Sri Matsya Mahapuranam-1    Chapters   

త్రయస్త్రింశో7ధ్యాయః.

పుత్త్రెస్సహ యయాతేర్జరాప్రదానమిని త్తక సంవాదః.

శౌనకః జరాం ప్రాప్య యయాతిస్తు స్వపురం ప్రాప్య చైవహి | పుత్త్రం జ్యేష్ఠం వరిష్ఠం చ యదుమి త్యబ్రవీద్వచః. 1

యయాతిః: జరా వలీ చ మాం పుత్త్ర పలితానిచ పర్యగుః|కావ్యస్యోశనస శ్శాపా న్న చతృప్తో7స్మి ¸°వనే.

త్వం యదో! ప్రతిపద్యస్వ పాప్మానం జరయాసహ | ¸°వనేన త్వదీయేన చరేయం విషయానహమ్‌. 3

పూర్ణే వర్షసహస్రేతు పునస్తే ¸°వనం త్వహమ్‌ |

దత్వా స్వం ప్రతిపత్స్యామి పాప్మానం జరయాసహ. 4

యదుః : జరాయాం బహవో దోషా పానభోజనకారితాః| తస్మాజ్జరాం న తే రాజ న్గ్రహీష్య ఇతి మే మతిః.

సితశ్మశ్రుధరో దీనో జరయా శిథిలీకృతః | వలీసన్నతగాత్రస్తు దుర్దర్శో దుర్బలః కృశః. 6

అశ క్తః కార్యకరణ పరిభూత స్స ¸°వనైః | సహోపజీవిభి శ్చైవ తజ్జరాం నాభికామయే. 7

సన్తి తే బహవః పుత్త్రా మత్తః ప్రియతరా నృప | జరాం గ్రహీతుం ధర్మజ్ఞ పుత్త్ర మన్యం బ్రవీహి వై.

యయాతిః : యస్త్వం మే హృదయాజ్జాతో స్వం వయో న ప్రయచ్ఛసి |

తస్మా దరాజ్యభా క్తాత ప్రజా తవ భవిష్యతి. 9

యయాతిః : తుర్వసో! ప్రతిపద్యస్వ పాప్మానం జరయాసహ |

¸°వనేన చరేయంవై విషయాంస్తవ పుత్త్రక. 10

పూర్ణే వర్షసహస్రే తు పున ర్దాస్యామి ¸°వనమ్‌ | తథైవ ప్రతిపత్స్యామి పాప్మానం జరయాసహ. 11

తుర్వసుః : న కామయే జరాం తాత కామభోగ ప్రణాశినీమ్‌ | బలరూపా న్తకరిణీం బుద్ధిప్రాణవినాశినీమ్‌. 12

యయాతిః : యస్త్వం మే హృదయా జ్జా తో వయ స్స్వం న ప్రయచ్ఛసి |

తస్మా త్ర్పజా సముచ్ఛేదం తుర్వసో తవ యాస్యతి. 13

సజ్కీర్ణాచారధర్మేషు ప్రతిలోమేషు పుత్త్రక | పిశితాశిషు చాన్త్యేషు నూనం రాజా భవిష్యసి. 14

గురుదారప్రస క్తేషు తిర్యగ్యోనిగతేషుచ | వ్లుెచ్ఛేషు పశుధర్మేషు పాపేషు ప్రసవిష్యసి. 15

శౌనకః : ఏవం తు తుర్వసుం శప్త్వా యయాతి స్స త మాత్మజమ్‌ |

శర్మిష్ఠాయా స్సుతం జ్యేష్ఠం ద్రుహ్యుం వచన మబ్రవీత్‌. 16

ముప్పదిమూడవ అధ్యాయము

జరాప్రాప్తి విషయమున యయాతి-తత్పుత్త్రుల సంవాదము.

శౌనకుడు శతానీకునితో ఇంకను ఇట్లు చెప్పెను: ఇట్లు వార్ధకమును పొందిన యయాతి తన రాజధానిని చేరి తన పెద్ద కుమారుడును అందరలో మేలైనవాడును అగు యదుని పిలిచి ఇట్లు పలికెను. ''కుమారా! కవి మునికుమారుడగు ఉశనసుని శాపమువలన నాకు శరీరము ముడుతలు పడినది; జుట్టు నరసినది. నాకో - ¸°వనసుఖముల విషయమున ఇంకను తృప్తి కలుగలేదు. నీవు నా దోషమును ఆదోషమునకు ఫలమగు వార్ధక(లక్షణ)మును స్వీకరింపుము. నీ ¸°వనమునతో నేను విషయముల ననుభవింతును. వేయి సంవత్సరముల తరువాత మరల నీ ¸°వనమునీకు ఇచ్చి నా పాపమును వార్ధకమును తీసికొందును.'' యదువు: ''తండ్రీ! ముసలితనము కలిగినచో దానివలన పానభోజనాది విషయములందు ఎన్నియో దోషములు ఏర్పడును. అందుచే నీ ముసలితనమును నేను తీసికొనను. ఇది నా నిశ్చయము. ముసలితనముచే దేహము శిథిలమగును. మీసములు తెల్లనివగును. శరీరము ముడుతలు పడును. వంగి పోవును. చూచుటకు బాగుగా నుండదు. చిక్కిపోవును. ఇట్టివాడు పనులు చేయుటకు అశక్తు డగును. ¸°వనమునందున్న వారును తనపై ఆధారపడి జీవించువారును కూడ అవమానింతురు. అందుచే నాకు ముసలితనము ఇష్టముకాదు. నీకు నాకంటెను ప్రీతిపాత్రులగు కుమారులు ఇంకను చాలమంది ఉన్నారుగదా! వారిలో ఇంకెవ్వరినైన మీవార్ధకమును తీసి కొమ్మని అడుగుడు. మీరు అన్ని ధర్మములను ఎరిగినవారు.'' యయాతి: ''నా హృదయమునుండి పుట్టినవాడవై ('హృదయాదధి జాయసే.' అనిశ్రుతి.) ఉండియు నీవు నాకు నీవయస్సు నీయకున్నావు. కావున నాయనా! నీ సంతతికి రాజ్యాధికారము లేకుండును.'' అని అతడు తుర్వసునితో ఇట్లనెను. ''కుమారా! తర్వనూ! నా పాపదోషమును వార్ధకమును కూడ గ్రహింపుము. నీ ¸°వనముతో విషయ సుఖముల ననుభవింతును. వేయి సంవత్సరముల తరువాత తిరిగి నీ ¸°వనమును నీకిత్తును. నా పాపదోషమును ముసలితనమును తీసికొందును.'' తుర్వసుడు: ''తండ్రీ! వార్ధకము కామ సుఖానుభవములను తదితర భోగానుభవములను కూడ లేకుండ జేయును. బలమును రూపమును బుద్ధిని ప్రాణశ క్తిని నశింపజేయును. కనుక నేనది గ్రహించ ఇష్టపడను.'' యయాతి: ''నీవు నా హృదయమునుండి పుట్టిన వాడవై ఉండియు నీ వయస్సును నాకీయకున్నావు. కనుక నీ సంతతి తుదివరకు కొనసాగక సముచ్ఛిన్న మగును. నీవు సంకీర్ణమగు ఆచారములను ధర్మములను పాటించువారు ప్రతిలోమ జాతులవారు (తక్కువ వర్ణపు పురుషునకు ఎక్కువ వర్ణపు స్త్రీతో సంగమముచే కలిగినవారు) పచ్చి మాంసమునైన తినువారు అంత్య వర్ణములవారు (ఊరి చివర నివసించువారు)-ఇట్టి వారి నడుమ రాజ వగుదువు. ఇది నిశ్చయము. గురుపత్ని తోనైన తిర్యక్‌-(పశుపక్ష్యాది)ప్రాణులతోనైన సంగమించువారు వ్లుెచ్చులు (స్పష్టోచ్చారణము మొదలగు వవిత్ర రూపములేని భాషల మాటలాడువారు) పశువులవలె జీవించు-వ్యవహరించువారు పాపులు మొదలగు వారినడుమ ఉండుచు సంతతిని కనెదవు.'' తుర్వసుని ఇట్లు శపించి యయాతి శర్మిష్ఠకు పెద్దకొడుకగు ద్రుహ్యునితో ఇట్లు పలికెను.

యయాతిః : ద్రుహ్యో త్వం ప్రతిపద్యస్వ వర్ణరూపవినాశినీమ్‌ |

జరాం వర్షసహస్రం మే ¸°వనం సమ్ప్రయచ్ఛ తమ్‌. 17

పూర్ణే వర్షసహస్రే తు తే ప్రదాస్యామి ¸°వనమ్‌| స్వం చాదాస్యామి భూయో7పి పాప్మానం జర యాసహ.

ద్రుహ్యుః : న రాజ్యం న రథం నాశ్వం జీర్ణో భుంక్తే న చ స్త్రియః |

నో రాగ శ్చాస్య భవతి న జరాం తే న కామయే. 19

యయాతిః : యస్త్వం మే హృదయాజ్జౌ తోవయః స్వం న ప్రయచ్ఛసి |

తస్మా ద్ద్రుహ్యో ప్రియః కామో నతే సమ్పత్స్యతే క్వచిత్‌. 20

ఉడుపప్లవసన్తారో యత్ర నిత్యం భవిష్యతి | ఆరాజ్యభాగభ్రష్టత్వం తత్ర ప్రాప్స్యసి సాన్వయః. 21

యయాతిః : అనో! త్వంప్రతిపద్యస్వ పాప్మానం జరయాసహ |

ఏవం వర్షసహస్రంతు చరేయం ¸°వనేన తే. 22

అనుః : జీర్ణ శ్శిశు రివాదత్తే కాలే7న్న మశుచిర్యథా | న జుహోతిచ కాలే7గ్నిం తాం జరాం నాభికామయే.

యయాతిః : యస్త్వం మే హృదయాజ్జాతో వయ స్స్వం న ప్రయచ్ఛసి |

జరాదోష న్త్వయోక్తో య స్తస్మాత్త్వం ప్రతిపత్స్యసే. 24

ప్రజాశ్చ ¸°వనం ప్రాప్తా వినశిష్యన్త్యనో తవ | అగ్నిప్రస్కన్దనమనా స్త్వంచా ప్యేవం భవిష్యసి. 25

యయాతిః : పూరో త్వం మే ప్రియః పుత్త్ర స్త్వం వరీయా న్భవిష్యసి |

జరా వలీ చ మే తాత పలితానిచ పర్యగుః. 26

కావ్యస్యోశనస శ్శాపా న్నచ తృప్తో7స్మి ¸°వనే | పూరో త్వం ప్రతిపద్యస్వ పాప్మానం జరయాసహ.

కిఞ్చిత్కాలం చరేయం వైవిషయా న్వయసా తవ | పూర్ణే వర్షసహస్రేవై ప్రతిదాస్యామి ¸°వనమ్‌. 28

స్వంచైవ ప్రతిపత్స్యామి పాప్మానం జరయాసహ |

శౌనకః : ఏవముక్తః ప్రత్యువాచ పూరుః పితర మంజసా. 29

యదాత్థ త్వం మహారాజ తత్కరిష్యామి తే వచః | ప్రతిపత్స్యామి తే రాజ న్పాప్మానం జరయాసహ. 30

గృహాణ ¸°వనం మత్త శ్చర కామా న్యథేప్సితా& | జరయా7హం ప్రతిచ్ఛన్నో వయోరూపధర స్తవ.

¸°వనం భవతే దత్వా చరిష్యామి యతేచ్ఛయా |

యయాతిః : పూరో! ప్రీతోస్మి తే వత్స జరా మేతాం దదామి తే. 32

సర్వకామసమృద్ధాస్తే ప్రజా రాజ్యం భవిష్యతి. 324

ఇతి శ్రీమత్స్యమహాపురాణ శౌనకశతానీకసంవాదే చన్ద్రవంశానువర్ణనే

యయాతిచరితే యయాతితత్‌పుత్త్ర సంవాదో నామ

త్రయస్త్రింశో7ధ్యాయః.

''ద్రుహ్యూ! జర అనునది దేహపువర్ణమును రూపమును నశింపజేయునదియే. ఐనను వేయి సంవత్సరములపాటు నాజరను నీవు తీసికొని నీ ¸°వనమును నాకు ఇమ్ము. వేయేండ్లు కాగానే నీ ¸°వనమును నీకిత్తును. నా పాపదోషమును ముసలితనమును తిరిగి తీసికొందును'' ద్రుహ్యుడు: ''జరచే శిథిలుడయినవాడు రాజ్యమును రథమును అశ్వమును స్త్రీలను వేటిని కూడ అనుభవించజాలడు. వాటియందు ఇష్టము కూడ ఉండదు. కనుక నాకు అది ఇష్టము కాదు.'' యయాతి: ''నీవు నా హృదయమునుండి పుట్టినవాడవై యుండియు నీవయస్సు నీకీయకున్నావు. కావున ద్రుహ్యూ! నీకు ఇష్టమగు ఏ కామమును (కోరికయు) నెరవేరకుండుగాక! నిత్యమును తెప్పలపై దాటియే వేరొక చోటికి పోవలసియుండు దేశమున రాజ్యభ్రష్టుడవై జీవింతువుగాక! నీ సంతతివారును ఇట్లే అయి రాజ్యాధికారము లేకుందురుగాక!'' యయాతి: ''అనూ! నా పాపదోషముతో కూడ నావార్ధకమును నీవు తీసికొనుము. నీ ¸°వనముతో వేయేండ్లు విహరింతును.'' అనువు: ''జరచే శిథిలుడయినవాడు శిశువు వలెను అశుచియేమో అన్నట్లును ఏదో సమయమున అన్నమును తినుచుండును. తగిన సమయములో అగ్నికి హోమము చేయజాలడు. కనుక జర నాకు ఇష్టముకాదు.'' యయాతి: ''నాహృదయమునుండి పుట్టినవాడవై ఉండియు నేనీ ¸°వనమును నాకీయకున్నావు. కనుక నీవు అనిన జరాదోషము నీకే ప్రాప్తించుగాక! నీ వంశము వారందరును ¸°వనము రాగానే నశించుచుందురుగాక! నీవును నీవనినట్లే అగ్ని ప్రస్కందన మనస్కుడవు (అగ్నిమీదుగా దుముకుట యందు ఇష్టము కలవాడవు) అగుదువుగాక! (ఇది మహాదోషము)''.

పిమ్మట యయాతి: ''పూరూ! నీవు నా ప్రియపుత్త్రుడవు. అందరలో గొప్పవాడవు కూడ అయ్యెదవు. కవి మునికుమారుడగు ఉశనసుని శాపమువలన నన్ను ముడుతలును నరలును క్రమ్ముకొన్నవి. ¸°వనముచే కలుగవలసిన తృప్తి నాకింకను కలుగలేదు. కనుక నీవు నాపాపదోషమును జరను గ్రహింపుము. నీవయస్సుతో కొంతకాలము విషయ సుఖముల ననుభవింతును. అట్లు నిండుగా వేయేండ్లున్న తరువాత నీ ¸°వనము నీకిత్తును. నా పాప దోషమును వార్ధకమును నేను తీసికొందును.'' ఇట్లు పలికిన యయాతితో వెంటనే పూరు డీ విధముగా ననెను: ''మహారాజా! నీవు చెప్పినట్లే చేయుదును. నీ పాపదోషమును వార్ధకమును నేను తీసికొందును. నానుండి ¸°వనము గ్రహింపుము. ఈప్సితములగు కామము లనుభవింపుము. (ఇతరుల బలాత్కారముచే కాక) నా యథేచ్ఛతోనే నా ¸°వనమును నీకిచ్చి నీ వార్ధకముతో కప్పబడి నీవయస్సును రూపమును ధరించి వ్యవహరింతును.''

అని పలుకగా యయాతి: ''నాయనా! పూరూ! నేను నీ విషయమున ప్రీతుడనైతిని. నా ముసలితనమును నీకిత్తును. నీ ప్రజలు (సంతతివారు) సర్వకామ సమృద్ధులు అయ్యెదరు. నీకు (నీ సంతతి వారికికూడ) రాజ్యాధికారము ఉండగలదు.''

ఇది శ్రీమత్స్యమహాపురాణమున చంద్రవంశానువర్ణనమున యయాతి చరిత్రమున

యయాతి-తత్పుత్త్ర సంవాదము అను ముప్పదిమూడవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters