Sri Matsya Mahapuranam-2    Chapters   

ఏకోనచత్వారింశదుత్తర ద్విశతతమో7ధ్యాయః

రాజధర్మాః- రాజ్ఞో యాత్రాకాలవిధిః.

మనుః ఇదానీం సర్వధర్మజ్ఞ సర్వశాస్త్రవిశారద| యాత్రాకాలవిదానం మే కథయస్వ మహీక్షియేమ్‌. 1

శ్రీమత్స్యః: యదా మన్యేత నృపతి రాక్రన్దేన బలీయసా| పార్షిణ గ్రాహాభిభూతో7రి స్తదా యాత్రాం ప్రయోజయేత్‌. 2

దృష్టా యోధా భృతా భృత్యాః ప్రబూతం చ బలం మమ| మూలరక్షాసమర్థో7 స్మి తదా యాత్రాం ప్రయోజయేత్‌. 3

అశుద్ధపార్షిణర్నృపతి ర్నతు యాత్రాం ప్రయోజయేత్‌| పార్షిణగ్రాహాధికం సైన్యం మూతే నిక్షిప్య వా ప్రజేత్‌. 4

చైత్య్రాం వా మార్దశీర్ష్యాం వా యాత్రాం యాయా న్నరాధిపః| చైత్య్రాం పశ్చేచ్చ నైదాఘం హన్తి పుష్టించ శారదీమ్‌. 5

ఏతదేవ నిపర్యస్తం మార్గశీర్ష్యాం నరాధిప| శత్రోర్వా ప్యపనే యాయా త్కాల ఏవ సుదుర్వభః. 6

దివ్యాన్తరిక్షక్షితిజై రుత్పాతైః పీడితం పరమ్‌| షడక్ష పీడాసన్తప్తం పీడితం చ తథా గ్రహైః.7

ప్రజ్వలన్తీ తథైవోల్కా దిశం యాం చ ప్రపద్యతే| భూకమ్పోల్కాది యాం యాతి యాచ కేతుం ప్రసూయతే. 8

నిర్ఘాతశ్చ పపతే ద్యత్ర యాయా ద్వసుదాధిపః| స్వబలవ్యసనోపపేతం తథా దుర్భిక్షపీడితమ్‌. 9

సమ్భూతాన్తరకోపం చ క్ష్ప్రం యాయా దరిం నృపః| యూకామక్షిక బాహుళ్యం బహు పఙ్కం తథా 7విలమ్‌. 10

నాస్తికం భిన్నమార్యాందం తథా 7మఙ్గవాదినమ్‌| అపేత ప్రకృతిం చైవ నిస్సారం చ తథా జయేత్‌. 11

విద్విష్టనాయకం సైన్యం తథా భిన్నం పరస్పరమ్‌| వ్యసనాసక్తనృపతిం బలం రాజా7 భియోజయేత్‌. 12

సైనికానాం న శాస్త్రాణి స్ఫురన్త్యఙ్గాని యత్ర చ| దుస్స్వప్నాన్యపి పస్యన్తి బలం తత్రాభియోజయేత్‌. 13

ఉత్సాహబలసమ్పన్న శ్చతురఙ్గబల స్తథా| హృష్టపుష్టబలో రాజా పరా నభిముఖో వ్రజేత్‌. 14

రెండు వందల ముప్పది తొమ్మిదవ అధ్యాయము.

రాజ యాత్రా విధానము.

సర్వధర్మజ్ఞా! స్రర్వశాస్త్ర విశారదా! నా కిపుడు మహీపతులు యాత్రాకాలమందజాచరించవలసిన విధానమును తెలుపుమని యడిగిన మనువుతో మత్స్యుడిట్లనెను: నా శత్రువు ఇపుడు నా సహాయముల చేతిలోనే కొంత దెబ్బతిని యున్నాడు; నా యోధులు ధృష్టులు (చాల నేర్పరులు); నా భృత్యులను చక్కగా పోషించి నా అధీనమునందుంచు కొన్నాను ;నా బలమును (సేనయును) ప్రభూతముగా చాల అధికముగా నున్నది; నా దుర్గాది మూలస్థానమును కూడ నేనిపుడు రక్షించుకొనగలడు ;ఇపుడు నేను బలీయమగు యుద్ధము జరిపినచో శత్రువు తప్పక ఓడిపోవును ;అని తనకు తోచినపుడు రాజు యుద్ధయాత్ర చేయవలెను; పార్షిశుద్ధి (తన ఇరుగు పొరుగు శత్రువులను అదుపులోనుంచుకొనుట) జరుగనిదే రాజు యుద్ధయాత్ర ఆరంభించరాదు ;పార్షిగ్రహుల (పొరుగు శత్రువుల)సేనకంటే ద్విగుణాధికసేనను తన మూలస్థానమందు (దుర్గమందు) ఉంచియైన యాత్రకు బయలుదేరవలయును; యాత్రకు చైత్రపూర్ణిమకాని మార్గశిర పూర్ణిమకాని తగినది; చైత్ర పూర్ణిమయందు బయులదేలినచో యుద్ధయాత్రా కాలమున రవితాపమును ఎదురక్కొనవలసి యుండును ; అదియుగాక దీనిచే శరదృతువునందు లభించు సస్యాది పుష్టి ఈ కాలమున లభ్యముకాదు ;మార్గశీర్ష పూర్ణిమయందైనచో ఇది వ్యతిరిక్త ముగనుండును ;(తాపమునెదుర్కొన నక్కరలేదు ;శరత్తులో పండిన మొదలగు వాని ఉపయోగము లభించును ;శత్రువు వ్యసన పీడితుడైయుండగా యాత్రచేయుట మంచిది; అట్టి కాలము చిక్కుట దుర్లభము ;శత్రువు

దివ్యాంతరిక్ష భౌమోత్పాతములతోను ఆరు ఈతిబాధలతోను గ్రహములతోను పీడితుడైయుండగాను శత్రుని దెనకు ప్రజ్వలించు ఉల్క పపోయినచజో భూకంపములు ఉల్కాపాతములు ఆ రాజ్యమున జరుగుచో ధూమకేతువు కనబడుచో పిడుగులు పడుచో అట్టి శత్రురాజ్యము మీదకు రాజు యుద్ధయాత్రకు పోవలెను ;శత్రు రాజు స్వబలము వ్యసన పీడితములు రాజ్యము దుర్భిక్ష పీడితమయి ఆంతరకోపము (రాజ్యము లోపలి ఆప్తులు ద్వేషించుట- కలతలు) అధికమయి నల్లులు పేలు దేమలు ఈగలు అధికమయి రాజ్యము బురదతో మలినమయి రాజు నాస్తికుడయి పెద్దలును శాస్త్రములును చెప్పు మర్యాదలు మీరి అధికారులు ప్రజలు తనయందునురక్తులు కాక ధనాదిసారహీనుడై అతని సేనానాయకులసను ,సైనికులు దేవిషించుచు వారిలో వారు కలహించుకొనుచు వ్యసనాసక్తుడైయున్న రాజు మీదకు దండయాత్ర చేయవలెను ;సైనికులకు శస్త్రములు లేక వారి అవయవములు శుభసూచకముగా స్పందించక వారు చెడుకలలు కనుచున్నతరి యుద్ధయాత్రమంచిది; ఇట్టి తరి రాజు చతురంగ బలసంపన్నుడై హృష్టపుష్ట సైన్యముతో శత్రవునెదిరించ పోవలెను.

శారీరస్ఫురణ ధన్యే తథా దుస్స్వప్ననాశ##నే| నిమిత్తే శకునే ధన్యే నృప శ్శత్రుపురం ప్రజేత్‌. 15

ఋక్షేషు షట్సు శుద్ధేషు గ్రహే ష్వనుగుణషు చ| ప్రశ్నకాలే శుభే జాతే పరా న్యాయా న్నరాధిపః. 16

ఏవం సదైవ సమ్పన్న స్తథా పౌరుషసంయుతః| దేశకాలోపన్నాంతు యాత్రాం యాయా న్నరాదిపః. 17

స్థలే నక్రస్తు నాగస్య తస్యాపి సజలే వశే| ఉలూకస్య నిశి ధ్వాంక్ష స్స చ తస్య దివా వశే. 18

ఏవం దేశం చ కాలం చ జ్ఞాత్వా యాత్రాం ప్రయోజయేత్‌| పదాతినాగబహుళాం సేనాం ప్రావృషి యోజయేత్‌. 19

హేమన్తే శిశిరే చైవ రథవాజిసమాకులామ్‌| ఖరోష్ట్రబహుళాం సేనాం తథా గ్రీష్మే నరాధిపః.20

చతురఙ్గబలోపేతాం వసన్తే వా శరద్యథా| సేనా పదాతిబహుళా యస్య త్పృథివీపతేః . 21

అభియోజ్యో భ##వేత్తేన శత్రు ర్విషమ మాశ్రితః| గమ్య వృక్షావృతే దేశే స్థితం శత్రుం తథైవచ. 22

కిఞ్చత్పఙ్కే తథా యాయా ద్బహునాగో నరాదిపః| చతురఙ్గబలోపేతో రథాశ్వబహుళో నృపః. 23

విషమాశ్రిత భూభాగ శ్శత్రుం సమపథి స్థితమ్‌| తమాశ్రయన్తో బహుళాస్తాంశ్చ రజా 7భియోజయేత్‌.24

ఖరోష్ట్ర బహుళో రాజా శత్రు ర్భన్దేన సంశ్రితః| బన్దనస్థో 7భియోజ్యో7రి స్తథా ప్రావృష్టి భూభుజా. 25

హిమపాతయుతే దేశే స్థితం గ్రీష్మే 7భియోజయేత్‌| యవసేన్ధనసంయుక్తం కాలే పార్థివ హైమనే. 26

శరద్వసన్తౌ ధర్మజ్ఞ కాలో సాధారణౌ స్మృతౌ| విజ్ఞాయ రాజా ద్విజ దేశసాలౌ దైవం త్రికాలం చ తథైవ బుధ్ధ్వా. 27

యాయా త్పరం కాలవిదాం మతేన సఞ్చిన్త్య సార్ధం ద్విజ మన్త్రవద్భిః. 27 u

ఇతి శ్రీ మత్స్య మహాపురాణ మతస్య మనుసంవాదే రాజధర్మే రాజ్ఞో యాత్రాకాల విధి ర్నామ ఏకోన చత్వారింశదుత్తర ద్విశతతమో7ధ్యాయః.

దుఃస్వప్నములు కలుగని సమయమున శరీరములు శుభ సూచకములై అదరుచుండ ధన్యములగు శుభ శకునము లగునపుడు దైవబల పురుషకార బలయుతుడై దేశ కాలానుకూలత గమనించి యుద్ధ యాత్ర చేయవలయును. స్థల మందు మొసలి ఏనుగునకును- నీటిలో ఏనుగు మొసలికిని రాత్రివేళ కాకి గ్రుడ్లగూబకును పగటివేళ కాకికి గ్రుడ్లగూబయును లోబడును; దేశ- కాల- జ్ఞానమనగా ఇట్టిదే ;వర్షాకాలమందు గజసేనా పదాతి సేనలును హేమంత శిశిరమందు అశ్వరథ సేనలును గ్రీష్మమందు ఖరోష్ట్రయుత సేనలును అధికముగ నుండుట జయప్రదము. వసంత శరదృతువులందు చతురంగ బలోపేత సేనతో యుద్ధయాత్ర చేయవచ్చును; మిట్ట పల్లములధికముగా గల దేశమందుండు రాజును జయించుటకు పదాతిసేన అధికముగా నుండవలెను ;సులభముగా చొరుటకు వీలగు చెట్లతో ఆవరింబడినదియై కొలదిగ మాత్రము బురద కల దేశమందుండు శత్రునెదుర్కొనుటకు గజసేన అధికముగా నుండవలయును ;రథసేనయు అస్వసేనయు అధికముగా గల చతురంగ సేనగల రాజు తాను విషమ భూభాగమునందుండియు సమతలమందుండు శత్రురాజును జయించ గలుగును ;శత్రురాజు ఇతరులతో ఒడంబడిక చేసికొన్నచో దానిచే అతనిని ఆశ్రయించి వారిని కూడ ఈ రాజు ఎదిరించి ఓడించవలెను ;కంచెలు మొదలగునవి రక్షణగా చేసికొనియున్న శత్రు రాజును జయించుటకు కంచర గాడిదలును ఒంటె లును అధికముగా గల సేనయుండవలెను; ఇట్టిఅవరణమందున్న రాజును వర్షాకాలమందెదిరించవలెను; హిమపాతముతో నిండినదేశమునందున్న శత్రుని గ్రీష్మమందెదిరించవలెను; ఎండు గడ్డియు కట్టెలును బాగుగా కల శత్రురాజును హేమంత ఋతువునందెదిరించవలెను ;శరద్వసంత ఋతువులు మాత్రము యుద్ధయాత్రకు అనుకూలముగా సాధారణ హేమంత ఋతువునందెదిరించవలెను ;శరద్వసంత ఋతువులు మాత్రము యుద్ధయాత్రకు అనుకాలములగు సాధారణ కాలములు; రాజు దేశకాలస్థితులనెరిగి దైవజ్ఞుల సాయమున భూత భవిష్యత్వర్తమానగతుల నెరిగి వారి అభిప్రాయానుసారముగా ఆలోచించి బ్రాహ్మణులతోను మంత్రాలోచన వేత్తలతోను సంప్రతించివారితో కూడి యుద్ధయాత్రకు బయలుదేరవలెను.

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున రాజధర్మమున యుద్ధ యాత్రా విధానమను

రెండు వందల తొమ్మిదవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-2    Chapters