Sri Matsya Mahapuranam-2    Chapters   

సప్తషష్ట్యుత్తరద్విశతతమో7ధ్యాయః.

వాస్తు శాన్తిః.

ఋషయః ప్రాసాదా కిదృశా స్సూత కర్తవ్యా భూతి మిచ్ఛతా | ప్రమాణం లక్షణం తద్వ ద్వద విస్తరతో7ధునా. 1

సూతః అథాత స్సమ్ప్రవక్ష్యామి ప్రాసాదవిధినిర్ణయమ్‌ | వాస్తౌ పరీక్షితే సమ్య గ్వాస్తుదేహవిచక్షణః. 2

వాస్తూపపశమనం కుర్యా త్సమిద్భి ర్బలిక్రర్మణా | జీర్ణోద్దారే తథోద్యానే తథా గృహనివేశ##నే. 3

నవప్రాసాదభవనే ప్రాసాదపరివర్తనే | ద్వారాభివర్తనే తద్వ త్ప్రాసాదోపవనేషు చ. 4

వాస్తూపశమనం కుర్యా త్పూర్వమేల విచక్షణః | ఏకాశీతిపదం లిఖ్య వాస్తుమధ్యేతు పిష్టకైః. 5

హోమ స్త్రిమేఖలే కార్యః కుణ్డ హ స్తప్రమాణకే | యవైః కృష్ణతిలై స్తద్వ త్సమిద్భిః క్షీరవృక్షజైః. 6

పాలాశైః ఖాదిరైశ్చాపి మధునర్పి స్సమన్వితై | కుశదూర్వామయై ర్వాపి మధుసర్పి స్సమన్వితైః. 7

కార్యస్తు పఞ్చభిర్బిల్వై ర్బిల్వబీజైస్తథాపిచ | హోమాన్తే భక్ష్యభోజ్యైశ్చ వాస్తుదేశే బలిం హరేత్‌. 8

దత్వద్విశేషనైవేద్య మేవం దద్యా త్క్రమేణతు |

రెండు వందల అరువది ఏడవ అధ్యాయము.

ప్రాసాద (దేవాలయ) వాస్తు శాంతి.

ఋషులు సూతునిట్లడిగిరి: సూతా! అభ్యుదయమును కోరువాడు ఎటువంటి ప్రాసాదము (దేవాలయము)లను నిర్మించవలయును? ఆలయముల ప్రమాణము (కొలతల)ను లక్షణమును విస్తరించి మాకిపుడు తెలుపుము. అన సూతుడు ఇట్లు పలికెను: మీరు జిజ్ఞాసువులయియున్నారు కావున ఇపుడిక ప్రాసాద (దేవగృహ) విధాన నిర్ణయక్రమమును తెలిపెదను; 'వాస్తు'ను లెస్సగా పరీక్షించిన తరువాత వాస్తు పురుషుని దేహ స్వరూపమును అతని ఆయా అవయవముల స్థాన ములను బాగుగ ఎరిగినవాడై సమిధల (తోడి హోమము) తోను బలి ప్రదాన కార్యముతోను వాస్తు శాంతి జరుపవలయును; ఈ విషయములను బాగుగ ఎరిగి యజమానుడు జీర్ణ గృహాలయాదుల ఉద్ధార కార్యములందును ఉద్యాన- గృహనివేశన నిర్మాణ నూతన ప్రాసాద (దేవాలయ - రాజభవన) నిర్మాణ ప్రాసాద పఠివర్తన ద్వారాభివర్తన ప్రాసాద సంబంధ్యుపవన నిర్మాణాది సందర్భములయందు ఆ కార్యారంభమునకు ముందుగానే వాస్తుశాంతిని జరుపవలయును.

('వాస్తు 'అనగా గృహప్రాసాదాది నిర్మాణమునకో వాని ఉద్ధారమునకో ఉపయోగించు స్థలము అని అర్థము). 'వాస్తు' మధ్యమునందు పిండులతో ఏకాశీతి పదవాస్తు రూపమునువ్రాసి ఆస్థలమందే మూడు మేఖలలతో ఆవరింపబడిన హస్త ప్రమాణక(ఒక మూర- లోతు వెడల్పు పొడవులుకల) కుండమందు యవలు కృష్ణతిలలు క్షీరవృక్షములనుండి ఉత్పన్నములయిన నమిధల పాలాశఖాదిర (చండ్ర) సమిధలు కుశలు దూర్వలు* పంచబిల్వ ఫలములు బిల్వ ఫలములు బిల్వ బీజములు- ఇవి తేనెతో నేతితో తడిపి వానితో హోమము జరుపవలెను; హోమము ముగిసిన తరువాత వాస్తు ప్రదేశమునందు భక్ష్యబోజ్యములతో బలిని వాస్తుపురుషాది దేవతలకుపహారమును ఈయవలెను; తరువాత ఈ విధముగా క్రమమున విశేష నైవేద్యమర్పించవలెను.

హరకోణ ఘృతాన్నం తు సిఖిలనే వినివేదయేత్‌. 9

ఓదనం సఫలం దద్యా త్పర్జన్యాయ ఘృతాన్వితమ్‌ | జయన్తాయ ధ్వజా న్పీతా న్పైష్టం కూర్మం చ సన్న్యసేత్‌. 10

ఇన్ద్రాయ పఞ్చరత్నాని పైష్టం చ కులిశం తథా | వితానకం చ సూర్యాయ ధూమ్రం సక్తుం తథైవచ. 11

సత్యాయ ఘృతగోధూమం మత్స్యం దద్యా ద్భృశాయచ | శఘ్కలీ శ్చాన్తరిక్షాయ దద్యా త్సక్తుం చ వాయవే. 12

లాజాః పూష్ణే ప్రదాతవ్యా వితథే చణకౌదనమ్‌ | గన్ధోదనం చ గన్ధర్వే భృఙ్గరాజస్య భృఙ్గికామ్‌. 13

గృహక్షతాయ మధ్వన్నం యమాయ పిశితౌదనమ్‌ | మృగాయ యావకం దద్యా త్రితృభ్యః కృసరం తథా. 14

దౌవారికే దన్తకాష్ఠం పైష్టం కృష్మబలిం తథా | సుగ్రీవే పూరికాం దద్యా త్పుష్పదన్తాయ పాయసమ్‌. 15

కుశస్తమ్భేన సంయుక్తం తథా పద్మంచ వారుణమ్‌ | పిష్టం హిరణ్మయం దద్యా దసురాయ సురా మతా. 16

ఘృతౌదనం చ శోషాయ యవాన్నం పాపయక్ష్మణ | ఘృతలడ్డుకాం స్తు రోగాయ నాగే పుష్ఫలానితు. 17

భక్ష్యం ముఖ్యాయ దాతవ్యం ముద్గౌదన మతః పరమ్‌ | భల్లాటస్థానకే దద్యా త్సోమాయ ఘృతపాయసమ్‌. 18

భగాయ శాలికం పిష్ట మదిత్యై పూరికా స్తథా | దిత్యై తు పూరికాం దద్యా దిత్యేవం బాహ్యతో బలి. 19

క్షీరమాపాయ దాతవ్య మాపవత్సాయ వై దధి | సావిత్రే లడ్డుకాం దద్యా త్సమరీచం కుశోదనమ్‌. 20

* పంచబిల్వములు సంప్రదాయమున ఎరుగవలయును.

సవితు ర్గుడవూపాంస్తు జయాయ ఘృతచన్దనమ్‌ | వివస్వతే పున ర్దద్యా ద్రక్తచన్దనపాయసమ్‌. 21

హరితాళౌదనం దద్యా దిన్ద్రాయ ఘృతసంయుతమ్‌ | ఘృతౌదనం చ మిత్రాయ రుద్రాయ ఘృతపాయసమ్‌. 22

ఆమం పక్వం తథా మాంసం దేయం స్యాద్రాజయక్ష్మణ | పృథ్వీధరాయ మాంసాని కుశ్మాణ్డాని చ దాపయేత్‌. 23

శర్కరాపాయసం దద్యా దర్యవ్ణుె పునరేవ హి | పఞ్చగవ్యం యవాశ్చైవ తిలాక్షతమయం చరుమ్‌. 24

భక్ష్యం భోజ్యంచ వివిధం బ్రహ్మణ వినివేదయేత్‌ | ఏవం సమ్పూజితా దేవా శ్శాన్తిం కుర్వన్తి తే సదా.

1. ఈశాన్యమున 'శిఖి 'కి ఘృతాన్నమును -ఇట్లే ప్రదక్షిణ క్రమమున 2. పర్జన్యునకు ఘృతఫలయుక్తాన్నమును 3. జయంతునకు పీతధ్వజములను పిష్టముతో చేసిన కూర్మమును 4. ఇంద్రునకు పంచరత్నములను పిష్ట వజ్రమును 5. సూర్యునకు వితానకము (మేల్కట్టు)ను ధూమ్రవర్ణపు నక్తువును 6. సత్యునకు నేతి గోధూమాన్నమును 7. భృశునకు మత్స్యమును 8. ఆకాశునకు చక్కిలములను. 9. వాయువునకు నక్తువులను 10. పూషునకు లాజములను 11. వితథునకు శనగలతో వండిన అన్నమును 12. గంధర్వునకు గంధాన్నమును 13. భృంగరాజునకు ఆడు తుమ్మెదను 14. గృహక్షతునకు తేనెయన్నమును 15. యమునకు మాంసాన్నమును 16. మృగునకు యావక (పాలతో గోధుమ రవ్వతో వండిన యన్నమును17. పితరులకు పులగమును 18. దౌవారికునకు దంతకాష్ఠమును పిండితో చేసిన నల్లని వన్నెగల బలియును. 19. సుగ్రీవునకు పూరికను 20. పుష్పదంతునకు పాయసమును 21. వరుణునకు దర్భ దుబ్బుతో కూడిన బంగరు పద్మమును 22. అసురునకు పిండిని మద్యమును 23. శో(శే)షునకు ఘృతాన్నమును 24. పాపయక్ష్మునకు ఘృతాన్నమును 25. రోగునకు నేతి లడ్డులను 26. నాగునకు పుష్పములను ఫలములను 27. ముఖ్యునకు భక్ష్యమును 28. భల్లాటునకు ముద్గాన్నమును 29. సోమునకు ఘృతపాయనమును. 30. భగునకు శాలిధాన్యపు పిష్టమును 31. అదితికి పూరికలను 32. దితికి ఒకేఒక పూరికను అని ఇట్లు బహిఃపదములయందు ఈయవలసిన బలిక్రమము.

ఇక అంతర పదములందు ఈయవలసిన బలిక్రమము; 33. ఆపునకు క్షీరమును 34. అవవత్సునకు దధిని 35. సావిత్రునకు ఒక లడ్డును మిరియాలతో సంస్కరించినదియు దర్భయుక్తమునగు అన్నమును 36. నవితకు బెల్లపు అప్పములను 37. జయునకు నేతిని చందనమును 38. వివస్వంతునకు రక్తచందనము పాయసమును 39. ఇంద్రునకు నేతియన్నమును హరితాళమును 40. మిత్రునకు ఘృతాన్నమును 41. రుద్రునకు ఘృతపాయసమును 42. రాజయక్ష్మునకు అమ(పచ్చి) పక్వమాంసములను 43. పృథ్వీధరునకు కూశ్మాండములను మాంసమును 44. అర్యమునకు శర్కరాపాయ నమును 45. బ్రహ్మకు పంచగవ్యమును యవలను తిలలతో అక్షతలతో నిండిన చరువును వివిధ భక్ష్యభోజ్యములను నివేదించవలయును. ఇట్లు సంపూజితులయి దేవతలు ఎల్లప్పుడును శాంతిని కల్గింతురు.

సర్వేభ్యః కాఞ్చనం దద్యా ద్బ్రాహణ గాం పయస్వినీమ్‌ | రాక్షసీనాం బలి ర్దేయో హ్యపి యాదృ క్తథా శృణు. 26

మాంసోదనం ఘృతం పద్మకేసరం దుధిరాన్వితమ్‌ | ఈశానభాగ మాశ్రిత్య చరక్యై వినివేదయేత్‌. 27

మత్స్యోదనం సరుధిరం హరిద్రౌదన మేవ చ | ఆగ్నేయీం దిశ మాశ్రిత్య విదార్యై వినివేదయేత్‌. 28

దధ్యోదనం సరుధిర మస్థిఖణ్డౖశ్చ సంయుతమ్‌ | పీతరక్తం బలిం దద్యా త్పూతనాయై చ రాక్షసే. 29

వాయవ్యాం పాపరాక్షసై#్య మత్స్యమాంసం సురాసవమ్‌ | పాయసంవా7పి దాతవ్యం స్వనామ్నా సర్వతః క్రమాత్‌. 30

నమస్కారాన్తయుక్తేన ప్రణవాద్యేన సంయుతః | తత స్సర్వౌషధీస్నానం యజమానస్య కారయేత్‌. 31

ద్విజా న్త్సమ్పూజయే ద్భక్త్యాయే చాన్యే గృహ మాగతాః | ఏతద్వాస్తువప్రశమనం కృత్వా కర్మ సమారభేత్‌. 32

ప్రాసాదభవనోద్యాన ప్రారమ్భే వినివర్తనే | పురవేశ్మప్రవేశేషు సర్వదోషాపనుత్తయే. 33

రక్షోగ్నపావమానేన సూక్తేన భవనాదికమ్‌ | నృత్యమఙ్గళవాద్యం చ కుర్యా

ద్భ్రాహ్మణవాచనమ్‌. 34

అనేన విధినా యస్తు ప్రతిసంవత్సరం బుధః | గృహే వా77యతనేకుర్యా న్న స దుఃఖ మావాప్నుయాత్‌. 35

స చ వ్యాధిభయం తస్య న చ బన్ధుజనక్షయః | జీవేద్వర్షశతం సాగ్రం స్వర్గే కల్పం చతిష్ఠతి. 36

ఇతి శ్రీమత్స్యమహాపురాణ వాస్తుశాన్తికథనం నామ సప్తష్ట్యుత్తర

ద్విశతతమో7ధ్యాయః.

ఎల్లరకును బంగారమును బ్రాహ్మణున(ల)కు పాడియావును ఈయవలయును. రాక్షసీజనమునకు ఎటువంటి బలినీయవలయునో తెలిపెదను వినుము1. ఈశానదిశయందలి 'చరకి'కి మాంసాన్నమును నేతిని పద్మకేసరమును రక్తమును 2. ఆగ్నేయమునందలి 'విదారి'కి మత్స్యాన్నమును రక్తమును హరిదాన్నమును 3. నైరృతమునందలి 'పూతన'కు దద్యన్నమును రక్తమును అస్థి కండములను 4. వాయవ్య మందలి 'పాపరాక్షసి'కి మత్స్యమాంసమును సురా77నవమును గాని పాయసమును గాని ఆయా దేవతల నామముల నుచ్చరించుచు (ఆ నామమును చతుర్థీ విభక్త్యంతముగా మార్చి) ప్రణవాదిగా 'నమః' శబ్దము చివరకు వచ్చునట్లుగా పలుకుచు ఈయవలెను; తరువాత యజమానుడు సర్వౌషధీస్నానమును జరిపించుకొనవలయును; ద్విజులను ఇంటికి వచ్చిన ఇతరులను భక్తితో సంపూజించవలయును; ఈ విధమగు 'వాస్తు శాంతిని 'జరిపిన తరువాతనే గృహ ప్రాసాదాది నిర్మాణాది కార్యము నారంభించవలయును.

ప్రాసాదములు భవనములు ఉద్యానములు ఆరంభము చేయునపుడు ముగించునపుడును పురప్రవేశాదులందును సర్వదోష పరిహారమునకై రక్షోఘ్న (రాక్షస భాధానివారకమగు) పవమానసూక్త పారాయణముతో కూడ భవనాది నిర్మాణ జీర్ణోద్ధారాది కార్యములనుద్దేశించి నృత్య మంగళవాద్యాదికము జరుపవలయును; బ్రాహ్మణులచే స్వస్తివాచనము జరిపించవలయును; దీని నెరిగి ప్రతి సంత్సరమందును ఈ విధానముతో గృహమందుగాని దేవాలయమునందుగాని వాస్తు శాంతిని జరిపించుకొని వానికి దుఃఖములు ఏవియు కలుగవు. అతనికి వ్యాధి భయ- బంధు జనక్షయములు కలుగవు; అతడు సమగ్రముగ నూరేండ్లు జీవించును; కల్పకాలమున స్వర్గసుఖమందును.

ఇతి శ్రీమత్స్యమహాపురాణమున వాస్తు శాంతి విధానమును

రెండు వందల అరువది ఏడవ అద్యాయము.

Sri Matsya Mahapuranam-2    Chapters