Sri Matsya Mahapuranam-2    Chapters   

త్ర్యశీత్యుత్తరద్విశతతమో7ధ్యాయః.

ధరాదానవిధానమ్‌.

శ్రీమత్స్యః : 

అథాత స్సమ్ర్పవక్ష్యామి ధరాదాన మనుత్తమమ్‌ | పాపక్షయకరం నౄణా మమఙ్గళ్యవినాశనమ్‌. 1

కారయే త్పృథివీం హైమీం జమ్భూద్వీపానుకారిణీమ్‌ | మర్యాదాపర్వతవతీం మధ్యే మేరుసమన్వితామ్‌. 2

లోకపాలాష్టకోపేతాం నవవర్షసమన్వితామ్‌ | నదీనదసమోపేతా మన్తే సాగర వేష్టితామ్‌. 3

మహారత్నసమాకీర్ణాం వసురుద్రార్క సేవితామ్‌ | హేమ్నః పలసహస్రేణ తదర్ధేనాపి శక్తితః. 4

శతత్రయేణ వా కుర్యాద్‌ద్విశ##తేన శ##తేన వా | కుర్యా త్పఞ్చపలా దూర్ధ్వ మశక్తోపి విచక్షణః. 5

తులాపురుషవ త్కుర్యా ల్లోకేశావాహనం బుధః | ఋత్విఙ్మణ్డపసమ్భార భూషణాచ్ఛాదనాదికమ్‌. 6

వేద్యాం కృష్ణాజినం కృత్వా తిలానా ముపరి న్యసేత్‌ | తథా7ష్టాదశధాన్యాని రసాంశ్చ లవణాదికా&. 7

తథా7ష్టౌ పూర్ణకలశా న్త్సమన్తా త్పరికల్పయేత్‌

వితానకంచ కౌశేయం ఫలాని వివిధాని చ. 8

తథాంశుకాని రమ్యాణి శ్రీఖణ్డశకలానిచ | ఇత్యేవం రచయిత్వా తా మధివాసనపూర్వకమ్‌. 9

శుక్లమాల్యామ్బరధరశ్శుక్లాభరణభూషితః | ప్రదక్షిణం తతం కృత్వా గృహీతకుసుమాఞ్జలిః. 10

పుణ్యం కాలమథాసాద్య మన్త్రా నేతా నుదీరయేత్‌ |

రెండు వందల ఎనుబది మూడవ అధ్యాయము.

ధరాదాన విధానము

శ్రీమత్స్యుడు మనువునకు ఇట్లు చెప్పెను: ఇపుడిక అను(అత్యు)త్తమమును మానవులకు అమంగల్య (అశుభ)మును నశింపజేయునదియు పాపక్షయకరమునగు ధరాదానవిధానమును తెలిపెదను. బంగరుతో జంబూ ద్వీపమును అనుకరించు (పోలిన) పృథివీ ప్రతిమను చేయించవలెను. దానియందు మర్యాదా (నాలుగు దిక్కులయందలి అవధి) పర్వతములును నడుమ మేరువును అష్టలోకపాలురును నవవర్షములును నదీ నదుమలును అంతమందు (చివరి హద్దుగా చుట్టును) సాగరమును నుండవలయును. ఈ పృథివీ ప్రతిమ మహారత్న సమాకీర్ణ (వ్యాప్త)మై అష్టవసు

*''ఇంద్రత్వ మభ్యుపగతం క్షయ మభ్యుపైతి

గో-భూమి-లాంగల-ధురంధర-సంప్రదానాత్‌.'' శ్లో. 20.

ఇందు సంప్రదానాత్‌ అనగా ఇచ్చుటవలన అని చెప్పినచో ఇంద్రత్వ క్షయమునకు ఇది హేతువనవలయును; కాని ఇది అసంగతము; 'ఇచ్చుటను బట్టి చూచినచో - ఏతత్సంప్రదానాపేక్షయా' అని అర్థము సంగతము. ఇది తెనుగు కారకము వలెనే యున్నది.

ద్వాదశాదిత్యై కాదశ రుద్ర సేవితమయి యుండవలెను. ఇది వేయియో ఐదువందలో మూడువందలో రెండువందలో ఒకవందయో పలముల బంగరుతోగాని ఐదు పలములకుపైగా ఎంత తూకపు బంగారుతోనైనను అశక్తుడయినను విచక్షణుడై చేయించవలయును; ఇదియెరిగి తులాపురుషదానమందువలెనే లోకపాలావాహనమును ఋత్విజులను మండపమును సంభారములను భూషణములు వస్త్రములు మొదలగువానిని సమకూర్చుకొనవలయును; ఈ పృథ్వీప్రతిమను వేదియందు పరచిన కృష్ణాజినముపై తిలలయందుంచవలెను; దగ్గరలో అష్టాదశధాన్యములను లవణాది రన ద్రవ్యములను అష్టపూర్ణకలశములను పట్టు వితానకము (మేలుకట్టు)ను వివిధ ఫలములను రమ్యములగు అంశుకము (సన్నని మేలగు వస్త్రము)లను శ్రీఖండ శకలము (మంచిగందపు కర్రమొక్క)లను ఉంచవలయును; ఇట్లన్నియు అమర్చి ఈ ప్రతిమకు అధివాసనమును జరిపి తెల్లని వస్త్రములను పూవులనుదాల్చి సర్వాభరణభూషితుడై పుణ్యసమయమురాగానే దోసిటపూవులు తీసికొని ఈ ప్రతిమాదికమును ప్రదక్షిణించి ఈ మంత్రములనుచ్చరించవలయును :

నమస్తే సర్వదేవానాం త్వమేవ భవనం యతః. 11

ధాత్రీచ సర్వభూతానా మతః పాహి వసున్ధరే | వసు ధారయతే యస్మా ద్వసు చాతీవ నిర్మలమ్‌. 12

వసున్ధరా తతో జాతా తస్మా త్పాహి భయా దలమ్‌ | చతుర్ముఖో7పి నో గచ్ఛే ద్యస్మా దన్తం తవాచలే.

అనన్తాయై నమ స్తస్మా త్పాహి సంసార కర్దమాత్‌ | త్వమేవ లక్ష్మీర్గోవిందే శివే గౌరీతి సంస్థితా. 14

గాయత్రీ బ్రహ్మణః పార్శ్వే జ్యోత్స్నా చన్ద్రే రవౌ ప్రభా |

బుద్ధి ర్బృహస్పతౌ ఖ్యాతా మేధా మునిషు సంస్థితా. 15

విశ్వం వ్యాప్య స్థితా యస్మా త్తస్మా ద్విశ్వమ్భరా స్మృతా |

ధృతిః క్షాన్తి: క్షమా క్షోణీ పృథ్వీ వసుమతీ రసా. 16

ఏతాభి ర్మూర్తిభిః పాహి దేవి సంసారసాగరాత్‌ | ఏప ముచ్చార్య తాం దేవీం బ్రాహ్మణభ్యో నివేదయేత్‌.

ధరార్ధంవా చతుర్భాగం గురవే ప్రతిపాదయేత్‌ | శేషం చైవాథ ఋత్విగ్భ్యః ప్రణిపత్య విసర్జయేత్‌. 18

అనేన విధినా యస్తు కుర్యాద్దేమదరాం శుభామ్‌ | పుణ్యకాలేతు సమ్ప్రాప్తే స పదం యాతి వైష్ణవమ్‌. 19

విమానేనార్కవర్ణేన కిఙ్కిణీజాలమాలినా | నారాయణపురం గత్వా కల్పత్రయ మథావిశే(వసే)త్‌. 20

పితౄ న్పుత్త్రాంశ్చ పౌత్త్రాంశ్చ తారయే దేకవింశతిమ్‌ |

ఇతి పఠతియఇత్థం య శ్శృణోతి ప్రసఙ్గా దపి కలుషవితానైర్ముక్తదేహ స్సమన్తాత్‌. 21

దివ మమరవధూభి ర్యాతి సమ్ర్పార్థ్యమానః పర మమరసహసై#్రస్సేవితం చన్ద్రమౌళేః. 21

ఇతి శ్రీమత్స్యమహాపురాణ మహాదానానుకీర్తనే ధరాప్రదానికో నామ

త్ర్యశీత్యుత్తరద్విశతమో7ధ్యాయః.

''వసుంధరా! నమస్తే! సర్వదేవులకును నీవే భవనమవు. సర్వ భూతములకును ధాత్రి (ధరించునది యు - తల్లియు - పోషించునదియు)వి. కావున ఇట్టి నీవుమమ్ము రక్షించుము; వసువును - అనగా బంగారును - ధనమును - అందును. అతి నిర్మలమగు దానిని - ధరింతువు గావున 'వసుంధర' అనబడుచున్నావు; కావున మమ్మునీవు భయముల నుండి మిక్కిలిగా కాపాడుము; అచలా! (కదలనిదానవగు ఓ భూమీ!) చతుర్ముఖుడు కూడ నీఅంతమును అందుకొనజాలడు; కావున అనంతయనబడు నీకు నమః; ఇట్టి దానవు కావున నీవు దయతో మమ్ము సంసారపు బురద నుండి కాపాడుము; గోవిందుని యొద లక్ష్మియు శివునియొద్ద గౌరియు బ్రహ్మయొద్ద గాయత్రియు చంద్రుని యందలి వెన్నెలయు రవియందలి ప్రభయు బృహస్పతియందలి బుద్ధియు మునుల యందలి మేధము నీవేయయి యున్నావు; విశ్వమంతటిని వ్యాపించియున్నావు కావున నీవు 'విశ్వంభర' (విశ్వమంతట నిండి దానిని మోయునది - బిభర్తి) అనబడుచున్నావు; ధృతి - క్షాంతి - క్షమ - క్షోణి - పృథ్వి - వసుమతి - రస - ఈ మూర్తులతోనున్న దేవీ; సంసార సాగరమునుండి నన్ను కాపాడుము.''

ఇట్లు పలికి ఆదేవిని బ్రామ్మణులకీయవలెను; ఎట్లన - అందుసగమో నాల్గవవంతో గురువునకును మిగిలిన దానిని ఋత్విజులకును (సమముగా పంచి) ఇచ్చి నమస్కరించి వీడ్కొన వలయును; ఈ విధముగా పుణ్యకాలము వచ్చినపుడు శుభయగు స్వర్ణ పృథివిని చేయించి దానము చేయువాడు విష్ణు స్థానమందును; రవి సమాన కాంతియు చిరుమువ్వల గములమాలలు కలదియునగు విమానముపై నారాయణపురమేగి అందు కల్పత్రయకాలముండును; పితృ పుత్త్ర పౌత్త్రాదికు లగు ఇరువదియొకతరముల వారిని తరింపజేయును; ఇట్లిది చదివినను ప్రసంగవశముననైన విన్నను పూర్తిగ కలుష సమూహ విముక్తశరీరుడై అప్సరసలు తను ప్రార్థించుచుండు స్వర్గమేగును; అమర సహస్రసంసేవితమగు చంద్రమౌళి (శివ) పురమును పొందును.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున షోడశ మహాదానాను కీర్తనమున ధరా ప్రదానికమను

రెండు వందల ఎనుబది నాలుగవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-2    Chapters