Sri Matsya Mahapuranam-2    Chapters   

ద్విచత్వారింశదుత్తరద్విశతతమో7ధ్యాయః

రాజధర్మాః- శుభాభశకునవిచారః.

మనుః గమనం ప్రతి రాజ్ఞస్తు సన్ముఖాదర్శనేన కిమ్‌| ప్రశస్తాం శ్చైవ సమ్భాష్యా స్త్సర్వానేతాంశ్చ కీర్తయ. 1

శ్రీ మత్స్యః ఔషధాని త్వయుక్తాని ధాన్యం కృష్ణంతు యద్భవేత్‌| కార్పాసశ్చ తృమం రాజ ఞ్ఛష్కం గోమయమేవచ. 2

ఇన్ధనం చ తథాఙ్గారం గుడం తైలం తథా7శుభమ్‌| అభ్యక్తో మలినో ముణ్డ స్తథా నగ్నశ్చ మానవః. 3

ముక్తకేశో రుజార్తశ్చ కాషాయామ్బరదారి(ర) ణః| ఉన్మత్తక స్తథా7సత్త్వో దీనో వా7థ నపుంసకః. 4

అయఃపఙ్క స్తథా చర్మ సేశబన్ధనమేవచ| తథైవోద్ధృతసారాణి పిణ్యాకాదీని యానిచ. 5

చణ్డాలః శ్వపచశ్చైవ రాజబన్ధనపాలకాః| వధకాః పాపకర్మాణో గర్భిణ్యస్త్స్రియ ఏవచ. 6

తుషభస్మ కపాలాస్థిభిన్నభాణ్డాని యాని చ | రక్తాని చైవ భాణ్డాని ఘృతం సారిఙ్గక మేవచ. 7

ఏవమాదీని చాన్యాని న శాస్తా న్యభిదర్షనే| అశస్తో వాద్యచశబ్ధశ్చ భిన్నబైరవజర్జరః. 8

ఏహీతి పురత శ్శబ్ద శ్శస్యతే తు పృష్ఠతః| గచ్ఛేతి చైవ పశ్చాత్తు పురస్తాత్తు విగర్హితః. 9

క్వ యాసి తిష్ఠ మా గచ్ఛ కిం తే తత్ర గతస్య తు| అన్యే శబ్దాశ్చ యే 7రిష్టా స్తే విపత్తికరా అపి. 10

ధ్వజాదిషు తథా స్థానం క్రవ్యాదానాం విగర్హిమ్‌| స్ఖలనం వాహానానాం చ వస్త్ర భహ్గ స్తథైవచ. 11

నిర్గచ్ఛతస్తు ద్వారాదౌ శిరస స్చాభిఘాతనమ్‌| ఛత్త్రధ్వజానాం వస్త్రాణాం పతనం చ తథా 7శుభమ్‌. 12

దృష్టే నిమిత్తే ప్రథమ మమఙ్గళ్య వినాశనమ్‌| కేశవం పూజయే ద్విద్వాం స్తవేన మధుసూదనమ్‌. 13

ద్వితీయే తు తతో దృష్టే ప్రతీపే ప్రవిశేద్గృహమే| అథేష్టాని ప్రవక్ష్యామి మఙ్గళ్యాని తథా 7నఘ.14

రెండు వందల నలువది రెండవ అధ్యాయము.

శుభాశుభ శకున విచారము.

రాజయాత్రాగమన సమయమున ఏవి ఎదురువచ్చినతో శుభమగునో ప్రశస్తములగునవి ఏవో చెప్పుకొనదగనివి ఏవో చెప్పుకొనదగినవి ఏవో ఇవి అన్నియు పేర్కొనుము. అనిని మనువునకు మత్స్యుడిట్లు చెప్పెను. అయుక్తములగు ఔషధములు నల్లని దాన్యము%ు దూది- ఎండు గడ్డి -ఎండు పేడ-కట్టెలు బొగ్గులు నూనె బెల్లము నూనె అంటుకొనినది మలినమునగు బోడితల- నగ్నుడు ముక్తకేశుడు రోగార్తుడు కాషాయ వస్త్రధారి ఉన్మత్తుడు బలహీనుడు దీనుడు నపుంసకుడు ఇనుము బురద చర్మముల మోపు కేశముల కట్ట తెలకపిండి మొదలగుసారము తీసివేసిన పదార్థమలు చండాలురు శ్వపచులు కారాగాల రక్షకులు కసాయివాండ్రు పాపకారులు గర్భిణులు ధాన్యపు పొట్టు భస్మము కపాలము ఎముకలు పగిలిన పాత్రలు కుండలు ఎర్రని పాత్రలు కుండలు మృతమయిన కొమ్ములు గల ప్రాణులు అప్రశస్త వాద్యధ్వములు చేవులు బ్రద్ధలు చేయు భయంకర ధ్వనులు అశుభకశునములు; 'రమ్ము' అనుమాట ముందునుండియు 'పొమ్ము' అనుమాట వెనుక నుండియు వినబడుట మంచిది ;ఎక్కడకు పోవుచున్నావు? నిలువుము; పోవలదు; అక్కడకు పోవుటచే నీకేమి ప్రయోజనము? ఈ మొదలగు శబ్దములు విపత్తికరములు ;ధ్వజాదులపై మాంసాహార పక్షులు వాలుట వాహానములు తడబడుట వస్త్రములు జారుట వెలికిపోవునపుడు ద్వారాదులు తలకు డీకోనుట కాళ్ళకు ఎదురు దెబ్బలు తగులుట ఛత్త్రధ్వజ వస్త్రాదుల పతనము- ఇట్టివి అశుభములు ;ఇట్టివి మొదటిసారి జరిగినపుడు కేశవునర్చించుట స్తుతించుటయు చేయవలెను. రెండవ మారు కూడ జరిగనోచ ప్రయాణము మాని ఇంటికో ప్రవేశించవలెను ;ఇపుడిక శుభశకునములు తెలిపెదను వినుము.

శ్వేతా స్సుమనస శ్శ్రేష్ఠాః పూర్ణాః కుమ్భాస్తతైవచ| జలజాః పక్షిణశ్చైవ మాంసం మత్స్యాశ్చ పార్థివ. 15

గావ స్తురఙ్గమా నాగా బుద్ధ ఏకః పసు స్త్వజః| త్రిదశా స్సుహృదో విప్రా జ్వలితశ్చ హుతాశనః. 16

గణికా చ మహాభాగ దూర్వాచార్ద్రం చ గోమయమ్‌| రుక్మం రూప్యం తథా తామ్రం సర్వరత్నాని చానఘ. 17

ఔషధాని చ ధర్మజ్ఞ యవా స్సిద్ధార్థకా స్తథా| నృవాహ్యమా(యా) నం యానంచ భద్రపీఠం తథైవ చ. 18

ఖడ్గం ఛత్రం పతాకా చ మృదశ్చాయుధ మేవచ| రాజలిఙ్గాని సర్వాణి శవా రుదితావర్జితాః. 19

ఘృతం దధి పయశ్చైవ ఫలాని వివిధాని చ| స్వస్తికం వర్ధమానం చ నన్ధ్యావర్తం సకౌస్తుభమ్‌. 20

వాదిత్రాణాం సుఖశ్శబ్ధో గమ్భీర స్సుమనోహరః| గాన్ధారషడ్జఃషభా యే చ శస్తాః స్వరా స్తథా. 21

వాయు స్సఖర్కరో రూక్ష స్సర్వత్ర సముపస్థితః| ప్రతిలోమ స్తతా నీచో విజ్ఞేయా భయకృద్ధ్విజః. 22

అనుకూలో మృదుస్స్నిగ్ధస్సుఎఖస్ఫర్శ స్సుఖావహః| రూక్షారూక్షస్వరా భద్రాః క్రవ్యాదాః పరిగచ్ఛతామ్‌. 23

మేఘశ్శస్తా ఘనాస్స్నిగ్ధా గజబృంహితసన్నిభాః| అనులోమా స్తటిచ్ఛన్నా శ్శక్రచాపం తథైవచ. 24

అప్రశ##స్తే తథా జ్ఞేయే పరివేష ప్రవర్షణ| అనులోమా గ్రహాశ్శస్తా వాక్పతిస్తు విశేషతః. 25

అస్తిక్యం శ్రద్ధాధానత్వం తథా పూజ్యాభిపూజనమ్‌| శస్తాన్యే తాని సర్వాణి యచ్ఛ స్యా స్మనసి ప్రియమ్‌. 26

మనసస్తుష్టిరేవాత్ర ప్రథమం జయలక్షణమ్‌| ఏతక స్సర్వలిఙ్గాని మనసస్తుష్టి రేకతః. 27

యాత్రోత్సుకత్వం మనసః ప్రహర్షం శుభస్య లాభో విజయప్రవాదః| మఙ్గళ్యస్వస్తిశ్రవణం చ రాజ్ఞో జ్ఞేయాని నిత్యం విజయావహాని. 28

ఇతి శ్రీ మత్స్య మహాపురాణ మత్స్య మును సంవాదే రాజధర్మే యాత్రానిమిత్త శుబాశుభ శకున విచారో నామ ద్విచత్వారింశదుత్తరద్విశతతమో7ధ్యాయః.

తెల్లని పూవులు పూర్ణకుంభములు జలపక్షులు మాంసము మత్స్యములు గోవులు అశ్వములు గజములు ఒంటి బౌద్ధసంన్యాసి సాధు ప్రాణి మేక దేవతలు మిత్రులు విప్రులు మండుచున్న అగ్ని వేశ్య దూర్వ పచ్చిగోమయము వెండి బంగారము రాగి సర్వరత్నములు ప్రశస్తౌషధములు యవలు తెల్ల ఆవలు మనుష్యులు మోయు యానము(పాలకీ -మేనా) శుభపీఠము- ఖడ్గచ్ఛత్త్ర పతాకలు మృత్తిక ఆయుధములు- ఇంకను సర్వరాజలాంఛనములు- ఏడుపు (లవారు వెంట) లేని శవములు నేయి పెరుగు పాలు వివిధ ఫలములు స్వస్తిక- వర్ధమాన నంద్యావర్తృ కౌస్తుభ గృహభేదములు- సుఖకరము- గంబీరము మనోహరమునగు వాద ధ్వని గాంధార షడ్జఋషబాధి ప్రశస్త(సంగీత) స్వరములు- ఇట్టివి శుభకరములు.

ఇసుకతో కూడి రూక్షమయి అంతటను చెలరేగిన పెనుగాలి ఎదురుగాలి నీచమగు వాయువు భయకారణములు ;అనుకూల వాయువు (వాలునకు వీచుగాలి) మృదువై నునుపై సుఖ స్పర్శమయి హాయి గొలుపుగాలి రూక్షములు రూక్షస్పర్శములు ఐనను భద్ర (శుభకర) ములు అగు మాంసాహార ప్రాణులు కనబడుట దట్టములయి నున్ననయి గజ బృంహితమువలె (పెనువానలు) ను మంచివికావు ;గ్రహములును- అందును విసేషించి బృహస్పతి- రాజు తాను పోవు దిక్కునకు ఎదురాగా కాక వెనుకవైపున నుండుట మంచిది ;ఆస్తిక్య శ్రద్ధలు పూజ్యులును పూజించుట- ఇట్టివే ;మనస్సునకు హాయి గొలుపున వన్నియు ప్రయాణ కాలమున శుభావహాములు ;మనస్తుష్టియే ప్రయాణకాలమున ప్రథమ జయ లక్షణము ;సర్వశకునము లును ఒక ఎత్తు - మనస్సంతోషము ఒక ఎత్తు; యాత్ర పోవలయునను ఉత్సుకత మనః ప్రహర్షము శుభ శశునలాభము విజయకరవచనములు - వినబడుమంగళకర స్వస్తివాచనికి మంత్రాదికము వినుట- ఇవి రాజులకెల్లపుడు విజయావహాములు.

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున రాజధర్మమున యాత్రా నిమిత్త శుబాశుభ శకున విచారమను రెండు వందల నలువది రెండవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-2    Chapters