Sri Matsya Mahapuranam-1    Chapters   

అష్టావింశత్యుత్తరశతతమో7ధ్యాయః.

త్రిపురనిర్మాణకథనమ్‌.

సూతః:  

ఇతి సఞ్చి న్త్య దైత్యేన్ద్రో దివ్యో పాయ ప్రభావజమ్‌ l చకార త్రిపురం దివ్యం మనస్స ఞ్చార చారితమ్‌ . 1

ప్రాకారాన్తరమార్గేణ ఇహచాత్రచ గోపురమ్‌ l రాజమార్గ ఇతశ్చాపి విపులం పొభవనాదిభిః. 2

ఇహచాట్టాలకద్వార మిహచాట్టాల గోపురమ్‌ l రథ్యాశ్చ ఇతఇహచాత్రచ చత్వరమ్‌. 3

ఇదమన్తః పురస్థానం రద్రాయతన మత్రచ l అవటాని *తటాకాశ్చ అత్ర వాప్య స్సరాంసిచ. 4

అంపామాశ్చ శుభాశ్చాత్ర ఉద్యానా న్యత్రచాత్రచ l వినిర్గమో దానవానాటం పభవతగత్ర మనోహరః. 5

ఇత్యేవం మానసం +దుర్గం కల్పయిత్వా సురారిణా l మయేన తత్పురం సృష్టం త్రిపురం త్వితి విశ్రుతమ్‌. 6

కార్షాసమరుం యత్త న్మయేన విహితం పురమ్‌ l విద్యున్మాలీ బలీతత్ర విద్యుద్గణ ఇవామ్బరే. 8

సువర్ణవికృతం యత్తన్మయేన విహితం పురమ్‌ l స్వయం చావ న్మయస్తత్ర గత స్తదధిపః ప్రభుః. 9

తారకస్య పురం తత్తు శతయోజనమన్తరమ్‌ l విద్యున్మాలిపురం చాపి పశతయోజన మన్తరమ్‌. 10

మేరుపర్వతసజ్కాశం మయస్యాపి పురంమహత్‌ l పుష్యసంయోగమాత్రేణ కాలేన సమయః పురా. 11

కృతవా స్త్రిపురం Oదైత్య స్త్రిణ త్రస్యేవ పుష్పకమ్‌ l యేనయేన మయో యాతి ప్రకుర్వాణః ప్రకుర్వాణః పురంపురాత్‌.

ప్రతస్థే తత్ర తత్రైవ ప్రచక్రే మరురూ స్వయమ్‌ l

నూట ఇరువది ఎనిమిదవ అధ్యాయము.

త్రిపుర నిర్మాణ కథనము

దైత్యేంద్రుడగు మయుడు ఇట్లాలొచరిచి దివ్యోపాయ ప్రభావ ఫలముగా దివ్యమగు త్రిపుర దుర్గమును నిర్మించెను. అది దాని అధిపుని మనఃసంకల్పముననుసరించి సంచరిం చునది. రెండేసి ప్రాకారముల నడుమ అక్కడక్కడ గోవు

______________________________________________________________________

*తడాగాని +తత్రాకల్పయత్పురకర్మవిత Oదైత్యస్త్రినేత్రః పుష్పకంయథా.

రములు భవనాదికముతో కూడిన విపశాలరాజమార్ణము అట్టాలక (మహాభవన) ద్వారములు అట్టాలక గోపురములు రథ్యంలు (పెక్కుబాటలు కలియుచోటు) ఉపరథ్యలు చత్వరములు అంతఃపురస్థానములు శివాలయములు గుంటలు చెరువులు దిగుడు బావులు సరస్సులు అరామములు (విశ్రాంతికనువగు బయళ్ళు) ఉద్యానములు దానవులు వాహ్యాళికి పోవు మనోహర ప్రదేశములు కల త్రిపురమను దుర్గమును తాను మనస్సున అనుకొనినట్లే మరూసురుడు నిర్మించెను. నల్లని ఉక్కుతో నిర్మించినదానికి తారకాక్షడును వెండితో చేయగా చంద్రునివలె ప్రకాశించు రజత దుర్గమునకు ఆకాశము నందలి మెరపుల రాశివంటి బలి నిద్యున్మాలియు సవర్ణమయ దుర్గమునకు మయుడును అధిపతులయిరి.

తారకాక్షుని పురమునకును విద్యున్మాలి పురమునకును నడుమ శతయోజనములును విద్యున్మాలి పురమునకును మయుని పురమునకును నడుమ శతయోజనములును అంతరముండునట్లు మయుడు ఒక పురమునుండి మరియొక పురమును వెలికితీయుచు పుష్యయో సమయమున త్రిణత్రుని విష్పకముతో సదృశమగు త్రిపుర దుర్గము నింటించుచు పోవుచుండ అపోయిన మార్గమున అతని మాయచే అదుర్గము అట్లే ఏర్పడెను.

కామరూపమయాన్యత్ర శతశోథ సహస్రశః. 13

రత్నాన్వితాని శోభ##న్తే భవనాని సురద్రుహామ్‌ l ప్రాసాదశజజుష్టాని కూటాగారోత్కటానిచ. 14

సర్వాతి కామగాని స్యు స్సర్వలోకమరూనిచ l సోద్యానవాపీకూపాని సపద్మసరవన్తిచ. 15

అశోకవనరమ్మాణి కొకిలారుతవన్తిచ l చిత్రశాలావిశాలని చన్ద్రశాలో త్తమానిచ. 16

సప్తాష్టా దశభౌమాని సుకృతాని మయేనచ l బహుస్వర్ణపతాకాని స్రగచ్దామలజ్కృతానిచ. 17

కిజ్కిణీజాలశబ్దాని గన్ధవన్తి మహాన్తిచ l సుసంయుక్తోపలిప్తాని పుష్పనైవేద్యవన్తిచ. 18

సాజ్యధూమాన్దకారాతి సంపూర్ణకలశానిచ l గగనావరణ భాన్తి పంసపజ్త్కి నిభానిచ 19

వజ్త్కీ కృతాని రాజన్తే గృహాణి త్రపురేపురే l ముక్తాకలాపై ర్లమ్బద్భిర్హసన్తీభి శ్శశిశ్రియమ్‌. 20

మల్లికాజాతిపుష్పాడ్యై ర్ధూపగన్ధాధివాసితైః l పథీన్ద్రియసుఖై ర్నిత్యం సమై స్సత్పురషైరివ. 21

హేమరాజతలోహాశ్చ మణిరత్నా ఞ్చనాన్వితాః l ప్రాకారా స్త్రిపురే తస్మి న్గిరిప్రకరసన్నిభాః.22

ఏకైకస్మి న్పురే తస్మి న్గోపురాణాం శతంశతమ్‌ l సపతాకధ్వజపటం దృశ్యతే గిరిశృజ్గవత్‌. 23

నూపురారావరమ్మి%ాతి త్రిపురేన్తః పురాణ్యపి l స్వర్గాతిరిక్తశ్రీర్భాతి పతత్రకన్యాపురేషుచ. 24

ఆరామైశ్చ విహారైశ్చ తడాకా7వవటపల్వలైః l సరోభిశ్చ సరిద్భిశ్చ వనైశ్చోపవనైరపి. 25

* దివ్యభోజ్యోపభోగ్యాని నానారత్నయుతానిచి l పుష్పోత్కరైశ్చ సుభగా స్త్రిపురే చోపనిర్గమాః. 26

పరిఘాతశతగమ్బీరా కృతా మాయావినా పురాl

నిశమ్య తద్దుర్గవిధాన ముత్తమం కృతం మయే నాద్భతకర్మణాచ. 27

దితేస్సుతా దైత్సవరా7జవైరిణ స్సహస్రశః ప్రాపురనన్తవిక్రమాః l తదాసురై ర్గర్వితవైరిమర్దనైః కరీన్ద్రశైలేన్ద్రమృగేన్ద్రసన్నిభైః. 28

బభూవ పూర్ణం త్రపురం భ##టైర్యథా యథామ్బరం భూరిజలై ర్ఝనవ్రజైః.

ఇతి శ్రీమత్స్యమహాపురాణ త్రపురోపాఖ్యానే త్రపుర నిర్మాణ కథనం నామ అష్టావింశత్యుత్తర శతతమో7ధ్యాయః.

* దివ్యోప భోగ భోగ్యాని.

వానియందు నూరులకొలది వేలకొలదిగా అసురుల భవనములు శోభించసాగెను. అవియన్నియు కామ రూపములు -రత్నవంతములు వందలకొలది ప్రాసాదములు కూటాగారములు ఉద్యానములు దిగుడు బావులు తామర కొలకులు అశోకవనములు కోకిలారావములు విశాలములగు చిత్రశాలలు ఉత్తమములగు చంద్రశాలలు పెక్కు బంగరు పతాకలు పూలమాలులు చిరుగంటల మువ్వల గుంపులు సుగంధములు చక్కగ కలయంపి చల్లి అలికిన అలుకులు పుష్పోపహారములు నేతితో వేసిన పొగల చీకట్లు పూర్ణకలశములు కలిగి సర్వలోకమయములై కామ గమనములై ఏడెనిమి దంతస్తులు కలవిగా మయుడా అసుర భవనముల నిర్మించెను. అవి ఆకాశావరణమున హంస పంక్తులవలె త్రిపుర దుర్గాంతర్గత పురములందు బారులు తీరి రాజిల్లుచుండెను. మల్లె జాజిపూలతో అలంకృతములయి ధూపగంధములతో వాసన వేయబడి సత్పురుషులవలె త్రోవను పోవు వారికి ఇంద్రియ సుఖము కలిగించుచు చంద్రుని శోభను పరిహసించు ముత్తెపు జాలరులతో ఆ భవనములు శోభిల్లుచుండెను.

ఆ త్రిపుర దుర్గమందలి ప్రతియొక పురమునను బంగారుతో వెండితో ఇనుముతోచేసి మణులతో రత్నములతో కూర్పుకలవై కొండల గములవంటి ప్రాకారములు వందలకొలదిగ నుండెను. అవి పతాకాధ్వజ వస్త్రములతో కూడి కొండ కొమ్ములవలె కానవచ్చుచుండెను. దానియందలి అంతఃపురములు అందెల రవళులతో రమ్యములు. కన్యాపురముల శోభ స్వర్గ శోభను మించియుండెను. ఆరామములు విహార ప్రదేశములు చెరువులు గుంటలు చెలమలు సరస్సులు నదులు వనములు ఉపవనములు అటనుండెను. దివ్యములగు భోజ్య పదార్థములు నానారత్నము (శ్రేష్ఠ పదార్థము) లతో కూడిన ఉపభోగ సాధనములు కలిగి పుష్పరాసులతో హాయి గొల్పుచుండు వాహ్యాళి ప్రదేశములతో ఒప్పుచుండునట్లా మాయావియగు మయుడు వందలకొలది లోతైన అగడ్తలతో సురక్షితమగు ఆ త్రిపుర దుర్గమును నిర్మించెను.

అద్భుత కార్యనిపుణుడగు మయుడు ఇట్టి యుత్తమ దుర్గ నిర్మాణము నొనరించిన సమాచారమును విని అనంత విక్రమ సంపన్నులగు దైత్యవరులు వేలకొలదిగ అటకు చేరిరి. గర్వితవైరి నాశకులును కరీంద్ర మృగేంద్ర సమానులునగు అసురులతో ఆత్రిపుర దుర్గము - ఆకాశము మేఘ సమూహములతో నిండినట్లు స్కంధావారము వీరభటులతో నిండినట్లు నిండిపోయెను.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున త్రిపురోపాఖ్యానమున త్రిపుర నిర్మాణ కథనమను నూట ఇరువది ఎనిమిదవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters