Sri Matsya Mahapuranam-2    Chapters   

ఏకోన త్రింశదుత్తర ద్విశతతమో7ధ్యాయః.

రాజధర్మాః- దేవతా7ర్చావికారోపశాన్తిః.

గర్గః : దేవతార్చాః ప్రనృత్యన్తి వేపన్తే ప్రజ్వలన్తిచ| ఆరటన్తి రుదన్త్యేతాః ప్రస్విద్యన్తి హాసమ్తిచ. 1

ఉత్తిష్ఠన్తి విషీదన్తి ప్రదావన్తి ధమన్తిచ | భజ్యన్తే విక్షిపంతేచ శ##స్త్రేమ ప్రహరన్తిచ. 2

అధోముఖాశ్చ తిష్ఠన్తి స్థానాత్‌ స్థానం చలన్తిచ| వమన్త్యగ్నిం తథా ధూమం స్నేహం రక్తం తథా వసామ్‌. 3

ఏవ మద్యాశ్చ దృశ్యన్తే వికారా స్సహసోత్థితాః| లిఙ్గాయతనవిప్రేషు తత్ర వాసం న రోచయేత్‌. 4

రాజ్ఞో వా వ్యసనం తత్ర స చ దేశో వినశ్యతి| దేవయాత్రాసు చోత్పాతా న్దృష్ట్వా దేశభయం వదేత్‌. 5

పితామహస్య హర్మ్యేషు తత్ర వాసం న రోచయేత్‌| పశూనాం రుద్రజం జ్ఞేయం నృపాణాం లోకపాజలమ్‌. 6

జ్ఞేయం సేనాపతీనాం తు యత్స్యా త్స్కన్దవిశాఖజమ్‌| లోకానాం విష్ణుసమ్భూతం విశ్వకర్మ సముద్భవమ్‌. 7

వినాయకోద్భవం జ్ఞేయం గణానాం యే తు నాయకాః| దేవప్రేష్యా న్నృపప్రేష్యా దేవస్త్రీ భి న్నృపస్త్రియః. 8

వాస్తు దేవోద్భవం జ్ఞేయం గ్రహాణామివ నాన్యథా| దేవతానాం వికారేషు శ్రుతివేత్తా పురోహితః. 9

దేవతార్చానాం తు గన్ధాద్యై స్స్నాన మాచ్ఛాద్య భూషయేత్‌| పూజయేచ్ఛ మహాభాగ గన్ధమాల్యాన్న సమ్పదా. 10

మధుపర్కేణ విధివ దుపతిష్ఠే దనన్తరమ్‌| తల్లిఙ్గేన చ మన్త్రేణ స్థాలీపాకం యథావిధి. 11

పురోధా జుహుయా ద్వహ్నౌ సప్తరాత్ర మతన్ద్రితః| విప్రాశ్చ పూజ్యా మధునా7 న్న పానై స్సదక్షిణం సప్తదినం నరేన్ద్ర. 12

ప్రాప్తే7ష్ట మే7 హ్ని క్షితిగోప్రదానై స్సకాఞ్చనై శ్శాన్తి ముపైతి పాపమ్‌. 12u

ఇతి శ్రీ మత్స్య మహాపురాణ అర్చావికారోపశమనం నామ

ఏకోన త్రింశదుత్తర ద్విశతతమో7 ధ్యాయః.

రెండు వందల ఇరువది తొమ్మిదవ అధ్యాయము.

దేవతార్చా వికారోపశాంతి.

గర్గుడు అత్రితో ఇట్లు చెప్పెను: దేవాలయములందలి అర్చామూర్తులు (దేవతా విగ్రహములు) విశేషముగా నృత్యము చేయును; వణకును; ప్రజ్వలించును; గట్టిగా అరచును; ఏడుచును; చెమర్చును; నవ్వును; లేచును; దుఃఖించును ;పరుగెత్తును ;ఊదును; విరుగును ;కదలును ;అయుధములతో కొట్టును; తలలు వంచుకొని నిలుచును ;ఒక చోటి నుండు మరియొక చోటికి కదలును ;అగ్నిని పొగను నూనెను(జిడ్డును) రక్తమును వసను క్రక్కు ; ఈ విధములగు వికారములు దేవాలయములందో బ్రాహ్మణుల ఇండ్లయందో కనబడును; అట్టి చోటులందు నివాసము విడువలయును ; వీనిచే రాజునకయినను వ్యసనము (ఆపద) కలుగును- దేశమునకైన నాశము కలుగును ;ఇట్టి ఉత్పాతములు దేవతల జాతర లందు కనబడుచో దేశమునకు భయము కలుగును ;అభయములు హర్మ్యములందు బ్రహ్మవలనను పశువులకు రుద్రుని వలనను నృపులకు లోకపాలుర వలనను సేనాపతులకు స్కందునివలనను విశాఖుని వలనను ( ఈ ఇద్దరును కుమార స్వామి రూపభేదములే) లోక (రాజ్య)) జనులకు విశ్వకర్మ విష్ణువుల వలనను గణ నాయకులకు వినాయకుని వలనను రాజ సేవకులకు దేవసేలకుల వలనను నృపస్త్రీలకు దేవతా స్త్రీల వలనను ఆ పదలు ఈ ఉత్పాతములు ఫలముగా కలుగును; గ్రహాదులయందు కలుగు ఉత్పాత దర్శనములు వాసుదేవుని వలన కలుగును ;దేవతార్చామూర్తులందు ఈ వికారములు కనబడినపుడు వేదవేత్తయగు పురోహితుడు ఆ మూర్తి ని స్నానమాడించి వస్త్ర గంధ భూషణాదులతో కప్పివేయవలెను ;అలంకరించవలెను;గంధమాల్యాన్నాది సంపదలతో అర్చన చేయవలెను ;తరువాత మధువర్కముతో (తేనెతో కలిపిన గోక్షీరముతో) మూర్తిని సేవించవలెను ;ఆ దేవతా సంబంధి మంత్రములతో యథావిధిగ స్థాలీపాకము జరిపి ఆచరువుతో ఏడహోరాత్రములు హెచ్చరికతో హోమము చేయవలెను; ఈ ఏడు దినములును విప్రులను- తేనె అన్నపానములు దక్షిణలు- వీనితో పూజించవలెను ;ఎనిమిది దినమున విప్రులకు గోభూదానములు జరుపవలయును ;దీనిచే ఉపద్రవములు శాంతించును.

ఇది శ్రీ మత్స్య మహపురాణమున రాజధర్మ మున అర్చావికారోప శమనమను

éరెండు వందల ఇరువది తొమ్మిదవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-2    Chapters