Sri Matsya Mahapuranam-1    Chapters   

చతుర్థో7ధ్యాయః - బ్రహ్మణః స్వపుత్త్రీగమనదోషాభావ కథనమ్‌.

మనుః : అహో కష్టతరం చైత దంగజాగమనం ప్రభో!|కథ మద్వేష్య మగమ త్కర్మణా కేన పద్మజః. 1

పరస్పరం చ సమ్బన్ధ స్సగోత్రాణా మభూ త్కథమ్‌ | వైవాహిక స్తత్సుతానాం ఛిన్ధి హ్యేతత్సుసంశయమ్‌. 2

మత్స్యః:దివ్యా మయాదిసృష్టిస్తు రజోగుణసముద్భవా | అతీన్ద్రియేంద్రియాతీతా హ్యతీన్ద్రియశరీరకా. 3

దివ్యతేజోమయీ రూపదివ్యజ్ఞానసముద్భవా | న మర్త్యై ర న్తత శ్శక్యా వేదితుం మాంసచక్షుషా. 4

యథా భుజఙ్గా స్సర్వేషా మాకాశే విశ్వపక్షిణామ్‌ | విన్దన్తి మార్గం దివ్యానాం వేదా ఏవ న మానవాః. 5

కార్యాకార్యే చ దేవానాం శుభాశుభఫలే ప్రభో | యస్మా త్తస్మాత్తు రాజేన్ద్ర తద్విచారో నృణాం శుభః. 6

అయం చ సర్వవిద్యానా మధిష్ఠాతా చతుర్ముఖః | గాయత్రీ బ్రహ్మణ స్తత్ర వ్యాఙ్గజాతా నిగద్యతే. 7

అమూర్తి మూర్తిమద్వాపి మిథునం త త్ప్రచక్షతే | విరిఞ్చి ర్భగవా న్యత్ర తత్ర దేవీ సరస్వతీ. 8

భారతీ యత్ర యత్రైవ తత్ర తత్ర ప్రజాపతిః | యథా రవేశ్చ రహితా చాయా నో దృశ్యతే క్వచిత్‌. 9

గాయత్రీ బ్రహ్మణః పార్శ్వం తథైవ నవిముఞ్చతి | వేదరాశి స్స్మృతో బ్రహ్మా సావిత్రీ త మధిష్ఠితా. 10

తస్మా న్న కశ్చి ద్దోష స్స్యా త్సావిత్రీగమనా ద్విభోః|తయా వినా7జ్ఞానయుతః ప్రజాపతి రభూ త్పురా. 11

చతుర్థాధ్యాయము

బ్రహ్మకు స్వపుత్త్రీ గమన దోష పరిహారము మొదలగునవి.

మనువు ఇట్లు పలికెను: ప్రభూ! బ్రహ్మ తన కుమార్తెను పొందెను; అంటిరి. చీ ! ఇది ఎంత నీచమయిన పని! అతడు మరల ఏ ప్రాయశ్చిత్త కర్మము నాచరించి లోకములకు ద్వేషించ రానివాడు అయ్యెను ? అతని కుమారులు ఒకరికి ఇంకొకరు సగోత్రు లగుదురు. వారిలో వారికి వై వాహిక సంబంధము జరుగుట ఎట్లు ? ఈ సంశ యమును నివారించుడు.

మత్స్య భగవానుడు ఇట్లు పలికెను : నేను చేసిన ఆది సృష్టి రజోగుణముచే ఉద్భవించినది. దివ్యమయినది. (లోక సాధారణమయినది కాదు.) అతీంద్రియము. ఇంద్రియములకు అందనిది. ఇంద్రియములకు గోచరించని శరీరము కలది. దివ్య తేజోమయము. దాని రూపము దివ్యమయినది. ఉత్తమమగు జ్ఞానముచే ఉత్పత్తి చెందినది. మర్త్యులు తమ మాంసపు కన్నులతో దానిని తుద వరకు (సంపూర్ణముగా) చూడజాలరు. సర్పములు ఆకాశమున సంచరించు వివిధ పక్షుల మార్గమును చూడజాలవు. అట్లే దివ్యులగు వారి మార్గమును వేదములే కాని మానవులు తెలిసికొన జాలరు. అందువలన వారి తత్త్వమును విచారణ చేయుటయే మానవులకు శుభకరము.

సావిత్రిని పొందుట బ్రహ్మకు దోషము కాదు.

ఈ చతుర్ముఖుడు సర్వ విద్యలకు అధిష్ఠాత. సర్వ విద్యా రూపయగు ఈ గాయత్రి (శబ్దరూప) ఆతని శరీరము నుండి పుట్టినదనియు అందుచే కూతురనియు చెప్పబడుచున్నది. ఆ ఇద్దరకును మూర్తి (ఆకారము - శరీరము) ఉండు గాక-లేకుండుగాక ! ఆ ఇద్దరును దంపతులే. ఇట్లు (విద్యాధిష్ఠాతయగు) బ్రహ్మ ఉన్నచోట (విద్యారూపిణిఅగు) సరస్వతి (భాషారూప - శబ్ద రూప కూడ) ఉండనే ఉండును. భారతి ఉన్న చోట బ్రహ్మ ఉండి తీరును. సూర్యుడులేని ఛాయ ఎక్కడను ఉండనట్లు గాయత్రి (సరస్వతి)యు బ్రహ్మ సమీపమును విడిచి ఉండదు. బ్రహ్మ వేదరాశి రూపుడు. సావిత్రి అతనిని ఆశ్రయంచి ఉండును. కనుక బ్రహ్మ సావిత్రిని పొందెను. అనుటలో దోషము ఏ మాత్రమును లేదు. ఏలయన సావిత్రితో కలియనంతవరకును బ్రహ్మ అజ్ఞానముతో కూడి ఉండెను.

మన్మథాయ విరిఞ్చిదత్తశాప స్తత్పరీహారశ్చ.

స్వసుతోపగమా ద్బ్రహ్మాశశాప కుసుమాయుధమ్‌ | య న్మమాపీహ భవతా మన స్సంక్షోభితం శ##రైః. 12

*తత స్త్వాం కామ! కోపేన రుద్రో భస్మీకరిష్యతి | తతః ప్రసాదయామాస కామదేవ శ్చతుర్ముఖమ్‌. 13

న మా మకారణా చ్ఛప్తుం త్వమిహార్హసి మానద | అహ మేవంవిధ స్సృష్ట స్త్వయైవ చతురానన. 14

  • BLiúµj…¸R…VO][Q˳ÏÁÇÁƒ«sNRP xqs=lLi[*uy®ªs[Vª«s ®µ…[z¤¦¦¦ƒyª±sV e {qsòQûxmsoLir¡ LRiÕ³Á¿ylLi[ßá ª«sV¸R…W xqsLRi*ú»R½ xqsLRi*µy. 15

    క్షోభ్యం మనః ప్రయత్నేన త్వయా ప్రోక్తం పురా ప్రభో| కురు ప్రసాదం భగవ న్త్స్వశరీరాప్తయే పునః. 16

    బ్రహ్మా:వైవస్వతే7న్తరే ప్రాప్తే యాదవాన్వయసమ్భవః|రామో నామ తదా మర్త్యో మత్సత్త్యబల మాశ్రితః.

    అవతీర్య పురధ్వంసీ ద్వారకా మధివత్స్యతి | తద్భ్రాతు స్తత్సమో భూత్వా తదా పుత్త్రత్వ మేష్యసి. 18

    ఏవం శరీర మాసాద్య భుక్త్వా బోగా నశేషతః | తతో భరతవంశాన్తే భూత్వా వత్సనృపాత్మజః. 19

    విద్యాధరాధిపత్యం చ యావదాభూతసంప్లవత్‌ | స్వయోనిం ధర్మతః ప్రాప్య*మత్సారూప్యం గమిష్యసి. 20

    ఏవం శాపప్రసాదాభ్యాం ముదితః కుసుమాయుధః | శోకప్రమోదాభిహత స్స జగామ యథాగతమ్‌. 21

    బ్రహ్మ మన్మథుని శపించి అనుగ్రహించుట.

    తన కుమార్తెను తాను పొందుట కారణముగా బ్రహ్మ మన్మథుని శపించెను. మన్మథా! నాయంతటి వాని మనస్సును కూడ నీవు నీ బాణములచే సంక్షోభింపజేసితివి. కావున రుద్రుడు నిన్ను కోపముతో భస్మము చేయును. అనగా మన్మథుడు బ్రహ్మను ఇట్లు అనుగ్రహింపజేసికొనెను: భగవన్‌ ! నీవు ఇక్కడ ఇప్పుడు ఇట్లు నన్ను అకారణముగా శపింపదగదు. మీరే నన్ను ఇట్టి వానినిగా - సర్వ ప్రాణులకు ఇంద్రియములను క్షోభింపజేయు వానినిగా - పుట్టించితిరి. ఈ చోట ఆ చోట అనక ఇప్పుడు అప్పుడు అనక ఎల్లప్పుడు ఎల్లచోట్ల హాని కలిగించు తలంపుతో ప్రయత్నించియైన నీవు స్త్రీ పురుషులమనస్సు కలత పరచవలయును. అని మునుపు మీరే నాతో పలికితిరి. మరల నాకు నా శరీరము లభించునట్లు అనుగ్రహము చేయ వేడుచున్నాను. అని మన్మథుడు వేడగా బ్రహ్మ ఇట్లు పలికెను : వై వస్వత మన్వంతరము

    __________________________________________

    *తస్మా త్త్వద్దేహామచిరాద్రుద్రోభస్మీకరిష్యతి. * నమామకారణాచ్ఛప్తుం. *మత్సమీపం.

    వచ్చినప్పుడు యదు వంశమున నా సత్త్వమును బలమును పూని రాముడు అను మానవుడు జన్మించును. అట్లవతరించిన అతడు శత్రుపురముల ధ్వంసము చేయు మహా శూరుడై ద్వారకయందు నివసించును. అప్పుడు నీవు అతని తమ్మునకు ఆతనితో సముడగు సుతుడవై జన్మింతువు. ఇట్లు శరీరమును పొంది అశేష భోగముల ననుభవింతువు. పిమ్మట భరత వంశము ముగియు కాలమున వత్సరాజునకు కుమారుడవై ధర్మానుసారము దేవయోనిని (జన్మమును) పొంది ప్రళయకాలము వరకు విద్యాధరుల కథిపతివై యుండి తుదకు నా సారూప్యమును పొందెదవు.

    ఇట్లు శాపము చేతను అనుగ్రహము చేతను శోకమును ప్రమోదమును పొంది మన్మథుడు తాను వచ్చిన మార్గమున వెళ్లెను.

    ఋషయః: దేహా ప్తయ ఇతి ప్రోక్తో యదువంశే కామసమ్భవః|కథం చ దగ్ధో రుద్రేణ కిమర్థం కుసుమాయుధః. 22

    భరథస్యాసుతస్యాస్య కా చసృష్టిః పురా7భవత్‌ | ఏత త్సర్వం సమాచక్ష్వ మూలత స్సర్వథా హి నః. 23

    సూతః: యా సా దేహార్ధసమ్భూతా గాయత్రీ బ్రహ్మవాదినీ | జననీ సుమనోదేవీ శతరూపా జితేన్ద్రియా. 24

    రతి ర్మన స్తపోవృద్ధి రహోదిక్సన్తమ స్తథా | తతస్తు శతరూపాయాం సప్తాపత్యం వ్యజీజనత్‌. 25

    యే మరీచ్యాదయః పుత్త్రా మానసా స్తస్య ధీమతః | తేషా మయ మభూ ల్లోక స్సర్వవిద్యాత్మకః పురా. 26

    వామదేవకృత జరామరణరహిత జననృష్టిః.

    తతో7సృజ ద్వామదేవం త్రిశూలవరధారిణమ్‌ | సనత్కుమారం చ విభుః పూర్వేషా మపి పూర్వజమ్‌. 27

    వామదేవోపి భగవా నసృజ న్ముఖతో ద్విజా9 | క్షత్త్రయా నసృజ ద్బాహ్వోర్విట్ఛూద్రానూరుపాదయోః. 28

    విద్యుతో7శనిమేఘాంశ్చ రోమితేన్ద్రధనూంషి చ | ఇన్ద్రాణాం చ ససర్జదౌ పర్జన్యం చతతః పరమ్‌. 29

    తత స్సాధ్యగణా నీశ స్త్రిణత్రా దసృజ త్పునః | కోటిత శ్చతురాశీతిం జరామరణవర్జితా9 30

    వామదేవో7సృజ ద్దేవా న్బ్రహ్మణా వినివారితః | నైవంవిధా భ##వే త్సృష్టి ర్జరామరణవర్జితా. 31

    శుభా7శుభాత్మికా యా తు సైవ సృష్టిః ప్రశస్యతే | ఏవం ససర్జ కల్పాదౌ సృష్టిస్థాణు రథ7భవత్‌. 32

    శౌనకాదిఋషు లిట్లనిరి : మన్మథుడు తన దేమమును మరల పొందుటకై యదువంశమున జన్మించునంటివి. కుసుమాయుధుడు ఏల ఎట్లు రుద్రునిచే దగ్ధుడు అయ్యెను? (తన భార్యనుండి) కుమారులే లేని ఈ భరథుని (బ్రహ్మ) నుండి ఏ సృష్టి మొదటగా జరిగెను? మాకు ఇది అంతయు మొదటి నుండి తప్పక చెప్పగోరెదము. అనగా సూతు డిట్లు చెప్ప నారంభించెను. బ్రహ్మదేహార్ధము నుండి జనించెనని నేను చెప్పిన గాయత్రి వేద విశారాద. పండితులకును దేవతలకును తల్లియు ఆరాధ్యయగు దేవియును. శతరూప-(వందలకొలది రూపములు కలది); ఇంద్రియములను జయించినది. బ్రహ్మ ప్రజాపతి శతరూపయందు రతి-మనస్సు-తపస్సు-వృద్ధి-అహస్సు (పగలు)-దిక్కు-తమస్సు (చీకటి) అను ఏడు మందిని కనెను. సర్వ విద్యాత్మకమగు ఈలోకము బుద్ధి శాలియగు బ్రహ్మకు జనించిన మానస పుత్త్రులగు మరీచి మొదలగు వారికి సంబంధించినది అయ్యెను. అనగా వా రీ లోకమునకు ప్రజాపతులుగా నయిరి.

    తరువాత లోక విభుడగు బ్రహ్మ త్రిశూల శ్రేష్ఠమును ధరించినవాడును మొదటి వారికంటె మొదటి వాడును అగు వామదేవుని సనత్కుమారుని కూడ సృష్టించెను. భగవానుడగు వామదేవుడును తన ముఖమునుండి బ్రాహ్మణులను బాహువులనుండి క్షత్త్రియులను తొడలనుండి వైశ్యులను పాదములనుండి శూద్రులను సృష్టించెను. మెఱపులను పిడుగులను మేఘములను వంకరలేని ఇంద్ర ధనుస్సును ఇంద్రుడు మొదలగు వారని పర్జన్యుని సాధ్యులు అను దేవ గణములను సృజించెను. తన మూడవ కంటినుండి జరామరణములు లేని ఎనుబది నాల్గు కోట్లమంది దేవతలను కూడ సృష్టించెను. అంతట బ్రహ్మ%్‌మ వామదేవునితో ఇట్లనెను. శుభా శుభములతో కూడి చావు ముసలితనములతో కూడిన సృష్టియే మేలయినది కాని ఇట్లు జరామరణములు లేనిదై ఉండరాదు. అని అతనిని వారించెను. కల్పాదియందు ఈశ్వరుడింత వరకు సృష్టించిన తరువాత అతని సృష్టి నిలిచిపోయెను.

    స్వాయమ్భువో మనుర్ధీమాం స్తప స్తప్త్వాతిదుస్తరమ్‌ | పత్నీ మవాప తుష్టాత్మా హ్యనన్తాం నామ నామతః. 33

    స్వాయమ్భువమనుసన్తతిః.

    ప్రియవ్రతోత్తానపాదౌ మను స్తస్యా మజీజనత్‌ | ధర్మస్య కన్యాం చతురాం సూనృతాం నామ భామినీమ్‌. 34

    ఉత్తానపాద స్తనయా మాప మన్దరగామినీమ్‌ | అయంపతి రయంమత్తః కీర్తిమా న్ధ్రువమేవచ. 35

    ఉత్తానపాదో7జనయ త్సూనృతాయాం ప్రజాపతిః | ధ్రువో వర్షసహస్రాణి కృత్వా దివ్యతపః పురా. 36

    దివ్యరూపం తతఃస్థాన మధస్తాద్ర్బహ్మణో భువః | ఏనం తు పురతః కృత్వా ధ్రువం స ప్తర్షయ స్థ్సితాః. 37

    ధన్యా నామ మనోః కన్యాధ్రువా చ్ఛిష్టి మజీజనత్‌ | అగ్ని కన్యా తు సుచ్ఛాయా శిష్టే రాధత్తవై సుతా9. 38

    రిపుం రిపుఞ్జయం వృత్రం వృకలం వృకతేజసమ్‌ | చాక్షుషం బ్రహ్మదౌహిత్ర్యాం వైరిణ్యాం స రిపుంజయః.

    వీరణస్యాత్మజాయాం తు నడ్వలాయాం చ చాక్షుషః | జనయామాస తనయా న్దశ శూరా నకల్మషా9. 40

    ఊరుః పురుశ్శతద్యుమ్న స్పపస్వీ సత్యవా క్కవిః | అగ్నిష్టోమో7తిరాత్రశ్చ సుదృష్టి రపరాజితః. 41

    అభిమన్యుశ్చ దశమో నడ్వలాయాం తు చాక్షుషాః | ఊరుశ్చాజనయ త్పుత్త్రానాగ్నేయ్యాం ధామసూత్రతా9.

    అఙ్గం సుమనసం స్వాతిం క్రతు మఙ్గిరసం శిబిమ్‌ | పితృకన్యా సునీథా వై వేన మఙ్గా దజీజనత్‌. 43

    స్థిరబుద్ధి కలవాడగు స్వాయంభువ మనువు మిగుల దుస్తరమగు తపస్సాచరించి అనంత అను నామముకల భార్యను పొంది మనస్సున సంతుష్టి చెందెను. ఆ మనువు ఆమెయందు ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అను కుమారులను కనెను. ఉత్తానపాదునకు ధర్ముని కుమా ర్తెయగు సూనృత యనునామె భార్యయయ్యెను. ఆమె నేర్పరి. సౌందర్యవతి. ఇంపైన నెమ్మది నడక గలది. ఇతడు నాకు రక్షకుడు. ఇతడు నావలన కీర్తిశాలి కావలయును. అను భావము తన భర్త యందు కలది. (అయంపతి-అయంమత్తుడు-కీ ర్తిమాన్‌-ధ్రువుడు అను వారందరును ఉత్తానపాదుని కుమారులని కొందరు చెప్పుచున్నారు.) ఆమె యందు ఉత్తానపాదుడు ధ్రువుని కుమారునిగా పొందెను. పురాతనకాలముననే ఆ ధ్రువుడు దివ్యతపము ఆచరించి దివ్యమగు రూపమును బ్రహ్మ లోకమునకు దిగేవాగా స్థిర స్థానమును సంపాదించెను. ఈ ధ్రువుని ముందుంచుకొనియే సప్త మహర్షులు ఉన్నారు. ధ్రువునకు ధన్యయను మనుపుత్త్రియందు శిష్టి కుమారుడు అయ్యెను. శిష్టికి అగ్ని పుత్త్రియగు సుచ్ఛాయయందు రిపుడు రిపుంజయుడు వృత్రుడు వృకలుడు వృకతేజసుడు అను కుమారులు కలిగిరి. రిపుంజయునకు బ్రహ్మకు దౌహిత్రి అగు వీరిణి (వైరిణి) యందు చాక్షుషుడు కుమారు డయ్యెను. ఈతనికి వీరణుని కుమార్తెయగు నడ్వలయందు శూరులు పవిత్రులునగు ఊరువు పురుడు శతద్యుమ్నుడు తపస్వి సత్యవాక్‌ కవి అగ్నిష్టోముడు అతి రాత్రుడు సుదృష్టి అభిమన్యుడు అను పదిమంది కుమారులు కలిగిరి. ఊరువునకు ఆగ్నే యియందు అంగుడు సుమనసుడు స్వాతి క్రతువు అంగిరుడు శిబి అను కుమారులు కలిగిరి. పితరుల కన్యయగు సునీథ అను నామెయందు అంగునకు వేనుడు పుట్టెను.

    వేన మన్యాయినం విప్రా మమన్థు స్తత్కరా దభూత్‌ | పృథుర్నామ మహాతేజా స్స పుత్త్రౌ ద్వా వజీజనత్‌. 44

    అన్తర్ధానం హవిర్ధానం శిఖణ్డిన్యా మజీజనత్‌ | హవిర్ధాన ష్షడాగ్నేయ్యాం ధిషణా న్జనయ త్సుతా9. 45

    ప్రాచీనబర్హిషం శుక్రం గయం కృష్ణం ప్రజాజినౌ | ప్రాచీనబర్హి ర్భగవా న్మమాత్మా77సీ త్ప్రజాపతిః. 46

    హవిర్ధానాః ప్రజాస్తేన బహవ న్సమ్ప్రవర్తితాః | సువర్ణాశ్వా మహాభాగా దశ భక్తసుతాః ప్రభో. 47

    సర్వే ప్రాచేతసా నామ ధనుర్వేదస్య పారగాః | అత్రైవోపచితా వృక్షా బభు ర్లోకే సమన్తతః. 48

    దేవాదేశా ద్ధవ్యవాహో హ్యదహ ద్రవినన్దన | సోమకన్యా7భవ త్పత్నీ మానసా నామ విశ్రుతా. 49

    *తేభ్యస్తు దక్ష మేకం సా పుత్త్ర మగ్ర్య మజీజనత్‌ | దక్షా దనన్తరం కృష్ణా నౌషధాం శ్చ సమన్తతః. 50

    ___________________________________________

    *తతస్తు. . వలీముఖాశ్శఙ్కాకర్ణాః. * అశ్వఋక్షముఖాః.

    అజీజన త్సోమకన్యా7నన్తాం భద్రవతీం తథా | సోమాంశస్య చ తస్యాపి దక్షస్యామితకోటయః. 51

    తాసాం తు విస్తరం వక్ష్యే లోకే యావ త్ర్పతిష్ఠితమ్‌ | ద్విపాదా శ్చాభవ న్కేచి త్కేచి ద్బహుపదా జనాః.

