Sri Matsya Mahapuranam-1    Chapters   

పంచదశో7ధ్యాయః

దానవాదిపితృగణాః.

సూతః: విభ్రాజా నామతో7న్యేతు దివి సన్తి సువర్చసః | లోకా బర్హిషదో యత్ర పితర స్సన్తి సువ్రతాః. 1

యత్ర బర్హిణయుక్తాని విమానాని సహస్రశః | సఙ్కల్పబర్హిషో యత్ర తిష్ఠన్తి ఫలదాయినః. 2

తత్రాభ్యుదయకశాలాను మోదన్తే శ్రేద్దదాయినః | యాన్దానవాసురగణా గన్ధర్వాప్సరసాం గణాః. 3

యక్షరక్షోగణాశ్చైవ యజన్తి దివి దేవతాః | పులస్త్యపుత్త్ర శ్శతశ స్తపోయోగ*బలాన్వితాః. 4

మహాత్మానో మహాభాగా భక్తానా మభయప్రదాః | ఏతేషాం ¨పీవరీ కన్యా మానసీ దివి విశ్రుతా. 5

యోగినీ యోగమాతాచ తపశ్చక్రే సుదారుణమ్‌ | ప్రసన్నో భగవాంస్తస్యా వరం వవ్రే చ సా హరేః. 6

యోగవన్తం సురూపంచ భర్తారం విజితేన్ద్రియమ్‌ | దేహి దేవ ప్రసన్న స్త్వం యది మే వదతాంవర. 7

__________________________________________

*సమన్వితాః .బదరీ.

ఉవాచ దేవో భవితా వ్యాసపుత్త్రో యదా శుకః | భవిత్రీ తస్య భార్యా త్వం యోగాచార్యస్య సువ్రతే. 8

భవిష్యతిచ తే కన్యా కృత్తి ర్నామ్నాచ యోగినీ | పాఞ్చాలాధిపతే ర్దేయా మానుషస్య త్వయా తదా. 9

జననీ బ్రహ్మద త్తస్య యోగసిద్ధాశ్చ యత్సుతాః | కృష్ణో గౌరః ప్రభు శ్శమ్భు ర్భవిష్యన్తిచ తే సుతాః. 10

మహాత్మానో మహాభాగా గమిష్యన్తి పరంపదమ్‌ | తానుత్పాద్య పునర్యోగా త్సవరా మోక్ష మేష్యసి. 11

ద్విజాదిపితృగణగణనమ్‌.

సూతః: యేమూర్తిమన్తః పితరో వసిష్ఠస్య సుకాలినః | నామ్నాతు మానసాస్సర్వే సర్వేతే దర్మమూర్తయః 12

జ్యోతి ర్భాసిషు లోకేషు యేవసన్తి దివః పరమ్‌ | విరాజమానాః క్రీడన్తి యత్ర తే శ్రాద్ధదాయినః. 13

సర్వకామసమృద్ధేషు విమానేష్వపి పాదజాః | కింపునః శ్రాద్ధదా విప్రా భక్తిమన్తః క్రియాన్వితాః. 14

గౌర్నామ కన్యా తేషాంతు మానసీ దివి రాజతే | శుక్రస్య దయితా పత్నీ సాధ్యానాం కీర్తివర్ధనీ. 15

పంచదశాధ్యాయము

దానవాదులును నాలుగు వర్ణములవారును అర్చించు పితరుల వృత్తాంతము.

(బర్హిషద్‌-సుకాలి-హవిష్మత్‌-ఆజ్యప-సోమప-పితరుల చరితము)

సూతుడు ఇంకను ఇట్లు చెప్పనారంభించెను : ద్యులోకమునందు శోభనమగు వర్చస్సు (కాంతి) కలిగిన మరి కొన్ని లోకములు గలవు. వాని పేరు విభ్రాజములు. వానియందేసువ్రతులు (ఉత్తమ నియమానుష్ఠాన పరులు) అగు బర్హిషదులు అను పితరులు నివసింతురు. వానియందు నెమళ్ళచే మోయబడు విమానములు వేలకొలదిగా ఉండును. ఈ పితరులు వానియందు కూర్చుండి సంచరింతురు. (బర్హి-సద్‌=బర్హిషద్‌=నెమిళ్ళపై కూర్చుండువారు.) ఆ లోకముల యందలి పితృ దేవతల విషయములో చక్కగా ఆచరింపబడిన యజ్ఞములు (శ్రాద్ధములు) (బర్హిస్‌=యజ్ఞము) విశేషముగా ఫలములను ఇచ్చునవియగును. వారినుద్దేశించి శ్రాద్ధములను ఆచరించిన వారు అభ్యుదయ శాలల ప్రాపంచిక సుఖముల నిచ్చెడు గృహముల) యందు ఆనందింతురు. వీరిని ఆసుర దానవ గంధర్వాప్సరో యక్షరక్షో గణముల వారును ద్యులోకమునందలి దేవతలును ఆరాధింతురు. వీరు పులస్త్య ప్రజాపతి కుమారులు. తపస్సుచేతను యోగసాధనము చేతను కలిగిన నూర్లకొలది శక్తులు కలవారు. మహాత్ములును మహాభాగులును భక్తులకు అభయమును ఇచ్చువారును. వీరి మానసీకన్య పీవరి అను పేరుతో ద్యులోకమున ప్రసిద్ధయైయున్నది. ఈమె యోగమునకే తల్లి అనదగిన యోగిని. ఈమె మిగుల భయంకరమగు తపస్సాచరించెను. భగవానుడగు హరి ఆమె ననుగ్రహించెను. పురుషోత్తమా! నీకు నా యందు అనుగ్రహము కలిగినచో నాకు యోగసిద్ధి కలవాడును సుందరుడును విజితేంద్రియుడును అగు భర్తను ఇమ్ము! ఆని ఆమె వరము కోరెను. హరి ఇట్లు పలికెను. ''ముందుముందు వ్యాసునకు శుకుడను కుమారుడు కలుగును. అతడు యోగాచార్యుడు నీవు ఆచరించిన ఈ సుతపోవ్రతముకు ఫలముగా నీకు అతడు భర్తయగును. యోగిని కాగల కృత్తి అను కూతురు నీకు కలుగును. నీవామోను మానవుడగు పాంచాల దేశరాజునకు ఇమ్ము. ఆమెకు బ్రహ్మదత్తుడను కమారుడు కలుగును. అతనికిని యోగసిద్ధులగు కుమారులు కలుగుదురు. నీకు కృష్ణుడు గౌరుడు ప్రభుడు శంభుడు అను కుమారులు కలుగుదురు. వారు మహాత్ములును మహాభాగులునై పరమపదము చేరుకొందురు. ఇట్టి కుమారులకు తల్లివై నీవు నీ భర్తతో కూడ మోక్షమును పొందుదువు.''

ఇది అమూర్తులు-(మూర్తి లేనివారు) అగు పితృ దేవతా గణములు విషయము.

(ఇచట మూలములో పండ్రెండవ శ్లోకమున మొదట ''అమూర్తిమంతః'' అని యున్నది. ఇది తప్పు. 'యే మూర్తి మంతః' అని ఉండవలెను. అనువాదకుడు.) ఇక మూర్తి మంతులగు పితృదేవతల విషయము. సుకాలిన్‌ అను పేరుగల పితృదేవతల గణమువారు వసిష్ఠుని మానసపుత్త్రులు. వారందరును ధర్మమూర్తులు. వారు ద్యులోకమునకు పైగా ఉన్న 'జ్యోతిర్భాసి' (నక్షత్రాది జ్యోతిస్సులతో ప్రకాశించు) లోకములందు నివసింతురు. తమ పూర్వులనుద్దేశించి శ్రాద్ధములను జరిపిన శూద్రులైనను ఈ లోకములందు విమానములపై ప్రకాశించుచు క్రీడించుచు వివిధ భోగములను అనుభవించుచుందురు. ఇక భ క్తిమంతులై సరిగా కర్మలను అనుష్ఠించువారై శ్రాద్ధములను జరుపు బ్రాహ్మణుల విషయము చెప్పవలసినదేమున్నది? గౌః అను పేరుకల వారి మానసపుత్త్రి ద్యులోకమున ప్రకాశించుచుండును. ఆమె శుక్రునకు ప్రియ భార్యయయ్యెను. ఆమె సాధ్యులను దేవతలకు కీర్తిని వర్ధిల్లజేయునది. (ఈ పితృదేవతా గణమును విప్రులారాధింతురు.)

మరీచిగర్భా నామ్నాతు లోకా మార్తాణ్డ మండలే | పితరో యత్రతిష్ఠన్తి హవిష్మన్తోం గిరస్సుతాః. 16

తీర్థశ్రాద్ధప్రదా యాన్తి యే చ క్షత్త్రియసత్తమాః | రాజ్ఞాంతు పితరస్తేవై స్వర్గమోక్షఫలప్రదాః. 17

ఏతేషాం మానసీ కన్యా యశోదా లోకవిశ్రుతా | పత్నీ హ్యంశుమతః శ్రేష్ఠ స్నుషా పఞ్చజనస్యతు. 18

జననీచ దిలీపస్య భగీరథపితామహీ ! లోకాః కామదుహోనామ కామభోగఫలప్రదాః. 19

సుస్వధా నామ పితరో యత్ర తిష్ఠన్తి సువ్రతాః | ఆజ్యపా నామ లోకేషు కర్దమస్య ప్రజాపతేః. 20

పులహస్యచ దాయాదా వైశ్యా స్తా న్భావయన్తిచ | యత్ర శ్రద్ధకృతస్సర్వే పశ్యన్తి యుగపద్గతాః. 21

మాతృభ్రాతృపితృష్వసృ సఖిసమ్బన్ధిబాంధవాః | అపిజన్మాయుతై ర్దుష్టా ననుభూతా న్త్సహస్రశః. 22

ఏతేషాం మానసీకన్యా విరజానామ విశ్రుతా | యా పత్నీ నహుషస్యాసీ ద్యయాతే ర్జననీ తథా. 23

ఏకాష్టకా7భవత్పశ్చా ద్ర్బహ్మలోకం గతాసతీ | త్రయేతే గణాఃప్రోక్తా శ్చతుర్థంతు వదామ్యహమ్‌. 24

లోకాస్తు మానసా నామ్నా బ్రమన్మణః పురి సంస్థితాః | ఏతేషాం మానసీకన్యా నర్మదానామ విశ్రుతా. 25

సోమపా నామ పితరో యత్ర తిష్ఠన్తి శాశ్వతాః | ధర్మమూర్తిధరా స్సర్వే పరతో బ్రహ్మణ స్థ్సితాః. 26

ఉత్పన్నా స్స్వధయా తేతు బ్రహ్మత్వం ప్రాప్య యోగినః |

కృత్వా నృష్ట్యాదికం సర్వం మానసే సామ్ర్పతం స్థితాః. 27

నర్మదానామ తేషాంతు కన్యా తోయవహా సరిత్‌ | భూతాని యా పావయతి దక్షినాపథగామినీ. 28

సూర్యమండలమునందు 'మరీచి గర్భములు' (తమ అంతర్భాగమునందు కిరణములు కలవి) అను లోకములు గలవు. అంగిరః ప్రజాపతికి పుత్త్రులగు బర్హిష్మంతులను పితృ దేవతలు ఈ లోకములందు వసింతురు. తీర్థ శ్రాద్ధములను జరుపు క్షత్త్రియ శ్రేష్ఠులు ఈ లోకములకు పోవుదురు. ఈ పితరులు క్షత్త్రియులకు స్వర్గ మోక్షఫలములను ఇత్తురు. వీరి మానసపుత్త్రి యశోద అను పేర లోకప్రసిద్ధురాలు. ఈమె పంచ జనుని కుమారుడగు అంశుమంతుని భార్య. దిలీపుని తల్లి. భగీరథుని నాయనమ్మ.

కోరిక భోగఫలమును ఇచ్చు 'కామదుఘములు' అను లోకములు కలవు. సత్కర్మములను అనుష్ఠించువారగు ఆజ్యపులు అను పితృదేవతలు ఈలోకములందు వసింతురు. వీరు కర్దమ ప్రజాపతి కుమారులను పులహుని కుమారులును. వీరిని వైశ్యులారాధింతురు. వీరిని ఆరాధించినవారు ఈ లోకములకు పోయి అచ్చట తమ పూర్వమృతులగు తల్లులు సోదరులు మేనత్తలు మిత్రులు వియ్యాలవారు ఇతర బంధువులు మొదలగువారు అప్పటికి పదివేల జన్మలను ఎత్తిన వారైనను వేలకొలది ఏయే విధములుగా వారిని తాము చూచి అనుభవము పొందియున్నారో అదే విధములుగా వారిని చూడగలుగుదురు. వీరి మనసపుత్త్రి విరజ అను పేర ప్రసిద్ధురాలు. ఈమె తరువాత నహుషుని భార్య- యయాతికి తల్లి-అయ్యెను. ఈమె బ్రహ్మలోకమునకు చేరిన తరువాత 'ఏకా7ష్టక' అను పేర ప్రసిద్ధురాలయ్యెను. ఇట్లు మూర్తిమంతములగు మూడు పితృగణముల వృత్తాంతము చెప్పుటయైనది నాలుగవ గణము విషయము వినుడు.

బ్రహ్మదేవుని నగరమునందు మానసములు అనులోకములు కలవు. నర్మద అను మానసపుత్త్రికి తండ్రులగు సోమపులు అను పితృదేవతలు ఈ లోకములందు నివసింతురు. వీరు అందరును ధర్మమూర్తిని ధరంచినవారు. శాశ్వతులు. బ్రహ్మకు పైస్థానమునందుండువారు. వీరు 'స్వధ'నుండి జనించిరి. యోగసిద్ధిచే బ్రహ్మత్వమును పొందిరి. సృష్టి మొదలగు వ్యాపారములను నిర్వహించి ఇప్పుడు మానస లోకములందున్నారు. వారి మానసపుత్త్రయగు నర్మద నీటిని ప్రవహింపజేయును నదిగానై నది. ఆమె దక్షణాపథము ( వింధ్యకు దక్షిణమునందు ఉన్న భారతదేశము) నందు ప్రవహించుచు ప్రాణులను పవిత్రులనుగా చేయుచున్నది.

తేభ్య స్సర్వేతు మనవః ప్రజాసర్గేషు నిర్మితాః | జ్ఞాత్వాశ్రాద్ధాని కుర్వీత ధర్మభావేపి సర్వదా. 29

*తేభ్యఏవ పునఃప్రాప్తుంప్రసాదా ద్యోగసన్తతిం | పితౄణా మాదిసర్గేతు శ్రాద్ధమేవ వినిర్మితమ్‌. 30

శ్రాద్ధే దేయాదేయవస్తువివరణమ్‌.

సర్వేషాం రాజతం¨పాత్రంపితౄన్ర్పీ ణాతి సర్వదా | దత్తం స్వధా పురోధాయ పితౄనుద్దిశ్య సర్వదా. 31

అగ్నీషోమయమాభ్యాంతు కార్య మాప్యాయనం బుధైః | అగ్న్యభావేపి విప్రస్య పాణావథ జలేపివా. 32

అజాకర్ణేశ్వకర్ణేవా గోష్ఠేవాథ శివాన్తికే | పితౄణా ముత్తమం స్థానం దక్షిణా దిక్ర్పశస్యతే. 33

ప్రాచీనావీత ముదకం తిలా స్సవ్యాఙ్గ మేవచ | దర్భా మాంసంచ పాఠీనం గోక్షీరం మధురో రసః. 34

*ఖడ్గవార్ధ్రామిషంచైవ మధుశ్యామాక శాలయః | యవ నీవార ముద్గేక్షుగుడపుష్ప ఘృతానిచ. 35

వల్లభాని ప్రశస్తాని పితౄణామేవ సర్వదా | గ్రాహ్యాణ్యతాని; వక్ష్యామి శ్రాద్ధే వర్జ్యాని యాని చ. 36

మసూర చణనిష్పావ రాజమాష కుళుత్థకాః | పద్మబిల్వార్క ధుత్తూర పారిభద్రాటరూషకాః.

న దేయాః పితృకార్యేషు పయశ్చాజావికం తథా | కోద్రవోద్దాలకరక కపిత్థమధుకాతసీ.

ఏతాన్యపి న దేయాని పిత్రుభ్య శ్ర్శియమిచ్ఛతా | పితౄన్ర్పీణాతి యో భోక్తా తే పునః ప్రీణయన్తి తమ్‌.39

ఇచ్చన్తి పితరస్తుష్టిం స్వర్గారోగ్యం ప్రజాః ఫలమ్‌ | దేవకార్యా దపి పునః పితృకార్యం విశిష్యతే.40

దేవతానాం పితృణాంతు పూర్వమాప్యాయనం స్మృతమ్‌ | శీఘ్రప్రసాదా స్త్వక్రోధాః ప్రశాన్తా స్థ్సిరసౌహృదః. 41

శాన్తాత్మాన శ్శౌచపరా స్సతతం ప్రియవాదినః | భక్తానురక్తా స్సుఖదాః పితరః పూర్వదేవతాః.42

హవిష్మతా మాధిపత్యే శ్రాద్థదేవో రవి స్మ్ర్సతః | ఏతద్వ స్సర్వమాఖ్యాతం పితృవంశానుకీర్తనమ్‌.

పుణ్యం పవిత్ర మాయుష్యం కీర్తనీయం సదా నృభిః.

ఇతి శ్రీమత్స్యమహాపురాణ మత్స్యమనుసంవాదే ద్విజాదిపితృగణ గణనం నామ పఞ్చదశో7ధ్యాయః.

ప్రజాపతులు తాము చేసిన ప్రజా సృష్టులలో ఈపితృదేవతల నుండియే మనువులనందరును సృజించిరి. ఈ విషయమును ఎరిగి జనులు ఏ యజ్ఞయాగాది ధర్మము నైనను ఆచరించినను ఆచరించకున్నను ఎల్లప్పుడును శ్రాద్థములను మాత్రమాచరించలెను. వారి అనుగ్రహమువలననే మరల ప్రజలు యోగసిద్థిని నిరంతరముగా(అవిచ్ఛిన్నముగా) పొందగలరు. ఏలయన ఆదిసృష్టియందు జనులు అనుష్టింపవలసిన కర్మముగా పితృశ్రాద్థమే విధింపబడినది.

అన్ని వర్ణములవారు పెట్టు శ్రాద్థములందును రజత (వెండితో చేసిన) పాత్రమే పితృప్రీతికరము. (పితృదేవతలనుద్థేశించి సమర్పించు ఏపదార్థమునైనను ఏవర్ణము వారైనను రజత పాత్రమునందే సమర్పించవలెను.) పితరులనుద్ధేశించి ఏది సమర్పించినను స్వధాకార పూర్వకముగా ఈయవలెను. సంప్రదాయమును ఎరిగినవారు అగ్నీషోములకును యమునకును (అగ్నిష్వాత్తులకు అని మరియొక విధముగ పాఠము) శ్రాద్థదానముచే తృప్తిని కలిగించవలెను. ఇది అగ్నియున్నచో అగ్నియందును లేనిచో విప్రుని చేతియందో జలమునందో మేక చెవియందో గుర్రపు చెవియందో గోవులు నిలుచు స్థానమునందో శివ సన్నిధియందో చేయవచ్చును. దక్షిణదిశ పితరులకు ప్రశస్తమయిన స్థానము (దిక్కు).

