Sri Matsya Mahapuranam-1    Chapters   

త్రయోవింశత్యుత్తర శతతమో7ధ్యాయః.

ఖగోళ ప్రారమ్భః.

సూతః సూర్యాచన్ద్రమసా వేతౌ భ్రమన్తౌ యావదేవ తు | సప్తద్వీసముద్రాణాం భూతానాం భూతివిస్తరః. 1

విస్తరార్థం పృథివ్యాస్తు భ##వే దన్యత్ర బాహ్యతః | పర్యాసపరిమాణాచ్చ చన్ద్రాదిత్యౌచ భాగశః. 2

పర్యాసపరిమాణాభ్యాంభూమేస్తల్యం దివం స్మృతమ్‌ | ఆవతి మాతి యోలోకా న్యస్మా త్సూర్యఃపరిక్రమ &.

ఆయనాత్తు ప్రకాశేన అవనా త్స రవిస్స్మృతః | భూయోభూయః ప్రవక్ష్యామి ప్రమాణం చన్ద్రసూర్యయోః. 4

సప్తద్వీపనముద్రాయాం భ్రమణం చన్ద్రసూర్యయోః | మహితత్వా న్మహశ్శబ్దో హ్యస్మిన్నర్థే నిపాత్యతే. 5

అస్య భారతవర్షస్య విష్కమ్భస్తుల్యతస్స్మృతః | మణ్డలం భాస్కరస్యాథ యోజనై స్త న్నిబోధత. 6

నవయోజనసాహస్రవిస్తారో మణ్డలస్యతు | విస్తారా త్త్రిగుణశ్చాపి పరిణాహో7ర్కమణ్ణలే. 7

విష్కమ్భా న్మణ్డలాచ్చైవ భాస్కరా ద్ద్విగుణ శ్శశీ | అతః పృథివ్యా వక్ష్యామి ప్రమాణం యోజనైః పునః. 8

సప్తద్వీపనముద్రాయా విస్తారో మణ్డలస్యతు | ఇత్యేత దిహ సఙ్ఖ్యాతం పురాణ పరిమాణతః. 9

తద్వక్ష్యామి ప్రజఙ్ఖ్యాతం యావద్భి రభిమానిభిః | అభిమానినో హ్యతీతా యే తుల్యాస్తే సామ్ప్రతేష్విహ. 10

దేవాదేవై రతీతాస్తు రూపై ర్నామభి రేవచ | తస్మాద్ధి సామ్ర్పతై ర్దేవై ర్వక్ష్యామి వసుధాతలమ్‌. 11

దివ్యశ్చ సన్నివేశోవై సామ్ప్రతైరేవ కృత్స్నశః | శతార్ధకోటివిస్తారా పృథివీ కృత్స్నశ స్స్మృతా. 12

భూపరిణామమ్‌.

తస్యాశ్చార్ధప్రమాణన మేరోశ్చైవోత్తరోత్తరమ్‌ | పృథివ్యాఅపి విస్తారా ద్యోజనానాంతు వై పునః. 13

భూమేర్మధ్యం ప్రతిదిశం కోటిరేకాతు సా స్స్మృతా | తథా శతసహస్రాణా మేకోననవతిం పునః. 14

పఞ్చాశచ్చ సహస్రాణి పృథివ్యార్ధస్య విస్తరః | పృథివ్యా విస్తరం కృత్స్నం యోజనై స్తన్నిబోధత. 15

తిస్రః కోట్యస్తు విస్తారా త్సఙ్ఖ్యాతా సా చతుర్దిశమ్‌ | తథా శతసహస్రాణా మేకోనాశీతి రుచ్యతే. 16

సప్తద్వీపనముద్రాయాః పృథివ్యా స్సతువిస్తరః | విస్తరా త్త్రిగుణంచైవ పృథివ్యా స్తస్య మణ్డలమ్‌. 17

గణితం యోజనానాంతు కోట్య స్త్వేకాదశ స్మృతాః | తథా శతసహస్రాణి సప్తత్రింశాధికానితు. 18

ఇత్యేతద్వై ప్రజఙ్ఖ్యాతం పృథివ్యన్తరమణ్డలమ్‌ |

నూట ఇరువది మూడవ అధ్యాయము.

ఖగోళ విషయము

సప్త ద్వీపములును సప్త సముద్రములును ఆయా భూతములును వాని సంభవ విస్తరమును ఎంతవరకు కలదో అంతవరకును (అంత మేరలో) ఈ సూర్యచంద్రులు తిరుగుచునేయుందురు. పృథివీ విస్తారము ఎంతయని విచారణ చేయవలసివచ్చినచో ఈ చంద్రాదిత్యులు మొదలగువారు పృథివీ వ్యాప్తికి వెలుపల కూడ సంచరించుచునేయున్నాడు. వారి పరిమాణము కూడ పృథివీ పరిమాణము కంటె భిన్నమై ఎక్కువదిగానో తక్కువదిగానో యున్నది. కాని వ్యవహారార్థమై మాత్రము భూమి ఉన్నంతమేర మాత్రమే సూర్యచంద్రుల వ్యాప్తియున్నదని భావించి భూమికిగల పరిమాణమునకు తగినట్లే అంతరిక్షపు పరిమాణము కలదని ఎంచవలెను. 'అవ' ధాతువునకును 'ఋ' ధాతువునకు గల అర్థముల ననుసరించి - రవి 'రాశినుండి రాశికి సంచరించును లోకముల నిర్మించును రక్షించును ప్రకాశింపజేయును గావున రవి (ఋ+అప్‌+= రవి-ఇయర్తి-అవతి ఇతి రవిః)' అనబడును.

ఇకమీదట సప్తద్వీప సప్త సముద్ర సహిత భూమండలమున సూర్యచంద్రులగతి ప్రకారమును వారి పరిమాణమును ఈ మొదలగునవి చెప్పెదను. ఈ 'చంద్ర సూర్యులు' అను నర్థమునందే 'మహః' అను శబ్ధము కూడ నిష్పన్నమగుచున్నది. 'మహ్యతే అయం' 'ఇతడు పూజింపబడును.' 'గొప్పవాడై యుండును.' 'మహీయంతే అనేన జ్యోతీంషి' 'ఇతని చేతనే ఇతర జ్యోతిస్సులు పూజితములగును.' అని 'మహః' అను శబ్దము వ్యుత్పన్నమగుచున్నది.

లోగడ చెప్పిన భూమండల వైశాల్యమంతయే రవి మండల వ్యాసమని చెప్పెదరు. రవి మండల వ్యాసము తొమ్మిదివేల యోజనములు; దాని చుట్టుకొలత వ్యాసమునకు మూడింతలు; చంద్రుని వ్యాసము రవి వ్యాసమునకు రెండింతలు; భూవ్యాసము (సరాసరి) ఏబది లక్షల యోజనములు. మహామేరు ప్రాంతమును భూవృత్తము తక్కువగా నుండును. అచ్చట భూవ్యాసము ఈ సగటు వ్యాసములో సగము మాత్రమే-అనగా ఇరువది ఐదు లక్షల యోజనము లుండును. భూగోళపు మధ్య భాగమున వ్యాసము అత్యధికముగా నుండును. అది ఒకకోటి ఎనుబది తొమ్మిది లక్షల ఏబదివేల యోజనములుండును. భూమికి దక్షిణోత్తరాగ్రముల మధ్య దూరము మూడుకోట్ల డెబ్బది తొమ్మిది లక్షల ఏబదివేల యోజనములుండును. భూమికి దక్షిణోత్తరాగ్రముల మధ్య దూరము మూడుకోట్ల డెబ్బది తొమ్మిది లక్షల యోజనములు; దీని (ఉత్తర దక్షిణములుగా ఏర్పడెడి భూవృత్తపు) చుట్టుకొలత పదునొకండు కోట్ల ముప్పది ఏడు లక్షల యోజనములుండును. ఇది భూమికి సంబంధించిన అన్ని విధముల మండలముల వ్యాసమును చుట్టుకొలతలును.

తారకాసన్ని వేశస్య దివి యావత్తు మణ్డలమ్‌ 19

పర్యాససన్ని వేశస్య భూమేర్యావత్తు మణ్డలమ్‌ | పర్యాయపరిమాణాభ్యాం భూమే స్తుల్యం దివం స్స్మృతమ్‌. 20

మేరోఃప్రాచ్యాం దిశాయాంతు మానసోత్తరమూర్ధని | వస్వోకసారా మహేంద్రపురీ హేమపరిష్కృతా. 21

ధక్షిణన పునర్మేరో ర్మానససై#్యవ పృష్ఠతః | వైవస్వతో నివసతి యమ స్సంయమనీపురే. 22

ప్రతీచ్యాంచ పునర్మేరో ర్మానససై#్యవ మూర్ధని | సుఖానామ పురీరమ్యా వరుణస్యాపి ధీమతః. 23

దిశ్యుత్తరాయాం మేరోస్తు మానససై#్యవ మూర్దని | | తుల్యామహేన్ద్రపుర్యాస్తు సోమస్యాపి విభాపురీ. 24

మానసస్యోత్తరే పృష్ఠే లోకపాలా శ్చతుర్దిశమ్‌ | స్థితా ధర్మవ్యవస్థార్థం ధర్మసంరక్షణాయచ. 25

సూర్యసఞ్చారకథనమ్‌.

లోకపాలోపరిష్టాత్తు సర్వతో దక్షిణాయనే | కాష్ఠాగతస్య సూర్యస్య గతింతస్య నిబోధత. 26

దక్షిణో(ణా)పక్రమే సూర్యః క్షిప్తేషురివ గచ్ఛతి | జ్యోతిషాం చక్ర మాదాయ సతతం పరిగచ్ఛతి. 27

మధ్యత శ్చామరావత్యాం యదాభవతి భాస్కరః | వైవస్యతే సంయమనే ఉద్యంస్తత్ర ప్రదృశ్యతే. 28

సుఖాయా మద్ధరాత్య్రాంతతు విభాయా మస్తమేతిచ | వైవస్వతే సంయమనే మధ్యాహ్నేతు రవి ర్యదా. 29

సుఖాయా మథ ముత్తిష్ఠ న్త్సతు దృశ్యతే | విభాయా మర్ధరాత్రంతు మాహేన్త్ర్య మసతమేతిచ. 30

సుఖాయా మథ వారుణ్యాం మధ్యాహ్నే చార్యమా యదా | విభాయాం పోమపుర్యాంతు ఉత్తిష్ఠతి విభావసుః. 31

రాత్ర్యర్థ మమరావత్యా మస్తమేతి యమస్య చ | సోమపుర్యాం విభాయాంతు మధ్యాహ్నే చార్యమా యదా. 32

మహేన్ద్ర్యా మమరావత్యా ముద్గచ్ఛతి దివాకరః | అర్ధరాత్రం సంయమనే వారుణ్యా మస్తమేతిచ. 33

తారకల (నక్షత్ర గ్రహాదుల) సన్నివేశమున (అమరిక) కై ద్యులోకమున ఎంత మండలము కలదో పర్యాసపు (భూమి చుట్టును గ్రహాదికము తిరుగుటకు సంబంధించిన) అమరికకై భూలోక సపీపమున ఎంత మండలము కలదో అవి రెండును ఒకదానికి మరియొకటి సరిపోవునవిగానే ఉన్నవి. మహామేరువునకు తూర్పున మానసోత్తరమను శిఖరమునకు పైభాగమున 'వస్వోకసారా' అను ఇంద్రుని నగరము బంగారు అలంకరింపబడినది కలదు. మహా మేరువునకు దక్షిణముగా మానసోత్తరమునకు పైభాగముననే కల యముని నివాసమగు 'సంయమనీ' పురము కలదు. మేరువునకు పడమటగా మానసోత్తరమునకు పైభాగమున 'సుఖా' (ప్రాచీన పారసీక నగరమునకు 'సుసా' అని పేరు.) అను నగరము కలదు. ఇట్లే మానసోత్తరపు పైభాగమున మేరువునకు ఉత్తరమున సోముని 'విభా' నగరము ఉన్నది. ఇట్లు లోకపాలురు నలుగురును లోక వ్యవస్థార్థము (సూర్య సంచార గణనకై) నాలుగు దిక్కులందును ఆయా నగరము లందు ఉన్నారు. (అని భావించవలెను.) లోకపాలుర కందరకును పైగా దక్షిణాయనమున సూర్యుడు చివరి దశలో (ఉత్తరాయనము ఆరంభము కాబోవునప్పుడు) అవ మండలమున (సూర్యుడు పయనించెడు అశ్విన్యాది నక్షత్ర మార్గమునకు అప మండలమని పేరు) ధనుస్సును వదలిన బాణమువలె మహావేగమున జ్యోతిశ్చక్ర మార్గమున పోవును. అమరావతిలో మధ్యాహ్నమయినపుడు సంయమనమున ఉదయము సుఖా నగరమున అర్ధరాత్రము విభానగరియందు అస్తమయము జరుగును. ఇట్లే సంయమనమున మధ్యాహ్నమయినపుడు సుఖా నగరమున ఉదయము విధానగరమున అర్ధరాత్రము అమరావతియందస్తమయము. ఇట్లే సుఖా నగరమున మధ్యాహ్నమయినపుడు విధా నగరమున ఉదయము అమరావతియందు అర్ధరాత్రి-సంయమని యంద స్తమయము; విధా నగరమున మధ్యాహ్నమయినపుడు అమరావతియందుదయము సంయమని యందర్ధరాత్రి సుఖా నగరమంద స్తమయము జరుగును.

స శీఘ్రమేవ పర్యేతి భాస్కరో7లాతచక్రవత్‌ | భ్రమత్వే భ్రమమాణాని ఋక్షాణి చలతే రవిః. 34

ఏవం చతుర్‌షు పార్శ్వేషు దక్షిణాన్తేషు సర్పతి | ఉదయే స్తమయేచాసా పుత్తిష్ఠతి పునః పునః. 35

పూర్వాహ్ణే చాపరాహ్ణేచ ద్వౌతు దేవాల¸°తు సః | తపత్యేకంచ మధ్యాహ్నే మధ్యాహ్నే తాభిరేవచ. 36

ఉదితో వర్దమానాభి ర్మధ్యాహ్నే తపతే రవిః | అతంపరం హ్రసన్తీభి ర్గోభి రస్తం స గచ్ఛతి. 37

ఉదయాస్తమయాభ్యాంతు స్మృతే పూర్వాపరేతు వై | యద్వత్పురస్తా త్తపతి తద్వత్పృష్ఠే తు పార్శ్వయోః.

యత్రోదయస్తు దృశ్యేత తేషాం స ఉదయ స్స్మృతః | ప్రణాశం గచ్ఛతే యత్ర తేషామస్త స్సఉచ్యతే. 39

సర్వేషాం తూత్తరే మేరు ర్లోకాలోకస్తు దక్షిణ | విదూరభావా దర్కస్య భూమే ర్లోకా& తస్యచ. 40

హ్రియన్తే రశ్మయో యస్మా త్తేన రాత్రౌ న దృశ్యతే | ఊర్ద్వం శతసహస్రాంశుః స్థిత స్తత్ర ప్రదృశ్యతే. 41

ఏవం పుష్కరమధ్యేన యదా భవతి భాస్కరః | అంశాంశకంచ మేదిన్యాం మూమూర్తే న గచ్ఛతి. 42

యోజనానాం సహస్రస్య ఇమాం సఙ్ఖ్యాం నిబోధత | ఊర్ద్వం శతహసస్రాణా మేకత్రింశచ్చ సా స్మృతా. 43

పఞ్చాశచ్చ సహస్రాణి తథాన్యా న్యధికాని చ | మౌహూర్తికీ గతిర్హ్యేషా సూర్యస్యతు విధీయతే. 44

ఏతేన క్రమాయోగేన యదా కాష్ఠాంతు దక్షిణామ్‌ | పరిగచ్ఛతి సూర్యోసౌ మాసం కాష్ఠాంతమేవహి. 45

మధ్యేన పుష్కరస్యాథ భ్రమతే దక్షిణాయనే | మానసోత్తర మేరోస్తు అన్తరం త్రిగుణంతు తత్‌. 46

సర్వతో దక్షిణాయాంతు కాష్టాయాం తన్నిబోధత | సవకోట్యః ప్రజఙ్ఖ్యాతా యోజనైః పరిమణ్డలమ్‌. 47

తథా శతసహస్రాణి చత్వారింశచ్చ పఞ్చచ | అహోరాత్రా త్పతఙ్గస్య గతిరేషా విధీయతే. 48

ఇట్లు సూర్యుడు నిరంతరమును అలాత చక్రమువలె (కొరవి గిరగిర త్రిప్పుటచే ఏర్పడు చక్రమువలె) తిరుగుచునేయుండును. దక్షిణము వరకు గల దిక్కులందును ఈ చెప్పిన క్రమమున తిరుగుచు సారెవలె తిరుచు(గుండ్రముగానున్న) నక్షత్ర చక్రమున అతడు నడుచుచుండును. పూర్వాహ్న మధ్యాహ్నా వరాహ్ణ కాలములందు వేరు వేరు స్థితులలో ఉండు కిరణములతో భూమిని తపింపజేయును. ఎట్లన ఉదయమునుండి అతని కిరణముల తాపము అధికమగుచు మధ్యాహ్నమునకు అత్యధికమగును. అప్పటినుండి క్రమముగా తగ్గుచు పోవును.

సూర్యోదయా స్తమయముల బట్టియే తూర్పు మొదలగు దిక్కుల వ్యవస్థ జరుగును. సూర్యుడుదయించు చున్నట్లు కనబడు దిశ ఉదయదిశ (అక్కడి వారికది తూర్పు). అస్తమించుచున్నట్లు కనబడు దిశ అస్తదిశ (అక్కడి వారికది పడమర.) అన్నిటికంటె ఉత్తరమున మేరువు-అన్నిటికంటె దక్షిణమునందు లోకాలోకము(పర్వతము) ఉన్నట్లు భావన చేయవలయును; భూమియందలి ఒక భాగమును పూర్తిగి వదలి మరియొక విదూర భాగమునకు పోవుట వలన సూర్యుడు అక్కడివారికి రాత్రులందు కనబడడు. ఏ భూభాగమునకు అతడు పోవునో అక్కడ నూరు వేల కిరణములు కలవాడై ఆకాశపు ఉచ్చ స్థానమున అక్కడి వారికి కనబడును. అది వారికి పట్టపగలు.

సూర్యుడు ఒక మూహూర్త కాలములో కొన్ని 'అంశ' (12) భాగలదూరమాకాశమున పయనించును. ఇది ముప్పది యొక లక్షల ఏబదివేల యోజనములగును. ఇది మూహూర్త. (రెండు గడియలు= 48 నిమిషములు) కాలములో రవి గమన వేగము. ఈ గతిలో పయనించుచు రవి దక్షిణ దిశకుపోయి మాఘమాసమున దక్షిణాయన గతిని వదలి పుష్కరద్వీప మధ్య భాగమున సంచరించుచు మేరుపర్వతమున మానసోత్తరశిఖరప్రాంతమునకు వచ్చుసరికి అచ్చట క్రాంతిమండల పరిమాణము విషువ మండలమునందు ఉండుదానికి మూడింతలగును. రవి ఒక అహోరాత్రములో పయనించు దూరము తొమ్మిదికోట్ల నలువది లక్షల యోజనములగును. (3150000 x30=94500000)

దక్షిణా ద్వినివృత్తో7సౌ విషువస్థో యదా రవిః | క్షీరోదస్య సముద్రస్యోత్తరతోపి దిశశ్చర &. 49

మణ్డలం విషువేచాపి యోజనై స్తన్నిబోధత | తిస్రఃకోట్యస్తు సమ్పూర్ణం విషువస్యాపి మణ్డలమ్‌. 50

తథా శతసహస్రాణి వింశ##త్యేకాధికాపునః | శ్రావణ చోత్తరే కాష్ఠాం చిత్రభాను ర్యదా భ##వేత్‌. 51

గోమేదకస్య ద్వీపస్య ఉత్తరాం చ దిశం చర& | ఉత్తరాయాః ప్రమాణతు కాష్ఠాయా మణ్డలస్యతు. 52

యోజనానాం ప్రసంఖ్యాతా కోటిరేకాతు సా ద్విజాః | అశీతి ర్నియుతానీహ యోజనానాం తథైవచ | అష్ట పంచాశతంచైవ యోజనా న్యధికానితు.

దక్షిణోత్తరమధ్యాని తాని విన్ద్యా ద్యథాక్రమమ్‌ | స్థానం జరద్గవం మధ్యే తథైరావతముత్తరమ్‌. 53

వైశ్వానరం దక్షిణతో నిర్దిష్టమిహ తత్త్వతః | నాగవీథ్యుత్తరావీథి రజవీథిస్తు దక్షిణ. 54

అశ్వినీ కృత్తికా యామ్యా నాగవీథి స్త్రయ స్స్మృతాః | రోహిణ్యార్ద్రా మృగశిరా గజవీథిరితి స్మృతా. 56

పుష్యాశ్లేషా పునర్వస్వో ర్వీథిశ్చైరావతీ స్మృతా | తిస్రస్తు వీథయో హ్యేతా ఉత్తరో మార్గ ఉచ్యతే. 57

పూర్వత్తరఫల్గున్యౌ మఖాచైవార్షభాభ##వేత్‌ | పూర్వోత్తరా ప్రోష్ఠపదే గోవీథీ రేవతీ స్మృతా. 58

శ్రవణంచ శ్రవిష్ఠాచ వారుణం వా జరద్గవమ్‌ | ఏతాస్తు వీథయ స్తత్ర మధ్యమో మార్గ ఉచ్యతే. 59

హస్తా చిత్రా తథా స్వాతీ అజ వీథిరితి స్మృతా | విశాఖా మైత్రమైన్ద్రంచ మృగవీథి రిహోచ్యతే. 60

మూలపూర్వోత్తరాషాఢా వీథిర్వైశ్వానరీ స్మృతా | స్మృతాస్తిస్రస్తు వీథ్యస్తా మార్గేవై దక్షిణ పునః. 61

కాష్ఠయో రన్తరం త్వేత ద్వక్ష్యతే యోజనైః పునః | ఏత చ్ఛత «సహస్రాణా మేకవింశత్తు వైస్మృతమ్‌. 62

శతాని త్రీణి చాన్యాని త్రయస్త్రింశచ్చ యోజనైః | కాష్ఠయో రన్తరం చైత ద్యోజనానాం ప్రకీర్తితమ్‌. 63

దక్షిణదిశనుండి మరలి సూర్యుడు విషువ మండలము (రాత్రింబవళ్ళు సమముగానుండు కాలమును ఏర్పరచు క్రాంతి వృత్త భాగము) లోనికి వచ్చియుండి అచటినుండి క్షీరోద సముద్రమునకు ఉత్తర దిశగాసంచరించనారంభించునపుడు ఆ విషువ మండలపు యోజన పరిమాణము మూడుకోట్ల ఇరువదియొక లక్షలు; శ్రావణమాసమున రవి క్రాంతిమండలమునకు ఉత్తరమున గోమేద ద్వీపమునకు ఉత్తరమున పయనించునపుడు అచ్చట మండలపు పరిమాణము ఒకకోటి ఎనుబది లక్షల ఏబది ఎనిమిది యోజనములు.

అప మండలము అనబడు నక్షత్రచక్రము దక్షిణభాగము ఉత్తరభాగము మధ్యభాగము అని మూడు భాగము లగును. మధ్యభాగమునకు జరద్గవస్థానము-ఉత్తర భాగమునకు ఐరావతస్థానము. దక్షిణ భాగమునకు-వైశ్వానర స్థానము అని పేరులు. స్థానమును పథము అని కూడ వ్యవహరింతురు. ఒక్కొక్క భాగములో మరల మూడేసి ఉపభాగములు (వీథులు) కలవు. వానిలో నాగవీథి ఉత్తరభాగమందును అజవీథి దక్షిణ భాగమునందును వచ్చును. అశ్వని-కృత్తిక-భరణి-నాగవీథి; రోహిణి-అర్ద్ర-మృగశిర-గజవీథి; పుష్యమి అశ్లేష-పునర్వసు-ఐరావతవీథి; ఈ మూడు వీథులును కలిసి ఉత్తరమార్గము; పుబ్బ-ఉత్తర-ముఖ-ఋషభవీథి; పూర్వాభాద్ర-ఉత్తరాభాద్ర-రేవతి-గోవీథి; శ్రవణము-ధనిష్ఠ-శతభిషము. జరద్గవవీథి; ఈ మూడును కలిసి మధ్యమమార్గము; హస్త-చిత్ర-స్వాతి-అజవీథి; విశాఖ-అనూరాధ-జ్యేష్ఠ-మృగవీథి; మూల-పూర్వాషాడ-ఉత్తరాషాడ-వైశ్వాసరవీథి; ఈ మూడును కలిసి-దక్షిణమార్గము. (ఇచట ఇతర పురాణములలో వేరు విధముగా నున్నది-ఎట్లన-ముఖ-పుబ్బ-ఉత్తర-ఋషవీథి; హస్త-చిత్ర-స్వాతి-గోవీధి; విశాఖ-అనూరాధ-జ్యేష్ఠ-జరద్గవవీథి; ఇది మధ్యమమార్గము; మూల-పూర్వాషాఢ-ఉత్తరాషాఢ-అజవీథి; శ్రవణము-ధనిష్ఠ-శతభిషము-మృగవీథి; పూర్వాభాద్ర-ఉత్తరాభాద్ర-రేవతి-ఈ మూడు కలిసి వైశ్వానరవీథి అని యున్నది. -అనువాదకుడు)

విశేషణము : నాగవీథి మొదలగు జ్యతిర్వ్యవస్థ విషయమున శ్రీ వేలూరి శివరామశాస్త్రిగారు ఇట్లు చెప్పి యున్నారు.

'వ్యాసవాణి' (ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య ఎకాడమీ వారి ప్రచురణ) యందలి 'ఆర్ష విజ్ఞానము' అను వ్యాసము నుండి:

జ్యోతీరూపము

''ముమ్మొదట విష్ణవాయు మత్స్య పురాణములు ఈ దేవయానమునకు రూపకల్పన మొనరించెను. పిదప భాగవతాదులు దీని ననుసరించెను.

'ఉత్తరం యదగస్త్యస్య అజవీథ్యాశ్చ దక్షిణమ్‌ |

పితృయాణం సవై పంథా వైశ్వానర పథా ద్బహిః.

విష్ణు-2-8-87; వాయు-50-208.

'నాగవీథ్యుత్తరం యశ్చ సప్తర్షి భ్యశ్చ దక్షిణమ్‌ |

ఉత్తరః సవితుః పంథాః దేవయానశ్చ నస్మృతః.'

విష్ణు-2.8.92; వాయు-50-216.

వథ మన నేమి? వీథి యన నేమి? ఒక్కొక్క గ్రహమునకు మూడేసి స్థానము లున్నది. ఉత్తరమున ఐరావతము- దక్షిణమున వైశ్వానరము-నడుమ జారద్గవము; ఇవి మూడును పథములు; లేక మార్గములు; ఈ మూడిటికిని మరల మూడేసి వీథులు కలవు; ఒక్కొక్క వీథిలో మూడేసి నక్షత్రము లున్నవి.

వాయు విష్ణు పురాణము లీ యోడ సమానములు; మత్స్య పురాణము 124 అధ్యాయమున 52 నుండి 60 వరకు శ్లోకము చూచునది; అందు కొంచెము మార్పు కలదు; నక్షత్రవీథి మార్గములు:- అశ్వని-భరణి-కత్తిక-నాగవీథి; 2.రోహిణి-మృగశిర-ఆర్ద్ర-గజవీథి; పునర్వసు-పుష్యమి-అశ్లేష-ఐరావతవీథి; ఈ మూడును ఐరావతపథము; 1.ముఖ-పుబ్బ-ఉత్తర వృషభవీథి; 2.హస్త-చిత్ర-స్వాతి-గోవీథి; 3.విశాఖ-అనూరాధ-జ్యేష్ఠ-జారద్గవవీథి; ఈ మూడును జరద్గవ పథము; 1.మూల-పూర్వాషాడ-ఉత్తరాషాఢ-అజవీథి; 2.శ్రవణము-ధనిష్ఠ-శతభిషము-మృగవీథి; 3.పూర్వాభాద్ర-ఉత్తరాభాద్ర-రేవతి-వైశ్వానరవీథి; ఈ మూడును వైశ్వానరపథము; ఇవి వరుసగా ఉత్తర-మధ్యము-దక్షిణ-పథములు;

గర్గమతానుసారము భరణి -కృత్తిక-స్వాతి-నాగ; రోహిణి-మృగశిర-ఆర్ద్ర-గజ; పున-పుష్య-అశ్లే-ఐరావత; (ఉ-మా) ముఖ-పుబ్బ-ఉత్తర-వృషభ; అశ్వ-రేవ-పూ-భా; ఉభా-గోవీథి; శ్ర-ధ-శత-జరద్గవ; (మధ్యమమార్గ); అనూ-జ్యే-మూల-మృగ; హస్త-విశా-చిత్ర-ఆజ; పూషా-ఉషా-వైశ్వానర; (దక్షిణ మార్గ); భరణ్యాది ముఖాంతము ఉత్తర మార్గము. పూర్వఫల్గున్యాది మూలాంతము మధ్యమమార్గము; పూర్వాషాఢాదిగ ఆశ్విన్యంతము దక్షిణమార్గము - అని వరాహ మిహిరుడు'' అని.

అపమండలపు రెండు అంచుల నడుమ దూరము-లేదా అపమండల వృత్తవ్యాసము-ఇరువది యొక లక్షల మూడు వందల ముప్పది యోజనములు;

కాష్ఠయో ర్లేఖయోశ్చైవ అయనే దక్షిణోత్తరే | తద్వక్ష్యామి ప్రజ్ఖ్యాయ యోజనై స్తన్నిబోధత. 64

ఏకైక మన్తరం తద్వ దుక్తాన్యేతాని సప్తభిః | సహసై#్ర రవియుక్తాని తతోన్యైః పఞ్చవింశతిః. 65

లేఖయోః కాష్ఠయోశ్చైవ బాహ్యాభ్యన్తరయో శ్చర& | అభ్యన్తరం స పర్యేతి మణ్డలా న్యుత్తరాయణ. 66

బాహ్యతో దక్షిణచవ సతతం సూర్యమణ్డలమ్‌ | చర న్పశ్చాదుదీచ్యాంతు అశీతిం మణ్డలం శతమ్‌. 67

తరణిర్దక్షిణ తావ ద్భ్రమతే మణ్డలానితు | ప్రమాణం మణ్డలస్యాపి యోజనానాం నిబోధత. 68

యోజనానాం సహస్రాణి దశచాష్టౌ తత స్స్మృతః | అధికా న్యష్టపఞ్చాశ ద్యోజనానితు వైపునః. 69

విష్కమ్భో మణ్డలసై#్యవ తిర్యక్సతు విధీయతే | అహస్తు చరతో నాభే స్సూర్యోవై మణ్డలక్రమాత్‌. 70

కులాలచక్రపర్యన్తో యథా చక్రీ రవి స్తథా | దక్షిణ చక్రవత్సూర్య స్తథా శీఘ్రం నివర్తతే. 71

తస్మా త్ప్రకృష్టాం భూమింతు కాలేనాల్పేన గచ్ఛితి | సూర్యో ద్వాదశభిశ్శీఘ్రం ముహూర్తై ర్దక్షిణాయనే. 72

త్రయోదశార్ద మృక్షాణాం మధ్యేచాంతర మణ్డలమ్‌ | ముహూర్తైస్తాని ఋక్షాణి తావదష్టాశై శ్చర& . 73

కులాలచక్రమధ్యస్థో యథా మన్దం ప్రసర్పతి | ఉదగ్యానే తథా సూర్య స్సర్పతే మన్దవిక్రమః. 74

తస్మా ద్దీర్ఘేణకాలేన భూమిం సోల్పాం ప్రసర్పతి | సూర్యో ద్వాదశభి శ్శీఘ్రం ముహూర్తై ర్దక్షిణాయనే. 75

సూర్యోష్టాదశభి రహ్నో ముహూర్తై రుదగాయనే | త్రయోదశార్ధం మధ్యేతు కాష్ఠానాం చరతే రవిః. 76

ముహూర్తై స్తాని ఋక్షాణి రాత్రౌ ద్వాదశభి శ్చర& | తతో మన్దతరం తాభ్యాం చక్రంతు భ్రమతే తతః. 77

ఉత్తరాయన దక్షిణాయన రేఖల నడుమ అపమండలపు బయటి అంచులకు సమాంతరముగా ఉండుచోట ఏడు వేల ఇరువది యైదు యోజనము లుండును. రవి అపమండలపు అంచులను దాటక ఉత్తరాయన దక్షిణాయన రేఖల నడుమ సంచరించుటతో ఉత్తరాయనమున ఈ మండలమునకు లోపలివైపుగాను దక్షిణాయనమందు ఈ మండలమునకు వెలుపలగాను సంచరించును. అతడు చేయు మండల వ్యాస పరిమాణము (180భా.) పదునెనిమిది వేల ఏబది ఎనిమిది యోజనములు. సూర్యుడు పగళ్లయందు ధ్రువుని చక్రనాభిగా చేసికొని కులాలచక్రము (కుమ్మరి సారె) తిరుగునపుడు ఆ చక్రపు అంచు ఆ చక్రపు నాభిపై ఆధారపడియు ఒకవైపు క్రిందికి వాలుచు మరియొక వైపు పైకి లేచుచు తిరుగునట్లు తిరుగుచుండును. దానిచే రవి దక్షిణాయనమున ఎక్కువ దూరమనును తక్కువ కాలములోనే అతిక్రమించును. అనగా పదుమూడున్నర నక్షత్రము లంత దూరమను (180 డిగ్రీలు) పండ్రెండు ముహూర్తముల కాలములోనే సంచరించును. ఉత్తరాయనమునందు గమనవేగము తగ్గి రవి ఇదే పదుమూడున్నర నక్షత్రముల దూరమును దాటుటకు పదునెనిమిది ముహూర్తముల కాలము పట్టును. ఉత్తరాయనమునగాని దక్షిణాయనమునగాని పగటి గతికి పోగా మిగిలిన కాలము రాత్రి గతికి పట్టును. మొత్తము మీద అహోరాత్ర పరిమాణము ముప్పది ముహూర్తములు సరిపోవును. (30 ముహూర్తములు =24 గంటలు)

మృత్పిణ్డివ మధ్యస్థో భ్రమతే7సౌ ధ్రువ స్తథా | ముహూర్తై స్త్రింశతా తావ దహోరాత్రం ధ్రువో భ్రమ& . 78

ఉభయోః కాష్టయోర్మధ్యే భ్రమతే మణ్డలానితు | ఉత్తరక్రమణా త్తస్య దివా మన్దగతి స్తతః. 79

తసై#్యవతు పునర్నక్తం శీఘ్రా సూర్యస్య వైగతిః | దక్షిణక్రమేణాచాపి దివా శీఘ్రం విధీయతే. 80

గతిస్సూర్యస్య వై నక్తం మన్దాచాపి పునస్స్మృతా | ఏవం గతివిశేషేణ విభజ న్రాత్య్రహానితు. 81

అథ (జ) వీథ్యాం దక్షిణాయాం లోకాలోకన్య చోత్తరే | లోకసన్తానతో హ్యేష వైశ్వానరపథా ద్బహిః. 82

వృష్ఠే యాతు ప్రభా సౌరీ పురస్తాత్సమ్ప్రవర్తతే | పార్శ్వేభ్యో బాహ్యతస్తావ ల్లోకాలోక స్సపర్వతః. 83

యోజనానాం సహస్రాణి దశోర్ధ్వం చోచ్ఛ్రితో గిరిః | ప్రకాశ శ్చాప్రకాశశ్చ సర్వతః పరిమణ్డలమ్‌. 84

నక్షత్రచన్ద్రసూర్యాశ్చ గ్రహా స్తారాగణౖ స్సహ | ఆభ్యన్తరే ప్రకాశ##న్తే లోకాలోకస్య వైగిరేః. 85

ఏతావానేవ లోకస్తు నిరాలోక స్తతఃపరమ్‌ | లోక ఆలోకనే ధాతు ర్నిరాలోక స్త్వలోకతః. 86

కాలభాగాదికథనమ్‌

లోకాలోకౌతు నన్ధత్తే యస్మా త్సూర్యః పరిభ్రమ | తస్మా త్సన్ధ్యేతి తామాహు రుషా వ్యుష్యో రథాన్తరమ్‌. 87

ఉషా రాత్రిః స్మృతా విపై#్ర ర్వ్యుషాచాపి దినం స్మృతమ్‌ | త్రింశత్కలా ముహూర్తస్తు అహస్తే దశ పఞ్చ చ. 88

హ్రాసో వృద్ధి రహర్భాగై ర్దివసానా మథో భువి | సంధ్యా ముహూర్తమాత్రాయా హ్రాసవృద్ధీతు తే స్మృతే. 89

లేఖాప్రభృత్యథాదిత్యం త్రిముహూర్తం విదుర్బుధాః | ప్రాతఃకాల మథో విప్రా భాగశ్చాహ్న స్స పఞ్చమః. 90

తస్మాత్సఙ్గవకాలోహి ముహూర్తా స్సఙ్గతా స్త్రయః | మద్యహ్నే త్రిముహూర్తాశ్చ తస్మాత్కాలా దనన్తరమ్‌. 91

తస్మా న్మధ్యన్దినా త్కాలా దపరాహ్ణ ఇతి స్మృతః | త్రయ ఏవ ముహుర్తాస్తు సన్ద్యాకాలః స్మృతో బుధైః. 92

అపరాహ్ణే వ్యతీతేతు కాల స్సాయం తదుచ్యతే | దశ పఞ్చ ముహూర్తా7హ్నో ముహూర్తా స్త్రయ ఏవచ. 93

దశపఞ్చముహూర్తావై అహస్తు విషువం ఇతి స్మృతమ్‌ | వర్ధత్యహో రాత్రభూతో అయనే దక్షిణోత్తరే. 94

అహస్తు గ్రసతే రాత్రిం రాత్రిస్తు గ్రసతే త్వహః | శరద్వస న్తయోర్మధ్యే విషువంతు విధీయతే. 95

ఆలోకత స్స్మృతో లోక అలోకో7లోక ఉచ్యతే | లోకపాలా స్థ్సితా స్తస్య లోకాలోకస్య మధ్యతః. 96

రవి ఇట్లు కుమ్మరి చక్రపు అంచువలె క్రిందికి మీదకు వాలుచు లేచుచు తిరుగుచుండినను ఈ జ్యోతిర్మండలమునకు కేంద్ర స్థానమున చక్రపు నాభివలె నున్న ధ్రువుడు మాత్రము కుమ్మరి సారె నడుమ నాభిపై కుండ చేయుటకై ఉంచిన మట్టి ముద్దవలె వాలుట లేచుటలు అంతగా లేక గమనింప సాధ్యముకాని తక్కువ వేగమున తిరుగుచుండును. ఐనను అతడును అపమండలపు రెండు అంచులకు నడుమ మండలాకృతి నేర్పరచు భాగల గతితో కొలదిగ వాలుచు లేచుచు తిరుగుచుండును. అతని ఈగతి భేదము వలననే అతనితో బంధింపబడి చక్రపుటంచువలె తిరుగు సూర్యుని గతి ఉత్తరాయనమున పగలు మందముగను రాత్రి చురుకుగను దక్షిణాయనమున పగలు చురుకుగను రాత్రులందు మందముగను సాగును.

ఇట్లు రాత్రింబవళ్ళను తన గతి విశేష వశమున విభజించుచు రవి దక్షిణమందలి అజ వీథియందు లోకాలోక పర్వతమునకు ఉత్తరమున లోక వ్రేణికి వెలపలను వైశ్వానరవీథికి వెలుపలను కూడ సంచరించుచుండును. సూర్యుడు లోకాలోక పర్వతమునకు వెనుకవైపున నున్నపుడు అతని కాంతి ముందు వైపున ప్రసరించును. ఈ చెప్పిన అజవీథి మొదలగు వానికి ప్రక్క అంచుట కవతలగా లోకాలోక పర్వతము ఉన్నది. దాని ఎత్తు పదివేల యోజనములు నక్షత్రములు చంద్రసూర్యలు గ్రహములు మొదలగు జ్యోతిర్గోళములన్నియు ఈ లోకాలోక పర్వతమునకు లోపలివైపున మాత్రమే సంచరించగలవు; తమ వెలుగును ప్రసరింపజేయగలవు. ఈ పర్వతమునకు అవతలివైపు అలోకము (వెలుతురు) లేదు. ఇట్లు దీనికి ఒక వైపున ఆలోకము (చూపు-చూచుటకు అవకాశము.(ప్రకాశము) ఉండుట చేతను మరియొక వైపున అది లేకపోవుట చేతను ఈ పర్వతమునకు లోకాలోకమని పేరు ఏర్పడెను. లోకము-వెలుతురు అలోకము-చీకటి; రవి సంచారము ఈ రెంటికిని నంధానము కలిగించును. కనుక అతనిచే వెలుగు చీకటులకు సంధానము కలిగించబడు సమయమును 'సంధ్యా' కాలము అందురు. ఉషా-వ్యుషా (వ్యుషి) అను సమయముల అంతరమునకు (మధ్యలమునకు) 'సంధ్యా' అని పేరు. ఏలయన-'ఉషా' అనగా రాత్రి; వ్యుషా అనగా పగలు; ఈ రెంటి సంధి కాలము 'సంధ్యా' కాలము; (ఇది వైదిక సంప్రదాయానుగతమగు వ్యుత్పత్తియును అర్థమును.)

ముప్పది 'కల'ల కాల పరిమాణమును ముహూర్తమందరు. పదునైదు ముహూర్తములు దివస పరిమాణము; (ఇది విషువ దినమున), కాని పగటి పరిమాణమునందు పెరుగు తరుగులు వచ్చుటచే ఈ పరిమాణములో మార్పులు ఉండును. సాధారణముగా సంధ్యాకాలము (ఇంచుమించు) ముహూర్తకాలమగును. దాని పరిమాణమునందును కాల భేదమును దేశ భేదమును రవి గతి భేదమును బట్టి మార్పులు కలగవచ్చును.

సూర్యుడు లేఖమీదకు (క్షితిజము = లేఖ = Horizon) వచ్చినది మొదలు మూడు ముహూర్తముల కాలము ప్రాతఃకాలము; తరువాత మూడును సంగవ(మ) కాలము; తరువాత మూడును మధ్యాహ్నము; తరువాత మూడును అపరాహ్ణము; తరువాత మూడును సాయంకాలము; పగటి పరిమాణమునందును రాత్రి పరిమాణమునందును పెరుగు తరుగులు వచ్చినను సాధారణ (విషువ) దిన పరిమాణము ఈ పదునైదు ముహూర్తములే; ఉత్తరాయన దక్షిణాయన క్రమములో దీని మార్పులు లోగడ చెప్పబడినవి. ఆ ఆయన భేదములను బట్టి పగలు రాత్రిని తనలోనికి తీసి కొనుటయు-రాత్రి పగటిని తనలోనికి తీసికొనుటయు జరుగును. శరద్వసంత ఋతువుల నడుమను వసంత శరద్‌ ఋతువుల నడుమను మొత్తము రెండు మారులు విషువ దినములు వచ్చును.

చత్వారస్తే మహాత్మాన స్తిష్ఠన్త్యాభూతసవ్ల్పువమ్‌ | సుధామశ్చైవ వైరాజః కర్దమశ్చ ప్రజాపతిః. 97

హిరణ్యరోమా పర్జన్యః కేతుమా న్రాజసత్తమః | నిర్ద్వన్ద్వో నిరభీమానీ నిర్మమో నిష్పరిగ్రహః. 98

లోకస్యమధ్యే తేపాలా స్థ్సితాస్త్వేతే చతుర్దిశమ్‌ | ఉత్తరం యదగస్త్యస్య శృఙ్గం దేవనిషేవితమ్‌. 99

పితృయాన స్స్మృతః పన్థా వైశ్వానరపథా ద్బహిః | తత్రాసం స్తే ప్రజాకామా ఋషయో హ్యగ్నిహోత్రిణః. 100

లోకస్య సన్తానకరాః పితృయానే పథి స్థితాః | భూతారమ్భకృతం కర్మ హ్యాశిషశ్చ విశామృతే. 101

ఆరభ##న్తే లోకకామా స్తేషాం పన్థా స్సదక్షిణః | చరన్తి తే పరం ధర్మంస్థాపయన్తి యుగేయుగే. 102

సతతం తపసా చైవ చోదనాభిశ్రితేన చ | ఇచ్ఛాద్వేషకృతశ్చైవ మైథునోపగతాశ్చ వై. 103

తథా కామకృతేనైవ సేవనా ద్విషయస్యచ | జాయమానాస్తు పూర్వేచ పశ్చిమానాం గృహేషుతే. 104

పశ్చిమాశ్చైవ పూర్వేషాం జాయన్తే నిధనేష్విహ | ఏవ మార్తమానాస్తే వర్తన్త్యాభూతసవ్ల్పువమ్‌. 105

అలోకము-వెలుగు-కలది-లోకము అనబడును; ప్రకాశములేని దానిని ప్రకాశముకాని దానిని అలోకమందురు. ఇట్టి రెండు స్థితులును కలది లోకాలోక పర్వతము. దీని నడుమ (లోకాలోకమనెడు చక్రవాళ పర్వతమునకు నడుమ) లోకపాలురు నలువురున్నారు. వీరు భూత సంప్లవ-ప్రాకృతిక ప్రళయ-కాలము వరకు ఉండి లోక ప్రవృత్తికి ప్రవర్తకులుగా నుందురు. వీరు ఎవరనగా 1.వైరాజుడు-విరాట్తత్త్వమునుండి జనించిన-సుధాముడు 2.కర్దమ ప్రజాపతి- 3.హిరణ్యరోముడనెడు పర్జన్యుడు 4.కేతుమాన్‌-అను రాజశ్రేష్ఠుడు అనువారు; వీరిలో ప్రతియొకరును ద్వంద్వములకు సంబంధించిన చిత్తవృత్తులును వానివలని బాధలును లేని ద్వంద్వాతీతులు; అహంకార మమకారాద్యభిమానములు లేనివారు; పరిగ్రహము-తమకు ఇదిలేదని ఏ వస్తువునైన ఒకరినుండి అడిగి కాని అడుగకయేకాని తీసికొనుట-లేనివారు; వీరు ఈలోక మధ్యమందు చతుర్ధిశలయందుండి లోక ప్రవృత్తి నిర్వర్తించుచుందురు.

ఉత్తర దిశయందు దేవతల కాశ్రయమగు అగస్త్య శృంగముకలదు. అది వీరికాశ్రయము. వీరందరును ప్రవృత్తి మార్గ ప్రవర్తకులై పితృయాన పథ ప్రవృత్తులై యుందురు. ఆ ప్రవృత్తికి మూలమయినదే ఈ కాలవ్యవస్థయును కాలనియమము నాశ్రయించిన కర్మ వ్యవస్థయును. ఈ ఖగోళ వ్యవస్థను తెలియుట వలన ఒక ప్రయోజనము ఈ కర్మ మార్గ ప్రవృత్తి.

ఈ యంశమును సంప్రదాయము ఇట్లు ప్రతిపాదించుచున్నది.

వైశ్వానర పథమునకు వెలుపల పితృయాణమను మార్గము కలదు. ప్రజాకాములు (తమకు పుత్ర్ర పౌత్రాది సంతతి కావలయునని కోరువారు) అగు అగ్నిహోత్రోపాసకులు (శ్రౌత కర్మానుష్ఠాతలు) అగు ఋషులు ఆ మార్గమునందు ఉందురు. వీరు లోక సంతానకరులు (సంతానము-ఎడతెగక కొనసాగుచుండు) గా నుందురు. వీరు పితృయాణ మార్గమందుండి భూతారంభకారులు (పరమేశ్వర మాయాశక్తి వశమున ఆయా జీవుల కామ కర్మానుసారము భూత భౌతిక సృష్టిని కలిగించునది) అగు కర్మలను ఆచరించుచు తమతమ ఆశిషములను (కామనలను) ఆశ్రయించి తమకు ఆయా ఇహపరలోక సుఖములు కావలెనని కర్మల ననుష్ఠించుచుందురు. వీరు అనుసరించు ఈ ప్రవృత్తి మార్గము దక్షిణ మార్గము. వీరు యుగయుగమున ఉత్కృష్టమగు వైదిక ధర్మమును ఆచరింతురు. దానిని లోకమున ప్రతిష్ఠింతురు. ఈ ధర్మ ప్రవర్తసమునకై తపస్సును (దీనినే జ్ఞానమని శ్రీశంకరభగవత్పాదాదులనిరి.) చోదనాభిశ్రితమయిన కర్మానుష్ఠాన మార్గమును పాటింతరు. ('స్వర్గము కోరువారు జ్యోతిష్టోమయాగముతో దేవతల నారాధించవలెను.' ఈ మొదలగు రూపములతో నుండు కర్మాచరణ ప్రేరణమును చోదన అందురు. ఈచోదన నాశ్రయించిన మార్గము చోదనా7భిశ్రిత మార్గము). వీరి చిత్తములందు ఇచ్ఛా ద్వేషములు-మైథున ప్రవృత్తి-కలవు. వీరు కామమునకు-కర్మానుష్ఠానమునకు వశులై విషయ సుఖములు సేవించుచు ఉత్తమ జీవులు కూడ అధమ జీవుల గృహము (దేహము) లందును జనింతురు; అధమ జీవులును ఉత్తమ జీవుల గృహము (దేహము) లందు జనింతురు; ఈ విధముగ వీరు ప్రాకృతిక ప్రళయము జరుగు వరకు జన్మ మరణ పరంపరలో ఆవృత్తి నొందుచుందురు.

అష్టాశీతిసహస్రాణి ఋషీణాం గృహమేధినామ్‌ | సవితు ర్దక్షిణం మార్గ మాశ్రిత్యాభూతసవ్ల్పువమ్‌. 106

క్రియావతాం ప్రసంఖ్యైషా యే శ్మశానాని భేజిరే | లోకసంవ్యవహారార్థం భూతానాం ప్రకృతేనచ. 107

ఇచ్ఛాద్వేషకృతాచ్చైవ మైథునోపక్రమాచ్చవై | తథా కామకృతేనేహ సేవనా ద్విషయస్యచ. 108

ఇత్యేతైః కారణౖ స్సిద్ధా శ్శ్మశానానీహ భేజిరే | ప్రజైషిణ స్సప్తర్షయో ద్వాపరేష్విహ జజ్ఞిరే. 109

సన్తతిం యే జుగుప్సన్తే తస్మా న్మృత్యు ర్జితస్తు తైః | అష్టాశీతిసహస్రాణి తేషా మప్యూర్ద్వరేతసామ్‌. 110

ఉదక్పంథాన మత్యర్ధ మాశ్రిత్యాభూతసవ్లుృవాత్‌ | అసంప్రయోగా ల్లోకస్య మైథునస్యచ వర్జనాత్‌. 111

ఇచ్ఛాద్వేష నివృత్త్యాచ భూతారమ్భవిసర్జనాత్‌ | ఇత్యేతైః కారణౖ శ్శుద్దై స్తే7మృతత్వంచ భేజిరే. 112

ఆభూతసవ్ల్పువస్థాన మమృతత్వం విభావ్యతే | త్రౌలోకస్థితకాలోహి నపునర్మార్గగామినామ్‌. 113

భ్రూణహత్యాశ్వమేధౌచ పాపపుణ్యనిభౌ పరమ్‌ | ఆభూతసవ్ల్పువాన్తేతు సంక్షయే చోర్ధ్వరేతసామ్‌. 114

ఊర్ద్వాన్తరమృషీభిస్తు ధ్రువో యత్రతు సంస్థితః | ఏత ద్విష్ణుపదం దివ్యం తృతీయం వ్యోమ్ని భాస్కరమ్‌. 115

యత్ర గత్వా న శోచ న్తి తద్విష్ణోః పరమం పదమ్‌ | ధర్మే ధ్రువస్య తిష్ఠన్తి యేతు లోకస్య కాఙిణః. 116

ఇతి శ్రీమత్స్యమహాపురాణ ఖగోళే సూర్యసఞ్చారాదికథనం నామ త్రయోవింశత్యుత్తరశతతమో7ధ్యాయః.

కామనతో హిరణ్య గర్భోపానన చేసినందున సూర్యుని దక్షిణాంశమగు చందలోకమువరకు మాత్రమే పోగలుగు దక్షిణ మార్గాశ్రితులు అగు ఋషులు గృహస్థులగు వారు ఎనుబది వేలమంది యనియు వీరు ప్రాకృతిక ప్రళయ కాలమువరకు ఇట్లు సంసారమున ప్రవృత్తులగుచుందురనియు గణన చేయబడినది. వీరందరును శ్రౌత కర్మానుష్ఠాన పరులయి శ్మశానములను ఆశ్రయించిరి. అది ఎట్లనగా-లోక వ్యవహారమును ప్రవర్తింపచేసి జనులను ఉద్ధరించుటకును భూతముల ప్రకృతి ధర్మములగు త్రిగుణములకును వశులై ఇచ్ఛాద్వేషములకు వశీభూతులయి మైథున ప్రవృత్తియందు ప్రవర్తిల్లి ఆయా ఇంద్రియ ప్రవృత్తులవలన కలిగిన కోరికలకు వశులయి విషయ సుఖముల ననుభవించి వీరందరును కర్మానుష్ఠానము వలన కలుగు సిద్ధిని మాత్రము పొంది శ్మశానములకు (జన్మ మరణ ప్రవాహరూప సంసార గతిని మాత్రము) పొందగలిగిరి. అమృతత్వమును పొందజాలక పోయిరి. ఇట్లు ప్రజాకాలములగు మరీచ్యాది సప్తఋషులు (ప్రజాపతులు) ఇట్లీ లోకమున 'ద్వాపరములయందు' (అపవర్గము కలుగు నిశ్చయము లేని మార్గమునందు) జన్మించిరి.

ఎవరు లోకమునందు తమ పుత్త్ర పౌత్త్రాది రూపమగు సంతానము కొనసాగవలెనను కోరిక లేక సంతతి యనిన అసహ్యపడిరో వారు మృత్యువును జయించి అమృతత్వమును పొందిరి. ఇట్లు ఊర్ద్వరేతస్కులు (తమ రేతస్సును అధోమార్గమున మైథునమునకై వినియోగించనివారు) కూడ ఎనుబది ఎనిమిదివేల మంది కలరు. వీరందరును లోక ప్రవృత్తి హేతువులగు శ్రౌత కర్మానుష్ఠానములను ఆచరించకపోవుట-మైథున ప్రవృత్తిని విడుచుట - ఇచ్ఛాద్వేషములను విడుచుట - భూతారంభమునకు హేతువులగు ప్రవృత్తులను (ఇష్టా పూర్త కర్మాచరణమును) వదలుట - మొదల విధానముల ననుసరించి శుద్ధులై ఉత్తరాయన మార్గమున హిరణ్య గర్భలోకమున చేరి అచ్చట ప్రాకృతిక ప్రళయకాలము వరకు నిలిచియుండి హిరణ్యగర్భునితోపాటు (క్రమశః) ముక్తులై అమృతత్వమును పొందుదురు. భూతసంప్లవకాలము (ప్రాకృతిక ప్రళయము) వరకు హిరణ్యగర్భునియందుండి తరువాత ముక్తి పొందు అమృతత్వమునకు ఆభూతసంప్లవస్థానమగు అమృతత్వమని వ్యవహారము. ఈ ఊర్ధ్వ రేతస్కులగు నిష్కామ కర్మానుష్ఠాతలకు కలుగు ముక్తి ఈ విధమయినది. వీరును నపునర్మార్గగాములే-పునరావృత్తిలేని మార్గమునకు-ముక్తి మార్గమునకు పోవువారే. వీరికిని త్త్రెలోక్య స్థితి హేతు భూతమగు కాల స్వరూప జ్ఞానము కావలసినదే. ఇట్టివారు చేసిన భ్రూణహత్య (సాంగ వేదాధ్యయనము-తద్విహిత కర్మానుష్ఠానము చేసిన ఉత్తమ బ్రాహ్మణుని చంపుట) వలన కలుగు పాపముకాని అశ్వమేధాదుల వలన సంపాదించిన పుణ్యముకాని ప్రాకృతిక ప్రళయము వరకు ఉన్నను ఆ సమయావధితో వీరికవి నశించును. ఊర్ధ్వ లోకముల నడుమ ధ్రువుని లోకమున ఋషులతోపాటు వీరు శాశ్వత స్థితి నొందుదురు. ఇదియే అంతరిక్ష లోకమున (దానికి పైగా సువర్లోకమును) ధ్రువునితో సంబద్ధుడైన భాస్కరుని రూపమున నున్న స్థానము. ఇదియే విష్ణుని తృతీయపాదస్థానము. ఈ విష్ణుని పరమపదమును చేరినవారు జన్మ మరణ జనితమగు శోకమును మరిపొందరు. కాని లోక (సుఖ) కాంక్షులగువారు ధ్రువుని ధర్మ ప్రవృత్తికి-లోక ప్రవృత్తికి-హేతువగు స్థానమును మాత్రము చేరి సుఖింతురు. ఈ తత్త్వమును ఎరుగుటకును ఈ జ్యోతిర్వ్యవస్థా జ్ఞానముపయోగించును.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున ఖగోళ వర్ణనమున సూర్య సంచారాది కథనమను నూట ఇరువది మూడవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters