Sri Matsya Mahapuranam-2    Chapters   

చతుః పంచాశదుత్తర ద్విశతతమోధ్యాయః.

స్తమ్భమానవినిర్ణయః.

సూతః : అథాత స్సమ్ర్పవక్ష్యామి స్తమ్భమానవినిర్ణయమ్‌ | కృత్వా స్వభవనోచ్ఛ్రాయం సదా సప్తగుణం బుధైః. 1

అశీత్యంశః పృథుత్వం స్యా దగ్రే నవగుణౖ స్సహ | రుచక శ్చతురశ్ర స్స్యా దష్టాశ్రో వజ్ర ఉచ్యతే. 2

ద్వివజ్ర ష్షోడవాశ్రస్తు ద్వాత్రింశాశ్రః ప్రలీనకః | మధ్యప్రదేశే యఃస్తమ్భో వృత్తో వృత్త ఇతి స్మృతః. 3

ఏతే పఞ్చ మహాస్తమ్భాః ప్రశస్తా స్సర్వవాస్తుషు | పద్మవల్లీలతాకుమ్భ పత్రదర్పణభూషితాః. 4

స్తమ్భస్య దవమాంశేన పద్మకుంభాంతరాణి తు | స్తమ్భతుల్యా తులా ప్రోక్తా హీనా చోపతులా తతః. 5

త్రిభాగేనేహ సర్వత్ర చతుర్భాగేన వా పునః | హీనం హీనం చతుర్థాంశా త్తథా సర్వాసు భూమిషు. 6

వాసగేహాని సర్వేషాం ప్రవేశే దక్షిణన తు | ద్వారాణి తు ప్రవక్ష్యామి ప్రశస్తానీహ యాని తు. 7

పూర్వేణన్ద్రజయంతం చ ద్వారం సర్వత్ర శస్యతే | యామ్యంచ వితథం చైవ దక్షిణన విదు ర్బుధాః. 8

పశ్చిమే పుష్పదన్తంచ వారుణం చ ప్రశస్యతే | ఉత్తరేణ చ భల్లాటం సౌమ్యం చ శుభదం భ##వేత్‌. 9

తథా వాస్తుషు సర్వత్ర వేధం ద్వారస్య వర్జయేత్‌ | ద్వారే తు రథ్యయా విద్దే భ##వే త్సర్వకులక్షయః. 10

తరుణా ద్వేషబాహుళ్యం శోకః పఞ్కేన జాయతే | అపస్మారో భ##వే త్తూర్ణం కూపవేధేన సర్వదా. 11

వ్యథా ప్రస్రవణన స్యా త్కీలేనాగ్నిబయం భ##వేత్‌ | వినాశో దేవతావిద్దే స్తమ్బేన స్త్రీకృతం భ##వేత్‌. 12

గృహభర్తుర్‌ వినాశ స్స్యా ద్గృహేణ చ గృహే కృతే | అమేధ్యావస్కరై ర్విద్ధే గృహిణీ బన్ధకీ భ##వేత్‌. 13

తథా చాస్త్రభయం విన్ద్యా దన్త్యజస్య గృహేణ తు | ఉచ్ఛ్రాయా ద్ద్విగుణాం భూమిం త్యక్త్వా వేధో న జాయతే. 14

రెండు వందల ఏబది నాలుగవ యాధ్యాయము.

స్తంభమాన వినిర్ణయము.

సూతుడు ఋషులతో ఇట్లు చెప్పెను: ఇకమీదట స్తంభమాన వినిర్ణయమును తెలిపెదను.. భవనపు ఎత్తును ఏడుతో గుణించి ఎనుబదితో భాగించగా అగునన్ని మూరల స్తంభపు మందముగా ఉండవలెను: (స్తంభపు బోదె ఇంకను ఎక్కువ మందముతో ఉండవలెను; అది ఎట్లన: భవనపు ఎత్తును తొమ్మిదితో గుణించి ఎనుబదితో భాగించగానైనన్ని మూరలు స్తంభపుబోదె మందము. స్తంభపు ఆకృతి చతురస్రమయినచో 'రుచకము' అష్టాస్రమయినచో ' వజ్రము' షోడశాస్రమయినచో 'ద్వివజ్రము' ద్వాత్రింశాస్రమయినచో 'ప్రలీనకము' మధ్యప్రదేశమున వృత్తాకృతితోనున్నచో 'వృత్తము' అనబడును; (చూ.పుట. 923) సర్వవాస్తులందును ఈ ఐదువిధములమహాస్తంభములును ప్రశస్తములు; స్తంభపు ఎత్తులో పదియవవంతు (ప్రదేశము)ను పద్మములు వల్లులు లతలు కుంభములు పత్రములు అద్దములు-వీని శిల్పముతో ఆలంకరించవలెను; స్తంభ##మెంత మందముండునో ఆంతే మందమున దూలము (తుల) ఉండవలయును: (ఉపతులలు) చిరుదూలములు (వీనిని ఎల్లవలు అందురు. ) ఈ పెద్ద దూలపు మందములో మూడవ వంతుగాని నాలుగవ వంతుకాని క్రమముగ తగ్గుచుపోవలెను; నివాస గృహములను దక్షిణ దిక్కునుండి ప్రవేశించుట ప్రశస్తము; అందులకై ఉండవలసిన ద్వార స్థానములు ఏవో తెలపెదను: తూర్పు దిక్కున ఇంద్ర జయంతస్థానములు దక్షిణమున యామ్య - వితథ స్థానములు పడమట పుష్పదంత వారుణ స్థానములు ఉత్తరమున భల్లాట సోమ స్థానములు మంచివి; సర్వవిధములగు వాస్తులయందును ద్వార వేధ (వాకిటికెదురుగ ఏదయిన తనది కానిది ఉండుట) లేకుండ చూచుకొనవలయును; రథ్యా (నాలుగు వీథులు కలియుచోటి ) వేధ సర్వ వంశనాశమును వృక్షవేద శత్రు విస్తారమును పంక (బురద)వేద శోకమును కూపవేధ అపస్మార రోగమును ప్రస్రవణ (సెలయేటి-నీటిబుగ్గల) వేధ వ్యథను కీల (రెండు వస్తువుల అదుకునకై కాని హద్దుల నిర్జయమునకై కాని నాటిన రాలు దారువులవంటి-వీథి దీప స్తంభములవంటి-వాని ) వేద అగ్ని భయమును దేవతావేధ వినాశమును స్తంభమున్నచో స్త్రీకృతదుఃఖమును గృహవేధగృహస్వామి నాశమును అమేధ్యము (పెంట)లతో అవన్కరము (కసపు)లతో వేద ఇల్లాలికి వ్యభిచారిణీత్వమును అంత్యజ గృహవేధ అస్త్రభయమును కలిగించును; ఇంటి ఎత్తు ఎంత యుండునో ఇంటినుండి అంతకు రెట్టింపు దూరములో వేధలు ఉన్నను వానివలన దోషము కలుగనేరదు.

స్వయ ముద్ఘాటితే ద్వారే ఉన్మాదో గృహవాసినామ్‌ | స్వయం వా పిహితే వింద్యా త్కులనాశం విచక్షణః.

మానాధికే రాజభయం నీచే తస్కరతో భయమ్‌ | ద్వారోపరి చ య ద్ద్వారం త దన్తకసఖం స్మృతమ్‌. 17

అధ్వనో మధ్యదేశేతు అధికో యస్య విస్తరః | వజ్రంతు సఙ్కటం మధ్యే సద్యో భర్తు ర్వినాశకమ్‌. 17

తథాన్యపీడితం ద్వారం బహుదోషకరం భ##వేత్‌ | మూలద్వారా త్తథాన్యత్తు నాధికం శోభనం భ##వేత్‌.

కుమ్బశ్రీపర్ణవల్లీభి ర్మూలద్వారం తు శోభ##యేత్‌ | పూజయే చ్చాపి తన్నిత్యం బలినా చాక్షతోదకైః. 19

భవనస్య వటః పూర్వే దిగ్బాగే సార్వకామికః | ఉదుమృర స్తథా యామ్యే వారుణ్యాం పిప్పల శ్శుభః. 20

ప్లక్ష శ్చోత్తరతో ధన్యో విపరీతా స్త్వసిద్దయే | కణ్టకీక్షీరవృక్షశ్చ హ్యసన స్సఫలో ద్రుమః. 21

భార్యాహానిః ప్రజాహాని ర్భవేతాం క్రమశ స్తథా | న చ్ఛిన్ద్యా ద్యది తా నన్యా నన్తరే స్థాపయే చ్ఛుభా&. 22

పున్నాగాశోకవకుశ శమీతిలక చమ్పకా &| దాడిమీపిప్పలీద్రాక్షా స్తథా కుసుమమణ్టపమ్‌. 23

జమ్బీరపూగ పనసద్రుమకేతకీభి ర్జాతీసరోజశతపత్రక మల్లికాభిః | యన్నాళికేరకదళీదళపాటలాభి ర్యుక్తం తదత్ర భవనం శ్రియ మాతనోతి 24

ఇతి శ్రీ మత్స్య మహాపురాణ వాస్తుశాస్త్రే స్తమ్భమానవినిర్ణయాది కథనం నామ చతుః పఞ్చాశదుత్తర ద్విశతతమో7ధ్యాయః.

(ద్వార నిర్మాణమునందలి దోషమువలన) తలుపు తనంతటతాననే తెరచుకొనుచున్నచో ఆ గృహవాసులకు ఉన్మాదమును మూసికొనుచున్నచో కుల నాశమును కలుగును; ద్వారము శాస్త్రోక్త పరిమాణముకంటె అధిక పరిమాణములో నున్నచో రాజభయము-తక్కువ పరిమాణముతోనున్నచో చోరభయము; వాకిటిపై వాకిలియున్నచో దానికి మృత్యుముఖమనిపేదు; తలవాకిటితంటె లోపలి వాకిండ్లు పెద్దవిగనున్నచో అట్టి తలవాకిటికి సంకటమనియు ఈ పెద్దదిగానున్న లోపలి వాకిటికి వజ్రమనియు వ్యవహారములు; ఇట్టిదోషముచే గృహస్వామి సద్యోమృతినందును? ఇట్లు తలవాకిలి ఇతర ద్వారములచే పీడితమగుట బహుదోషకరము; కావున ఎన్నడును మూల ((ప్రధాన) ద్వారముకంటె ఇతర ద్వారములు ఏవియు పెద్దవిగనుండరాదు. మూలద్వారమును అనుదినమును పూర్ణకుంభముతో శ్రీపర్ణిలతతో ఇతరలతా విశేషములతో శోభింపజేయు చుండవలయును; బలులతోను అక్షతోదకములతోను పూజించుచు నుండవలయును; ఇంటికి తూర్పున మర్రి దక్షిణమున ఉదుంబరము (మేడి) పడమట రావి ఉత్తరమున జువ్విచెట్టు ఉండుట శుభము; ఇవికాక మరేవయినను ముండ్ల చెట్లు పాలుకలచెట్లు అసనవృక్షము మరేవయిన నిషద్ధఫలవృక్షములు ఇంటి ఆవరణమునకు లోపలనున్నచో భార్యాహానియు సంతాన హానియునగును; కాని అవి వానియంతట అవియున్నచో వానిని నరుకరాదు; వానినడుమ మంచి వృక్షములను తెచ్చి నాటవలయును; పున్నాగము అశోకము వకుళము (పొగడ) జమ్మి తిలకవృక్షము సంపెగ దానిమ్మ పిప్పలి ద్రాక్ష మరేవయిన పూలపొదలు నిమ్మ పోక పనస మొగలి జాజి తామర నూరురేకుల తామర మల్లె కొబ్బరి అరటి పాటలా - ఇట్టి వృక్షములు లతలు ఇంటి ఆవరణములో నుండుట గృహశోభాకరము.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున వాస్తుశాస్త్రమున స్తంభమాన నిర్ణయాది కథనమను రెండు వందల ఏబది నాలుగవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-2    Chapters