Sri Matsya Mahapuranam-2    Chapters   

చతుఃషష్ట్యుత్తరద్విశతతమో7ధ్యాయః.

మూ ర్తిపలక్షణమ్‌.

సూతఃః అతఃపరం ప్రవక్ష్యామి మూర్తిపానాం తు లక్షణమ్‌| స్థాపకస్య సమాసేన లక్షమం శృణుత ద్విజాః. 1

సర్వావయవసంయుక్తో వేదమన్త్ర విశారదః | పురాణవేత్తా తత్త్వజ్ఞో దమ్భలోభవివర్జితః. 2

కృష్ణసారమయే దేశే య ఉత్పన్న శ్శుభాకృతిః | శౌచాచారాపరో నిత్యం పాషణ్డకులనిస్పృహః. 3

సమ శ్శత్రౌ చ మిత్రే చ బ్రహ్మోపేన్ద్రహరప్రియః | ఊహాపోహార్థతత్త్వజ్ఞో వాస్తుశాస్త్రస్య పారగః. 4

ఆచార్యస్తు భ##వే న్నిత్యం సర్వదోశవివర్జితః | మూర్తిపాన్తు ద్విజాశ్చైవ కులీనా ఋజవ స్తథా. 5

ద్వాత్రింశ త్షోడశా7థా7పి అష్టౌ వా దేవపారగాః | జ్యేష్ఠమధ్యకనిష్ఠేషు మూర్తిపాశ్చ ప్రకీర్తితాః. 6

రెండు వందల అరువది నాలుగవ యధ్యాయము.

మూర్తిప లక్షణము- అధివాసనవిధి.

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను: ఇపుడు ఇక దేవతా ప్రతిష్ఠా ప్రక్రియయందు ఋత్విక్‌ లుగా నుండ దగిన 'మూర్తిప' అనబడు వారికిని ప్రధాన ఋత్విక్‌ -అధ్వర్యుడు -ఆచార్యుడు -గా నుండదగిన స్థాపకుడు అనబడు విప్రునకును నుండవలసిన లక్షణములను తెలిపెదను.

స్థాపకుడు అంగవైకల్యము ఏమాత్రమును లేక సర్వావయవ యుక్తుడును వేదమంత్రములయందు వైశారద్యము- గొప్ప ఎరుక-కలవాడును. పురాణములను అధ్యాత్మిక తత్త్వమును ఆగమాది శాస్త్ర తత్త్వమును ఎరిగినవాడును దంభము- కపటాచారాదికము- లోభము లేనివాడును నల్లని చారలుగల జింకలుండు దేశమున జన్మించిన వాడును చక్కని అకారము కలవాడును నిరంతరము శారీరమానస శుచిత్వము కలవాడును సదాచారమును కలవాడును పాషండ (వేద నిదక- వేదబాహ్య) జనులయందు ఎట్టి అన క్తియు లేనివాడును శత్రుమిత్రులయందు సమబావము కలవాడును బ్రహ్మ విష్ణు రుద్రులయందు ప్రీతి గలవాడును ఆయా విషయములను ఊహించుటయందును తగనివానిని అపోహించుట (వానిని

*ఇచట మూలములో 'కన్యన' పదము 'కనీయస్‌' అనుటకు అర్షప్రయోగము 'తాత! కన్యన' అని భారతమున ప్రయోగము కలదు.

గురుతించి వదలివేయుట) యందు నేర్పుగలవాడును ఆయా ప్రతిష్ఠాది శాస్త్ర తత్త్వములను ఎరిగిన వాడును వాస్తు శాస్త్రపారంగతుడును ఏయొక దోషములును లేనివాడును ఆచార్యుడు- ప్రతిష్ఠాకార్య ప్రక్రియయందు అధ్వర్యుడు- ప్రధాన ఋత్విక్‌ గా నుండవలయును: 'మూర్తిపులు' కూడ సద్వంశమునందు జనించి ఋజు స్వబావము కల విప్రులై యండవలయును; ఈ మూర్తిపులు జ్యేష్ఠ పరిమాణక లింగ ప్రతిష్ఠయందు ముప్పది ఇరువురును మధ్యమ పరమాణక లింగప్రతిష్ఠ యందు పదునారుమందియు కనిష్ఠ పరిమాణక లింగ ప్రతిష్ఠయందు ఎనిమిమందియు ఉండవలయును.

అధివాసనవిధిః.

తతో లిఙ్గ మథార్చాం వా నీతా స్నపనమణ్డపమ్‌| గీతమఙ్గళశ##బ్దేన స్నపనం తత్ర కారయేత్‌. 7

పఞ్చగవ్యకషాయేణ మృద్భి ర్భస్మోదకేన చ | శౌచం తత్ర ప్రకుర్వీత వేదమన్త్రచతుష్టయాత్‌. 8

సముద్రజ్యేష్ఠమన్త్రేణ ఆపోదివ్యేతి చాపరః | యాసాంరాజేతి మన్త్రశ్చ ఆపోహిష్టేతి చాపరః. 9

ఏవం స్నావ్య తతో దేవం పూజ్య గన్ధానులేపనైః | ప్రచ్ఛాద్య వస్త్రయుగ్మేన అభివస్త్రేత్యు దాహృతమ్‌. 10

ఉత్థాపయే త్తతో దేవ ముత్తిష్ఠ బ్రహ్మణస్పతే | అమూరజేతి చ తథా రథే తిష్ఠేతి చాపరః. 11

రథే బ్రహ్మరథే వా7పి ధృతాం శిల్పగణన తు | ఆరోప్య చానయే ద్విద్వా నాకృష్టేన ప్రవేశ##యేత్‌. 12

అనంతరము లింగమును కాని అర్చామూర్తిని కాని స్నపన (స్నాన) మండపమునకు తీసికొనిపోయి అచట గీత మంగళశబ్దముతో పంచగవ్యముతోను కషాయ మిశ్రితోదకముతోను మృత్తికతోను (హోమ) భస్మోదముకముతోను స్నానము చేయించవలయును; ఆ సందర్భమునందు శౌచార్థము ఈ చెప్పబోవు నాలుగు వేదమంత్రములను జపించు (బిగ్గరగా పఠించు) చుండవలయును; అవి1. సముద్రజ్యేష్ఠాః 2. యా అపోదివ్యా (?) 3. యసాంరాజా 4. అపోహిష్టా అనునవి ; ఇట్లు దేవుని స్నపనము చేయించి గంధానువేపనములతో పూజించి 'అభివస్త్రా' అను మంత్రముతో వస్త్రముల చాపుతో కప్పి తరువాత 'ఉత్తిష్ఠ బ్రహ్మణస్పతే' ! 'ఆమూరజ' 'రథేతిష్ఠన్‌' అను త్రములతో దేవుని లేవదీయవలయును; మూర్తిని తెచ్చి రథమునందుకాని బ్రహ్మరతమునందుకాని శిల్పులచే ఎక్కించి రథమును లాగించుకొని తీసికొనివచ్చి మంజపమునందు ప్రవేశింపజేయవలయును.

తత అస్తీర్య శయ్యాయాం స్థాపయే చ్ఛనకై ర్బుధః| కుశానాస్తీర్య పుష్పాణీ స్థాపయే త్ప్రాఙ్ముఖన్‌ తతః. 13

తతస్తు నిద్రాకలశం వస్త్రకాఞ్చన సంయుతమ్‌ | శిరోభాగే తు దేవస్య దపన్నేవం నిధాపయేత్‌. 14

ఆపోదేవీతి మన్త్రేణ ఆపో7స్మాన్మాతరేతిచ| తతో దుకూలపట్టైశ్చ చాద్య నేత్రోపదానకమ్‌. 15

దద్యా చ్ఛిరసి దేవస్య కౌశేయం వా విచక్షణః | మధునా సర్పిషా7 భ్యజ్య పూజ్య సిద్ధార్థకై స్తతః. 16

ఆప్యాయస్వేతి మన్త్రేణ యా తే రుత్రశివేతి చ | ఉపవిశ్యార్చయే ద్దేవం గన్ధపుషై#్ప స్సమన్తతః. 17

సితం ప్రతిసరం దద్యా ద్బార్హస్పత్యేతి మన్త్రతః | దుకూలపట్టైః కార్పాసై ర్నానాచిత్రై రథాపివా. 18

ఆచ్ఛాద్య దేవం సర్వత్ర ఛత్త్రచామరదర్పణమ్‌ | పార్శ్వత స్థ్సాపయే త్తత్ర వితానం పుష్పసంయుతమ్‌. 19

రత్నాన్యోషధయ స్తత్ర గృహోపకరణాని చ | భాజనాని విచిత్రాణి శయనా న్యాసనాని చ. 20

అభిత్వాశూర మన్త్రేణ యథావిభవతో న్యసేత్‌ | క్షీరం క్షౌద్రం ఘృతం తద్వ ద్భక్ష్యభోజ్యాన్నపాయసైః. 21

షడ్విధైశ్చ రసై స్తద్వ త్సమన్తా త్పరిపూజయేత్‌| బలిం దద్యా త్ప్రయత్నేన మన్త్రేణానేన భూరిశః. 22

'త్య్రమ్బకం యజామహా' ఇతి సర్వత శ్సనకై ర్భువి | మూర్తిపా& స్థాపయే త్పశ్చా త్సర్విదిక్షు విచక్షణః. 23

చతురో ద్వారపాలాంశ్చ ద్వారేషు వినివేశ##యేత్‌ | శ్రీసూక్తం పావమానం చ సోమసూక్తం సుమఙ్గళమ్‌. 24

తథాచ శాన్తికాధ్యాయ మిన్ద్రసూ క్తం తథైవచ | రక్షోఘ్నం చ తథా సూక్తం పూర్వతో బహ్వృచః పఠేత్‌. 25

రౌద్రం పురుషసూక్తం చ శ్లోకాద్యాయం సశుక్రియమ్‌ | తథైవ మణ్డలాధ్యాయ మధ్వర్యు ర్దక్షిణ జపేత్‌. 26

వాసుదేవం బృహత్సామ జ్యేష్ఠసామ రథన్తరమ్‌ | తథా పురుషసూక్తం చ రుద్రసూక్తం సశాన్తికమ్‌. 27

భారుణ్డాని చ సామాని చ్ఛన్దోగః పశ్చిమే జపేత్‌ | అథర్వాఙ్గిరసం తద్వన్నీలం రౌద్రం తథైవచ. 28

తథా7 పరాజితా దేవీ సప్తసూక్తం సరౌద్రకము | తథైవ శాన్తికాధ్యాయ మాథర్వ శ్చోత్తరే జపేత్‌. 29

అంతట అందు దేవుని అర్చామూర్తిని నెమ్మదిగా దించి ఉంచవలయును; అచట దర్భలను పరచి వానిపై పూవులను ఉంచి ఇట్లేర్పరచిన శయ్యయందు మూర్తిని ప్రాఙ్ముఖముగా పండుకొనపెట్టవలయును; 'ఆపోదేవీః' 'ఆపో స్మాన్‌ మాతరా' అను మంత్రములను పఠించుచు లోపల బంగారమునుంచి పైని నూతన వస్త్రములను చుట్టిన నిద్రాకలశమును దేవుని శిరోభాగమునందుంచవలయును; తరువాత దుకూల పట్టములతో దేవుని కప్పవలయును; తరువాత ఉన్నిబట్ట పొదిగియున్న వస్త్రముతో చేసిన దిండుకాని (దిండువలె) పట్టువస్త్రమును కాని ఉంచవలయును; తరువాత దేవును కడ కూర్చుండి తేనతో ను నేతితోను అభ్యంజనము (పూయుట) చేయవలెను; తెల్ల ఆవలతో పూజించవలయును; 'ఆప్యాయస్వ' 'యాతేరుద్ర' అను మంత్రముతో అర్చామూర్చిని అంతటను గంధ పుష్పములతో పూజించవలయును; 'బార్హన్పత్య' అ నుమంత్రముతో తెల్లని ప్రతిరసమును ధరింపజేయవలెను; దూది నూలితో నిర్మించిన దుకూల పట్టములతోనో నానా విధముల చిత్రములుగల వస్త్రములతోనో దేవుని మూర్తిని కప్పవలయును; పార్శ్వములందు దగ్గరలో ఛత్త్రము చామరము అద్దము ఉంచవలయును; ఆ పడకకు పైగా పూవులతో మేలుకట్టు అమర్చవలయును; 'అభిత్వాశూర' అను మంత్రముతో యజమానుడు తన విభవము కొలదిని వివిధములగు పాత్రలను శయనములను %ాసనములను అచ్చట నుంచవలయును; పాలు తేనె నేయి భక్ష్య భోజ్యాన్న పాయసములు ఇట్టివానితోను షడ్విధరన(పు ఆహార)ములతోను 'త్య్రంబకం యజామహే' అను మంత్రముతో పూజా పూర్వకముగా బలిని సమర్పించవలయును; తరువాత మూర్తిపులను నెమ్మదిగా ఆయా స్థానములందు సర్వదిక్కులందు కూర్చిండబెట్టవలయును; నలుగురనుగా ద్వారపాలురనుగా ద్వారములందు కూర్చుండబెట్టవలయును. వీరిలో 1. తూర్పు ద్వారమందుండు బహ్వృచుడు (ఋగ్వేది) శ్రీ- పవమాన- సోమ-శాంతి కాధ్యాయేంద్ర- రక్షోఘ్న- సూక్తములను పఠించును; దక్షిణ ద్వారమందలి అధ్వర్యుశాఖా (కృష్ణ యజుఃశాఖా) ధ్యాయి రౌద్ర సూక్త- పురుషసూక్త- శుక్రియావాకమును శ్లోకాధ్యాయములను పఠించును; పస్చిమ ద్వారమందలి సామవేది- వామదేవ- బృహత్‌. రథంతర జ్యేష్ఠ- సామములను పురుషసూక్త రుద్ర సూక్తములను శాంతికాధ్యాయమును భారుండ సామమును పఠించును; ఉత్తర ద్వారమందలి అథర్వణవేదీయుడు అథర్వాంగిరన మంత్రభాగమును నీల సూక్తమును రౌద్ర సూక్తమును అపరాజితాదేవీ సూక్త సప్తకమును శాంతికాధ్యాయమును పఠించును.

శిరఃస్థానేతు దేవస్య స్థాపకో హోమ మాచరేత్‌ | సాన్తికైః పౌష్టికై స్తద్వ న్మన్త్రై ర్వ్యాహృతిపూర్వకైః. 30

పలాశోదుమ్బరాశ్వత్థా అపామార్గ శ్శమీ తథా | హుత్వా సహస్ర మేకైకం దేవం పాదే తు సంస్పృశేత్‌. 31

తతో హోమసహస్రేణ హుత్వా హుత్వా తత స్తతః | నాభిమద్యం తథా వక్ష శ్శిరశ్చ ప్యాలభే త్పునః. 32

హస్తమాత్రేషు కుణ్డషు మూర్తిపా స్సర్వతోదిశమ్‌ | సమేఖలేషు తే కుర్య ర్యోనివక్త్రేషు చాదరాత్‌. 33

వితస్తిమాత్రా యోని స్స్యా ద్గజోష్ఠ సదృశీ తథా | ఆయతా చ్ఛిద్రసంయుక్తా పార్శ్వతః కలయోచ్ఛ్రితా. 34

కుణ్డత్కలానుసారేణ సర్వత శ్చతురఙ్గళా | విస్తారేణోచ్ఛ్రయా తద్వ చ్చతురశ్రా సమాభ##వేత్‌. 35

వేదీ భిత్తిం పరిత్యజ్య త్రయోదశభి రఙ్గుళైః | ఏవం నవసు కుణ్డషు లక్షణం చైవ దృశ్యతే. 36

ఆగ్నేయ శక్రయామ్యేషు హోతవ్య ముదగాననైః | శాన్తయో లోకపాలేభ్యో మూర్తిభ్యః క్రమశ స్తథా. 37

తథా మూర్త్యధిదేవానాం హోమం కుర్యా త్సమన్తతః | వసుధా వసురేతాశ్చ యజమానో దివాకరః. 38

జలం వాయు స్తథా సోమ అకాశ శ్చాష్టమ స్స్మృతః | దేవస్య మూర్తయ స్త్వష్టా వేతాః సంస్మరేత్‌. 39

దేవుని శిరఃస్థానమునందు స్థాపకుడు (ప్రధాన ఋత్విక్‌- ఆచార్యుడు) వ్యాహృతి పూర్వకములగు శాంతికపౌష్టిక మంత్రములతో పలాశము ఉదుంబరము-అశ్వత్థము-అపామార్గము- శమి ఈ సమిధలతో ఒక్కొక్క ఆవృత్తిలో సహస్రాహుతులతో హోమముచేసి ఒక్కొక్క సహస్రము కాగానే వరుసగా దేవుని పాదములను- నాభి మధ్యమున పక్షమును శిరమును తాకుచు పోవలెను. సర్వదిశలయందు ఉన్న మూర్తిపులు మేఖలలతో కూడిమవయి హస్తమాత్ర పరిమాణమున (లోతు- వెడల్పు- పొడవు) కల కుండములందు ఆదరపూర్వకముగ హోమము చేయుచుందురు; ఈ కుండలములకు వక్త్ర (ముఖ- ముందు) భాగమునందు 'యోని'(అను పేరుగల నిర్మాణము ) ఉండవలయును.

యోని లక్షణము 'యోని' అనగా ఏదేని వస్తువులను (ఇచట హోమ పరికరములను) ఉంచుటకు ఉపయోగించు స్థానము అని అర్థము: ''యోనిః -ఆసాదనస్థానమ్‌'' అని శ్రీ సంకర భగవత్పాదులు: (చూడు .బృహ. శాం. ఖా. అధ్యా-1; బ్రాహ్మణం-1 ) ఇది అనేక విధములుగా ఉండవచ్చును: ఇందుండి ఏ విధమునైనను గ్రహించి 'యోని'ని కుండ సమీపమున ఏర్పరచవచ్చును: ఇందు ఒక విధమగు 'యోని' విషయము లోగడ ఏబది ఎనిమిదవ అధ్యాయము న ఎనిమిదవ శ్లోకమున చెప్పబడినది. దానిననుసరించి (ఆ. 58 శ్లో 8).

ఇది దీర్ఘ చతురస్రాకృతితో (ఆయతముగా) వితస్తి 12 (భారతీయాంగుళములు) మాత్రము పొడవు ను-ఆరుగాని ఏడుగాని అంగుళముల వెడల్పును కలిగియుండును. (ఇక ఇచ్చట చెప్పినవి):

2. పండ్రెండు భారతీయాంగుళముల పొడవుతో గజోష్ఠము (ఏనుగు పెదవి) వంటి ఆకృతితో ఉండవలయును.

3. పైని (1లో) చెప్పినట్లు ఆయత (దీర్ఘచతురస్ర)మై పండ్రెండు భారతీయాంగుళములు పొడవును ఆరుగాని ఏడుకాని అంగళముల వెడల్పును కలిగి( నడుమ కూర్మపృష్ఠమువలె వంపుతో ఎత్తుగాను పార్శ్వములందు కలా మాత్రము (కుండపు కొలతలో 1/16 పదునారవవంతు) ఎత్తుగాని నుండవలెను. కుండము ఒక హస్త మాత్రము -అనగా ఇరువది నాలుగు భారతీయాంగుళముల పొడవు వెడల్పు లోతులు కలిగి ఉండవలయును అనుటచే దానిలో పదునారవవంతు అనగా ఒకటిన్నర బారతీయాంగుళములు అగును. మరియు కుండ పరిమాణము ఇంతకంటె ఎక్కువయో తక్కువయో ఉన్న సందజర్భములలో దీనిని బట్టి ఈ పదునారవవంతు పరిమాణము మారవచ్చును.

4. పొడవును వెడల్పును ఎత్తును ఒకే విధముగా నాలుగు భారతీయాంగుళములు మాత్రమే యుండవచ్చును.

ఈ కుండలములు అన్నియు వేది భిత్తినుండి పదుమూడంగుళముల దూరములో ఉండవలయును. ఇట్లు ఈ సందర్భములో ఉండవలసిన తొమ్మిది కుండలములకును 'యోని' నిర్మాణము చేయవలయును.

ఆగ్నేయ కోణమునందు తూర్పు దిశయందును దక్షిణ దిశయందును ఉన్న ఋత్విజులు ఉత్తరాభిముఖులై కూర్చుండి శాంత్యర్థమయి లోకపాలురను శివుని అష్టమూర్తులను మూర్త్యధి దేవతలనుఉద్ధేశించి హవనము జరుపవలయును;1. పృథవి 2. జలము 3. అగ్ని 4. వాయువు 5. ఆకాశము 6.రవి 7. సోముడు 8. యజమానుడు అనునవి శివుని మూర్త్యష్టకము.

ఏతాసా మధిపా న్వక్ష్యే పవిత్రా న్మూర్తినామతః | పృథివీం పాతి శర్వశ్చ పశుప శ్చాగ్ని మేవ చ. 40

యజమానం తథైవోగ్రో రుద్ర శ్చాదిత్య మేవచ | భవో జలం సదా పాతి వాయు మీశాన ఏవచ. 41

మహాదేవ స్తథా సోమం భీమశ్చాకాశ మేవ చ | సర్వదేవప్రతిష్ఠాసు మూర్తిపా హ్యేత ఏవ తు. 42

ఏతేభ్యో వైదికై ర్మన్త్రై ర్యథాస్వం హోమ మాచరేత్‌ | తథా శాన్తిఘటం కుర్యా త్ప్రతికుణ్డషు సర్వతః. 43

శతాన్తే వా సహస్రాన్తే సమ్పూర్ణాహుతి రిష్యతే | సమపాదః పృథివ్యాం తు ప్రసాన్తాత్మా వినిక్షిపేత్‌. 44

ఆహుతీనాం తు సమ్పాతం పూర్ణకుమ్భేషు వైన్య సేత్‌ | మూలమధ్యో త్తమాఙ్గేషు దేవం తేనావసేచయత్‌.45

స్థితంచ స్నాపయే త్తేన సమ్పాతాహుతివారిణా | ప్రతియామేషు ధూపంచ నైవేద్యం చన్దనోదకమ్‌. 46

పునః పునః ప్రకుర్వీత హోమః కార్యః పునః పునః | పునః పునశ్చదాతవ్యా యజమానేన దక్షిణా. 47

సితవసై#్త్రశ్చ తే సర్వే పూజనీయాః సమన్తతః | విచిత్రై ర్హేమకటకై ర్హేమసూత్రాఙ్గుళీయకైః. 48

వాసోభి శ్శయనీయైశ్చ పరిధాప్యా స్స్వశక్తితః | భోజనం చాపి దాతవ్యం యావ త్తస్యాధివాసనమ్‌. 49

త్రిసన్ధ్యం తు బలిర్దేయో భూతేభ్య స్సర్వతోదిశమ్‌ | బ్రాహ్మణా న్భోజయే త్పూర్వం శేషా న్వర్ణాంస్తు కామతః. 50

రాత్రౌ మహోత్సవః కార్యో నృత్యగీతక మఙ్గళైః | సదా పూజ్యాః ప్రయత్నేన చతుర్థీ కర్మ

యావతా. 51

త్రిరాత్ర మేకరాత్రిం వా పఞ్చరాత్ర మథాపి వా | సప్తరాత్ర మథో కుర్యా త్క్వచి త్సద్యో7ధివాసనమ్‌. 52

సర్వయజ్ఞఫలో యస్మా దధివాసోత్సవ స్సదా.

ఇతి శ్రీమత్స్య మహాపురాణ అధివాసనవిధిర్నామ

చతుః షష్ట్యుత్తర ద్విశతతమో7ధ్యాయః.

మూర్తుల పేరులతో పాటుగ ఆమూర్తుల అధిదేవతలను గూడ పేర్కొందును: వరుసగా 1. శర్వుడు 2. భవుడు 3. పశుపతి 4. ఈశానుడు 5. భీముడు 6. రుద్రుడు 7. సోముడు 8. ఉగ్రుడు అనువారు అష్ట మూర్త్యధిపతులు: మూర్తి ప్రతిష్ఠా ప్రక్రియల యందు శివుని విషయమున గ్రహించవలసిన మూర్తులును మూర్తుల అధిపతులును వీరే: (వీరి నుద్దేశించి హోమము చేయువారు కావున ఆ ఋత్విజులకు మూర్తిపులు (మూర్త్యధిపతులు) అని వ్యవహారము.)

వీరి నుద్దేశించి వారి వారికి చెందు వైదిక మంత్రములతో హోమమాచరించవలయును.

ప్రతికుండ సమీపమునందును హోమ సమయమందే శాంతి ఘటములను నిలుపవలయును; నూరేసి ఆహుతులు కాని వేయేసి ఆహుతులు కాని కాగానే ఒక్కొక్క సారి పూర్ణాహుతి జరుపవలయును; పూర్ణాహుతి సామగ్రిని సమపాదుడై నేలపై నిలిచియుండి హోమకుండమందు వేయవలయును.

హోమము జరుపునపుడు ప్రతి ఆహుతియందును దర్వియందు మిగిలిన ఆహుతి శేషాంశమును పూర్ణ ఘటముల యందు వేయ (వదల) వలయును; దీనితో మిశ్రితమయిన జలముతో దేవుని మూలాంగ (పాద) మధ్యమాంగో (నాభి) త్తమాంగము (శిరము)లను తడుపవలయును; దేవుని నిలువబెట్టిన ఆహుతి శేష మిశ్రిత జలముతో న్నపనము కూడ చేయించవలయును.

ప్రతి యామమునందు చందనోదకముతో అవసేచనమును ధూపమును నైవేద్యమును జరుపవలయును. అట్లే పర్యాయక్రమమున మరలమరల హోమమును జరుపుచు పోవలయును; ప్రతి పర్యాయమును యజమానుడు ఋత్విజులకు దక్షిణలు తెల్లని వస్త్రములు వివిధములగు బంగారు కడియములు బంగరు హారములు బంగరు సూత్రములును సువర్ణాంగుళీయకములును పానుపులును ఈయవలయును; నూతన వస్త్రములును కట్టబెట్టవలయును; భోజనములును బాగుగా జరుపుచుండవలయును; అధివాసనము ముగియువరకును ఇదియంతయు జరుపుచుండవలెను. మూడు సంధ్యలయందును అన్ని దిశలయందును భూతబలి వేయుచుండవలయును; ప్రతిపూటను మొదట బ్రాహ్మణులకును అనంతరము మిగిలిన వర్ణములవారికిని (జనులకు) భోజనములును యథేష్టముగా పెట్టుచుండవలయును. నృత్య గీతాది మంగళ లక్షణములతో రాత్రియందు మహోత్సవము (గొప్ప వేడుక) జరుపుచుండవలెను; చతుర్థీ కర్మ (క్రియా) ముగియువరకును ('చతుర్థీ క్రియా' అనగా ప్రతిష్ఠాక్రియ అయియుండును) ఎల్లరును ప్రయత్నపూర్వకముగా యథాశక్తిగా పూజించుచుండవలయును.

ఈ చెప్పిన ఈ అధ్యాయమందలి ప్రక్రియకు 'అధివాసప్రక్రియ' అని వ్యవహారము ; ఇది ఒకటి కాని మూడుకాని ఐదు కాని -ఏడు కాని- (అహో) రాత్రములపాటు జరుపవలయును; కొన్ని కొన్ని సందర్భములలో సద్యో7ధి వాసనము (ప్రతిష్ఠకు కొంచెము ముందుగానే) అధివాసము జరుపుటయును కలదు; ఈ అధివాసప్రక్రియా ప్రాముఖ్యము ఏమియనిన దీనిచే సర్వయజ్ఞఫలము లభించును.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున దేవతా ప్రతిష్ఠా నిరూపణమునందు

అధివాసవిధాన కథనమను రెండువందల అరువది నాలుగవ అధ్యాయము

Sri Matsya Mahapuranam-2    Chapters