Sri Matsya Mahapuranam-2    Chapters   

అష్టాత్రింశదుత్తరదజ్విశతతమో7ధ్యాయః.

రాజధర్మాః- గ్రహయజ్ఞవిధిః.

మనుః : గ్రహయజ్ఞః కథం కార్యో లక్షహోమః కథం నృపైః| కోటిహోమోపి వా దేవ సర్వపాపప్రణాశనః. 1

క్రియతే విధినా యేన యద్దృష్టం శాస్త్రచిన్తకైః| తత్సర్వం విస్తరా ద్దేవ కథయస్వ జనార్దన. 2

మత్స్యః ఇదానీం కథయిష్యామీ ప్రసఙ్గాదేవ తే నృప| రాజ్ఞా ధర్మప్రసక్తేన ప్రజానాం చహితేప్సునా. 3

లక్షహోమవిధిః.

గ్రహయజ్ఞ స్సదా కార్యో లక్షహోమసమన్వితః| నదీనాం సఙ్గమే చైవ సురాణా మగ్రతస్తథా. 4

సుసమే భూప్రదేశేతు దేవజ్ఞాధిష్ఠతో నృపః| గురుణాచ ద్విజైశ్చైవ సార్ధం భూమిం పరీక్షయేత్‌. 5

ఖనేద్వై తత్ర కుణ్డంతు సునమం హస్తమాత్రకమ్‌| ద్విగుణం లక్షహోమేచ కోటిహోమే చతుర్గుణమ్‌. 6

యుగ్మాస్తు ఋత్విజః ప్రోక్తా అష్టౌ వై వేదపారగాః| కన్జదమూలఫలాహారా దధిక్షీరాశినో 7పి వా.7

వేద్యాం నిధాపయేచ్చైవ రత్నాని వివిధాని చ| సికతాభి స్సమావేష్ఠ్య తతో7 గ్నిం చ సమిన్ధయేత్‌. 8

గాయత్ర్యా దశసాహస్రం మానస్తోకేన షడ్గుణః| త్రింశద్గ్రహాణాం మన్త్రై శ్చచత్వారో విష్ణుదైవతైః. 9

కూశ్మాణ్దౖ ర్జుహుయా త్పఞ్చ కుసుమాద్యైస్తు షోడశ| హోతవ్యా దశసహస్రం బాదరైర్జాతవేదసి. 10

శ్రియో మన్త్రేణ హోతవ్యాస్సహస్రాణి చతుర్ధశ| శేషాః పఞ్చసహస్రాస్తు హోతవ్యా స్త్విన్‌ద్‌ర్దైవతై| 11

హుత్వా శతసహస్రంతు పుణ్యంస్నానం విధీయతే| కుమ్భై ష్షోడశసఙ్ఖ్యేశ్చ సహితరణ్యౖ స్సుమఙ్గళైః. 12

స్నాపయేద్యజమానంతు తత శ్శాన్తి ర్భవిష్యతి|

రెండు వందల ముప్పది ఎనిమిదవ అధ్యాయము.

గ్రహయజ్ఞవిధానము- లక్షహోమ- కోటిహోమములు.

(ఇవి లోగడ 92వ అధ్యాయమున మరియొక విధముగా తెలుపబడినవి.)

నృపులు గ్రహయజ్ఞలక్షహోమ కోటిహోమములు సర్వపాప ప్రణాశనమగునవి ఎట్లు జరుపవలయునో జనార్ధనా! నవిస్తరముగ చెప్పుమన మత్స్యుడిట్లు చెప్పెను: రాజా! ప్రాసంగికముగా ఇపుడు నీకు నీవడిగినది తెలిపెదను; ధర్మ ప్రసక్తుడును ప్రజాహితైషియునగు రాజు లక్షహోమ సమన్వితమగు గ్రహయజ్ఞము జరుపలెను.

దానికై నదీసంగమమందో దేవాలయముల ముందో సమప్రదేశమున దైవజ్ఞులను గురువులను ద్విజులను తోడుగ తీసికొనిపోయి భూపరీక్ష చేయవలెను. అచట గుంటలు మిట్టలు లేని హస్త ప్రమూణచతురస్రముగా కుండముచత్రవ్వవలెను; ఇది అయుతహోమరూప సాధారణ గ్రహయజ్ఞమునకు; లక్షహోమమును దీనికి ద్విగుణమును- కోటిహోమమును చతుర్గుణమును కందమూల ఫలదక్షిరాహారులై యుండవలయును వేదిక యందు వివిధ రత్నములను వేయవలెను; వానిపై ఇసుకతో కప్పవలెను; అగ్నిని ప్రజ్వలింపజేసి హోమము జరుపవలెను; గాయత్రీ మంత్రముతో పదివేలు 'మానస్తోకే' మంత్రముతో ఆరువేలు గ్రహదేవతాక మంత్రములతో ముప్పదివేలు విష్ణుదైవత్య మంత్రముతో నాలుగువేల కూశ్మాండములతో ఐదు వేల కుసుమములతో పదునారువేలు బదరీ సమిధలతో పదివేలు శ్రీ దేవతాక మంత్రములతో పదనారువేలు ఇంద్ర దైవత్య మంత్రములలో ఐదు వేల హవనము చేయవలెను. (10+6+30+4+5+16+10+14+5=100వేలు) ఇది ఐన తరువాత యజమానుడు హిరణ్య సహిత షోడశ కుంభముల జలముతో పవిత్రస్నానమాచరించవలెను. ఇట్లు జరిపినచో శాంతియగును.

ఏవం కృతేతు యత్కిఞ్చిద్గ్రహపీచాసనుద్బవమ్‌.

తత్సర్వం నాశ మాయాతి దత్వా వై దక్షిణాం తతః| తస్మాతత్సర్వప్రయత్నేన ప్రదేయా దక్షిణా| స్మృతాః. 14

హస్త్యస్వరథయానాని భూమివస్త్రయుగానిచ| అనడుద్గోశతం దద్యా దృత్విజాం చైవ దక్షిణామ్‌. 15

యథావిత్తాను సారాత్తు విత్తశాఠ్యం న కారయేత్‌| మాసేపూర్ణే సమాప్తస్తు లక్షహోమో నరాధిప. 16

కోటిహోమ విధిః.

లక్షహోమస్య రాజే న్ద్ర విదానం పరికీర్తితమ్‌| ఇదానీం కోటిహోమస్య శృణుత్వం కదాయా మ్యహమ్‌. 17

గఙ్గాతటే 7థ యమునాసరస్వత్యో ర్నరేశ్వర| నర్మధాయాం దేవ్కాయాం తటే హోమో విధీయతే. 18

తత్రాపి ఋత్విజః కార్యారవిన్దన షోడశ| సర్వహోమేతు రాజేన్ద్ర దద్యా ద్విప్రే7థవా ధనమ్‌. 19

ఋత్విగాచార్య సహితో దీక్షాం సాంవత్సరీం స్థితః| చైత్రే మాసే తు సమ్ప్రాప్తే కార్తికే వా విశేషతః. 20

ప్రారమ్భః కరణీయో వా వత్సరం వత్సరం నృప| యజమానః పయోభక్షీ ఫలాశీ చ తథా నృప. 21

యవాదివ్రీహయో మాషా స్తిలాశ్చ సహ సర్షపైః| పలాశసమిధ శ్సస్తా వసోర్ధారా స్తథోపరి. 22

మాసే7థ ప్రథమే దద్యా దృత్విగ్భ్యః క్షీరభోజనమ్‌| ద్వితీయే కృసరా దేయా సర్వకార్యార్థ సాధనీ. 23

తృతీయే మాసి సంయావో దేయో వై వరినన్దన| చతుర్థే మోదకా దేయా విప్రాణాం ప్రీతి మహారేత్‌. 24

పఞ్చమే దధిభక్తంతు షష్ఠే వై సక్తుభోజనమ్‌| అపూపా స్సప్తమే దేయాహ్యష్టమే ఘృతపూపకాః. 25

షష్ట్యోదనంచ నవమే దశ##మే యవషష్టికాః| ఏకాదశే సమాషంతు భోజనం రవినన్దన. 26

ద్వాదశే త్వథ సమ్ప్రప్తే మాసే రవికులోద్వహ| షడ్రసై స్సహ భ##క్ష్యైశ్చ భోజనం సార్వకామికమ్‌| 27

ఈ విధముగా జరిపపినచో గ్రహపీడా సముద్భవములగు ఉపద్రవములు అన్నియు శమించును; శాంతి పరిపూర్తికై హోమానంతరము దక్షిణల నీయవలెను; ఈయబడునది కావుననే దక్షిణయని వ్యవహారము; కావున సర్వప్రయత్నముతో శక్తివంచనలేక దక్షిణలు ఈయవలెను; ఈయవలసినవి: ఏనుగులు గుర్రములు రథములు యానములు (బండ్లు పాలకీలు మొదలగునవి) భూములు పంచల జతలు ఎద్దులు గోవులు మొదలగునవి; ఇది మాసకాలము జరిపినచో ముగియునది; ఇట్లు నీకు లక్షహోమ విధానము తేలిపితిని.

ఇతి కోటిహోమ విధానము తెలిపెదను వినుము; గంగా తటయమునా తట సరస్వతీర నర్మదా తీర దేవికాతీరము లందిది జరుపవలెను; దీనికై పదునారుమంది ఋత్విజులను

నియమించవలెను; సర్వహోమములును ముగియగనే విప్రునకు ధనమీయవలెను; దీనికై ఋత్వికులతోను ఆచార్యునితో అధ్వర్యునితో - పురోహితునితో, ను కూది సంవత్సర కాలము సాగించు దీక్షను గ్రహించవలయును; ఈ దీక్ష ను చైతేరమాసమున గాని కార్తికమాసమున గాని స్వీకరించవలెను; ఇది ఇట్లు ప్రతివర్షమందును జరిపినను జరుపవచ్చును; ఈ దీక్షాకాలమున యజమానుడు పాలుపండ్లు మాత్రము ఆహారముగా గ్రహించుచుండవలెను; హోమమునకై యవలు వరిధాన్యము మినుములు తిలలు ఆవలు పలాశ సమిధలు వసుధార ఉపయోగించవలెను; బ్రాహ్మణులకు భోజనము- ప్రథమ మాసమున క్షీరభోజనము రెండవ నెలలో సర్వకార్యార్థ సాధనియగు పులగము రెండవనెల సంయావము (గోధుమరవ్వతో వండిన పాలఅన్నము) నాల్గవనెలలో లడ్డులు ఐదవ నెలలో పెరుగన్నములు ఆరవలెలలో సక్తుభోజనము ఏడవనెలలో అపూపములు(అప్పములు- బూరెలు- అరిసెలు) ఎనిమిదివనెలలో నేతిబూరెలు తొమ్మిదవ నెలలో షష్టికము అను(రెండు నెలల పంట వరి) బియ్యపు అన్నము పదవనెలలో షష్టికయవల అన్నము(యవల పిండి రొట్టె) పదునొకండవ నెలలో మినుము(మినప గారెలు మొదలగు పిండి వంటల)తో కూడిన భోజనము పండ్రెండవ నెలలో అన్ని కోరికలను తృప్తిపరచు షడ్రసోపేత భక్ష్యసహితభోజనము పెట్టించవలయును.

దేయా ద్ద్విజానాం రాజేన్ద్ర మాసి మాసి చ దక్షిణామ్‌| అహతవాసా స్సంవీతో దినార్ధం హోమయే చ్ఛుచి. 28

తస్మాత్తసదోత్థితై ర్భావ్యం యజమానస్య ఋత్విజైః| ఇన్ద్రాదీనాం సురాణాం చ ప్రీణనం సార్వకామికమ్‌. 29

కృత్వా సురాణాం రాజేన్ద్ర పశుఘాత సమన్వతమ్‌| సర్వదా సాధిదేవానా మగ్నిష్టోమం చ కారయేత్‌. 30

ఏవం కృత్వా విధానేన పూర్ణహుతి శ##తేశ##తే| సహస్రే ద్విగి%ుణా దేయా యావచ్ఛత సహస్రకమ్‌. 31

పురోడాశ స్తతస్సాధ్యో దేవతార్థేచ ఋత్విజైః| యుక్తో వస న్మానవైశ్చ పునః ప్రాప్తార్చనా న్ద్విజా &.32

ప్రీణయిత్వా సురాస్త్సర్వా న్పితృదేవం తతః క్రమాత్‌| కృత్వా శాస్త్రవిధానేన పిణ్డానాంతు సమర్పణమ్‌. 33

సమాప్తౌ తస్య హోమస్య విప్రాణా మథ దక్షిణామ్‌| సమాం చైవ తులాం కృత్వా బద్ధ్వా శిక్యద్వయం పునః. 34

ఆత్మానం తోలయే త్తత్ర పత్నీం చైవ ద్వితీయకామ్‌| సువర్ణేన తథా7 త్మానం రజతేన తథా ప్రియామ్‌. 35

తోలయిత్వాదదే ద్రాజా విత్తశాఠ్య వివర్జితః| దదే చ్ఛత సహస్రంతు రూప్యస్య కనకస్య తు. 36

సర్వస్వం వా దదే త్తత్ర రాజసూయాఫలం లభేత్‌| ఏవం కృత్వా విధానేన విప్రాం స్తాంశ్చ విసర్జయేత్‌. 37

ప్రీయతాం పుణ్డరీకాక్ష స్సర్వ యజ్ఞేశ్వరో హరిః| తస్మిం స్తుష్టేజగత్తుష్టం ప్రీణితే ప్రీణితం భ##వేత్‌. 38

ఏవం సర్వోపఘాతేషు దైవమానుషకారణ |ఇయం శాన్తి స్తవాఖ్యాతా యాం కృత్వా సుకృతీ భ##వేత్‌. 39

న శోచే జ్జన్మమరణ కృతాతృత విచారణ| సర్వతీర్థేషు యత్స్నానం స్రవయజ్ఞేషు యత్ఫలమ్‌. 40

తత్ఫలం సమవాప్నోతి కృత్వా యజ్ఞత్రయం నృప. 40 u

ఇతి శ్రీ మత్స్య మహాపురాణ రాజధర్మే గ్రహయజ్ఞ కోటిహోమ కథనం మాన

అష్టాత్రింశదుత్తర ద్విశతతమో7ధ్యాయః.

ప్రతిమాసమందును బ్రాహ్మణులకు (ఋత్విజులకు) దక్షిణలీయవలెను ;యజమానుడును ఋత్వికులతో కూడి అహతవాససుడై (చించిన జత వస్త్రములు-అనగా దోవతుల జత చిచంక ఒకదానిని కట్టువస్త్రముగాను రెండవ దానిని ఉత్తరీయముగాను అమర్చికొని ధరించిన వాడు అయి) దినార్థకాలము హోమము చేయవలెను ;ఇది ఇంద్రాదిదేవతా ప్రీతికరమును సర్వకామ ప్రదమును ;ఇట్లు సర్వదేవతోద్దేశకమగు ఈ యజ్ఞమును జరిపి పశువిశనన పూర్వకముగా అగ్నిష్టోమమును సర్వదానాది పూర్వకముగా జరుపవలయును; ఇట్లు యథావిధిగ జరుపుచు నూరేసి హవనముల కొకసారి పూర్ణాహుతి జరుపవలెను ; వేయి హవనములు కాగానే ద్విగుణదక్షిణల నీయవలెను ;ఇట్లు లక్షహోమములు ముగియు వరకు చేయవలెను. తుదకు ఋత్విజులు పురోడాశమును సిద్ధపరచి దానితో దేవతోద్దేశమున హవనము జరుపవలయును. యజమానుడును మానవ యోగ్యములగు హవిష్యాన్ననములతో జితేంద్రియుడై యుండి ద్విజులను దేవతలను అర్చించి ప్రీతి నందించవలెను ; తరువాత పితరులనర్చించి శాస్త్రోక్త విధానమున పిండప్రదానము జరుపవలయును; ఇట్లు హోమసమాప్తి కాగానే బ్రాహ్మణులకు (ఋత్వికులకు) దక్షిణమలు సమృద్దిగా ఈయవలెను ;తరువాత సరియగు తులచేయించి దానికి రెండు వైపుల రెండు ఉట్టులను వ్రేలాడదీయ వలయును ;రాజు తాను బంగారుతో తులలో తూగి తన బార్యను వెండితో తూకము చేయించవలయును ;ఈ ధనమును దానము చేయవలయును; వెండి గాని బంగారుగాని లక్షనాణములు ఈతులాభారమునందుండునట్లు యథాశక్తిగ ఇతర ద్రవ్యములనైన తూకము చేసి దానమీయవలెను; రాజు తనకున్న దంతయు (సర్వ-స్వము) నైన ఈయవచ్చును ;దీనిచే రాజసూయ యాగఫలము లభించును; ఇట్లు యథావిధానముగ లక్షహోమ కోటిహోమముల జరిపి ఆ ఋత్విగాది బ్రాహ్మణులకు వీడ్కోలు ఇచ్చిపంపవలయును ;యజ్ఞాంతమున పుండరీకాక్షుడును సర్వ యజ్ఞేశ్వరుడునను హరిప్రీతినందు గాక! అను మంత్రమునుచ్చరింపవలయును ;అతడు తుష్టుడైనచో జగత్తు సంతుషశ్టమగును ;అతడు ప్రీణితు (ప్రీతినందించబడినవా) డైనచో జగము ప్రీణితమగును ;దైవ హేతుకములును మానుష హేతుకములునగు సర్వోపఘాతములందును జరుపవలసిన శాంతివిధానము ఇది ;నీకు తెలిపిన ఈ యజ్ఞమాచరించినచో సుకృతమాచరించినవాడగును ;జన్మ మరణముల గుర్చి కాని కృతాకృతములను (నేను ఏ పుణ్యమాచరించితిని- ఏ పుణ్యమాచరించలేదు- అను విషయమును) గూర్చి కాని విచారించ- శోకింప- పనిలేదు ;సర్వతీర్థస్నానముచేతను సర్వయజ్ఞాతరణము చేతను కలుగు ఫలమంతయు ఈ గ్రహయజ్ఞత్రయము (ఆయతహోమలక్షహోమ -కోటి హోమముల) తో లభించును.

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున రాజ ధర్మమున గ్రహయజ్ఞ లక్షహోమ కోటిహోమ విధాన ప్రతిపాదనమును రెండు వందల ముప్పది ఎనిమిదవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-2    Chapters