Sri Matsya Mahapuranam-1    Chapters   

వింశత్యత్తరశతతమోధ్యాయః.

కైలాసాదిపర్వతవర్ణనమ్‌.

సూతః తస్యాశ్రమస్యోత్తరతస్త్రిపురారినిషేవితః | నానారత్నమయై శ్శృంగైః కల్పద్రుమవిభూషితైః. 1

మధ్యే హిమవతః పృష్ఠే కైలాససోనామ పర్వతః | తస్మి న్నివసతి శ్రీమాన్కుబేర స్సహగుహ్యకైః. 2

అప్సరోనుగతో రాజా మోదతే హ్యలకాధిపః | కైలాసపాదసమ్భూతం పుణ్యం శీతజలం శుభమ్‌. 3

మన్దారకుసుమరజః పూరితం దేవసంయుతమ్‌ | తస్మా త్ప్రభవతే దివ్యా నదీ మన్దాకినీ శుభా. 4

దివ్యంచ చన్దనవనం తస్యాస్తీరే మహచ్ఛుభమ్‌ | ప్రాగుత్తరేణ కైలాసం దివ్యసౌగన్దికం గిరిమ్‌. 5

సర్వధాతుమయం దివ్యం సువేల పర్వతంవ్రతి | చన్ద్రప్రభో నామ గిరి స్సాముద్రోదక సన్నిభః. 6

తత్సమీపే సరోదివ్య మచ్ఛోదంనామ విశ్రుతమ్‌ | తస్మా త్ప్రవహతే దివ్యా నదీ త్వచ్ఛోదకా శుభా. 7

తస్యాస్తీరే వనం దివ్యం మహ చ్చైత్రరథం శుభమ్‌ | తస్మిన్గిరౌ నివసతి మాణిభద్ర స్సహానుగః. 8

యక్షసేనాపతిః క్రూరై ర్గుహ్యకైః పరివారితః | పుణ్యా మన్దాకినీ నామ నదీ త్వచ్ఛోదకా శుభా. 9

మహీమణ్డలమధ్యేతు ప్రవిష్టాచ మహాదధిమ్‌ | కౌలాస దక్షిణాప్రాచ్యాం శివం సర్వౌషధిం గిరిమ్‌. 10

మనశ్శిలామయం దివ్యం శబలం పర్వతంప్రతి | లోహితో హేమశృఙ్గస్తు గిరి స్సూర్యప్రభో మహా&. 11

తస్యపాదే మహద్దివ్యం లోహితం సుమహ త్సరః | తస్మా త్ప్రవహతే లోకే లౌహిత్యశ్చ నదో మహా&.

దేవారణ్య మశోకంచ తస్య తీరే మహద్వనమ్‌ | తస్మిన్తిరౌ నివసతి యక్షో మాణిధరో వశీ. 13

సౌమ్యై స్సుధార్మికైశ్చైవ గుహ్యకైః పరివారితః |

నూట ఇరువదవ అధ్యాయము.

కైలాసాది పర్వత వర్ణనము.

(ఈ అధ్యాయమున హిమవత్పర్యతాంశములగు కైలాస పర్వతము మొదలగు పర్వతములును వానినుండి జనించు సరోనదీ సన్నివేశమును మిగుల రమ్యముగను స్పష్టముగను వర్ణింపబడియున్నది. ఇది ఈనాడును ఇట్లే కనబడుచున్నది.)

సూతుడు ఋషులకు ఇంకను ఇట్లు చెప్పెను : ఆ అత్ర్యాశ్రమమునకు ఉత్తరమున హిమవత్‌ పృష్ఠమున త్రిపుర సంహర్తయగు పరమశివుడు అనుభవించి ఆనందించుచుండు కైలాస పర్వతము ఉన్నది. అది కల్పద్రుమ విభూషితములగు నానా రత్నమయ శృంగములతో అలంకృతము దానియందే శ్రీమంతుడగు కుబేరుడు గుహ్యకులతో కూడ నివసించుచుండును. అలకాధిపతియగు రాజరాజు కుబేరుడు అప్సరసలు తన వెంటనుండగా ఆ కైలాసపర్వత పాదమునుండి ప్రభవించు శుభమును పుణ్యమును (పవిత్రమును) మందార (కల్పవృక్ష) పుష్పపరాగ పూర్ణమును దేవ సమాదర పాత్రమునునగు శీతల జలమును అనుభవించి ఆనందించుచుండును. ఆ కైలాసమునుండియే శుభమగు మందాకినీ (దేవగంగా) నది ప్రభవించును. ఆ నదీ తీరమునందే గొప్పదియును శుభమునునగు నందనవనమున్నది.

కైలాసమునకు ఈశాన్యమున దివ్యమగు సౌగంధిక గిరికిని సర్వ గైరిక ధాతుమయమును దివ్యమునగుసువేల పర్వతమునకును చేరువగా సముద్రజలపు కాంతిగల చంద్ర ప్రభమను గిరి కలదు. దాని సమీపమందుకల అచ్ఛోదమను సరస్సునుండి శుభయగు అచ్ఛోదకయను దివ్యనది ప్రవహించును. దాని తీరమునగొప్పదియై దివ్యమును శుభమునగు చైత్రరథవన మున్నది. దానియందు క్రూ(శూ)రులగు గుహ్యకులు తన పరివారముగా యక్షసేనాపతి మణిభద్రుడు తనయనుయాయులతో కలిసి నివసించును. ఈ అచ్ఛోదకానదినే మందాకిని యనియు (కొందరు) వ్యవహరింతురు అది మహీమండల మధ్యమున ప్రవహించి మహోదధిని ప్రవేశించును. (మహోదధితో కలియును)

(దీని తరువాత రావలసిని క్రమముతో తూర్పు దెసయం దేమున్నదియు చెప్పలేదు.

కైలాసా త్పశ్చిమావాచ్యాం కకుద్మానుదితో గిరిః. 14

కకుద్మతిచ రుద్రస్య హ్యుత్పత్తి స్త్రికకుద్మతః| తదఞ్జనం త్రైకకుదం శైలం త్రికకుదంప్రతి. 15

తస్యపాదే మహద్దివ్యం మానసం సిద్ధసేవితమ్‌| తస్మా త్ర్పభవతే పుణ్యా సరయూర్లోకపావనీ. 16

తస్యాస్తీరే వనందివ్యం వైభ్రాజంనామ విశ్రుతమ్‌| కుబేరానుచర స్తస్మి న్ర్పహేతితనయో వశీ. 17

*బ్రహ్మయోని ర్నివసతి రాక్షసోనన్తవిక్రమః| కైలాసా త్పశ్చిమాశాయాం దివ్య స్సర్వౌష

ధిర్గిరిః. 18

అరుణః పర్వతశ్రేష్ఠో రుక్మధాతువిభూషితః| భవస్య దయిత శ్శ్రీమా స్పర్వతో హేమనన్నిభః. 19

______________________________________

* బ్రహ్మధానో

శాతకుమ్భమయై ర్దివ్యై శ్శిలాజాలై స్సమాచితః | శతసఙ్ఖ్యై స్తాపనీయై శ్శృఙ్గై ర్ధివమివోల్లిఖ& 20

ముఞ్జవా న్త్సుమహద్దివ్యో దుర్గశైలో మహోచ్ఛ్రితః | తస్మిన్గిరౌ నివసతి గిరిశో ధూమ్రలోహితః. 21

తస్యమపాదా త్ర్పభవతి శైలోదంనామ వైసరః | తస్మా త్ర్పభవతే పుణ్యానదీ శైలోదకా శుభా. 22

సా దక్షశీతయోర్మద్యే ప్రవిష్ఠా పశ్చిమోదధిమ్‌ | అస్త్యుత్తరేణ కైలాసం శివ స్సర్వౌషధిర్గిరిః. 23

గౌరస్తు పర్వత శ్రేష్ఠో హరిసాలవనంప్రతి | హిరణ్యశృఙ్గ స్సుమహా& దివ్యౌషధిమయోగిరిః. 24

గజ్గోత్పత్తిః

తస్యపాదే మహద్దివ్యం సరః కాఞ్చనవాలుకమ్‌| రమ్యం బిన్దుసరోనామ యత్ర రాజా భగీరథః. 25

గఙ్గార్థీ సతు రాజర్షి రువాస బహులా స్సమాః | దివం యాస్యన్తి మేపూర్వే గఙ్గాతోయాప్లుతాస్థికాః. 26

కైలాసమునకు ఆగ్నేయమున శుభకరమగు సర్వౌషధి గిరికిని మనశ్శిలా (మణిశిల) మయమును దివ్యమును నగు శబల పర్వతమునకును చేరువగా హేమ శిఖరములతో సూర్యునివలె తేజరిల్లు లోహిత మహాపర్వతమున్నది. దాని పాదమున మహాదివ్యమగు లోహితమగను మహాసరస్సు కలదు. దానినుండి లోహిత మహానదము ప్రభవించి లోకమున ప్రవహించును. ఆ సరస్తీరమున అశోకమను దేవ మహావనము కలదు. ఆగిరియందావనమున సౌమ్యులు సుధార్మికులునగు గుహ్యకులు తన పరివారముగా జితేంద్రియుడగు మణిధరుడను యక్షుడు నివసించును.

(దీని తరువాత రావలసిన క్రమములో దక్షిణ దిశయందు ఏమున్నదో చెప్పలేదు.)

కైలాసమునకు నైరృత దిశయందు కకుద్మత్పర్వతము గలదు. త్రికకుద్మంతము (మూడు శిఖరములు కలది) అగు ఆ త్రికకుద్మత్పర్వతపు త్రైకకుదాంజనమను శిఖరమును రుద్రుని ఉత్పత్తి జరిగెను. ఆ పర్వతపు పాదము నందు మహాదివ్యము సిద్ధ సేవితమునగు మానసమను సరస్సు కలదు. దానినుండి పుణ్యయు లోకపావనియునగు సరయూనది (ఇది హరయూ అని అవెస్తాలో పేర్కొనబడినది. ఇపుడిది పడమటి ఆప్ఘన్‌స్తానులో హీరట్‌కు దగ్గరగా హరిరుద్‌ అను పేరుతోనున్నది.) దాని తీరమునందు వైభ్రాజమను ప్రసిద్ధవనము కలదు. దానియందు కుబేరానుచరుడు జితేంద్రియుడు ప్రహేతి అను వాని కుమారుడు అనంత విక్రముడు నగు బ్రహ్మయోని (బ్రహ్మధానుడు) అను రాక్షసుడుండును.

కైలాసమును పశ్చిమమున సర్వౌషధియను దివ్యగిరి కలదు. అచటనే స్వర్ణమయ గైరిక ధాతువులతో విభూషితము అందుచేతనే బంగారువలె కనబడునది శివుని ప్రీతికి పాత్రమయినది దివ్య సువర్ణ శిలా సమూహములతో వ్యాప్తము వందలకొలది బంగారు (వలె ప్రకాశించు) శిఖరములతో ఆకాశమును ఒరయుచున్నదో అనునట్లు తోచు అరుణమను పర్వతశ్రేష్ఠము కలదు. దాని దాపుననే సుమమాదివ్యమగు ముంజవత్పర్వతమును మహోన్నతమగు దుర్గ శైలము కూడ కలవు. ఈ అరుణ పర్వతమందు ధూమ్రలోహిత రూపుడగు శివుడు సన్నిధానము చేసియుండును. ఈ అరుణ పర్వత పాదమునుండి శైలోదమను సరస్సును దానినుండియే శైలోదయనునదియు ప్రభవించును. ఆనది [ఇదియే నేటి అక్సస్‌-(ఇం) చక్షుష్‌-వక్షు (సం) ఆమూదరియా (పార్శీ) నది] దక్ష-శీత-పర్వతముల నడుమగా పశ్చిమ సముద్రమున కలియును.

(ఈ వరుసలో రావలసిన వాయవ్య దిశయందు ఏమున్నదియు చెప్పలేదు)

కైలాసమునకు ఉత్తరమున ఉన్న సర్వౌషధి గిరికిని హరి సాలమను వనమునకును చేరువగా దివ్యౌషధి మయమై గౌర వర్ణముగల హిరణ్య శృంగమను పర్వతశ్రేష్ఠము కలదు. దాని పాదమునందు మహాదివ్యమును కాంచన వాలుకము (బంగారు ఇసుకగలది) రమ్యముఅగు బిందుసరమను సరస్సు గలదు. అచ్చటనే భగీరథుడను రాజర్షి తన పూర్వులు గంగా జలముతో తమ అస్థ్యాదికము తడిసినచో స్వర్గమునకేగుదురను ఆశతో అనేక వత్సరములు తప మాచరించుచుండెను.

తత్ర త్రిపథగాదేవీ ప్రథమందు ప్రతిష్ఠితా | సోమపాదా త్ర్పసూతా సా సప్తధా ప్రవిభజ్యతే. 27

యుపా మణిమయాస్తత్ర చితయశ్చ హిరణ్మయాః | తత్రేష్ట్వా క్రతుభి స్సిధ్దాశ్శక్ర స్సురగణౖ స్సహ. 28

దివ్యచ్ఛాయాపథ స్తత్ర నక్షత్రాణ్యనుమణ్డలమ్‌| దృశ్యత్తే ధాసురా రాత్రౌ దేవీ త్రిపథగాతుసా. 29

అన్తరిక్షం దివంచైవ ప్లావయిత్వా భువంగతా| భవోత్తమాఙ్గే పతితా సంరుద్ధా యోగమాయయా. 30

తస్యాధో బిన్దవః కేచి త్ర్కుద్ధాయాః పతితా భువి | కృతంతు తై ర్బిన్దుసర స్త్వతో బిన్దుసరస్స్మృతమ్‌. 31

తతస్తస్యానిరుద్ధాయా భ##వేన సహసా రుషా | జ్ఞాత్వాతు తస్యాభిప్రాయం క్రూరం దేవ్యాశ్చికీర్షితమ్‌. 32

భిత్త్వా విశామి పాతాళం స్రోతసా గృహ్య శఙ్కరమ్‌| అథావలేపం స జ్ఞాత్వా తస్యాః క్రూరంతు శఙ్కరః. 33

తిరోభావయితుం బుద్ధి రాసీదఙ్గేషు తాం నదీమ్‌ | ఏతస్మిన్నేవ కాలేతు దృష్ట్వా రాజాన మగ్రతః. 34

ధమనీసన్తతంక్షీణం క్షుధావ్యాకులితేన్ద్రియమ్‌| అనేక తోషితశ్చాహం నద్యర్థం పూర్వమేవతు. 35

బుద్ధ్వాస్య వరదానంతు తతః కోపం న్యయచ్ఛత | బ్రహ్మణో వచనం స్మృత్వాయదుక్తం ధారయన్నదీమ్‌.

తతో విసర్జయామాస సంరుద్ధాం స్వేనతేజసా | నదీ భగీరధస్యార్థే తపసోగ్రేణ తోషితా. 37

తతో విసర్జయామాన సప్త స్రోతాంసి గఙ్గయా | త్రీణి ప్రాచీ మభిముఖం ప్రతీచీం త్రీణ్యథైవతు. 38

స్రోతాంసి త్రిపథాయాస్తు ప్రత్యపద్యన్త సప్తధా| నళినీ హ్లాదినీ చైవ ప్లావనీ చైవ ప్రాగ్గతాః. 39

సీతా చక్షుశ్చ సిన్ధుశ్చ తిస్రశ్చైవ ప్రతీచిగాః | సప్తమ్యనుగతా తాసం దక్షిణతు భగీరథమ్‌. 40

తస్మా ద్బాగీరథీ సావై ప్రవిష్టా దక్షిణోదధిమ్‌ | సప్తచైతాః పావయన్తి వర్షంతు హిమసాహ్వయమ్‌. 41

త్రిపథగ (మూడు మార్గముల పోవునది) ఐన గంగ మొదట అక్కడనే ఉండెడిది. ఆమె సోముని (శివ శిరఃస్థిత చంద్రుని) పాదమునుండి వెలువడెను. తరువాత ఆమె ఏడుగా విభాగమందెను. అక్కడ ఇప్పటికిని మణి నిర్మితములగు యూప (యజ్ఞ పశువు నుబంధించు) స్తంభములును హిరణ్మయచితులు (చితి=యజ్ఞ వేదికా వివేషము)ను కలవు. అచట ఇంద్రుడు సురగణములతో కూడి క్రతువులతో యజనము (దేవతారాధనము) చేసి కామితఫల సిద్ధిపొందెను. ఈ విషయమునందే సంప్రదాయము ఇట్లున్నది. నక్షత్రమండలమును ఆశ్రయించి దివ్యచ్ఛాయా మార్గము కలదు. (దీనికే స్వాతీపథమని పేరని శ్రీమద్రామాయణమున కలదు.) ఈ త్రిపథగ రాత్రులందు అంతరిక్షమున కనబడుచునే యున్నది. ఆమె (తన ప్రకాశమను జలముతో) అంతరిక్ష ద్యులోకములను ప్లావనము (ముంచెత్తి తడుపుట) చేసి భూలోకమునకు వచ్చెను. (ఇందుచేతనే ఆమెకు త్రిపథగా=భూపథాంతరిక్ష పథద్యుపథములందు మూడిటియందును నడచునది.) అని వ్యవహారము. అని సంప్రదాయ వచనము.

(భగీరథుని తపః ప్రభావమున) ఆమె మొదట భవుని ఉత్తమాంగమున పడెను. శివుడు తన యోగమాయా శక్తిచే ఆమెనట సంరోధిం(ఆటంకపర)చెను. అందులకై క్రోధము చెందిన ఆమెనుండి కొన్ని బిందువులు క్రిందకు జారి భూమిపై పడెను. వానితో ఏర్పడినందున ఆ సరస్సుకు బిందు సరస్సని నామము.

శివుడు గంగను తన శిరమున నిరోధించగా ఆమె రోషించి క్రూర భావమునంది 'నేనీ నిరోధమును ఛేదించి ప్రవాహవేగమున శివునిగూడ తీసికొని పాతాళమున ప్రవేశింతును.' అని తలచెను. ఆమె అభిప్రాయమునెరిగి శంకరుడానదిని తన శరీరమునందే మరుగు పరచదలచెను. అంతలోనే శివునకు తన ఎదుటనున్న భగీరథుడు కనబడెను. అతడు చిక్కి ఒడలంతయు ధమనులు మాత్రము వ్యాపించి కనబడుచుండెను. అతని ఇంద్రియములు ఆకటితో వ్యాకులములై యుండెను. ఈనది విషయమున ఇతడు తపముచే నన్నిదివరకే మెప్పించెను. నేనతనికి వరమిచ్చితిని. అని స్మరించి ఆదేవుడు తన కోపమును నిగ్రహించుకొని బ్రహ్మవచనమును కూడ జ్ఞప్తికి తెచ్చుకొని నదిని అట్లే నిలిపి పట్టి తన తేజముచే సంరోధింపబడియున్న గంగను వదలివేసెను. ఆమె నదివరకే భగీరథుడు ఉగ్రతపముచే మెప్పించియుండెను. కావున అట్టి ఆమెను గంగ అనుపేరనే సప్తస్రోతస్సులు (ఏడు ప్రవాహములు)గా శివుడు వదలెను.

నళి(ంది)ని-హ్లాదిని-ప్లావని అను మూడు స్రోతస్సులు తూర్పునకను సీత-చక్షుస్‌-సింధు-అను మూడును పడమరకును మరియొకటి భగీరథు ననుసరించి దక్షిణమునకును ప్రవహించెను. ఈ హేతువుననే దక్షిణ సముద్రమున కలిసిన ఈ సప్తమ స్రోతస్సు భాగీరథియైనది. మిగిలిన ఆరింటితోకూడా ఈ ఏడును హైమవత వర్షమనునామాంతరము గల భరత వర్షమును పావితమును స్లావితమును (పవిత్రము చేయబడినది-తడిసి ముంచెత్తబడినది)గా చేయుచున్నవి.

సీతా చక్షుశ్చ సిన్దుశ్చ తిస్రశ్చైవ సుశోభనాః | తా& దేశా న్పావయన్తిస్మ వ్లుెచ్ఛప్రాయాంశ్చ సర్వశః. 42

సశైలా న్కుకురా నన్ధ్రా న్బర్బరా న్యవనాన్తికా& | పుల్కసాశ్చకులుత్థాశ్చ అఙ్గలోక్యాధరాశ్చ యే. 43

హిమవన్తం ద్విధాకృత్వా ప్రవిష్టాః పశ్చిమోదధిమ్‌ | అప్లాక్షాంశ్చ మరూంశ్చైవ కాలకాంశ్చైవ శూలికా&.

ఖరా నావర్తకా ఞ్ఛాకా న్పల్లవా& దరదా ఞ్ఛకా& | ఏతా& జనపదాంశ్చైవ ప్లావయ న్త్యుదధిం గతాః

దరదా న్కుక్కుటాం శ్చైవ గాన్ధారా నౌరసా న్కురూ& | శివపౌరా నిన్ద్రమరూ& శాలీయాంశ్చైవ తేజసా. 46

సైన్ధవారట్టకామ్భోజా న్కుపథా న్భీమగౌరికా& శునోముఖా నుష్ట్రముఖా న్త్సిన్దురేతా న్నిషేవతే. 47

గన్ధర్వా న్కిన్నరా న్యక్షాం స్తథా విద్యాధరోత్తమా& | కలాపాన్గ్రామకాంశ్చైవ తథా కిమ్పురుషార్షపా& 48

కిరాతాంశ్చ పుళిన్దాంశ్చ కురూన్వై భారతానపి | పాఞ్చాలా న్కాశికా న్మత్స్యా న్మాగధాఙ్గాం స్తథైవచ. 49

బ్రహ్మోత్తరాంశ్చ వఙ్గాంశ్చ తామ్రలిప్తాంస్తథైవచ | ఏతా న్జనపదా న్ర్పాప్య గంగా పావయతే శుభా. 50

తతస్తు ప్లావనీ విన్ధ్యే ప్రవిష్టా దక్షిణోదధిమ్‌ | తతస్తుహ్లాదినీ పుణ్యా ప్రాచీమభిముఖా య¸° 51

ప్లాపయన్త్యవకాంశ్చైవ నిషాదానపి సర్వశః | నీవరా న్మూషికాంశ్చైవ తథా నీలముఖానపి. 52

కళిఙ్గదాతికాంశ్చైవ కుశికా& న్త్సర్గభూమికా& | సామణ్డలై స్సము ద్గ(ద్ర)స్య పాదోద్భూతాంశ్చ సర్వశః. 53

తతస్తు నన్దినీచాపి ప్రాచీమేవ దిశం య¸° | కుపథా న్ల్పావయన్తీ సా ఇన్ద్రద్యుమ్న సరఃప్రతి. 54

యథాత్వేష యథాదేశాం శ్చైత్రశఙ్కుపదానపి | మధ్యేనర్షానకఠరా నోష్టప్రావరణానపి. 55

ఇన్ద్రద్వీపసముద్రాన్తే ప్రవిష్టా లవణోదధిమ్‌ |

పడమరగా ప్రవహించు సీత-చక్షుస్‌- (ఇదియే నేటి వక్షు-oxus ఆమూదరియా-అనుపేరుగల నది-లోగడ శైలోదానదియే'వక్షు' అని చెప్పబడినది. అనగా ఇవి ప్రవహించిన ప్రదేశ స్థితిని బట్టి అవి రెండును ఒకటిగా కలిసి పోవుటయో ఒకటి అంతర్వాహినిగా నగుటయో జరిగియుండును.) సింధు-అను మూడు గంగా స్రోతస్సులును వ్లుెచ్ఛ ప్రాయములును పర్వత బహుళములునునగు కుకురాన్ద్రబర్బర యవనాంతిక పుల్కనకులుత్థాంగలోక్యాధరా ప్లాక్ష మరుకాలక శూలిక ఖరావర్తక శఖ పల్లవదరదశక జనపదములను పవిత్రమెనరించుచు ప్రవహించి తుదకు హిమ వంతమున రెండుగా చీలి పోయిపోయి పశ్చిమ సముద్రములో కలియుచున్నది. ఈమూడు ప్రవాహములును మిగిలినవి కూడ మొత్తముమీద దరద కుక్కుట గాంధారౌరస కురు శివపౌరేంద్ర మరుశాలీయ సైంధవారట్టక కాంభోజకుపథ భీమ గౌరిక శునోముఖోష్ట్రముఖ సింధురేత గంధర్వ కింనర యక్ష విద్యాధర కలాప్రగామక కింపురుషార్షప కిరాత పుళింద భారత కురు పాంచాల కౌశిక మత్స్య మతధాంగ బ్రహ్మోత్తరవంగ తామ్ర లిప్త జనపదములను పవిత్ర మొనర్చుచున్నవి.

హ్లాదినియను గంగా ప్రవాహము తూర్పుగ ప్రవహించి యవక నిషాదనీవర మూషిక నీలముఖ కళింగ దాతికకుశిక స్వర్గభూమిక సముద్ర పాద సంజాత జనపదముల వారిని పవిత్రమొనర్చుచున్నది.

నందినియు తూర్పుగనే ప్రవహించి ఇంద్రద్యుమ్న సరఃపరిసరములందలి కుపథములను (ఇరుకు త్రోవలుగల ప్రాంతములను) చైత్ర శంకుపద ఋక్ష కఠరోష్ఠ ప్రావరణ దేశముల నడుమగా ప్రవహించిపోయి ఇంద్రీద్వీప (ఖండ) సమీపమున (ఇంద్రద్వీప-అండమాన్‌ నికోబారు దీవులు కావచ్చును.) సముద్రమున కలియుచున్నది.

తతస్తు ప్లావనీ ప్రాయా త్ర్పాచీ మాశాం జవేన తు. 56

తోమరా న్పావయన్తీస్మ హంసమార్గా న్త్సమూహకా& | పూర్వా& దేశాంశ్చ సేవన్తీ భిత్త్వా సా బహుధా గిరిమ్‌. 57

కర్ణప్రావరణా న్ర్పాప్య గతా సాశ్వముఖానపి | సిక్త్వా సపర్వతమరూ న్గత్వా విద్యాధరా న్య¸°. 58

శమీమణ్డలగోష్ఠంతు సా ప్రవిష్టా మహత్సరః | తాసాం నద్యుపనద్యశ్చ శతశోథ సహస్రశః. 59

ఉపగచ్ఛన్తి తాం నద్యో యతో వర్షతి వాసవః | తీరే వస్వోకసారాయా వనం సురభినామ తత్‌. 60

హిరణ్యశృఙ్గే వసతి విద్వా న్కౌబేరకో వశీ| యజ్ఞా దపేత స్సుమహా నమితౌజా స్సువిక్రమః. 61

తత్ర చాన్యైః పరివృతో విద్వద్భి ర్బ్రహ్మరాక్షసైః | కుబేరానుచరా హ్యతే చత్వార స్తత్సమాశ్రితాః. 62

ఏవమేవతు విజ్ఞేయా సిద్ధిః పర్వతవాసినామ్‌| పరస్పరేణాపి గుణాః ధర్మత. కామతోర్థతః. 63

హేమకూటస్య వృష్ఠేతు సర్పాణాంతు సరస్మ్సృతమ్‌ | సరస్వతీ ప్రభవతి తస్మా జ్ఞ్యోతిష్మతీ(తో)హ్రదాత్‌.

అవగాఢే హ్యుభయత స్సముద్రౌ పూర్వపశ్చిమౌ | నరో విష్ణుపదంనామ నిషదే పర్వతోత్తమే. 65

తస్మా ద్ధ్వయం ప్రభవతి గాన్ధారీచ కులాచ తే | మేరోః పార్శ్వా త్ర్పభవతి హ్రద శ్చన్ద్రప్రభో మహా&.

జమ్బూశ్చైవ నదీ పుణ్యా తస్మా జ్జామ్బూనదం స్మృతమ్‌| పయోదస్తు హ్రదో నీల స్సుశుభః పుణ్డరీకవా&

పుణ్డరీకా పయోదా చ తస్మాద్వై సమ్ర్పసూయతే | పరంతు శీతశైలస్య స్మృత ముత్తరమానసమ్‌. 68

జ్యోత్స్నా చామృతకాన్తాచ తస్మాద్వై సమ్ర్పసూయతే | హ్రదాః కురుష విఖ్యాతాః పద్మమీనకులాకులాః.

నామ్నాతు వైజయానామ ద్వాదశోదధిసన్నిభౌః | తేభ్య శ్శాన్తిశ్చ సన్ధ్యాచ ద్వే నద్యౌ సమ్ర్పసూయతః. 70

ప్లావనియను గంగాశాఖ వేగముతో తూర్పుదెసగా ప్రవహించుచు తోమర-హంసమార్గ-సమూహక-ములను పవిత్రమొనర్చును ఇంకను కొన్ని ప్రాగ్ధేశములకు సేవించుచు పలుతావుల పర్వతమును భేదించుచు పోయి కర్ణప్రావరణ(అ)శ్వముఖ జనుల జనపదములను తడుపుచు పర్వతమరు-ప్రదేశముల మీదుగా విద్యాధర ప్రదేశములచేరి శమీమండల గోష్ఠము అను మహా సరస్సున కలియుచున్నది. ఇంద్రుడు వర్షించు దేశములందుత్పన్నములగు నదులుపనదులెన్నియో త్రోవలో ఈ గంగా శాఖలయందు కలియును.

వస్వోకసార (అమరావతీ?) సమీపమున సురభియను వనము కలదు. హిరణ్యశృంగుడు అనుపేరుగల విద్వాంసుడు జితేంద్రియుడు నగు హిరణ్య శృంగుడను కౌబేరకుడు (భేతాళుడు) యజ్ఞాపేతుడు సుమహాన్‌-అమితౌజస్‌-సువిక్రమ నామములుగల కుబేరానుచరులగు విద్వద్ర్బహ్మ రాక్షసులు నలుగురును ఇట్టివారు మరికొందరును తన పరివారముగా వసించును.

పర్వతవాసులగు జనులు ఇట్టివారితోనే తమ పురషార్థముల సిద్ధింపజేసికొందురు. ధర్మార్థ కామ ప్రవృత్తులలో వారందరు పరస్పరము రెట్టింపై యుందురు.

హేమకూట పర్వత పృష్ఠమున సర్పముల సరస్సు ఒకటి కలదు. ఆహ్రదమునుండి సరస్వతీ-జ్యోతిష్మతీ అను రెండునదులు ప్రభవిల్లి వరుసగా తూర్పు-పడమటి సముద్రములందు కలియుచున్నవి.

నిషధమను పర్వతోత్తమమున విష్ణుపదమను సరస్సు కలదు. దానినుండి గాంధారీ-కులా అను రెండు నదులు ప్రభవించును.

మేరు పార్శ్వమునుండి చంద్రప్రభమను సరస్సును పుణ్యయగు జంబూనదియు ప్రభవించును. జంబూనదినుండి లభించునది కావుననే బంగారునకు జాంబూనదమని వ్యవహారము. పయోదమను నీలహ్రదమును అతి శుభకరమగు పుండరీకహ్రదమును ఆమేరుపార్శ్వమునందే ప్రభవించును. వానినుండి వరుసగా పుండరీకా-పయోదా అను నదులును ప్రభవించును. హిమవంతమునకు ఆవలివైపున ఉత్తరామానసమను సరస్సొకటి మేరు పార్శమునుండి ప్రభవించును. దానినుండి జ్యోత్స్నా అమృతకాంతా అనునదులు రెండు ప్రభవించుచున్నవి.

ఇవికాక మేరు పార్శ్వమునుండియే ప్రభవించినవి సముద్రమువలె విశాలములైనవి పండ్రెండు హ్రదములు వైజయములను నామము కలవి కలవు. అవి ఉత్తరకురు వర్షమునందు ప్రసిద్ధములు. అవి ఎప్పుడును పద్మములతో మీనాది జలచరములతో ఆకులములయి యుండును. వీటినుండి శాంతి-సంధ్యా-అను రెండునదులు ప్రభవించును.

కిమ్ఫురుషాద్యాని యాన్యష్టౌ తేషు దేవో న వర్షతి | ఉద్భిజ్ఞా న్యుదకాన్యత్ర ప్రభవన్తి సరిద్వరాః. 71

వినివిష్ఠాః ప్రతిదిశం నిమ్నగా లవణామ్భసి | ఋషభోబాలకశ్చైవ వజ్రో మైనాక ఏవచ. 72

చన్ద్రకాన్త స్తథా ద్రోణః సుమహాంశ్చ శిలోచ్ఛయః | ఉదగాయతా ఉదీచ్యంతే హ్యవగాడా మహోదధిమ్‌.

చక్రో రుధికరశ్చైవ తథా నారదపర్వతః | ప్రతీచ్య మాగతాస్తేవై ప్రవిష్ఠా లవణోదధిమ్‌. 74

జీమూతో ద్రావణశ్చైవ మైనాకశ్చైవ పర్వతః | ఆయతాస్తే మహాశైలా స్సముద్రం దక్షిణం ప్రతి. 75

వజ్రమైనాకయో ర్మధ్యే విదిశం దక్షిణాపథే| తత్ర సంవర్తకోనామ సోగ్నిః పిబతి తజ్జలమ్‌. 76

అగ్నిస్సముద్రావానస్తు ఔర్వ స్స బడబాముఖః | ఇత్యేతే పర్వతావిష్టా శ్చత్వారో లవణోదధిమ్‌. 77

భిద్యమానేషు పక్షేషు పురా శక్రస్యవై భయాత్‌ | తేషాంతు దృశ్యతే చన్ద్రశ్శుక్లే కృష్ణే సమాకృతిః. 78

తే భారతస్య వర్షస్య సహాయేన ప్రకీర్తితాః | మహాంసి తత్ర దృశ్యన్తే చన్ద్రో నాన్యత్ర చోదితః. 79

ఉత్తరోత్తరమేతేషాం వర్షముద్రిచ్యతే గుణౖః | ఆరోగ్యాయుః ప్రమాణినాం

ధర్మతః కామతోర్థతః. 80

సమర్చితాని భూతాని తేషు ధర్మేణ భాగశః | వసన్తి నానాజాతీని తేషు వర్షేషు తానివై. 81

ఇత్యేవం ధారయద్విశ్వం పృథ్వీం జగదిదం స్థితాః. 81

ఇతి శ్రీమత్స్యమహాపురాణ భూగోళే కైలాసాదిపర్వతకథనం నామ

„sLiaRP»R½Vù»R½òLRiaRP»R½»R½®ªsW 7ధ్యాయః.

ఈ భరతవర్షము కాక మిగిలిన కింపురుషాది వర్షములయందెనిమిదింటను ఇంద్రుడు వర్షించడు. అచట ఉద్భిజ్జమగు-నేలను చీల్చుకొని పైకి వచ్చు నీటి(underground water) తోనే నదులు ప్రభవించి అవి ఆయా దిక్కులందలి సముద్రములందు కలియును.

ఆయా వర్షములందు-

ఋషభ-బాలక-వజ్ర-మైనాక-చంద్రకాంత-ధ్రోణ-పర్వతములు దక్షిణమునుండి ఉత్తరమునకు వ్యాపించి ఉత్తర దిగంతము ఉత్తర సముద్రలోనికి చొచ్చుకొనియున్నవి. చక్ర రుధికర-నారద పర్వతములు పడమటగా సాగి పశ్చిమ సముద్రములోనికి ప్రవేశించినవి. జీమూత ద్రావణ మైనాక పర్వతములు దక్షిణ సముద్రము వైపునకు సాగియున్నవి. వజ్రము మైనాకము అను రెండు పర్వతములు నడిమికి తిన్నగా అగు విదిక్కు (మూల) నందు దక్షిణాపథ పరిసరములలో సంవర్తకుడను సముద్రవాసియగు అగ్ని సముద్రపు నీటిని త్రాగుచుండును. అతనికే ఔర్వుడు-బడబాముఖుడు అనియు వ్యవహారములు.

పూర్వము ఇంద్రుడు తమ రెక్కలు భేదించరాగ అభయము వలన ఈ పర్వతములు (పర్వతములలో)నాలుగు లవణోదధియందు ప్రవేశించెను. ఈపర్వత ప్రదేశములందు చంద్రుడు మానవు శుక్ల కృష్ణపక్షముల రెంటను సమాకృతియై కనబడును. ఈ పర్వతములు నాలుగును భారత వర్షమునకు సహాయకములని (ఉపకారకములని) పెద్దలు చెప్పుచున్నారు. (అది ఎట్లో సంప్రదాయజ్ఞులవలన తెలియదగినది.) వేరు ప్రదేశములందు అతడు ఉదయించకపోయినప్పటికిని ఇచ్చట చంద్రుని అన్ని కాంతులును (ఎల్లప్పుడు) కనబడుచుండును.

ఈ ఎనిమిది వర్షములందును జనులు ఆరోగ్యము ఆయుఃప్రమాణము దర్మార్థకామ ప్రవృత్తులు తత్సిద్ధులు-ఈ విషయములందు ఒకదానికంటెను మరియొకటి రెట్టింపు చొప్పున ఆధిక్యము కలిగియుందురు. ఆ వర్షములన్నిటి యందును ప్రాణులు ధర్మము విషయమున ఆయా సందర్భములలో మేలు తరములయి యుండును. ఆయా వర్షములందు నానాజాతుల భూతములు నివసించుచున్నవి. నానా జాతుల జనులు నివసించుచున్నారు.

ఈ విధమగు ఈ విశ్వమును తనయందు ధరించుచు ఈ భూమి ఇట్టి వర్షాది విభాగములతో ఉన్నది.

(గమనిక: ఈ అధ్యాయము చివర చంద్రుని విషయము చెప్పెడి శ్లోకములలో కొన్ని ప్రతులయందు పాఠములు అర్థమును పూర్ణముగా భేదింపజేయుచున్నది. అనువాదకుడు తాననుసరించిన ప్రతియందలి పాఠముననుసరించి అనువదించుటయైనది- అనువాదకుడు.)

ఇది శ్రీమత్స్యమహాపురాణమున భూగోళ వర్ణనమున జంబూ ద్వీపాంతర్గత భరత వర్షాంతర్గత భరతఖండ వర్ణనమున కైలాసాది పర్వత సంస్థాన వర్ణనము కింపురుషాది వర్షన్థ వివేషవర్ణనమునను

నూట ఇరువదవ యధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters