Sri Matsya Mahapuranam-2    Chapters   

పంచసప్తత్యుత్తరద్విశతతమో7ధ్యాయః.

బ్రహ్మాండ దాన విధానమ్‌.

శ్రీ మత్స్యః : అథాత స్సమ్ప్రవక్ష్యామి బ్రహ్మాణ్డవిధి ముత్తమమ్‌| యచ్ఛ్రేష్టం సర్వాదానానాం మహాపాతకనాశనమ్‌. 1

పుణ్యం దిన మథాసాద్య తులాపురుషదానవత్‌| ఋత్త్విఙ్ముణ్డసమ్భార భూషణాచ్ఛాదినాదికమ్‌. 2

లోకేవాహనం తద్వ దధివాసనకం తథా| కుర్యాద్వింశపలాదూర్ధ్వ మాసహస్రాచ్ఛ శక్తితః. 3

కలశద్వయసంయుక్తం బ్రహ్మాణ్డం కాఞ్చనం బుధః| దిగ్గజాష్టకసంయుక్తం షడ్వేదాఙ్గసమన్వితమ్‌. 4

లోకపాలాష్టకోపేతం మధ్యస్థిత చతుర్ముఖమ్‌| శివాచ్యుతార్కశిఖర ముమాలక్ష్మీసమన్వితమ్‌. 5

వస్వాదిత్యమరుద్గర్భం మహారత్న సమన్వితమ్‌| వితస్తే రఙ్గుళశతం యావదాయామవిస్తరమ్‌. 6

కౌశేయ వస్త్రసంయుక్తం తిలద్రోణోపరి న్యసేత్‌| తతాష్టాదశధాన్యాని సమాన్తా త్పరికల్పయేత్‌. 7

పూర్వేణానన్తశయనం ప్రద్యుమ్నం పూర్వదక్షిణ| ప్రకృతిం దక్షిణ దేశే సఙ్గర్షమ మతః పరమ్‌. 8

పశ్చిమే చతురో వేదా ననిరుద్ద మతః పరమ్‌| ఆగ్నిముత్తరతో హైమం వాసుదేవ మతః పరమ్‌. 9

సమన్తా ద్గుడపీఠస్ధా నర్చయే త్కాఞ్చనా న్బుధః| స్థాపయే ద్వవస్త్రసంవీతా న్పూర్ణకుమ్భాన్దశైవతు. 10

రెండు వందల డెబ్బదియైదవ అధ్యాయము.

బ్రహ్మాండ దాన విధానము.

శ్రీ మత్స్యడు మనువునకు ఇట్లు చెప్పెను; ఇపుడిక ఉత్తమమగు బ్రహ్మాండ దానమును తెలిపెదను; వినుము; ఇది సర్వదానములలో శ్రేష్ఠమును మహాపాతక నాశనమును; పుణ్యకరమగు శుభదినమున తులాపురుష దానమందువలెనే ఋత్విజులను మండపమును సంభారములను వస్త్ర భూషణాదికమును ఏర్పరచుకొనవలెను; అట్లే లోకపాలావాహనమును దేవతాధివాసమును జరుపవలయును; ఇరువది పలములకు తక్కువ కాకుండ వేయి పలముల వరకుగల తూకముగల బంగారుతో రెండు కలశములను బ్రహ్మాండమును చేయించవలయును ; అందు అష్ట దిగ్గజములు చతుర్వేద షడ్వేదాంగ లోక పాలాష్టక చతుర్ముఖ శివ విష్ణు రవి ప్రముఖులను పార్వతీ లక్ష్మీ దేవులును అష్ట వసువులును ద్వాదశాదిత్యులును సప్తమరుత్తులును మహారత్నములును ఉండవలయును ;పండ్రెండు మొదలుగా నూరు వలకు అంగుళములు పొడవు వెడల్పులు గల పట్టు వస్త్రమును పరచి దానిపై తిలద్రోణమునుంచి దానిపై ఈ బ్రహ్మాండాదుల నుంచవలయును ;దాని చుట్టును పదునెనిమిది ధాన్యములుంచవలెను; తూర్పున అనంత శయనుడగు నారాయణుని ఆగ్నేయమున ప్రద్యుమ్నుని దక్షిణమున ప్రకృతి దేవిని నైరృతమున సంకర్షణుని పశ్చిమమున నాల్గు వేదములను వాయవ్యమున అనిరుద్ధుని ఉత్తరమున ఆగ్నిని ఈశాన్యమునందు వాసుదేవుని బంగారు ప్రతిమలుగా గుడ పీఠములయందు నిలిపి పూజించవలెను; నూతన వస్త్రము చుట్టిన పూర్ణకుంభములు పది అటనుండవలెను.

దశైవ ధేనవో దేయా స్సహైమామ్బరదోహమాః| పాదుకో పాన హచ్ఛత్ర చామరాసనదర్పణౖః. 11

భక్ష్యభోజ్యాన్న దీపేక్షు ఫలమాల్యానులేపనః| హోమాధివాసనాన్తేతు స్నాపితో వేదపూఙ్గవైః. 12

ఇమ ముచ్చారయేన్మన్త్రం త్రిః కృత్వా7థ ప్రదక్షిణమ్‌| నమోస్తు విశ్వేశ్వర విశ్వదామ విశ్వేశ్వరాధార జగత్సవిత్రే . 13

సప్తర్షిలోకామభూతలేశ గర్భేణ సార్థం వితరాభిరక్షామ్‌| యే దుఃఖితాస్తే సుఖినో ప్రయాన్తు పాపాని చరాచరణామ్‌. 14

త్వద్దానశస్త్రాహతాపాతకానాం బ్రహ్మణ్డదోషాః ప్రళయం వ్రజన్తు| ఏవం ప్రణమ్యామరవిశ్వగర్భం దద్యాద్ద్విజేభ్యో దశదా విభజ్య. 15

భాగద్వయం తత్ర గురోః ప్రకల్ప్య సమం భ##జే చ్ఛేష మనుక్రమేణ| స్వల్పేతు హోమే గురు రేక ఏవ కుర్యా దథైకాగ్ని విధానయుక్త్యా. 16

స ఏవ సమ్పూజ్యతమో7ల్పవిత్తై ర్యతోక్తవస్త్రాభరణాదికేన| ఇత్థం య ఏత దకిలం పురుషో7త్తర కుర్యా ద్రహ్మాణ్డదాన మధిగమ్య మహా ద్విమానమ్‌. 17

నిర్ధూతకల్మషవిశుద్ధతను ర్మురారే రానన్దకత్పద ముపైతి సహాస్పరోభిః| సన్తారయే త్పితృపితామహాపుత్త్ర పౌత్త్ర బన్దు ప్రియాతిథికళత్రశతాష్టకం సః. 18

బ్రహ్మాణ్డదానశకలీకృతపాతకౌఘు మానన్దయేచ్చ జననీం కులమ్‌ ప్యశేషమ్‌| ఇతి పఠతి శృణోతి వా య ఇత్థం సురభవనేషు గృహేషు ధార్మికాణామ్‌. 19

మతిమపిచ దదాతి మోదతే7 సా పమరపతే పర్భవనే సహాస్పరోభిః. 19

ఇతి శ్రీ మత్స్య మహాపురాణ మహాదానాను కీర్తనే బ్రహ్మాణ్డ ప్రదానికో

నామ పంచసప్తత్యుత్తర ద్విశతతమో7ధ్యాయః.

ఈ పది పాడియావులను బంగరు సరిగ వస్త్రములను పాలు పిదుకు పాత్రలను పాదుకలను పాదరక్షలను ఛత్త్ర చామరాసన దర్పణములను భక్ష్య భోజ్యాన్న దీపేక్షు ఫలపుష్ప సుగందానువేపనములను ఈయవలయును; హోమమును దేవతాధివాసమును ముగిసిన తరువాత వేదవిదులగు విప్ర పుంగవుల మంత్రములతో వారిచే స్నానము చేయించబడి యజమానుడు వారిని దేవతలను ముమ్మారు ప్రదక్షిణించి ఈ మంత్రముచ్చరించవలయును ; ''విశ్వేశ్వరా! (విశ్వము స్థానముగా గలవాడా!) విశ్వధామన్‌ ! విశ్వేశ్వరులకు ఆధారమా! జగత్సృష్టికర్తా! సప్తర్షులకును లోకములకును అమరులకును ఈశా! ఈ హిరణ్యయ గర్భముతో కూడిన నూవు మాకు అభి (స్ర విధములగు) రక్షను దయ చేయుము. దుఃఖితులందరును సుఖితులగుదురుగాక! చరాచర ప్రాణుల పాపములు తొలగిపోవును గాక! నీ దానమనెడు శస్త్రములతో మా పాతకములు దెబ్బలుతిని బ్రహ్మాండమందలి దోషములన్నియు నాశమందుగాక!''

ఇట్లు అమర విశ్వగర్భుడగు బ్రహ్మాండాధిపతిని నమస్కరించి ఈ ద్రవ్యమంతయు పది భాగములుగా విభజించి బ్రాహ్మణులకీయవలయును; అందు రెండు భాగములు గురువును మిగిలిన ఎనిమిగి భాగములును ఋత్విజులకు సమానము గాను అనుక్రమముగా పంచవలయును; హోమమును అల్పముగానే ఏకాగ్ని విధానమున జరిపినపుడు గురుడొక్కడే యుండునుగాన అతనినే పూజ్యతమునిగా గ్రహించి యథోక్త వస్త్రాభరణాదికములతో అతని నర్చించవలయును.

ఈ విధమగు విధాన ప్రక్రియతో బ్రహ్మాండ దానమును చేసిన పురుషుడు మహా విమానాశ్రయముగా చేసికొని పాపములు కడిగి వేయబడగా నిర్మలతనుమానసుడై అప్సరసలతో కూడి ఆనందకరమగు మురారి లోకమునంది యందు సుఖములందును ; అతడు పితృ పితామహ పుత్త్ర పౌత్త్ర బందుప్రియాతిథి కళత్రాదులగునూట ఎనిమిది

మందిని కూడ సంసారమునుండియు నరకము నుండియు తరింపజేయును; తన

తల్లి మాత్రమే కాదు- తన అశేషకులము కూడ ఈ బ్రహ్మాండ దానముచే తన పాతకములు నశించతగా తరించి ఆనందమునందును; దీనిని పఠించినను వినినను సురభవనములను సుఖించును; ధార్మికుల గృహములయందు జనించి ధర్మపరుడై జీవించును జనులకు ఉత్తమ మతి నందించి తాను అప్సరలతో కూడి అమరేంద్ర భవనమున ఆనందమందును.

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున మహాదానాను కీర్తనమున బ్రహ్మాండ దానాను కీర్తనమను రెండు వందల డెబ్బది యైదవ యధ్యాయము.

Sri Matsya Mahapuranam-2    Chapters