    ఉల్కాముఖా శ్శఙ్కుకర్ణాః కర్ణప్రావరణా స్తథా | *వ్యాఘ్రాననా స్తథా కేచి త్కేచిత్పిఙ్గాననా స్తథా. 53

    శ్వసూకరముఖాః కేచి త్కేచి దుష్ట్రముఖా స్తథా | జనయామాస ధర్మాత్మా వ్లుెచ్చా న్త్సర్వా ననేకశః. 54

    సృష్ట్యా చ మానసా న్దక్షస్త్ర్సియః ప్రీత్యా మజీజనత్‌ | దేవాసురమనుష్యాది తాభ్య స్సర్వ మభూ జ్జగత్‌. 55

    ఇతి శ్రీ మత్స్యమహాపురాణ మత్స్యమను సంవాదే బ్రహ్మణ స్స్వపుత్రీగమనదోషాబావ

    కథనం నామ చతుర్థో7ధ్యాయః.

    అన్యాయియగు వేనుని విప్రులు మథించిరి. అతని చేతినుండి మహాతేజస్కు డగు పృథువు కలిగెను. అతనికి శిఖండియందు అంతర్ధానుడు హవిర్ధానుడు అను కుమారులు కలిగిరి. హవిర్ధానునకు ఆగ్నేయియందు ప్రాచీనబర్హి శుక్రుడు గయుడు కృష్ణుడు ప్రజా జినుడు అను ఆరుగురు కుమారులు కలిగిరి. భగవానుడును మమాత్ముడునగు ప్రాచీనబర్హి ప్రజాపతి అయ్యెను. ఏలయన అతనిచేత హవిర్ధానులు అను పేర అనేకులగు ప్రజలు ప్రవర్తిల్ల జేయబడిరి. బంగారు గుర్రములు కలవారు మహాభాగులును భగవద్భక్తులును అగు పదిమంది అతని కుమారులు. వారికి అందరకును ప్రాచేతసులు అని పేరు వారందరు ధనుర్వేదము చివర వరకు నేర్చినవారు (ధనుర్వేదపు త త్త్వము నెరిగినవారు); ఒకప్పుడు భగవంతుని ఆదేశమున లోకమునందలి వృక్షౌషధీ జాతులను అగ్నిదహించెను. వాటిని ఈ ప్రాచేతసులు అంతట ప్రకాశించునట్లు చేసిరి. సోముని కన్యయగు మానస అనునామె వారికందరకు పత్ని అయ్యెను. ఆమె వారివలన పూజ్యుడగు దక్షుడను కుమారుని కనెను. అతని తరువాత నల్లని ఓషధులును అనన్త భద్రవతి అను కుమార్తెలును ఆమెకు సంతానమయ్యెను. సోమాంశము వలన కలిగిన ఆ దక్షునకు లెక్కలేనన్ని కోట్ల సతానము కలిగెను. లోకమునందు నిలిచియున్న అ సంతాన విస్తరమును తెలిపెదను వినుము. రెండు పాదములు కలవారు అనేక పాదములు కలవారు కోతి మొగము వంటి మొగము కలవారు శంకువువంటి చెవులు కలవారు కప్పువడిన చెవులు కలవారు పులి మొగము వంటి మొగము పచ్చని మొగము కుక్క మొగము వంటి మొగము పంది మొగము వంటి మొగము ఒంటె మొగము వంటి మొగము కలవారు అనేకులు వ్లుెచ్ఛులందరును అతనికి మానస సుతులుగా జనించిరి. అనంతరము ప్రీతి అను భార్యయందు చాలమంది స్త్రీలు అతనికి కూతులుగా కలిగిరి. ఆ స్త్రీలనుండి యే దేవతలు అసురులు మనుష్యాది ప్రాణులు; వీరితో జగ త్తంతయు నిండిపోయెను.

    ఇది శ్రీ మత్స్య మహా పురాణమున బ్రమ్మకు స్వపుత్త్రీగమన దోషము లేకపోవుట మొదలగు వృత్తాంతములుకల చతుర్థాధ్యాయము.

    Sri Matsya Mahapuranam-1    Chapters   

  •