Sri Matsya Mahapuranam-2    Chapters   

అష్టపఞ్చాశదుత్తర ద్విశతతమో7ధ్యాయః.

ఈశ్వరప్రతిమాలక్షణమ్‌.

సూతః అతఃపరం ప్రవక్ష్యామి దేవాకారా న్విశేషతః | దశతాల స్స్మృతో రామో బలి ర్వైరోచని స్తథా. 1

వారాహో నారసింహశ్చ సప్తతాళశ్చ వామనః | మత్స్యః కూర్మో వినిర్దిష్టౌ యథాశోభం స్వయమ్భువా. 2

అతఃపరం ప్రవక్ష్యామి రుద్రాద్యాకార ముత్తమమ్‌ | ఆపీనోరుభుజస్కన్ధ స్తప్తకాఞ్చనసన్నిభః. 3

శుక్లార్కరశ్మిసఙ్ఘాత శ్చన్ద్రాఙ్కితజటో విభుః | ద్వ్యష్టవర్షాకృతి స్సోపి జటామకుటభూషితః. 4

బాహూ వారణహస్తాభౌ వృత్తజఙ్ఘోరుమణ్డలః | ఊర్ధ్వకేశస్తు కర్తవ్యో దీర్ఘాయతవిలోచనః. 5

వ్యాఘ్రచర్మపరీధానః కటిసూత్రత్రయాన్వితః | హారకేయారసమ్పన్నో భుజగాభరణ స్తథా. 6

బాహావశ్చాపి కర్తవ్యానానాభరణభూషితాః | పీనోరుగణ్డఫలకః కుణ్డలాభ్యా మలఙ్కృతః. 7

ఆజానులమ్బిబాహుశ్చ సౌమ్యమూర్తి స్సుశోభనః | ఖేటకం వామహస్తే తు ఖడ్గం చైవ తు దక్షిణ. 8

శక్తిం దణ్డం త్రిశూలం చ దక్షిణ వినివేశ##యేత్‌ | కాపాలం వామపార్శ్వే తు నాగం ఖట్వాఙ్గ మేవచ. 9

ఏకశ్చ వరదో హస్త స్తథా7క్షవలయో7పరః | వైశాఖం స్థానకం కృత్వా నృత్యాభినయసంస్థితః. 10

నృత్య న్దశభుజః కార్యో గజచర్మధర స్తథా | తథా త్రిపురదాహే చ షోడశైవ తు బాహవః. 11

శఙ్ఖం చక్రం గదా శారఙ్గం ఘణ్టా తత్రాధికా భ##వేత్‌ | తథా ధనుః పినాకం చ శరో విష్ణుమయ స్తథా. 12

చతుర్భుజో7ష్టబాహుర్వా జ్ఞానయోగేశ్వరో మతః | తీక్షణానాసాగ్రదశనః కరాళవదనో మహా& . 13

రెండు వందల ఏబది ఎనిమిదవ అధ్యాయము.

దేవతామూర్తి విశేష లక్షణములు- శంకర- తాండవేశ్వర - త్రిపురదాహేశ్వర-

భైరవేశ్వరాది మూర్తుల లక్షణములు.

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను: ఇక మీదట ఆయా దేవతారూపములను విశేషా కారమున- వేరువేరుగా- చెప్పెదను; రామమూర్తియు విరోచన పుత్త్రుడగు బలి మూర్తియు వరాహమూర్తియు నరసింహ మూర్తియు -దశతాల ప్రమాణములు; వామన మూర్తి సప్తతాళ ప్రమాణము; మత్స్య కూర్మ మూర్తులు శోభగానుండునట్లు ఎంత పరిమాణముతో నైన నిర్మించవచ్చును. అని స్వయంభూ బ్రహ్మా చెప్పెను.

ఇక మీదట రుద్రాది మూర్తుల లక్షణముల చెప్పెదను. ఈశ్వరమూర్తి- బాగుగ బలిసిన ఊరువులు భుజములు భజస్కంధములు తప్తకాంచన సమాన శోభ శుక్ల రవి కిరణ రాశి ప్రకాశము చంద్రాంకిత జటాకలాపము పదునారు సంవత్సరముల వయస్సు జటా మకుట భూషణములు గజహస్తు సమాన బాహువులు వృత్త జంఘోరు మండలములు ఊర్ధ్వకేశములు దీర్ఘాయుత విలోచనములు వ్యాఘ్ర చర్మ వస్త్రము మూడుకటి సూత్రములు హారకేయురాలంకారములుభుజగా77భరణములు నానాభరణ భూషిత బాహువులు బలిసిన విశాల గండ ఫలకము కుండలాలంకారములు ఆజాను లంబి బాహు వులు సౌమ్యమగు మూర్తి కలిగి శోభించుచుండును; ఎడమ చేతులందు ఖేటకము కపాలము నాగము ఖట్వాంగమును కుడి చేతులందు ఖఢ్గశక్తి దండత్రిశూరములు నుండును.

తాండవేశ్వర మూర్తికి- ఒక చేతియందు వరద ముద్ర రెండవ చేతియందు అక్షమాల యుండును. ఇతడు వైశాఖమను స్థానకము (నృత్యభంగి విశేషము)తో నృత్యాభినయమందు ఉండును; దశ భుజుడును గజ చర్మాధారియునై నృత్యమొనర్చుచుండును.

త్రిపురదాహేశ్వమూర్తికి షోడశబాహువులు; దశభుజమూర్తి యందుకంటె ఈ మూర్తి యందు శంఖము చక్రము గదా శార్జధనువు ఘంట పినాక ధనువు విష్ణుమయశరము అను ఆరాయుధములధికముగా నుండును.

యోగేశ్వరమూర్తియందు చతుర్భుజములో అష్ట భుజములో యుండును. భైరవేశ్వమూర్తికి నా సాగ్రమును దంతములును తీక్షణములయినవి; ముఖము భయంకరము; ఈ మూర్తిని ప్రత్యాయతనము (ఉపాలయము) నందేకాని మూలాయ తనము (ప్రధానాలయము) నందు ప్రతిష్ఠించరాదు.

భైరవ శ్శస్యతే లోకేవ్రత్యాయతనసంస్థితః | న మూలాయతనే కార్యో భైరవస్తు భయఙ్కరః. 14

నరసింహో వరాహో వా తథా7న్యే చ భయఙ్కరాః | నాధికాఙ్గా న హీనాఙ్గా కర్తవ్యా దేవతాః శ్వచిత్‌. 15

స్వామినం ఘాతయే న్న్యూనా కరాళవదనా తథా | అధికా శిల్పినం హన్యా త్కృశా చైవార్థనాశినీ. 16

వక్రనాసా తు దుఃఖాయ సఙక్షిప్తాఙ్గీ భయఙ్కరీ | కృశోదరీ తు దుర్భిక్షం నిర్మాంసా ధననాశినీ. 17

చిపిటా దుఃఖరోగాయ అన్రేతా నేత్రనాశినీ | దుఃఖదా హీనక్త్రా చ పాణిపాదకృశా తథా. 18

హీనాఙ్గా హీనజఙ్ఘా చ భ్రమోన్మాదకరీ నృణామ్‌ | శుష్కవక్త్రాతు రాజానం కటిహీనాం చ యా భ##వేత్‌.19

పాణిపాదవిహీనో యో జాయతే మారకో మహా& | జఙ్ఘాజానువిహీనా చ శత్రుకల్యాణకారిణీ. 20

పుత్త్రమిత్రవినాశాయ హీనవక్షస్థ్సలా తు యా | సమ్పూర్ణావయవా యా తు ఆయుర్లక్ష్మీప్రదా సదా. 21

ఏవం లక్షణ మాసాద్య కర్తవ్యః పరమేశ్వరః | స్తూయమాన స్సురైస్సర్వై స్సమన్తా ద్దర్శయే ద్భవమ్‌. 22

శ##క్రేణ నన్ధినా చైవ మహాకాళేన శఙ్కరమ్‌ | ప్రణతా లోకపాలాస్తు పార్శ్వే తు గణనాయకాః. 23

నృత్యద్భృఙ్గీ రిటిశ్చైవ భూతబేతాళసంవృతః | సర్వే హృష్టాస్తు కర్తవ్యా స్త్సువన్తః పరమేశ్వరమ్‌. 24

గన్ధర్వవిద్యాధరకిన్నరాణా మథాప్సరోగుహ్యకనాయకానామ్‌ | గణౖ రనేకై శ్శతశో7మరేన్ద్రై ర్మునిప్రవీరై రపి నమ్యమానమ్‌. 25

ధృతాక్షసూత్రై శ్శతశః ప్రవాళపుష్పోపహార ప్రచయం దధిద్భిః | సంస్తూయమానం భగవన్త మీడ్య నేత్రత్రయేణామరమర్త్యపూజ్యమ్‌. 26

ఇది శ్రీమత్స్యమహాపురాణ ఈశ్వర ప్రతిమాలక్షణాదికథనం నామ

అష్టపఞ్చాశదుత్తరద్విశతతమో7ధ్యాయః.

(ఈ భైరవేశ్వమూర్తి కాదు;) నారసిహ వరాహాది భయఙ్కరమూర్తులు ఏవియు అధికాంగములుగాగాని హీనాంగములుగాగాని ఎక్కడను ఎప్పుడును చేయరాదు. భయంకరముఖముగల మూర్తులనుగాచేసినచో స్వామికిని శిల్పికిని నాశము కలిగించును; అర్థనాశమును చేయును; వక్రనాసికగల మూర్తి దుఃఖమును తక్కువ పరిమాణముగల అవయవములతో నున్నచో భయమును -కృశోదరియగు మూర్తి దుర్భిక్షమును - మాంసము (పుష్టి)లేని మూర్తి ధననాశమును చప్పిట ముక్కుగల మూర్తి దుఃఖమును రోగమును - కన్నులు లేని మూర్తి నేత్రనాశమును ముఖము హీనమయినచో దుఃఖమును పీలగానున్న కాలుసేతులు గలదియు హీనాంగయు హీనజంఘయు భ్రమోన్మాదములను -కలిగింతును; ముఖముగాని కటిగాని లోపముతోనున్నచో రాజును చంపును; కాలుసేతులలో లోపమున్నను ఆమూర్తి అధికముగా మృత్యువును కలిగించును; పిక్కలును మోకాళ్లును సరిగాలేని మూర్తి శత్రువులకు క్షేమకరము; వక్షఃస్థలమున లోపమున్నచో పుత్త్రమిత్త్ర వినాశకరము; సంపూర్ణావయమూర్తి ఆయువును ఐశ్వర్యమును కలిగించును.

ఈ లక్షణ దోషములవలనిహాని నెరిగి అవిలేని లక్షణములతో పరమేశ్వర మూర్తిని నిర్మించవలయును. ఆమూర్తిని అన్నివైపులయందుండి సకల సురులును స్తుతించుచుండవలయును; ఇంద్రుడు నంది మహాకాలుడు లోక పాలురు పార్శ్వములందు గణనాయకులు ప్రణతులయియుండ నృత్యమాడుచున్న భృంగియురిటియు భూతబేతాళులును హర్షపూర్ణులై ఆయనను స్తుతించుచున్నట్లును గంధర్వ విద్యాధర కింసరాప్సరోగుహ్యకాదిదేవతాగణములును అమరనాయకులును ముని ప్రవీరులును ఆయనను నమస్కరించుచున్నట్లును మూర్తిని నిర్మించవలెను. అసురులును మానవులును అక్షసూత్రములను ప్రవాళములను పుష్పములను ధరించియుండి ఉపహారములుగా ఈశ్వరునకు అవిఅర్పించుచుండ త్రినేత్రముగ పరమేశ్వరమూర్తి భేదములుండవలయును.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున ఈశ్వరప్రతిమాది లక్షణ కథనమను

రెండు వందల ఏబది ఎనిమిదవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-2    Chapters