Sri Matsya Mahapuranam-1    Chapters   

ఏకోనచత్వారింశో7ధ్యాయః.

యయాత్యష్టకసంవాదః.

అష్టకః : యదా7 వస న్నన్దనే కామరూపీ సంవత్సరాణా మయుతం శతానామ్‌ |

కిం కారణం కార్తయుగప్రధాన హిత్వా చ త్వం వసుధా మన్వపద్యః. 1

యయాతిః : జ్ఞాతి స్సుహృ త్స్వజనో వా యథేహ క్షీణ విత్తే మానవైస్త్యజ్యతే హి |

తథా చ తత్ర క్షీణపుణ్యం మనుష్యం త్యజన్తి సద్య స్సేశ్వరా దేవసఙ్ఘాః. 2

అష్టకః : కథం తత్ర క్షీణపుణ్యా భవన్తి సంముహ్యతే తత్ర మనో7తిమాత్రమ్‌ |

కిం వా విశిష్టాః కస్య ధామోపయాన్తి తద్వై బ్రూహి క్షేత్రవి త్త్వం మతో మే. 3

యయాతిః : ఇమం భౌమం నరకం తే పతన్తి లాలప్యమానా నరదేవ సర్వే|

తే కఙ్కగోమాయు « బిడాశనార్థం క్షీతౌ వివృద్ధిం బహుధా వ్రజన్తి. 4

తస్మా దేత ద్వర్జనీయం నరేణ దుష్టం లోకే గర్హణీయంచ కర్మ |

ఆఖ్యాతం తే పార్థివ సర్వమేవ భూయశ్చేదానీం వద తే కిం వదామి. 5

అష్టకః : యథాతు తా న్వితుదన్తే వయాంసి తథా గృద్ద్రా శ్శితికణ్ఠాః పతఙ్గాః |

కథం భవన్తి కథం మా భవన్తి న భౌమ మన్యం నరకం శృణోమి. 6

యయాతిః : ఊర్ధ్వం దేహా త్కర్మణా జృమ్భమాణా ద్వ్యక్తం పృథివ్యా మనుసఞ్చరన్తి |ఇమం భౌమం నరకం తే పతన్తి నావేక్షన్తే వర్షపూగా ననేకాన్‌. 7

షష్టిం సహస్రాణి పత న్తి వ్యోమ్ని తథా7శీతిం పరిసంవత్సరాణి |

తాన్వై తుదన్తే పతతః ప్రపాతం భీమా భూమౌ రాక్షసాస్తీక్షీణదంష్ట్రాః. 8

అష్టకః : యదేతాం స్తే సమ్పతన్త స్తుదన్తి భీమాకారా రాక్షసా స్తీక్షణదంష్ట్రాః |

కథం భవన్తి కథం మా భవన్తి కథమ్భూతా గర్భభూతా భవన్తి. 9

యయాతిః : అసృ గ్రేతః పుష్పఫలానుపృక్త మన్వేతి సద్యః పురుషేణ సృష్టమ్‌|

తథైతస్య రజ ఆపద్యతే వై గర్భభూత స్సముపైతి తత్ర. 10

వనస్పతీం శ్చోషధీన్వై విశన్తి హ్యపో వాయుం పృథివీం చాన్తరిక్షమ్‌ |

చతుష్పదం ద్విపదం చాపి సర్వ మేవంభూతా గర్భభూతా భవన్తి. 11

ముప్పది తొమ్మిదవ అధ్యాయము

యయాత్యష్టక సంవాదము

అష్టకుడు: ''కృతయుగపు వారిలో ప్రధానుడవగు యయాతీ: నీవు నందనవనమున కామరూపుడవయి నూరు పదివేల సంవత్సరములున్న తరువాత దానిని విడిచి భూలోకమునకు చేరుకొంటివిగదా! కారణమేమి?'' యయాతి: ''ఈ లోకములో మానవునకు ధనము క్షీణించిన తరువాత అతనిని అతని జ్ఞాతులును మిత్రులును స్వజనులును విడిచి పెట్టుదురు గదా! అట్లే ఆలోకములందు లోకపాలురును దేవ సంఘములును మనుష్యుని పుణ్యము నశించగానే అతనిని వదలి వేయుదురు.'' అష్టకుడు: ''మానవు లచట క్షీణపుణ్యు లెట్లగుదురు? ఈ విషయమున నాకేమియు తెలియుటలేదు. ఏ విషయమున ఎంత విశిష్టులు (ఇచట పడిన తరువాత మరల) ఏలోకమును చేరుదురు? ఇది యంతయు నాకు చెప్పుము. నీవు క్షేత్ర త త్త్వమును (దేహము-దేహధారికి కలుగు ధర్మాధర్మఫలములు మొదలగునవి) ఎరిగినవాడవను విశ్వాసముతో అడుగుచున్నాను.'' యయాతి: ''స్వర్గమునుండి ఈ భూలోకమును చేరుకొనిన జీవులు ఈ భౌమ (భూలోక సంబంధి) నరకమున పడుదురు. వారందరును రాజా! (తమకు కలిగిన ఈ స్థితికై) విలపింతురు. భూలోకమున పడి వారు అనేక విధముల ప్రాణులుగా వృద్ధిపొంది రాబందులు నక్కలు పిల్లులు మొదలగు ప్రాణులకు ఆహారమగుదురు. కావున మానవుడు ఈలోకములో దుష్టమును నిందనీయమును నగు కర్మమును చేయక విడువవలయును. నీవడిగిన

___________________________________________

« బలాశనార్థం

దంతయును చెప్పితిని. ఇపుడింకేమి చెప్పవలయును?'' అష్టకుడు: ''పాపకర్ములగు వారిని గ్రద్దలు నెమళ్ళు మొదలగు పక్షులు ఎట్లు బాధించును? ఈ నరక బాధలలో ఈ జీవులు ఎట్లు ఉందురు? ఎట్లు ఉండరు? భౌమమగు నరకమును గురించి ఇంకను వినగోరుచున్నాను.'' యయాతి: ''ఈ దేహము కర్మను అనుసరించి రూపొందుచుండును. (ఎవరు చేసిన కర్మమునకు తగిన శరీరమును వారు పొందుదురు.) దేహమును విడిచిన తరువాత వారు దానిని బట్టియే పృథివి యందును ఆయా దేహములను ధరించి సంచరింతురు. స్వర్గమునుండి పడినవారును అట్లే ఈ భౌమ నరకమున వారు పడుదురు. అనేక సంవత్సరములపాటు మరల వెనుకకు తిరిగి చూడనైన లేకుందురు. పుణ్యలోకములనుండి భ్రష్టులైన వారు క్రిందికి పడుచు ఆరువదివేల ఎనుబదిసంవత్సరములపాటు అంతరిక్షయునందే యుందురు. వారిని ఆ కాలములో వాడి కోరలుగల భయంకర రాక్షసుల పీడించుచుందురు.'' అష్టకుడు: ''ఇట్లు ఆ భయంకర రాక్షసుల పీడలు అనుభవించిన తరువాత ఈ జీవులు ఏఏ విధముల ఉందురు: ఎట్లుండరు? ఏయే స్థితుల పొంది ఈ జీవులు గర్భముగా రూపొందుదురు?'' యయాతి: ''(కొందరు జీవులు మానవులగుదురు. వారి విషయము.)పురుషుడు వదలిన రేతస్సు స్త్రీకి చెందిన పుష్పఫలముతో (రజోర క్తమతో) కలిసి స్త్రీ ర క్తమున ప్రవేశించును. ఇట్లు జీవుడు మానవ రజస్సును చేరును. పిమ్మట అచ్చట గర్భముగా అగును. మరికొన్ని జీవులు వనస్పతులను ఓషధులను వాయువును నీటిని పృథివిని అంతరిక్షమును చతుష్పాత్ర్పాణులను ద్విపాత్ర్పాణులను-దీనిలో వేటినైనను ప్రవేశించును.''

అష్టకః : అన్య ద్వపు ర్విదధాతీహ గర్భ ముతాహోస్వి త్కేన కామేన యాతి |

ఆపద్యమానో నరయోని మేతా మాచక్ష్వ మే సంశయం పృచ్ఛత స్త్వమ్‌. 12

శరీరభేదాదిసముచ్ఛ్రయాంశ్చ చక్షుశ్శోత్రే లభ##తే వేన సంజ్ఞామ్‌ |

ఏత త్త్వం న స్సర్వ మాచక్ష్వ పృష్టః క్షేత్రజ్ఞం త్వాం తాత మన్యామ సర్వే. 13

యయాతిః : వాయు స్సముత్కర్షతి గర్భయోని మృతౌ రేతః పుష్పఫలానుపృక్తమ్‌ |

స తత్ర తన్మాత్రకృతాధికారః క్రమేణ సంవర్ధయతీహ గర్భమ్‌. 14

స జాయమానో విగృహీతగాత్ర స్సంజ్ఞా మధిష్ఠాయ తతో మనుష్యః |

స శ్రోత్రాభ్యాం వేదయతీహ శబ్దం సర్వం రూపం పశ్యతి చక్షుషా తు. 15

ఘ్రాణన గన్ధం జిహ్వయా7థో రసంచ త్వచా స్పర్శం మనసా వేద భావమ్‌ |

ఇత్యష్ట కేహోపచితం హి విద్ధి మహాత్మనః ప్రాణభృత శ్శరీరే. 16

అష్టకః : య స్సంస్థితః పురుషో దహ్యతేవా నిఖన్యతే వాపి నిఘృష్యతే చ |

అభావభూత స్స వినాశ మేత్య కథ మాత్మానం చేతయతే పరస్తాత్‌. 17

యయాతిః : హిత్వా సో7సూ న్త్సుప్తవ న్నిష్టనిత్వా పురోధాయ సుకృతం దుష్కృతం చ |

అన్యాం యోనిం పుణ్య పాపానుసారం హిత్వా దేహం విశ##తే రాజసింహ. 18

పుణ్యాం యోనిం పుణ్యకృతోవిశన్తి పాపాం యోనిం పాపకృతో ప్రజన్తి |

కీటాః పతఙ్గాశ్చ భవన్తి పాపా స మే వివక్షాస్తి మహానుభావ. 19

చతుష్పదా ద్విపదా ష్షట్పదాశ్చ తథభూతా గర్భభూతా భవన్తి |

ఆఖ్యాత మేత న్ని ఖిలేన సర్వం భూయస్తు కిం వృచ్ఛసి రాజసింహ. 20

అష్టక : కింస్వి త్కృత్వా లభ##తే తాత లోకా న్మర్త్య శ్శ్రేష్ఠాం స్తపసా విద్యయాచ |

త న్మే పృష్ట శ్శంస సర్వం యథావ చ్ఛుభా న్లోకా న్యేన గచ్ఛే త్ర్కమేణ. 21

యయాతిః : తపశ్చ దానం చ శమో దమశ్చ హ్రీ రార్జవం సర్వభూతానుకమ్పా |

స్వర్గస్య లోకస్య వద న్తి సన్తో ద్వారాణి సపై#్తవ మహాన్తి పుంసామ్‌. 22

నశ్వన్తి మానేన తమోభిభూతాః పుంస స్సదై వేతి వదన్తి సన్తః |

అధీయమానః పణ్ణితం మన్యమానో యో7విద్యయా హన్తి యశః పరస్య. 23

తస్యాన్తవన్తస్తు భవన్తి లోకా న చాస్య తద్బ్రహ్మ ఫలం దదాతి |

చత్వారి కర్మాణ్యభయంకరాణి భయం ప్రయచ్ఛ న్త్యయథాకృతాని. 24

మానాగ్ని హోత్ర ముత మానమౌనం మానే నాధీత ముత మానయజ్ఞః |

న మానమా న్యో ముద మాదదీత న సన్తాపం ప్రాప్నుయా చ్చావమానాత్‌.

సన్త స్తతః పూజయ న్తీహ లోకే నాసాధవ స్సాధుబుద్ధిం లభ##న్తే. 25½

ఇతి దద్యా మితి యజ ఇత్యధీయ ఇతి వ్రతమ్‌ |

ఇత్యేతాని భయా న్యాహు స్తాని వర్జ్యాని నిత్యశః. 26

యే చాశ్రయం మానయన్తే పురాణం మనీషీణో మానస మర్గరుద్ధమ్‌|

త న్నిఃశ్రేయ సై#్తజసం రూప మేత్య పరాం శాన్తిం ప్రాప్నుయుః ప్రేత్య చేహ. 27

ఇతి శ్రీ మత్స్యమహాపురాణ శౌనకశతానీకసంవాదే చన్ద్రవంశానువర్ణనే

యయాతిచరితే ఏకోనచత్వారింశో7ధ్యాయః.

అష్టకుడు: ''మానవ లోకమునందలి ఆ యా శరీరములను జీవులు పొందుటలో వారు తమ సంకల్పము ననుసరించి తాము కోరిన శరీరమును పొందుదురా? లేక మరిఏదైన హేతువు వారిని గర్భముగా (గర్భస్థ శిశువుగా) రూపొందించునా? నాకుగల ఈ సంశయమును తెలియగోరుచున్నాను. చెప్పుము. ఏ హేతువుచే హెచ్చు తగ్గులుగల వివిధ శరీరములను వానియందలి చక్షుఃశ్రోత్రాదీంద్రియ భేదములను సంజ్ఞా (అనుభూతి) భేదమును పొందగలుగుదురు? నేను ప్రశ్నించిన ఈ విషయములన్నియు చెప్పుము. ఏలయన నీవు క్షేత్ర (శరీర సృష్టి) తత్త్వమును ఎరిగినవాడవని మేమందరము (అష్టక సోదరులు) అనుకొనుచున్నాము.'' యయాతి: ''ఋతుకాలమునందు రేతస్సుతో రజస్సుతో సంపర్కము చెందిన గర్భయోనిని (గర్భము నిలిచియుండెడి ఉదరకోశమును) వాయువు లాగిపట్టి యుంచును. ఆ వాయువు ఆ గర్భకోశమునందు పంచ తన్మాత్రలకు తాను ఆశ్రయమైయుండి గర్భమును వృద్ధి పొందించును. అనంతరము జీవుడు వ్యక్తత పొందుచు అవయవములు స్పష్టములగుచురాగా అనుభవ జ్ఞానమును పొందుచు వచ్చును. క్రమముగ శ్రోత్రముతో శబ్దమును చక్షుస్సుతో రూపమును ఘ్రాణముతో గంధమును జిహ్వతో రసమును త్వక్కుతో స్పర్శమును మనస్సుతో భావమును తెలిసికొనును. అష్టకా! ఈ జీవ లోకములో దేహియొక్క (మానవుల)దేహవృద్ధి క్రమము ఈ విధముగ నుండును. అని ఎరుగుము.'' అష్టకుడు: ''మరణించిన మానవుడు దహింపబడికాని పాతివేయబడి కాని ప్రాణులచే తినబడికాని అభావమును పొంది నశించునుకదా! అతడు మరల తనుతాను చేతన పదార్థముగా ఎట్లు రూపొందించుకొనును?'' యయాతి: ''గాఢనిద్ర పోవువాడు గుర్రుపెట్టినట్లు మానవుడు మూలిగి ప్రాణములను విడుచును అనగా ఈ దేహమును విడుచును. అతని సుకృత దుష్కృతములు మాత్రమతనికి ముందు ఉండి అతనిని తమవెంటగొని పోవును. తరువాత మరల నతడు తన పుణ్యపాపముల ననుసరించి లభించిన మరియొక (మాతృ పితృ) గర్భమును ప్రవేశించును. మహానుభావా! పుణ్యమును చేసినవారు పుణ్యయోనిని (జన్మమును) పాపము చేసినవారు పాప జన్మమును పొందురురు. అతి పాపులు కీటకములుగా పక్షులుగా అగుదురు. వాటిని వివరించి చెప్పుశ క్తి నాకులెదు. ఆయా భూతములు గర్భభూతులై (గర్భమునందలి శిశువులుగానై) మరికొందరు నాలుగు పాదములు-రెండు పాదములు-ఆరుపాదములు-కల ప్రాణివిశేషములుగా నగుదురు. నీవడిగిన ఈ విషయమంతయు ఏమియు వదలక చెప్పితిని. మరింకేమి యడుగుదువు?'' అష్టకుడు: ''తండ్రీ! మర్త్యుడు ఏమి చేసినచో-తపస్సును చేసియో-విద్యను ఆర్జించియో-శ్రేష్ఠములగు లోకమును పొందును? క్రమక్రమముగా ఉత్తరోత్తరము మేలగు లోకములను ఏ యుపాయముచే పొందవచ్చును? నేనడిగిన ఈ ప్రశ్నకు సమాధానము ఉన్నదున్నట్లు చెప్పుము.'' యయాతి: ''తపస్సు దానము శమము (అంతఃకరణ నిగ్రహము) దమము (బహిరింద్రియ నిగ్రహము) సిగ్గు బిడియము ఋజు (వంకరలేని) స్వభావము సర్వభూతములయందును దయ ఈ ఏడును మానవులకు స్వర్గలోకమునకు పోవు ద్వారములని వివేకులు చెప్పుదురు. మానవులు ఎల్లప్పుడును దురభిమానముచే అజ్ఞానము క్రమ్మగా నశింతురని పెద్దలు చెప్పుదురు. ఎవరు తాను విద్యలను అధ్యయనము చేసి తాను పండితుడయ్యెనని అహంకారపడుచు తన విద్యచే ఇతరుల కీర్తిని నశింపజేయునో అట్టివాని లోకములు (వాడు సుకృతము చేసి పుణ్య లోకములను సాధించుకొన్నను) అంతవంతములు (ముగిసినవి-నశించినవి) అగును. అంతేకాదు. అతడు అధ్యయనము చేసిన వేదము కూడ అతనికి ఫలము నీయదు. మానవునకు భయమును పోగొట్టి ఉత్తమ లోకములకు కొనిపోవు కర్మములు నాలుగును - అగ్ని హోత్రము-మౌనము-(తపస్సు) అధ్యయనము-యజ్ఞము- చేయవలసినట్లు చేయనిచో అధమలోక ప్రాప్తి భయమును కలిగించును. అవి 1. మానాగ్నిహోత్రము 2. మానతపస్సు 3. మానాధ్యయనము 4. మానయజ్ఞము అనునవి ఇతరులు ఆదరించగా హర్షమునందక అవమానించిరని సంతాపడకయుండు వానిని సత్‌జనులు ఈ లోకముందును పైలోకమందును పూజింతురు. కాని అసాధుజనులు సాధు బుద్ధిని పొందుట దుర్ఘటము. (అది స్వాభావికముగ కలుగ వలెను.) ఈ ప్రయోజనమునకై దానము చేయుచున్నాను. ఇందులకై యజ్ఞము (దేవతారాధనము) చేయుచున్నాను. ఇందులకై అధ్యయనము చేయుచున్నాను. ఇందులకై వ్రతములను (వైదిక స్తార్మ కర్మలను) అనుష్ఠించుచున్నాను. అని చేయు ఈ పనులన్నియు భయమును కలిగించునవి. కావున వాటిని ఎల్లప్పుడును అన్ని విధముల తప్పక విడువవలయును. ఎవరు తత్త్వము నెరిగినవారై పురాణము (అతి ప్రాచీనము శాశ్వతము) అగు ఆశ్రయమును పరమాత్ముని తమ చిత్తవృత్తియందు స్థిరముగ నిలిపి ఆదరింతురో వారు తై జసమగు (స్వయంప్రకాశమగు) రూపమును పొంది నిఃశ్రేయసమును ఇహమునను పరమునను పరమశాంతిని పొందుదురు.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున చంద్రవంశాను కీర్తనమున యయాతి చరితమున

యయాత్యష్టక సంవాదమను ముప్పది తొమ్మిదవ యధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters