Sri Matsya Mahapuranam-1    Chapters   

శతతమో7ధ్యాయః.

స్నానవిధిః.

నన్దికేశ్వరః: నైర్మల్యం భావశుద్ధిశ్చ వినా స్నానం న విద్యతే l తస్మాన్మనోవిశుద్ధ్యర్థం స్నానమాదౌ విధీయతే. 1

అనుద్ధృతై రుద్ధృతైర్వా జలై స్స్నానం విధీయతే l తీర్థం ప్రకల్పయే ద్విద్వా న్మూలమ న్త్రేణ మన్త్రవిత్‌. 2

నమో నారాయణాయేతి మూలమన్త్ర ముదాహృతమ్‌ l దర్భపాణస్తు విధినా త్వాచాన్తః ప్రయతశ్శుచిః. 3

చతుర్హ స్తసమాయుక్తం చతురశ్రం సమన్తతః l ప్రకల్ప్యా వాహయే ద్గజ్గా మేభిర్మన్త్రెః పృధక్పృధక్‌. 4

విష్ణుపాద ప్రసూతా7సివైష్ణవీ విష్ణుదేవతా l పాపిన స్త్వేనస స్తస్మా దాజన్మమరణాన్తికాత్‌. 5

తిస్రఃకోట్యోర్ధకోటీచ తీర్థానాం వాయుర బ్రవీత్‌ l దివి భుమ్యన్తరిక్షేచ తాని తేసన్తి జాహ్నవి . 6

నన్దినే త్యేవ తద్బూమౌ దేవేషు నళినీతిచ l దక్షా పృథ్వీచ విహగా విశ్వకామా శివప్రదా. 7

విద్యాధరా సుప్రసన్నా తథా విశ్వప్రసాదినీ l క్షేమ్యాచ జాహ్నవీ చాథ తథా శాన్తిప్రదాయిని .8

ఏతాని పుణ్యనామాని స్నానకాలే ప్రకీర్తయేత్‌ l భ##వే త్సన్నిహితా తత్ర గజ్గా త్రిపథగామినీ. 9

సప్తవారాభిజప్తేన కరమ్పుటయోజితమ్‌ l మూర్ద్నికుర్యా జ్జలం భూయ స్త్రి చతుఃపఞ్చసప్తవా. 10

స్నానం కుర్యా న్మృదా తద్వ దామన్త్ర్యాను విధానతః l అశ్వక్రాన్తే రథక్రాంతే విష్ణుక్రాన్తే వసున్ధరే. 11

మృత్తికే హన మే పాపం యన్మయా దుష్కృతం కృతమ్‌ l ఉద్దృతాసి వరాహేణ కృష్ణేన శతబాహునా.

నమస్తే సర్వలోకానాం ప్రభవారణిసువ్రతే l ఏవం స్నాత్వా తతః పశ్చాదాచమ్యాథ విధానతః. 13

ఉత్థాయ వాససీ శుక్లే శుద్ధేచ పరిధాయవై l తతస్తు తర్పణం కుర్యా త్త్రై లోక్యాప్యాయనాయవై. 14

నూరవ అధ్యాయము.

స్నానవిధి.

మనో నిర్మలత్వమును మనఃశుద్ధియు స్నానము లేనిదే కలుగవు. కావుననే పెద్దలు స్నానమును మొదటి దానిగా విధించిరి. పైకి తీయని(నదుల) నీటితోగాని తీసిన (బావుల) నీటితోగాని స్నానము చేయవచ్చును. మొదట సంప్రదాయము నెరిగి 'నమో నారాయణా య' అను మూలమంత్రముతో తీర్థకల్పనము చేసికొనవలెను. ఎట్లన నాలుగు మూరల కొలతతో చతురస్రముగ తన చుట్టును తీర్థప్రకల్పనము చేసికొని ఈ మంత్రములతో దానియందు గంగ నావాహనము చేయవలెను !'నీవు విష్ణుపాదమునుండి పుట్టితివి; విష్ణు సంబధినివి; విష్ణువే నీ కధిష్ఠానదేవత; కావున అట్టి నీవు అజన్మ మరణముగా మమ్ములను పాపములనుండి రక్షింపుము. వాయుదేవుడు పేర్కొన్న భూమ్యంతరిక్షద్యులోకములందలి మూడున్నర కోట్ల తీర్థములును నీయం దున్నవి . భులోకమున నందిని-ద్యులోకమున నళిని అని నీ పేరులు. ఇవికాక దక్షా-పృథ్వీ- విహగా -విశ్వకామా-శివప్రదా-విద్యాధరా-నుప్రసన్నా-లోకప్రసాదినీ-క్షేమ్యా-జాహ్నవీ-శాంతిప్రదాయినీ(ఆనందము కలిగించునది-పద్మములు కలది- సమర్థురాలు-విశాలమయినది-అకాశమున సంచరించునది-అన్ని కోరికలు తీర్చునది- శుభము ఇచ్చునది- విద్యలను ధరించునది-మిగుల తేటయైనది-లోకములకు ప్రసన్నత-తేటదనము కలిగించునది -క్షేమమ కలిగించునది-జహ్ను మునినుండి వెలికి వచ్చినది-జహ్నుముని కూతురు-శాంతి నిచ్చునది) స్నాన కాలమున ఈ పుణ్య నామములను కీర్తంచుటచేత త్రిపథగా (తూర్పునకు-పడమరకు-పాతాళమునకు-పోవు మూడు త్రోవలు కలది) అగు గంగ సన్నిహితయగును; ఇట్లు స్నానీయ జలమును ఏడుమా ర్లభిమంత్రించి దోసిట నింపుకొన్న ఆ నీటిని మూడు కాని నాలుగుకాని ఐదుకాని సారులు తలపై పోసికొనవలెను.

అట్లే మృత్తికను అభిమంత్రించి అది రాచికొని కూడ స్నానము చేయవలెను. (మంత్రార్థము); అశ్వములచే రథములచే విష్ణునిచే పాదము లుంచబడినదియు ధనమును ధరించునదియు అగు మృత్తికా! నేను చేసిన దుష్కృత సిద్ధపాపములను పోగొట్టుము. వరాహరూపుడు నల్లనివాడు శతబాహుడు నగు విష్ణునిచే ఎత్తబడినావు ; సర్వలోకముల(నెడు అగ్ని ) పుట్టుకకు కారణమవు; నీకు నమస్కారము; ఇట్లు స్నానమాడి యథావిధానముగ అచమించి తెల్లని శుద్ద వస్త్రముల ధరించి త్రిలోక (స్థితదేవతాదుల) తృప్తికై తర్పణము (తృప్తి కలిగించునది) ఈయవలెను.

దేవాయక్షాస్తథా నాగాగన్ద ర్వాప్సరస స్సురాః l క్రూరా స్సర్పా స్సుపర్ణాశ్చ తరవో జజ్గమాఃఖగాః. 15

విద్యాధరా జలధరా స్తథైవాకాశగామిన ః l నిరాధారాశ్చయే జీవా యేచ ధర్మరతా స్తథా. 16

తేషామాప్యాయనాయైత త్క్రియతే జలతర్పణమ్‌ l కృత్వోపవీతం దేవేషు నివీతీతు భ##వేత్తతః. 17

మనుష్యాం స్తర్పయేద్భక్త్యా బ్రహ్మపుత్త్రా నృషీం స్తథా l సనకశ్చ సనన్దశ్చ తృతీయశచ సనాతనః. 18

కపిల శ్చాసురిశ్చైవ వోఢుః పఞ్చశిఖా స్తథాl సర్వే తే తృప్తిమాయాన్తు మద్దత్తేనామ్బునాసదా. 19

మరీచి మత్ర్యజ్గీరసం పులస్త్యం పులహం క్రతుమ్‌ l ప్రదేతసం వసిష్ఠంచ భృగుం నారదమేవచ. 20

దేవా న్బ్రహ్మఋషీ న్త్సర్వాం స్తర్పయే దక్షతోదకైః l అపసవ్యం తతః కృత్వా సవ్యం జాన్వాచ్య భూతలే.

అగ్నిష్వాత్తా స్తథా సౌమ్యా హవిష్మంత స్తథోష్మపాః సుకాలినో బర్హిషద స్తథాన్యే వాజ్యపాః పునః. 22

సంతర్ప్య పితరో భక్త్యా సతిలోదకచందనైః l యమాయ ధర్మరాజాయ మృత్యవే చాంతకాయచ. 23

వైవస్వతాయ కాలాయ సర్వభూతక్షయాయచ l ఔదుంబరాయ దఘ్నాయ నీలాయ పరమేష్ఠినే. 24

వృకోదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ వై నమః l దర్భపాణిస్తు విధినా పితౄన్సంతర్పయేద్బుధః. 25

పిత్రాదీ న్నామగోత్రేణ తథా మాతామహానపి l సంతర్ప్య విధినా భక్త్యా ఇమం మంత్ర ముదీరయేత్‌. 26

యేబాంధవా బాంధవేయా యే7న్యజన్మని బాంధవాః l తేతృప్తి మఖిలా యాంతు యశ్చాస్మత్తో7భివాంఛతి. 27

తతశ్చాచమ్య విధివ దాలిఖే త్సద్మమగ్రతః l అక్షతాభిః నపుష్టాభిః సజలారుణచందనమ్‌. 28

(మంత్రార్థము): దేవ యక్ష నాగ గంధర్వాప్సరః సురక్రూర సర్పసుపర్ణ(గరుడ) తరు(చెట్లు) జంగమ(సంచరించు ప్రాణులు) ఖగ (పక్షులు) విద్యాధర జలధరా (మేఘములు) కాశగామి ప్రాణులు- ఇవి అన్నియును నిరాధార జీవులును ధర్మరతులగువారును తృప్తి నొందుట కీతర్పణ మిచ్చుచున్నాను. అనుచు ఉపవీతముగా (జందెము సవ్యముగా) దేవతర్పణముచేసి పిమ్మట నివీతము జందెము తావళమువలె వేసికొనుట) గా నుండి భక్తితో మనుష్యులకును సనకసనందన సనాతన కపిలాసురివోడు పంచశిఖులనెడు బ్రహ్మపుత్త్రులగు

ఋషులకు మరీచ్యత్య్రంగిరః పులస్త్య పులహక్రతు ప్రచేతో వషిష్ఠ భృగునారదులను దేవర్షి బ్రహ్మర్షులకు అక్షతోదకములతో తర్పణము నీయవలెను. తరువాత అపసవ్యముతో ఎడమ మోకాలిని నేలపై తాకించి అగ్నిష్వాత్త సౌమ్య హవిష్మత్‌ ఊష్మపసుకాలిన్‌ బర్హిషద్‌-ఆజ్యపులుఅనెడు పితృ దేవతా వర్గములకు తన పితరులకు భక్తితోతిలచందనోదకములతో తర్పణ మీయవలెను. ప్రాణుల నియమించువాడు ధర్మముతో రంజింపజేయువాడు మృత్యురూపుడు అంతమొందించువాడు సూర్యపుత్త్రుడు నల్లనివాడు సర్వభూతనాశకుడు ఔదుంబరదఘ్న నీల-పరమేష్ఠి వృకోదర చిత్రచిత్రగుప్త నామములతో వ్యవహరింపబడు నీకు తర్పణమనుచు యమునకు ఆయా నామగోత్రములతో పితృ పితామహ మాతామహాదులకు తర్పణ మిచ్చి ''ఈ జన్మమందో పూర్వజన్మములందో నాకు బంధువులో బంధు బంధువులో అగువారు నా నుండి తృప్తి కోరు పితరు లెవ్వరైనను తృప్తి చెందుదురుగాక!'' యని దర్భపాణియై అందరకు తర్పణ మీయవలెను.

అర్ఝ్యం దద్యాత్పృయత్నేన సూర్యనామాని కీర్తయేత్‌ l నమస్తే విష్ణురూపాయ నమో విష్ణుముఖాయవై. 29

సహస్రరశ్మయే నిత్యం నమస్తే సర్వతేజసే l నమస్తే శివ ! సర్వేశ!నమస్తే సర్వవత్సల!. 30

జగత్య్సామి న్నమస్తే7స్తు దివ్యచందనభూషిత: పద్మాసన! నమస్తే7స్తు దివ్యచందనభూషిత! 31

నమస్తే సర్వలోకేశ! జగత్సర్వం విబోధసే! సుకృతం దుష్కృతంచైవ సర్వం పశ్యసి సర్వగ. 32

సత్యదేవ! నమస్తే7స్తు ప్రసీద మమ భాస్కర! దివాకర! నమస్తే7స్తు ప్రభాకర! నమో7స్తుతే. 33

ఏవం సూర్యం నమస్కృత్య త్రిః కాత్వాచ ప్రదక్షిణమ్‌ l ద్విజం గాం కాంచనం స్పృష్ట్యా తతో విష్ణుగృహం వ్రజేత్‌. 34

ఇతి శ్రీమత్స్యమహాపురాణ స్నానాది- తర్పణ-సూర్యార్ఝ్య

నిరూపణం నామ శతతమో7ధ్యాయః.

తరువాత యథావిధిగా ఆచమించి తన ముందు పద్మమును లిఖించి దానిపై సూర్యనామకీర్తన పూర్వకముగా పుష్పాక్షతరక్తచంనద సహితముగా సూర్యునకు అర్ఝ్యము నీయవలెను. ( నామార్థములు): విష్ణురూపుడు విష్ణుముఖుడు సహస్రకిరణుడు సర్వతేజోరూపుడు శభకరుడు సర్వేశుడు అందరయందు వాత్సల్యము కలవాడు లోకప్రభువు దివ్య చందనభూషితుడు పద్మాసనుడు-కుండలములతో భుజకీర్తులతో భూపితుడు సర్వలోకేశుడు సర్వజగముల మేల్కొలుపు వాడు సర్వసుకృతదుష్కృత సాక్షి సర్వవ్యాపి సత్యదేవుడు తేజోనిర్మాతయగు రవీ! నీకు నమస్సులు-అనుచు రవి కర్ఝ్యము ఇచ్చి ముమ్మారు ప్రదక్షీణించి నమస్కరించి బ్రాహ్మణుని గోవును గోవును బంగారమును తాకి తరువాత విష్ణ్వాలయమునకు పోవలెను.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున స్నాన విధియను నూరవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters