అనువారు) బృహస్పతికి ఆదరపాత్రులై యుండి దేవతలతో కలిసియుండి (మీకు నాశము కలుగనియకుండునట్లు) దేవతలను వారంతురు.''

అని ఇట్లు శుక్రుడు దానవులకు చెప్పెను. అతడు ఎట్టి క్లిష్టమయిన పనులనైనను సునాయాసముగా చక్కపెట్టగలవాడు. తప్పక జరిగి తీరెడి భవిష్యద్విషయములనే శుక్రుడు తమకు చెప్పెను. కనుక ప్రహ్లాదుడు మొదలగు దైత్యులందరును హర్షముతో వెడలిపోయిరి.

సకృ దాశంసమానాస్తు భయం శుక్రేణ భాషితమ్‌ |

దంశితా స్సాయుధా స్సర్వే తతో దేవా న్త్సమాహ్వయన్‌. 234

దేవా న్తథా7సురా న్దృష్ట్వా సఙ్గ్రామే సముపస్థితాన్‌ |

సర్వే సమ్భృతసమ్భారా దేవా స్తా న్త్సమయోధయన్‌. 235

దైవాసురే తత స్తస్మి న్వర్తమానే శతం సమాః |

అజయ న్నసురా దేవాం స్తతో దేవా న్త్వమన్త్రయన్‌. 236

యజ్ఞేనోపాసయామో7ద్య తతో జేష్యామహే7సురాన్‌ |

తత స్సమ్మన్త్రయన్‌దేవా శ్శణ్డామర్కౌతు తా వుభౌ. 237

యజ్ఞేనో పాహ్వయిష్యామ స్త్వక్షతా నసురాన్‌ ద్విజాః|

తతో గ్రహౌ గ్రహీష్యామ స్సహ జిత్వా దానవాన్‌. 238

______________________________________

« బలి చక్రవర్తి తన పాలనకాలమున త్రిలోకములందును ఒక ఉత్తమమగు పాలన వ్యవస్థను నిలిపెను. విష్ణువు దేవతలకై బలినుండి త్రిలోకరాజ్యమును హరించెనేకాని బలి అతఃపూర్వము లోకములందు నిలిపిన వ్రవృత్తుల కంటె మేలగు ప్రవృత్తులను దేవతలు కాని మానవులుకాని ఎవ్వరును ఏర్పరుపలేరు. కావున తరువాత దేవతలు బలి అంతకు మునుపు నడుపుచుండిన ప్రవృత్తులతోనే లోకపాలనను సాగించిరి. ఇది బలి గొప్పదనము. బలి ఇట్టి ఉత్తమ పాలకుడు గావున అతని విషయమున విష్ణువు ప్రీతుడై అతనికి ఉత్తమ వరములిచ్చుట ఆశ్చర్యకరముకాదు.

ఎవం కృత్వా7భిసన్ధానం శణ్డామర్కౌ సురా నగుః |

తతో దేవా జయం ప్రాప్తా దానవాశ్చ పరాజయమ్‌. 239

శణ్డామర్కౌ పరిత్యక్తౌ దానవా హ్యబలా స్తదా |

ఏవం దైత్యాః పురా కావ్య ·కోపేనాభిహతా స్తథా. 240

దేవై ర్దైత్యాః పరాభూతా శ్శణ్డామర్కా వుపాశ్రితాః |

కావ్యకోపాభిభూతాస్తే అనాధారాశ్చ సర్వతః. 241

నిరస్యమానా దేవైశ్చ వివిశుస్తే రసాతలమ్‌ | ఏవం నిరుధ్య తై ర్దేవై ర్జితాః కీచ్ఛ్రేణ దానవాః. 242

ప్రహ్లాదస్య తు నిర్దేశేన స్థాస్యం త్యసురాశ్చ యే |

మనుష్యవధ్యాం స్తా న్త్సర్వాన్‌ బ్రహ్మా7భివ్యాహర త్ప్రభుః. 243

శుక్రుడు చెప్పినట్లు తమకు దేవతలవలన భయము రానున్నదని ఎరిగి దానిని వారించుకొనదలచి దైత్యులు కవచములను ఆయుధములను ధరించి దేవతలను యుద్ధమునకు ఆహ్వానించిరి. అది చూచిన దేవతలును ఆయా సామగ్రులను సమకూర్చుకొని దైత్యులతో తలపడిరి. ఈ దైవాసుర యుద్ధము నూరేండ్లు జరిగెను. దీనిలో తుదకు దైత్యులే దేవతలను గెలిచిరి. దేవతలోడిరి.

దేవతలు అందరును మంత్రాలోచనము చేసిరి. యజ్ఞముచే (భగవానుని) ఉపాసింతము. ఆ విధముగ దైత్యులను ఓడింతము. అని సంకల్పించిరి.

వారంతట శుక్ర శిష్యులగు శండామర్కులను బ్రాహ్మణులను పిలిచి ''మనము యజ్ఞము జరుపుదము. తరువాత ఇప్పటికి యుద్ధమున గాయపడకుండిన దైత్యులనందరును యుద్ధమునకు పిలిచెదము. మనమందరము కలిసి దానవులను గెలిచి వారి ధనమును గెలిచికొందము.'' అనిరి. ఇట్లు మోసముతో ఒడంబడిక చేసికొని « శండామర్కులు దేవతల పక్షమునకు పోయిరి. దీనికి ఫలితముగా దేవతలు గెలిచిరి. దైత్యులోడిరి. శండామర్కులు తమ్ము విడిచి పోయినందున దానవులు బలహీనులైరి. ఇట్లు పూర్వము దైత్యులు శుక్రుని కోపము మూలమున దెబ్బతిని దేవతల చేతిలో పరాభవమునందిరి. అపుడు మరల వారు శండామర్కుల నాశ్రయించిరి.

దైత్యులు ఇట్లు కావ్యుని కోపముచే వ్యాప్తులై ఎచ్చటను ఏ ఆశ్రయమును లేనివారయిరి. దేవతలచే ముట్టడించబడి వారిచేతిలో ఓడిపోయి ఎన్నో క్లేశముల పాలయిరి. ప్రహ్లాదుని ఆజ్జకు లోబడి నడచుకొనని రాక్షసులందరును మానవుల చేతులలో కూడ మరణింతురిని బ్రహ్మ పూర్వమే పలికియుండెను.

విష్ణో ర్భృగుశాపనిమిత్తకధర్మాద్యవతారాః.

తతః ప్రభృతి శాపేన భృగునై మిత్తికేవ చ | జజ్ఞే పునః పున ర్విష్ణు ర్ధర్మే ప్రశిథిలే ప్రభుః 244

కుర్వ న్ధర్మనరవ్యవస్థాన మసురాణాం నిబర్హ ణమ్‌ |

ధర్మో నారాయణస్యాంశా త్సమ్భూత శ్చాక్షుషే7న్తరే. 245

యజ్ఞం వై వర్తయామాసు ర్దేవా వైవస్వతే7న్తరే |

ప్రాదుర్భావే తత స్తస్య బ్రహ్మాప్యాసీ త్పురోహితః. 246

___________________________________________

· శాపేనా

« ఈ సందర్భమున దేవతలు జరిపిన యజ్ఞమును శండామర్కులు నిర్వహించిన విషయమే ఈ అధ్యాయమున ఏబది ఐదవ శ్లోకమున చెప్పబడియున్నది.

యుగాఖ్యాయాం చతుర్థాయా మాపన్నే ష్వమరేషు వై | హిరణ్యాక్షవధార్థాయ హిరణ్యకశిపో స్తథా. 247

ద్వితీయే నారసింహాఖ్యే «రుద్రో7ప్యాసీ త్పురోహితః |

బలి సంస్థేషు లోకేషు త్రేతాయాం సప్తమం ప్రతి. 248

తృతీయం వామనస్యార్థే ధర్మేణతు పురోయే |

ఏతా స్తిస్ర స్స్మృతా స్తస్య దివ్యా స్సమ్భూతయ శ్శుభాః. 249

మానుషా స్సప్త యే7న్యే తు శాపజా స్తా న్నిబోధత |

త్రేతాయుగే7థ ప్రథమే దత్తాత్రేయో బభూవ హ. 250

నష్టే ధర్మే చతుర్థో7సౌ మార్కణ్డయః పురోహితః |

పఞ్చమః పఞ్చదశ్యాంచ త్రేతాయాం సమ్బభూవహ. 251

మాన్ధాతా చక్రవర్తీతు తస్య రైభ్యః పురోహిత | ఏకోనవింశ త్రేతాయాం సర్వక్షత్త్రాన్తకృ ద్విభుః. 252

జామ దగ్న్య స్తథా షష్ఠో విశ్వామిత్రపురస్సరః | చతుర్వింశే యేగే రామో వసిష్ఠేన పురోధసా. 253

సప్తమో రావణస్యార్థే జజ్ఞే దశరథాత్మజః | అష్టమో ద్వాపరే విష్ణు రష్టావింశే పరాశరాత్‌. 254

వేదవ్యాస స్తథా జజ్ఞే జాతూకర్ణ్యపురస్సరః | కర్తుం ధర్మవ్యవస్థాన మసురాణాం నిబర్హణమ్‌. 255

కృష్ణో నవమకో జజ్ఞే తపసా పుష్కరేక్షణః | దేవక్యాం వసుదేవేన ద్వైపాయనపురస్సరః 256

తస్మిన్నేవ యుగే క్షీణ సన్ధ్యాశిష్టే భవిష్యతి | కల్కి ర్విష్ణుయశా నామ పారాశర్యపురస్సరః. 257

దశమో భావిసమ్భూతో యాజ్ఞవల్క్యః పురోహీతః |

సర్వాంశ్చ భూతా న్ప్రమితా న్పాషణ్డాంశ్చైవ సర్వత:. 258

ప్రగృమీతాయుధై ర్విపై#్ర ర్వృత శ్శతసహస్రశః | నిశ్శేషా న్ఛూద్ర రాజ్ఞస్తు తదా చాన్తం కరిష్యతి. 259

బ్రహ్మద్విష స్సపత్నాంస్తు సంహృత్త్యెవ తతః ప్రభుః |

పఞ్చవింశే స్థితః కల్కి శ్చరితార్థ స్ససైనికః. 260

శూద్రా న్త్సంశోధయిత్వా తు సముద్రాన్తే చ వై స్వయమ్‌ |

ప్రవృత్తచక్రో బలవా న్త్సంహారంతు కరిష్యతి. 261

ఉత్పాటయిత్వా వృషలా న్ర్పాయశ స్తా నధార్మికా& | తత సై#్త ర్దానవైః కల్కి శ్చరితార్థస్ససైనికః.

ప్రజా స్సంశోధయిత్వాతు సముద్రాన్తే శయిష్యతి |

అకస్మా త్కోపనా7న్యోన్యం హనిష్యన్తీహ మోహితాః. 263

క్షపయిత్వా తతో7న్యోన్యం భావితార్థేన చోదితాః | తతః కలౌ వ్యతీతేతు స దేవో7న్తరధీయత. 264

తరువాత అది మొదలుకొని భృగు శాపమును నిమిత్తముగా చేసికొని ప్రభువగు శ్రీ నారాయణుడు లోకమున ధర్మము మిగుల శిథిలమయినపుడెల్ల ధర్మవ్యవస్థను రాక్షస నాశమును కలిగించుటకై మరల మరల అవతారములను ఎ త్తనారంభించెను. ఇట్లు అతడు అజుడు-జన్మము లేనివాడయ్యును జన్మము నందసాగెను.

వీనిలో మొదటిది ధర్మావతారము : చాక్షుష మన్వంతరమున నారాయణుడు అంశముతో ధర్ముడుగా అవతరించెను. అతని ప్రాదుర్భావ కాలమునందే ఆ చాక్షుష మన్వంతరమునందే దేవతలు యజ్ఞము నాచరించిరి. ఈ యజ్ఞము నందు బ్రహ్మ అధ్వర్యుడుగా నుండెను.

రెండవది నారసింహావతారము: నాలుగవ దివ్య యుగమునందు అమరులకు ఆపదలు కలుగగా హిరణ్యాక్ష

___________________________________________

« భద్రోహ్యాసీత్పురోహితః

హిరణ్యకశిపులను వధించుటకై నారాయణడు నారసింహుడయ్యెను. ఈ కాలమున దేవతలు జరిపిన యజ్ఞమున రుద్రుడు పురోహితుడు (అధ్వర్యుడు) అయ్యెను.

మూడవది వామనావతారము: స ప్తమ మహాయుగపు త్రేతాయుగమున త్రిలోకములును బలి వశగతములు కాగా నారాయణుడు వామనుడుగా నవతరించెను. ఈ కాలమున దేవతలు జరిపిన యజ్ఞమున దర్ముడు (మహాముని) అధ్వర్యుడు అయ్యెను.

ఇవి శ్రీ మహావిష్ణువునకు భృగుశాప నిమిత్తమున కలిగిన జన్మములలో మూడు. ఇవి దివ్యములగు (దేవతా తత్త్వ సంబంధులగు) అవతారములు. ఇవి కాక మిగిలిన ఏడును మానుషములు.

నాలుగవది దత్తాత్రేయావతారము. ఇది ప్రథమ త్రేతా యుగమున జరిగెను. ఈ కాలమున దేవతలు జరిపిన యజ్ఞమునందు మార్కండేయుడు పురోహితుడయ్యెను.

పదునై దవ త్రేతాయుగమున జరిగిన మాంధాతృ చక్ర వర్త్యవతారము ఐదవది. అతనికి రైభ్యడు పురోహితుడయ్యెను.

పందొమ్మిదవ త్రేతాయుగమున జరిగిన పరశురామావతారము ఆరవది. ఈ విభుడు సర్వక్షత్త్రాంతకరుడు. ఇతడు జమదగ్ని కుమారుడు. విశ్వామిత్త్రు డీతనికి పురోహితుడు.

ఇరువది నాలుగవ త్రేతాయుగమున రావణవధార్థమై దశరథ కుమారుడుగా జనించిన శ్రీ రాముని అవతారము ఏడవది. ఇతనికి వసిష్ఠుడు పురోహితుడు.

ఇరువది ఎనిమిదవ ద్వాపరముగమున పరాశర పుత్త్రుడుగా జన్మించిన వేదవ్యాసుడు ఎనిమిదవ యవతారము. జాతుకర్ణ్యుడు ఈతనికి పురోహితుడు. ఈతడు ధర్మప్రతిష్ఠాపనమును అసురనాశమును జరుపుటకు హేతుభూతుడయ్యెను.

పద్మనేత్రుడగు శ్రీ నారాయణుడు ఇదే ఇరువది ఎనిమిదవ ద్వాపరమున దేవకీ వసుదేవుల కుమారుడగు కృష్ణుడుగా నవతరించెను. ఇది తొమ్మిదవ యవతారము. ఇతని పురోహితుడు ద్వైపాయన వ్యాసుడు.

ఈ కల్పమునందే యుగధర్మము క్షీణించగా కల్ప సంధ్యాకాలమున విష్ణు యశుడు అనునాతనికి కల్కి అనుపేరు కుమారుడుగా శ్రీ నారాయణుడు జనించును. ఇది పదియవ యవతారము. ఇతనికి పారాశర్య వ్యాసుడు అగ్రేసరుడై యుండును. యాజ్ఞవల్క్యుడీతని పురోహితుడు. ఆయుధములు ధరించిన లక్షల కొలది విప్రులీతనికి సేనగా నుందురు. ఈతడు దుష్టులగు అనేక భూతములను పాషండులను వేదములకు విప్రులకు శత్రువులగు నరులను శూద్రలగు వేదద్వేషులగు రాజులను అంతము నొందించును. సముద్రముల అంచులవరకు గల భూమండలమునందలి దుష్ట శూద్రులను నశింపజేయును. ఆ కాలమునందే జనులును దుష్ఠులగు వారు మోహితులై ఒకరిని మరియొకరు వధించుకొందురు. జరుగవలసిన భవితవ్యత ప్రేరించగా ఆ దుష్టులందరు నట్లు నశించగాఇంతలో కలియుగము గడువగా ఆ కల్కి మూర్తి అంతర్ధానమునందును.

కలిధర్మాః.

నృపే ష్వథ ప్రణష్టేషు ప్రజానాం సఙ్గ్రహా త్తదా |

రక్షణ తు నివృత్తే తు హత్వా చాన్యో7న్య మాహవే. 265

పరస్పరం చ హత్వా తు నిరాక్రన్దా స్సుదుఃఖితాః | పురాణి హిత్వా గ్రామాంశ్చ తుల్యత్వే నిష్పరిగ్రహాః.

