Sri Matsya Mahapuranam-1    Chapters   

త్రింశదుత్తరశతతమో7ధ్యాయః.

దేవకృతమహేశ్వరస్తవః.

సూతః : సుశీలేషు ప్రదుష్టేషు దానవేషు దురాత్మను | లోకేషూత్పాట్యమానేషు తపోదనవనేషుచ. 1

సింహనాదేన దైత్యానాం భయభీతేషు జన్తుషు | త్రైలోక్యే భయసమ్మూఢే తమోన్ధత్వ ముపాగతే. 2

ఆదిత్యా వసవ స్సాధ్యాః పితరో మరుతాం గణాః | భీతాశ్చ శరణం జగ్ము ర్బ్రహ్మాణం ప్రపితామహమ్‌. 3

బ్రహ్మదర్శనార్థం ఆదిత్యాదిదేవతానాం సత్యలోకగమనమ్‌.

తేతు స్వర్ణామ్బుజాసీనం దదృశు స్సముపాగతాః | తే తమూచుశ్చ సహితాః ప్రణమ్య ప్రపితామహమ్‌. 4

దేవాః : వరదృప్తా స్తవైతే చ దానవా స్త్రిపురాలయా | బాధన్తేస్మా న్యథాదేవ ప్రేష్యాన్వై స్వామినోనఘ.

చరామః పృథివీం నర్వాం మృగా స్సింహభయా దివ | దానవానాం భయా త్తద్వ ద్భ్రమామః ప్రపితామహ. 6

పుత్త్రాణాం నామధేయాని కళత్రాణ్యమరాధిప | దానవై ర్ర్భామ్యమాణానాం విస్మృతానీహ నోనఘ. 7

దేవవేశ్మప్రభఙ్గాశ్చ ఆశ్రమభ్రంశనానిచ | దానవై ర్లోభమోహాన్ధైః క్రియన్తే పాపబుద్ధిభిః. 8

యది న త్రాయసే లోకా& దానవేభ్యశ్చ విద్రుతా& | ప్రేక్ష్యాస్యకాలే నిర్దేవం నిర్మానుష మిదం జగత్‌. 9

ఇత్యేవం త్రిదశైరుక్తః పద్మయోనిః పితామహః | ప్రత్యాహ త్రిదశా న్త్సేంద్రా నిన్దుతుల్యాననప్రభా.& 10ఔ

దానవానాం వినాశాయ తథా మతిమతాంవరాః | తస్మా ద్ద్వారశ్చ సమ్ప్రాప్తో యః పురోక్తో మయామరాః.

తచ్చ తేషా మధిష్ఠానం త్రిపురే త్రిదశర్షభాః | ఏకేషుపాతమోక్షేణ హన్తవ్యం తత్పురం యతః. 12

భవతాంచ న పశ్యామి ఏకమ ప్యమరర్షభాః | యస్తుచైక ప్రహారేణ పురం హన్యా త్సదానవమ్‌. 13

త్రిపురా ణ్యాత్మవీర్యేణ శక్తం హన్తుం శ##రేణతు | ఏకం ముక్త్వా మహేశానం మహాదేవం జగత్పతిమ్‌. 14

నూట ముప్పదవ అధ్యాయము.

దానవులచే బాధితులగు దేవతలు మహేశుని స్తుతించుట.

అంతవరకును సుశీలురుగా నుండిన త్రిపుర దుర్గస్థులగు దైత్యులు దానవులు ఇట్లు దుష్టులను దురాత్ములు నయిరి. వారు లోకములను నాశము చేయసాగిరి. తపోధనుల తపోవనములను పెకలింపసాగిరి. దైత్యుల సింహనాదముతో ప్రాణులు భయభీతములు కాసాగెను. త్రైలోక్యమును భయముతో సమ్మోహితమై చీకటిలో కన్నులు కనబడనట్లయ్యెను. అంతట ఆదిత్యులు వసువులు సాధ్యులు పితరులు మరుద్గణములు భీతులయి లోకప్రపితామహుడగు బ్రహ్మను శరణు వేడబోయిరి. వారు సువర్ణ కమల పీఠమున ఆసీనుడయి యున్న ప్రపితామహుని సమీపించి దర్శించి అందరు నొక్కటిగ నమస్కరించి ఇట్లు పలికిరి: దేవా! నీ వరములచే దర్పించి ఈ త్రిపుర దుర్గావాసులగు దానవులు ప్రభువులు తమ సేవకులను బాధించినట్లు మమ్ముల బాధించుచున్నారు. వారి భయమున మేము సింహములకు భయపడు మృగముల వలె పృథివి యందంతట తిరుగుచున్నాము. వారి భయముతో తిరుగు మాకు మా పత్నీ పుత్త్రుల పేరులు కూడ జ్ఞప్తిలో లేకుండ పోయినవి. లోభమోహాంధులు పాపబుద్ధులు నయి వారు దేవాలయములను దేవతా భవనములను ఆశ్రమములను నాశము చేయుచున్నారు. దానవుల ఉపద్రవముల నుండి నీవు మమ్ము కాపాడనిచో త్వరలోనే జగమున దేవతలు కాని మానవులు కాని ఒక్క డును లేకపోవుట నీవే చూడగలవు.

ఇట్లు పలికిన చంద్రుని వంటి ముఖకాంతులుగల దేవతల వచనములు విని పద్మ భవుడగు బ్రహ్మ వారితో ఇట్లనెను : దేవతలారా! మీరును గొప్ప బుద్ధిమంతులు కదా! ఆలోచింపుడు. నేను వారితో వరప్రదాన సమయమున పలికి నట్లు వారి నాశమునకు ద్వారభూతమగు సమయము దగ్గరకు వచ్చినది. కాని నే ననినట్లు వారి త్రిపుర దుర్గమును ఒకే బాణముతో కొట్టగలవారు పరమేశ్వరుడు తప్ప మీలో నొక్కరును నున్నట్లు నాకు కనబడుట లేదు. జగత్పతియు మహేశ్వరుడు మహాదేవుడు నగు శివునకు తప్ప ఇతరులకు ఈ త్రిపుర దుర్గమును ఒకే బాణముతో ఒకే మారు ఆత్మవీర్యముతో పడగొట్టుట శక్యమా?

తే యూయం యది మన్యధ్వం క్రతు విధ్వంసకం హరమ్‌ | యాచామ స్సహితా దేవం త్రిపురం స హనిష్యతి. 15

కృతః పురాణాం విష్కమ్భో యోజనానాం శతం శతమ్‌ | యథా చైకప్రహారేణ హన్యాదేవం మయం న తు. 16

పుష్యయోగేన యుక్తాని క్షణమేకస్థితానితు | పురాణ్యకప్రహారేణ ధక్ష్యతీతి త్రిలోచనః. 17

తతో దేవేశ్వరః ప్రోక్తో యాస్యామ ఇతి దుఃభితైః | పితామహ స్సురై స్సార్ధం భవసంపద మాగతః. 18

ఈశ్వరదర్శనార్థం బ్రహ్మాదిదేవతానాం కైలాసగమనమ్‌.

తే భం భూతభ##వ్యేశం Oజగత్సంహారకం ప్రభుమ్‌ | పశ్యన్తి స్మోమయా సార్ధం నన్దినాచ మహాత్మనా. 19

అగ్నివర్ణమయం దేవ మగ్నిపుఞ్జభేక్షణమ్‌ | అగ్న్యాదిత్యసహస్రాభ మగ్నివర్ణవిభూషణమ్‌. 20

చన్ద్రావయవలక్ష్మాణం చన్ద్రసౌమ్యతరాననమ్‌ | అగమ్యం త మజం దేవం మదనారిం త్రిలోచనమ్‌. 21

బ్రహ్మాదిదేవకృతమహాదేవస్తుతిః.

సర్వేషాం సర్వదం శమ్భుం గోపతిం పార్వతీపతిమ్‌ | దేవాః : నమో భవాయ శర్వాయ రుద్రాయ వరదాయ చ. 22

పశూనాం పతయే నిత్య ముగ్రాయచ కపర్దినే | మహాదేవాయ భీమాయ త్ర్యమ్బకాయ విశామ్పత్యే. 23

ఈశ్వరాయ భగఘ్నాయ నమస్త్వన్ధకఘాతినే | నీలగ్రీవాయ భీమాయ వేధసే వేధసాం పత్యే. 24

కుమారశత్రువిఘ్నాయ కుమారజననాయచ | విలోహితాయ ధూమ్రాయ ధరాయ క్రథనాయచ. 25

నిత్యం నీలశిఖణ్డాయ శూలినే దివ్యశాయినే | ఉరగాయ సునేత్రాయ హిరణ్యవసురేత సే. 26

అచిన్త్యా యామ్బికాభ##ర్త్రే సర్వదేవస్తుతాయ చ | పృషధ్వజాయ * చణ్ణాయ జటినే బ్రహ్మచారిణ. 27

తప్యమానాయ సలిలే బ్రహ్మణ్యాయాజితాయచ | విశ్వాత్మనే విశ్వసృజే విశ్వమావృత్య తిష్ఠతే. 28

నమోస్తు దివ్యసేవ్యాయ ప్రభ##వే సర్వసమ్పదామ్‌ | అభిగమ్యాయ కామ్యాయ +సవ్యాపారాయ సర్వదా. 29

భక్తానుకమ్పినే తుభ్యం దిశ##తే జన్మనో గతిమ్‌. 29

ఇతి శ్రీమత్స్యమహాపురాణ త్రిపురోపాఖ్యానే దేవకృత మహేశ్వరస్తవాది

కథనం నామ త్రింశదుత్తర శతతమోధ్యాయః.

కనుక మీరందరు సరే అనిచో మనమందరమును పోయి క్రతు విధ్వంసియగు హరుని వేడుకొందము. అతడు త్రిపుర దుర్గమును నశింపజేయును. ఆ మయుడు త్రిపురములను తను ఒకే ప్రహారముతో కొట్టుట శక్యము కాకుండునట్లు ఒక్కొక్క పురపు విష్కంభముగాని ఒక పురమునకు మరియొక పురమునకు అంతరముకాని నూరేసి యోజనములుండునట్లు వానిని నిర్మించినాడు. వాడు వానిని పుష్యయోగమున నిర్మించెను. త్రిలోచనుడగు శివుడైనచో ఒకే బాణమున పుష్యయోగమునందే అన్నిటి నోకేమారు క్షణమున దహించగలడు. (విష్కంభము=నడిమి కొలత)

దైత్యభయ దుఃఖితులగు దేవతలును 'అట్లే పోదము' అనగా బ్రహ్మయు వారితో కలిసి శివుని కొలువునకు పోయెను. వారచట శివుని దర్శించిరి. ఆదేవుడు భూతభ##వ్యేశుడు; జగత్సంహారకర్త; ఉమతో నందితో కూడి అగ్ని వర్ణమయ దేహముతో అగ్నిరాశి సమాననయనములతో అగ్ని వర్ణ విభూషణములతో వేలకొలది అగ్నులవలె సూర్యులవలె ప్రకాశించుచు చంద్రుని అవయవ లక్షణములు చంద్రునివలె సౌమ్యమగు ముఖము కలిగియుండెను. అతడు అగమ్యుడు అజుడు ప్రకాశమానుడు మదన శత్రువు త్రినేత్రుడు ఎల్లరకు ఎల్ల కోరికల తీర్చువాడు సుఖకరుడు సర్వలోక పతి పార్వతీపతి.

ఇట్టి శివుని దర్శించి దేవత లా దేవు నిట్లు స్తుతించిరి. (ఇది మాతృకా సంఖ్యతో ఏకపంచాశన్నామాత్మక మగు స్తోత్రము) భక్తులకు శుభకరుడు పాపులకు హింసకుడు బాధల తొలగించువాడు వరములొసగువాడు జీవుల కధిపతి భయంకరుడు జటాజూటధారి మహాదేవుడు దుష్టులకు భయంకరుడు త్రినేత్రుడు ప్రజాధిపతి ఈశ్వరుడు భగుడను

___________________________________________________________________

O గిరిశంశూలపాణినమ్‌ + స్తుత్యాయార్యాయే.

· ముణ్డాయ.

ఆదిత్యుని కొట్టినవాడు అంధకుని చంపినవాడు నీలకంఠుడు సూర్యాదులచే కూడ భయముతో పనులు చేయించువాడు లోకకర్తలకును కర్తలకును అధిపతి కుమారస్వామికి శత్రువులగువారి నశింపజేయువాడు కుమారస్వామికితండ్రి విశేషముగా జటాజూటమున ఎర్రనివాడు దూమ్రవర్ణుడు లోకముల ధరించువాడు పాపుల నరకువాడు నీలకేశుడు శూలధారి దివ్య శయనుడు ఉరగభూషణుడు సునేత్రుడు హిరణ్యము వసువు రేతస్సుగాగల అగ్ని స్వరూపుడు అచింత్యుడు అంబికా భర్త సర్వదేవస్తుతుడు వృషభధ్వజుడు దుష్టుల విషయమున కోపి జటాధారి బ్రహ్మచారి జలములందుండి తపమాచరించు చుండువాడు బ్రహ్మతత్త్వవేత్త ఆజితుడు విశ్వ స్వరూపుడు విశ్వస్రష్ట విశ్వమందావరించియుండువాడు దివ్యుల సేవలందు కొనువాడు సర్వసంపదలకు ప్రభువు ఆశ్రయింపదగినవాడు కోరికలు వేడదగినవాడు ఎల్లపుడు పనిలో మునిగియుండు వాడు భక్తాను కంపి జన్మమునకు తగిన ఉత్తమగతి నిచ్చువాడునగు దేవా నీకు నమస్కారము.

ఇందు దేవతాకృతశివస్తుతి మాతృకా (ఏకపంచాశత్‌) సంఖ్యాకముగానున్నది. ఇందలి మూల భూత భావనను ఇట్లు ఊహించవచ్చును : వాఙ్మయమంతయు ఏకపంచాశన్మాతృకా (వర్ణసమామ్నాయ) మయము. అ-నుండి అః-వరకు పదునారు; క-నుండి-మ-వరకు ఇరువదియైదు; య-ర-ల-వ-శ-ష-స-హ-ళ-క్ష-పది; మొత్తము ఏబదియొకటి. కావుననే శబ్దబ్రహ్మరూపయగు శ్రీదేవిని మాతృకారూపనుగా ఉపాసింతురు. కావున ఇట్లు మాతృకా సంఖ్యాకనామములతో స్తుతించుట సమస్త వాఙ్మయముతో స్తుతించుటయు శబ్ద రూపయగు పరమేశ్వరికిని పరమేశ్వరునకును అర్థ (సమస్త జగద్‌) రూపుడగు అభేదమును భావనచేసి సకల బ్రహ్మతత్త్వమునుపాసించుటయునగును. ఇది సాధకులకు సకలార్థ సాధకము.

ఆ నామావళి ఈ విధముగ నున్నది :

ఓం భవాయనమః వేధసాం పతయే వృషధ్వజాయ

శర్వాయ కుమారశత్రునిఘ్నాయ చండాయ

రుద్రాయ కుమారజననాయ 20 జటినే

వరదాయ విలోహితాయ బ్రహ్మచారిణ

పశూనాంపతయే ధూమ్రాయ సలిలే తప్యమానాయ

ఉగ్రాయ ధరాయ బ్రహ్మణ్యాయ 40

కపర్దినే క్రథనాయ అజితాయ

మహాదేవాయ నీలశిఖండాయ విశ్వాత్మనే

భీమాయ శూలినే విశ్వసృజే

త్ర్యంబకాయ 10 దివ్యశాయినే విశ్వం ఆవృత్య తిష్ఠతే

విశాంపతయే ఉరగాయ దివ్యసేవ్యాయ

ఈశ్వరాయ సునేత్రాయ సర్వసంపదాం ప్రభ##వే

భగఘ్నాయ హిరణ్యరేతసే 30 అభిగమ్యాయ

అంధకఘాతినే వసురేతసే కామ్యాయ

నీలగ్రీవాయ అచింత్యాయ సర్వదా సవ్యాపారాయ

భీమాయ అంబికాభ##ర్త్రే భక్తానుకంపినే

వేధసే సర్వదేవస్తుతాయ జన్మనః-గతిం-దిశ##తే-

తుబ్యం నమః. 51

ఇది శ్రీమత్స్యమహాపురాణమున త్రిపురోపాఖ్యానమున బ్రహ్మాదిదేవతలు మహేశుని

స్తుతించుటయను నూట ముప్పదియవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters