Sri Matsya Mahapuranam-2    Chapters   

త్రింపచాశదుత్తరిద్విశతతమో7ద్యాయః.

చతుశ్శాలానిర్మాణక్రమః.

సూతః చతుశ్శాలం ప్రవక్ష్యామి స్వరూపం నామత స్తథా | చతుశ్శాలం చతుర్ద్వారై రళిన్దై స్సర్వతోముఖమ్‌. 1

నామ్నా త త్సర్వతోభద్రం శుభం దేవనృపాలయే | పశ్చిమద్వారహీనం చ నన్ద్యావర్తః ప్రచక్ష్యతే. 2

దక్షిణద్వారహీనం తు వర్ధమాన ముదాహృతమ్‌ | పూర్వద్వారవిహీనం తు స్వస్తికం నా మ విశ్రుతమ్‌. 3

రుచకం చోత్తరద్వారవిహీనం త త్ప్రచక్షచే | సౌమ్యశాలావిహీనం త త్త్రిశాలం ధాన్యకం చ యమ్‌(త్‌). 4

క్షేమవృద్ధికరం నృణాం బహుపుత్రఫలప్రదమ్‌ | శాలయా పూర్వయా హీనం సుక్షేత్ర మితి విశ్రుతమ్‌. 5

ధన్యం యశస్య మాయుష్యం శోకమోహ వినాశనమ్‌ | శాలయా యామ్యయా హీనం యద్విశాలం తు శాలయా. 6

కులక్షయకరం నృణాం సర్వవ్యాధిభయావహమ్‌ | హీనం పశ్చిమయా యత్తు పక్షఘ్నం నామ తత్పునః.

1. చతుశ్శాలము 2. త్రిశాలము.

ఫిగర్‌ ఫిగర్‌

3. ద్విశాలము. 4. ఏకశాలము.

ఫిగర్‌ ఫిగర్‌

మిత్రబన్ధుసుతా& హన్తి తథా సర్ఫభయావహమ్‌ | యామ్యా7పరాభ్యాం శాలాభ్యాం సర్వధాన్యఫలప్రదమ్‌.

క్షేమవృద్ధికరం నౄణాం తథా పుత్త్రఫలప్రదమ్‌ | యమసూర్యం చ విజ్ఞేయం పశ్చిమోత్తరశాలికమ్‌. 9

రాజాగ్నిభయదం నౄణాం కురక్షయకరం మహత్‌ | ఉదక్పూర్వే తు శాలే ద్వే దణ్డాఖ్యే యత్ర త ద్భవేత్‌. 10

అకాలమృత్యుభయదం పరచక్రభయావహమ్‌ | ధనాఖ్యం పూర్వయామ్యాభ్యాం శాలాభ్యాం చ ద్విశాలకమ్‌. 11

త చ్ఛస్త్రభయదం నృణాం పరాభవభయావహమ్‌ | చుల్లీ పూర్వావరాభ్యాం తు సా భ##వే స్మృత్యుసూచనీ. 12

వైధవ్యదాయినీ స్త్రీణా మనేకభయదాయికా | కార్య ముత్తరయామ్యాభ్యాం శాలాభ్యాం భయదం నృణామ్‌.

సిద్ధార్థవప్రవర్జ్యాణి విశాలాని సదా బుధైః|

రెండు వందల ఏబది మూడవ యధ్యాయము.

చతుశ్శాలాది స్వరూప వివేచనము.

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను: లోగడ చెప్పిన నామక్రమమున మొదట చతుశ్శాల గృహస్వరూపమును తెలిపెదను; 1. ఇది నాలుగువైపుల వాకిండ్లును అళిందములును (పంచలు- వసారాలు) కలిగిన నాలుగు శాలాగృహములు కలది; దీనికి సర్వతోభద్రము అని శాస్త్రవ్యవహారము; దేవతలకును నృపులకును ఇదిచాల మంచిది; 2. అన్ని విషయములును ఇట్లే ఉండి పడమటకు మాత్రము వాకిలికి లేని చతుశ్శాలము సంద్యావర్తనమనబడును; 3. దక్షిణమునకు మాత్రము వాకిలిలేని చతుశ్శాలము స్వస్తికము; 4. ఉత్తరమునకు మాత్రము ద్వారములేని చతుశ్శాలము రుచకము; ఇక త్రిశాలగృహములు: ఉత్తరమున మాత్రము శాలలేనిది (తూర్పు పడమర దక్షిణములందు శాలలుకలది) ధాన్యకమన బడును; ఇది క్షేమవృద్ధికరము - బహుపుత్త్రఫలప్రదము; తూర్పున శాలలేని త్రిశాలగృహము 'సుక్షేత్ర'మనబడును; ఇదిశుభమును ఆయువును యశమును కలిగించును; శోకమోహనాశకము; దక్షిణమున శాలలేని త్రిశాలగృహమునకు 'విశాల' మని పేరు; ఇది కులక్షయకరమును; వ్యాధి భయావహమును; పశ్చి మమున మాత్రము శాలలేని త్రిశాలగృహమునకు పక్షఘ్నమని పేరు; ఇది మిత్రబందుసుతనాశమును సర్పభయమును కలిగించును; (ఇక ద్విశాల గృహములు): దక్షిమ పశ్చిమములయందు శాలలుకలదు సర్వధాన్యఫలప్రదము; క్షేమవృద్ధికరమును పుత్త్రఫలప్రదమును పశ్చిమోత్తర శాలలుకల ద్విశాలము యమసూర్యమనబడును; రాజభయాగ్నిభయప్రదము- కులక్షయకరము; ఉత్తరపూర్వదిక్శాలలు కల ద్విశాలము 'దండ' మనబడును; అది అకాలమృత్యు - పరచక్ర (సేనా) భయజనకము; పూర్వదక్షిణ శాలాద్వయము కల ద్విశాలము 'ధన'మనబడును; అది శస్త్రభయ పరాభవ భయప్రదము; తూర్పు పడమరల శాలలుకల ద్వాశాలము 'చుల్లీ' 'ప్రొయ్యి' అనబడును; ఇది మృత్యుభయదము వైధవ్యప్రధము ఉత్తర దక్షిణములందు మాత్రము శాలలుకల ద్విశాలము 'కార్యము' అనబడును; ఇది భయప్రదము; ఇవికాక సిద్ధార్థము - వజ్రము మొదలగు పేరుకల ద్విశాలా భేదములను కూడ వివేకులు నిర్మింపరాదు.

రాజభవనాది నిర్మాణక్రమః.

అథాత స్సమ్ప్రవక్ష్యామి భవనం పృథవీపతేః. 14

పఞ్చప్రకారం తత్ర్పోక్త ముత్తమాదివిభేదత ః | అష్టోత్తరం హస్తశతం విస్తర శ్చోత్తమో మతః. 15

చతుర్ష్వన్యేషు విస్తారో హీయతే త్వష్టభిః కరై | చతుర్థాంశాధికం దైర్ఘ్యం వఙ్చస్వపి నిగద్యతే. 16

యువరాజస్య వక్ష్యామి తథా భవనపఞ్చకమ్‌ | షడ్బి ష్షడ్బి న్తథా7శీతిర్‌ హీయతే తత్ర విన్తరాత్‌. 17

త్ర్యంశేన చాధికం దైర్ఘ్యం పఞ్చస్వపి నిగద్యతే | సేనాపతేః ప్రవక్ష్యామి తథా భవనపఞ్చకమ్‌. 18

చతుష్టష్టిస్తు విస్తారా త్షడ్భి ష్షడ్భిః ప్రహీయతే | పఞ్చ స్వేతేషు దైర్ఘ్యం చ షడంశేనాదికం భ##వేత్‌. 19

మన్త్రిణా మపి వక్ష్యామి తథా భవనపఞ్చకమ్‌ | చతుశ్చతుర్భి ర్హీనా స్యా త్కరషష్టిః ప్రవిస్తరే. 20

అష్టాంశే నాధికం దైర్ఘ్యం పఞ్చస్వపి నిగద్యతే | సామన్తాత్యలోకానాం వక్ష్యే భవనపఞ్చకమ్‌. 21

చత్వారింశ త్తథాష్టౌ చ చతుర్భి ర్హీయతే క్రమాత్‌ | చతుర్థాంశాధికం దైర్ఘ్యం పఙ్చ స్వేతేషు శస్యతే. 22

శిల్పినాం కఞ్చుకీ(కి)నాం వేశ్యానాం గృహపఞ్చకమ్‌ |

అష్టావింశకరాణాం తద్విహీనం విస్తరా త్ర్కమాత్‌. 23

ద్విగుణం దైర్ఘ్యమేవోక్తం మధ్యమే ష్వేవ ష్వేవ మేవ తు | దూతీకర్మాన్తికాదీనాం వక్ష్యే భవనపఞ్చకమ్‌. 24

చతుర్థాంశాధికం దైర్ఘ్యం విస్తారో ద్వాదశైవ తు | అర్ధార్ధకరహాని స్స్యా ద్విస్తారా త్చఞ్చసు క్రమాత్‌. 25

ఇకమీదట రాజభవనపు కొలతలను చెప్పదను; అది ఉత్తమాది భేదమున ఐదు విధములు (బహుశః 1. ఉత్తమము 2. ఉత్తమమధ్యమము- 3. మధ్యమము- 4. మధ్యమాధమముఉ 5. అధమము). వీనిలో మొదటి దాని వెడలుపు 108 మూరలు; మిగిలిన నాలుగింటికి క్రమముగా దీనినుండి ఎనిమిదేసి మూరలు తగ్గును; పొడవు ప్రతిదాని యందును వెడల్పుకంటె - వెడల్పులో మరియొక చతుర్థాంశమధికము. వె:పొ= 1:1+1/4 అనగా 1. పొడవు 135 మూరలు - వెడల్పు - 108మూరలు 2. పొ-125; వె-100; 3. పొ-115; వె-92; 4.పొ -105; వె. 84; 5. పొ. 95; వె. 76.

యువరాజ గృహమునకు-వెడల్పు మొదటిదానికి 80 మూరలు; క్రమముగా మిగిలిన నాలుగింటికిని 6చొప్పున మూరలు తగ్గవలయును; పొడవు ప్రతిదానియుందును వెడల్పునకు మరల దానిలో మూడవవంతు అధికము వె:పొ =1.1+1/3; అనగా 1. వె-80; పొ-106+2/3; 2. వె-74; పొ-98+2/3; 3. వె-68; పొ-90+2/3; 4. వె-62; పొ-82+2/3; 5. వె-56; పొ-74+2/3;

సేనాపతి గృహమునకు - 1. వె-64; పొ-74+2/3; 2. వె-58; పొ-67+2/3; 3. వె-52; పొ. 60+2/3; 4. వె-46; పో-53+2/3; 5. వె-40; పొ-46+2/3; అనగా వెడల్పు 64మూరలు : ఇది క్రమముగా 6 మూరలచొప్పున తగ్గుచు పోవును; పొడవు ప్రతిదానియందును వెడల్పుకంటె మరల దానిలో ఆరవవంతు అధికము పొ:వె =1:1+1/6.

ఇక మంత్రుల గృహములకు- వెడల్పు 60 మూరలు: ఇది మిగిలిన నాలుగింటిలో 4 మూరలచొప్పున తగ్గును. పొడవు వెడల్పుకంటె మరల వెడల్పులో ఎనిమిదవంతు అధికమగును వె. పొ =1:1+1/8: అనగా 1. వె-60: పొ-67 +1/2: 2. వె-56: పొ-63: 3. వె-52: పొ-58+1/2: 4. వె-48: పొ- 54: 5. వె-44: పొ-49+1/2.

ఇక సామంతులు అమాత్యులు మొదలగువారి గృహముల ఐదు భేదములు; 48తో ఆరంభించి క్రమముగ 4 చొప్పున తగ్గుచు వెడల్పును వెడల్పువంటె దానిలో 1/4 వంతు కలిసినంత పొడవును; వె:పొ: = 1:1+1/4; ఉండవలయును: 1.వె-48; పొ-60; 2. వె-44; పొ-55: 3. వె-40; పొ-50; 4. వె-36; పొ-45; 5. వె-32: పొ-40;

శిల్పి కంచుకి వేశ్యాగృహముల పంచభేదములు; 28 మూరలతో ఆరంభించి వెడల్పు 2 చొప్పున తగ్గుచు పోవును; వెడల్పునకు రెట్టింపు పొడవుండును; వె: పొ= 1:2; 1. వె-28 పొ-56 2. వె-26; పొ- 52; 3. వె-50; పొ-100; 4. వె-48; పొ-48; పొ 96; 5. వె-46; పొ-92;

దూతికలు కర్మాంతికులు (కమతగాండ్రు) మొదలగువారి పంచగృహ భేదములు; 12తో ఆరంభించి 1/4మూర చొప్పు వెడల్పు తగ్గుచుపోవును; వెడల్పుకంటె దానిలో నాలుగవంతు అధికమయినంత పొడవు; వె: పొ=1: 1/4 1. వె-12; పొ-15; 2. వె-11 1/2; పొ-14 3/8; 3. వె11;పొ-13 3/4; 4. వె-10 1/2; పో-13 1/8; 5. వె-10;పొ-12 1/2;

దైవజ్ఞగురువైద్యానాం సభాస్తారపురోధసామ్‌ | తేషామపి ప్రవక్ష్యామి తథా భవనపఞ్చకమ్‌. 26

చత్వారింశత్తు విస్తారా చ్చతుర్భి ర్హీయతే క్రమాత్‌ | పఞ్చ స్వతేషు దైర్ఘ్యం చ షడ్భాగేనాధికం భ##వేత్‌.

చాతుర్వర్ణ్యస్య వక్ష్యామి సామాన్యం గృహపఞ్చకమ్‌ | ద్వాత్రింశతి కరాణాం తు చతుర్భి ర్హీయతే క్రమాత్‌. 28

ఆషోడశాదితి పరం న్యూన మన్తే7వసాయినామ్‌ | దశాంశేన త్రిభాగేన త్రిభాగేనాథ పాదికమ్‌ . 29

అధికం దైర్ఘ్య మిత్యాహు ర్బ్రాహ్మణాదేః ప్రశస్యతే | సేనాపతే ర్నృపస్యాపి గృహయో రన్తరేణతు. 30

నృపవాస గృహం కార్యం భాణ్డాగారం తథైవచ | సేనాపతే ర్గృహస్యాపి చాతుర్వర్ణ్యస్య చాన్తరే. 31

వాసాయచ గృహం కార్యం రాజపూజ్యేషు సర్వదా | అన్తర ప్రభవాణాం చ స్వపితు ర్గృహ మిష్యతే. 32

తథా హస్తశతా దర్ధం గదితం వనవాసినామ్‌ | సేనాపతే ర్నృపస్యాపి సప్తత్యా సహితే7న్వితే. 33

చతుర్దశహతే వ్యాసో వాలావ్యాసః ప్రకీర్తితః | పఞ్చత్రింశాన్వితే తస్మి న్నళిన్ద స్సముదాహృతః. 34

తథా షట్త్రింశర్ధస్తా తు సప్తాఙ్గళసమన్వితా | విప్రస్య మహతీ శాలా న దైర్ఘ్యం పరతో భ##వేత్‌. 35

దైవజ్ఞులు గురువులు వైద్యులు సభాస్తారులు పురోహితులు ఇట్టి వారి పంచగృహ భేదములు; 40తో ఆరంభించి వెడల్పు క్రమముగా 4 మూరలు తగ్గుచుపోవును; వెడల్పు: పొడవు=6: 7;

చాతుర్వర్ణ్యముల వారికిని గ్రామాంత వాసులవరకు ఒకే విధముగ పంచవిధ గృహభేధములు; వీని వెడల్పులు 32తో ఆరంభించి 17 వరకు 4 చొప్పున తగ్గుచుపోవును; బ్రాహ్మణ గృహముల పొడవు: వెడల్పు= 11:10; క్షత్త్రియులకు -పొడవు: వెడల్పు =9:8; వైశ్యులకు -పొడవు: వెడల్పు= 4:3; శూద్రులకును అంత్యజులకును- పొడవు: వెడల్పు = 5:4:

సేనాపతిగృహ నృపగృహులకు నడుమ (అతిథులుగా వచ్చిన) నృపులకు గృహములుండవలెను; అచటనే భాండాగారము (ఉగ్రాణము-Store house) నుండవలెను; సేనాపతిగృహ చాతుర్వర్ణ్యులగృహములకు నడుమ రాజ పూజ్యులగు పెద్దల బసకై గృహములుండవలెను; అందే మంత్రి - సేనాపతి ప్రభృతుల కుమారుల గృహములును రాజ పితృగృహము కూడ ఉండవలెను; వనవాసులగు వారి (విడిది) గృహములు ఏబది మూరల వెడల్పుతో నుండవలయును.

ఈ చెప్పిన పొడవులను వెడల్పులను శాలకు కొంతయును అళిందమునకు (పంచకు) కొంతయునుగా విభజించ వలయును. దాని విభాగము ఎట్లనిన: రాజునకును సేనాపతికిని నిర్మించు గృహములకై చెప్పిన వెడల్పునకు డెబ్బది (మూరలు ) చేర్చి ఆ మొత్తమును పదునాలుగుతో భాగించగా వచ్చినంత వెడల్పు శాలా భాగమునకును అదే గృహపు వెడల్పునకు ముప్పదియైదు చేర్చి దానిని పదునాల్గుతో భాగించగా నైనంత వెడల్పు అళిందమునకును గ్రహించవలయును.

విప్రుల గృహములకు సంబందించిన మహాశాల ముప్పదియారు మూరల ఏడంగుళముల పొడవుండవలయును; అంతకంటె ఎక్కువ పొడవు ఉండరాదు.

దశాఙ్గుళాధికా తద్వ తక్షత్త్రియస్య విధీయతే | పఞ్చత్రింశత్కరా వైశ్యే అఙ్గుళాని త్రయోదశ. 36

తావత్కరైవ శూద్రస్య యుతా పఞ్చదశాఙ్గుళైః | శాలాయాస్తువిభాగేన యస్యాగ్రే వీథికా భ##వేత్‌. 37

సోష్ణీషం నామ తద్వాస్తు పశ్చాచ్ఛ్రేయం భ##వేత్‌ | పార్శ్వయోర్వీధికా యత్ర సావష్టమ్భం తదుచ్యతే. 38

సమన్తాద్వీథికా యత్ర సుస్థితం తదిహోచ్యతే | శుభదం సర్వ మేత త్స్యా చ్చాతుర్వర్ణ్యే చతుర్విధమ్‌. 39

విస్తారా త్షోడశో భాగ స్తథా హస్తచతుష్టయమ్‌ | ప్రథమో భూమికోచ్ఛ్రాయ ఉపరిష్టా త్ప్రహీయతే. 40

ద్వాదశాంశేన సర్వాసు భూమికాసు తథోచ్చ్రయః | పక్వేష్టకా భ##వేద్భిత్తి ష్షోడశాంశేన విస్తరాత్‌. 41

దారవైరపి కల్ప్యా స్యా త్తథా మృన్మయభిత్తికా | గర్భమానేన మానం తు సర్వవాస్తుషు శస్యతే. 42

గృహవ్యాసస్య పఞ్చాశ దష్టాదశభి రఙ్గుళైః సంయుతో ద్వారవిష్కమ్భో ద్విగుణ నోచ్చ్రయో భ##వేత్‌.

ద్వారశాఖాసు బాహుళ్య ముచ్ఛ్రాయకర సమ్మితైః | అఙ్గుళై స్సర్వవాస్తూనాం పృథక్త్వం శస్యతే బుధైః.

ఉదుమ్బరోత్తమాఙ్గం చ తదర్దార్ధ ప్రవిస్తరాత్‌. 445

ఇతి శ్రీ మత్స్య మహాపురాణ వాస్తుశాస్త్రే చతుశ్శాలాది నిర్మాణక్రమో నామ త్రిపఞ్చాశదుత్తర ద్విశతతమో7ధ్యాయః.

క్షత్త్రియుల గృహముల మహాశాల పొడవు ముప్పది ఆరు మూరల పదియంగుళములుండవలెను.

వైశ్యుల మహాశాల పొడవు ముప్పదియైదు మూరల పదుమూడంగుళములుండవలయును.

శూద్రుని మహాశాల పొడవు ముప్పదియైదు మూరల పదునైదంగుళములు.

శాలకు ముందు భాగమున వీథిక (శాలయంత పొడవునను ఆవరణముగాని నిర్మాణముగాని లేని ' నడక' ప్రదేశము) ఉన్నచో అట్టి వాస్తును 'సోష్ణీషము' వెనుక వైపున వీథిక యున్నచో అట్టి వాస్తును 'శ్రేయోచ్చ్రయము' శాలకు రెండువైపులను వీథిక కలవాస్తును 'సావష్టంభము' అన్ని వైపులను వీథికయున్న వాస్తును 'సుస్థితము' అందురు: చాతుర్వర్ణ్యులకును ఈ నాలుగు విధములగు వాస్తులలో ప్రతియొకటియు శుభకరము.

*(ఎక్కువ భూమిక (అంతస్తు) లతో భవనములు కట్టునపుడు) భవనపు గర్భపు వెడల్పు (భూజము) ఎంత యుండునో దానిలో పదునారవవంతు అగు మూరల ఎత్తుగ మొదటి యంతుస్తు ఉండవలయును; అంతకు మించి ఎక్కువ అంతస్తులకు పోవుకొలది మొదటి అంతస్తు ఎత్తులో పండ్రెండవవంతు తక్కువగా రెండవదియు రెండవదాని ఎత్తులో పండ్రెండవవంతు తక్కువగా మూడవ యంతస్తును అను ఈ క్రమములో ఉండవలయును. ఇదియొక విధము; అథవా- అన్ని అంతస్తులు నాలుగు మూరల ఎత్తుతోనే ఉండుట రెండవ పద్దతి.

*ఇచట ముఖ్యముగా ఈ విషయమును గమనించవలయును. ఒకటికంటె ఎక్కువ అంతస్తులు ఉన్న గృహములు 'ప్రాసాద'ములు అనబడును. 'ప్రాసాదము'లలో అన్నిటికంటె క్రింది నిర్మాణము 'భూమి' (Ground floor); ప్రథమ భూమిక (మొదటి అంతస్తు- First floor) మొదలుగా ఏడు ఆంతస్తుల వరకు అంతస్తులను పెంచుట ప్రాచీన భారతీయుల అలవాటు అని కనబడుచున్నది. ఇట్లు అంతస్తులను పెంచునప్పుడు వాని ఎత్తుసరి ఏ అంతస్తునకు ఎంత ఉండవలయును? అనునది ఇచట చెప్పెబడినది. ఇచట ఆ కొలతలకు రెండు పద్ధతులు చెప్పబడినవి. అందు మొదటిదాని ననునరించి చూచుప్పుడు రాజ ప్రాసాదము విషయము ఆలోచింతము. దానికిగల 'భూమి' భుజపుకొలత 108 హస్తములు; కనుక మొదటి అంతస్తు 108/10= 27/4 హస్తములు. రెండవ అంతస్తు =( 27/4 _ 27/4)x1/12= 297/48 హస్తములు; మూడవ అంతస్తు(297/48--297/48)x 1/12 = 3267/576 హస్తములు. అని ఈ విధముగా గణితము చేయుచు ఏడు అంతస్తుల వరకు పరిమాణము నిర్ణయించుకొనవలెను. అథవా-రాజ ప్రాసాదముకాక మిగిలిన వారిగృహములును లోగడ చెప్పినట్లు రాజ ప్రాసాదములందు కూడ (పంచ విధములలో) మిగిలిన విధములగునవియు 108 హస్తములకంటె తక్కువ హస్తముల భుజముగల 'భూమిత'తో ఉండును: కనుక అట్టివానికి అన్నిటికిని సరిపడు పద్దతిగా అన్ని అంతస్తులకును 4 హస్తములే అను రెండవ విధము చెప్పబడినది. ఈ రెండవ పద్దతిలో ఏడు అంతస్తులును కలిసియు 7x4=28 హస్తములును వానికితోడు అంతస్తుల కప్పు మందమును చేరినంత మాత్రమేయుండును. కాని మొదటి పద్ధతి ననుసరించినచో ఏడు అంతస్తులకును కలిసి మరికొంచెము ఎక్కువ ఎత్తు అగును.

గోడలు-కాల్చిన ఇటుకలతో కట్టవలయును; వాని మందము శాలా విస్తారములో (వెడల్పలో) పదునారవ వంతు ఉండవలయును; గోడలు కొయ్య తునుకలతో గాని మట్టితోగాని కట్టవచ్చును.

ఏ విధమగు వాస్తు (నిర్మాణము)ల యందైనను గృహపు మొత్తపు వెడల్పును నడుమింటి (గర్భపు) వెడల్పును సరియగు అనుపాతములో నుండవలయును.

ద్వారపు వెడల్పు అరువది ఎనిమిది అంగుళములును దాని ఎత్తు అంతకు రెట్టింపు (నూట ముప్పదియారంగుళములు)ను ఉండవలయును; వాకిటి ఎత్తు ఎన్ని మూరలో ద్వారశాఖల వెడల్పు అన్ని అంగుళములుండవలయును: ఈ మందము అన్ని వాస్తులయందును వర్తించును; ద్వారముపై వేయు ఆడ్డుపట్టె (ఉత్తరాసి) మందము ద్వారశాఖల వెడల్పులో నాలుగవవంతుడవలయును; ఈ ఆడ్డుపట్టెను మేడికొయ్యతో చేయవలయును.

ఇతి శ్రీమత్స్యమహాపురాణమున వాస్తు శాస్త్రమున చతుశ్శాలాది నిర్మాణక్రమము అను రెండు వందల ఏబది మూడవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-2    Chapters