Sri Matsya Mahapuranam-2    Chapters   

అష్టచత్వారింశదుత్తరద్విశతతమో7ధ్యాయః.

అమృతమథనకథా ప్రారమ్భః.

ఋషయః : నారాయణస్య మాహాత్మ్యం శ్రుత్వా సూత యథాక్రమమ్‌ | న తృప్తి ర్జాయతే 7స్మాక మతః పునరిహోచ్యతామ్‌. 1

కథం దేవా గతాః పూర్వ మమరత్వం విచక్షణాః| తపసా కర్మణా వాపి ప్రసాదా త్కస్య తే 7మరాః. 2

సూతః యత్ర నారాయణో దేవో మహాదేవశ్చ శూలభృత్‌| తత్రామరత్వే సర్వేషాం సహాయో తత్ర తౌ స్మృతౌ. 3

పురా దేవాసురే యుద్ధే హతాశ్చ శతశ స్సురైః| పున స్సఞ్జీవినీం విద్యాం ప్రయోజ్య భృగునన్దనః. 4

సఞ్జీవయతి దైత్యేన్ద్రా న్యథా సుప్తోత్థితా విన| తస్య తుష్టేన దేవేన శఙ్కరేణ మహాత్మానా. 5

మృతసంఞ్జీవినీ నామ విద్యా దత్తా మహాప్రభా| తాం తు మహేశ్వరీం విద్యాం మహేశ్వరముఖోద్గతామ్‌. 6

బార్గవే సంస్థితాం దృష్ట్వా ముముహు స్సర్వదానవాః| తతో 7మరత్వం దైత్యానాం కృతం శుక్రేణ ధీమతా. 7

య న్నాస్తి సర్వలోకానాం దేవానాం యక్షరక్షసామ్‌| న నాగానా మృషీణాం చ బ్రహేమేన్ద్రో పేన్ద్ర విష్ణుషు. 8

తాం లబ్ధ్వా శహ్కరా చ్ఛుక్రః పరాం నిర్వృతి మాగతః| తతో దేవాసురో ఘోర స్సమర స్సుమహా నభూత్‌. 9

తత్ర దేవై ర్హతా న్దైత్యా ఞ్ఛుక్రో విద్యాబలేన చ| ఉత్థాపయతి దైత్యేన్ద్రా న్లీలయైవ విచక్షణః. 10

ఏవం వేద న శక్రస్తు బృహస్పతి రుదారధీః| హన్యమానా స్తతో దేవా శ్శతశో7థ సహస్రశః. 11

విషణ్ణవదనా స్సర్వే బబూవు ర్విహ్వలేన్ద్రియాః| తత స్తేషు విషణ్ణషు భగవా న్కమలోద్భవః. 12

మేరు వృష్ఠే సురేన్ద్రా మిద మాహా జగత్పతిః|

రెండు వందల నలువది ఎనిమిదవ అధ్యాయము.

అమృత మథన కథా77 రంభము.

ఋషులు సూతునిట్లడిగిరి : సూతా! యథాక్రమముగా నారాయణ మాహాత్య్మము నెంత వినినను మాకు తృప్తి కలుగుటలేదు; కావున ఇంకను అది తెలుపుము ;పూర్వము దేవతలు విచక్షణులు (వివేకవంతులు) అయి అమరత్వమును పొందిరి? ఏ తపస్సుచే ఏ కర్మము నాచరించుటచే ఎవరి యనుగ్రముచే అమరులయిరి? అన సూతుడిట్లు చెప్పెను. నారాయణదేవుడును శూలభృత్తగు మహాదేలుడును తామున్నచోటనెల్ల (దేవతలకేకాదు) సర్వులకును అమరత్వమున సహాయులేయని పెద్దల తలంపు; పూర్వము దేవాసుర యుద్ధమున సురులచే వందలకొలదిగ చంపబడిన దైత్యేంద్రులను భృగునందనుడగు శుక్రుడు తన సంజీవినీ విద్యను ప్రయోగించి నిద్ర మేలుకాంచిన వారిని వలె జీవించి లేచునట్లు చేయు చుండెను. ఎట్లన అతని తపముచే తుష్టుడైన మహాత్ముడగు శంకరుడు మహాప్రభయగు సంజీవినియను విద్యను అతనికి ఇచ్చియుండెను ;మహేశ్వర ముఖోదితయగు ఆ విద్య ఆ భార్గవునందుడుట చూచి సర్వదానవులును గర్వముచే మూడులయిరి ;దానితో ధీమంతుడగు శుక్రుడు సర్వలోకములందెవరికిని - దేవయక్ష రాక్షస నాగాదులకును ఋషి బ్రహ్మేంద్రో పేంద్ర విష్ణులకును లేని అమరత్వము దైత్యులకు సంపన్నమోనర్చెను. శంకరునుండి అట్టి అవిద్యను సంపాదించి శుక్రుడు పరమనిర్వృతి (ఆనందము) నందెను. ఇట్లు శుక్రుని సంజీవినీ విద్యాప్రాప్తికి తరువాత సుమహాఘోర దేవాసుర యుద్ధము జరిగెను. అందు దేవహతులగు దైత్యులను దైత్యేంద్రులను విచక్షణుడగు శుక్రుడు తన విద్యాబలముతో లీలగా లేవదీయుచుండెను ఈ విధమగు స్థితిని ఇంద్రుడును ఉదారబుద్ధిశాలియగు బృహస్పతియు ఎరుగరు ;దెబ్బలు తినుచున్న వందల- వేలకొలది దేవులును అందరు వికలేంద్రియులును విషణ్ణవదనులు నయిరి ;ఇట్లు వారు విషణ్ణులు కాగా జగత్పపతియగు పద్మసంభవుడు మేరుపర్వత సానువునందు దేవతలతో ఇట్లనెను. (విచక్షణః =విచష్టే)

బ్రహ్మాదిదేవకృత అమృతమథనోద్యోగః.

బ్రహ్మా : దేవా శ్శృణుత మద్వాక్యం తదేవచ నిరూప్యతామ్‌. 13

క్రియతాం దానవై స్సార్ధం సక్య మత్ర ప్రవర్తతామ్‌| క్రియతా మమృతోద్యోగో మథ్యంతాం క్షీరవారిధిః. 14

సహాయం వరుణం కృత్వా చక్రవాణి ర్విబోధ్వతామ్‌| మన్థానం మన్ధరం కృత్వా శేషనేత్రేణ వేష్టితమ్‌. 15

దానవేన్ద్రో బలిస్వామీ స్తోకకాలం నిషేవ్యతామ్‌| ప్రార్థ్యతాం కూర్మరూపశ్చ పాతాళే విష్ణు రవ్యయః. 16

ప్రార్థ్యతాం మన్దర శ్శైలో మన్థకార్యం ప్రవర్త్యతామ్‌| తచ్ఛ్రుత్వా వచనం దేవా జగ్ము ర్దానవమన్దిరమ్‌. 17

అలం విరోధభ##వేన భృత్యా స్తవ బలే 7ధునా| క్రియతా మమృతోద్యోగం క్రియతాం శేషనేత్రకమ్‌. 18

త్వయా చోత్పాదితే దైత్య అమృతే7మృతమన్థనే| భవ్యాష్యా మో7 మరా స్సర్వే త్పత్ప్రసాధాన్న సంశయః. 19

ఏవ ముక్త స్తదా దేవైః పరితుష్ట స్స దానవః| యథా వదత హే దేవా స్తథా కార్యం మయా 7ధునా. 20

శక్తో7హ మేక ఏవా7 త్ర మథితుం క్షీరవారిధిమ్‌| బాహుభ్యా మేవ సంలోఢ్య సర్వతః క్షీరవారిధిమ్‌. 21

అహరిష్యే7 మృతం దివ్య మమృతత్వాయ వో 7ధునా| సుదూరా దాశ్రయం ప్రాప్త న్ప్రణతానపి వైరిణః. 22

యో న పూజయతే భక్త్యా ప్రేత్య చేహ వినశ్యతి| పాలయిష్యామి వ స్సర్వా నధునా స్నేహ మాస్థితా &.

దేవతలారా! నామాట వినుడు; దానిపై ఆలోచించుడు ;ఇపుడు దానవులతో నఖ్యము చేయవలయును; అది జరుగవలయును; అమృతమునకై యత్నించవలయును; వరు ణుని సహాయునిగా చేసికొని మందరమును కవ్వమునుగా చేసి శేషుడను కవ్వపుత్రాటితో చుట్టి క్షీర సముద్రము మథించవలయును ;చక్రపాణి మేలుకొలుపవలయును ;దానవేంద్రుడగు బలిని మన స్వామిగా చేసికొని మనము కొలది కాలము సేవింపవలయును ;అవ్యముడగు విష్ణుడు కూర్మరూపుడై పాతాళమునందుండునట్లు వేడవలయును; మందరశైలమును కూడ ప్రార్థించవలయును ;చిలుకుట కొనసాగవలయును ;అనగా ఆ మాట విని దేవతలు దానవ మందిరమున ;కేగిరి బలితో ఇట్లనిరి ;విరోధ భావము మానుదము ;ఇకమీదట మేమును నీ బలమిందలి భృత్యులము అమృతమునకై ఉద్యోగింతము;శేషుడు కవ్వపుత్రాడగును; దైత్యా ! నీవు ఈమథనమున అమృతమును త్పాదించగా నీ ప్రసాదమున మేమందరము అసంశయముగ అమరులమయ్యెదము ; దేవతలిట్లనగా ఆ బలి దానవుడు పరితుష్టుడయ్యెను ; దేవతలారా! మీరు చెప్పినట్లే నేనిపుడు చేయుట ఉచితము ;ఇందు నేనొక్కడనే క్షీరవారిధిని మథింపశక్తుడను; బాహువులతోనే క్షీరవారిధినంతటను కెలికి మీయందర అమృతత్వమునకై ఇపుడే దివ్యామృతమును తేగలను; కానిశత్రువులనైనను చాల దూరమునుండి చాల కాలమునకు తరువాత వచ్చి తన్నాశ్రయించు వారిని భక్తితో పూజించనివాడు ఇహపరముల రెంటను నాశమందును ;కావున స్నేహాశ్రితులగు మిమ్ములనందరును పాలింతును ;అనెను.

ఏవ ముక్త్వా స దైత్యేన్ద్రో దేవై స్సార్దం య¸° తదా| మన్దరం ప్రార్థయామాస సహాయత్వే ధరాధరమ్‌. 24

మన్థో భవ త్వ మస్మాక మధునా 7మృతమన్థనే | సురాసురాణాం సర్వేషా మిదం కార్యం

కార్యం మహద్యతః. 25

తథేతి మన్దరః ప్రాహ యద్యాధరో భ##వే న్మమ| యత్ర స్థిత్వా భ్రమిష్యామి మథిష్యే వరుణాలయమ్‌. 26

కల్ప్యతాం నేత్రకార్యేచ య స్సహస్రఫణీ మమ| తతస్తు నిర్గతౌ దేవౌ కూర్మసేషౌ మహాబలౌ. 27

విష్ణో ర్భాగౌ చతుర్థాంసా ద్ధరణీధరణ స్థితౌ | ఊచతుర్గర్వసంయుక్తం వచనం శేషకచ్ఛపౌ. 28

త్రైలోక్య ధారణ నాపి న గ్లాని రిహ జాయతే| కిన్ను మన్దరకాతుక్షద్రా ద్ఘుటికాసన్నిభా దిహ. 29

శేషః బ్రహ్మాణ్డవేష్టనేనాపి బ్రహ్మాణ్డ మథనేన చ | న మే గ్లాని ర్భవే ద్దేహే కిము మన్దరవర్తనే. 30

తత ఉత్పాట్య తం శైలం తతక్షణా తీక్షసాగరే| చిక్షేప లీలయా నాగః కూర్మశ్చాధ స్థ్సిత స్తదా. 31

నిరాధారం యదా శైలం న శేకు ర్దేవదానవాః| మన్దర భ్రమణం కర్తుం క్షీరోదమథనే తదా. 32

బలి ప్రభృతీనాం విష్ణులోకగమనమ్‌.

నారాయమనివాస న్తే జగ్ము ర్బలిసమన్వితాః| యత్రాస్తే దేవదేవేశ స్స్వయమేవ జనార్దనః. 33

తత్రాపశ్యం స్తతో దేవం సితపద్మోపమం శుభమ్‌| యోగనిద్రాసునిరతం పీతవాసన మచ్యుతమ్‌. 34

హారకేయూర సద్ధాఙ్గహేమపర్యఙ్క సంస్థితమ్‌| పాదపద్మనే పద్మాయా స్స్పృశశన్తం నాభిమణ్డలమ్‌. 35

స్వపక్షవ్యజనేనాథ వీజ్యమానం గరుత్మతా| స్తూయమానం సమన్తాచ్చ సిద్ధచారమకిన్నరైః. 36

అయుధై ర్మూర్తిమధ్బిశ్చ స్తూయమానం సమన్తతః| సవ్య బాహుపధానం తం తుష్టు ర్దేవదానవాః. 37

కృతాఞ్జలిపుటా స్సర్వే ప్రణతా స్సర్వతోదిశమ్‌|

ఇట్లు పలికి ఆ దైత్యేంద్రుడపుడే దేవతలతో కూడ పోయెను; మందరధరాధరమును సహాయత్వమునకై ప్రార్థించెను. ఇపుడమృత మంథనమున నీవు మాకు కవ్వముగుము; ఏలయన ఇది సురాసురులకందరకు కావలసిన మహా కార్యము; అనగా మందరము ఎందు నిలిచి నేను భ్రమించునో సముద్రమును మథింతునో అట్టి ఆధారమున్నచో అట్లే చేయుదును; సహస్రఫణలు కల శేషునిందు కవ్వపు త్రాడుగ చేసికొనుడు ;అనెను. అంతట విష్ణుని చతుర్తాంశరూపులయి ధరణీ ధారణ కార్యమందు నిలిచియున్న మహాబలులు శేషుడును కూర్ముడును వెలికివచ్చిరి; వారు గర్వ సంయుక్త వచన మిట్లు పలికిరి ;త్రైలోక్యదారముచే కూడ మాకిందు గ్లాని కలుగుట లేదు ;అనగా ఈ విస్వందు ఘటిక (చిన్న ఉండ) వంటి క్షుద్ర వస్తువగు మందరము వలన మాకేమి శ్రమము? అనిరి శేషుడిట్లనెను; బ్రహ్మాండమునే నా యందు చుట్టినను నాలో బ్రహ్మాడమునే మథించినను నా దేహమునకు గ్లాని కలుగదు ;అనగా మందరము( నా చుట్టు) ఉండుటచే నా కేమి యగును? అంతట తత్‌క్షణమే అనాగుడు ఆ శైలమును లీలగా ఉత్పాటించి క్షీరసాగరమున ఎత్తి పడవేసెను; అంతట దాని క్రింద కూర్ముడు నిలిచెను ;ఎపుడు దేవదానవులు క్షీరోద సాగర మథనమునకై నిరాధారమగు మందరమును భ్రమింప జేయుటలో అశక్తులయిరో అపుడు వారు బలి సమన్వితులై స్వయముగ దేవదేవేశుడగు జనార్దునుడున్న నారాయణ నివాసమున కేగిరి ;అచట శ్వేతపద్మ సదృశుడును శుభుడును యోగనిద్రా నిరతుడును పీతాంబరుడును అచ్యుతుడును హార కేయూర భూషితాంగుడును హేమపర్యంక స్థితుడును తన పాదపద్మములతో లక్ష్మీ నాభిమండలమును స్పృశించుచు గరుత్మంతునిచే తన రెక్కల విసనకర్రతో గాలి వీవబడుచు తన కన్ని వైపుల నిలిచిన సిద్ధాచారణ కింనరులచేతను మూర్తి మంతములగు ఆయుధములచేతను స్తుతింపడుచు ఎడమ బాహువును దిండుగా పెట్టుకొని ఆ దేవుని దర్శించి దేవదానవులెల్లరు అన్ని దెసల నిలిచి కృతాంజలి పుటులయి ప్రణతులయి అతనినిట్లు స్తుతించిరి.

దేవదానవ కృత విష్ణుస్తుతిః.

దేవదానవాః : నమో లోకత్రయాధ్యక్ష తేజసా జితభాస్కర. 38

నమో విష్ణో నమో జిష్ణో నమస్తే కైటభార్దన | నమ స్సర్గక్రియాకర్త్రే జగత్పాలయతే నమః. 39

రుద్రరూపాయ శర్వాయ నమ స్సంహారకారిణ | నమ శ్శూలాయుధాధృష్య నమో దానవఘాతినే. 40

నమః క్రమత్రయా క్రాన్త త్రైలోక్యాయా7భవాయచ నమః| ప్రచణ్డదైత్యేన్ద్ర తూలకాలమహానల. 41

నమో నాభిహ్రదోద్భూత పద్మగర్భ మహాచల| పద్మబూత మహాభూతకర్త్రే హర్త్రే జగత్ప్రియ. 42

జనితా శేషలోకేశ క్రియాకారణకారిణ| అమరారివినాశాయ మహాసమరశాలినే. 43

లక్ష్మీ ముఖాబ్జమధుప నమః కీర్తినివాసినే| అస్మాక మమరత్వాయ ధ్రియతాం ధ్రియతా మయమ్‌. 44

మన్దర స్సర్వశైలానా మయుతాయుతవస్తరః| అనన్తబల బాహుభ్యా మవష్టభ్యైకపాణినా. 45

మథ్యతా మమృతం దేవ స్వథాస్వాహార్థకామినామ్‌| తత శ్శ్రుత్వా న భగవా & స్తోత్రం పూర్వం వచ స్తదా. 46

విహాయ యోగనిద్రాం తా మువాచ మధుసూదనః| శ్రీ భగవా& : స్వాగతం విబుధా స్సర్వే కి మాగమన కారణమ్‌. 47

యస్మా త్కార్య దిహ ప్రాప్తా స్తద్బ్రూత విగతజ్వరాః| నారాయణ నైవ ముక్తాః ప్రోచు స్తత్ర దివౌకసః. 48

అమరత్వా య దేవేశః మథ్యఘానే మహోదధౌ| యథా7మృతత్వం దేవేశ తథా నః కురు మాధవ. 49

త్వయా వినా న త చ్ఛక్య మాస్మాభిః కైటభార్దన| ప్రాప్తుం త దమృతం నాథ తతో7 గ్రే భవ నో విభో. 50

లోకత్రయాధ్యక్షా ! తేజోజిత భాస్కరా ! విష్ణో! జిష్ణో! కైటభమర్ధనా ! సృష్టిక్రియాకర్తా ! జగత్పాలయితా ! నమస్కారము; రుద్రరూపా ! శర్వా! సంహారకారిన్‌! శూలాయుధా! అధృష్యా! దానవఘాతిన్‌ !నమస్కారము ; పాదత్రయక్రమాక్రాంత త్రైలోక్యా! అభవా!ప్రచండదైత్యంద్రతూల ప్రళయ మహాగ్నీ ! నా భిహ్రద సంజాత పద్మగర్భ మహాచలా ! పద్మభూతా మహాభూతా! (పాద్మకల్పమున పృథ్వీ మహాభూతమునారాయణుని నాభి పద్మమని చెప్పబడెను.) కర్తా!హర్తా!జగత్ప్రియా!అసేష లోకపాల జనకా!క్రియాకారణ కారిన్‌!దేవారి వినాశకా! మహాసమరసాలిన్‌ ;లక్ష్మీ ముఖ పద్మ మధుపా !కీర్తినివాసిన్‌!నమస్కారము; మాకు అమరత్వము కలిగింప నిశ్చయించుము ;సర్వ శైలములలో గొప్పదియు అయుతాయుత యోజన విస్తామునునగు ఈ మందరమును నీ అనంత బలబాహుద్వయమందలి ఒక బాహువుతో ఒక పాణితో నిలువబెట్టి ధరించుము ;స్వధాస్వాహార్థహవిః కాములగు దేవతలకై అమృతమును మథించవలయును ;అనిన స్తోత్ర పూర్వక దేవవచనమును విని మదుసూదనుడు యోగనిద్ర విడిచి ఇట్లనెను : సర్వదేవతలారా! స్వాగతము; మీ ఆగమన కారణమి? మనః సంతాపము విడిచి మీరు వచ్చిన పని తెలుపుడు; అట నారాయణుడిట్లు పలుకగ విని దివౌకసులిట్లనిరి ;దేవేశా! మాకమరత్వ ప్రాప్తికై చేయు ఈ మహోదధి మథనముచే మా కది లభించు నుపాయమొన రింపుము; మాధవా! కైటభమర్దనా!విభూ!నీవు లేనిదే మాచే ఆ అమృతము పొంద శక్యముకాదు ;కావున నీవు మా ముందుడుము.

ఇత్యుక్తశ్చ తతో విష్ణు రప్రధృష్ణో 7రిమర్దనః| జగామ సహితో దేవై ర్యత్రా 7సౌ మన్దరాచలః. 51

వేష్టితో 7నన్త భోగేన ధృతశ్తామరదానవైః| విషభీతా స్తతో దేవా యతః పుచ్ఛం తత స్థ్సితా. 52

ముఖతో దైత్యసఙ్ఘాస్తు సైంహికేయపురస్సరాః| సహస్రంవదనం చాస్య శిర స్సవ్యేన పాణినా. 53

దక్షిణన బలి ర్దేహం నాగస్యాకృష్టం వాం స్తదా| దధారామృతమన్థానమన్దరం చారుకన్దరమ్‌. 54

నారాయణస్తు భగవా న్భుజయుగ్మద్వయేన తు| తతో దేవాసురై స్సర్వై ర్జయశబ్దపురస్సరమ్‌. 55

దివ్యం వర్షశతం సాగ్రం మథితః క్షీరసాగరః| తత శ్శ్రాన్తాస్తు తే సర్వే దేవా దైత్యపురస్సరాః. 56

తత శ్శ్రాన్తేషు దేవేన్ద్రో మేఘో భూత్వా7 మ్బుశీకరా& |వవర్షామృతకల్పాం స్తా న్వవౌ వాయుశ్చ శీతలః. 57

శ్రాన్తప్రాయేషు దేవేషు అశ్రాన్తః కమలాసనః| మథ్యతాం సిన్ధురిత్యువాచ పునః పునః. 58

ఆవశ్య ముద్యో గవతాం శ్రీరపారా భ##వే త్సదా| బ్రహ్మప్రోత్సాహితా దేవా మమన్థుః పునరమ్భుధిమ్‌. 59

భ్రామ్యమాణ తత శ్శైలే యోజనాయుత శేఖరే. నిపేతు ర్హస్తియూథాని వరాహశరభాదయః. 60

శ్వాపదాయుతలక్షాణి తథా పుష్ప ఫలద్రుమాః | తతః ఫలానాం వీర్యేణ పుష్పౌషధిర సేన చ. 61

క్షీరసఙ్ఘర్షణా చ్చాపి దధిరూప మజాయత| తతస్తు సర్వజీవేషు చూర్ణితేషు సహస్రశః. 62

తదమ్బుమేదసోత్పన్నా వారుణీ సమపద్యత | వారుణీ గన్ధ మాఘ్రాయ ముముహు ర్దేవదానవాః. 63

తదాస్వాదేన బలినో దేవదైత్యాదయో7 భవ &|

దేవతలిట్లనగా అప్రధృష్యుడును శత్రు మర్దనుడునగు విష్ణుడు దేవసహితుడై మందరాచలమున్నచోటి కేగెను; దానిని దేవదానవులు అనంతుని భోగరాసితో చుట్టి పట్టుకొనిరి ;దేవతలు విషభీతులయి తోకవైపున నుండిరి ;సైంహికేయ (రాహు) ప్రముఖ దానవులు ముకమువైరున నుండిరి; అంతట బలి ఆ నాగుని సహస్రదనమగు శిరమును ఎడమచేతితో మిగిలిన దేహమును కుడిచేతితో పట్టిలాగెను. నారాయణ భగవానుడు తన భుజద్వయముతో అమృత మథన మునకు కవ్వమయిన మందరమును ధరించెను; అంతట దేవాసురులెల్లరును జయ శబ్ద పూర్వకముగా ఆరంభించి సమగ్ర దివ్య శతవత్సరములు క్షీరసాగరమును మథించిరి ;దైత్యదానవులు సర్వులు అప్పటికి శ్రాంతులయిరి అపుడు దేవేంద్రుడు మేఘడయి అమృత కల్పములగు జలశీకరముల వర్షించెను ;శీతల వాయువును వీచెను ;దేవతలలో చాలమంది చాలవరకు అలసిన పుడెల్ల కమలాసనుడు మాత్రము అశ్రాంతుడై సముద్రమును మథించుడు ;మథించుడు; ఉద్యోగ(యత్న) వంతులకెప్పుడును అపారయగు శ్రీ లభించును; అనిఎచ్చరించుచుండెను ;బ్రహ్మ ప్రోత్సాహితులయి దేవతలు మరల అంబుధిని మథించుచుండిరి ;అట్లు అయుత యోజనోన్నత శిఖరమగు శైలమును వారట్లు త్రిప్పుచుండ దానినుండి గజయూథములును వరాహ శరభాది మృగములును అయుతలక్ష సంఖ్యలో శ్వాపదములును పుష్పఫల ద్రుమములును పడసాగెను ;ఫలవీర్యము (రసము)ను పుష్పౌషధి రసమును క్షీరముతో సంఘర్షణమంది దధి రూపమందెను ;వేలకొలదిగ సర్వ జీవులును చూర్ణితములు కాగా వాని మేదస్సు నీటితో కూడి వారుణి (మద్యము) అయ్యెను ;ఆ వారుణీ గంధ మాగ్రాణించి దేవదానవులు మోహితులయిరి; దాని నాస్వాదించి వారు బవశాలురునైరి.

తతో 7తివేగా జ్జగృహు ర్నాగేన్ద్రం సర్వతో 7సురాః. 64

మన్థానం మన్థయష్టిస్తు మేరు స్తత్రా7 చలో7 భవత్‌ | ఆభవచ్చాగ్రతో విష్ణు ర్బుజనమన్దరబన్ధనః. 65

స వాసుకిఫణాలగ్నపాణిః కృష్ణో వ్యరాజత| యథా పద్మోత్ఫలై ర్యుక్తో బ్రహ్మ దణ్డో7తివిస్తరః. 66

ధ్వని ర్మేఘసహస్రస్య జలధే రుచ్ఛ్రిత స్తదా| భాగే ద్వితీయే మఘవా నాదిత్యాస్తు తతః పరమ్‌. 67

తతో రుద్రా మహోత్సాహా వసవో గుహ్యకాదయః| పురతో విప్రచిత్తిస్తు మనుచి ర్వృత్త్రశమ్బరో. 68

ద్విముర్ధా వజ్రదంష్ట్రశ్చ సైంహికేయో బలి స్తదా| ఏతే చాన్యేచ బహవో ముఖబాగ మవస్థితాః. 69

మమన్తు రమ్భుధిం దృప్తా జలవన్తో విభూషితః| బభూవాత్ర మహాఘోషో మహామేఘరవోపమః. 70

ఉదధే ర్మథ్యమానస్య మన్దరేణ సురాసురైః| తత్ర నానాజలచరా వినిర్ధూతా మహాద్రిణా. 71

విలయం సముపాజగ్ము శ్శతశో7థ సహస్రశః| వారుణాని చ భూతాని వివిధాని మహీధరాః. 72

పాతాళతలవాసీని విలయం సముపానయత్‌| తస్మింశ్చ భ్రామ్యమాణ7ద్రౌ సఙ్ఘర్షాచ్చ పరస్పరమ్‌. 73

న్యపత న్పతగోపేతాః పర్వతాగ్రా న్మహాద్రుమాః|

అంతట అతివేగముతో అంతటను అసురులా నాగేంద్రుని కవ్వమగు మందరమును కూడ పట్టుకొనిరి ;అందు మేరుపర్వతము మంథపుష్టి(కవ్వపు కర్ర) గానయ్యెను ;మందరమును తన భుజములయందు బంధించుకొని ముంధు విష్ణువు నిలిచెను; వాసుకి ఫణాలగ్నవాణియగు ఆ కృష్ణుడు పద్మకుముదపుష్పములతోకూడి అతి విస్తరమగు బ్రహ్మ దండమువలె ప్రకాశించెను ;అతట ఆ మథనముచే జలధినుండి మేఘసహస్రధ్వని యుత్పన్నమయ్యెను ;సర్పపు ద్వితీభాగమున మొదట ఇంద్రుడు తరువాత క్రమముగా ఆదిత్యమహోత్సాహి రుద్రమసు గుహ్యకాదులునుండిరి; ముందు ముఖభాగమున విప్రచిత్తి సముచిపృత్రశంబర ద్విమూర్ధవజ్రదంష్ట్ర సైంహికేయబలి ప్రముఖులగు బహుదైత్యులుండిరి ;దర్పవంతులు బలవంతులు విభూషితులును అగు వీరందరును అంబుధిని మథించిరి ;సురాసురులచే మందర ముతో ఉదధి మథింపబడుచుండగా మహామేఘధ్వనిని పోలిన మహాఘోషమయ్యేను ;అందు మందర మహాద్రిచే చెదర గొట్టబడి వందల వేలకొలదిగ నానా జలచరములు విలయమందెను ;ఆ మందర మహీధరము పాతాళ తలవాసులగు వివిధ జలచర ప్రాణులను విలయమందించెను. అట్లాయద్రి భ్రమింపజేయబడుచుండ పరస్పర సంఘర్షమున ఆ పర్వతా గ్రము నుండి మహావృక్షములు తమ మీది పక్షులతో కూడ పడుచుంచెను.

తేషాం సఙ్ఘర్షణాచ్చాగ్ని రర్చిర్భిః ప్రజ్వల న్ముహుః.

విద్యుద్భిరివ నీలాబ్ర మావృణో న్మన్దరం గిరిమ్‌ ద్రదాహ కుఞ్జరాం శ్చైవ సింహాశ్చైవ వినిస్సృతా& .75

విగతాసూని సర్వాణి సత్త్వాని వివిధానిచ| తమగ్నిమమరశ్రేష్ఠః ప్రదహస్తం యత స్తతః. 76

వారిణా మేఘజేనేన్ద్ర శ్శమయామాస సర్వతః| తతో నానారసా స్తత్ర నిపేతు స్సాగరామ్భసి. 77

మహాద్రుమాణాం నిర్యాసా బహవశ్చౌషధీరసాః| తేషా మమృతవీర్యాణాం రసానాం ప్రస్రవేణవై. 78

అమరత్వం సురా జగ్ముః కాఞ్చనచ్ఛవిసన్నిభాః| అథ తస్య సముద్రస్య తజ్జాత ముదకం పయః. 79

రసాన్తరై ర్విమిస్రం చ తతః క్షీరా దబూద్ఘృతమ్‌| తతో బ్రహ్మమ మానసీం దేవా వచన మబ్రువ& . 80

శ్రాన్తాః స్మ సుభృసం బ్రహ్మ న్నోద్భవ త్యమృతం చ యత్‌| ఋతే నారాయణా త్సర్వే దైత్యా దేవోత్తమా స్తథా. 81

చిరాయిత మిదం చాపి సాగరస్యాపి మన్థనమ్‌| తతో నారాయణం దేవం బ్రహ్మా వచన మబ్రవీత్‌. 82

విధత్స్వైషాం బలం విష్ణో భవానేన పారయణమ్‌| శ్రీ విష్ణుః బలం దదామి సర్వేషాం కర్మైత ద్యే సమాస్థితాః. 83

క్షుభ్యతాం క్రమశ స్సర్వై ర్మన్దరః పరివర్త్యతామ్‌.

ఇతి శ్రీ మత్స్య మహాపురాణ దేవదానవకృతం అమృతకథనం నామ

అష్టచత్వారింశదుత్తర ద్విశతతమోధ్యాయః.

వాటి రాపిడిచే కలిగిన అగ్ని కూడ మిగుల మండుచు తన జ్వాలలతో ఆ మందరపర్వతమును నీలమేఘమును మెరుపులతో ఆవరించెను; వెలికివచ్చిన గజములను సింహములను దహించెను; వివిధ సర్వసత్త్వములును అగ్నిచే విగతప్రాణములయ్యెను ;ఎక్కడ బట్టిన నక్కడనే ప్రదహించుచున్న ఆ అగ్నిని అమరశ్రేష్ఠుడగు ఇంద్రుడు అంతటను కురుసిన మేఘజలముతో చల్లార్చెను; అంతట అటు ఆ పర్వతమునుండి సాగరజలమందు నానా రసములును పడెను; మహాద్రుమముల నిర్యాసము(బంక) లును అనేకౌషదీ రసములును అట్టివే ;అమృత సమాన వీర్యయుక్తములగు రసప్రస్రవముచే సురలు కాంచననసమాన కాంతియుతులై అమరత్వమునందిరి; అంతట ఆ సముద్రపు క్షీరరూపజలము రసాంతరము లతో విమిశ్రమయి ఘృత మేర్పడెను ;అంతట(అలసి) కూర్చుండిన బ్రహ్మతో దేవతలిట్లనిరి ;బ్రహ్మన్‌! నారాయణుడు తప్ప మిగిలిన సర్వదైత్యులును దేవోత్తములునునగు మనమందరమును మిగుల అలసిపోతిమి ;ఇంతవరకును అమృత ముద్భవించలేదు ;సాగరమును మనము మథించుట ఆరంభించి చాలకాలమయినది; అనగా బ్రహ్మ నారాయణ దేవునితో ఇట్లనెను ;విష్ణో! నీవే మాకు పరాయణము ;(ఉత్తమాశ్రయము;) వీరికి బలము కలిగించుము ;అనగా-ఎవరు ఈ పని పూనియున్నారో - వారికందరకును బలము ఇచ్చుచున్నాను; సర్వులును క్రమశః సముద్రమును క్షోభిల్లజేయుచు మందర మును త్రిప్పుచుండుడు. అని నారాయణుడనెను.

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున దేవదానవులు అమృతమునకై క్షీరసాగరమును

మథించుటయను రెండు వందల నలువది ఎనిమిదవ యధ్యాయము.

Sri Matsya Mahapuranam-2    Chapters