___________________________________________

*సర్వంపాత్రేభ్యఏవస్యాచ్ర్ఛాద్ధమేవవినిర్మితమ్‌. .పాత్రమథవారాజతాన్వితమ్‌.

*ఖడ్గలోహామిషంచైవ.

ప్రాచీనావీతము (కుడి భుజము మీదకు ధరించిన యజ్ఞోపవీతము) ఉదకము నూవులు సవ్యమయిన (ఎడమవైపు) అవయవము దర్భలు కూర్మమాంసము ఆవుపాలు మధురరస ద్రవ్యములు ఖడ్గమృగపు మాంసము తేనె చామలు అనువడ్ల బియ్యము వరిబియ్యము యవలు నివ్వరి బియ్యము పెసలు చెరకు బెల్లము పూవులు నేయి ఇవి ఎల్లప్పుడును పితృ దేవతలకు ప్రియములైనవియు ప్రశస్తములైనవియును. కనుక శ్రాద్థమున ఇవి గ్రహింపదగినవి. విడువదగినవి చెప్పెదను- వినుము. చిరుసెనగలు సెనగలు అనుములు బొబ్బరలు ఉలవలు తామరపూవు బిల్వము జిల్లేడు ఉమ్మెత్త వేప అడ్డసరము మేకల గొర్రెలపాలు కొర్రలు అడవి కొర్ర లు దానిమ్మ వెలగ ఇప్ప అవిసి గింజలు ఇవి శ్రాద్థమునందు వినియోగించకూడదు. అట్లు చేయుటచే వారి అనుగ్రహము కలుగదు. శోభ సిరి తగ్గును. భక్తిచే పితరులను తృప్తిపరచిన వానిని పితరులను సంతృప్తి పరతురు. పితరులు తుష్టి చెందినచో వారు కర్తకు గూడ తుష్టిని స్వర్గమున ఆరోగ్యమును సంతానమును ఫలముగా ఇత్తురు.

దేవకార్యముకంటెను పితృకార్యమువిశిష్టతరమయినది. దేవతలను తృప్తిపరచుటకంటెను ముందు పితరులను తృప్తి పరచవలయును. పితృదేవతలు శీఘ్రముగా అనుగ్రహించు వారును క్రోధము లేనివారును మిగుల శాంతులును స్థిరముగా నిలచియుండు సుహృద్భావము (అనుగ్రహము) కలవారును శుద సత్త్వగుణ ప్రధానమగు చిత్తవృత్తి కలవారును దేహమునను చిత్తమునను శుచిత్వమునందు శ్రద్థ కలవరును ఎల్లప్పుడు ప్రీతికరముగా మాటలాడువారును భక్తులయందు ప్రీతికలవారును వారికి సుఖమును ఇచ్చువారును ఐయున్నారు. ఇంతఏల? వారు దేవతలలో మొదటివారు.

సూర్యుడు హవిష్మంతులు అను పితృదేవతల అధిపతిత్వము కలవాడును శ్రాద్థ కర్మానుష్టానమునకు అధిష్ఠాన దేవతయునై యున్నాడు.

మహర్షులారా! మీకు నేను పితృవంశాను కీర్తనము అంతయు చెప్పితిని. ఇది పుణ్య కరము-పవిత్రమయినది. ఆయుష్యమును వృద్థిచేయునది. మానవులు ఎల్లప్పుడును కీర్తింపదగినది.

ఇది శ్రీ మత్స్యమహా పురాణమున మత్స్యమను సంవాదమున పితృగణ గణనమను పంచదశాధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters