Sri Matsya Mahapuranam-2    Chapters   

ఏకోనషష్ట్యుత్తరద్విశతతమో7ధ్యాయః.

అర్ధనారీశ్వర ప్రతిమాలక్షణమ్‌.

సూతః అధునా సమ్ప్రపక్ష్యామి అర్ధనారీశ్వర పరమ్‌ | అర్ధేన దేవదేవస్య నారీరూపం సుశోభనమ్‌. 1

ఈశార్ధే తు జటాభాగో బాలేన్దుకలయా యుతః | ఉమార్దే చాపి దాతవ్యౌ సీమన్తతిలకా వుభౌ. 2

వాసుకి ర్దక్షిణ కర్ణే వామే కుణ్డల మాదిశేత్‌ | బాలికా చోపరిష్టాత్తు కపాలం దక్షిణ కరే. 3

త్రిశూలం వా7పి కర్తవ్యం దేవదేవస్య శూలినః | వామతో దర్పణం దద్యా దుత్పలం వా విశేషతః. 4

వామబాహుశ్చ కర్తవ్యంః కేయూరవలయాన్వితః | ఉపవీతం చ కర్తవ్యం మణిముక్తామయం తథా. 5

స్తనభార మథార్ధే తు వామే పీనం ప్రకల్పయేత్‌ః | హారార్ధముజ్జ్వలం కుర్యా చ్చ్రోణ్యర్ధం తు తథైవచ. 6

లిఙ్గార్ధ మూర్ధ్వగం కుర్యా ద్వ్యాఘ్రాజినకృతామ్బరమ్‌ | వామే లమ్బపరీదానం కటిసూత్రత్రయాన్వితమ్‌. 7

నానారత్న సమోపేతం దక్షిణ భుజగాన్వితమ్‌ | దేవస్య దక్షిణం పాదం పద్మోపరి సుసంస్థితమ్‌. 8

కిఞ్చిదర్దే తథా వామ భూషితం నూపురేణ తు | రత్నైర్విభూషితా న్కుర్యా దంగుళీష్వంగుళీయకా&. 9

సాలక్తకం తథా పాదం పార్వత్యా దర్శయే త్సదా | అర్ధనారీశ్వర స్యేదం రూప మస్మి న్నుదాహృతమ్‌. 10

రెండు వందల ఏబది తొమ్మిదవ అధ్యాయము.

అర్ధనారీశ్వరాది ప్రతిమాలక్షణములు:

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను: ఇపుడు శ్రేష్ఠమగు అర్ధనారీశ్వరుని మూర్తిని వివరింతును; దేవదేవుని అర్ధభాగముతో ఏర్పడి మిగుల శోభించు నారీరూపమిది;ఈ మూర్తియందు ఈశునికి చెందిన అర్ధభాగమందు బాలేందుకలతో కూడిన జటాభాగముండును; ఉమార్థమునందు సీమంతమును తిలకమును ఉంచవలయును; దక్షిణ కర్ణమందు వాసుకిని వామకర్ణమునందు కుండలమునుగాని త్రిశూలమును గాని వామహస్తమందు దర్పణమును ఉంచవలయును; కేయూరములతో వలయములతో కూడిన వామబాహువును మణిముక్తామయమగు యజ్ఞోపవీతమును వామార్ధమందు పీనమగు స్తనమును అమర్చవలయును; అట్లే ఎడమవైపు ఉజ్జ్వలమగు హారార్ధమును సగము లావగు పిరుదును నిర్మించవలయును; కుడి వైపున ఊర్ధ్వముఖమగు లింగార్ధమును వ్యాఘ్రాజిన వస్త్రమును వామాంశమందు వ్రేలాడు కట్టువస్త్రమును (చీరను)కటి సూత్రత్రయమును చేయవలయును; అందే నానా రత్న సముపేతహార ముండగా దక్షిణమందు భుజగహారముండును; దేవుని దక్షిణపాదము పద్మముపైనుండగా ఎడమపాదము మాత్రము కొంచెము భాగము నూపురముతో భూషితమయియుండును; వామాంగుళులయందు రత్న విభూషితాంగుళీయకములుండవలయును; వామపాదము లత్తుకరసముతో అలంకృతమయి యుండును; ఇది అర్ధనారీశ్వరరూపము.

ఉమామహేశ్వరస్యాపి లక్షణం శృణుత ద్విజాః | సంస్థానంతు తయో ర్వక్ష్యే లీలాలలిత విభ్రమమ్‌. 11

చతుర్భుజం ద్విబాహుం వా జటాభారేన్దుభూషితమ్‌ | లోచనత్రయ సంయుక్త ముమైకస్కన్ధపాణినమ్‌. 12

దక్షిణనోత్ఫలం శూలం వామే కుతభ##రే కరమ్‌ | ద్వీపిచర్మపరీధానం నానారత్నో పవీతినమ్‌. 13

సుప్రతిష్ఠం సువేషం చ తథా7ర్ధేన్దుకృతాననమ్‌ | వామే తు సంస్థితా దేవీ తస్యోరౌ బాహుగూహితా. 14

శిరో భూషణసంయుక్తై రలకై ర్లలితాననా | సబాలికా కర్ణవతీ లలాటతిలకోజ్జ్వలా. 15

మణికుణ్డలసంయుక్తా కర్ణికాభరణా క్వచిత్‌ | హారకేయూరబాహుళా హరవక్త్రావలోకినీ. 16

వామాంసం దేవదేవస్య స్పృశన్తీ లీలయా తతః | దక్షిణం తు బహిః కృత్వా బాహుం దక్షిణతస్తథా. 17

స్కన్దం వా దక్షిణ కుక్షౌ స్పృశన్త్యంగుళిభిః క్వచిత్‌ | వామే చ దర్పణం దద్యా దుత్పలం వా సుశోభనమ్‌. 18

కటిసూత్రత్రయం చైవ నితమ్బే స్యాత్ప్రలమ్బకమ్‌ | జయాచ విజయా చైవ కార్తికేయవినాయకౌ. 19

పార్శ్వయో ర్దర్శయే త్తత్ర తోరణ గుణగుహ్యకా& | మాలాంవిద్యాధరాం స్తద్వ ద్వీణావా సప్సరోగణః. 20

శివనారాయణ ప్రతిమాలక్షణమ్‌.

ఏతద్రూప ముమేశస్య కర్తవ్యం భూత మిచ్ఛతా | శివనారాయణం వక్ష్యే సర్వపాపప్రణాశనమ్‌. 21

ఉమా మహేశ్వర ప్రతిమాలక్షణము.

ద్విజులారా! ఉమా మహేశ్వర ప్రతిమాలక్షణమును తెలిపెదను వినుడు; లీలాలలితవిభ్రమయుక్తమగు పార్వతీ పరమేశ్వరుల ఉనికి ఆ మూర్తియందు ఎట్లుండునో చెప్పెదను; ఈ శివుడు చతుర్భుజుడుగాని ద్వబాహుడుగాని కావచ్చును; జటాభారము ఇందుఖండాలకరణము లోచనత్రయము ఉండును; ఉమాస్కంధమందుంచిన ఏకపాణియు కుడిచేత శూలమును కలువపూవును ఉండగా ఎడమచేయి పార్వతీ స్తనమును స్పృశించుచుండును; వ్యాఘ్ర చర్మ వస్త్రము నానారత్నోపవీతము కలిగి మంచినిలుకడయు చక్కని వేషమును అర్ధేందు నమలంకృత వదనమును ఉండును; అతని ఎడమ తొడయందు దేవి అతని ఎడమబాహువుతో ఆలింగితురాలై ఉండును; ఆమె శిరోభూషణుములతో కూడిన ముంగురులతో అందమగు ముఖము కలిగి చెవులందు బావిలీలు లలాటమందు తిలకము కలిగి ప్రకాశించుచు మణికుండలములును కొన్ని ఎడల మణికర్ణికలును ధరించి అనేక హారకేయూరములును కలిగి శివుని ముఖమవలోకించుచుండును; ఆమె దేవదేవుని ఎడమభుజమును విలాసముగా స్పృశించుచు తన దక్షిమబాహువును కుడివైపుగా బయటకు వదలి ఉండును. కొన్ని విగ్రహములందు దక్షిణ బాహువును శివుని స్కంధమందుగాని కుక్షిదక్షిమణ పార్శ్వమందుగాని ఉంచి ఎడమచేతియందు దర్పణమునుగాని సుశోభనమగు కలువను గాని దాల్చియుండును! ముప్పేటకటి సూత్రము పిరుదుల మీదినుండి వ్రేలాడుచుండును; తోరణమునందు రెండు పార్శ్వములందును జయవిజయులు కార్తికేయ వినాయకులు గణపతులు గహ్యకులు పంక్తులుగా విద్యాధరులు వీణాధారిణులగు అప్సరసలు ప్రదర్శింపబడవలయును; ఇట్లు ఉమా మహేశ్వర మూర్తిని నిర్మించుట శుభ కరము; ఇక సర్వపాప ప్రణాశనమగు శివనారాయణ రూపమును వివరింతును.

వామార్ధే మాధవం కూర్యా ద్దక్షిణ శూలపాణినమ్‌ | బాహుద్వయం చ కృష్ణస్య మణికేయూరభూషణమ్‌. 22

శఙ్ఖటక్రధరం శాన్త మారక్తాంగుళివిభ్రమమ్‌ | చక్రస్థానే గదాం వారి పాణౌ దద్యా ద్గదాభృతః. 23

శఙ్ఖం చైవేతరే దద్యా త్కట్యర్ధం భూషణోజ్జ్వలమ్‌ | పీతవస్త్రపరీదానం చరణం మణిభూషణమ్‌. 24

దక్షిణార్ధే జటాభార మర్ధేన్దుకృత భూషితమ్‌ | భుజఙ్గహారవలయం వరదం దక్షిణం కరమ్‌. 25

ద్వితీయం చాపి కుర్వీత త్రిశూలవరధారిణమ్‌ | వ్యాళోపవీతసంయుక్తం కట్యర్ధం కృత్తివాససమ్‌. 26

మణిరత్నైశ్చ సంయుక్తం పాదం నాగవిభూషితమ్‌ | శివనారాయణసై#్యవం కర్తవ్యం రూప ముత్తమమ్‌. 27

మహావరాహ ప్రతిమాలక్షణమ్‌.

మహావరాహం వక్ష్యామి పద్నహస్తం గదాధరమ్‌ | తీక్షణదంష్ట్రోగ్రఘోణాస్యం మేదినివామకూర్పరమ్‌. 28

దంష్ట్రాగ్రేణోద్ధృతాం దాన్తాం ధరణీ ముత్పలాన్వితమ్‌ | విస్మయోత్ఫుల్లనయనా ముపరిష్టా త్ప్రకల్పయేత్‌. 29

దక్షిణం కటిసంస్థంతు కరం తస్యాః ప్రకల్పయేత్‌ | కూర్మోపరి తథా పాద మేకం నాగేన్ద్రమూర్థని. 30

సంస్తూయమానం లోకేశై స్సమన్తా త్పరికల్పయేత్‌ | నారసింహ ప్రతిమాలక్షణమ్‌.

నారసింహ ప్రకర్తవ్యం భుజాష్టకసమన్వితమ్‌. 31

రౌద్రం సింహాసనం తద్వ ద్విదారితముఖేక్షణమ్‌ | స్తబ్ధపీనసటాకర్ణం దారయస్తం దితే స్సుతమ్‌. 32

వినిర్గతాన్త్రజాలం చ దానవం పరికల్పయేత్‌ | వమన్తం రుధిరం ఘేరం భ్రకుటీవదనేక్షణమ్‌. 33

యుధ్యమానస్తు కర్యవ్యః క్వచిత్కరణబన్ధనైః | పరిశ్రాన్తేన దైత్యేన తర్జ్యమానో ముహుర్ముహుః. 34

దైత్యం ప్రదర్ణయే త్తత్ర ఖఢ్గఖేటకధారిణమ్‌ | స్తూయమానం తథా విష్ణుం దర్శయే

దమరాధిపైః. 35

శివ నారాయణ ప్రతిమాలక్షణము.

ఈమూర్తియందు వామార్ధమందు మాధవుడును దక్షిణార్ధమునందు శూలపపాణియు నుండును; కృష్ణుని బాహు ద్వయమునకు మణికేయూరములు భూషణములు; శంఖ చక్రములు హస్తద్వయమందుండును; శాన్తమూర్తి; అంగుళులు కొంచెమెర్రనివి; కృష్ణుని (గదాధారి) పాణియందు చక్రమునకు మారుగ గదనైన నుంచవచ్చును; కటివామార్ధము భూషణులతో ఉజ్జ్వలమును పీతాంబరయుక్తమునగును; చరణములందు మణిభూషణములు; ఇక దక్షిణార్ధమందు జటాభారమును అర్ధచంద్రాలంకరణమును భుజంగహారవలును వరద దక్షిణహస్తమును త్రిశూలహస్తమును సర్పయజ్ఞోపవీతమును కటియందు (దక్షిణార్ధమున) చర్మాంబరమును మణిరత్నములతోను నాగముతోను విభూషితమగు పాదమును నుండును. శివనారాయణమూర్తి ఇంట్లుండును.

మహా వరాహ ప్రతిమాలక్షణము.

మహా వరాహమూర్తిని వివరింతును: ఇతడు పద్మహస్తుడు-గదాధరుడు; తీక్‌ష్ణములగు కోరలును ఉగ్రమగు ముట్టెయు ముఖమును కలిగి ఎడమ మోచేయి భూదేవిపైనుంచును; ఆమెను తన కొనకోరతో పైకెత్తుచుండును; ఆమె జితేంద్రియయై చేతులందు కలువలు కలిగి విన్మయములో కన్నులు వికసించి పైభాగమందుండునట్లు నిర్మించవలెను; ఆమె కుడిచేయి తనకటిపైనుండును; ఆతనిని చుట్టునున్న లోకపాలురు స్తుతించుచుందురు.

నారసింహ ప్రతిమా లక్షణము.

నరసింహమూర్తికి ఎనిమిది భుజములు; రౌద్రమూర్తి; సింహముఖము; విప్పారిన ముఖమును కన్నులును; నిక్క పొడిచి బలిసియున్న జూలును నిక్కపొడిచిన చెవులును; హిరణ్యకశిపుని చీల్చుచుండును; ఆ దానవుని ప్రేవులు బయటికి వచ్చుచుండును; వాడు నెత్తురుక్రక్కుచు కనుబొమలముడితోకూడిన ముఖమును కన్నులును కలిగియుండును; కొన్న మూర్తులందు వాడు యుద్ధమునందు కరణ బంధములతో యుద్ధము చేయుచున్నట్లుండును; ఆ దైత్యుడు అలసి మాటి మాటికి నరసింహుని బెదించుచుండును: వాని చేతులందు ఖేడ్గమును ఖేటకమునుండును; ఆ దేవుని అమర శ్రేష్ఠులు పొగడుచుందురు.

త్రివిక్రమ ప్రతిమాలక్షణమ్‌.

తథా త్రివిక్రమం వక్ష్యే బ్రహ్మాణ్డక్రమణోల్బణమ్‌ | పాదపార్శ్వే తథా బాహు ముపరిష్టా త్ప్రదర్శయేత్‌.

అధస్తా ద్వామనం తత్ర కల్పయే త్సకమణ్డలుమ్‌ | దక్షిణ ఛత్త్రికాం దద్యా న్ముఖం దీనం ప్రదర్శయేత్‌.

మత్స్యరూపం తథా మత్స్యం కూర్మం కూర్మాకృతిం న్యసేత్‌ | ఏవంరూపస్తు భగవా న్కార్యో నారాయణో హరిః. 39

బ్రమ్మ ప్రతిమాలక్షణమ్‌.

బ్రహ్మా కమణ్డలుధరః కర్తవ్య స్స చతుర్ముఖః | హంసారూఢః క్వచిత్కార్యః క్వచిచ్చ కమలాసనః. 40

వర్ణేన పద్మగర్భాభ శ్చతుర్బాహు శ్శుభేక్షణః | కమణ్డలుం వామకరే స్రువం హస్తేచ దక్షిణ. 41

వామే దణ్డధరం తద్వ త్స్రుచం చాపి ప్రదర్శయేత్‌ | మునిభి ర్దేవగన్ధర్వై స్త్సూయామానం సమన్తతః. 42

కుర్వాణ మివలోకాం స్త్రీ ఞ్ఛుక్లామ్బరధరం విభుమ్‌ | మృగచర్మధరం వాపి దివ్యజ్ఞోపవీతినమ్‌. 43

అజ్యస్థాలీం తథా పార్శ్వే వేదాంశ్చ చతురః పునః | వామపార్శ్వే తు సావిత్రీం దక్షిణన సరస్వతీమ్‌. 44

ఆగ్రేచ బుషయ స్తద్వ త్కార్యాః పైతామహే పదే | కార్తికేయం ప్రవక్ష్యామి తరుణాదిస్యసన్నిభమ్‌. 45

కమలోదరవర్ణాభం కుమారం సుకుమారకమ్‌ | దణ్డకేయూరకైరన్యుక్తం మయూరవరవాహనమ్‌. 46

స్థాపయే త్స్వేష్టనగరే భూజా న్ద్వాదశ కల్పయేత్‌ | చతుర్భ.ః ఖర్వటే స్యా ద్వనే గ్రామే ద్విబాహుకః.

శక్తిః పాశ స్తథా ఖడ్గ శ్శర శ్శూలం తథైవచ | వరదశ్చైవ హస్త స్స్యా దథ చాభయదో భ##వేత్‌. 48

ఏతే దక్షిణతో జ్ఞేయాః కేయూరకటకోజ్జ్వలాః | ధనుః పతాకా ముష్టిశ్చ తర్జనీ తు ప్రసారితా. 49

ఖేటకం తామ్రచూడం చ వామహస్తే తు శస్యతే | ద్విభుజస్య కరే శక్తి ర్వామే స్యా త్కుక్కుటోపరి. 50

చతుర్భజే శక్తిపాశౌ వామతో దక్షిణ త్వసిః | వరదో7భయదో వా7పి దక్షిణ స్స్యా త్తురీయకః. 51

త్రివిక్రమ ప్రతిమాలక్షణము.

త్రివిక్రమమూర్తి బ్రహ్మాండములను ఆక్రమించుచు తీవ్ర రూపముతో నుండును; అతడు తన ఎత్తిన పాదమును ఒక బాహువుతో పట్టుకొనియుండును; అందే క్రింది భాగమందు ఎడమచేత కమండలువు ధరించిన వామనుని నిర్మించవలయును; అతనిచేత చిన్న గొడుగుండును; అతడు దీనముఖుడు; అతని పార్శ్వమందు జలభృంగారము ధరించి బలి యుండును; ఈదేవుడు ఆబలిని బంధించుచుండును; ఆతని దగ్గరనే గరుడుడుండును.

మత్స్యకూర్మ ప్రతిమాలక్షణములు.

మత్స్యుని మత్స్యరూపముతో కూర్ముని కూర్మ రూపముతో నిర్మించవలయును; భగవానుడును నారాయణుడును నగు హరిరూపములిట్లుండును.

బ్రహ్మ ప్రతిమాలక్షణము.

బ్రహ్మ కమండలు ధరుడు; చతుర్ముఖుడు; హంసారూఢుడుః లేదా కమలాసనుడు; తామరపూవు లోపలి కాంతితో నుండు దేహచ్ఛాయ; చతుర్బాహుడు; ఒప్పిదమగు కన్నులవాడు; ఎడమ చేతియందు కమండలువు; కుడి చేతియందు స్రువముండును; మరియొక ఎడమచేత దండమును మరియొక కుడిచేతియందు స్రుక్కునుండును; అన్ని వైపుల నిలిచి దేవతలు గంధర్వులు మునులు నితనిని స్తుతించుచుందురు; ఇతడు త్రిలోకములను సృజించుచుండును; శుక్ల వస్త్రధరుడు; విభుడు; మృగ చర్మధారియైన కావచ్చును; దివ్య యజ్ఞోపవీతి; దగ్గర ఆజ్యస్థాలి-నాల్గు వేదములు నుండును; ఎడమవైపునందు సావిత్రి కుడివైపున సరస్వతియుందురు; ముందు ఋషులుందురు.

కార్తికేయ ప్రతిమాలక్షణము.

కార్తికేయుడు (కుమారస్వామి) బాల సూర్యునివలె కాంతి కలవాడు; కమలాంతర్భాగమువలె సుకుమారచ్ఛాయ గలవాడు; సుకుమారుడుగు కుమారుడు; భుజములందు కేయూరములును హస్తమునందు దండమునుండును; మయూర వాహనుడు; తన ఇచ్ఛానుసారము ఈ దేవుడే నగర (స్థాన) మందు ఉన్నట్లయిన చూపవచ్చును: అపుడతడు ద్వాదశ భుజుడు; గూడెమునందున్నట్లు చూపినచో చతుర్భుజుడు; గ్రామమందో వనమందోయున్నట్లు చూపినచో ద్విబాహుడు; కుడివైపున శక్తి-పాశము ఖడ్గము శరము శూలము వరదహస్తముకాని అభయ హస్తము కానియుండును; ఎడమ చేతులందు ధనువు- పతాక-పిడికిలి-చాచిన చూపుడువ్రేలు -ఖేటకమయు- కోడిపుంజు-ఇవి ద్వాదశ భుజునకు; ద్వాభుజునకు దక్షిణ హస్తమునందు శక్తియు ఎడమచేతియుందు కోడిపుంజు నుండును; చతుర్భుజునకు ఎడమ చేతులందు శక్తియు పాశమును కుడిచేతులందు ఖడ్గమును వరదహస్తముకాని అభయ హస్తముకాని యుండును.

వినాయక ప్రతిమాలక్షణమ్‌.

వినాయకం ప్రవక్ష్యామి గజవక్త్రం త్రిలోచనమ్‌ | లమ్బోదరం చతుర్బాహుం వ్యాళయజ్ఞోపవీతినమ్‌. 52

శూర్పకర్ణం బృహత్తుణ్డ మేకదంష్ట్రం పృథూదరమ్‌ | స్వదన్తం దక్షిణకరే ఉత్పలం చాపరే తథా. 53

మోదకం పరశుం చైవ వామతః పరికల్పయేత్‌ | బృహత్త్వాత్‌క్షప్తవదనం పీనస్కన్దాఙ్గ్రిపాణికమ్‌. 54

యుక్తం తు బుద్ధిబుద్ధిఖ్యా మధస్తా న్మూషకాన్వితమ్‌ | కాత్యాయనీ ప్రతిమాలక్షణమ్‌. కాత్యాయన్యాః ప్రవక్ష్యామి రూపం దశభుజం తథా. 55

త్రయాణామపి దేవానా మనుకారానుకారిణీమ్‌ | జటాజూటసమాయుక్తా మర్ధేన్దుకృతలక్షణామ్‌. 56

లోచనత్రయసంయుక్తాం పద్మేన్దుసదృశౄననామ్‌ | అతసీపుష్పసఙ్కశాం సుప్రతిష్ఠాం సులోచనామ్‌. 57

నవ¸°వనసమ్పన్నాం సరవాభరణభూషితామ్‌ | సుచారుదశనాం తద్వ త్పీనోన్నతపయోధారామ్‌. 58

త్రిభిజ్గస్థానసంస్థానాం మహిషాసురమర్దినీమ్‌ | త్రిశూలం దక్షిణ దద్యా త్ఖడ్గం చక్రం తథైవచ. 59

తీక్షంబాణం తథా శక్తిం వామతో7పి నిబోధత | ఖేటకం పూర్ణచాపంచ పాశ మజ్కుశ మేవచ. 60

ఘణ్ణాం వా పరశుం వాపి వామత స్సన్నివేశ##యేత్‌ | అధస్తా న్మషిషం తద్వ ద్ద్విశిరస్కం ప్రదర్శయేత్‌.

శిరచ్ఛేదోద్భవం తద్వ ద్దానవం ఖడ్గపాణినమ్‌ | హృది శూలేన నిర్భిన్నం తిర్యగ్రక్తవిభూషితమ్‌. 62

రక్తర క్తీకృతాఙ్గం చ రక్త విస్ఫారితేక్షణమ్‌ | వేష్టితం నాగపాశేన భ్రుకుటీభీషణాననమ్‌. 63

వమద్రుధిరవక్త్రంచ దేవ్యా స్సింహం ప్రదర్శయేత్‌ | దేవ్యాస్తు దక్షిణం పాదం సమం సింహోపరి స్థితమ్‌.

కిఞ్చిదూర్ధ్వం తథా వామ మంగుష్ఠం మహిషోపరి | స్తూయమానం చ తద్రూప మమరై స్సన్నివేశ##యేత్‌.

ఇన్ద్రప్రతిమాలక్షణమ్‌.

ఇదానీం సురరాజస్య రూపం వక్ష్యే విశేషతః | సహస్రనయనం దేవం మత్తవారణసంస్థితమ్‌. 66

పృథూరువక్షోవదనం సింహస్కన్ధం మహాభుజమ్‌ | కిరీటకుణ్డలధరం పీవరోరు భుజేక్షణమ్‌. 67

వజ్రోత్పలధరం తద్వ న్నానాభరణభూషితమ్‌ | పూజితం దేవగన్దర్వై రప్సరోగణసేవితమ్‌. 68

ఛత్త్రచామరధారిణ్య స్త్స్రియః పార్శ్వే ప్రదర్శయతే | సింహాసననగతం వాపి గన్ధర్వగణసేవితమ్‌. 69

ఇన్ద్రాణీం వామత శ్చాస్య కుర్యా దుత్పలధారిణీమ్‌. 69

ఇతి శ్రీమత్స్య మహాపురాణ అర్ధనారీశ్వరప్రతిమాదిలక్షణం నామ ఏకోన షష్ట్యుత్తర ద్విశతతమో7ధ్యాయః.

వినాయకమూర్తి లక్షణము.

వినాయకుడు గజముఖుడు-త్రిలోచనుడు-లంబోదరుడు-చతుర్భుజుడు-సర్పయజ్ఞోపవీతధారి; చేటల వంటి చెవులు పెద్దతుండము ఏకదంతము పెద్దకడుపు కలవాడు; ఒక కుడిచేతియందు తన దంతమును రెండవ చేతియందు కలువపూవును ధరించును. ఒక ఎడమ చేతియందు లడ్డులు (ఉండ్రాలు) రెండవదానియందు గండ్రగొడ్డటిని ధరించును; శరీరము చాల పెద్దదియగుటచే ముఖము చిన్నదిగా కనబడును; బలిసిన భుజమూలములు పాదములు చేతులు కలవాడు; బుద్ధి బుద్ధి అను భార్యలతో కూడినవాడు; క్రింది భాగమున ఎలుకయుండును.

కాత్యాయనీ ప్రతిమాలక్షణము.

ఈమె దశభుజ; ఈమెయందు (బ్రహ్మ విష్ణు రుద్ర) దేవతాత్రయ లక్షణములునుండును: ఈమె జటాజూటము అద్ధ చంద్రుడు లోచనత్రయము పద్మేందు నదృశముఖము అవిసిపూవుచాయను పోలినచాయ చక్కని నిలుకడ చక్కని కన్నులు కలది; నవ¸°వన సంపన్న-నర్వాభరణ భూషిత-మిగుల మనోహరములగు దంతముల కలది-పీనోన్నత న్తనయుక్త. త్రిభంగస్థాన సంస్థానయుక్త (నితంబ భారముచే వేణీ భారముచే కలిగిన మూడు ఒయ్యారపు వంపులు కలది) మహిషాసురమర్దిని; కుడి చేతులందు త్రిశూల ఖడ్గచక్ర తీక్ష్న బాణ శక్తులును ఎడమచేతులందు భేటక-పూర్ణచాప-పాశాంకుశములును ఘంటకాని గండ్రగొడ్ణలి కాని ఉండును: దిగువను రెండు తలలు కల మహిషమును శిరశ్ఛేదము కలిగిన ఖడ్గపాణియగు దానవుడు నుండును. వాని హృదయమున శూలము గ్రుచ్చబడియుండును. అడ్డముగా రక్తము న్రవించుచుండును. వాని శరీరావయవములన్నియు నెత్తటితో ఎర్రనై విప్పారిన ఎర్రని కన్నులు కలిగి నాగపాశ##వేష్టితుడై భ్రుకుటి భీషణముఖుడై యుండును. రక్తము వెలికి వచ్చుచున్న నోటితో దేవి వాహన సింహమును నిర్మించవలెను. దేవి దక్షిణపాదమా వాహనముపై సరి మట్టముగా నుంచబడియుండును. ఎడమ పాదము కొంచెముగ పైకెత్తి దాని బోటనవ్రేలు మహిషముపై నుండును. ఆమె రూపమును అమరులు స్తుతించుచుందురు.

ఇంద్ర ప్రతిమాలక్షణము.

ఇంద్రుడు సహస్రనయనుడై మత్త గజముపై నుండును. విశాల వక్షో వదనయుతడు సింహమునకువలె మూపులు కలవాడు. మహాభుజుడు. కిరీట కుండలధరుడు. బలిసిన పెద్ద భుజములును పెద్ద కన్నులును కలవాడు. వజ్రమును కలువపూవును ధరించినవాడు; నానాభరణ భూషితుడు; దేవగందర్వ పూజితుడు - అప్సరోగణ సేవితుడు; పార్శ్వములందు ఛత్త్ర చామర ధారిణులగు స్త్రీలుందురు; లేదా సింహాసనగతుడు గంధర్వ గణసేవితుడుగానైన ఇతని చూప వచ్చును; ఇతని ఎడమవైపున ఉత్పల ధారిణియగు ఇంద్రాణి (శచీదేవి) యుండును.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున అర్ధనారీశ్వరాది ప్రతిమాలక్షణమను

రెండు వందల ఏబది తొమ్మిదవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-2    Chapters