Sri Matsya Mahapuranam-1    Chapters   

పంచత్రింశో7ద్యాయః.

యయాతే ర్వనగమనమ్‌.

శౌనకః : 

ఏవం స నాహుషో రాజా యయాతిః పుత్త్ర మీప్సితమ్‌ | రాజ్యే7భిషిచ్య ముదితో వానప్రస్థో7భవ న్మునిః. 1

ఉషిత్వా వనవాసం స బ్రామ్మణౖస్సహ సంశితః | ఫలమూలాశనో దాన్తో యయాతిః స్వ రితో గతః. 2

స గ త స్సుఖవాసంచ న్యవస న్ముదిత స్సుఖమ్‌ | కాలస్య నాతిమహత శ్శక్రేణ వినిపాతితః. 3

న్యపత త్ప్రచ్యుత స్స్వర్గా దప్రాప్తో మేదినీతలమ్‌ | స్థిత ఆసీ ద న్తరిక్షే స తదేతి శ్రుతం మయా. 4

తత ఏవ పునశ్చా పి గత స్స్వర్గమితి శ్రుతిః | రాజ్ఞా వసుమతా సార్ధ మష్ట కేనచ వీర్యవాన్‌. 5

ప్రతర్దనేన శిబినా సమేత్య కిల సంసది | శతానీకః : కర్మణా కేన స దివం పునః ప్రాప్తో మహీపతిః. 6

కథ మిన్ద్రేణ భగవ న్పాతితోమేదినేతలే | సర్వ మేత దశేషేణ శ్రోతు మిచ్ఛామి త త్త్వతః. 7

కథ్యమానం త్వయా విప్ర దేవర్షిగణసన్నిధౌ | దేవరాజసమో హ్యాసీ ద్యయాతిః పృథివీపతిః. 8

వర్ధనః కిల వంశస్య విభావసుసమద్యుతిః | ·తస్య విస్తీర్ణవంశస్య సత్యకీర్తే ర్మహాత్మనః. 9

చరితం శ్రోతు మిచ్ఛామి దివి చేహ చ సర్వశః |

శౌనకః హన్త తే కథయిష్యామి యయాతే రుత్తమాం కథామ్‌. 10

దివి చేహచ పుణ్యార్థాం సర్వపాప్రమోచనీమ్‌ | యయాతి ర్నాహుషో రాజా పూరుం పుత్త్రం కనీయసమ్‌.

రాజ్యే7భిషిచ్య ముదితః ప్రవవ్రాజ వనం తదా | అన్త్యేషు స వినిక్షిస్య పుత్త్రా న్యదుపురోగమాన్‌. 12

ఫలమూలాశనో రాజా వనే7సౌ న్యవస చ్చిరమ్‌ | సంశితాత్మా జితక్రోధ స్తర్పయ న్పితృదేవతాః. 13

అగ్నించ విధివ జ్జుహ్వ న్వానప్రస్థవిధానతః | అతిథీ న్పూజయన్నిత్యం వన్యేన హవిషా విభుః. 14

శిలోఞ్ఛవృత్తి మాస్థాయ శేషాన్న కృతభోజనః | పూర్ణం సహస్రం వర్షాణా మేవంవృత్తి రభూ న్నృపః.

అమ్బుభక్త స్స మాసాం స్త్రీ నాసీన్ని యతవాఙ్మనాః | తతశ్చ వాయుభక్షో7భూ త్సంవత్సర మతన్ద్రితః.

పఞ్చాగ్ని మధ్యే చ తప స్తేపే సంవత్సరం పునః | ఏకపాదస్థితో వాసీ త్షణ్మాసా ననిలాశనః. 17

పుణ్యకీర్తి స్తత స్స్వర్గం జగామావృత్య రోదసీ. « « « 128

ఇతి శ్రీమత్స్యమహాపురాణ శౌనకశతానీకసంవాదే చన్ద్రవంశానువర్ణనే

యయాతిచరితే పఞ్చత్రింశో7ధ్యాయః.

యయాతి వానప్రస్థవ్రతానుష్ఠానము-అతనిస్వర్గప్రాప్తియు.

శౌనకుడు శతానీకునితో ఇంకను ఇట్లు చెప్పెను: ఇట్లు యయాతి తనకు ప్రీతిపాత్రుడగు పుత్త్రని పూరుని రాజపదమునం దభిషేకించి ముదితుదై వానప్రస్థుడై మునిగా నయ్యెను. అతడు వనవాసమును జరిపి అచటి బ్రాహ్మణులతో పాటుగా ఫలమూలము లాహారముగా ఇంద్రియముల నిగ్రహించి తుదకు స్వర్గమున కేగెను. అతడచట సుఖవాసమును పొంది ముదితుడై సుఖముగా నుండెను. కొంతకాలమునకు ఇంద్రు డతనిని క్రిందికి పడద్రోసెను. అతడు స్వర్గమునుండి జారిపడెను. కాని భూమికి చేరలేదు. అప్పటిలో కొంతకాలమంతరిక్షమందే యుండి యజ్ఞ సంసత్‌నందు ఉండిన వసుమాన్‌ అష్టకుడు ప్రతర్దనుడు శిబి అను రాజులతో కూడి అటనుండియే మరల స్వర్గమునకేగెను. అని నేను పరంపరలో వినియున్నాను.

శకానీకుడు శౌనకు నిట్లడిగెను: భగవన్‌! ''యయాతి పృథివీ పాలకుడుగా శ్రేష్ఠుడు. వంశమునకు వృద్ధిని (శుభమును సంతోషమును అభివృద్ధిని) కలిగించినవాడు. సూర్యుని ప్రకాశముతో అగ్నిప్రకాశముతో సమమగు ప్రకాశము కలవాడు. వంశమును విస్తరింపజేసినవాడు. వాస్తవమును నిర్మలమున నగు కీర్తిగలవాడు. మహామనస్కుడు. స్వర్గమునందును దేవర్షి గణముల ప్రశంసలందుకొనుచు వారి సన్నిధియందు దేవరాజసముడై వెలుగొందెను.'' అందురు గదా! అట్టి వాని నింద్రు డెట్లు ఏల స్వర్గమునుండి పడద్రోసెను? యయాతిచరితమునందలి ఈ యంశములన్నియు అతని ఐహిక పారలౌకిక వృత్తాంతములనందలి తత్త్వము నంతయు వినగోరుచున్నాను.

__________________________________________

·తస్యాని కీర్ణవంశస్య

శౌనకుడు శతానీకున కిట్లు చెప్పెను: నాయనా! యయాతి కథ ఉత్తమ మయినది. సర్వపాపములను పోగొట్టి పుణ్యమును కలిగించునది. అతని ఐహ లౌకిక పారలౌకిక వృత్తాంతమును తాత్త్వికముగా వివరింతును. వినుము.

నహుష పుత్త్రుడగు యయాతి తన కడపటి కుమారుడగు పూరుని రాజ్యమునం దభిషేకించి ముదితుడై వనమునకు ప్రవ్రాజితడయ్యె నంటిని గదా! అంతకుముందే అతడు యదువు మొదలగు కుమారులను రాజ్యపు మేరల యందును అంతకు వెలుపలను నిలిపెను. వనమునందు ఈరాజు వానప్రస్థుడుగా ఫలమూలములు ఆహారముగా ఇంద్రియ నిగ్రహము కలిగి అరణ్యమునందు చాల కాలముండెను. చిత్తమును తీక్షణమొనర్చుకొని క్రోధమును జయించి పితృదేవతల తృప్తి నొందించుచు అగ్నియందు వానప్రస్థ విధానమున హోమాదికము జరుపుచుండెను. ఆ ప్రభువు వనములందు లభించు ఆహారాదికమును దేవతలకు నివేదించిన తరువాత ఆ హవిష్యమునే అతిథులకు ఆహారముగా నిచ్చి వారి నాదరించుచుండెను. శిలవృత్తి (పొలములు మొదలగుచోట్ల రాలిన ధాన్యకణముల నేరితెచ్చుట) ఉంఛవృత్తి (సేద్యపు పొలములలో రాలిన ధాన్యపు కంకులను ఏరితెచ్చుట) అవలంబించి దేవతలకు అతిథులకు పితరులకు వినియోగించగా శేషించిన ఆహారమునే తినుచుండెను. ఇట్లారాజు వేయి నిండు సంత్సరములు జీవితము గడపెను. తరువాత మూడు మాసములు జలాహారుడై మనస్సును వాక్కును నియమించు కొనియుండెను. తరువాత సోమరితనము లేక సంవత్సరము పాట వాయుభక్షు డయ్యెను. తరువాత సంత్సరకాలము పంచాగ్ని మధ్యమున తప స్సాచరించెను. వాయు వాహారముగా ఆరుమాసములు ఏక పాదస్థితుడై తపస్సు చేసెను. పుణ్యకీ ర్తియగు ఆ యయాతి తన ప్రకాశముతో రోదసులను (ద్యుభూలోకముల నడుమ ప్రదేశమును) నింపివేయుచు స్వర్గము చేరెను.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున చంద్రవంశాను కీర్తనమున యయాతి చరితమున

యయాతి వానప్రస్థ జీవితము-అతని స్వర్గప్రాప్తియను ముప్పదియైదవ యధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters