Sri Matsya Mahapuranam-2    Chapters   

చతుశ్చత్వారింశదుత్తరద్విశతతమో7ధ్యాయః.

శ్రీ వామన చరిత్రే- వామనస్య బలియజ్ఞవాట గమనమ్‌.

శౌనకః: నిస్తేజసో7సురా స్టృష్ట్వా సమస్తా నమరేశ్వరః | ప్రహ్లాద మథ పప్రచ్ఛ బలి రాత్మపితామహామ్‌. 1

బలిః : తాతా నిస్తేజసో దైత్యా నిరగ్‌గ్ధా ఇవ వహ్నినా | కిమేతే సహసైవాద్య బ్రహ్మదణ్డహతా ఇవ. 2

దురిష్టం కిన్ను దైత్యానాం కిం కృత్వా వైరినిర్మితా | నాశాయైషా సముద్భూతా మయా నిస్తేజసో7సురాః. 3

శౌనకః : ఇతి దైత్యపతిర్వీరః పృష్టః పౌత్త్రేణ పార్థివ |

చిరం ధ్యాత్వా జగాదైవ మసురేన్ద్రం బలిం తదా. 4

ప్రహ్లాదః చలన్తి గిలయో భూమి ర్జహాతి సహసా ధృతిమ్‌ |

సర్వే సముద్రాః క్షుభితా దైత్యా నిస్తేజసః కృతాః. 5

సూర్యాదయో యథా పూర్వం తథా గచ్ఛన్తి న గ్రహాః | దేవానాం చ పరా లక్ష్మీః కారణౖ రనుమీయతే. 6

మహదేత న్మహోబాహో కారణం దానవేశ్వర | న హ్యల్ప మభిమన్తవ్య మిదం కార్యం సురార్దన. 7

శౌనకః : ఇత్యుక్త్వా దానవపతిం ప్రహ్లాద స్సో7సురోత్తమః |

అత్యన్తభక్తో దేవేశం జగామ మనసా హరిమ్‌. 8

స ధ్యానయోగం కృత్వా7థ ప్రహ్లాద స్సుమనోహరమ్‌ | విచారయామాస తతో దేవదేవం జనార్దనమ్‌. 9

స దదర్శోదరే7దిత్యాః ప్రహ్లాదో వామనాకృతిమ్‌ | అన్తః స్థా న్బిభ్రతం సప్త లోకా నాది ప్రజాపతిమ్‌. 10

తదన్తఃస్థా స్వసూ న్రుద్రా నశ్వినౌ మరుత స్తథా | సాధ్యాన్విశ్వాం స్తథా77దిత్యా న్గన్దర్వోరగరాక్షసా&. 11

విరోచనం చ తనయం బలిం చాసురనాయకమ్‌ | జమ్భం కుజమ్భం నరకం బాణ మన్యా న్మహాసురా&. 12

ఆత్మాన ముర్వీం గగనం వాయు మమ్భో హుతాశనమ్‌ | సముద్రాద్రిద్రుమసరిత్సరాంసిచ పశూ న్మృగా&.13

దేవా న్మనుష్యా నఖిలాం స్తథైవచ సరీనృపా& | సమస్తలోకస్రష్టారం బ్రహ్మణం భవమేవచ. 14

గ్రహనక్షత్రభేదాంస్చ దక్షాద్యాం శ్చ ప్రజాపతీ& | సమ్పశ్య న్విస్మయా77విష్టః ప్రకృతిస్థః క్షణాత్పునః.15

ప్రహ్లాదః ప్రాహ దైత్యేన్ద్రం బలిం వైరోచనిం తథా |

రెండు వందల నలుబది నాలుగవ అధ్యాయము.

వామన జననము- వామనుడు బవియజ్ఞవాటమునకు పోవుట.

శౌనకుడర్జునునకిట్లు చెప్పెను: అసురులందరును నిస్తేజస్కులగుట చూచి అసురేశ్వరుడగుబలి పితామహుడగు ప్రహ్లాదునిట్లడిగెను; తండ్రీ! దైత్యులందరును ఇట్లు అకస్మాత్తుగా వహ్నితో దగ్దులయిరేమో బ్రహ్మాండముచే దెబ్బతినిరేమో యనునట్లు నిస్తేజస్కులయిరేల? దైత్యులేమైన దుర్యజ్ఞములాచరించిరా? వైరులేదయిన కృత్యమ నిర్మించగా ఆది వీరి నాశమునకై సముద్భూతయయినదా? అని పౌత్త్రుడడుగ వీరుడగు దైత్యపతి ప్రహ్లాదుడు చాలతడవు ధ్యానించి ఇట్లు పలికెను; అకస్మికముగా గిరులు చలించుచున్నవి; భూమి నిబ్బరము కోల్పోవుచున్నది; సముద్రములు క్షోభిల్లు చున్నవి ; దైత్యులు నిస్తేజస్కులుగా చేయబడిరి; సూర్యాదిగ్రహములు ఎప్పటివలె నడుచుటలేదు; ఈ హేతువులను బట్టి దేవతలకు పరమలక్ష్మి కలుగనున్నదని యూహించవచ్చును; మహాబాహూ! ఇది మహాకారణమే; సురవైరీ! ఇది అల్పకార్యమని తలచుకుము; అని దానవ పతితో పలికి అసురోత్తముడును అత్యంతహరి భక్తుడును అగు ప్రహ్లాదుడు మనసా హరిని ధ్యానించెను; ప్రహ్లాదుడును మనోహరమగు ధ్యానయోగమనుష్ఠించి దేవదేవుడగు జనార్దనుని తనచిత్తమున విచారణచేసికొనెను; ఆ ప్రహ్లాదునకు అదితియుదరమునందు వామనరూపుడై తనయుదరమందు సప్తలోకములను ధరించిన ఆది ప్రజాపతియగు నారాయణు కనబడెను; అతని లోపల వసువులు రుద్రులు అశ్వినులు మరుత్తులు సాధ్యులు విశ్వేదేవులు అదిత్యులు గంధర్వులు నాగులు రక్షస్సులు విరోచన తనయుడు అసుర నాయకుడునగు బలి జంభకుజంభనరక బాణాది మహాసురులు తానును( ప్రహ్లాదుడు) భూమి ఆకాశము వాయువు జలము అగ్ని సముద్ర వృక్ష పర్వత నదీ సరస్సులు పశువులు దేవ మానవ సరీనృపములు సర్వలోకస్రష్టయగు బ్రహ్మా- రుద్రుడు గ్రహనక్షత్ర విశేషములు దక్షాది ప్రజాపతులు కనబడిరి. ఇవియన్నియు చూచి విన్మయావిష్టుడయియు ప్రహ్లాదుడు క్షణములో మరల తేరుకొని దైత్యేంద్రుడును విరోచన పుత్త్రుడునగు బలితో ఇట్లనెను:

బలిం ప్రతి ప్రహ్లాదోపదిష్టవిష్ణుమహిమా.

ప్రహ్లాదః : వత్స జ్ఞాతం మయా సర్వం యదర్థం భవతామియమ్‌. 16

తేజసో హాని రుత్పన్నా తచ్ఛృణుష్య యథార్థతః | దేవదేవో జగద్యోని రయోని ర్జగదాదికృత్‌. 17

అనాది రాదిర్విశ్వస్య వరేణ్యో వరదో హరిః | పరమ్పరాణాం పరమం పరః పరవతామపి. 18

ప్రమాణంచ ప్రమాణానాం సప్తలోకగురో ర్గురుః |

ప్రభుః ప్రభూణాం పరమే మహాత్మా అనాదిమధ్యో భగవా ననన్తః. 19

త్రైలోక్య మంశేన సనాథ మేష కర్తుం మహాత్మా7దితిజో7వతీర్ణః |

న యస్య రుద్రో న చ పద్మయోని రిన్ద్రో న సూర్యేన్దు మరీచిముఖ్యాః. 20

జానన్తి దైత్యాధిప యత్స్వరూపం స వాసుదేవః కలయా7వతీర్ణః |

యో7సౌ కలాంశేన నృసింహరూపీ జఘాన పూర్వం పితరం మమేశః 21

య స్సర్వయోగీశమనోనివాస స్స వాసుదేవః కలయా7వతీర్ణః |

యమక్షరం వేదవిదో విదిత్వా విశన్తి యం జ్ఞానవిధూతపాపాః. 22

యస్మి న్ప్రవిష్టా న పునర్భవన్తి తం వాసుదేవం ప్రణమామి నిత్యమ్‌ |

భూతా న్యశేషాణి యతో భవన్తి యథోర్మయ స్తోయనిధే రజస్రమ్‌. 23

లయం చ యస్మి న్ప్రళ##యే ప్రయాన్తిం తం వాసుదేవం ప్రణమామ్యజస్రమ్‌ |

న యస్య రూపం న బలప్రభావౌ న యస్య భావః పరమస్య పుంసః. 24

విజ్ఞాయతే శర్వపితామహాద్యై స్తం వాసుదేవం ప్రణమామ్యజస్రమ్‌ |

రూపస్య చక్షుర్గ్రహణ త్వగిష్టా స్పర్శే గ్రహిత్రీ రసవా రసస్య. 25

శ్రోత్రంచ శబ్దగ్రహణ నరాణాం ఘ్రాణంచ గన్ధగ్రహణ నియుక్తమే | సఘ్రాణగ్రాహ్యశ్శ్రవణాదిభి ర్య స్సర్వేశ్వరో వేదితు మక్షయాత్మా. 26

శక్య స్త మీడ్యం మనసైవ దేవం గ్రాహ్యం తతో7హం హరి మీశితారమ్‌| యేనైకదంష్ట్రాగ్ర సముద్ధృతేయం ధరా చ తాం ధారయతీహ సర్వా& . 27

యస్మింశ్చ శేతే సకలం జగచ్ఛ తమాద్యమీశం ప్రమతో7స్మి విష్ణుమ్‌ |

అంశావతీర్ణేన చ యేన గర్భే హృతాని తేజాంసి మహాసురాణామ్‌. 28

నమామి తం దేవ మజస్ర మీశ మశేషసంసారతరోః కుఠారమ్‌ |

దేవో జగద్యోని రయం మహాత్మా స షోడశాంశేన మహాసురేన్ద్ర.29

స దేవమాతు ర్జఠరం ప్రవిష్ణో హృతాని వ స్తేన బలా ద్వపూంషి|

నాయనా! నేనంతయు నెరిగితిని; మీకందరకును తేజోహాని కలిగిన హేతువు యాథార్థ్యముతో తెలిపెదను; వినుము; దేవదేవుడును జగత్కారణుడును తనజన్మకు కారణమగునది లేనివాడును జగదాది కర్తయు అనాదియు విశ్వమున కాదియు వరేణ్యుడు( శ్రేష్ఠుడు- ప్రార్థనీయుడు) ను వరదుడును హరియు (పాపములను హరించువాడును) గొప్పవాని యన్నింటిలో గొప్పవాడును గొప్పవారికిని గొప్పవాడును ప్రమాణములకును ప్రమాణభూతుడును సప్తలోకగురుడు (తండ్రి) అగు బ్రహ్మకును తండ్రియు ప్రభులకును పరమ ప్రభువును మహాత్ముడును ఆదిమధ్యాంతరహితుడును భగవాముడును అగు మహాత్ముడీ విష్ణువు త్రైలోక్యమును సనాధము (రక్షణకలది) గా చేయుటకై అంశముతో అదితి గర్భమునందవతరించినాడు; రుద్రబ్రహ్మేంద్ర రవీందులకును మరీచ్యాది ప్రజాపతులకును అతని స్వరూపమెరుగరానిది; తన కలాంశముతో నృసింహ రూపుడై మునుపు మా తండ్రిని చంపిన ఈశుడు సర్వయోగీశ మనోనివాసుడునగు వాసుదేవుడీతడు; వేదతత్త్వవిదు లీయక్షరునెరిగి జ్ఞానబలమున తమ పాపములు పోద్రోలి అతనియందే లయమందుదురు; వారు మరల జన్మించరు; అట్టి వాసుదేవుని నమస్కరింతును; సముద్రమునుండి అలలువలె అతనినుండియే సమస్త భూతములునతని నుండి జనించి ప్రళయముననతనియందే లయమందును; రుద్ర బ్రహ్మాదులును ఆ పరమపురుషుని రూప బల ప్రభావ భవముల నెరుగజాలరు; రూప స్పర్శ రస శబ్ద గంధ గ్రహులగు చక్షుస్త్వక్‌ జిహ్వాశ్రోత్రఘ్రాణములును అతనిని గ్రహింపజాలవు; అట్టి స్తవనీయుడును మనోమాత్ర గ్రాహ్యుడును ఈశ్వరుడునునగు హరిని వాసుదేవుని నమస్కరింతును; తన ఏకదంష్ట్రాగ్రముతో నతడు భూమిని ధరించినందుననే ఆ దేవియు ఈ సర్వభూతములను ధరించగలుగుచున్నది; ఈ సకల జగము నాతనియందే శయనించియున్నది; అట్టిహరి అంశావతారమెత్తి దైత్యతేజములకు హానికలిగించినాడు; సంసార వృక్షకుఠారుడగు ఆ దేవుని నేను అజస్రమును నమస్కరించుచుందును. మహాత్ముడగు ఆదేవుడు జగత్కారణుడు. మహా7సురేంద్ర! అతడు తన పదునారవ అంశముతో దేవమాతృగర్భమున ప్రవేశించినందున నతని బలముచే దైత్య శరీరతేజస్సులు హరింపబడినవి.

బలికృ విష్ణ్వాక్షేపః

బలిః : తాత కో7యం హరిర్నామ మ యతో నో భయ మాగతమ్‌. 30

సన్తి మే శతశో దైత్యా వాసుదేవా బలాధికాః | విప్రచిత్తి శ్శిబి శ్శఙ్కు రశ్శశీర్ష స్తథైవచ. 31

అయశ్శిరా ః ఖరశిరా భఙ్గకారో మహాసురః | ప్రతాపః ప్రఘస శ్శమ్భుః కుకురశ్చ సుదుర్జయః. 32

ఏతే చాన్యేచ మే సన్తి దైతేయా దానవా స్తథా| మహాబలా మహావీర్యా భూభారధరణక్షమాః. 33

ఏషా మేకైకశః కృష్ణో న వీర్యార్ధేన సమ్మితః |

వైకుణ్ఠాక్షేపక బలింప్రతి ప్రహ్లాద కృతనిన్దా.

శౌనకః: పౌత్త్రసై#్యత ద్వచ శ్శ్రుత్వా ప్రహ్లాదో దైత్య పుఙ్గవః. 34

ధిగ్ధిగిత్యాహ స బలిం వైకుణ్ఠాక్షేప వాదినమ్‌ |

ఇది విని బలి ప్రహ్లాదునిట్లు ప్రశ్నించెను: తండ్రీ ఏహరివలన మనకు భయమేర్పడినదనుచున్నావో -అతడు ఎంతటివాడు! బలమున ఈ వాసుదేవునికంటె

ఆధికులగు దైత్యులు వందల కొలదిగా నాకడనున్నారు; విప్రచిత్తి శిబి శంకువు అశ్వశిరుడు ఆయశ్శిరుడు ఖరశివుడు మహాసురుడగు భంగకారుడు ప్రతాపుడు ప్రఘసుడు శంభుడు సమరజయడగు కుకురుడు వీరును మరికొందరిను దైతేయులును దానవులును నాకున్నకారు; వీరందరును మహాబలులు మహాభుజులు భూభారమును ధరింప సమర్థులు; కృష్ణుడు వీరిలో ఏఒక్కరి బలములో సగము కంటెను తక్కువ బలముకలవాడు; అని వైకుంఠునధిక్షేపించుచు మాటలాడు పౌత్త్రునిమాట విని దైత్యపుంగవుడగు ప్రహ్లాదుడు బలిని ఉద్దేశించి చీఛీయనెను.

ప్రహ్లాదః: వినాశ ముపయాస్యన్తి మన్యే దైతేయదానవాః. 35

యేషాం త్వమీదృశో రాజా దుర్భుద్ధి రవివేకవా& | దేవదేవం మహాభాగం వాసుదేవ మజం విభుమ్‌. 36

త్వామృతే పాపనఙ్కల్ప! కో7న్య ఏవం వదిష్యతి | య ఏతే భవతా ప్రోక్తా స్సమస్తా దైత్యదానవాః. 37

సబ్రహ్మజా స్తథా దేవా స్థ్సావరానన్తమూర్తయః | త్వం చాహంచ జగచ్చేదం సాద్రిద్రుమనదీనదమ్‌. 38

సముద్రద్వీపలోకాశ్చ న సమం కేశవస్య హి | యస్యాతివన్ద్యవన్ద్యస్య వ్యాపినః పరమాత్మనః. 39

ఏకాంశేన జగత్సర్వం కస్త మేవం ప్రవక్ష్యతి | ఋతే వినాశాభిముఖం త్వామేక మవివేకినమ్‌. 40

దుర్బుద్ధి మకృతాత్మానం వృద్ధానాం శాసనాతిగమ్‌ |

శోచ్యో7హం యస్య మే గేహే జాత స్తవ పితా7ధమః. 41

యస్య త్వ మీదృశః ప్రుత్త్రో దురాత్మా కృష్ణనిన్దకః | తిష్ఠత్యేషా హి సంసారసమ్భృతా7ఘవినాశినీ. 42

కృష్ణే భక్తి రహం తావ దవేక్ష్యో భవతా ను కిమ్‌ | న మే ప్రియతమః కృష్ణా దపి దేహో మహాత్మనః. 43

ఇతి జానా త్యయం లోకో న భవా న్దితిజాధమ | న జానాసి ప్రియతరం ప్రాణభ్యో7పి హరిం మమ. 44

నిన్దాం కరోషి తస్య త్వ మకుర్వ న్గౌరవం మమ | విరోచన స్తవ గురు ర్గురు స్తస్యాప్యహం బలే. 45

మమాపి సర్వజగతాం గురో ర్నారాయణో గురుః | నిన్దాం కరోషి యస్తస్మిన్కష్ణే గురుగురో ర్గురౌ. 46

యస్మా త్తస్మా దిహైశ్వర్యా దచిరా ద్భ్రంశ మేష్యసి | మమ దేవో జగన్నాథో బలే తావ జ్జనార్ధనః. 47

భవత్వహ ముపేక్ష్యస్తే ప్రీతిమానస్తు మే గురుః | ఏతావన్మాత్ర మప్యేవం నిన్దితో జగతో గురుః. 48

నావేక్షితం త్వయా యస్మా త్తస్మా చ్ఛాపం దదామి తే | యథా మే శిరసశ్ఛేదా దిదిం గురుతరం వచః. 49

త్వయోక్త మచ్యుతాక్షేపి రాజ్యభ్రష్ట స్తథా పత | యథా చ కృష్ణా న్న పరం పరిత్రాణం భవార్ణవే. 50

తథా చిరేణ పశ్యేయం భవన్తం రాజ్యవిచ్యుతమ్‌ |

ఇటువంటి దుర్భుద్ధియు అవివేకియునగు నీవు రాజుగానున్న ఈ దైతేయదానవులు వినాశమందుదురని నాకు తోచుచున్నది; దేవదేవుడు మహాభాగుడు అజుడు విభుడు అగువాసుదేవుని పాపసంకల్పుడవగు నీవుతప్ప ఇతరుడెవ్వడు ఇట్లు అనును? నీవు పేర్కొన్న ఈ సమస్త దైత్యదానవులును బ్రహ్మాది దేవతలును స్థావర పదార్థము లన్నియు ఆనంతరూపములగు సకల తత్త్వములును నీవును నేనును పర్వత వృక్ష నదీనద సముద్రద్వీప సహిత సకల జగమును కేశవునకు సరిపోలవు; అతివంద్యులకును వంద్యుడును వ్యాపియును పరమాత్ముడునునగు ఎవని ఏకాంశములో సర్వజగము రూపొందినదో అట్టి హరిని అవివేకిని వినాశాభిముఖుడవు అగు నీవుతప్ప మరెవ్వరిట్లనగలరు? నీవు దుర్భుద్ధివి; సంస్కారరహిత చిత్తుడవు; పెద్దల అదుపుమీరి నడుచువాడవు; దురాత్ముడు కృష్ణనిందకుడునగు నిన్ను కనిన అధముడగు నీతండ్రి నా ఇంట జన్మించినందున నేను శోచనీయుడనైతిని; కృష్ణునియందు నిలిపిన భక్తి సంసారమందతటను సర్వపాపనాశనియై యున్నది; నీవు నన్నైన గమనించవలదా? మహాత్ముడగు కృష్ణునికంటెమించి నాకు నా దేహము కూడ ప్రియతరముకాదని లోకము ఎరుగును; నాకు ప్రాణములకంటెను హరిప్రియక (త)రుడని నీవెరుగకున్నావే! నీవు నన్ను కూడ గౌరవింపక అతని నిందించుచున్నావే! బలీ! నీగురుడగు విరోచనునకును గురుడనగు నాకును శ్రీహరి గురుడు; ఇట్లు గురు గురు గురుడగు కృష్ణుని నిందించుచున్నందున అచిర కాలముననే నీవు ఐశ్వర్యభ్రంశమందుదువు; బలీ! జనార్ధనుడుఅగు జగన్నాధుడు నాకు దేవుడు గదా! నీకు నేను అనాదరణీయుడను ఉపేక్షణీయుడను ఐనను నాగురుడగు అతడు నీయందు ప్రీతికలవాడు కావలయును కదా! నీవింత మాత్రముకూడ ఆలోచింపక జగద్గురుని నిందచేసితివి కావున నిన్ను శపించుచున్నాను; నీవు నాతో అచ్యుతుని నిందించి పలుకుట నా శిరశ్ఛేదముకంటె బాధాకరముగావున నీవు రాజ్యభ్రష్టుడవు అయి పతనమందుము; ఈ సంసార సముద్రమునందు రక్షకుడు హరితప్ప మరిలేడు కావున అట్టి హరిని నిందించిన నీవు త్వరలోనే రాజ్యభ్రష్టుడవగుట చూతును.

శౌనకః : ఇతి దైత్యపతి శ్శ్రూత్వా గురో ర్వచన మప్రియమ్‌. 51

ప్రసాదాయామాస గురుం ప్రణిపత్య పునః పునః |

బలిః ప్రసీద తాత మా కోపం కురు మోహహతేయ మయి. 52

బలావలేమత్తేన మయైతద్వాక్య మీరితమ్‌ | మోహోపహతవిజ్ఞానః పాపో7హం దితిజోత్తమ. 53

యచ్ఛప్తో7స్మి దురాచార స్తత్సాధు భవతా కృతమ్‌ |

రాజ్యభ్రంశం వసుభ్రంశం ప్రాపై#్యవ న తథా7ప్యహమ్‌.54

విషణ్ణో7స్మి యథా తాతా తవైవావినయే కృతే | త్రైలోక్యరాజ్య మైశ్వర్య మన్యద్వా నాతిదుర్లభమ్‌. 55

సంసారే దుర్లభాస్తేతు గురువో యే భవద్విధాః | తత్ప్రసీద న మే కోపం కర్తుమర్హసి దైత్యప. 56

త్వత్కోపదృష్ట్యా తాతా7హం పరితప్యే న శాపతః |

ప్రహ్లాదః: వత్స కోపే న మోహో మే జనిత స్తేన తే మయా. 57

శాపో దత్తో వివేకశ్చ మోహేనాపహృతో మమ | యది మోహేన మే జ్ఞానం న క్షిప్తం స్మా న్మహాసుర. 58

తత్కథం సర్వగం జాన& హరిం కిఞ్చి చ్ఛపామ్యహమ్‌ |

యో7యం శాపో మయా దత్తో భవతో7సురపుఙ్గవ. 59

భావ్య మేతేన నూనం తే తస్మా న్మా త్వం విషీద వై | అద్యప్రభృతి దేవేశే భగవ త్యచ్యుతే హరౌ. 60

భ##వేథా భక్తిమానీశే స తే త్రాతా భవిష్యతి | శాపం ప్రాప్యాథ మాం వీర సంస్మరేథా స్స్మృత స్త్వయా.

తథా తథా యతిష్యే7హం శ్రేయసా యోజ్యసే యథా | ఏవముక్త్వా స దైత్యేన్ద్రం విరరామ మహాద్యుతిః.

దైత్యపతియగు బలి అప్రీతికరమగు తన గురు (పితామహు)ని వచనమును విని అతనిని మరల మరల నమస్కరించుచు అతనిని ప్రసన్ను నొనర్చికొనుటకై బ్రతిమాలసాగెను; తండ్రీ! ప్రసన్నుడవుకమ్ము; అజ్ఞానహతుడనగు నాపై కోపింపకుము; బలగర్వ మత్తుడనయి నేనీమాట అంటిని; దైత్యోత్తమా! నేను మోహముచే నా విజ్ఞానమును కోల్పోయితిని; పాపుడను; దురాచారుడనగు నన్ను శపించ నీవు మంచిపనియే చేసితివి; తండ్రీ! నీశాపమున నాకు రాజ్యధనములు పోవునని నను నీవిషయమున అవినయము చూపితినన్నందులకు కలిగినంత దుఃఖము కలుగుటలేదు; త్రైలోక్య రాజ్యము కాని ఐశ్వర్యము కాని ఇట్టి మరేదికాని లోకమున దుర్లభముకాదు; ఈ సంసారమున నీవంటి గురువులే దుర్లభులు; కావున దైత్యపతీ! అనుగ్రహించుము; కోపింపకుము; తండ్రీ! నేను నీకోప దృష్టికి పరితాపపడుచున్నాను కాని శాపమునకు కాదు; అన ప్రహ్లాదుడిట్లనెను; నాయనా! కోపముచే నాకు మోహము జనించినది; దానిచే వివేకమపహరింపబడినందున శరపించితిని; అంతే కానిచో సర్వగుడగు హరి నెరిగిన నేనెట్లు శపించియుందును? అసురపుంగవా! నేను నీకిచ్చిన శాపమవశ్యము జరుగ వలసినయేయున్నది; కావున నీవు దుఃఖింపకుము; ఇది మొదలుకొని దేవేశుడు భగవానుడు అచ్యుతుడు ఈశుడునగు హరి యందు భక్తి కలిగియుండును; అతడే నిన్ను రక్షించును; శాపఫలము కలిగిన తరువాతను కూడ నాయనా! నన్ను స్మరించుచుండుము; దానిచే నేనును నీకు శ్రేయము కలిగించయత్నింతును; అని పలికి మహాద్యుతియగు బలి విరమించెను.

అజాయత స గోవిన్దో భగవా న్వామనాకృతిః | అవతీర్ణే జగన్నాథే తస్మి న్త్సర్వామరేశ్వరే. 63

దేవాశ్చ మముచు ర్దుఃఖం దేవ మాతా7దితి స్తథా | వవు ర్వాతా స్సుఖస్పర్శా విరజస్క మభూ న్నభః. 64

ధర్మే చ సర్వభూతానాం తథా మతి రజాయత | నోద్వేగశ్చాప్యభూత్తత్ర మనుజేన్ద్రా సురేష్వపి. 65

తదాది సర్వభూతానాం భూమ్యమ్బరదివౌకసామ్‌ | తం జాతమాత్రం భగవా న్బ్రహ్మా లోకపితామహః. 66

జాతకర్మాదికం కృత్వా కృష్ణం దృష్ట్వా చ పార్థివ | తుష్టావ దేవదేవేశ మృషీణాం చైవ శృణ్వతామ్‌. 67

బ్రహ్మకృత వామనమూర్తి స్తుతిః.

బ్రహ్మా: జయాద్యేశ జయాజేయ జయ సర్వాత్మకాత్మక |

జయ జన్మజరాపోత జయానన్త జయాచ్యుత. 68

జయాజిత జయామేయ జయావ్యక్తస్థితే జయ | పరమార్థార్థసర్వజ్ఞ జ్ఞానజ్ఞేయాత్మ నిస్సృత. 69

జయాశేషజగత్సాక్షి న్జత్కర్త ర్జగద్గురో | జగతో7స్యాన్తకృద్దేవ స్థితిం పాలయితుం జయ. 70

జయాశేష జయాశేష జయాఖిలహృది స్థిత | జయాదిమధ్యాన్త జయ సర్వజ్ఞాననిధే జయ. 71

ముముక్షుభినిర్దేశ్య స్వయం హృష్టజనేశ్వర | యోగినాం ముక్తిఫలద దమాదిగుణభూషణ. 72

జయాతిసూక్ష్మ దుజ్ఞేఞయ జయ స్థూలజగన్మయ | జయస్థూలాతిసూక్ష్మ త్వం జయాతీన్ద్రియ సేన్ద్రియ. 73

జయ స్వమాయాయోగస్థ శేషభోగశయాక్షర | జయైకదంష్ట్రా ప్రాన్తాగ్రసముద్దృత వసున్ధర. 74

నృకేసర న్జయారాతి వక్షస్థ్సల విదారణ | సామ్ప్రతం జయ విశ్వాత్మ న్జయ వామన కేశవ. 75

నిజమాయాపటచ్ఛన్న జగన్మూర్తే జనార్ధన | జయాజిత జయానేక స్వరూపైకవిధ ప్రభో. 76

వర్ధస్వ వర్ధితాశేషవికారప్రకృతే హరే | త్వయ్యేషా జగతా మీశే సంస్థితా ధర్మపద్ధతిః. 77

న త్వామహం న చేశానో నేన్ద్రాద్యా స్త్రిదశా హరే | న జ్ఞాతు మీశా మునయ స్సనకాద్యా న యోగినః. 78

త్వన్మాయాపటసంవీతే జగత్యత్ర జగత్పతే | కస్త్వాం వేత్స్యతి సర్వేశ త్వత్ప్రసాదం వినా నరః. 79

త్వమేవారాధితో యేన ప్రసాదసుముఖః ప్రభో | స ఏకః కేవలో దేవ వేత్తి త్వాం నేతరే జనాః. 80

నన్దీశ్వరేశ్వరేశాన ప్రభో వర్ధస్వ వామన | ప్రభవాయాస్య విశ్వస్య విశ్వాత్మ న్పృథులోచన. 81

శ్రీ వామన మూర్త్యవతార ఘట్టము.

అంతట భగవానుడగు గోవిందుడు వామనాకృతియై జనించెను; సర్వామరేశ్వరుడగు ఆ జగన్నాథుడవతరించ గనే దేవతలును తన్మాతయగు అదితియు దుఃఖముక్తులయిరి; సుఖస్పర్శ వాయువులు వీచెను; గగనము నిర్మలయ్యెను; సర్వభూతములకు ధర్మమందాసక్తి కలిగెను; అసురులకును భూమ్యంతరిక్ష ద్యులోకవాసులకును తదాదిగా ఉద్వేగము తగ్గెను; అతడు జనించినంతనే లోక పితామహుడగు బ్రహ్మ అతనికి జాతకర్మాదికము జరిపి అతనిని దర్శించి ఋషులు వినుచుండ ఆ దేవదేవేశునిట్లు స్తుతించెను: జయజయ ఆద్యా! ఈశా! అజేయా! సర్వాత్మకాత్మకా! జన్మజరారహితా! అనంతా! అచ్యుతా! అజితా! అమేయా! అవ్యక్తస్థితి! పరమార్థవస్తురూపా! సర్వజ్ఞా! జ్ఞాతృజ్ఞానజ్ఞేయరూపా! స్వయంభూరుపా! అశేష జగత్సాక్షిన్‌! జగత్కార్తా! జగద్దురూ! జగత్థ్సితిలయకరా! జగత్పాలకా! శేషా! శేషా! అశేషా! అఖిల హృదయావాసా! ఆదిమధ్యాంతరూపా! సర్వజ్ఞానవిధీ! ముముక్షువులును ఇట్టివాడవని నిర్దేశింపనలవికాని దేవా! ఆత్మతృప్తా ! జనేశ్వరా! యోగిముక్తి ఫల ప్రదా! దమాది గుణవిభూషణా !

అతిసూక్ష్మ! దుజ్ఞేయా! స్థూలజగన్మాయా! అతీంద్రియా! సేంద్రియా! మాయాయోగస్థితా! శేషభోగశయనా! అక్షరా! ఒకకోరకొనతోనే వసుంధరను పైకెత్తినవాడా! నృసింహా; శత్రువక్షఃస్థల విదారణా! విశ్వాత్మన్‌! వామనా! కేశవా! స్వమాయా వస్త్రాచ్ఛాదితజన్మూర్తీ! జనార్ధనా! అనేక రూపా! ఏకరూపా! ప్రభూ! వర్థిల్లుము ; వర్ధితాశేష వికారయుత ప్రకృతీ! హరీ! జగదీశుడవగు నీయందే ధర్మ మార్గము నిలిచియున్నది నేను కాని రుద్రుడు కాని ఇంద్రాది దేవతలు కాని మునులును సనకాది యోగులునుకాని నిన్నెరుగజాలరు. జగత్పతీ! నీమాయయను వస్త్రముతో కప్పుపడిన ఈజగమందు సర్వేశా! నీ యనుగ్రహమందక ఎవడు నిన్నెరుగును నిన్నారాధించి ప్రసాద సుముఖునిగా చేసి కొనినవారు మాత్రమే కాక ఇతరులు నిన్నెరుగజాలరు;

నందీశ్వరేశ్వరా! ఈశానా! ప్రభూ! వామనా: విశ్వాత్మన్‌! విశాల లోచనా! ఈ జగదభ్యుదయమునకై వర్ధిల్లుము.

శౌనకః ఏవం స్తుతో హృషీకేశ స్స తదా వామనాకృతిః |

పహస్య భావగమ్భీర మువాచాబ్జసముద్భవమ్‌. 82

స్తుతో7హం భవతా పూర్వ మిన్ద్రా ద్యైః కశ్యపేన చ |

మయా చ వః ప్రతిజ్ఞాత మిన్ద్రస్య భవనత్రయమ్‌. 83

భూయశ్చాహం స్తుతో7దిత్యాతస్యాశ్చాపి ప్రతిశ్రుతమ్‌ |

యథా శక్రాయ దాస్యామి త్రైలోక్యం హతకణ్టకమ్‌. 84

సో7హం తథా కరిష్యామి మహేన్ద్రో జగతః పతిః | భవిష్యతి సహస్రాక్ష స్సత్య మేత ద్బ్రవీమి వః.

తతః కృష్ణాజినం బ్రహ్మా హృషీకేశాయ దత్తవా& | యజ్ఞోపవీతం భగవా న్దదౌ తసై#్మ బృహస్మతిః. 86

ఆషాఢ మదదా ద్దణ్డం మరీచి ర్బ్రహ్మమ స్సుతః | కమణ్డలుం వసిష్ఠశ్చ కౌశం వేద మథాఙ్గిరాః. 87

అక్షసూత్రం చ పులహాః పులస్త్య స్సితవాససీ | ఉపతస్థుశ్చ తం వేదాః ప్రణవోచ్ఛారభూషణాః. 88

శ్రీవామనమూర్తేర్బలియజ్ఞవాటగమనమ్‌.

శాస్త్రాణ్యనే కాని తథా సాజ్ఖ్యయోగోక్తయశ్చ యాః | సవామనో జటీ దణ్ణీ ఛత్రీ భృతకమణ్దలుః. 89

సర్వదేవమయో భూత్వా బలే రధ్వర మభ్యగాతే | యత్ర యత్ర పదం భూయో భూభాగే వామనో దదౌ.

దదాతి భూమి ర్వివరం తత్ర తత్రాతిపీడితా | స వామనో జడగతి ర్మృదు గచ్ఛన్త్సపర్వతామ్‌. 91

సాబ్దిద్వీపవతీం సర్వాం చాలయామాస మేదినీమ్‌. 91U

ఇతి శ్రీ మత్స్య మహాపురాణ శౌనకార్జునసంవాదే శ్రీ వామనచరిత్రే వామస్య బలి

యజ్ఞనాటగమనం నామ చతుశ్చత్వాంరింశత్తమో7ధ్యాయః.

ఇట్లు స్తుతింపబడి వామనాకృతియగు హృషీకేశుడు నవ్వి పద్మభవునితో భావ గంభీరముగ ఇట్లనెను: పూర్వము నేను నీచే ఇంద్రాదులచే కశ్యపునిచే స్తుతింపబడి ఇంద్రునకు భవనత్రయ రాజ్యమిత్తునంటిని; మరల అదితి చేతను స్తుతింపబడి ఇంద్రునకు నిష్కంటకమగు త్రైలోక్య రాజ్యము నిత్తునంటిని; నేనట్లే చేయుదును; సహస్రాక్షుడగు ఇంద్రుడు మహేంద్రుడై జగత్పతియగు; ఇది సత్యము; అని నంతట హృషీకేశునకు బ్రహ్మ కృష్ణాజినమును బృహస్పతి యజ్ఞోపవీతమును బ్రహ్మసుతుడగు మరీచి ఆషాఢ దండమును వసిష్ఠుడు కమండలువును అంగిరుడు కుశపవిత్రమును పులహుడక్షసూత్రమును పులస్త్యుడు తెల్లని వస్త్రములను ఇచ్చిరి; ప్రణవోచ్చరణాలంకృతములగు వేదములును అనేక శాస్త్రములును సాంఖ్యము యోగము అతనిని స్వయముగ వచ్చి ఆశ్రయించి సేవించెను; ఆ వామనుడును జటా దండ చ్ఛత్త్ర కమండలు ధారియై సర్వదేవ మయుడై బలి యజ్ఞమునకు పోయెను; అతడడుగిడిన ప్రతి భూమ్యంశమును అతి పీడితమయి వివరము నిచ్చుచుండెను; వామనుడును మంద మృదుగతియై పోవుచున్నను సముద్ర ద్వీపాదియుతయగు మేదిని చలించుచుండెను.

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున వామన చరిత్రమున వామన మూర్త్యవతారమను

రెండు వందల నలుబది నాల్గవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-2    Chapters