Sri Matsya Mahapuranam-1    Chapters   

చతుర్విఃవత్యుత్తరశతతమోధ్యాయః.

ధ్రువజఞ్చారకథనమ్‌.

ఏతాం శ్రుత్వా కథాం దివ్యా మబ్రువ న్రోమహర్షణిమ్‌ | సూర్యాచన్ద్రమసో శ్చారం గ్రహాణాంచైవ సర్వశః. 1

ఋషయః : భ్రమన్తి కథమేతాని జ్యోతీంషి రవిమణ్ణలే | అవ్యూ హేనేన సర్వాణి తథైవాసఙ్కరాణితు. 2

కశ్చ భ్రామయతే తాని భ్రమన్తి యదివా కథమ్‌ | ఏతద్వేదితు మిచ్ఛాను స్తన్నో నిగరసత్తమ. 3

భూతసమ్మోహనం హ్యేత ధ్బ్రూహి నో వదతాం వర | సూతః : భూతనసమ్మోహనం హ్యేతం ద్బ్రువతో మే నిబోధత. 4

ప్రత్యక్షమపి దృశ్యన్తత్‌ సమ్మోహయతి వై ప్రజాః | యోసౌ చతుర్దశ##రేషు శింశుమారో వ్యవస్థితః. 5

ఉత్తానపాదపుత్త్రోసౌ మేధీభూతో ధ్రువోదివి | సైష భ్రమ న్భ్రమయతి చన్ద్రాదిత్యౌ గ్రహైస్సహ. 6

భ్రమన్త మనుపరియ న్తి నిక్షత్రాణితు చక్రవత్‌ | ధ్రవస్య మనసా యోసౌ భ్రమతో జ్యోతిషాంగణాః. 7

వాతానీకమయైః పాశై ర్ద్రువస్య పరిసర్పతి | తేషాం భేదశ్చ యోగశ్చ కాలాచారా స్తథైవచ. 8

అస్తోదయా స్తథోత్పాతా అయనే దక్షిణోత్తరే | విషువద్గ్రహవర్ణాశ్చ సర్వమేత ద్ద్రువేరితమ్‌. 9

నూట ఇరువది నాలుగవ అధ్యాయము.

జ్యోతిర్మండల వ్యవస్థ.

ధ్రువస్థితి - తత్సంచార ప్రతిపాదనము.

ఈ విధముగా రౌమహర్షణి చెప్పి దివ్యకథను సూర్యాచంద్రమసుల-సూర్య్రగహముల సంచారమును వేరు వేరుగ విని ఋషులతనితో ఇటనిరి : ఈ జ్యోతిస్సులు అన్నియు రవి మండలమునందు ఏ వ్యూహమును (అమరికయు) లేకయే ఒక దానితో మరియొకటి సంకరము (వ్యవస్థలేని కలయిక) నొందక సంచరించుచున్నవి? ఎవరైన వీనిని త్రిప్పుచున్నారో-స్వయముగ అవియే తిరుగుచున్నవో-ఎట్లు తిరుగుచున్నవో-ఇదియంతయు తెలియగోరుచున్నాము. పండితోత్తమా ! మాకు అది తెలుపుము. ఈ విషయము భూతములకే సంమోహమును కలిగించునది. కాని నీవు విషయమును తెలుపగల వారందరలో శ్రేష్ఠుడవు. కావున మాకది తెలుపవలయును. అనగా సూతుడు వారికి ఇట్లు చెప్పనారంభించెను.

అవును; ఇది మీరనినట్లు భూత సంమోహనమే. ప్రత్యక్షముగ కనబడుచుండియు ఇది భూతములను సంమోహింపజేయుచున్నది.

*ఇదుగో! ఈ శింశుమారము (శిశుమారము) వేదములందు చెప్పబడినట్లు పదునాలుగు ఋక్షములపై (జ్యోతీ రూపములపై) వ్యవస్థ చేయబడి కనబడుచున్నదే! ఈ శిశుమార చక్రమునకు మేఢము*గా ద్యులోకమున ఉత్తానపాద పుత్త్రుడుగా పురాణములందు పేర్కొనబడిన ధ్రువుడున్నాడు. (అతడు పేరునకు తగినట్లు కదలడనుకొనవలదు.) అతడు తాను (తన చుట్టు) తిరుగుచునే చంద్రాదిత్యులను ఇతర గ్రహములను త్రిప్పుచున్నాడు. ఇతర నక్షత్రములును తిరుగుచున్న ఆ ధ్రువుని చుట్టు తామును భ్రమించుచు చక్రమును చుట్టుచు భ్రమించు ఇతర చక్రములవలె తిరుగుచున్నవి. ధ్రువుని మనన్సంకల్పానుసారము ఇట్లు తిరుగుచున్న ఈ జ్యోతిర్గణము వాత సమూహమయములగు పాశములతో (కట్టబడి) ధ్రువము (కదలనిది) ఐ అతని వెంట తిరుగుచున్నది. వాని భేదము (వేరగుట) యోగము (కలయిక) కాల ప్రమాణానుసారము వాని సంచారము ఉదయాస్తమయములు ఉత్పాతములు దక్షిణోత్తరాయనములు విషువములు గ్రహ వర్ణములు ఇవి అన్నియు ధ్రువుని మూలముననే కలుగుచుండును. (భేదము యోగము మొదలగునవి సూర్య సిద్దాంతాది జ్యోతిఃశాస్త్ర గ్రంథములులందు ప్రసిద్దములు.)

జీమూతా నామ తే మేఘా యద్యేభ్యో జీవసమ్భవః | ద్వితీయ ఆవహోవాయు ర్మేఘా స్తేష్వభిసంశ్రితాః. 10

మేఘమణ్డలకథనమ్‌

ఇతో యోజనమాత్రేచ అధ్యర్ధార్ద కృతా అపి | వృష్టిసర్గ స్సదా తేషాం ధారాసారాః ప్రకీర్తితాః. 11

_________________________________

* ఇటువంటి వచనములనుబట్టి ఈ జ్యోతిర్మండల వ్యవస్థా విషయమంతయు బుషులు నిర్మలాకాశమున కనబడు వెలుగు ముద్దల వెలుగులను చూచినపుడు కలుగుచుండిన కుతూహలముతో ప్రశ్నించుచుండిరనియు వానికి సమాధానములను రౌమహర్షణుడదే సమయమున ఇర్చుచుండెననియు స్పష్టముగుచున్నది.

* ధాన్యపు కళ్ళములో గడ్డిని నలుగద్రొక్కుటకై బంతిత్రిప్పు ఎద్దులు ఒకేవిధముగ తిరుగుటకై కళ్ళము నడుమపాతిన స్తతంభమునకు మేఠి-మేఢి-మేథము మొదలగునవి పేర్లు.

పుష్కరావర్త కానామ యే మేఘాః పక్షసమ్భవాః | శ##క్రేణ పక్షా శ్ఛిన్నావై పర్వతానాం మహౌజసామ్‌. 12

కామగానాం సమృద్ధానాం భూతానాం హితమిచ్ఛతామ్‌ | పుష్కరానామ తేమేఘా బృంహన్త న్తోయధారిణః. 13

పుష్కరావర్తకానామ కారణనేహ శబ్దితాః | నానారూపధరాశ్చైవమహాఘోరస్వనాశ్చతే. 14

కల్పాన్తే వృష్టికర్తారః కల్పాన్తాగ్ని నియామకాః | వాయ్వాధారా వహ న్తిస్మ సంయుక్తాః కల్పసాధకాః. 15

యాన్యస్యాణ్డస్య భిన్నస్య ప్రాకృతస్యాభవం స్తథా | యస్మిన్బ్రహ్మా సముత్పన్నశ్చతుర్వక్త్ర స్స్వయం ప్రభుః. 16

తాన్యేవాణ్డకపాలాని సర్వే మేఘాః ప్రకీర్తితాః | తేషా మాప్యాయనం ధూమ స్సర్వేషా మవిశేషతః. 17

తేషాం శ్రేష్ఠశ్చ పర్జన్య శ్చత్వారశ్చైవ దిగ్గజాః | గజానాం పర్వతానాంచ మేఘానాం భోగిభిస్సహ. 18

కులమేకం ద్విధాభూతం యోనిరేకా జలంస్మృతమ్‌ | పర్జన్యశ్చైవ వర్షాసు హేమన్తే శీతసమ్భవః. 19

తుషారవర్షం వర్షన్తి వృద్దాహ్యత్ర వివృద్ధయే | షష్ఠః పరివహోనామ వాయుస్తేషాం పరాయణమ్‌. 20

యోసౌ బిభర్తి భగవా న్గఙ్గా మాకాశగోచరామ్‌ | దివ్యామృతజలాం పుణ్యాం త్రిపథస్యోపరి స్రుతామ్‌. 21

తస్య విష్యన్దితం తోయం దిగ్గజాః పృథుభిః కరైః | శీకరాన్త్సమ్ర్పముఞ్చన్తి నీహారితి స స్మృతః. 22

దక్షిణన గిరిర్యోసౌ హేమకూట ఇతిస్మృతః | ఉదగ్ఘిమవతశ్చైవ ముత్తరః ప్రాచ్యదక్షిణ 23

పుర్ద్రూనామ్నా సమాఖ్యాతం నగరం తత్రవై స్మృతమ్‌ | తస్మిన్ని వర్తతే వర్షం తత్తుషార సముద్భవమ్‌. 24

తతో హిమవతో వాయు ర్హిమపాత సముద్భవః | ఆనయత్యాత్మ వేగేన సిఞ్చమానో మహాగిరిమ్‌. 25

హిమవస్త మతిక్రమ్య వృష్టిశేషం తతఃపరమ్‌ | ఇహోభ్యేతి తతః పశ్చాదపరాతు వివృద్ధయే. 26

మేఘా శ్చాప్యాయనం చైవ సర్వమేత త్ప్రకీర్తితమ్‌ |

మేఘములనుండియే జీవులు ఉత్పన్నములగును కావున వానికి 'జీ(వ)మూతములు' అని పేరు. సప్త వాయువులలో రెండవదగు ఆవహ వాయువు నాశ్రయించి మేఘములుండును. ఇక్కడ (మన భూమి) నుండి ఒకటియు ముప్పావు యోజనము దూరమున అవి నిలిచి వానను భూమిపయి వదలుచుండును. దానికే ధారా-ఆసారము-ఈ మొదలగు నామములు.

ఇవికాక పక్షములు మొలచియున్న పుష్కరా వర్తకములను మేఘములు కలవు. మహా సామర్థ్యము కలవగు పర్వతముల పక్షములను ఇంద్రుడు-అవి కామ సంచారములును సమృద్ధి కలవియును నగుట చూచి - భూతహితమునకై నరకెను. (కాని ఈ పుష్కరా వర్తకముల రెక్కలనతడు నరుకలేదు.) పుష్కరము అనగా నీరు; అవి తోయ(జల) ధారులై బృంహణము (ప్రాణి పోషణము) చేయును కావున వానికి పుష్కరా వర్తకములని వ్యవహారము (ఆవర్తకములు-సంపూర్ణముగా వర్తనమును-జీవనమును-కలిగించునవి.) ఇవి నానారూప ధరములును మహాఘోర ధ్వనియుతములును; అవి కల్పాంతమున వానలు కురిసి ప్రళయాగ్ని నుపశమింపజేయును. కాని ఇవి సృష్టి స్థితి కాలములందు వాయు వశమున కొట్టుకొనిపోవుచు వానలనీయక కల్ప ప్రవృత్తిని సాగించుచుండును. లోకమున సాధారణముగా అండము పగులగా ఏర్పడిన కుండ పెంకులను కపాలములందురు గదా! అట్లే ఏ అండమునందు ప్రభువు (సృష్టి వ్యాపార సమర్థుడు) చతుర్ముఖుడునగు బ్రహ్మ గర్భస్థ శిశువుగా నుండి చివరకు దానిని చీల్చుకుని ఉత్పన్నుడయ్యేనో- ఆ అండపు కపాలములే మేఘములయ్యెను. అట్టి మేఘములెన్ని యున్నను అన్నిటికిని సమానముగా అప్యాయనము కలిగించునది ధూమము. మేఘములన్నిటిలో శ్రేష్ఠములు పర్జన్యుడును నాలుగు దిగ్గజములును; (మేఘములును దిగ్గజములును వేరుగదా యనిన) గజములు మేఘములు భోగులు (సర్పములు) వీని కన్నిటికిని మూలతః కుల మొక్కటియే; తరువాత ఈ కులము రెండయినది. (నాగములు అనునది ఆ రెండవ కులము-కావుననే గజములకును సర్పములకును నాగమని వ్యవహారము) వీని కన్నిటికిని జన్మకారణము నీరు ఒక్కటియే. ఈ పర్జన్యుడు వర్షర్తువునందు నీరు ఇచ్చుచు మేఘుడుగా నుండును. హేమంతర్తువులో ఇతడే శీతము కలిగించును. ఇవి మరింత వృద్దినొందినచో మంచువానను కురియించును. ఇట్టి పుష్కరావర్తక పర్జన్యాదికమునకు వాయువులలో ఆరవది యగు పరివహవాయువు ఆశ్రయము.

ఆ పరివహ వాయు భగవానుడే 'త్రిపథగా' 'ఆకాశమున పోవునది' అని ప్రసిద్దయు దివ్యామృత జలపూర్ణయు త్రిపథమునకు (అంతరిక్షమునకు) ఉపరిస్థానమును ప్రసరించుచు ఇదిగో! ఈ ఆకాశమున కానబడుచున్న గంగను భరించు (క్రిందకు పడకుండ నిలిపి పట్టు)చున్నాడు. అతడు స్రవింపజేసిన జలమును దిగ్గజములు తమ లావగు తొండములతో తుంపురులనుగా వదలుచుండును. ఆ తుంపురుల సముదాయపు రూపమునే నీహారమనుచున్నాము.

హేమకూట పర్వతమునకు దక్షిణమునను హిమవంతమునకు ఉత్తరమునను కల ప్రదేశమునందు-ఆగ్నేయమున-పుర్ద్రూ అను నగరము ఉన్నది (ఇది పూర్వముండెడిది.) ఈ చెప్పిన తుషారవర్షము ఆ నగరము వరకు వ్యాపించి నిలిచిపోవును. అక్కడినుండి హిమపాతమునకు మూలహేతువగు ఈ వాయువు హిమముతో హిమవన్మహాగిరిని తడుపుచు ఆ నీహారమును దక్షిణమునకు తెచ్చును. హిమవత్పర్వతమును దాటి దక్షిణమునకు వచ్చిన ఈ వాయువు వర్షము తన శేషాంశముగా కలదగును. ఈ వృష్టి తక్కువదయియు వృద్ధికరము; (వానలను కురియించును.) అంతరిక్షమున మేఘముల ఉనికి తీరును వానివలన ప్రాణులకు కలుగు ఆప్యాయన (సంతృప్తి) ప్రకారమును మీకు తెలిపితిని.

సూర్యఏవతు వృషీనాం స్రష్టా సముపదిశ్యతే. 27

వర్షం ఘర్మం హిమం రాత్రిసన్ద్యే చైవ తథా దినమ్‌ | శుభాశుభఫలానీహ ధ్రువా త్సర్వం ప్రవర్తతే. 28

ధ్రువేణాధిష్ఠితశ్చైవ సూర్యోయం సమ్ప్రవర్షతి | సర్వభూతశరీరేషు ఆపోహ్యసుసమాశ్రయాః. 29

దహ్యమానేషు తేష్వేవం జఙ్గమస్థావరేషుచ | ధూమభూతాస్తు తాహ్యాపో నిష్క్రామన్తీహ సర్వశః. 30

తేన సాస్రాణి జాయన్తే స్థానభ్రంశమపాం స్మృతమ్‌ | తేజోభి స్సర్వభూతేభ్యో హ్యాదత్తే రశ్మిభిర్జలమ్‌.

సముద్రా ద్వాయునా యోగాద్వహన్త్యాపో గభస్తయః తత స్త్వతివశా త్కాలే పరివర్తం దివాకరః. 32

నయత్యపోథ మేఘేభ్యో శుక్లాశుక్లైస్తు రశ్మిభిః | అభ్రస్థాః ప్రపతన్త్యాపో వాయునా సముదీరితాః. 33

తతో వర్షతి షణ్మాసా న్త్సర్వభూతవివృద్ధయే | వాయువ్యం స్తనితంచైవ విద్యుత స్త్వగ్నిజా స్మ్మృతాః. 34

మేహనాచ్చ మిహేర్దాతో ర్మేఘత్వం వ్యంజయన్తిచ | న భ్రశ్యన్తే తతోహ్యోప స్తస్మా దభ్రాణివై స్థితిః. 35

స్రష్టాసౌ వృష్టిసర్గస్య ధ్రువేణాధిష్ఠితో రవిః | ధ్రువేణాధిష్ఠితో వాయు ర్వృష్టిం సంహరతే పునః. 36

ఖేన నిస్సృతసూర్యేణ చరన్తే ఋక్షమణ్డలమ్‌ | చారస్యాన్తే విశన్త్యర్కం ధ్రువేణ సమధిష్ఠితాః. 37

వాన కురియుటకు సూర్యుడే మూలము అని పెద్దలు నముపదేశించుచున్నారు. కాని వస్తుతః వర్షము-వేడిమి-హిమము-రాత్రింబవళ్ళు-సంధ్యాకాలములు-ఇవన్నియు ధ్రువునినుండియే ప్రవర్తిల్లుచున్నవి. ధ్రువుడు అధిష్ఠాతగా ఉన్ననే రవియు వాన కురియించుచున్నాడు. సర్వభూత శరీరములందును ప్రాణములకు కూడ నీరే ఆశ్రయము. స్థిర చర ప్రాణులన్నిటియందును ఆనీరు (అదృష్టమగు అగ్నిచే) దహింపబడగా అది ఆవిరిగా అయి బయటకు పోవును. (ఇదియే మరల నీరుగామారినపుడు) ఆయా ప్రాణులు సాన్రములు (న-అస్ర-కన్నీటితో కూడినవి) అయినవనుచున్నాము. ఇది నీటియొక్క స్థానభ్రంశము (ఒక స్థితిని విడిచి మరియొక స్థితిని పొందుట) మాత్రమే. రవి సర్వభూతముల నుండియు తేజోమయములగు తన కిరణములతోను సముద్రమునుండి మాత్రము వాయు సహకృతములయిన తన కిరణములతోనూ ఈ జలమును గ్రహించుచున్నాడు. తరువాత ఆతడు తన తెల్లని కిరణములతో తెల్లని జలములనుగా ఆ నీటి యావిరిని పరివర్తించి మేఘములకందించుచున్నాడు. తరువాత వాయు ప్రేరణచే మేఘములయందంత వరకున్న నీరు క్రిందపడును. ఇట్లు ఆరు మాసములపాటు రవి సర్వభూత వృద్ధికరముగా అంతయో ఇంతయో వానలు కురియించుచుండును. వాయువు మూలమున ఉరువులును అగ్నివలన మెరుపులును కలుగును. మిహ్‌-అను ధాతువునకు తడుపుట-నీరు చిందించుట అని అర్థము. నీరు చిందించి తడుపునది కావున (మేహ>మేఘ) మేఘము అనబడును. (వాయు శక్తిచే నిలుపబడి) క్రిందికి జారిపడదు కావున అభ్రము అని ఈ మేఘములకు పేరు (న+భ్ర>(భ్రంశ్‌)-అభ్ర-(కాని వాస్తవమున-అప్‌-భ్ర>అబ్‌-భ్ర>అ(భ్‌) భ్ర>అభ్ర-నీటిని మోయునది).

ఇట్లు ధ్రువుడు తనపై అధిష్ఠాతగా ఉండుట చేతనే (ధ్రువుని శక్తి రవియందు నిలిచి యుండుటచే) సూర్యుడు వృష్టికి స్రష్ట-వాన కలిగించువాడు-అగుచున్నాడు. ధ్రువుడు తనకు ఆధిష్ఠాతగా ఉండుటచేతనే వాయువు వర్షమును ఉపసంహరించగలుగుచున్నది. ధ్రువుడు అధిష్ఠాతగా ఉండుట చేతనే నక్షత్రమండలము (కుజ బుధ గురు శుక్ర శనులకు తారాగ్రహములని శాస్త్ర వ్యవహారము) నిరంతరముగా రవి సంచరించెడి త్రోవలో రవితోపాటు అతనికి విధేయులవలె సంచరించుచుండును. ధ్రువాధిష్ఠానము చేతనే అవి తమతమ నియతరాశి సంచారానంతరము రవియందు ప్రవేశించు చున్నవి.

సూర్యరథపరిమాణాదికథనమ్‌.

తత స్సూర్యరథస్యాపి సన్నివేశం ప్రచక్షతే | స్థతేనై కేన చక్రేణ పఞ్చారేణ త్రినాభినా. 38

హిరణ్మయేనాణ్వణినా అష్టచక్రైకనేమినా | చక్రేణ భాస్వతా సూర్య స్స్యన్దనేన ప్రసర్పిణా. 39

దశయోజనసాహస్రో విస్తారాయామ ఉచ్యతే | ద్విగుణశ్చ రథోపస్థా దీషాదణ్డః ప్రమాణతః. 40

స తస్య బ్రహ్మణా సృష్టో రథో హ్యర్థవశేనతు | అసఙ్గః కాఞ్చనో దివ్యై ర్యుక్తస్స& శీఘ్రగై ర్హయైః. 41

ఛన్దోభి ర్వాజిరూపైసై#్త ర్యథాచక్ర మవస్థితమ్‌ | వారుణస్య రథస్యేహ లక్షణౖ స్సదృశంతు తత్‌. 42

తేనాసౌసర్పతేవ్యోమ్ని భాస్కరో 7నుదినందివి | రథాఙ్గానితు సూర్యస్య ప్రతఙ్గాని రథస్యతు. 43

సంవత్సరస్యావయవైః కల్పితాని యథాక్రమమ్‌ | అరా నేమ్యస్తు సూర్యస్య ఏవచక్రంతు వైస్మృతమ్‌. 44

అరాః సంవత్సరాఃపఞ్చ నేమయ స్త్వృతాః |

రాత్రి ర్వరూథా ధర్మశ్చ ధ్వజ ఊర్ధ్వం సముచ్ఛ్రితః. 45

యుగాక్ష తేతస్య అర్థకామా వుభౌ స్మృతౌ | తస్య కాష్ఠాః స్స్మృతా ఘోణా దన్తపజ్త్కిః క్షణా భువి. 46

నిమేషా శ్చానుకర్షోస్య ఈషాచాస్య కలాస్మృతా | సప్తాశ్వరూపా శ్ఛన్దాంసి వహన్తే వాయురంహసః. 47

గాయత్రీచైవ త్రిష్టుప్చ జగత్యనుష్టబేవచ | పఙ్త్కిశ్చ బృహతీచైవ ఉష్ణిగేవతు సప్తమః. 48

అనంతరము పెద్దలు సూర్యరథ సన్నివేశమును ఈవిధముగ చెప్పుచున్నారు. నిలువుగా నిలచియున్న (ఒక్కటియేయైనను పడిపోకయున్న)ఒకే చక్రము-ఆచక్రమునకు ఐదు అరలు-(ఆకులు)-పృథివ్యంతరిక్ష ద్యులోకములు అనెడు మూడు నాభులు-(చక్రపు మధ్యస్థానములు-కుండలు) బంగారుతో చేసిన మిగుల సూక్ష్మమగు అణి(చక్రపుచీల)ఎనిమిది చక్రములతో ఏర్పడిన ఒకేఒక నేమి (చక్రపు పట్టా) కలిగిన ఇట్టి ఏకచక్రమగుచు తీవ్రముగా ప్రసరించగల ప్రకాశమాన రథముతో సూర్యుడు సంచరించుచుండును. ఆ రథపు నడిమి విస్తారము పదివేల యోజనములు రథపు ఉపస్థ ప్రదేశము(నడిమి విస్తారము)నకు రెట్టింపు కాడి పొడవు: ప్రయోజనవశ దృష్టతో ఈ రథమును బ్రహ్మ(వేదము)సృష్టించెను. (సృష్టియందలి ఆయాతత్త్వములను ఆయా రథాంగ ప్రత్యంగములుగా వేదము రూపించుచున్నది.) ఈ రథము దేనికిని అంటకయే నడుచు బంగారు రథము. ఛందస్సులు అనెడి శీఘ్రగాములగు అశ్వములు. ఈ రథమున పూంచియున్నవి. ఈ స్యందనము దాని చక్రమునకు అనుగుణముగ (నిట్టనిలువుగా) నున్నది. దీనిలక్షణములు వరుణ రథ లక్షణములతో సమానములు. ఈ రథముతో భాస్కరుడు అనుదినమును ద్యులోకమున నంచరించుచుండును.

వాస్తవ స్థితిని ఆలోచించగా రవి రథపు అంగ ప్రత్యంగములన్నియు సంవత్సరావయవములతో కల్పింపబడినవే. (ఇచ్చట సంవత్సరమునకు అవయవములుగా లోక వ్యవహార ప్రసిద్దములగు అవయవములు మాత్రమేకాక వేదములందు సంవత్సరాత్మక ప్రజాపతికిని ఆ ప్రజాపతిని ఆరాధించు విధానమునకును అంగములుగా చెప్పిన వానిని గూడ గ్రహించవలయును.) అది ఎట్లనగా---సంవత్సరము చక్రము: పంచ సంవత్సరాత్మక యాగమున ఉండెడి సంవత్సరము-పరివత్సరము-ఇదావత్సరము ఇద్వవత్సరము వత్సరము అను ఐదు భేదములను ఐదు ఆకులు; వసంత గ్రీష్మ వర్షా శరచ్ఛిశిరములనెడు ఐదు ఋతువులను ఐదునేములు-ఐదు పూటీలు-రాత్రి వరూథము (రథమును కాపాడుటకు అమర్చిన దారుమయమైన పంజరము) ధర్మము (యజ్ఞము) నిట్టనిలువుగా ఎగురుచున్న ధ్వజము; అర్ధ కామములు రెండును కాడికొనలు; కాష్ఠా అను కాలావయవ విశేషములు ఆ రథమును లాగెడి ఏకైకాశ్వపు ముక్కు; క్షణమను కాలావయవ విశేషములు ఆ అశ్వపు దంతపంక్తి; నిమేషములనెడు కాలావయవ విశేషములు అనుకర్షము అను రథావయవము; కలా అనెడు కాలావయవ విశేషములు ఈషా (ఏండి) అనెడు రథావయవము. కాడి కట్టుటకుపయోగించు నిలువు దూలము వంటిది. ఇట 'ఏరో అశ్వో వహతి సప్తనామా' అను శ్రుతి ననుసరించి అశ్వము ఒకటియే అయినను అది ఏడు పేరులతో ఏడు గుర్రములుగా నున్నది; గాయత్రి-త్రిష్టుప్‌-జగతీ-అనుష్టుప్‌-పంక్తి-బృహతీ-ఉష్ణక్‌ అను ఏడు ఛందస్సులే వాయువేగము గల ఏడు గుర్రములు.

చక్రమక్షే నిబద్ధన్తు ధ్రువేచాక్ష స్సమర్పితః | సహచక్రో భ్రమత్యక్ష స్సహాక్షో భ్రమతిధ్రువః. 49

అక్ష స్సహైవచక్రేచ భ్రమతే7సౌ ధ్రువేరితః | ఏవ మర్థవశాత్తస్య సన్నివేశో రథస్యతు. 50

తథాసంయోగభావేన సిద్ధోసౌ భాస్కరో రథః | తేనాసౌ తరణి ర్దేవో నభస స్సర్పతే దివమ్‌. 51

యుగాక్షకోటి తే తస్య దక్షిణ స్యన్దనస్యతు | ధ్రువేణచ గృహీతోసౌ రశ్మినా భ్రమతే రవిః. 52

మణ్డలాని భ్రమన్తిస్యుః ఖేచరస్య రథస్యతు | కులాలచక్రవ ద్భానుమణ్డలం సర్వతో దిశి. 53

యుగాక్షకోటి తే తస్యవాతోర్మీ స్యన్దనస్య తు | సఙ్క్రామేతే క్రమవతో మణ్డలే సర్వతోదిశమ్‌. 54

భ్రమతస్తస్య రశ్మీతే హ్రసేతే మణ్డలే షూత్తరాయణ | వర్ధేతే దక్షిణ త్వస్య భ్రమతో మణ్డలానితు. 55

యుగాక్షకోటి సమ్భద్దే ద్వేరశ్మీ స్యన్దనస్య తు | ధ్రువేణ ప్రగృహీతౌ తౌ తపన్తావథ తే రవిమ్‌. 56

ఆకృష్యేతే సమాయాతౌ ధ్రువేణ సమధిష్ఠితౌ | తథా సౌభ్యన్తరే సూర్యో భ్రమతే మణ్డలానితు. 57

*అశీతిమణ్డలశతం కాష్ఠయో రుభయో7న్తరమ్‌ | ధ్రువేణ ముచ్యమానేన పురా రశ్మియుగేనతు. 58

తథైవ బాహ్యత స్సూర్యో భ్రమతే మణ్డలానితు | ఉద్వేష్టయన్వై వేగేన మణ్డలానితు గచ్ఛతి. 59

ఇతి శ్రీమత్స్యమహాపురాణ ఖగోళే ధ్రువసఞ్చారాది కథనం నామ చతుర్వింశత్యుత్తరశతతమో7ధ్యాయః.

సూర్యుని రథపు చక్రము అక్షమునందు బిగింపబడియున్నది; అక్షము ధ్రువునియందిమిడియున్నది. ఈ మూటిలో చక్రముతోపాటు అక్షమును అక్షముతోపాటు ధ్రువుడును తిరుగుచున్నారు. వాస్తవమున ధ్రువుని ప్రేరణతో అక్షము చక్రముతోపాటు తిరుగుచున్నది.

విషయ ప్రతిపాదనమును ప్రయోజనముగా దృష్టియందుంచుకొని రవి రథ సన్ని వేశమంతయు రూపింపబడి ప్రతిపాదింపబడినది. ఆ విధముగ కాలావయవముల సంయోగభావముతో భాస్కరరథ (రూప)ము సిద్ధించుచున్నది. ఆ రథముతో సూర్యదేవుడు అంతరిక్ష లోకమునుండి ద్యులోకమునకు సంచరించుచుండును. (అనగా-రవి మండలము భౌతికముగా అంతరిక్షమందే కనబడుచున్నను ఆదేవుని ఆధిదైవతరూపము ద్యులేకస్థాయి అని తెలియవలెను.)

__________________________________________________________________________ *ఆసీత్తన్మణ్డలశతం

ఖగోళ విషయము-సూర్యరథ వర్ణనము-సూర్యగణ భేదములు-124-125 అ.

రవి రథపు కాడికిని అక్షమునకును గల దక్షిణపు కొనలు ఏవి కలవో-వానికిగల పగ్గములు పట్టి ధ్రువుడు తన రథమును త్రిప్పుటను బట్టి రవి సంచరించుచుండును. ఆకాశమున ఇట్లు మండలాకార భ్రమణములతో తిరుగు రవి రథమున భానుమండలము అన్ని దిక్కులకును గిరగిర తిరుగు కుమ్మరి సారవలె కనబడుచుండును.

ఎప్పుడును క్రమించు (ముందునకు సాగు)చునేయుండు రవి రథపు కాడి-అక్షముల కొనలు వాయుతరంగ ప్రేరితములగుచు మండల రూపమున అన్ని దిక్కులందును సంక్రమించు(వ్యాపించు)చుండును.

ఈసూర్య రథపు యుగ కోట్యక్షకోటులయందు బిగించియున్న రశ్మిద్వయము (రెండు పగ్గములు)ను మండల (భాగల-లేదా డిగ్రీల) గణనమున చుట్టుకొనుచు మరల విప్పుకొనుచు ఉత్తరాయనమున పొట్టివగును. దక్షిణాయనమున పెద్దవగును. ఇవి ధ్రువునిచే బిగించి పట్టుకొనబడుచు వదలబడుచు తద్వశమున రవి రథమును వేడెక్కించుచుండుటే ఇందులకు హేతువు. ఈరెండు రశ్ము (పగ్గము)లును ధ్రువునిచే అధిష్ఠితములయి సమస్థితికి వచ్చునట్లును లాగబడును. ఉత్తర దక్షిణ దిశల అర్థవృత్తములు నూట ఎనుబది మండలములు (భాగలు-డిగ్రీలు) అగును. రథ యుగకోట్యక్షకోటులయందలి పగ్గములను ధ్రవుడు సడలించివదలగా రవి వెలుపలగా సంచరించును; లాగిపట్టి చుట్టివేసినపుడు లోపలగా సంచరించును. దానిని బట్టి రవి వేగమునందు శీఘ్రత్వమందత్వ భేదములు ఏర్పడును. దానిని బట్టి ఉత్తరాయన దక్షిణాయనము లేర్పడును. అని సారాంశము.

[గమనిక: ఇచ్చట మండలము అను పదము భాగలు (డిగ్రీలు) అను అర్థమున ప్రయోగింపబడినది. మరియును రవిని బట్టి రాత్రింబవళ్ళు మొదలగు వ్యవస్థ ఏర్పడునని భారతీయ జ్యోతిఃశాస్త్రముగాని ఆధునిక పాశ్చాత్త్యశాస్త్రములు కాని చెప్పుచున్నను కాలాత్మక ప్రజాపతి వ్యవస్థిత రూపమగు సంవత్సరమునకధీనుడై తదధిష్టాతృ తత్త్వములలో నొకటియగు ధ్రవుని వశమున రవి నడచుచున్నాడను సంప్రదాయమొకటి భారతదేశమున కలదని సాయన వచనములబట్టి తెలియుచున్నది. పురాణములందు ఈ సంప్రదాయముననుసరించియే ధ్రువుడు సూర్యునిమీదను అధికారము వహించినట్లు చెప్పుట జరుగుచున్నదని గ్రహింపనగును. -అనువాదకుడు)

ఇది శ్రీమత్స్యమహాపురాణమున ఖగోళ వర్ణనమున జ్యోతిర్మండల వ్యవస్థా ప్రతిపాదమున ధ్రువాధీన రవి సంచార కథనమను నూట ఇరువది నాలుగవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters