Sri Matsya Mahapuranam-2    Chapters   

షట్‌ పఞ్చశదుత్తర ద్విశతతమోధ్యాయః.

గృహనిర్మాణార్థం దార్వాహరణాదికథనమ్‌.

సూతః అథాత స్సమ్ప్రవక్ష్యామి దార్వాహరణ ముత్తమమ్‌ | ధనిష్ఠాపఞ్చకం త్యక్త్వా విష్ట్యాదిక మతః పరమ్‌.1

తత స్సాంవత్సరోద్దిష్టే దినే యాయా ద్వనం బుధః | ప్రథమం బవిపూజాం తు కుర్యా ద్వృక్షాయ సర్వదా. 2

పూర్వోత్తరేణ పతితం గృహదారు ప్రశస్యతే | అన్యథా న శుభం విన్ద్యా ద్యామ్యోపరి నిపాతితమ్‌. 3

క్షీరవృక్షోద్భవం దారు న గృహే వినివేశ##యేత్‌ | కృతాధివాసం విహగై రనిలానలపీడితమ్‌. 4

గజావభగ్నం చ తథా విద్యున్నిర్ఘాచపీడితమ్‌ | అర్ధశుష్కం తథా దారు భగ్నశుష్కం తథైవచ. 5

చైత్యదేవాలయోత్పన్నం నదీసఙ్గమజం తథా | శ్మశానకూపనిలయం తటాకాదిసముద్భవమ్‌. 6

వర్జయే త్సర్వదా దారు యదీచ్ఛే ద్విపులాం శ్రియమ్‌ | తథా కణ్టకినో వృక్షా న్నీపనిమ్భవిభీతకా& .7

శ్లేష్మాతకా నామ్రతరూ న్వర్జయే ద్గృహకర్మాణి | అసనాశోకమధుకసర్జశాలా శ్శుభావహాః. 8

చన్దనం పనసం ధన్యం సురదారుహరిద్రకాః | ద్వాభ్యా మేకేన వా కుర్యా త్త్రిభిర్వా భవనం శుభమ్‌. 9

బహుభిః కారితం యస్మా దనేకభయదం భ##వేత్‌ | ఏకైక శింశుపా ధన్యా శ్రీపర్ణీ తిన్దుకీ తథా. 10

ఏతే నాన్యసమాయుక్తా వాస్తుకార్యేశుభప్రదాః | తరుచ్ఛేదే తతా పీతే గోధాం విన్ద్యా ద్విచక్షణః. 11

ఏతా నాన్యసమాయుక్తాః కదాచి చ్ఛుభకారకాః | స్యన్దనః పనస స్తద్వ త్సరళార్జునపద్మకాః. 12

మాఞ్జిష్ఠవర్ణే భేక స్స్యా న్నీలే సర్పాది నిర్దిశేత్‌ | అరుణ సరటం విన్ద్యా న్ముక్తాభే శుక మాదిశేత్‌. 13

కపిలే మూషకా న్విన్ద్యా ద్వ్రజ్రాభే జల మాదిశేత్‌ | ఏవంవిధం సగర్భంతు వర్జయే ద్వాస్తుకర్మణి. 14

పూర్వచ్ఛిన్నంతు గృహ్ణీయా న్నిమిత్తశకునై శ్శుభైః|

రెండు వందల ఏబది యారవ అధ్యాయము.

గృహ నిర్మాణమునకై దారువుల తెచ్చుట- ఆయవ్యయగణనము.

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను: ఇకమీదట గృహనిర్మాణ ప్రక్రియలో ఉత్తమాం(ముఖ్యాం)శమగు దార్వాహరణము (దారువులను సేకరించి తెచ్చుకొను పద్ధతి) చెప్పెదను; దార్వాహరణమునకై బయలుదేరుటలో నక్షత్రములలో ధనిష్ఠాపంచకమును విష్టి(భద్రా) మొదలగు దుష్టసమయములను విడువలయును; ఇవి కానిదియు దైవజ్ఞుడు నిర్దేశించినదియు నగు శుభసమయున వనమునకు పోవలయును; ఎల్లప్పుడు మొదట తాను నరుకదలచిన వృక్షమునకు పూజాపూర్వకముగా బలిచేయవలయును; గృహనిర్మాణమునకుద్దేశించిన నరకిన వృక్షము ఈశాన్యదిశలో పడుట మంచిది; ఇట్లుకాక పడుట అంతగా మంచిదికాదు: పాలుగల (మర్రివంటి)ది -పక్షులు నివసించుచుండినది వాయువుతో అగ్నితో పీడింపబడునది ఏనుగుచే విరుగగొట్టబహడినది పిడుగుపడి చెడినది సగము ఎండినది విరిగి ఎండినది చైత్య (ప్రార్థనాపూజాస్థాన) దేవాలయనదీసంగమ శ్మశాన కూపతటాకాది ప్రదేశములందలిదియగు వృక్షమునుండు దారువును గ్రహించుట శ్రేయోదాయకముకాదు; ముండ్ల చెట్లును నీపనింబ విభీతకశ్లేషామాకా77మ్ర దారువును -గృహ నిర్మాణమున వాడరాదు: అసనము అశోకము మధుకము సర్జము సాలము చందనము పససము దేవదారు హరిద్రకములు- వీని దారువులు (కలపలు) మంచివి; ఇండ్ల నిర్మాణము నకై ఒకటి రెండు- లేదా మూడు విధములగు దారువుల మాత్రము వాడవలయును; అంతకంటె ఎక్కువ విధములగు దారువులను ఉపయోగించుట భయప్రదము: శింశుపా-శ్రీపర్ణీ-తిందుక-స్యందన-పనస-సరళా7ర్జున-దారువులు మరివేనితోను కలుపక ఒకే విధమగునవి వాడుట మంచిది; చెట్టు నరకునపుడు దాని దారుఖండము పచ్చగానున్నచో ఉడుము. మంజిష్ఠవలె ఎర్రగానున్నచో కప్ప- నీలముగా నున్నచో చిలుక- కపిలవర్ణమైనచో ఎలుకలు వజ్రపువన్నెయైనచో జలము. అందు కలవని తెలియవలయును. చిట్లిన గర్భదారువలును గృహనిర్మాణమున నుపయోగించరాదు; మొదట ఇట్లు నరికియుంచిన దారువును అది ఆరిన తరువాత శుభశకున సమయమందు వచ్చి తీసికొని పోవలయును.

వ్యాసేన గుణితే దైర్ఘ్యే అష్టాభి ర్వై హృతే తథా. 15

య చ్ఛేష మాయతం విన్ద్యా దష్టభేదం వదామి తత్‌ | ధ్వజో ధూమశ్చ సింహశ్చ వృష శ్శ్వా ఖర ఏవచ. 16

గజో ధ్వాఙ్‌క్షశ్చ పూర్వాధ్యాః కరశేషా భవన్త్యమీ | ధ్వజః పూర్వముఖో ధన్యంః ప్రత్యగ్ద్వారే విశేషతః. 17

ఉదఙ్ముఖో భ##వేత్సింహః ప్రాఙ్ముఖో వృషభో భ##వేత్‌ | దక్షిణాభిముఖో హస్తీ సప్తభి స్సముదాహృతః. 18

ఏకేన ధ్వజ ఉద్దిష్ట స్త్రిభి స్సింహః ప్రకీర్తితః | పఞ్చభి ర్వృషభః ప్రోక్తో వికోణస్థాంశ్చ వర్జయేత్‌. 19

తమేవాష్టంగుణం కృత్వా ఖరరాశిం విచక్షణః | సప్తవింశాహృతే భాగే ఋక్షం విన్ద్యా ద్విచక్షణః. 20

అష్టభి ర్భాజితే ఋక్షే య శ్శేష స్స వ్యయో మతః | వ్యయాధికం స కుర్వీత యతో దోషకరం భ##వేత్‌. 21

ఆయాధికే భ##వే చ్ఛాన్తి రిత్యాహ భగవా& హరిః | కృత్వా7గ్రతో ద్విజవరా నథ పూర్ణకుమృం దధ్యక్షతామ్రదళ పుష్పఫలోపశోభమ్‌. 22

దత్వా హిరణ్యవసనాని తదా ద్విజేభ్యో మాఙ్గల్యశాన్తినిలయాయ గృహం వివేశేత్‌ |

గృహ్యోక్తహోమవిధినా బలికర్మా కుర్యా త్ప్రాసాదవాస్తుశమనే చ విధి ర్య ఉక్తః. 23

సన్తర్ప్య చ ద్విజవరా నథ భక్ష్య భోజ్యై శ్శుక్లామ్బర స్స్వభవనం ప్రవిశే త్సధూపమ్‌. 23

ఇతి శ్రీ మత్స్య మహాపురాణ వాస్తుశాస్త్రే దార్వాహరణాదికథనం నామ

షట్‌ పఞ్చాశదుత్తర ద్విశతతమో7ధ్యాయః.

ఆయగణితము.

ఇంటి వెడల్పును పొడవుతో గుణించి వచ్చిన దానిని ఎనిమిదితో భాగించగా (పొx వె÷8) వచ్చిన శేషములలో 1. ధ్వజ- 2. ధూమ- 3. సింహ- 4. శునక. 5. వృషభ- 6. ఖర- 7. గజ, 8(0) ధ్వాంక్ష -ఆయములను తెలుపును; (పొడవు వెడల్పులు మూరలలో లెక్కకు తీసికొనుటచేత ఈ పొడవు వెడల్పులను పరస్పరము గుణించగా - దానిని భాగించగాను వచ్చిన సంఖ్యలు చదరపు మూరలను తెలుపును;) ఈ ఎనిమిది ఆయములును వరుసగా తూర్పునుండి ఈశాన్యము వరకు ఎనిమిది దిక్కులయందుండునని తెలియవలయును: వీనిలో ధ్వజాయము అన్ని దిక్కులకును అభిముఖమై- విశేషించి పశ్చిమాభిముఖమై గృహనిర్మామ (వాస్తు) స్థానమునందు తూర్పుదిశయందుండును: సింహాయము దక్షిణ దిశయందు ఉత్తరాభిముఖమయి యుండును: వృషభాయము పశ్చిమ దిశయందు ప్రాగభిముఖమైయుండును: గజాయము ఉత్తరదిశయందు దక్షిణాభిముఖమై యుండును: ఈ ఆయములు మంచివి: విదిశల (మూలలు) యందు వచ్చిన 2-4- 6-8 ఆయములు మంచివికావు. (ఈ వ్యవస్థను) 3x3 =9 గడులుగల చక్రము వ్రాసి చూచుకొనునది.)

నక్షత్రగణనము- వ్యయగణనము.

ఇట్లే గృహపు పొడవు వెడల్పులను పరస్పరము గుణించగా వచ్చిన చదరపు హస్తముల సంఖ్యను ఎనిమిదిచే గుణించి ఇరువది ఏడిటిచే భాగించగా పొxవెx8/27 వచ్చు శేషమును నక్షత్రమందురు; ఈ నక్షత్ర సంఖ్యను ఎనిమిదిచే భాగించగా వచ్చు శేషమును వ్యయమందురు: ఇట్లు గణన చేయగా వచ్చిన ఆయవ్యయములలో ఆయమధికమగుట గృహ స్వామికి శుభమునిచ్చును; అని భగవానుడగు హరి చెప్పెను.

ద్విజపర్యులను ముందుంచుకొని పూర్ణకుంభమును దధి అక్షతలు మామిడి చివుళ్ళు పుష్పములు ఫలములు తీసి కొని శోభాయమానముగా బయులదేరిపోయి విప్రుంకు హరిణ్య వస్త్రాదికమునిచ్చి మాగల్యమును శాంతియు కలుగవలె నను తలపుతో గృహస్వామి నూతన గృహమున ప్రవేశించవలయును.

గృహ్యోక్త కల్ప విధానానుసారముగ గృహవాస్తు శాంతి విధానమున హోమమును బలి కార్యమును నిర్వర్తించ వలయును; బ్రాహ్మణశ్రేష్ఠులను భక్ష్యభోజ్యములతో తృప్తినందించవలయును; శుక్ల వస్త్రములతో గృహమున ప్రవేశించవలయును.

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున వాస్తు శాస్త్రమున దార్వాహరణాది కథనమను

రెండు వందల ఏబది ఆరవ అధ్యాయము.

వాస్తు శాస్త్రము ముగిసినది.

Sri Matsya Mahapuranam-2    Chapters