Sri Matsya Mahapuranam-2    Chapters   

చతుఃసప్తత్యుత్తరద్విశతతమోధ్యాయః.

హిరణ్యగర్భదానవిధానమ్‌.

శ్రీమత్స్యః : 

అథాత స్సమ్ర్పవక్ష్యామి మహాదాన మనుత్తమమ్‌ |నామ్నా హిరణ్యగర్భాఖ్యం మహాపాతకనాశనమ్‌. 1

పుణ్యందిన మథాసాద్య తులాపురుషదానవత్‌ | ఋత్విఙ్మణ్డపసమ్భారభూషణాచ్ఛాదనానిచ. 2

కుర్యా దుపోషిత స్తద్వ ల్లోకేశావాహనం బుధః |

పుణ్యాహవాచనం కృత్వా తద్వ త్కృత్వా7ధివాసనమ్‌. 3

బ్రాహ్మణౖ రానయేత్కుమ్భం తపనీయమయం శుభమ్‌ |

ద్విసప్తత్యఙ్గుళోచ్ఛ్రాయ హేమపఙ్కజగర్భవత్‌. 4

త్రిభాగహీనం విస్తార మాజ్యక్షీరాభిపూరితమ్‌ | దశాస్త్రాణి సరత్నాని తామ్రసూచీం తథైవచ. 5

హేమనాళం సపిష్ట (ట)కం బహిరాదిత్యసంయుతమ్‌ | తథైవావరణం నాభేరుపవీతంతు కాఞ్చనమ్‌. 6

పార్శ్వత స్థ్సాపయే త్తద్వ ద్ధేమదణ్డకమణ్డలుమ్‌ | పద్మాకారం విధానం స్యా త్సమన్తాద్‌ ద్వ్యఙ్గుళాధికమ్‌.

ముక్తావళీసమోపేతం పద్మరాగదళాన్వితమ్‌ | తిలద్రోణోపరిగతం వేదిమధ్యే వ్యవస్థితమ్‌. 8

తతో మఙ్గళశ##బ్దేన బ్రహ్మఘోషస్వరేణచ | సర్వేషధ్యుదకస్నానం స్నాపితో ద్విజుపుఙ్గవైః. 9

శుక్లమాల్యామ్బరధర స్సర్వాభరణభూషితః | ఇమ ముచ్చారయే న్మన్త్రం గృహీతకుసుమాఞ్జలిః. 10

రెండు వందల డెబ్బది నాలుగవ అధ్యాయము.

హిరణ్య గర్భదాన విధానము.

శ్రీమత్స్యుడు మనువునకు ఇట్లు చెప్పెను: ఇంతవరకును మహాదాన షోడశకములో మొదటిదానిని తెలిసికొంటివి; కనుక ఇపుడు ఆ క్రముమలో రెండవదాని విషయము నీకు తెలిపెద వినుము; ఇది హిరణ్యగర్భమను నామముగల అను (మహో) త్తమ మహాదానము; మహాపాతక నాశకము; పుణ్యకరమగు తిథియందు తులాపురుష దానమందువలెనే ఋత్విజులను మండపమును సంభారములను భూషణ వస్త్రాదికమును సమకూర్చుకొని ఉపవసించవలయును; విషయమెరిగి యజమానుడు పుణ్యాహవాచనమును లోక పలకావాహనమును దేవతాధివాసనమును జరిపించవలెను. తరువాత బ్రాహ్మణులచేత అందమగు బంగాపు కడవను తెప్పించవలయును. దానియందు నడిమ బంగరు పద్మపు ప్రతిమయు ఉండవలయును. డెబ్బది రెండంగుళముల ఎత్తును ఇందు మూడవవంతు తగ్గించిన అంగుళముల అడ్డు కొలతతో (నలువది ఎనిమిదంగుళముల వ్యాసముతో) పొట్టలావును కలదై అది యుండవలయును; దానినినేతితోనో పాలతోనో నింపవలయును ;దాని సమీపమున పది విధములగు ఆయుధములు (ఆయుధములు అనగా ఇచట గృహోపకరణములు ;ఈ పదియు ఏవి అనునది సంప్రదాయమున తెలిసికొనవలయును. ) రత్నములు రాగి సూది బంగరు గొట్టము బుట్ట సూర్య ప్రతిమ యుండవలయును; నాభికి ఆవరణమగు మేఖలయు ఉపవీతమును బంగారపువి ఉంచ వలెను; రెండు ప్రక్కలందును బంగరు దండమును కమండలువును ఉంచవలెను ;కడవపై అన్నివైపులను రెండగుంళములకంటె ఎక్కువ పొడవు పరిమాణముగా గల బంగరు పద్మముల ప్రతిమల ఏర్పరచవలెను. ఈ కడవకు ముత్తెముల దండలు వెయవలెను. తామరపూవులకు పద్మరాగ దళములమర్చవలెను; ఈ కడవను నూవులతో నింపిన ద్రోణము (అను తూమెడు కొలత పాత్ర) పై నుంచి ఇదియంతము మండపమందలి వేదీ మధ్యమందుంచవలెను. తరువాత మంగళకర వాద్య వేదధ్వనులతో యజమానుడు బ్రాహ్మణ శ్రేష్ఠులచే సర్వౌషధీ జలముతో స్నానము చేయించుకొని తెల్లని వస్త్రములను పూవులను ధరించి సర్వాభరణభూషితుడై దోసిట పూవులు పట్టుకొని ఈ చెప్పబోవు మంత్రము నుచ్చరించవలయును.

నమో హిరణ్యగర్భాయ హిరణ్య కవచాయచ| సప్తలోకసురాధ్యక్ష జగద్దాత్రే నమోస్తుతే. 11

భూర్లోక ప్రముఖా లోకా స్తవ గర్భే వ్యవస్థితాః| బ్రహ్మదయ స్తథా దేవా నమస్తే విశ్వదారిణ. 12

నమస్తే భువనాధార నమస్తే భువనాశ్రయ| నమో హిరణ్య గర్భాయ పితామహ పితామహ. 13

పర స్త్వమేవ భూతాత్మా భూతే భూతే వ్యవస్థితః| తస్మా న్మాముద్ధరాశేషధుఃఖసంసారసాగరాత్‌. 14

ఏవ మామన్త్ర్య తన్మధ్య మావిశ్యాస్త ఉదఙ్ముఖః| ముష్టిభ్యాం పరిసఙ్గృహ్య ధర్మరాజచతుర్ముఖౌ . 15

జానుమధ్యే సిరః కృత్వా తిష్ఠే దుచ్ఛ్వాసపఞ్చకమ్‌ : గర్భాదానం పుంసవనం సీమన్తో న్నయనం తథా. 16

కుర్యాద్ధిరణ్య గర్భస్య తతస్తే ద్విజపుఙ్గవాః| గీతమఙ్గళ ఘోషేణ గురు రుత్థాపయే త్తతః. 17

జాతకర్మాదికాః కార్యాః క్రియా ష్షోడశ చాపరాః| సూచ్యాదికంచ గురవే దద్యా న్మన్త్ర మిమం జపేత్‌. 18

హిరణ్యగర్భుడు హరిణ్మయ కవచము కలవాజు సప్త లోకములకు అందలి సురలకు అధ్యక్షుడు లోకములను నిర్మించువాడు నగు నీకు హిరణ్యగర్భా !నమస్కారము; భూర్లోకము మొదలగు లోకములును బ్రహ్మాది దేవతలును నీ గర్భమందున్నారు; భువనాధారా! భువనాశ్రయా! హిరణ్యగర్భా! పితామహులకును పితామహా! నమస్తే; భూత భూత మందును ఉండు భూతాత్ముడవు వరుడవు నీవు; కావున ఇట్టి నీవు అశేష దుఃఖ సంసార సాగరమునుండి నన్నుద్దరించుము; ఇట్లు హిరణ్యగర్భుని ఆమంత్రించి మండప మధ్యమును ప్రవేశింతి ఉత్తరాముఖుడై కూర్చుండి ధర్మరాజును చతుర్ముఖును పిడికిళ్ళతో పట్టుకొని మోకాళ్ళు నడుమను తల ఉంచుకొని ఐదు ఉచ్ఛ్వాసములను జరుపగా తరువాత ద్విజ పుంగవులు హిరణ్య గర్భునకు గర్భాదాన పుంసవన సీమంతోన్నయనములనెడు మూడు సంస్కారములను జరుపవలయును; తరువాత అచార్యుడు యజమానుని గీత మంగళ ఘోషములతో అక్కడినుండి లేవదీయవలెను ; తరువాత జాతకర్మాది షోడశ కర్మములను జరుపవలయును; రాగి సూది మొదలగునవి గురువునకు యజమానుడీయవలెను; తరువాత ఈ మంత్రమును పఠించవలయును.

ఓం నమో హిరణ్య గర్భాయ విశ్వగర్భాయ వై నమః| చరాచరస్య జగతో గృహభూతాయ వై నమః.

యథా7హం జనితః పూర్వం మర్త్యధర్మా సురోత్తమ| త్వద్గర్భః సమ్భవాదేవ దివ్యదేహో భవామ్యహమ్‌. 20

చతుర్భిః కలశై ర్భూయ స్తతస్తే ద్విజపుఙ్గవాః| స్నాపయేయుః ప్రసన్నాఙ్గా స్సర్వాభరణభూషితాః. 21

దేవస్య త్వేతిమన్త్రేణ స్థితస్య కనకాసనే| అద్యజాతస్య తే7 ఙ్గాని హ్యాభిషేక్ష్యామహే వయమ్‌. 22

దివ్యేనానేన వపుషా చిరంజీవ సుఖీ భవ| తతో హిరణ్యగర్భంతు తేభ్యో దద్యా ద్విచక్షణః.23

సమ్పూజ్య సర్వభావేన బహుభ్యో వా తదాజ్ఞయా | తత్రో పకరణం సర్వం గురవే వినివేదయేత్‌. 24

పాదుకోపానహచ్ఛత్రచామరనభాజనమ్‌| గ్రామం వా విషయం వా7పి యదన్యద్దయితం భ##వేత్‌. 25

అనేన విధినా యస్తు పుణ్య 7హని నివేదయేత్‌| హిరణ్యగర్భదానం స బ్రహ్మలోకే మహీయతే. 26

పురేషు లోకపాలానాం ప్రతిమన్వన్తరం వసేత్‌| కల్పకోటిశతం యావ ద్బ్రహ్మలోకే మహీయతే. 27

కలికలుషవిముక్తః పూజిత స్సిద్ధసాధ్యై రమరచమరమాలా వీజ్యమానో7 ప్సరోభిః. | పితృశతమథ బన్దూ న్పుత్త్రపౌత్త్రా ననేకా నపి నరకనిమిగ్నాం స్తారయే దేక ఏవ. 28

ఇతి పఠతి య ఇత్థం య శ్శృణోతీహ సమ్యగ్మధురిపురివ లోకే పూజ్యతేసర్వస్తిద్ధెః| మతి మపిచ జనానాం యో దదాతి ప్రియార్థం విబుధపతిజనానాం నాయక స్స్యా దమోఘమ్‌. 29

ఇతి శ్రీ మత్స్య మహాపురాణ మహాదానానుకీర్తనే హిరణ్యగర్భప్రదానికో

నామ చతుః సప్తత్యుత్తరద్విశతతమో7ధ్యాయః.

హిరణ్య గర్భునకు విశ్వగర్భునకు చరాచర జగత్తునకు గృహమగు వానికి నీకు నమస్సు; సురోత్తమా! నేను మొదట మనుష్య ధర్మములతోనే జనించితిని కావున ఇపుడు నీ గర్భమునందు జనించి నేను దివ్యదేహుడనయ్యెదను. ''

తరువాత బ్రాహ్మణ శ్రేష్ఠులు ప్రసన్న దేహులును సర్వాభరణ భూషితులునునయి నలుగురును నాలుగు కలశ ములతో మరల యజమానుని స్నానము చేయింతురు ; చేయించునపుడు వారీ మంత్రము పఠింతురు; "కనకాసనమందు కూర్చున్నవాడవు ఇపుడే పుట్టినవాడవునగు నీ అంగములను మేము 'దేవన్యత్వా' అను మంత్రముతో అభిషేకించుచున్నాము; ఈ దివ్య దేహముతో చిరకాలము జీవించును- సుఖివికమ్ము.''

తరువాత విచక్షుడగు ఆ యజమానుడు హిరణ్య గర్భుని (ప్రతిమను) ఆ విప్రులకు- వారనందరను సర్వభావముతో పూజచేసి - అందరకుగాని ఇతరులకు కూడ మరికొందరకు గాని గరుడ యనుమతితో దానము చేయవలెను ;అచ్చటి సర్వోపకరణములను ఇంకను తనకు ప్రీతికరములగు పాదుకలు చెప్పులు చ్ఛత్రము పీఠము పాత్రమలు గ్రామము - దేశము- మొదలగునవియు ఆచార్యునకు దానము చేయవలయును.

ఈ విధానమున పుణ్య కర ఆ యజమానుడు హిరణ్యగర్భదానము చేయువాడు బ్రహ్మలోకమును పుజ్యుడగును; ఒక్కొక్క లోకపాలుని లోకమునందొక్కొక్క మన్వంతర కాలము వసించును; నూరు కోట్ల కల్పములపాటు బ్రహ్మ లోకమున వసించి పూజలందుకొనును; కలి దోష విముక్తుడై సిద్ధ సాధ్య పూజితుడై అమరలోక చమరీ మృగములనుండి ఏర్పడిన చామర మాలలతో అప్సరలచేత వీజింపబడుచుండును; తానొక్కడే నూరుమంది తమ పితరులను బంధువులను పుత్త్ర పౌత్త్రులననేకులను నరక నిమగ్నులగు కూడజ తరింపజేయును.

దీనిని లెస్సగా చదువువాడును వినువాడును కూడ మధురాక్షస హంతయగు విష్ణువువలె సర్వ సిద్ధపూజితుడగును; హిరణ్య గర్భ ప్రీతిగా ఈ దానము చేయువాడు జనులకు ఉత్తమజ్ఞానము కూడ కలిగించును; విబుధ నాయకులకును నాయకుడును.

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున మహా దానాను కీర్తనమున హిర ణ్య గర్భదానమను

రెండు వందల డెబ్బది నాలుగవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-2    Chapters