Sri Matsya Mahapuranam-1    Chapters   

చతుర్దశో త్తరశతతమో7ధ్యాయః.

పురూరవః పూర్వచరితమ్‌.

మనుః చరితం బుధపుత్త్రస్య జనార్దన మయాశ్రుతమ్‌| త్రిధా శ్రదాద్ధవిధిః పుణ్య స్సర్వపాప్రపణాశనః. 1

విమలం చైవ సర్వేషాం ఫలముచ్చై స్తథాశ్రుతమ్‌| కృష్ణాజినప్రదానంచ వృషోత్సర్గం తథైవచ. 2

శ్రుత్వారూపం నరేన్ద్రస్య బుధపుత్త్రస్య మాధవ| కౌతూహలం సముత్పన్నం తన్మమాచక్ష్వ వ్భచ్ఛతః. 3

కేన కర్మవిపాకేన సతు రాజా పురూరవాః|అవాప తాదృశం రూపం గతించ పరమోత్తమామ్‌. 4

దేవాం స్త్రిభువనశ్రేష్ఠా న్గర్ధర్వాంశ్చ మనోరమా&|ఊర్వశీ సఙ్గతా త్యక్త్వా సర్వభావేన తంనృపమ్‌. 5

శ్రీమత్స్యఃశృణు కర్మవిపాకేన యేన రాజా పురూరవాః|

అవాప తాదృశంరూపం సౌభాగ్యమపి చోత్తమమ్‌. 6

అతీతే జన్మని పురా యోయం రాజా పురూరవాః|మద్రవదేశే మహేష్వాసో భూమిపశ్చాక్షుఏ7న్తరే. 7

పూర్వం సర్వైర్న్యపగుణౖ ర్యుక్తః పరపురఞ్జయః|నృపోసౌ ధనవా& జాతః కేవలంరూపవర్జితః. 8

ఋషయః : పురూరవా మ దపతిః కర్మణా కేన సార్థివః |బభూవ కర్మణాకేన రూపవాంశ్చైవ భూతలే. 9

నూట పదునాలుగవ అధ్యాయము

భారతవర్ష వర్ణన విస్తరరూపమయిన పురూరవసుని పూర్వ జన్మ వృత్తాంతము

(ఆలోచించగా ఇచ టపురూరవసుని వృత్తాంతమును తెలుపుమని ఋషులు నూతు నడుగవలసిన ప్రసక్తి లేదు. కాని దీనిని ఒక విధముగ సమర్థింపవచ్చును. ఇచట నవవర్ష వర్ణమున ఇలావృత వర్షము పేర్కొని వివరింపబడినది. దీని కీ పేరు పురూరవసుని తల్లియగు ఇల(పుంస్త్వముఎన ఇలుడు)ను బట్టి వచ్చినదని లోగడ తెలుపబడినది. కావున ఆ పేరు వినగానే ఋషులకు ఇలాపుత్రుడగు పురూరవసుని విషయము విన కుతూహలము కలిగియుండెనని భావింపవచ్చును. మరియు దీని మూలమున భారతవర్షమందలి నదీపర్వతవనాది వర్ణన విస్తరమున కవకాశమును గలదు. పురాణములయందు ఇట్టివి సహజమే)

మనువు మత్స్య నారాయణు నిట్లడిగెను: జనార్ధనా! నేను బుధుపుత్త్రుడగు పురూరవసుని చరితమును మూడు విధములగు శ్రాద్ధముల విధానమును సర్వపాప ప్రణాశకములగు అశ్రాద్ధములన్నింటి అనుష్ఠానమున కలుగు సమున్నత ఫలములను కృష్ఠాజని ప్రధాన వృషోత్సర్గాది ప్రకారమును వింటిని. బుధపుత్త్రుడును నరేంద్రుడునగు పురూరవసుని రూప విషయమును వినినందున నాకు కుతూహలము కలిగి అడుగుచున్నాను. అది నాకు తెలపుడు. ఏ కర్మఫలముగా ఆ పురూరవసుడను రాజు అట్టి పరమోత్తమరూపమును పరమోత్తమగతిని పొందెను? త్రిభువనశ్రేష్ఠులగు దేవతలతోను మనోరములగు గంధర్వులతోను కలయికను విడిచి ఊర్వశి ఏలసర్వభావముతో ఆ నృపుని పొందెను? అనగా మత్స్యజనార్ధనుడు మనువుతో ఇట్లు చెప్పెను: ఈ పురూరవోరాజు ఏ కర్మ విపాకమున అట్టి ఉత్తమ రూప సుభగత్వములను ( కామినులకు ప్రీతిపాత్రుడగు సుభగత్వము) పొందెనో వినుము. ఈ పురూరవుడు అంతకు ముందటి జన్మమున చాక్షుష మన్వంతర మున మహా ధానుష్కుడు సర్వ నృపలక్షణ యుక్తుడు శత్రుపుర(ధనరాశి)విజేత ధనవంతుడు అయియును రూపము మాత్రము లేని మద్రదేశ రాజై యుండెను. అతనిని ఋషులు పరూరవుడు తత్పూర్వ జన్మమున మద్రపతిగా నుండి నపుడు అతడు అపుడు రాజగుటకును రూప రహితుడగుటకును మరల రూపవంతుడగుటకును హేతువులగు కర్మ విపాకములేవియని సూతునడిగిరి.

సూతః: ద్విజగ్రామే ద్విజశ్రేష్ఠా నామ్నైవాసీ త్పురూరవాః|

నద్యాః కూలే మహారాజ పూర్వజన్మని పార్థివః. 10

సతు మద్రపతీ రాజా యస్తునామ్నా పురూరవాః|తస్మిన్జన్మ న్యసౌ విప్రో ద్వాదశీషు సదానఘ. 11

తపోష్య పూజయామాస రాజ్యకామో జనార్ధనమ్‌| ద్వాదశృషు చకారాసౌఐ స్నాన మభ్యఙ్గపూర్వకమ్‌. 12

ఉపవాసఫలా త్ర్పాప్తం రాజ్యం మద్రే ష్వకన్టకమ్‌| ఉపోషిత స్సదా7భ్యఙ్గాపూర్వకమ్‌| వర్జనీయం ప్రయత్నేన రూపఘ్నం తత్పరం నృప. 14

ఏతత్తే కథితం తస్య యద్వృత్తం పూర్జన్మని| మద్రేవ్వరత్వే చరితం శృణు తస్య మహీపతేః. 15

తస్య రాజగుణౖ స్సర్వై స్సముపేతస్య భూపతేః| జనానురాగో నైవాసి ద్రూపహీనస్య తస్యవైః. 16

రూపకామ స్సమద్రేశ స్తపసే కృతనిశ్చయః| రాజ్యం మన్త్రిగతం కృత్వా జగామ హిమపర్వతమ్‌. 17

వ్యవసాయద్వితీయస్తు పద్భ్యామేవ మహాయశాః| ద్రష్టుం స తీర్థసదనం పర్వతస్యాస్య మస్తకే. 18

ఉగ్రం తవ స్తప్తుమిచ్ఛూ రాజావై న పురూరవాః| ఇరావతీతి విఖ్యాతా మవశ్య త్సుమనోహరామ్‌. 19

తుహినగిరిభవాం మహోగ్రవేగాం తుహినగభస్తిసమానశీతలామ్‌|

తుహిననదృశరమ్యవర్ణకాన్తాం తుహినయశా స్సరితం దదర్శ రాజా. 20

ఇతి శ్రీమత్స్యమహాపురాణ భూగోళే పురూరవసో హివద్గమనం

నామచతుర్దశోత్తరశతతమో7ధ్యాయః.

సూతుడు ఋషులకిట్లు చెప్పసాగెనుః ఈ బుధపుత్ర పురూరవనునకు మద్రపతిగా నున్నపుడును పురూరవసుడనియే నామము. అతడంతకు ముందటి జన్మమున ఒకనదీ తీరమందలి ఒక బ్రాహ్మణ గ్రామమున పురూరవసుడను పేరుగల ద్విజ శ్రేష్ఠుడయి యుండెను. ఆ జన్మమునందా విప్రుడు రాజత్వమును కోరి నిరంతరము ద్వాదశుల యందుపవసించుచు జనార్ధను నారాధించెడివాడు. కాని ఆ ఉపవాన దినములందు అభ్యంగ(తలయంటు) స్నానమాడెడివాడు. ఆ వ్రత పుణ్యమున రెండవ జన్మమున మద్రరాజై జన్మించెను. కాని ఉపవాస దినాభ్యంగ దోషమున రూపహీనుడయ్యెను. కావున ఉపవాస దినమున అభ్యంగ స్నానమాడరాదు. ఇది ఈ బుధపుత్ర పురూరవనుడు మద్రపతియగు పురూరవసుడుగా నగుటకు పూర్వ జన్మమందలి విప్ర పురూరవగనుని వృత్తాంతము. ఇక మద్రపతిగానున్న యతని వృత్తాంతము వినుడు. అతడు సర్వ రాజగుణ యుక్తుడైనను రూపహీనుడగుటచే నతని విషయమున రాజ్య జ నులకు అనురాగము లేకుండెను. అందున అతడు రూపార్థియై తపమాచరించగోరి రాజ్యమును మంత్రుల కప్పగించి హిమాలయమునకు ఏగెను. ఉగ్ర తపమాచరించగోరి నిర్మల కీర్తియగు ఆ రాజు తన దృఢ సంకల్ప మాత్రము తోడుగా పాదచారియై ఆ పర్వత శిఖరమునందు తపమున కనుకూలమగు తీర్థ స్థానము వెదుకగోరి పోగాపోగా సుమనోహరమై హిమవంతమున పుట్టిన ఇరావతి (ఐరావతి-రావినది) అనునది కనబడెను. ఆనది మహోగ్రవేగము చంద్ర సమాన శీతలయ హిమ నమాన కాంతియుక్తయునై యుండెను.

ఇది శ్రీమత్సమహాపురాణమున భూగోళ వర్ణమున జంబూద్వీపాంతర్గత భారతవర్ష వర్ణమున పురూరవః పూర్వచరితమగు నూట పదునాలుగు అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters