Sri Matsya Mahapuranam-1    Chapters   

సప్తత్రింశదుత్తరశతతమోధ్యాయః.

త్రిపురదాహే చంద్రోదయాదివర్ణినమ్‌.

సూతః : 

తారకాక్షే హతే యుద్ధే ఉత్సార్య ప్రమథాన్మయః | ఉవాచ దానవా న్భూయో భూయ స్సతు భయావృతా&. 1

అసురేన్ద్రాధునా సర్వే శృణుధ్వం మత్ప్రభాషితమ్‌ |

యత్కర్తవ్యం మయాచైవ యుష్మాభిశ్చ మహాబలైః. 2

పుష్యం సమేష్యతే కాలే చన్ద్ర శ్చన్ద్రనిభాననాః | యత్రైకం త్రిపురం సర్వం క్షణమేకం భవిష్యతి. 3

సజన్తో ర్నిహితః కాలోనో జరా గ్రసతేనఘాః | ముహూర్తం యదయం కాలః కోకిలాశంసితేనవై. 4

స కాలః పుష్యయోగస్య పురస్యచ మయా కృతః | కాలే తస్మి న్పురేయస్తు సమ్భావయతి సంహతామ్‌. 5

సఏవ దాహయేత్తూర్ణం బలి నైకేషుణా సురాః | యావత్ప్రాణా బలం యచ్చ యోధయధ్వం మహాసురాః. 6

తంకృత్వా హృదయేచైవ పాలయధ్వ మిదంపురమ్‌ | మాహేశ్వరరథం హ్యేకం సర్వప్రాణివిభీషణమ్‌. 7

విముఖీకుర్వతాత్యర్థం యథా నోత్సృజతే శరమ్‌ | తత ఏవం కృతే స్మాభి స్త్రిపురస్యాభిరక్షణ. 8

ప్రతీక్షిష్యన్తి వివశాః పుష్యయోగం దివౌకసః | నిశమ్యతు మయసై#్యవం దానవా స్త్రిపురాలయాః. 9

ముహు స్పింహరవం కృత్వా మయమూచు ర్యమోపమాః |

ప్రయత్నేన వయం సర్వేయత్త్వయా మయ భూషితమ్‌. 10

తథా కుర్మో యథా రుద్రో నమోక్ష్యతి పురే శరమ్‌ |

అద్య దాస్యామ సఙ్గ్రామం రుద్రస్యతు జిఘాంసవః. 11

కథయన్తి దితేః పుత్త్రాః హృష్టా భిన్నతనూరుహాః | కల్పంస్థాస్యతివా స్వస్థం త్రిపురం శాశ్వతం ధ్రువమ్‌.

అదానవం వా భవితా నారాయణపధాలయమ్‌ | హాస్యామో న వయం ధర్మం యస్మాన్మోక్ష్యతి నో భవా&.

ఆదైవత మదైత్యంవా లోకం ద్రక్ష్యన్తి మానవాః | ఇతి సంశ్రుత్య సంహృష్టా స్త్రిపురా స్త్రిదశారయః. 14

నూట ముప్పది ఏడవ అధ్యాయము.

చంద్రోదయాది వర్ణనము.

తారకాక్షుడు మరణించిన తరువాత మయుడు ప్రమథులను తరిమి భయావృతులయి యున్న దానవులతో ఇట్లనెను. దానేవేంద్రులారా! ఇపుడు నేనును మీరును ఏమి చేయవలెనో చెప్పుదును వినుడు. చంద్రుడు పుష్యనక్షత్రముతో కలియు పుష్యయోగము వచ్చినపుడు క్షణకాలము త్రిపురములు ఒకటి యగును. ఇది కోకిల 'కుహూ' ధ్వనికి పట్టునంతకాలము. ఆ సమయమున మనలను వార్దకము మ్రింగి వేయును. ఇది పుష్యయోగ సమయమని నేను వ్యవస్థ చేసినాను. ఆ ముహూర్తమున ఈ మూడు పురముల ఏకత్వమును గుర్తించిన దేవతలో ఎవడయినను ఒకే బాణముతో త్రిపురదుర్గ మును చూర్ణము చేయును. కావున ప్రాణములును బలమును ఉన్నంత వరకును దానవు లందరు యుద్ధముచేసి పురరక్షణ చేయుడు.

మహేశ్వరుని రథ మొక్కటి సర్వప్రాణి భయంకరమైనది. దానిని మీ రెట్లయిన అడ్డగించి బాణ ప్రయోగము చేయకుండునట్లు చూడుడు. ఏలయన దేవతలు అదే పనిగా పుష్యయోగమున కెదురు చూచుచుందురు. మీ రది గమనించుడు.

మయుని మాటలు విని యమునివంటి త్రిపుర దానవులు మాటామాటికి సింహనాదములు చేసి మయునితో ఇట్లనిరి: మయా: మే మందరమును నీవు చెప్పినట్లు చేసెదము. శివుడు త్రిపురదుర్గముపై బాణము ప్రయోగించకుండ వారించెదము. రుద్రుని సంహరించుటకై యుద్ధము చేసెదుము. ఈ త్రిపురదుర్గము కల్పాంతము వరకు స్థిరముగ ఉండనైన వలయును; లేదా-ఈ ఆకాశ సంచారియగు త్రిపురమున దానవు డొక్కడును లేకుండనైన పోవలయును. నీవు మమ్ములను విడువ నంతవరకును మేమును మా ధర్మమును విడువము. లోకమున దేవతలుగాని దానవులుగాని లేకుండ పోవుటను మానవులు చూడగలరు. అని దానవులు పలికిరి.

చన్ద్రోదయాదివర్ణనమ్‌.

ప్రదోషే ముదితా భూత్వా చేరుర్మన్మథచారతామ్‌ | ఏవ ముక్తోదయాగ్రస్థ ఉదయాద్రౌ మహారుణః. 15

తమ ఉత్సార్య భగవాం శ్చన్ద్రోజృమ్భత సోమ్బరే | కుముదాలఙ్కృతే హాసో యథామ్భసి విజృమ్భతే.

సింహో యథా చోపవిష్టో వైడూర్యశిఖరే మహా& | విష్ణోర్యథాచ విస్తీర్ణో హారశ్చోరసి సఙ్గతః. 17

తథాచ గాఢే తమసి చన్ద్రో7త్రినయనోద్భవః | భ్రాజతే భ్రాజయన్లోకా న్ర్భాజ& జ్యోత్స్నావసేచనమ్‌. 18

శీతాంశా వుదితే చన్ద్రే జ్యోత్న్సాపూర్ణే పురే సురాః | చన్ద్రాంశుభి ర్దీపితే తదను దీపై స్సుదీపితైః. 19

ప్రదోషే తాన్యలంచక్రుర్గృహా ణ్యాత్మానమేవచ | రథ్యాసు రాజమార్గేషు ప్రాసాదేషు గృహేషుచ. 20

దీపా శ్చమ్పకపుష్పాభా యే దీప్యన్తే ప్రదీపితాః | గృహేష్వభ్రేషు తే దీపా స్స్నేహపూర్ణాః ప్రదీపితాః. 21

గృహాణి మసుమన్త్యేషాం నవరత్నమయానిచ | జ్వలన్తోదీపయన్దీప్తా శ్చన్ద్రోదయ ఇవ గ్రహాః. 22

చన్ద్రాంశుభి ర్బాహ్యతమ స్తనుదీపై స్తు దీపితే | దుష్టపుత్రైః కులమివ పీడ్యతే త్రిపురే తమః. 23

తస్మిన్పురేవై తరుణ ప్రదోషే చన్ద్రాట్టహాసే తరుణప్రదోషే |

రత్యర్థినో వైదనుజాః పురే ముహు స్సహాఙ్గనాభిశ్చ తతో విరేజుః. 24

ఇంతలో ప్రదోష మయ్యెను. త్రైపుర దానవు లెల్లరు శృంగార భావపూర్ణులై మన్మథుని సందేశహరులవలె నయిరి. క్రమముగ భగవానుడగు చంద్రుడు ఉదయ పర్వతముపై మిగుల ఎర్రనై ఉదయించుచు చీకటులను పోద్రోలుచు ఆకాశమున విజృంభింపసాగెను. అతడు సరోజలములో కలువపూల నడుమ విహరించు హంసవలెను వైడూర్య శిఖరము పై కూర్చున్న సింహమువలెను విష్ణువక్షమునందలి హారమువలెను ఆకాశమున కనబడుచుండెను.

లోకమంతయకు గాఢాంధకారములో మునిగియుండగా ఉదయించిన చంద్రుడు తాను అత్రి మహాముని నేత్రము నుండి ఉద్భవించినవాడు అగుటను సార్థకము చేయుచు లోకములను వెన్నెలతో తడుపుచు తాను ప్రకాశించుచు లోకము లను ప్రకాశింపజేయుచు లోకములకు కన్నులను ఇచ్చెను. ఇట్లు చంద్రోదయ మయ్యెను. త్రిపురము వెన్నెలతో నిండెను. భవనములందును దీపములు వెలిగింపబడెను. ఇట్లా పురమున బయట వెన్నెలతో లోపల దీపములతో ప్రకాశ మయ్యెను. అసురులును తమ తమ ఇండ్లను దేహములను కూడ అలంకరించుకొనసాగిరి. రచ్చలలో రాజమార్గములలో ప్రాసాదములందును గృహములందును నూనెతో నింపిన దీపములు వెలిగింపబడి సంపెగ పూలవలె ప్రకాశించుచుండెను. ధనముతో నిండిన వగు దానవుల నరవత్నమయ గృహములలో దీప ప్రకాశములో ఆయా వస్తువులు ధనములు రత్నములు - చంద్రోదయవశమున ప్రకాశించు గ్రహములవలె ప్రకాశము నందెను. దుష్టపుత్త్రుల వలన కులమునకు కలిగినట్లు బయటి వైపున వెన్నెలతోను ఇండ్లయందు దీపములతోను చీకటికి పీడ కలిగెను. ఇట్టి ప్రదోష కాలారంభమున చంద్రుని అట్టహాసము (అధిక ప్రకాశము) ¸°వనమునంది రాత్రికి ప్రకాశమునందించుచుండ దానవులు శృంగార సుఖమును కోరి స్త్రీ జనములతో కూడి అలంకరించుకొనుచు ప్రకాశించుచు చుండిరి.

వినోదితాయే వృషభధ్వజస్య పఞ్చేషవస్తే మకరధ్వజస్య |

తత్రాసురే ష్వాసురవుఙ్గవేషు సర్వాంగ నాస్వాద యుతా బభూవుః. 25

కలప్రలాపేషు చ దానవీనాం వీణాప్రలాపేషుచ మూర్ఛితేషు |

మత్తప్రలాపేషుచ దానవానాం సచాపబాణో మదనో మమన్థ. 26

తమాంసి నైశాని ద్రుతం నిహత్య జ్యోత్స్నావిధానేన జగద్ధితాయ |

ఖే రోహీణాం తాం దయితా మవాప్య చన్ద్రః ప్రభాభిః కురుతేహి రాజ్యమ్‌. 27

స్థిత్వైవ కామస్యతు పాదమూలే కాచిద్వరస్త్రీ స్వకపోలమూలే |

విశేషకం చారుదతీ కరోతి తేనాననం స్వం సమలంకరోతి. 28

దృష్ట్వాననం మణ్డలదర్పణస్థం మహాప్రభా మే ముఖజేతి జప్త్వా |

పరం నతాఙ్గీ రమణరితాని తేనైవ భావేన రతీవ చాస. 29

రోమాంచితై ర్గాత్రవరై ర్యువత్యా రతానురాగా ద్రమణషు చాన్యా |

స్వలఙ్కృతా యాన్తి మదాభిభూతా ద్విపా యథా ఘర్మదినావసానే. 30

పేపీయతే చాతిరసానువిద్ధా విమార్గతేన్యాచ ప్రియం ప్రసన్నా |

కాచిత్ర్పియస్యాతిచిరా త్ర్పసన్నా ఆసీత్ర్పలాపేషుచ సుప్రసన్నా. 31

గోశీర్షపద్మై ర్హరిచన్దనైశ్చ పఙ్కాఙ్కితాః క్షీరధరా೭೭సురీణాం |

మనోజ్ఞరూపా రుచిరా బభూవుః పూర్ణామృతస్యేవ సువర్ణకుమ్భాః. 32

క్షతాధరోష్ఠద్రుతరోషరక్తం రమన్తి దైత్యా దయితానురక్తాః |

తన్త్రీప్రలాపేషు పున స్సరక్తాః స్త్రీణాం ప్రలాపేషు పునర్విరక్తాః. 33

క్వచిత్ర్పలాపం మధురాభిధానం కామస్య బాణషు కృతం విధానమ్‌ |

ఆపానభూమీషు సుఖప్రదేశో దితేస్సుతానాం సమవాప్య గేయమ్‌. 34

గేయం ప్రవృత్తం త్వథ వాదయన్తి ప్రియోపగూఢాంగరుహాపి నారీ. 35

కేచిత్బ్రియాస్తత్రచ సాధయన్తి కేచిత్ప్రియా స్సమ్ప్రతిబోధయన్తి |

మారప్రసూనప్రభవాంశ్చ గన్ధా న్న్రసూయతేవై త్రిపురేషు గన్ధః. 36

పూర్వము శివునిపై ప్రయోగింపబడి వినోదము ననుభవించిన ఐదు బాణములును ఇపుడు త్రిపుర దానవులపై ప్రయోగింపబడి అచటి స్త్రీ పురుషులకు తమ రుచిని చూపెను. మన్మథుడు అచటి దానవ స్త్రీల అవ్యక్త మధుర వచనము లలో వీణాలాపనలలో సంగీత మూర్ఛనలలో దానువులు చేయు శృంగార మత్తప్రలాపములలో విజృంభించి వారి మనస్సు లను కలవరపరచెను. చంద్రుడాకాశమున తన పత్నియగు రోహిణీదేవితో కూడి వెన్నెల కురియుచు రాజ్యము చేయు చుండ ఆతని వెన్నెల అచటి రాత్రి చీకటులను పారదోలుచు జగమునకు హితము చేయుచుండెను. ఆ దానవాంగనలలో ఒకతె మన్మథుని పాదములకడ నిలిచి తన చెక్కిళ్ళయందు విశేషకము అను రంగు పూతతో అలంకరణము చేసికొనుచు దానితో తన ముఖమునకు శోభ సమకూర్చుకొనుచుండెను. తరువాత ఆమె తన ముఖమును గుండ్రని అద్దములో చూచుకొని 'నా ముఖమునకు ఎంతయో శోభ కలిగెను కదా'యని మురియుచు తన ప్రియుడు కూడ తను ఇట్లు ప్రశంసించునను భావముతో చాల ఆనందించుచుండెను. కొందరు యువతులు గగుర్పాటు చెందిన శరీరములతోను తన ప్రియునితోకూడి రమించవలెనను ఆసక్తితోను చక్కగా అలంకరించుకొని మదపుటేనుగులవలె ఆనందముతో మత్తిల్లి యుండిరి. ఒకతె శృంగార భావముతో నిండిన మనస్సుతో మద్యము త్రావుచుండెను. మరియొకతె ప్రసన్న హృదయముతో ప్రియుని వెదకుకొనుచుండెను. మరియొకతె చాలసేపు తన ప్రియుని విషయములో ప్రసన్నురాలయి యుండెను. ఇంకొక దానవస్త్రీ తన ప్రియుడు చేయు ప్రలాపములకే ఆనందపడుచుండెను. గోశీర్ష పద్మములు హరి చందనము మొదలగు అలంకరణములతో సుగంధ ద్రవ్యపు పూతలతో చన్నులు బురదతో పులిమినట్లు కనబడుచుండ పెదవులు మెరయుచుండ వారి రూపములు మనోహరములయి ఆసక్తి గొల్పనవై ప్రకాశించెను. అమృతముతో నింటిన బంగారు కుంభములవలె వారి రూపములుండెను. కొందరు దానవులు ప్రియురాండ్రయం దనురక్తులయి వారి పెదవులను గాయపరచి వారు శీఘ్రముగా కోపింపగా మరల వారిని బ్రతిమాలి వినోదపెట్టి ఆనందపరచుచు ఆనంద పడుచునుండిరి. కాని వారు తమ ప్రియురాండ్ర మాటలయందుకంటె వీణావాద్య ధ్వనులయందు ఎక్కువ ఆసక్తులై అవి వినగోరిరి. కొందరు దానవులు తమ ప్రియురాండ్ర మధుర వచనములు విన్నంత మాత్రాన కామబాణ వశీభూతులగుచుండిరి; కొందరు దానవస్త్రీలు మద్యపానశాలా ప్రదేశములందు పానముచేసి తను ప్రియుడు కౌగిలించుకొనగా అతడు పాడుచుండ తాను వాద్యము వాదించుచుండెను. కొందరు దానవులు తమ ప్రియురాండ్రను బ్రతిమాలుచుండిరి. కొందరు తమ ప్రియురాండ్రు అలుగగా వారికి నచ్చచెప్పుచుండిరి. ఆ సమయమున త్రిపురములయందలి సుగంధము మన్మథుని బాణపు పూవుల వాసనలను వెదజల్లుచుండెను. (దానవులలో స్త్రీలును పురుషులును శృంగారబావ పరవశులగుచుండిరని భావము.) ఒకానొక దానవాంగన శయ్యపై సుఖముగా పండుకొని ప్రియుడు కౌగిలించుకొనగా పులకించి చెమర్చి లేత గడ్డిమొక్కల చిగురాకులతో అందగించుచున్న భూమి ఆ తృణాంకురములపై సన్నని మంచు చినుకులు క్రొత్తగా పడినపుడు ప్రకాశించునట్లు ఒప్పారెను.

ప్రియోపగూఢా శయనోపగూఢా కాచిత్ప్రరూఢాంగరుహాఙ్గనాపి |

సబాలశష్పాఙ్కురపల్లవాన్తా నవామ్బుయుక్తాఇవ భూమిరాసీత్‌. 37

శశాఙ్కపాదై రుపశోభితేషు ప్రాసాదవర్యేషు వరాఙ్గనానామ్‌ |

మాధుర్యధూతాభరణా మహాన్తః స్వనా బభూవు ర్మదనేషుతుల్యాః. 38

పానేన ఖేదం దయితాతివేలం కపోల మాజిఘ్రతి కిం మమేదమ్‌ |

ఆరోహచ శ్రోణి విమాం విశాలాం పీనోన్నతాం కాఞ్చనమేఖలాఢ్యామ్‌. 39

రథ్యాసు చన్ద్రోదయభాసితాసు నరేన్ద్రమార్గేషుచ విస్తృతేషు |

దైత్యా మహాయూథగతా విభాన్తి తారా యథా చన్ద్రమసా దినాన్తే. 40

సుధాట్టహాసేఘ సురాలయేషు ప్రేఙ్ఖాసు చాస్యా మదలోలభావాః |

నన్దోలయన్తే కిల సమ్ప్రహాసం పృథ్వాని (?) కాఞ్చీగుణకృష్ణనాదాః. 41

అవ్లూనమాలాఞ్చతి చాఙ్గనానాం సముత్పుకానా మతిహర్షితానామ్‌ |

శ్రూయన్తి వాచః కలధౌతకల్పా వాపీషు చాన్యే కలహంసశబ్దా.ః 42

కాఞ్చీకలాపాశ్చ సహాఙ్గహారాః ప్రేక్ష్యాస్సదా హాసకృతశ్చబాలాః |

దృశ్యన్త ఏతే హ్యసురాఙ్గనానాం ప్రియాలయా మన్మథ మార్గణానామ్‌. 43

చిత్రామ్బరై శ్చోద్ధృతకేశపాశై స్సన్దోలమానా శుశుభేసురాణామ్‌ |

సుచారువేషాభరణౖ రుపేతా తారాగణౌ ర్ద్యౌదివ సా సచన్ద్రా. 44

సన్దోళనాధ్వానితభిన్నసూత్రా కాఞ్చీకలాపాఞ్చితరత్నకీర్ణా |

శయ్యాభూమి శ్చిత్రితా తైర్విభాతి చన్ద్రస్య పార్శ్వోపగతేవ చిత్రా. 45

సచన్ద్రికే చోపవనప్రదేశ రుతేషు కాన్తేషుచ కోకిలానామ్‌ |

శరవ్యయం ప్రాప్య పురే సురాణాం ప్రక్షీణబాణో మదన శ్చచార. 46

ఇతి త్రిపురపురేమరద్విషాణాం సపది హ పశ్చిమ కౌముదీ తదా೭೭సీత్‌ |

రణశిరసి తదా భవిష్యతాంవై భవతురగైః కృతసఙ్ఖయోప్యరీణామ్‌. 47

చన్రోద్య కున్దకుముదాకరహారవర్ణో భాగ్యక్షయే ధనపతీవ నరో వివర్ణః |

ఛాయావ్యయం మహదుపేత్య స భాతి తద్వ జ్జ్యోత్న్సా వితానరహితోభ్రసమానవర్ణః. 48

చన్ద్రప్రభా మరుణసారథినాభిభూయ నిష్టప్తకాఞ్చనరథాఙ్గసమానబిమ్బః |

భిత్త్వోదయాద్రిశిఖరు ముహురేష సూర్యో భాత్యమ్బరే తిమిరతోయవహ న్నిరస్య&. 49

ఇతి శ్రీమత్స్య మహాపురాణ త్రిపురోపాఖ్యానే చంద్రోదయాదివర్ణనం నామ

సప్తత్రింశదుత్తరశతతమోధ్యాయః.

చంద్రుని వెన్నెలలతో శోభించుచున్న త్రిపుర సౌధాగ్రములందు మాధుర్య భావ ప్రకటనవశమున కదలుచున్న ఆభరణములును ఒడ్డాణపు గజ్జెలును మొలనూలు లందలి చిరుగజ్జెలును చేయు ధ్వనులు మన్మథుడు ప్రయోగించిన బాణములు వచ్చి పడునపుడు అయ్యెడు ధ్వనువలె మనోహరములయి వినబడుచుండెను. ఒక దానవ స్త్రీ తన ప్రియునితో ''నీవు ఆసవపానముచే అలసితివి. అమితముగా నాచెక్కిలి ముద్దాడి యాడి ఇంకను అలసితివి. నా పిరుదులు విశాలమయినవి. అవి బంగారు మొలనూలితో మనోహరమయి మనోహర ధ్వని చేయుచున్నవి. పుష్టితో విశాలమై యున్నవి. నీవు వానిపై కూర్చుండి శ్రమ దీర్చుకొనుము.'' అనుచుండెను.

ఇట్లా రాత్రియందు త్రిపురములందలి రథ్యలు (విశాల రాజవీథులును నాలుగు వీథులు కలిసిన తావులును) వెన్నెలతో నిండి ఒప్పుచుండెను. రాజమార్గముల మాటయే అందరును మరచిపోయినట్లు అచట ఎవరును సంచరించక తమ తమ భవనములందును సౌధములందును సుఖించుచుండిరి. కాని కొందరు దైత్యులు పెద్ద గుంపులుగా కూడి సాయం కాలానంతరము చంద్రునితో కూడిన నక్షత్రముల వలె ప్రకాశించుచుండిరి. దానవులు తమ తమ భవనములయందు వెన్నెల అట్టహాసముల నడుమ ఊయెలలయందు మదలోలభావములతో ఊగుచు ఆనందించుచుండిరి. వారి మనస్సులు తమ ప్రియురాండ్ర మొలనూలులందలి చిరుగజ్జెల మ్రోతలచే ఆకర్షింపబడుచుండెను. దానవాంగనలు ఆ సమయమున వాడని పూలమాలలు ధరించి మిగుల ఉత్పుకభావముతో అతిహర్షముతో నిండియుండిరి. భవనములందు ఈ దానవ స్త్రీల మధుర వచనములును దిగుడు బావులందలి కలహంసముల ధ్వనులును ఒకే విధముగా మధురములై వినవచ్చుచుండెను. ఆ పురమందెల్ల చోటులందును-ఒడ్డాణముల అందములు-దానవస్త్రీల మధురాంగ విన్యాసముల శోభలు-ఎప్పుడును నవ్వులు చిందెడి బాలురు-మన్మథ బాణములకు ప్రియ నివాసములగు దానవాంగనల సౌందర్యములు - ఇవి ఆ పురమునందంతట కన బడుచుండెను.

వన్నె వన్నెల వస్త్రములు పైకెత్తి కట్టిన కేళపాశములు ధరించిన స్త్రీ పురుషులతో తరంగితమయి మనోహరమగు ఆభరణములు ధరించిన జనముతో కూడిన ఆ త్రిపురపురి ఆ రాత్రివేళ చంద్రునితో తారలతో కూడి వెలుగు ఆకాశము వలెనే ప్రకాశించెను. కదలికచే ధ్వనించుచు తెగిపడిన మొలనూలులతో ఒడ్డాణములందుండి చెదరి రాలి పడిన రత్నములతో చిత్రకాంతులతో విరాజిల్లుచు త్రిపుర భవనములందలి శయ్యాభూమి చంద్రుని సమీపమున ప్రకాశించు చిత్రా నక్షత్రమువలె ప్రకాశించుచుండెను. వెన్నెలలతో తళతళలాడు ఉద్యానములందు కోకిలల మనోహర ధ్వనుల నడుమ ఆ దానవుల త్రిపుర భవనములందు మన్మథుడు తన బాణములను ప్రయోగించి ప్రయోగించి ఆ శరములన్నియు వ్యయమయి పోగా అతడు ఏమియు తోచక తిరుగుచుండెను.

అంతలోనే దానవ పుంగవుల ఆ త్రిపురములందు రాత్రి ముగియగా వెన్నెలలు తగ్గుచు చంద్రుడు పడమట వాలెను. కొలది సేపటిలో యుద్ధరంగమున నిలువబోవు శివుని తురగములే దేవశ్రతువులగు దానవులకును చంద్రున కును ఒకేసారి ఒకే విధముగా క్షీణదశను కలిగించినట్లయ్యెను. అస్తమించుచున్న చంద్రుడు తరిగిన వెన్నెలలతో వెలవెల పోవుచు మొల్లపూవులను కలువపూలను కర్పూరమును పోలిన కాంతితో కూడి భాగ్యక్షయము కలిగిన ధనవంతుని వలె వివర్ణుడై కనబడుచుండెను. ఆతని ఛాయ అంతయు వ్యయమయ్యెను. వెన్నెల రాసులన్నియు కరగిపోయెను. చివరకు అతని వర్ణము ఆకాశ వర్ణముతో సమానమయ్యెను.

అంతలో సూర్య డుదయించెను. అతడు తన సారథియగు అరుణునితో చంద్రుని కాంతిని అణగద్రొక్కెను. అతని బింబము మిగుల కాచిన మేలిమి బంగారు వన్నెతో మెరయుచుండెను. ఇట్లతడు లోకమందలి చీకటులను మేఘముల పారదోలుచు ఉదయాద్రి శిఖరమును చీల్చుకొని వెలికి వచ్చి ప్రకాశించసాగినా డిడుగో: అని ఆనందించిరి.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున త్రిపురోపాఖ్యానమున చంద్రోదయాది వర్ణనమను

నూట ముప్పది ఏడవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters