Sri Matsya Mahapuranam-2    Chapters   

పంచ పఞ్చాశదుత్తర ద్విశతతమో7ధ్యాయః.

గృహనివేశాది కథనమ్‌.

సూతః ఉదగాదిప్లవం వాస్తు సమానశిఖరం తథా | పరీక్ష్య పూర్వవ త్కుర్యా త్త్సమ్భోచ్ఛ్రాయం విచక్షణః. 1

న దేవధూర్తసచివచద్వరాణాం సమీపతః | కారయే ద్భవనం ప్రాజ్ఞో దుఃఖశోకభయం తతః. 2

తస్య ప్రదేశా శ్చత్వార స్తథోత్సర్గోగ్రత శ్శుభః | పృష్ఠతః పృష్ఠభాగస్తు సవ్యావర్తః ప్రశస్యతే. 3

అపసవ్యో వినాశాయ దక్షిణ శీర్షక స్తథా | సర్వకామఫలో నౄణాం సమ్పూర్ణో నామ వామతః. 4

ఏవం ప్రదేశ మాలోక్య యత్నేన గృహ మారభేత్‌ | అథ సాంవత్సర ప్రోక్తే ముహూర్తే శుభలక్షణ. 5

రత్నోపరి శిలాం కృత్వా సర్వబీజసమన్వితామ్‌ | చతుర్భి ర్బ్రాహ్మణౖః స్తమ్భం వస్త్రాలఙ్కారభూషితమ్‌.

శుక్లామ్బరధర శ్శిల్పీ సహితో వేదపారగైః | స్నాపితం విన్యసే త్తద్వ త్సర్వౌషధిసమన్వితమ్‌. 7

నానాక్షతఫలోపేతం వస్త్రతామ్బూలసంయుతమ్‌ | బ్రహ్మ ఘోషేణ వాద్యేన గీతమఙ్గళనిస్వనైః.8

పాయసం భోజయే ద్విప్రాన్‌ హోమయే న్మధుసర్పిషా | వాస్తోష్పతే ప్రతిజానీహి' మన్త్రేణానేన సర్వదా. 9

సూత్రపాతే తథా కార్య మేవం స్తమ్భోచ్ఛ్రయే పున్‌ః | ద్వారబన్ధోచ్చ్రయే తద్వ త్ర్పవేశసమయే తథా. 10

వాస్తూపశమనే తద్వ ద్వాస్తుయజ్ఞస్తు పఞ్చధా | ఈశానే సూత్రపాత స్స్యా దాగ్నీయే స్తమ్భరోపణమ్‌. 11

ప్రదక్షిణం ప్రకుర్వీత వాస్తోః పదవిలేఖనమ్‌ | తర్జనీ మద్యమా చైవ తథాఙ్గుష్టస్తు దక్షిణః. 12

ప్రవాళరత్న కనకఫలపుష్పాక్షతోదకమ్‌ | సర్వవాస్తు విభాగేషు శస్తం పదవిలేఖనమ్‌ . 13

న బస్మాఙ్గారకాష్ఠేన నఖశ##స్త్రేణ చర్మభిః | న వంశాస్థికపాలేన క్వచి ద్వాస్తువిలేఖనమ్‌. 14

ఏభి ర్విలేఖితం కుర్యా ద్దుఃఖరోగభయాదికమ్‌ |

రెండు వందల ఏబదియైదవ అధ్యాయము.

గృహ నివేశాది కథనము.

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పను: వాస్తుశాస్త్రము బాగుగనెరిగినవాడు నివేశనస్థలమును బాగుగ పరీక్షించ వలయును; స్థలమునందు పడినవీరు ఉత్తరదిశకుగాని ఈశాన్యదిక్కునకుగాని ప్రవహించుచుండలయును; నడుమ నుండుపై భాగమంతయు ఒకే మట్టముగా నుండవలెను; ఇట్లు ఉండునట్లు పరీక్షించి చూచిన తరువాత ఆ నివేశనస్థలము నందు స్తంభమును నిలువబెట్టవలయును.

ప్రాజ్ఞుడు దేవతాద్యూతకార సచివాదుల గృహములకును నాలుగు వీథులుకలియు ప్రదేశములకును దగ్గరలో గృహనిర్మాణము చేసికొనరాదు; దానిచే దుఃఖశోక భయములు కలుగును; గృహసన్నివేశమును గృహమునుండి నీరు బయటకు పోవుటలో దానికిగల యవకాశమునుబట్టి నాలుగు విధములగ విభజించవచ్చును; 1. ఉత్సర్గము-ఇంటి ముందునుండి నీరు బయటికి పోవునది-ఇది శుభకరమ; 2. నవ్యావర్తము-ఇంటివెనుకనుండి నీరు బయటకు పోవునది; ఇది మరియు శుభతరము; 3. అపనవ్యము-ఇంటికి దక్షిణముగా నీరు బయటకు పోవునది -వినాశప్రదము; 4. సంపూర్ణము-ఇంటికి ఉత్తరదిశనుండి నీరు బయటికి పోవునది-ఇది చాలమంచిది; ఇట్టి అనుకూలతలుగల ప్రదేశమును చూచి కొని యత్నపూర్వకముగ యథాశ క్తిగ గృహమారంభించవలయును.

ఇది ఎట్లన -దైవజ్ఞుడు చెప్పిన శుభలక్షణయుత ముహూర్తమునందు (స్తంభమును ప్రతిష్ఠించుటకై త్రవ్విన గోతియందు) రత్నములుంచి వానిపై (దృఢమును సమతలమునగు) శిలనుంచవలెను; అచట సర్వబీజములునుకూడ చల్లవలెను; శిల్పి శుక్ల వస్త్రధరుడై వేదపారగులగు నలుగురు విప్రులు వేదములు పఠించుచుండ స్తంభమును స్నానముచేయించి వస్త్రాలంకారాదులచే భూషించి వేదధ్వనులతోను మంగళవాద్య గీతధ్వనులతోను దాని నాశిలపై నిలువవలయును; నర్వౌషధులను నానాక్షత ఫల వస్త్ర తాంబూలాదులను దానికర్పించవలయును; వాస్తుయజ్ఞమునుకూడ జరుపవలెను; 1. సూత్రపాతము (గృహము నిర్మించుటలో కాలసిన ఆయా కొలతతలనుబట్టి ఆయా గృహభాగములను నిర్ణయించుటకై 'శంకు'స్థాన నిర్ణయముచేసి ఆశంకువు ఆధారముగా రజ్జువుతో కొలతల నారంభించుట) 2. స్తంభోచ్ఛ్రాయము (స్తంభముఎత్తుట) 3. ద్వారోచ్ఛ్రాయము (ద్వారముఎత్తుట) 4. గృహప్రవేశము 5. వాస్తూపశమనము (వాస్తుశాంతి) ఈ ఐదు సందర్భములందు ఐదు విధములుగా వాస్తుయజ్ఞము జరుపవలసియుండును; గృహనిర్మాణమునకు ఉద్దేశించిన ప్రదేశమంతటికిని సరియగు ఈశాన్యమునందు సూత్రపాతమును-సరియగు ఆగ్నేయమునందు స్తంభోచ్ఛ్రాయమును- జరుపవలయును; ఈ సమయములందు జరుపు వాస్తు యజ్ఞములందు 'వాస్తోష్పతే ప్రతిజానీహి' అను మంత్రముతో తేనెతోను నేతితోను హోమమును జరుపవలయును; బ్రాహ్మణులకు పాయసము భుజింప జేయవలయును.

(లోగడ ఏకాశీతి పదాత్మకమగు వాస్తు చక్రము చెప్పబడినది.) ఈ వాస్తు చక్రమును గృహ నిర్మాణమునకు ముందుగా (సూత్రపాతమునను కూడ ముందుగా ఆ స్థలమునందు లిఖించి యుంచుకొనవలయును; దీనిని వాస్తు (గృహ నిర్మాణార్థమగు) ఏకాశీతి పదవిలేఖనమందురు; దీని కై రేఖాదులను లిఖించుటయు ఆయా పదము (అంకణము) లందు ఆయా స్థాన దేవాతానామములును లిఖించుటలో ప్రదక్షిణ క్రమమును పాటించవలయును; వ్రాయుటలో కుడిచేతి తర్జనీ మాధ్యమాంగుళులను బొటన వ్రేలిని ఉపయోగించవలయును, వ్రాతకైపవడములు రత్నములు బంగారు ఫలపుష్పాక్షతోదకము ఉపయోగించవలయును; బూడిద-బొగ్గులు-కట్టె ముక్కలు గోళ్లు-ఆయుధములు వంట ఇంటిపనిముట్లు -చర్మము-వెదురు కర్ర -ఎముకలు- కపాలపు ముక్కలు-ఈ లేఖన కార్యములో ఉపయోగించరాదు; దీనిచే దుఃఖరోగభయాదికము గలుగును.

యదా గృహప్రవేశ స్స్యా చ్ఛిల్పీ తత్రాపి లక్షయేత్‌. 15

స్తమ్భసూత్రాదికే తద్వ చ్ఛుభాశుభఫలోదయమ్‌ | ఆదిత్యాభిముఖం రౌతి శకునిః పరుషం యది. 16

తుల్యకాలం స్ఫురేదఙ్గం గృహభర్తు ర్యతాత్మనః | వా వాస్త్వఙ్గే త ద్విజానీయా న్నరశల్యం భయప్రదమ్‌. 17

అంకనానన్తరం యత్ర హస్త్యశ్వశ్వాపదం భ##వేత్‌ | తదఙ్గసమ్భవం వింద్యా త్తత్ర శల్యం విచక్షణః. 18

ప్రసారమ్యాణ సూత్రే తు శ్వగోమాయు ర్విలఙ్గనమ్‌ | తత్ర శల్యం విజానీయా త్స్వరశ##బ్దేన భైరవే. 19

యదైశానేతు దిగ్భాగే మధురం రౌతి వాయసః | ధనం తత్ర విజానీయా ద్భాగే వా తదధిష్ఠితే. 20

సూత్రచ్ఛేదే భ##వే న్మృత్యు ర్వ్యాధిః కిలే త్వధోముఖే | అఙ్గారేషు తథోన్మాదం కపాలేషు చ సంశయమ్‌. 21

కమ్బుశ##ల్యేషు జానీయా త్పౌంశ్చల్యం స్త్రీషు వాస్తువిత్‌ | గృహభర్తు ర్గృహస్యాపి వినాశ శ్శిల్పిసమ్భ్రమే. 22

స్తమ్భే స్కన్ధచ్యుతే కుమ్భే శిరోరోగం వినిర్దిశేత్‌ | కుమ్భావహారే సర్వస్య కులస్యాపి క్షయో భ##వేత్‌. 23

మృత్యుః స్థానచ్యుతే కుమ్భే భ##గ్నే బన్ధం విదు ర్బుధాః | కరసఙ్ఖ్యావినాశేతు నాశం గృహపతే ర్విదుః. 24

బీజౌషధివిహీనేతు భూతేభ్యో భయ మాదిశేత్‌ | ప్రాగ్ధక్షిణన విన్యస్యస్తమ్భే చ్చత్రం నివేశ##యేత్‌. 25

తతః ప్రదక్షిణ నాన్యాన్‌ న్యసే త్త్సమ్భా న్విచక్షణః | యస్మాద్భయకరం నౄణాం యోజితా హ్యప్రదక్షిణమ్‌. 26

రక్షాం కుర్వన్తి యత్నేన స్తమ్భోపద్రవనాశనీమ్‌ | తథా ఫలవతీం శాఖాం స్తమ్భోపరి నివేశ##యేత్‌. 27

ప్రాగు దక్ప్రవణం కుర్యా ద్దిఙ్మూఢం తు నకారయేత్‌ | స్తమ్భం వా భవనం వా7పి ద్వారం వాసగృహం తథా. 28

దిఙ్మూఢే కులనాశ స్స్యా న్న చ సంవర్ధయే ద్గృహమ్‌ | యది సంవర్ధయే ద్గేహం సర్వదిక్షు వివర్ధయేత్‌. 29

పూర్వేణ వర్దితం వాస్తు కుర్యాద్‌ ద్వారాణి సర్వదా | దక్షిణ వర్దితం చైల మృత్యవే స్యా న్న సంశయః.

పశ్చా ద్వివృద్ధం య ద్వాస్తు తు దర్థక్షయకారకమ్‌ | వర్ధాపితం తథా సౌమ్యే బహుసన్తాకారకమ్‌. 31

ఆగ్నేయే యత్ర వృద్ధి స్స్యా త్తదగ్నిభయదం భ##వేత్‌ | వర్ధితం రాక్షసే కోణ శిశుక్షయకరం భ##వేత్‌. 32

వర్ధాపితం తు వాయవ్యే వాతవ్యాధి ప్రకోపకృత్‌ | ఐశాన్యాం తు ప్రజాహానిర్వాస్తౌ సంవర్ధితే సదా. 33

ఐశానే దేవతాగారం తథా శాన్తిగృహం భ##వేత్‌ | మహానసం త థాగ్నేయే తత్పార్శ్వే చోత్తరే జలమ్‌. 34

గృహస్యాపస్కరం సర్వం నైరృత్యే స్థాపయే ద్బుధః | సర్వస్థానం బహిః కుర్యా త్స్నానమణ్డవ మేవ చ.

ధనంధాన్యం చ వాయవ్యే కర్మశాలా తతో బహిః | ఏవం వాస్తునివేశ స్స్యాద్గృహభర్తు స్సుఖావహాః. 36

ఇతి శ్రీ మత్స్య మహాపురాణ వాస్తుశాస్త్రే గృహనివేశో నామ

పంచ పఞ్చాశదుత్తర ద్విశతతమో7 ధ్యాయః.

ఆయా వాస్తుల కర్మల ఆరంభమున శకునాదికము.

గృహ నిర్మాణమునకై సూత్ర పాతము - స్చంభోచ్ఛ్రాయము (స్తంభ ప్రతిష్ఠ) గృహప్రవేశము మొదలగు సందర్భములందు శిల్పి శకునాదికమును బట్టి శుభాశుభ ఫలోదయమును గురుతించవలయును. ఎట్లనగా 1. పక్షి ఏదయిన సూర్యాభిముఖముగ పరుషముగా కూయుటయు గృహస్వామికి అవయవమేదయిన అదరుటయు ఒకే మారు జరిగినచో వాస్తు పురుషుని ఆ అవయవ భాగమునకు సరిపడు ఆ గృహ నిర్మాణ ప్రదేశమున భయప్రదమగు నరాస్థి యున్నదని తెలియ వలెను. 2. వాస్తు చక్రము లిఖించి ఆయా గురుతులు గురుతించిన వెంటనే ఆ స్థలమందు ఏనుగు గుర్రము- మరే దైన క్రూరప్రాణివచ్చి నిలిచినచో ఆ తావున శల్యముండును; 3. సూత్రమును మొదటి సారిగా కొలతకై ప్రసారించు నపుడు కుక్కయో నక్కయో ఆ స్థలమునందలి ఏతావునకు దుమికి నిలుచునో- ఎచట అది భయంకరముగ అరచునో అచ్చట శల్యముండును. 4. ఆ స్థలపు ఈశాన్యదిశయందు కాకి మధురముగా కూసినచో ఆ స్థలమందును -అది మరెచ్చటనైన కూర్చుండి మధురముగా కూసినచో ఆ ప్రదేశమునందును ధనము లభించును.

సూత్రపాత సమయమున సూత్రము తెగినచో గృహస్వామికి మ్యత్యువు కలుగును; సూత్రము కట్టుటకుద్ధేశించిన కీలము తలక్రిందులయినచో వ్యాధి కలుగును; ఆ భూమి యందు బొగ్గులు వచ్చినచో ఉన్మాదము కపాలములు వచ్చి నచో సంశయము శంఖములుకాని ఎముకలుకాని వచ్చినచో ఆ ఇంటి స్త్రీలలో జారిణీత్వము కలుగును; శిల్పితడబడినచో గృహస్వామియు గృహమును నాశమందుట జరుగును.

స్తంభమునకు మొదట రాతిపైనుంచిన జల కుంభము తన తావునుండి జారినచో శిరోవ్యాధి - కుంభము దొంగిలింపబడినను( తన తావునుండి తొలగినను) వంశ నాశము - అది తన తావునుండి జారినచో మృత్యువును-స పగిలినచో బంధమును కలుగును; కర (మూరల) సంఖ్యలను తెలుపు గురుతులు చెడిపోయినచో గృహ స్వామికి నాశము; అచట చల్లిన బీజములు ఓషధులు చెడినచో భూతములనుండి భయము కలుగును; ఈ స్తంభముపై ఆగ్నేయమున గొడుగుంచవలయును; ఇట్లు ప్రథమస్తంభ ప్రతిష్ఠ ఆగ్నేయమున జరిగిన తరువాత వివేకియగు శిల్పి ప్రదక్షిణ క్రమమున ఆయా ఇతర స్తంభము లను కూడ నిలుపుచు పోవలయును; ఆ ప్రదక్షిణముగ ఇతర స్తంభములుంచుట భయప్రదము; కావున స్తంభపు ప్రతిష్ఠచే కలుగదగు ఏ ఉపద్రవములును కలుగకుండ రక్షణలు (జాగ్రత్తలు) పూనవలయును; ఈ ప్రథమ స్తంభములపై పండ్లతో కూడిన చెట్ల కొమ్మలుఏవయిన కట్టవలయును; గృహ నిర్మాణ విషయమున అన్నియును తూర్పునకో ఉత్తరమునకో వాలుగ నుండునట్లు నిర్మించవలయును; అంతేకాని దిక్కుల విషయము పట్టించు కొనకుండ (దిఙ్మూఢముగ) తోచినట్లుగా స్తంభప్రతిష్ఠ కాని భవన నిర్మాణముకాని ద్వారముకాని నివాస గృహముకాని ఏదియు చేయరాదు; దానిచే వంశ నాశమగును.

గృహమును వృద్ధిచేయుట (పెంచుట)

మొదట ఒక అమరికలో గృహ నిర్మాణముచేసిన తరువాత దానిని మరల పెంచుట మంచిది కాదు; ఒక వేళ పెంచుచో అన్ని దిక్కులకును పెంచవలయును; తూర్పునకు మాత్రము పెంచినచో వైర వృద్ధి; దక్షిణమునకు పెంచినచో మృత్యులు; పడమటకు పెంచినచో ధననాశము; ఉత్తరమునకు పెంచినచో సంతాపము; ఆగ్నేయవృద్ధి అగ్ని భయదము; నైరృత వృద్ధి శిశు నాశకరము; వాయవ్యవృద్ధి వ్యాధి ప్రకోపకరము; ఈశాన్యవృద్ధి సంతాన హానికరము.

ప్రధాన గృహమునకు వెలుపల ఉప గృహములు.

ప్రధాన గృహమునకు ఈశాన్యమున దేవతా గృహమును శాంతి గృహమును ఆగ్నేయమున వంట ఇంటిని ఈ వంట ఇంటికి ఉత్తరముగా ఈ ఆగ్నేయ మూలయందే జలగృహమును గృహపరికర గృహమును నైరృతము నందును దానికి వెలుపలగా ఆనైరృతమునందే అన్ని ఇతర సామగ్రుల గృహమును అందే దానికి వెలుపలగా కర్మాశాల (వడ్లు దంచుట పిండి విసరుట మొదలగు పనునులశాల)ను నిర్మించ వలయును; (ఇట్లు నాలుగు మూలలందును ఎనిమిది ఉపగృహములు చెప్పబడినవి. )ఇట్టి వాస్తునివేశము గృహ భర్తకు (గృహస్వామికి) సుఖకరము.

శ్రీ మత్స్య మహాపురాణమున వాస్తు శాస్త్రమున గృహ నివేశమను

రెండు వందల ఏబది యైదవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-2    Chapters