ప్రణష్టాశ్రమధర్మార్థా నష్టవర్ణాశ్రమా స్తథా | అట్టశూలా జనపదా శ్శివశూలా శ్చతుష్పథాః. 267

ప్రమదాః కేశశూలిన్యో భవిష్యన్తి కలౌ యుగే| హ్రస్వదేహాయుషశ్చైవ భవిష్యన్తి వనౌకసః. 268

నదీపర్వత సేవిన్యో మూలపత్రఫలాశనాః | చీరచర్మాజినధరా స్సంకటం ఘోర మాశ్రితాః. 269

ఉత్పన్నవాదా స్స్వల్పస్వా బుద్ధివాదాల్పకాః ప్రజాః | ఏవం కష్ట మను ప్రాప్తాః కలౌ సఙ్కరకే తథా. 270

తదా క్షయం గమిష్యన్తి సార్ధం కలియుగే జనాః | క్షీణ కలియుగే తస్మిం స్తతః కృత మవర్తత. 271

ఇత్యేత త్కథితం సమ్య గ్దేవాసురవిచేష్టితమ్‌ | యదునంశ ప్రసంగేన సమాసా ద్వైష్ణవం యశః. 272

తుర్వసోస్తు ప్రవక్ష్యామి పూరో ర్ద్రుహ్యో రనో స్తథా. 2724

ఇతి శ్రీమత్స్యమమాపురాణ చన్ద్ర వంశానువర్ణనే యదువంశే కృష్నజన్మాది

కథనం నామ సప్తచత్వారింశో7ధ్యాయః.

యుగాంతమున ప్రజలను రక్షించు నిమిత్తమయి చివరకు రాజులందరును నశింతురు. వారిని రక్షించు వారెవ్వరును ఉండరు. వారు ఒకరిని మరియొకరు చంపుకొందురు. వారు మిగుల దుఃఖముల పాలగుటయే కాక అవి చెప్పుకొనుటకు దిక్కులేని వారగుదురు. అందరును ఒకరిని మరొకరు హింసించుకొనుచు సమముగా దుర్మార్గులగుటతోవారు తమ ఆస్తులు విడిచి పురములు గ్రామములు విడిచి పోవుదురు. ఆయా ఆశ్రమ ధర్మములకు కావలసిన వస్తువులే దొరుకక పోవును. వర్ణాశ్రమ ధర్మములు నశించును. జనపదములలో అన్న మును విక్రయింతురు. చతుష్పథము (నాలుగు వీథులును కలియు కూడలు)లలో వేదములు అమ్ముదురు. (ధనమునకు ఆశపడి వేద ధర్మములను అందరకును బహిరంగముగా ప్రవచింతురు.) స్త్రీలు తమ శీల పవిత్రతను అమ్ముకొందురు. ప్రజలు పొట్టిదేహములు కలవారు అల్పాయుష్కులు అడవులలో నదీ తీరములలో పర్వతములలో నివసించు వారగుదురు. వారలు చర్మములు ధరింతురు ఘోరములగు సంకటముల పొందుదురు. అందరును వాదగొండులగుదురు. ఆస్తులు తగ్గిపోవును. బుద్ధి వాదములు చేయుదురు. అల్పబుద్ధులగుదురు. సంకర ప్రధానమగు కలియుగములో ప్రజలు ఇట్లు కష్టముల సొందుదురు. తుదకు కలియుగములో జనులిట్లు కష్టములు పడిపడి ఒకేమారు నాశము పొందుదురు. అంతట కృతయుగమారంభమగును.

ఇట్లు మీకు యదువంశమును తెలుపు ప్రసంగమున దై వాసుర యుద్ధమును చక్కగా చెప్పితిని. విష్ణుయశమును కూడ తెలిపితిని. ఇక మీదట తుర్వసు ద్రుహ్య్వనుపూరుల వంశమును తెలిపెదను.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున చంద్రవంశానువర్ణనమున యదువంశ కథనమున శ్రీకృష్ణావతార ప్రసంగము న దై వాసుర యుద్ధాది కథనము భగవదవతార హేతు కథనమునను నలువది యేడవ అధ్యాయము.

గమనిక

(13వ అధ్యాయమున శ్రీదేవి దక్షప్రజాపతికి తన అష్టో త్తరశతస్థానములను తెలిపెను. వానిని శ్రీదేవి పూజార్థమయి ఉపయోగించుటకు అనువుగా అవి అష్టోత్తరశతనామావళి రూపమున ఇచట ఈయబడు చున్నవి.

47వ అధ్యాయమున శుక్రుడు చేసిన శివస్తుతి త్రిశతీ నామ రూప మయినది. అవియు త్రిశతీనామావళీ రూపమున ఇచ్చట ఈయబడుచున్నవి. ఇవి రెండును ఉపాసకులకు ప్రయోజనకరములు. -అనువాదకుడు.)

Sri Matsya Mahapuranam-1    Chapters