Sri Matsya Mahapuranam-1    Chapters   

ఏకోనచత్వారింశదుత్తరశతతమోధ్యాయః

త్రిపురసంహార కథాసమాప్తిః

సూతః : అథ దైత్యపురాభావే పుష్యయోగో బభూవ హ | బభూవ తత్ర సంయుక్తం తద్యోగేన పురత్రయమ్‌. 1

*తత్ర త్రిణయనో దేవో భ్రామయ న్నిశితం శరమ్‌ | ముమోచ త్రిపురే తూర్ణం త్రినేత్రస్త్రిపురాధిపః 2

తేన ముక్తేన బాణన బాణపుష్పనమప్రభమ్‌ | ఆకాశం స్వర్ణసజ్కాశం కృతం తస్య విరాజితమ్‌. 3

ఈశ్వరేణౖ కేషుణా త్రిపురదాహః

ముక్త్వా త్రిదైవతమయం త్రిపురే తం శరోత్తమమ్‌ | ధిగ్దిగ్మామితిచక్రన్ద కష్టంకష్ట మితిబ్రువ&. 4

వైధ్యుర్యం దైవతం దృష్ట్వా శైలాది ర్గజవద్గతః | కిమిదం త్వితి పప్రచ్ఛ శూలపాణిం త్రిలోచనమ్‌. 5

తత శ్శశాజ్కతిలకః కపర్దీ వరమార్తవత్‌ | ఉవాచ నన్దినం భక్తం స మయో ద్య వినజ్ఞ్యతి. 6

అథ నన్దీశ్వరస్తూర్ణ మగా న్మారుతవద్బలీ | శ##రే త్రిపురమాయాతే త్రిపురస్తు వివేశ సః 7

స మయం వీక్ష్య గణవః ప్రాహ కాఞ్చనసన్నిభః | వినాశస్త్రిపురస్యాస్య ప్రాప్తో మయః సుదారుణః 8

అనేనైవ గృ హేణత్వం మయావక్రమ శీఘ్రతః | తచ్ర్ఛుత్వా నన్దివచనం దృఢభక్తో మయ స్తదా . 9

తేనైవ గృమముఖ్యేన త్రిపురా దపసర్పితః | సోపీషుః పత్రపుటవ ద్భిత్త్వా చైవ పురత్యయమ్‌. 10

త్రిధాభవ ద్దుతాశశ్చ సోమో నారాయణ స్తదా| శరతేజః పరీతాని పురాణి ద్విజపుజ్గవాః 11

దుష్పుత్త్రదోషా ద్దహ్యన్తే కులాన్యేతా న్యథాతథా | మేరుమన్దరకల్పాని మన్దిరాణి గృహాణిచ. 12

నకవాటగవాక్షాణి వలభీశోభితానిచ | ప్రాసాదాద్యాని రమ్యాణి కూటాగారోత్కటానిచ. 13

ప్రమదాశతపుష్టాని దనధాన్యయుతానిచ | బద్దద్వజవతాకాని స్వర్ణరౌప్యమయానిచ. 14

గృహాణి తస్మిం స్త్రిపురే దానవానా ముపద్రవే | దహ్యన్తే దహనాభాని దహనేన సహస్రశః 15

నూట ముప్పది తొమ్మిదవ అధ్యాయము.

త్రిపుర సంహార కథా సమాప్తి.

సూతుడు ఇంకను ఇట్లు చెప్పనారంభించెను. ఇంతలో త్రిపుర దుర్గ నాశమునకు హేతువగు పుష్యయోగము రానేవచ్చెను. దానితో ఆమూడు పురములును ఒకటిగా నయ్యెను. త్రినేత్రుడు త్రినయనుడు త్రిపురాధిపుడునగు దేవుడు (త్రినయనుడు - మూడు లోకములందలి జీవులను తన ఉత్తమ గతికి చేర్చువాడు; త్రిపురములకు అధిపతి పరమేశ్వరుడే.) శివుడు ఆ పుష్యయోగ సమయమున నిశితమగు శరమును గిరగిర త్రిప్పి వేగముగా త్రిపురములకు దుర్గముపై ప్రయోగించెను. ఆ విడిచిన బాణపు తేజస్సుచే ఆకాశము మొదట రెల్లు పూవువలెను పిమ్మట బంగారువలెనునయి ప్రకాశించెను. శివుడు త్రిపురములపై బాణ ప్రయోగము చేయుచునే 'నేను నిందింపదగిన పని చేసితినే:' యనుచు 'అయ్యో : అయ్యో:' అనుచు దుఃఖముతో అరచెను. శివుడట్లు ఆర్తి చెందుట చూచి నందీశ్వరుడు గజమువలెపోయి ఇదేమి-మీరేల దుఃఖపడుచున్నారని శివునడిగెను. చంద్రభూషణుడు ఆ శివుడు-తన భక్తుడగు నందితో 'ఇక ఇప్పుడు మయుడు నశించును. అందులకై పరమార్తుడనై దుఃఖించుచున్నాను. 'అనెను. అంతట నంది నంది వాయువువలె మహావేగమున పయనించి శివుని శరము త్రిపురములను చేరులోపలనే తాను నచటికిపోయెను. స్వర్ణకాంతిగల ఆ నందియను ప్రమథ నాయకుడు మయునితో ' మయా: ఈ త్రిపుర దుర్గమునకు మిగుల దారుణమగు నాశము సమీపించినది. కావున నీవు ఇదే గృహముతో నా వెంట బయలుదేరి పురమునుండి తప్పించుకొని పొమ్ము' అని పలికెను. నంది పలికిన వచనమును విని దృఢ భక్తుడగు మయుడు అతడు తెలిపినట్లు మహాగృహము ఆధారముగా త్రిపుర దుర్గమును విడిచి తప్పించుకొనిపోయెను. వెంటనే శివుడు విడిచిన శరము అగ్ని చంద్రనారాయణ రూపమున మూడుగా అయి త్రిపుర దుర్గమును ఆకు దొన్నెను. చీల్చినట్లు చీల్చి కాల్చసాగెను. దుష్పుత్త్రుడు జనించి తన దోషములచే కులనాశము చేసినట్లు శర తేజస్సులు ఆ దుర్గమును చుట్టుకొని దహింపసాగెను. మేరు మందర పర్వతములవంటి మందిరములను గృహములును వాటి కవాటములు గవాక్షముల వలభి గృహములు (మేడలపై నుండి శిఖరాకార గృహములు) ప్రాసాదములు రమ్యములగు కూట గృహములు వానియందు వందల కొలదిగా నున్న స్త్రీలు ధనధాన్యములు ధ్వజములు పతాకలు కాలసాగెను. వెండితో బంగారుతో నిర్మించిని ఆ త్రిపురములందలి ఇండ్లన్నియు అంతవరకు అగ్నివలె ప్రకాశించుచుండియు ఇపుడీ శివుని శరాగ్నిచే దగ్దమగుచు దానవులకు ఉపద్రవము కలిగింపసాగెను.

ప్రసాదాగ్రేషు హర్మేషు హ్యశోకోపవనేషుచ | వాతాయనస్థితాశ్చాన్యా హ్యాకా శేషు తలేషుచ. 16

రమణౖ రుపగూఢాశ్చ రమణ్యో రమణౖస్సహ | ధక్ష్యన్తే దానవేన్ద్రాణా మగ్నినా దయితాః స్త్రియః. 17

కాచిత్ర్పియం సమాలిజ్గ్య అశక్తా గన్తుమన్యతః | పురః ప్రియస్య పఞ్చత్వం గతాగ్నే ర్వదనే క్షయమ్‌. 18

ఉపసర్పంత మేకాతు విసృప్యచ హుతాశనమ్‌ | ఉవాచ శతపత్రాక్షీ సాస్రాక్షీ సా కృతాఞ్చలిః . 19

హవ్యవాహనః భార్యహం పరస్య పరతాపనః | ధర్మసాక్షీ త్రితోకస్య న మాం త్వం స్ప్రష్టుమర్హసి. 20

సహిత స్స్వాహయా దేవః స్వధయా చాపి సువ్రత | పరేణా వైహి ముక్త్వేదం గృహం చర హితం హి మే. 21

ఏకా పుత్త్ర ముసాదాయ బాలకం దానవాజ్గనా | హుతాశనసమీపస్థా ఇత్యువాచ హుతాశనమ్‌. 22

బాలోయం దుఃకలబ్దశ్చ మయా పావక పుత్త్రకః | నార్హ స్యేన ముపాదాతుం యది తే షణ్యుఖం ప్రియః 23

భూయః ప్రియం పరిష్వజ్య పీడితా దానవాంగనా | నిపతస్త్యర్ణవజలే సింజమానవిభూషణా. 24

హా మాతః పుత్త్ర తాతేతి మాతులేతి చ విహ్వలాః | చుక్రుశుస్త్రిపురే నార్యః పావకజ్వాలవేష్టితాః. 25

యథా దహతి శీతాగ్ని స్సామ్బుజం జలజాకరమ్‌ | తథా స్త్రీచక్రవద్మాని దహతి త్రిపురేనలః. 26

తుషారరాశిః కమలాకరాణాం యథా దహత్యమ్బుజకం నిశాన్తే | తథైవ సోగ్ని స్త్రిపురాజ్గనానాం దదాహ రక్తేక్షణ మజ్కజాని. 27

ప్రాసాదాగ్రములందు హర్మ్యతలములందు అశోకోద్యానములందు గవాక్షములలో ఆకాశ ప్రదేశములలో తమ ప్రియుల కౌగిలింతలలో సుఖించుచునో ప్రియులతో కూడి విహరించుచునో తమ ప్రియులకు ప్రీతి కలిగించుచు వారికి ప్రీతిపాత్రములుగా నున్న దానవ స్త్రీలెందరో అమంటలలో కాలిపోవుచుండిరి. ఒకతె ప్రియుని కౌగిలింతలోనుండి మరెక్కడకును పోలేక అట్లే కాలెను. మరియొకతె తన ప్రియుని ఎదుటనే అగ్ని నోటపడి నశించెను. ఒకతె అగ్నితనవైపునకు వచ్చుచుండగా తానే ఇంకను అగ్ని సమీపమునకు పోయి తామరలవంటి తన కన్నుల నీరు కార్చుచు దోసిలివట్టి హవ్యవాహనా: నీవు పరులను తపింపజేయువాడవు అనుట నిజమే; కాని నేను పరుని భార్యను; నీవు త్రిలోక ధర్మమునకు సాక్షివి; నీవు సత్కర్మలనాచరించు మహనీయుడవు; స్వాహా స్వధాదేవులలు నీకు ధర్మపత్నులుగదా: ఇట్టి నీవు నన్ను తాకుట తగదని వేడుకొనుచున్నాను. నన్ను కాపాడుటకును ఇంట ఎవరును లేరు; నేను ఒంటరిదానను; ఈ ఇల్లు విడిచి దూరముగా పొమ్ము. అని ప్రార్థించెను. మరియొక దానవాంగన తన కుమారుని తీసికొని అగ్నికడకుపోయి హుతాశనునిట్లు ప్రార్థించెను: పావకా: నేనంతో దుఃఖముతో ఈ బాలుని కనిపెంచితిని; వీడు పసివాడు; నీకు కుమారస్వామి ఎట్లు ప్రీతి పాత్రుడో వీడు నాకును అట్లే; వీనిని తీసికొనిపోవలదు. అని ప్రార్థించెను. ఇంకొక దానవ స్త్రీ ప్రియుని కౌగిలించుకొనియుండి అతనిని విడువలేక బాధపడుచునే తన ఆభరణములు ధ్వని చేయుచుండ సముద్ర జలముతో వడిపోయెను. అగ్ని చుట్టుకొనగా ఏమియు చేయలేక దానవస్త్రీలు అమ్మా: కొడుకా: నాయనా: మామా: అని ఏడ్చుచుండిరి. కొండలపై మండెడు. అగ్నిఅచటనున్న తామరకొలకులను కాల్చినట్లు త్రిపురమున క్రమ్మిన శివశరాగ్ని స్త్రీ పద్మాకరమును కాల్చివేసెను. ప్రభాత సమయమునమంచు బిందువుల రాసుల సరస్సులందలి పద్మములను దహించి (పాడుచేసి)నట్లు ఆ అగ్నియు స్త్రీజనపు ముఖనేత్ర పద్మములను దహించెను.

శరాగ్నితాపా త్సమభిద్రుతానాం సర్వాఙ్గనానా మతికోమలానామ్‌ | బభూవ కాఞ్చీగుణనూపరాణా మా క్రన్ద అసాంచ తదాతిమిశ్రమ్‌. 28

దగ్దార్దచన్ద్రాణి సతోరణాని విస్తీర్ణహర్మ్యాణి సవేదికాని | దగ్దానిదగ్దాని గృహాణి తత్ర పతన్తి త్రాణార్థమివార్ణవౌఘే. 29

గృహైః పతద్భి ర్జ్వలనావలీఢై రసౌ సముద్రే సలిలం వ్రతప్తమ్‌ | కుపుత్త్రదోషైః ప్రపతన్విరుద్దం యథా కులం యాతి ధనాన్వితస్య. 30

గృహైః ప్రతపై#్తః క్వథితం సమన్తా త్తదార్ణవే తోయ ముదీర్ణవేగే | విత్రాసయామాన తిమీ స్త్సనక్రాం స్తిమిఙ్గిలాం స్తత్‌క్వథితం తథాన్యా&. 31

దగ్దః పురో మన్దరపాదకల్పః ప్రాకారవర్గ స్త్రిపురే పపాత | తై రేవసార్ధం భవనైః పపాత శబ్దం మహాస్తం జనయ త్సముద్రే. 32

సహస్రశృఙ్గై ర్బవనై ర్యదాసీ త్సహస్రశృఙ్గైస్సఇవాచలేన్ద్రః | నామావశేషం త్రిపురం వ్రజజ్ఞే హుతాశనాహారబలిప్రయుక్తః 33

ప్రదహ్యమానేన పురేన తేన దహ త్సపాతాళదివం ప్రతప్తమ్‌ | దుఃఖం మహత్ర్పాప్య జలావమగ్నం యస్మిన్గృహే సంగతవా న్మయోసౌ. 34

శ్రుత్వా తతశ్చ దేవేశో ఇన్ద్రోవజ్రధర స్తథా | శశాప తం గృహం చైవ మయంచ దితినన్దనమ్‌. 35

అసేవ్య మప్రతిష్ఠంచ భ##యేనచ సమావృతమ్‌ | భవిష్యతే మయగృహం నిత్యమేవ యథానలః. 36

యస్యయస్యచ దేశస్య భవిష్యతి పరాభవః ద్రక్ష్యన్తి త్రైపురం ఖణ్డం తత్రైకం నాశగా జనాః 37

శరాగ్ని తాపమునకు తట్టుకొనలేక అటునిటు పరుగెత్తుచున్న అతి కోమలలగు త్రిపుర నగర స్త్రీల ఒడ్డాణములు అందెలు మొదలగు ఆభరణముల ధ్వనులును ఏడుపుల ధ్వనులును నమ్మిశ్రితమై వినబడుచుండెను. అర్ధ చంద్ర నిర్మాణములతో తోరణ (మహాద్వార)ములతో వేదికలతో కూడి విస్తీర్ణహర్మ్యములు నిరంతరముగ దగ్దమగుచు అగ్నినుండి రక్షణ కొరకేమో అనునట్లు సముద్ర జలములో పడిపోవుచుండెను. అగ్ని జ్వాలలు చుట్టుకొనగా మండుచు పడుచున్న గృహములతో సముద్రజలము దుష్పుత్తుని దోషములచే సంతాపించి లోక విరోధమును పొందు వంశమువలె ఉడికిపోవుచుండెను. అట్లు ఉడికిపోవు సముద్రజలము తనయందలి తిమి తిమింగిల నక్రాది జల జంతువులకును చాల బాధ కలిగించుచు వాటిని ఉడికించుచుండెను. చూచుచు చూచుచుండగనే ఆ త్రిపుర ప్రాకారవర్గము మందర పర్వత పాదమువలె దగ్దమయి పోగా భవనములును దగ్దములయి సముద్రమున కూలగా వాటితోపాటే తానును మహాధ్వని చేయుచు సముద్రమున పడిపోయెను. సహస్ర శిఖరములుకల పర్వతములవలెనే సహస్ర గోపురములుగల భవనములు దగ్దములు కాగా హుతాశనునకు బలిగా అర్పించిన హవిస్సువలె త్రిపురము నామావ శేషమయ్యెను. ఆ త్రిపురదుర్గమట్లు ప్రదహ్య మానమయి నశించుచుండగా భూలోకమేకాక పాతాళ ద్యులోకములు కూడ ప్రతప్తమయ్యెను. అంతలో మయుడు దాగియున్న గృహము మహాదుఃఖమునందుచున్న మయునితో కూడ సముద్రజలములలో (కాలకయే) వడిపోయెను.

ఈవిషయము విని వజ్రధరుడగు ఇంద్రుడు ఆ మయ గృహమును మయుని కూడ ఇట్లు శపించెను. '' ఇక మీదట ఈ మయ గృహము నిరంతరమును నిలుకడ లేనిదియు ఎవరును ఆశ్రయింపరానిదియు అగ్నివలె భయముతో నిండినదియు అగును. ఏఏ దేశమునకు ఎచ్చటెచ్చట పరాభవము (ఓటమి కాని కరవు మొదలగు ఉపద్రవములు కాని) సంభవించునో అచ్చట నెల్ల ఉపద్రవము వలన నాశము పాలగుచు జనులు ఈ త్రిపురదుర్గ ఖండమగు మయ గృహమును చూడగలరు (అనగా ఈ ఉపద్రవముల పాలయిన దేశభాగమే మయగృహము.)

తదేత దద్యాపి గృహం మయస్యామయవర్జితమ్‌ | సౌఖ్యం సమాప్నుతే భూయో మయోసౌ స్వగృహే వరమ్‌. 38

ఋషయః : భగవన్త్స మయో యేన గృహేణ ప్రపలాయితః | తస్య నో గతి మాఖ్యాహి మయస్య తపసోద్భవమ్‌. 39

సూతః : దృశ్యతే దృశ్యతే యత్ర ధ్రువ స్తత్ర మయో మహా& | దేవద్విట్తు మయశ్చాతః స తదోద్నిగ్నమానసః . 40

తతోన్యత శ్శిలావేశ్మ త్రాణార్థం వై చకార సః | తత్రాపి దేవా యాస్యన్తి మయ మాసురముత్తమమ్‌. 41

తదా7శక్త స్తతో గంతుం తచ్ఛైకం పుర ముత్తమమ్‌ | శివః సృష్ట్వా గృహం ప్రాదా న్మయాయచ గృహార్థినే . 42

విరామ సహస్రాక్షః పూజితశ్చ ప్రతాపవా& | పూజయన్తశ్చ భూతేశం సర్వే తుష్టువురీశ్వరమ్‌. 43

సంపూజ్యమాన స్త్రిదశై స్స దేవ స్సమీక్షమాణౖ ర్గణనాయకైశ్చ. 43u

హర్షా ద్వవల్గు ర్జగృహుశ్చ దేవా జగుశ్చ గీతం త్రిపురావదానమ్‌ | ననర్తు రుచ్చైశ్చ విభక్తహస్తాః పితామహోవన్దత తం మహేశ్వరమ్‌. 44

ప్రగృహ్య చాపం విసనర్జ భూత్యా రథా త్సముత్ల్పుత్య సురాం స్త్రిలోచనః 44 u

ఏవం తత్త్రిపురం దుర్గం దైవతై స్సుదురాసదమ్‌ | హరేణౖ కేషుణా దగ్దం విక్షిప్తం మకరాలయే. 45

యఇదం రుద్రవిజయం పఠతే విజయాహవమ్‌ | విజయం తస్య సఙ్గ్రామే దిశ##తే స వృషధ్వజః . 46

పితౄణాంచ నివాపేతు యఇదం శ్రావయిష్యతి | ఇదం స్వస్త్యయనం పుణ్యం ఇదం పుంసవనం మహత్‌. 47

ఇదం శ్రుత్వా పఠిత్వాతు రుద్రలోకే మహీయతే | అనంతం తస్య పుణ్యం స్యా త్సర్వయజ్ఞఫలప్రదమ్‌. 48

ఇతి శ్రీమత్స్యమహాపురాణ త్రిపురోపాఖ్యానే త్రిపురదాహే

త్రిపురసంహారసమాప్తికథనం నామ

ఏకోనచత్వారింశదుత్తర శతతమోధ్యాయః

ఇట్లు జనులకు భయహేతువగు ఈ మయగృహము మాత్రము ఈ నాటికిని ఏ కీడును పొందక యున్నది. దానియందు ఆ స్వగృహమందు మయుడు కూడ సుఖము లనుభవించుచునే యున్నాడు.

అన విని ఋషులు సూతునితో ఇట్లనిరి : సూత భగవన్‌: మయుడు ఏ గృహముతో పారిపోయెనో ఆమయగృహము గతి ఏమయినది? అది తపశ్శక్తిచే సిద్దించినది కదా: అనగా సూతు డిట్లనెను: ధ్రువు డెచ్చట ఎంతవరకు కనబడుచుండునో అంతవరకును అచ్చట నెల్ల మయుడు కనబడుచునే యుండును. ఇది ఎట్లు జరిగె ననగా చెప్పెద వినుడు.

దేవ శత్రువగు మయుడు ఆనాటి త్రిపుర దాహము చూచి భయోద్వేగములతో నిండిన మనస్సుతో కూడి దాని నుండి ఎక్కడకును పోలేకయుండగా శివుడు అతనికి నిర్భయమగు ఇల్లొకటియే ఒక పురముగా సృష్టించుకొనునట్లు గృహార్థియగు మయునకు వరముగా ఇచ్చెను. దాని ప్రభావమున వాడు వేరొకచోట శిలామయమగు గృహము నిర్మించు కొనెను. అచ్చటకు కూడ దేవతలు అసురోత్తముడగు మయాసురుని చూడ పోవుచుందురు.

ఇట్లు శివుడు మయుని విషయముని అనుగ్రహము చూపుట చూచి ఇంద్రుడును తానెంత ప్రతాపవంతుడయ్యు మయునిపై పగ చూపుట మానెను. అందులకు మెచ్చి ఎల్లరును ఇంద్రుని ప్రశంసించింరి. దేవత లందరును భూతనాథుడగు ఈశ్వరుని స్తుతించిరి. ఇది చూచుచున్న దేవత లందరును ప్రమథ గణాధిపతులును ఈశ్వరుని సంపూజించిరి. సంతోషముతో దేవతలు గంతులు వైచిరి. ఒకరినొకరు పట్టుకొనిరి. త్రిపురావదావమును (వీరకృత్యమును) గీతములుగా రచించి గానము చేసిరి. చేతులు నృత్య సంబంధి ముద్రలుగా విభజించి (ముద్రా ప్రదర్శన పూర్వకముగా ) గొప్పగా నృత్యములు చేసిరి. బ్రహ్మదేవుడును పరమేశ్వరుని నమస్కరించెను. పరమేశ్వరుడును రథమునుండి తన ధనువును తీసికొని దానినుండి క్రిందికి దేవతలకు వీడ్కోలిచ్చి పంపెను.

ఈ విధముగా ఎవరికిని చేరుటకైన అలవి కాని త్రిపురదుర్గమును హరుడు ఒకే ఒక బాణముతో దగ్ద మొనర్చి సముద్రములో వడవేసెను.

ఈ రుద్ర విజయమును పఠించిన-వినిన-వారికి వృషభ ధ్వజుడగు శివుడు యుద్ద విజయము కలిగించును.

దీనిని పితృశ్రాద్ద తర్పణాదికృత్యముల సమయమున వినిపించిన ఎడల సర్వ యజ్ఞము లాచరించినంతగా అనంతపుణ్యము లభించును. ఇది స్వస్త్యయన (శుభమును కలిగించు) కర్మలలో ఉత్తమము; పుణ్యకరమయినది; పుంసవన కర్మముతో సమాన మయినది; దీనిని విన్నను చదివినను రుద్రలోకప్రాప్తి యగును.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున త్రిపురోపాఖ్యాన సమాప్తి యను నూట ముప్పది తొమ్మిదివ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters