Sri Matsya Mahapuranam-2    Chapters   

సప్తత్యుత్తరద్వి శతతమో7ధ్యాయః.

భవిష్య ద్రాజానుకీర్తన ప్రారమ్భః.

ఋషయ: పూర్వో ర్వంశ స్త్వయా సూత సభవిష్యో నివేదితః | సూర్యవంశే నృపా యే తు భవిష్యన్తి హి తా న్వద. 1

తథైవ యాదవే వంశే రాజానః కీర్తవర్ధనాః | కలౌ యుగే భవిష్యన్తి తానపీహ వదస్వ నః. 2

వంశాన్తే జాతయో యాశ్చ రాజ్యం ప్రాప్స్యన్తి సువ్రతాః | బ్రూహి సఙ్‌క్షేపత స్తాసాం యథా భావ్య మనుక్రమాత్‌. 3

సూతః బృహద్బలస్య దాయాదో వీరో రాజా హ్యురుక్షయః | ఉరుక్షయసుతశ్చాపి *వత్సప్యూహో మహాతపాః. 4

వత్సవ్యూహా త్ప్రతివ్యోమ స్తస్య పుత్త్రో దివాకరః | తసై#్యవ మధ్యదేశేతు అయోధ్యా నగరీ శుభా. 5

దివాకరస్య భవితా సహదేవో మహాయశాః | సహదేవస్య భవితా ధ్రువాశ్వో వై మహామనాః. 6

తస్య భావ్యో మహాభాగః ప్రతీపాశ్వశ్చ తత్సుతః | ప్రతీపాశ్వ సుతశ్చాపి సుప్రతీపో భవిష్యతి. 7

మరుదేవః సుత స్తస్య సునక్షత్ర స్తతో7భవత్‌ | కిన్నరాశ్వః సునక్షత్రా ద్భవిష్యతి పర న్తపః. 8

కిన్నరాశ్వా దన్తరిక్షో భవిష్యతి మహామనాః | సుషేమ శ్చాన్తరిక్షాచ్చ సుమిత్రస్యాప్యమిత్రజిత్‌. 9

సుమిత్రజో బృహద్రాజో బృహద్రాజస్య వీర్యవా& | పుత్త్రః కృతఞ్జయో నామ ధార్మికశ్చ భవిష్యతి. 10

*వత్సద్రోహో

కృతఞ్జయసుతో విద్వా న్భవిష్యతి రణజయః | భవితా సఞ్జయశ్చాపి వీరో రాజా రణజయాత్‌. 11

సఞ్జయస్య సుత శ్శాక్యా శ్శాక్యా చ్ఛుద్ధౌదనో నృపః | శుద్ధోదనస్య భవితా సిద్ధార్థః పుష్కల స్సుతః. 12

ప్రసేనజి త్తతో భావ్యః క్షుద్రకో భవితా తతః | క్షుద్రకా త్కులకో భావ్యః కులకా త్సురథ స్స్మృతః. 13

సుమిత్ర స్సురథా జ్జాతో అన్యస్తు భవితా నృపః | ఏతే చైక్ష్వాకవః ప్రోక్తా భవిష్యన్తి కలౌ యుగే. 14

రెండు వందల డెబ్బదియవ అధ్యాయము.

భవిష్యద్రాజానుకీర్తనము.

ఋషులు సూతునిట్లడిగిరి: సూతా! నీవు భవిష్యులగు రాజులతో గూడ వూరు వంశమును మాకెరిగించితివి; సూర్యవంశమునందు రాబోవు రాజులెవరు? యాదవ వంశమునందు కలుగబోవు కీర్తి వర్ధనులను కలియుగమునందు రాబోవు వారిని- వీరి వంశాంతమందు సువ్రతులగు ఏ జాతులవారు రాజ్యమునకు వత్తురో వారి భవిష్యక్రమమును సంక్షేపముగా తెలుపుము; అన సూతుడిట్లు చెప్పసాగెను ; బృహద్బలునకు వీరరాజగు ఉరుక్షయుడు వానికి మహాతపుడగు వత్సవ్యూహుడు వానికి ప్రతివ్యోముడు వానికి దివాకరుడు కలుగుదురు; దివాకరునికి మధ్యదేశమునందు శుభయగు అయోధ్య యను నగరి ఉండును; అతనికి మహాయశుడగు సహదేవుడు అతనికి మహామనుడగు ధ్రువాశ్వుడు అతనికి మహాభాగుడగు ప్రతీపాశ్వుడు అతనికి సుప్రతీపుడు అతనికి మరుదేవుడు అతనికి సునక్షత్రుడు అతనికి పరంతపుడగు కింనరాశ్వుడు అతనికి మహామనుడగు అంతరిక్షుడు అతనికి సుషేణుడును శత్రుజేతయగు సుమిత్రుడునను వారును వారిలో సుమిత్రునకు బ్రహద్రాజుడు అతనికి వీర్యవంతుడును ధార్మికుడనగు కృతంజయుడును అతనికి విద్వాంసుడగు రణజయుడు అతనికి వీరరాజగు సంజయుడు అతనికి శాక్యుడును అతనికి శుద్ధౌదనుడును అతనికి సిద్ధార్థుడును అతనికి పుష్కలుడు అతనికి ప్రసేనజిత్తు అతనికి క్షుద్రకుడు అతనికి కులకుడు అతనికి సురథుడు అతనికి సుమిత్రుడు కలుగుదురు; ఇతడే వీరిలో కడపటివాడు; కలియుగమున కలుగబోవు ఐక్ష్వాకులు వీరు.

బృహద్బలాన్వయా యే తు భవిష్యాః కులవర్ధనాః | నిశ్శేషాః కథితాశ్చైవ నృపా యే వై పురాతనాః. 15

అత్రాసువంశ శ్ల్శోకోయం గీతో విపై#్రః పురాతనైః| "ఇక్ష్వాకూణా మయంవంశ స్సుమిత్రాన్తో భవిష్యతి. 16

సుమిత్రం ప్రాప్య రాజానం సంస్థాం ప్రాప్స్యతివై కలౌ "| ఇత్యేవం మానవో వంశః ప్రాగేవ సముదాహృతః. 17

అత ఊర్ధ్వం ప్రవక్ష్యామి మాగధా యే బృహద్రథాః | పూర్వేణ యే జరాసన్ధా త్సహదేవాన్వయే నృపాః. 18

అతీతా న్వర్తమానాంశ్చ భవిష్యాశ్చ నిబోధత | సఙ్గ్రామే భారతే వృత్తే సహదేవే నిపాతితే. 19

సోమాధి స్తన్య దాయదో రాజా7భూత్స రిగివ్రజే | పఞ్చాశతం తథా7ష్టౌ చ సమా రాజ్య మకారయేత్‌. 20

శ్రుత శ్రవా శ్చతుష్షష్టిం సమా స్తస్యాన్వయే7భవత్‌ | అప్రతీపీ చ షట్త్రింశ త్సమా రాజ్య మకారయత్‌. 21

చత్వారింశ త్సమా స్తన్మా న్మిరామిత్రో దివం గతః | పఞ్చాశతం సమాష్షట్చ సురక్షః ప్రాప్తవా స్మహీమ్‌. 22

బృహత్కర్మా త్రయోవింశ దబ్దం రాజ్య మకారయేత్‌ | శ్యేనజి త్సామ్ప్రతశ్చాయం భోక్తా పఞ్చశతం మహీమ్‌. 23

శ్రుతఞ్జయశ్చ వర్షాణాం చత్వారింశ ద్భవిష్యతి | అష్టావింశతివర్షాణి మహీం సమ్ప్రాప్స్యతే విభుః. 24

అష్టపఞ్చాశతం చాబ్దా న్రాజ్యే స్థాస్యతి వై శుచిః | అష్టవింశ త్సమా రాజా క్షేమో భోక్ష్యతి మేదినీమ్‌. 25

అనువ్రత శ్చతుష్షష్టిం రాజ్యం ప్రాప్స్యతి వీర్యవా& | పఞ్చత్రింశతివర్షాణి సునేత్రో భోక్ష్యతే మహీమ్‌. 26

భోక్ష్యతే నిర్వృతి శ్చేమా మష్టపఞ్చాశతం సమాః | అష్టావింశత్సమా రాజ్యం త్రినేత్రో బోక్ష్యతే తతః. 27

చత్వారింశ త్తథా7ష్టౌచ *మహాసేనో భవిష్యతి | త్రయస్త్రింశత్తు వర్షాణి మహీనేత్రః ప్రకాశ్యతే. 28

ద్వాత్రింశత్తు సమా రాజా సుబలశ్చ భవిష్యతి | రిపుఞ్జయస్తు వర్షాణి పఞ్చాశ్ర త్ప్రాప్యతే మహీమ్‌. 29

ద్వాత్రింశత్తు నృపా హ్యేతు భవితారో బృహద్రథాః | పూర్ణం వర్షసహస్రాత్తు తేషాం రాజ్యం భవిష్యతి. 30

జయతాం క్షత్త్రియాణాం చ బాలకః పారకోభ##వేత్‌. 30

ఇతి శ్రీమత్స్య మహాపురాణ భవిష్యద్రాజాను కీర్తనం నామ

సప్తత్యుత్తరద్విశతతమో7ధ్యాయః.

బృహద్బలుని వంశమున కలిగిన పురాతన రాజులను కలుగబోవు వాలిని నిఃశేషముగ తెలిపితిని; ఈ విషయమందు పురాతనులగు విప్రులు గానము చేసిన అనువంశశ్లోకము ఇది; ఇక్ష్వాకుల ఈ వంశము సుమిత్రునితో అంతమందును; అనగా ఈ సుమిత్రుడు రాజగుటతో ఈ వంశపు అంత్యస్థితి ఏర్పడును; లోగడనే మీకు తెలుపనారంభించిన మనువంశ వృత్తాంతము ఇది; ఇక మీదట మాగధులగు బృహద్రథవంశీయుల నెరింగింతును! లోగడ తెలిపిన జరాసంధును పుత్త్రుడగు సహదేవుని వంశమునందలి భూత వర్తమాన భవిష్యరాజులను తెలిపెదను; భారత సంగ్రామము జరిగి అందు ఈ సహదేవుడు నిపాతితుడు(పడగొట్టబడినవాడు- మృతుడు) కాగా అతని కుమారుడు సోమాధి గిరివ్రజమున మగధ రాజయ్యెను; అతడు ఏబది ఎనిమిదేండ్లు రాజ్యమేలెను; అతని వంశమున శ్రుతవ్రతుడు అరువది నాలుగు ఏండ్లు ఆవ్రతీపి ముప్పది నాలుగేండ్లు

నిరామిత్రుడు నలువది ఏండ్లు సురక్షుడు ఏబదియారేండ్లు బృహత్కర్ముడు ఇరువది మూడేండ్లు రాజ్యమేలి; ఇపుడు శ్యేనజిత్‌ ఏలుచున్నాడు; అతడు ఏబది ఏండ్లు ఏలును; తరువాత శ్రుతంజయుడు నలువది ఏండ్లు విభుడు ఇరువది ఎనిమిదేండ్లు శుచి ఏబది ఎనిమిదేండ్లు క్షేముడు ఇరువది ఎనిమదిఏండ్లు అనువ్రతుడు అరువది నాలుగేండ్లు సునేత్రుడు ముప్పదియైదు ఏండ్లు నిర్వృతి ఏబది ఎనిమిదిదేండ్లు త్రినేత్రుడు ఇరువది ఎనిమిదేండ్లు మహాసేనుడు నలువది ఎనిమిదేండ్లు మహీనేత్రుడు ముప్పది మూడేండ్లు సుబలుడు ముప్పది రెండేండ్లు రిపుంజయుడు ఏబదిఏండ్లు పాలింతురు; ఈ బృహద్రథ వంశీయరాజులు మొత్తము ముప్పది ఇద్దరును వేయియేండ్లు పాలింతురు; పులకుడను వాని కుమారుడు బాలకుడు అగు క్షత్త్రియుడు ఈ వంశపు కడపటి వాని తరువాత తాను రాజగును.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున భవిష్యప్రదాజాను కీర్తనమను

రెండు వందల డెబ్బదియవ యధ్యాయము.

Sri Matsya Mahapuranam-2    Chapters