Sri Matsya Mahapuranam-2    Chapters   

షడ్వింశత్యుత్తర ద్విశతతమో7ధ్యాయః.

రాజధర్మాః- స్తేయాదౌ దండాః.

శ్రీమత్స్యః: నిక్షేపస్య సమం మూల్యం దణ్డో నిక్షేప భుక్తథా |

వస్త్రాదికసమ స్తస్య తదా ధర్మో న హీయతే. 1

యో నిక్షేపం నార్పయతి యశ్చానిక్షిప్య యాచతే |

తావుభౌ చోరవ చ్ఛాస్యౌ దాప్యౌ వా ద్విగుణం ధనమ్‌. 2

ఉపధాభిశ్చ యః కశ్చి త్పరద్రవ్యం హరే న్నరః | ససహాయ స్స హన్తవ్యంః ప్రకామం వివిధై ర్వధైః. 3

యో యాచితం సమాదాయ న తద్దద్యా ద్యథాక్రమమ్‌ |

స నిగృహ్య బలాద్దాప్యో దణ్డో వా పూర్వసాహసమ్‌. 4

అజ్ఞానా ద్యది వా కుర్యా త్పర ద్రవ్యస్య విక్రయమ్‌ | నిర్దోషో జ్ఞానపూర్వం తు చోరవ ద్వధ మర్హతి. 5

మూల్య మాదాయ యో విద్యాం శిష్యేభ్యో న ప్రయచ్ఛతి |

దణ్డ్య స్స మూల్యం సకలం ధర్మజ్ఞేన మహీక్షితా. 6

ద్విజభోజ్యే తు సమ్ప్రాప్తే ప్రతివేశ్మ మభోజయ& |

హిరణ్య మాషకం దణ్డ్యః పాపై నాస్తి వ్యతిక్రమః. 7

ఆమన్త్రి తో ద్విజో యస్తు వర్తమానశ్చ స్వే గృహే |

నిష్కారణం న గచ్చేద్య స్స దాప్యో7ష్టశతం దమమ్‌. 8

ప్రతి శ్రుత్యా7ప్రదాతారం సువర్ణం దణ్డయే న్నృపః |

భృత్యశ్చాజ్ఞాం స కుర్యాద్యో దర్పా త్కర్మ యథోదితమ్‌. 9

స దణ్డ్యః కృష్ణలాన్యఎ్టౌ న దేయం చాస్య వేతనమ్‌ | సఙ్గృహీతం న దద్యాద్యః కాలే వేతన మేవచ. 10

అకాలేతు త్యజేద్భృత్యం దణ్డ్య స్స్యా చ్ఛతమేవ చ |

రెండు వందల ఇరువది యారవ అధ్యాయము.

స్తేయా (చౌర్యా)ది దోషదండములు.

శ్రీమత్స్య నారాయణుడు మనువుతో ఇట్లు చెప్పెను: ఇతరులు తనయొద్ద దాచుట కిచ్చిన ధనమును అనుభవించిన వానికి ఆ నిక్షేప మూల్యసమాన మూల్యమే

దండము; వస్త్రాదిక విషయమునందును ఇంతే; ఇట్లు చేయుటచేత ధర్మమునకు హాని కలుగకుండును. ఇతరులు తనకడ దాచుట కిచ్చిన ధనమును తిరిగి ఈయనివానిని దాచకయే దాచితినని ధనమడుగువానిని దొంగలను వలె దండించవలెను; నిక్షేప మూల్యమునకు రెట్టింపు ధనమయిన ఇప్పింపవలెను; మోసములతో పరద్రవ్య మపహరించిన వానిని వాని సహాయులను కూడ చిత్రహింసలతో చాల హింసించవలెను; ఇతరుల కడ అడిగి తీసికొనిన దానిని సొంతదారునకు తిరిగి యథాక్రమముగ ఈయనివానిని దండించి బలవంతముగ ఇప్పింపవలయును; రెట్టింపు వెలనైన ఇప్పింపవలెను; తనకడ నున్న ఇతరుల వస్తువును తెలియక అమ్మినచో తప్పుకాదు; తెలిసి అమ్మినచో చోరునికి వలె శారీరదండ మీయవలయును; విద్యను శిల్పమును ఇత్తునని వెల తీసికొనియు అవి ఈయనివాని నుండి ధర్మజుడగు రాజామూల్య మిప్పించవలెను: తన ఇంట బ్రాహ్మణు సంతర్పణము చేయుచు పొరుగువానిని భోజనము నకు పిలువని వానిని మాషప్రమాణపు (ఐదుగురి గింజల ఎత్తు బంగారు నాణము) బంగారముతో దండించవలెను; దీనితో ఆ పిలువనివాని కా దోష మంటకుండును: ఆమంత్రణము చేయబడి ఒప్పుకొనిన బ్రాహ్మణు డింటియందుండియు నిష్కాకారణముగా పోనిచో వానికి ఎనిమిది వందల దమము(దుడ్డు)లు దండముగా విధించవలెను; ఇత్తునని ఒప్పినదాని నీయనివానికి ఒక సువర్ణము (సవరసు-80 గురిగింజల తూకము) దండముగా విధించవలెను: తన స్వామి ఇచ్చిన ఆజ్ఞను పొగరుతో చేయని సేవకుని ఎనిమిది కృష్ణలములతో (ఒక గురిగింజ తూకపు బంగారు నాణము) దండము విధించవలెను; వాని వేతనమీయకుండవలెను. చాలాకాలము నుండు తాను చేయించుకొనిన పనికై భృత్యునకు కాలముతో వేతనమీయని వానిని- అకాలములో భృత్యుని విడిచినవానిని- నూరు కార్షాపణములతో దాడించవలెను. (కార్షాపణము= పదునారు పణములు- పణము అనునది పూర్వపు నాలుగు అణాల ఎనిమిది కాసులని 'కిట్టెల్‌' చెప్పెను.)

యో గ్రామదేశసస్యానాం కృత్వా చైవ సుసంవిదమ్‌. 11

వినంవదే న్నరో లోభా త్తం రాష్ట్రా ద్విప్రవాసయేత్‌ |

క్రీత్వా విక్రీయ మా కిఞ్చి త్పశ్చా త్సానుశయో భ##వేత్‌. 12

సోన్తర్దశాహా త్తత్సామ్యం దద్యాచ్చైవాదదీత వా | పరేణు తు దశాహస్య న దద్యా న్నైవ దాపయేత్‌. 13

ఆదదన్విదదంశ్చైవ రాజ్ఞా దణ్డ్య శ్శతాని షట్‌ | యస్తు దోషవతీం కన్యా మనాఖ్యాయ ప్రయచ్ఛతి. 14

తస్య కుర్యా న్నృపో దణ్డం స్వయం షణ్ణవతిం పణా& |

అకన్యై వేతియః కన్యాం బ్రూయా ద్దోషేణ మానవః. 15

స శతం ప్రాప్నుయా ద్దణ్డం తస్యాదోష మదర్శయ& |

య స్త్వన్యాం దర్శయిత్వా7న్యాం వోఢుః కన్యాం ప్రయచ్ఛతి. 16

ఉత్తమం తస్య కుర్వీత రాజా దణ్డం చతు సాహసమ్‌ |

పరో దోషం సమాచ్ఛాద్య యః కన్యాం వరయే దిహ. 17

దత్త7ప్యదత్తా సా తస్య రాజ్ఞా శ్శతద్వయమ్‌ |

ప్రదాయ కన్యాం యో7 న్యసై#్మ పునస్తాం సమ్ప్రయోజయేత్‌. 18

దణ్డః కార్యో నరేన్ద్రేణ తస్యాప్యుత్తమసాహసః | సత్యంకారేణ వా వాచా యుక్తం పుణ్యమసంశయమ్‌.

లుబ్ధో హ్యన్యత్ర విక్రేతా షట్ఛతం దణ్డ మర్హతి |

గ్రామ విషయమునను దేశ విషయమునను సస్య (పంటల) విషయమునను (రాజుతో) ఒడంబడిక చేసికొనియు లోభవశుడయి మాట తప్పన వానిని రాజు దేశమునుండి వెడలగొట్టవలెను. ఎవరైనను ఒక వస్తువును అమ్మికాని కొనికాని తరువాత పశ్చాత్తాపపడి అది మానుకొనదలచినచో పదినాళ్ళలోగా దానిని ఇచ్చి ధనము పుచ్చుకొనుటయో దానిని తీసికొని ధనమును తిరిగి ఇచ్చుటయో చేయవలెను . పది దినములు గడచినమీదట ఈయరాదు. పుచ్చుకొనరాదు. కాని ఆ పదిదినముల లోపలకూడ ఈయనివానిని పుచ్చుకొనని వానిని రాజు ఆరు వందల పణములతో దండించవలెను. తన కన్యయందున్న దోషములను బయల్పరచక దాచియుంచిన కన్యాదానము చేసిన వానిని తొంబదియారు పణములతో దండించవలెను. తన కన్యయందేదైన దోషముండగా అది బయల్పరచకుండుటకై ఆమె తన కన్య కాదనిన వానిని నూరు పణములతో దండించవలయును. ఒక కన్య చూపి మరియొక కన్యను వరునకిచ్చిన వానిని రాజు ప్రథమ శ్రేణికి చెందిన (వేయి కార్షాపముల) మూల్యముతో దండించవలయును. తనయందున్న దోషమును కప్పియుంచి కన్యను ఇప్పించుకొనినవానికి ఆ కన్యను ఈయనట్లే: పైగా ఆవరునకు రాజు రెండు వందల కార్షాపణములు దండముగా విధించవలెను. తన కన్యను మొదట ఒకనికి దానము చేసి కాని ఇత్తునని మాట ఇచ్చికాని ఆమెనే మరల నింకొకనికిచ్చిన వానిని రాజు ప్రథమ శ్రేణి (వేయి కార్షాపణముల) దండముతో దండించవలెను, ఒక వస్తువునొకనికి అమ్ముటకు శపథ పూర్వకముగ మాట ఇచ్చినదానిని మరియొకనికి అమ్మువానిని ఆరువందల కార్షాపణములతో దండించవలెను.

దుహితు శ్శుల్క విక్రేతా సత్యంకారాత్తు సన్త్యజేత్‌.

ద్విగుణం దణ్డయేదేన మితి ధర్మో వ్యవస్థితః | మూల్యైకదేశం దత్వా తు యదు క్రేతా ధనం త్యజేత్‌. 21

స దణ్డ్యో మధ్యమం దణ్డం తస్య పణ్యస్య మోక్షణమ్‌ |

దుహ్యా ద్ధేనుంచ యః పాలో గృహీత్వా భక్తవేతనమ్‌. 22

స తు దణ్ద్య శ్శతం రాజ్ఞా సువర్ణం చాప్యరక్షితా | దణ్డం దత్వా తు విరమే త్స్వామితః కృతరక్షణః. 23

బద్ధః కార్షాణయసైః పాశై స్తస్య కర్మకరో భ##వేత్‌ | ధనుశ్శతపరీణాహో గ్రామస్య చ సమన్తతః. 24

ద్విగుణం త్రిగుణం చాపి నగరస్య తు కల్పయేత్‌| వృత్తిం తత్ర ప్రకుర్వీత యాముష్ట్రో నావలోకయేత్‌. 25

ఛిద్రం వా వారయే త్సర్వం శ్వమాకర ముఖానుగమ్‌ | యత్రా7పరివృతం ధాన్యం విహింస్యుః పశవో యది. 26

న తత్ర కారయే ద్దణ్డం నృపతిః పశురక్షితే | ఆనిర్దశాహా ద్గా( హాంగాం)ం సూతా వృషం దేవపశుం తథా. 27

ఛిద్రం వా వారయే త్సర్వం న దణ్డ్యా మనురబ్రవీత్‌ | అతో7న్యథా వినష్టస్య దశాంశం దణ్డ మర్హతి. 28

పాల్యస్య పాలకస్వామీ వినాశే క్షత్రియస్య తు | భక్షయిత్వోపవిష్టస్తు ద్విగుణం దణ్డ మర్హతి. 29

విశం దణ్డ్యా ద్ధశంగుణం వినాశే క్షత్త్రియస్య తు| గృహం తటాక మారామం క్షేత్రం వాపి సమాహర&. 30

శతాని పఞ్చ దణ్డ స్స్యా దజ్ఞానా ద్ద్విశతో దమః | సీమాబన్ధన కాలేతు సీమాన్తం యో హి కారయేత్‌. 31

తేషాం సంజ్ఞాం దదానస్తు జిహ్వాచ్ఛేదన మాప్నుయాత్‌ | అథైనామపి యో దద్యా త్సంవిదం వాధిగచ్ఛతి. 32

తన కూమార్తెకు ఆమె అత్త ఇంటివారుకాని ఇతర బంధువులుకాని చదివించిన కానుకలు మొదలగు వానిని అమ్మినవానిని అవి తనయొద్దకు లేనేలేవని నిరాకరించిన వానిని వెలకు రెట్టింపు వెలతో దండించవలెనని ధర్మవ్యవస్థ చెప్పుచున్నది. వస్తువును కొనినవాడు దాని వెల కొంతమాత్రమిచ్చి మిగిలిన దానినీయక మానినచో వానిని (నూరు కార్షాపణములనుండి ఐదు వందల కార్షాపణముల వరకు గల) మధ్యమ దండముతో దండించుటయే కాక ఆ తీసికొనిన వస్తువును తిరిగి సొందారునకు ఇప్పించవలెను. పశువును (ఆవును) కాచెదను మేపెదను అని అందులకై వేతనము తీసి కొనియు దానిని కాపాడక మేపక దాని పాలు పిదుకుకొను పశుపాలుని రాజు నూరు నవరసులతో దండించవలయును. ఈ విధించిన దండమును చెల్లించిన తరువాత తన స్వామిచే తన దేహమున తన అపరాధపు గురుతు వేయించుకొని ఆ మొదటి పని విడువవలెను. తరువాత తన కాలికి ఇనుప గొలుసు కట్టుకొని ఆ స్వామి చెప్పిన పని చేయవలెను. గ్రామమునకు చుట్టును నూరు ధనువుల దూరమునందును నగరమునకయినతో రెండు మూడు వందల ధనువుల దూర మందును రాజు ఒంటె తమ మెడ ఎత్తి చూచినను అవతలిది కనబడనంత ఎత్తున కంటె వేయించవలయును. ఈ కంచెలోనుండి పందులు కుక్కలు మొదలగునవి దూరిపోకుండునట్లు కంచె సందులను మూయించి యుంచవలయును; ఈ కంచెకులోగా ఉండు పైరు పంటలకు పశువులేమి హాని కలిగించినను రాజు పశు పాలకునకు దండము విధించవలసిన పనిలేదు; ఈని పది దినములు గడువని అవుగాని ఆబోతుగాని దేవతకు అర్పించిన పశువు గాని పొలములో దూరకుండ ఛిద్రములు మూయవలెనే కాని అవి పొలములలోనికి ఒకవేళ పోయినచో వానిని కొట్టకూడదు; ఈ విధముగ కాక మరియొక విధముగ పశువులు పంట పైరులు మొదలగు వానికి హాని కలిగించినచో ఆ నష్టమయిన ధాన్యాదికము క్షత్రియుని దయినచో పశుపాలకుని నియమించుకొనిన పశుస్వామికి వినష్టమయిన దానిలో పదియవ వంతు దండముగా విధించ వచ్చును; పశువు పైరు పంటలను తిని అచ్చటనే పండుకొనియున్నచో పైదానికి రెట్టింపు దండము విధించవలయును; క్షత్రియుని ఆస్తిని వైశ్యుని పశువు ఇట్లు నష్టపరచినచో పైదానికి పదింతలు దండముగా విధించవలెను: గృహము చెరువు తోట పొలము మొదలగునవి హరించినవానికి ఐదు వందల కార్షాపణము దండము విధించవలయును; ఇవి తెలియక చేసినచో రెండు వందల కార్షాపణము చాలును; పొలపు గట్టులు నిర్ణయించి ఏర్పరచుటలో తప్పు హద్దులను నిర్ణయించినను ఏర్పరచినను అట్లు చేయుటకు అనుకూలించు సైగలు చేసినను గుర్తులుంచినను అట్టివాని నాలుక కోయవలెను; జ్ఞాన పూర్వకముగా తెలిసి తెలిసి ఇతరుల పొలపుగట్లను వ్యత్యస్తముగా చేసిన వానికిని చేయించిన వానికిని ఆ సంకేతము లను అందుకొనినవారికిని ఉత్తమశ్రేణికి చెందిన (వేయి కార్షాపణముల) దండము విధించవలయును.

అకార్య కారి బ్రాహ్మాణాదీనాం ప్రాయశ్చిత్తరూప దణ్డవిధిః 32

ఉత్తమం సాహసం దణ్డ్య ఇతి స్వాయమ్భువో7బ్రవీత్‌ | వర్ణానా మానుపూర్వ్యేణ త్రయాణా మవిశేషతః. 33

అకార్యకారిణ స్సర్వా న్ప్రాయశ్చిత్తాని కారయేత్‌ | అసత్యేన ప్రమాప్య స్త్రీం శూద్రహత్యావ్రతం చరేత్‌.

దానేనచ ధనేనైకం సర్పాదీనా మశక్నువ& | ఏకైకం స చరే త్కృచ్ఛ్రం ద్విజః పాపాపనుత్తయే. 35

ఫలదానాం చ వృక్షాణాం ఛేదనే జప్య మృక్ఛతమ్‌ | గుల్మవల్లీ లతానాం చ పుష్పితానాం చ వీరుధామ్‌. 36

అస్థిమతాంచ సత్త్వానాం సహస్రస్య ప్రమాపణ | పూర్ణేవా7నస్యవస్థాతుం శూద్రహత్యా వ్రతం చరేత్‌. 37

కించిద్దేయంచ విప్రాయ దద్యా దస్థిమతాం వధే | అనస్థ్నాం చైవ హింసాయాం ప్రాణాయామై ర్విశుద్ధ్యతి. 38

అన్నాదిజానాం సత్త్వానాం రసజానాం చ సర్వశః | ఫలపుష్పోద్భవానాం చ ఘృతప్రాశో విశోధనమ్‌. 39

కృష్ణానా మోషధీనాం చ జాతానాం చ స్వయం వనే | వృథాచ్ఛేదే నగచ్ఛేత దిన మేకం పయోవ్రతః. 40

ఏతై ర్వధై రపోహ్యాం స్యా దేనో హింసా సముద్భవమ్‌ |

స్తేయకర్త్రపహర్తౄణాం వ్రతానాం శ్రూయతాం విధిః. 41

ధాన్యాన్న ధనచౌర్మాణి కృత్వా కామం ద్విజోత్తమః | స్వజాతీయగృహాదేవ కృచ్థ్రార్ధేన విశుద్ధ్యతి. 42

మనుష్యాణాం తు పరణ స్త్రీణాం క్షేత్రగృహస్యచ |

కూపవాపీజలానాం తు శుద్ధి శ్చాన్ద్రాయణం స్మృతమ్‌. 43

ద్రవ్యాణా మల్పసారాణాం స్తేయం కృత్వా7న్య వేశ్మనః |

చరే త్సాన్తపనం కృచ్ఛ్రం తద్వ దాత్మవిశుద్ధయే. 44

భక్ష్యభోజ్యాపహరణ యానశయ్యాసనస్య చ | పుష్పమూలఫలానాం చ పఞ్చగవ్యం విశోధనమ్‌. 45

తృణకాష్ఠద్రుమాణాం తు శుష్కాన్నస్య గుడస్యచ | చేలచర్మామిషాణాం తు త్రిరాత్రం స్యాదభోజనమ్‌. 46

మణిముక్తాప్రవాళానాం* స్వర్ణస్య రజతస్య చ | అయఃకాంస్యోపలానాం చ ద్వాదశాహం కణాన్నభుక్‌. 47

కార్పాసకీటవర్ణానాం ద్విశ##ఫైకశఫస్యచ | పక్షిగన్దౌషధీనాం చ రజ్జ్వాశ్చైవ త్ర్యహం పయః. 48

ఏతై ర్వ్రతై రపోహన్తి పాపం స్తేయకృతం బుధః |

వధ దోష ప్రాయశ్చిత్తము.

బ్రాహ్మణ క్షత్త్రియ వైశ్యులలో నెవ్వరేకాని అకార్యము (చేయరాని పను) లాచరించినచో ఏమియు ఎక్కువ తక్కువలు పాటింపక వారిచే రాజు ప్రాయశ్చిత్తము లాచరింపజేయవలెను; మోసగించి స్త్రీహత్య చేసినవాడు శూద్ర హత్యావ్రతమాచరించవలెను; సర్పాది ప్రాణులను తాను చంపజాలక ధనము మొదలగునవి ఇచ్చి చంపించిన ద్విజుడు ఒక్కొక్కటిగా కృచ్ఛ్రవ్రతములను ఆచరించి పాపము పోగొట్టుకొనవలయును: పండ్లు ఇచ్చు చెట్లను పూచు పొదలను పల్లులను లతలను నరికి(ంచి)నచో నూరు ఋక్కులను (అవి శాస్త్రమందు చెప్పబడినవి తెలిసికొని) జపించవలెను: ఎముకలు గల ప్రాణులను వందలకొలదిగ చంపి(ంచి) నను బండ్లకొలదిగ ఆ ప్రాణుల చర్మాస్థిమాంసాదికమును నింపించి తోలించినను ద్విజుడు శూద్ర హత్యావ్రతమాచరించవలెను. విప్రులకు దానము కూడ చేయవలెను. అస్థిరహిత ప్రాణులకు చంపి(ంచిన)నచో ప్రాణాయామములతోనే శుద్ధియగును అన్నములయందును రస ద్రవ్యములందును ఫల పుష్పములందును ఉత్పన్నములగు ప్రాణులను చంపి(ంచి)నచో ఘృతప్రాశనముచే శుద్ధుడగును; వనమందు స్వయముగ ఉత్పన్నములగు- దున్ని పండించిన- ఓషధులను అహేతుకముగ నరికినచో ఒక దినము వయోవ్రతమాచరించవలెను; హింసా సముద్భవ పాపమీ విధముగ వ్రతములతో పోగొట్టుకొనవలయును.

చౌర్య ప్రాయశ్చిత్తము.

దొంగతనముతో వస్తువులపహరించిన వారి దోష పరిహార ప్రకారము చెప్పెదను వినుము: ద్విజుడు బుద్ధి పూర్వకముగా తన జాతివారి ధాన్యాన్న ధనములలో నేవి దొంగిలించినను కృచ్ఛ్రార్ధమాచరించవలయును; స్త్రీలను పురుషులను క్షేత్ర( పొలము) గృహములను కూపవాపీస్థజలములను దొంగలించినచో చాంద్రాయణముచే శుద్ధి యగును; అల్ప సారములగు ద్రవ్యముల నితరుల గృహములనుండి హరించినచో సాంతపనకృచ్ఛ్రమాచరించవలయును: భక్ష్యభోజ్యశయ్యా77నన పుష్పమూల ఫలాదుల హరించినచో పంచగవ్య ప్రాశనముతో శుద్ధియగును; గడ్డి కట్టెలు చెట్లు శుష్కాన్నము (ఎండుజొన్నరొట్టె మొదలగునవి) వస్త్ర చర్మ మాంసములు దొంగిలించినచో త్రిరాత్రోపవాసముతో శుద్దుడగును; మణిముక్తా (ముత్తెములు) ప్రవాళ స్వర్ణరజతాయః (ఇనుము) కాంస్యోపలములు(రాలు) దొంగిలించినచో పండ్రెండునాళ్ళు బియ్యపు నూకల అన్నము తినవలెను; దూది (కీటజము- పురుగులనుండి వచ్చునది) పట్టును ఉన్నిని రెండు గిట్టలు గల ఒక- గిట్ట గల ప్రాణులను - పక్షులను -గంధ ద్రవ్యములను ఓషధులను దొంగలించినచో మూడు దినములు క్షీరాహారముతో ఉండ వలెను; దొంగతనముచే కల్గు పాపముల నీవ్రతములతో పోగొట్టుకొనవలెను.

*త్రామస్య.

అగమ్యాగమనీయం తు వ్రతై రేభి రపానుదేత్‌. 49

గురుతల్పవ్రతం కుర్యా ద్రేతో ముక్త్వా స్వయోనిషు |

l శిష్యపుత్త్రస్య పత్నీషు కుమారీ ష్వన్త్యజాసు చ. 50

పితృష్వస్రీయభగినీం స్వస్రీయాం మాతురేవచ |

మాతుశ్చ భ్రాతృభార్యాయాం గత్వా చాన్ధ్రాయణం చరేత్‌. 51

ఏతా స్తిస్రస్తు భార్యార్థే నోపగచ్ఛేత్తు బుద్ధిమా& | జ్ఞాతీశ్చ మాతులేయా స్తే పతితా హ్యుపయన్తి చేత్‌. 52

అమానుషీఘు పురుషో ఉదక్యాయా మయోనిఘు | రేత స్సిక్త్వా జలే చైవ కృచ్ఛ్రం సాన్తపనం చరేత్‌. 53

మైథునం చ సమాలోక్య పుంసి యోషితి వా ద్విజః | గోయానే7ప్సు దివా చైవ సహసా జల మావిశేత్‌. 54

చణ్డాలా న్త్యస్త్రియం గత్వా భుక్త్వాచ ప్రతిగృహ్యచ | పతత్యజ్ఞానతో విప్రో జ్ఞానా త్సామ్యంతు గచ్ఛతి.

విప్రదుష్టాం స్త్రియం భర్తా నిరున్ధ్యా దేకవేశ్మని | యత్పుంసః పరదారేషు తచ్చైనాం చారయే ద్వ్రతిమ్‌.

సా చేత్పునః ప్రదుష్యేత్తు సదృశేనోపమన్త్రితా |

చరే చ్చాన్ద్రాయణం చైవ తత్తస్యాః పావనం స్మృతమ్‌. 57

యః కరోత్యేకరాత్రేణ వృషలీసేవనం ద్విజః | తదేకభు గ్జపేన్నిత్యం త్రిభి ర్వర్షై ర్వ్యపోహతి. 58

ఏషా పాపకృతా ముక్తా చతుర్ణామపి నిష్కృతిః |

అగమ్యాగమన ప్రాయశ్చిత్తము.

ఇక అగమ్యాగమన ప్రాయశ్చిత్తము తెలిపెద వినుము: స్వజాతీయ స్త్రీయోనియందును శిష్యపత్నీ పుత్త్ర పత్నీ కుమారీ యోనులయందును అంత్యజ స్త్రీయోనియందును రేతస్సు విడిచినచో గురు తల్పగమన ప్రాయశ్చిత్తమాచ రించవలయును. మేనత్తను పిన (పెద) తల్లిని మేనమామ భార్యను కూడినచో చాంద్రాయణమాచరించవలెను; వివేకి ఎవ్వడును వీరిలో నెవ్వరినిగాని పెండ్లాడరాదు; జ్ఞాతిస్త్రీలను మేనమామ కూతులను పతితలను పెండ్లాడినను మనుష్యేతర ప్రాణియోనులందును ముట్టుతయోనియందును రేతః సేకమాచరించినను కృచ్ర్ఛసాంతతపన మాచరించవలయును; పురుషుడు ఆచరించు స్వాభావిక మైథునమునుకానిస్త్రీ ఆచరించు (పురుషాయిత) మైథునమును కాని ఎద్దులబండియందో పగటి వేళనో చూచినచో వస్త్ర సమేతుడై జలములందు మునిగి స్నానమాడవలెను; అజ్ఞానముచే చండాలస్త్రీని అంత్యజస్త్రీని పొందినను ఆమెచేతి అన్నము తినినను ఆమెను పెండ్లాడినను పతితుడగును; తెలిసియే ఇవి చేసినచో తత్సముడగును; (పరపురుషుడగు) విప్రునితో కూడి చెడినస్త్రీని (భార్యను) భర్త ఒంటరిగదియందు బంధించి ఉంచి పరదారగమనమున పురుషుడాచరించ వలసిన వ్రతముల నీమెచే ఆచరించ జేయవలయును; ఆమె మరల అదే తప్పు చేసి దోషమందినచో చాంద్రాయణ వ్రతమాచరించి శుద్ధయగును; ఒకరాత్రి వృషలి (శూద్రస్త్రీ)ని పొందిన ద్విజుడు మూడు సంవత్సరములపాటు ప్రతిదినమును ఏకభుక్తము చేయుచు (గాయత్య్రాదికము) జపించవలయును; ఇట్లు నాలుగు వర్ణముల వారును చేయు ఆయా పాపములకు ప్రాయశ్చిత్తములు చెప్పబడినవి.

పతితసంసర్గే ప్రాయశ్చిత్తరూపదణ్డవిధిః ఘటస్ఫోటవిధిశ్చ.

పతితై స్సమ్ప్రయుక్తానా మిమాం శృణుత నిష్కృతిమ్‌. 59

సంవత్సరేణ పతతి పతితేన సమాచర& | యాజనాధ్యాపనాద్యానా దనుయానాశనాసనాత్‌. 60

యో యేన పతితే నైషాం సంసర్గం యాతి మానవః | స తసై#్యవ వ్రతం కుర్యా త్తత్సంసర్గవిశుద్ధయే. 61

వతితస్యోదకం కార్యం సపిణ్డౖ ర్భాన్ధవై స్సహ | నిందితే7హని సాయాహ్ణే జ్ఞాతిభి ర్గురుసన్నిధౌ. 62

దాసీ ఘట మపాం పూర్ణం పర్యస్యే త్ప్రేతవ త్సదా | అహోరాత్రం సపిణ్డానా మాశౌచం బాన్ధవై స్సహ.

l సఖ్యుః పత్త్రస్య.

నివర్తయేరం స్తస్మాత్తు సమ్భాషసహాసనమ్‌ | దాయాదస్య ప్రమాణంచ యాత్రా మేవంచ లౌకికీమ్‌. 64

జ్యేష్ఠకార్యం నివర్తేత జ్యేష్ఠలభ్యం చ యత్పునః |

జ్యేష్ఠాంశం ప్రాప్నుయా చ్చాస్య పాపీయా న్గుణతో7ధికః. 65

పతితసంసర్గ ప్రాయశ్చిత్తము-ఘటస్ఫోట విధానము.

పతితులతో కూడిన దోషమునకు ప్రాయశ్చిత్తము తెలిపెదను వినుము; అనగా పతితునిచే యజ్ఞమో అధ్యయనమో చేయించుట వానితో వివాహ సంబంధాదికము చేయుట కలిసి ప్రయాణించుటచేసినవాడు తానును పతితుడగును; ఏదోషముచే పతితుడగు వానితో వీనికి సంసర్గము కలిగెనో ఆదోషమున కాచరించవలసిన ప్రాయశ్చిత్తమీతడాచరించిన పాప పరిహార మగును.

ప్రాయశ్చిత్తమొనర్చుకొనని పతితునకు ఘటస్ఫోటము.

పతితుని జ్ఞాతులును నపిండులును బాంధవులును (అమావాస్యవంటి) అశుభదినము సాయాహ్నమున పెద్దల సన్నిధిలో పతితునగు తిలోదక మీయవలెను; దాసిచే నీటితో నిండిన కడవను తెప్పించి దానిని అప్రదక్షిణముగా త్రిప్పి ఎత్తివేసి బ్రద్దలు చేయవలెను; వీరందరును వానికై ఒక అహోరాత్రముపవానముండి ఆశౌచము పాటించవలెను; వీరందరును వానితో సంభాషణమును కలిసి కూర్చుండుట మొదలగు వానిని లౌకిక వ్యవహారములను దాయాదవ్యవహార మును విడువవలయును; అంతేకాదు; వానికి అన్నదమ్ములలో జ్యేష్ఠుడగుటచే ఉండు అధికారములును పైతృకమగు ఆస్తిలో జేష్ఠ భాగమును లేకుండ పోవును; అవి అన్నియు గుణాధికుడగు అతని తమ్మునకు సంక్రమించును.

స్థాపితాం చాపి మర్యాదాం యే భిన్ద్యుః పాపకర్మిణః | సర్వే పృథ గ్దణ్డనీయా రాజ్ఞా ప్రథమసాహసమ్‌. 66

శతం బ్రాహ్మణ మాక్రుశ్య క్షత్త్రియో దణ్డ మర్హతి | వైశ్యస్తు ద్విశతం రాజ ఞ్చూద్రస్తు వధ మర్హతి. 67

పఞ్చాష ద్బ్రాహ్మణో దణ్డ్యః క్షత్త్రియస్యాభిశంసనే | వైశ్యస్తు సార్ధపఞ్చాశ చ్ఛూద్రే ద్వాదశకో దమః. 68

క్షత్త్రియాస్యాప్నుయా ద్వైశ్వ స్సాహసం పునరేవచ |

శూద్రః క్షత్త్రియ మాక్రుశ్య జిహ్వాచ్ఛేదన మాప్నుయాత్‌. 69

పఞ్చాశ తక్షత్త్రియో దణ్డ్య స్తథా వైశ్యాభిశంసనే | శూద్రే చైవార్ధపఞ్చాశ త్తథా ధర్మో న హీయతే. 70

వైశ్యస్యాక్రోశ##నే దణ్డ్య శ్శూద్రశ్చోత్తమసాహసమ్‌ | శూద్రాక్రోశే తథా వైశ్య శ్శతార్ధం దణ్డ మర్హతి. 71

సవర్ణా క్రోశ##నే దణ్డ్య స్తథా ద్వాదశకం స్మృతమ్‌ | వాదే ష్వవచనీయేషు తదేవ ద్విగుణం భ##వేత్‌. 72

ఏకజాతి ర్ద్విజాతించ దారుణం యా77క్షిపే ద్భువి |

జీహ్వాయాః ప్రాప్నుయాచ్ఛేదం జఘన్యః ప్రథమో హి నః. 73

నామజాతిగృహం తేషా మభిద్రోహేమ కుర్వతః |

విక్షేప్యో7యోమయ శ్శఙ్కు ర్జ్వలా న్నాస్యే దశాఙ్గుళః. 74

ధర్మోపదేశం శూద్రస్తు ద్విజానా మభికుర్వతః| తప్త మాసేచయే త్తైలం వక్త్రే శ్రోత్రేచ పార్థివః. 75

శ్రుతిం దేశంచ జాతించ కర్మ శారీర మేవచ | వితథంచ బ్రువ న్దణ్డ్యో రాజా ద్విగుణసాహసమ్‌. 76

యస్తు పాతక సంయుక్తః క్షిపే ద్వర్ణాన్తరం నరః |

ఉత్తమం సాహసం తస్మి న్దణ్డః పాత్యో యథాక్రమమ్‌. 77

రాజ్ఞో నివేశనియమం వితథం యాన్తి వై మిథః | సర్వే ద్విగుణదణ్డ్యాస్తే వివ్రలమ్భా న్నృవస్య తు. 78

ప్రీత్యా మయా7స్యాభిహితం ప్రమాదేనాథవా పదేత్‌ |

భూయో న చైవం వక్ష్యామి స తు దణ్డార్ధభా గ్భవేత్‌. 79

కాణం వా7వ్యథవా ఖఞ్ద మన్ధం చాపి తతావిధమ్‌ | తథై వాపి బ్రువన్దాప్యో దణ్డం కార్షాపణం ధనమ్‌. 80

మాతరం పితరం జ్యేష్ఠం భ్రాతరం శ్వశురం గురుమ్‌ |

ఆక్రోశయ ఞ్ఛతం దణ్డ్యః పన్థానం చార్దయ న్గురోః. 81

శాస్త్రధర్మాను సారముగ నేర్పరచిన మర్యాదలను ఉల్లంఘించి నడుచు పాపకర్ములను ప్రతియొకరిని రాజు వేరు వేరుగ ప్రథమశ్రేణికి చెందిన (సహస్రకార్ఫాపణముల) దండముతో దండించవలయును; బ్రాహ్మణుని తిట్టిన క్షత్త్రియుని నూరు పణములతోను వైశ్యుని రెండువందల పణములతోను శూద్రునైనచో వధముతోను దండించవలయును; బ్రాహ్మణుడు క్షత్త్రియుని తిట్టినచో ఏబది పణములతోను వైశ్యుని తిట్టినచో ఇరువది యైదు పణములతోను శూద్రుని తిట్టినచో పండ్రెండు పణములతోను దండించవలయును; క్షత్రియుని నిందినచిన వైశ్యుని నూరు పణములతోను శ్రూదుని తిట్టినచో అతని సహస్ర పణములతోను వైశ్యుడు శూద్రుని తిట్టినచో అతనిని ఏబది పణములతోను దండించవలయును; వీరిలో ఎవరికివారు తమ జాతివారిని తిట్టినచో పండ్రెండు పణములతోను అనరాని మాటలు అని తిట్టినచో ఇరువది పణము లతోను దండించవలయును; ఏకజాతివాడు (శూద్రుడు) ద్విజాతి వానిని (బ్రాహ్మణ క్షత్త్రియ వైశ్యులలో నెవనినైనను) దారుణ వాక్కుతో తిట్టినచో ఆశూద్రుని జిహ్వాచ్ఛేదము చేయవలెను; ఏలయన అతడు తక్కువజాతి వారిలో మొదటి వాడుగదా! ఏకజాతి ద్విజాతివానిని నామజాతి గృహములు (ఇంటి మర్యాద మొదలగునవి) ఎత్తి తిట్టనచో వాని నోటిలో మండుచున్న పండ్రెండంగుళముల అయోమయ శంకువు నుంచవలయును; శూద్రుడు బ్రాహ్మణునకు ధర్మోపదేశము చేయుదునని వచ్చినచో రాజు వాని నోటిలోని చెవులలోను క్రాగుచున్న నూనె పోయించవలెను. వేదశాస్త్రాధ్యయనమును దేశమును జాతిని శారీరకమయిన కర్మమును ఒక విధముగానున్న దానిని మరొక విధముగా ననుచు( అనగా శాస్త్రము చదివిన వానిని చదువలేదని- ఒకజాతి వానిని నీవీజాతివాడవు కావని ఒకదేశపు వానిని నీవాదేశపు వాడవుకావని ఒక మంచి పనిని చేసిన వానిని నీవాపనిని చేయనేలేదని తిట్టినచో) తిట్టిన వానికి రాజు రెండువేల పణములు దండముగా విధించవలయును; స్వతః తాను పాతకుడయి యుండియు మరియొక జాతివానిని తిట్టిన వానిని వేయి పణములతో దండించవలయును; కొందరు కలిసి ఒకటియై రాజేర్పరచిన నియమము సరియైనదికాదని నిందించిన వారిని వేరువేరుగా ద్విగుణ (రెండువేల పణముల) దండముతో దండించవలెను; ఏలయన వారందరు (ఎదిరించు) చున్నారు; ఒకరు ఇంకొకరిని నిందించిన సందర్భములలో "నేను ఇతనియందలి 'ప్రీతి''చనవు' చే అంటిని" "పొర బాటున అంటిని" ఇక మీదట ఇంకెప్పుడు అనను." అని చెప్పినచో వాడు దండమునకు పాత్రుడు కాడు; మెల్లకంటి వానిని గ్రుడ్డివానిని కొంకుల కాళ్లవానిని ఇట్లే అంగవైకల్యము కలవానిని ఆ మాట అనినచో వానికి ఒక కార్షాపణధనము దండముగా విధించవలెను; తల్లిని తండ్రిని అన్నను మామగారిని గురుని (పెద్దలను) తిట్టినను గురు(వు నడచు) మార్గమున ఏబాధ (ఆటంకము) కలిగించినను అట్టివానిని శత పణములతో దండించవలెను.

గురు వర్జ్యంతు మార్గార్హాం యో హి మర్గం యచ్ఛతి |

స దాప్యః కృష్ణలం రాజ్ఞ స్తన్య పాపస్య శాన్తయే. 82

ఏకజాతి ర్ధ్విజాతిం చ యేనాఙ్గేనాపరాధ్నుయాత్‌ | తదేవ చ్ఛేదయే త్తస్య క్షిప్రమేవావిచారయ&.83

అవనిష్ఠీవతో దర్పాద్ద్వావోష్ఠౌ ఛేదయే న్నృప | అవమూత్రయతో మేఢ్ర మపశబ్దయతో గుదమ్‌. 84

సహాసన మభిప్రేప్సురుత్కృష్టస్యాపకృష్టజః |

కట్యాం కృతాఙ్కో నిర్వాస్య స్స్ఫిచం వా7ప్యస్య కర్తయేత్‌. 85

కేశేషు గృహ్ణతో హస్తం ఛేదయే దవిచారయ& | పాదయో ర్నాసికాయాంచ గ్రీవాయాం వృషణషు. 86

త్వగ్భేదక శ్శతం దణ్డ్యో లోహితస్య చ దర్శకః | మాంసభేత్తాచ షణ్ణిష్కా న్నిర్వాస్య స్త్వస్థిభేదకః. 87

అఙ్గభఙ్గకరస్యాఙ్గం తదేవావహరే న్నృపః | దణ్డపారుష్యకృద్దండ్యః సముత్థానవ్యయం తథా. 88

అర్ధపాదకరః కార్యో గోగజాశ్వోష్ట్రఘాతుకః | పశుక్షుద్రమృగాణాంచ హింసాయాం ద్విగుణో దమః. 89

పఞ్చాశచ్చ భ##వేద్దణ్డ్య స్తథైవ మృగపక్షిషు | క్రిమికీటేషు దణ్డ్య స్స్యా ద్రజతస్య చ మాషకమ్‌. 90

తస్యానురూప్య మౌల్యం ప్రదద్యా త్స్వామినే తథా | స్వస్వామికానాం సకలం శేషాణాం దమమేవచ. 91

వృక్షంతు సఫలం ఛిత్వా సువర్ణం దణ్డ మర్హతి | ద్విగుణం దణ్ణయేచ్చైనం పథి సీమ్ని జాలాశ##యే. 92

చేదనా దఫలస్యాపి మధ్యమం సాహసం స్మృతమ్‌ | గుల్మవల్లీలతానాం చ సువర్ణస్యచ మాషకమ్‌. 93

వృథాచ్ఛేదీ తృణస్యాపి దండః కార్షాపణం భ##వేత్‌ | త్రిభాగం కృష్ణలా దణ్డ్యాః ప్రాణిన స్తాడనే తథా. 94

దేశకాలానురూపేణ మూల్యం రాజా ద్రుమాదిషు | తత్స్వామినే తథా దద్యా ద్దణ్డముక్తంతు పార్థివ. 95

గురువు కాకున్నను త్రోవవిడువదగిన వారికి త్రోవనీయని వాడు తత్పాపశాంతికై రాజునకు ఒక కృష్ణలము దండముగా చెల్లించవలెను; శూద్రుడు ద్విజునకు ఏ అవయవముతో అపరాధము చేయునో వాని ఆ అవయవమును అవిచారి తముగా శీఘ్రమే ఛేదించవలెను; ఎట్లన- దర్పముతో ఉమిసినచో రెండు పెదవులను- మూత్రించినచో మేఢ్రమును- అపశబ్దము (అపాన వాయుధ్వని) చేసినచో గుదమును ఛేదించవలెను; గొప్పవానితో సహాసనము కోరినవాని కటిని ఛేదించి గురుతు కలుగునట్లు

వెడలగొట్టవలెను; లేదా వాని పిరుదును నరుకవలెను; జుట్టు పాదములు నాసిక మెడ వృషణములు పట్టినచో అవిచారితముగా శీఘ్రమే వాని హస్తము(ల)ను ఛేదించవలెను; చర్మము రేగునట్లును రక్తము కారునట్లును గాయపరచిన వానిని నూరు దుడ్డులతోను మాంసము వెలికివచ్చునట్లు గాయపరచినవానిని ఆరు పణములతోను దండించవలెను; ఎముకలు విరుగునట్లు కొట్టినవానిని ఊరినుండి వెడలకొట్టవలెను; ఇతరులకు అంగ వైకల్యము కలిగించినవాని అదే అవయవము తొలగించవలెను; దండ పారుష్యము (తప్పునకు మించిన దండనము) చేసిన వానిచే అందువలన కలిగిన నష్టపు పరిహారమిప్పించవలెను; గోవులను గజములను అశ్వములను ఉష్ట్రములను చంపిన వాని కాలు సేతులు సగము సగము నరుకవలెను; హానికరములు గాని పశువులను క్షుద్ర మృగములను హింసించినవానికి ద్విగుణమగు (రెట్టింపని అర్థముకాదు; రెండవ శ్రేణికి చెందిన) నూరు కార్షాపణముల దండము విధించవలెను; మృగపక్షుల హింసించిన వానిని ఏబది పణముల తోను క్రిమికీటాదులకు అకారణముగ హింస కలిగించిన వానిని మినుపగింజ తూకపు వెండితోను దండించవలెను; ఇది కాక ఆ ప్రాణులస్వామికి వానికి (కలిగిన నష్టమునకు) తగిన మూల్యమును కూడ ఇప్పించవలెను స్వస్వామి సంబంధము కల మిగిలిన వాని విషయమందును దండ విధానము ఇట్లేయని ఎరుగవలెను; పండ్లుకల వృక్షమును ఛేదించిన వానిని నవరసు బంగారుతోను ఆవృక్షము మార్గము ప్రక్కనో ఊరి పొలిమేరమీదనో జలాశయ తీరమందో ఉన్నదైనచో రెట్టింపు దండముతోను దండించవలెను; అఫలమగు వృక్షమును ఛేదించిన వానిన రెండవ తరగతి (నూరు పణముల) దండము తోను పొదలు వల్లులు లతలు అకారణముగా ఛేదించినచో మాషపు తూకపు బంగారుతోను దండించవలెను; గడ్డినైనను వ్యర్థముగ నరకినచో కార్షాపణము దండము; ప్రాణులను అకారణముగ కొట్టినచో మూడు కృష్ణపములను వెండి నాణములు దండము; వృక్షాదికమును నరకినచో దానికి దేశకాలానుసారమగు వెలను వాని సొంతదారునకిప్పించుటతోవాటు శాస్త్రానుసారముగ ఆ అపరాధమునకు దండము కూడ విధించవలెను; (దండధనము రాజునకు చెందును).

యత్రాతివర్తతే యుగ్యం వైగుణ్యా త్ప్రాజకస్యతు | తత్ర స్వామీ భ##వే ద్దణ్డ్యో నాప్తశ్చేత్ప్రాజకో భ##వేత్‌.

ప్రాజకశ్చ భ##వే దాప్తః ప్రాజకో దణ్డమర్హతి | నాస్తి దణ్డశ్చ తస్యాపి తాథావై హేతుకల్పకః. 97

ద్రవ్యాణి యో హరేద్యస్య అజ్ఞానా ద్‌జ్ఞానతోపి వా (జానతో7జానతో7 పివా) |

స తస్యోత్పాదయే త్తుష్టిం రాజ్ఞో దద్యా త్తతో దమమ్‌. 98

యస్తు రజ్జుం ఘటం కూపా ద్దరే ద్భిన్ద్యాచ్చ తాం ప్రపామ్‌ |

స దణ్డం పాప్నుయా న్మాషం తచ్ఛ సమ్ప్రతిపాదయేత్‌. 99

ధాన్యం దశభ్యః కుమ్భేభ్యో హరతో7 భ్యదికం వధః | శేషే7ప్యేకాదశగుణం తస్య దణ్డం ప్రకల్పయేత్‌. 100

తథా భక్ష్యాన్నపానానాం న తథా7ప్యధికే వధః | సువర్ణరజతాదీనా ముత్తమానాం చ వాససామ్‌. 101

పురుషాణాం కులీనానాం నారీణాం చ విశేషతః | మహాపశూనాం హరణ శస్త్రాణా మౌషధస్య చ. 102

మూఖ్యానాం చైవ రత్నానాం హరణ వధ మర్హతి | దధ్నః క్షీరస్యతక్రస్య పానీయస్యరసస్యచ. 103

వేణువైదళభాణ్డానాం లవణానాం తథైవ చ | మృణ్మయానాం చ సర్వేషాం మృదో భస్మన ఏవచ. 104

కాలమాసాద్య కార్యంచ రాజా దణ్డం ప్రకల్పయేత్‌ | గోషు బ్రాహ్మణ సంస్థాసు మహిషీషు తథైవచ. 105

అశ్వాపహారకశ్చైవ సద్యః కార్యో7ర్ధపాదకః| సూత్రకార్పాసకిణ్వానాం గోమయస్య గుడస్య చ. 106

మత్స్యానాం పక్షిణాంచైవ తైలస్య చ ఘృతస్య చ | మాంసస్య మధునశ్చైవ యావా న్యస్త్వన్యసమ్భవః. 107

అన్యేషాం లవణాదీనాం మద్యానా మోదనస్యచ |

పక్వాన్నానాం చ సర్వేషాం తన్మూల్యా ద్ద్విగుణో దమః. 108

పుష్పేషు హరితే ధాన్యే గుల్మవల్లీలతాసు చ | అన్నేషు పరిపూర్ణేషు దణ్డస్స్యా త్పఞ్చమాషకమ్‌. 109

పరిపూర్ణేషు ధ్యానేషు శాకమూలఫలేషు చ | నిరస్వయే శతం దణ్డ్య స్సాన్వయే ద్విశతం దమః. 110

యేన యేన యథా7ఙ్గేన స్తేనో7న్యేషు విచేష్టతే | తత్తదేవ హరేత్తస్య ప్రత్యాదేశాయ పార్థివః. 111

బండిని తోలెడివాని తప్పిదమున ఎద్దులు సరిగా నడువక బండి బోల్తాపడుట మొదలగునవి జరిగి నరకునకో మనుష్యులకో ఏహాని కలిగినను అది కలుగునపుడు ప్రాజకుడు (తోలెడువాడు) ఎదురుగ లేనిచో ఆ బండి సొంతదారునకును ఎదురుగనున్నచో ఆ ప్రాజకునకును దండము విధించవలెను; దుస్సంఘటనకు ప్రాజకుడు హేతువు కానిచో వానికి ఏశిక్షయు విధించరాదు; తెలిసియో తెలియకయో (నరకుల సొంతదారునకు తెలియునట్లో తెలియనట్లో) ఇతరుల ద్రవ్య మపహరించినవాడు మొదట ఆ స్వామినా విషయమున సంతృప్తుని చేయవలెను; చేసిన తప్పిదమునకుగాను రాజునకు దండమును (జుర్మానా- Fine) చెల్లింపవలెను; (ఇది ఈ విధమగు స్వస్వామితా సంబంధముగల వాని విషయమున జరుగు అన్ని అపరాధములయందును వర్తించు సామాన్యరీతి) (జనులకందరకుపయోగించు) బావినుండు కడవనుగాని చేదు త్రాటినిగాని హరించినవాడు అవి తిరిగి తెచ్చి అమర్చవలెను: మాష పరిమాణపు వెండి దండమీయవలెను; ఒకవేళ ఆ నీటి సౌకర్యమునకు ఏ హానినైన కలిగించినను ఇదే దండనము; పది కడవల (కొలత) కంటె ఎక్కువ ధాన్యము దొంగిలించిన వానికి మరణమే దండము; అంతకంటే తక్కువ దొంగలించిన సందర్భములందును ఆ దొంగలించినంతకు పదునొకండు రెట్ల ధాన్యము దండముగ విధించవలెను; భక్ష్యాన్నపానములు అధిక పరిమాణములో దొంగిలించినను వధము విధించరాదు; సువర్ణము రజతము ఉత్తమ వస్త్రములు గొప్పవంశమందు జన్మించిన పురుషులను విశేషించి స్త్రీలను మహాపశువులను శస్త్రములను ఔషధములను మహా రత్నములను హరించినచో అపరాధికి వధ దండము విధించ వచ్చును; పెరుగు పాలు మజ్జిగ పానీయములు రసద్రవ్యములు వెదురు బ్రద్ధలతో చేసిన బుట్టలు తడికలు మొదలగునవి లవణములు మృణ్మయ పాత్రాదికము మన్ను భస్మము దొంగలించినచో కాలమును చేసిన అపరాధ కార్యమును అనుసరించి దండము విధించవలెను; బ్రాహ్మణుల ఇండ్లయందలి గోవులను ఎనుము (గేదె)లను అశ్వములను హరించినవానికి వెంటనే కాళ్ళు సగము నరకించవలెను; దారము ప్రత్తి- కిణ్వము (తెలికపిండి) గోమయము బెల్లము చేపలు పక్షులు తైలము ఘృతము మాంసము తేనె ఆయా ఈ వస్తువులనుండి ఉత్పన్నములగు ద్రవ్యములు ఇతర విధములగు లవణములు అన్నము మద్యములు పక్వాన్నము (పిండివంట)లు దొంగలించినచో వాటి వెలకు రెట్టింపు దండముగా విధించవలయును; పుష్పములు పచ్చని ధాన్యములు పొదలు వల్లులు లతలు పరిపూర్ణాన్నములు- ఇవి దొంగలించినవానికి ఐదు మాషముల తూకపు వెండి దండము; పరిపూర్ణ ధాన్యములు శాకమూల ఫలములు దొంగలించినవానికి అతడు ఒక్కడే వచ్చి దొంగలించినచో నూరు కార్షాపణములును తనకు తోడు మరికొందరిని కూడ తెచ్చికొనినవానికి రెండువందల కార్షాపణములును దండము; ఆయా దొంగతనములందు దొంగ ఏ యవయవములతో ఎట్లు పనిచేయునో వాని ఆయా అవయవమునట్లే హరించి ప్రత్యాదేశము ( ఆ పని అట్లు చేయనీయకుండుట) కలిగించవలెను.

ద్విజో7ధ్వగః క్షీణవృత్తి ర్ద్వావిక్షూ ద్వే చ మూలకే |

త్రపుసోర్వారుకౌ ద్వౌ చ తావన్మాత్రం ఫలేషు చ. 112

యథా చ సర్వధన్యానాం ముష్టిగ్రాహేణ పార్థివ | శాకే శాకప్రమాణన గృహ్యమాణన దుష్యతి. 113

వానస్పత్యం మూలఫలం దార్వగ్న్యర్థం తథైవ చ |

తృణం గో7భ్యవహారార్థ మస్తేయం మను రబ్రవీత్‌. 114

అదేవవాటికా పుష్పం దేవతార్థం తథైవ చ | ఆదదానః పరక్షేత్రా న్న దణ్డం దాతు మర్హతి. 115

శృఙ్గిణాం నఖినాం రాజ న్దంష్ట్రిణాం వా వధోద్యతమ్‌ |

యో హన్యా న్న స పాపేన లిప్యతే మనుజేశ్వర. 116

*శస్త్రోద్యతకరం చైవ బ్రాహ్మణం వా బహుశ్రుతమ్‌ |

ఆతతాయిన మాయాన్తం హన్యాదే వావిచారయ&. 117

ఆతతాయివధే దోషో హస్తు ర్భవతి కశ్చన | ప్రకాశంవా7ప్రకాశం వా మన్యు స్తం మన్యు మృచ్ఛతి. 118

గృహక్షేత్రాభిహర్తార స్తథా7గమ్యాభిగామినః | అగ్నిదో గరదశ్చైవ తథా చాభ్యుద్యతాయుధః. 119

అభిచారం కుర్వాణో రాజగామిచ పైశునమ్‌ | ఏతేహి కథితా లోకే ధర్మజ్ఞై రాతతాయినః. 120

పరస్త్రీణాంచ సమ్భాషే తీర్థే7రణ్య గృహేపి వా |

నదీనాం చైవ సమ్భేదై స్స సఙ్గ్రహణ మాప్నుయాత్‌. 121

న సమ్భాషే త్సహ స్త్రీభిః ప్రతిషిద్ధః పుమాన్కిల | యస్తు సమ్భాషేతే స్త్రీభిః స్సువర్ణందణ్డ మర్హతి. 122

నైష చైరణదారేషు విధి రాత్మోవజీవిషు | సజ్జయన్తి మనుషై#్యస్తా నిగూఢం వా చరస్త్యుత. 123

కిఞ్చిదేవతు దాప్య స్స్యాత్సమ్భాషేణాపచారయ& | ప్రేష్యాసు చైవ సర్వాసు గృహప్రప్రజితాసు చ. 124

యో7కామాం దూషయే త్కన్యాం స సద్యో వధ మర్హతి |

ద్విజునకు త్రోవనడుచుచు జీవమునకు (దారిబత్తెమునకు) ఏమియు లేనందున రెండు చెరుకుగడలో ముల్లంగి దుంపలో (చేదుదోన) బుడమకాయలో దోసకాయలో రెండు ఏవయిన పండ్లో పిడికెడు ధాన్యపు కంకులో కూరకు సరిపోవునంత ఆకు కూరయో దొంగలించినను అది దోషముకాదు; పండ్లు దుంపలు వానస్పత్యములు (పూచి కాచుకాయలు) అగ్న్యర్థమయిన కట్టెలు ఆవు మేతకైన గడ్డి స్వామ్యనుమతి లేకుండ తీసికొన్నను దొంగతనము కాదని మను వచనము; దేవాలయమందలి కాని పూవులు దేవతార్థమై పరక్షేత్రమునుండి తాత్స్యమినడుగక తీసికొనినను దండార్హుడుకాడు ; కొమ్ములు గోళ్ళు కోరలు కల ప్రాణులను తను చంపబూను వానిని చంపినను పాపముకాదు; ఆతతాయియగువాడు తన కెదురు పడినపుడు ఆ ఆతతాయి తనకు గురుడయినను బాలుడో వృద్ధుడో బహు శాస్త్రాధ్యేతయగు బ్రాహ్మణుడో అయినను వానిని ఆలోచించకయే చంపివేయవలెను; అది దోషముకాదు. ఈ ఆతతాయివధాపరాధము ప్రకాశముగా జరిపినను అప్రకాశముగా జరిపినను దీని దోషము ఆ అపరాధిని అంటుకొనదు. గృహములను క్షేత్ర (పొలము)లను బల

*గురుంవాబాలంవృద్ధంవా

వంతముగ హరించువారు పొందరాని స్త్రీని పొందువారు ఇండ్లకు మఠాదులకు నిప్పు పెట్టువారు విషమపెట్టువారు ఇతరుల హింసిచువారు తలపుతో ఎల్లప్పుడు ఆయుధములు పూని తిరుగుచుండువారు అభిచారకర కర్మలాచరించువారు ప్రభువు కడచేరి ఇతరులపై కొండెములు చెప్పువారు ధర్మజ్ఞులచే ఆతతాయులనబడుదురు. భిక్షుకులు పురుషులేకాని స్త్రీలేకాని పాటలు పాడి జీవించువాడుగాని వలదనినను ఇంటిలోపలికి చొరబడినచో రెట్టింపు దండమునకుల (రెండవశ్రేణికి చెందిన నూరు పణముల దండమునకు) అర్హులగుదురు. తీర్థమునందు అరణ్యమందు గృహమందు నదీ సంగమములందు పరస్త్రీలను అకారణముగ మాటలాడించినచో వానిని చెరయందుంచవలయును. తనతో మాటలాడరాదని నిషేధించుచున్నను ఆ స్త్రీలతో మాటలాడినవానికి ఒక సువర్ణము(నవరసు బంగారము). దండము. తన శక్తి పై తానాధారపడి జీవించు చారణ దారల (గాయన నర్తక స్త్రీల) విషయమున ఈ నిషేధములును దండములను వర్తించవు. ఏలయన వారు మనుష్యులతో కలిసియే కాని రహస్యముగాగాని జీవించుచుందురు. అయినను ఇట్టి చారణ దారలతోగాని దాసీజనముతోగాని గృహము లందును మఠాదులందును పనులతో తిరుగుచుండు స్త్రీలతోగాని అకారణముగా మాటలాడినవానికిని రాజు ఏ దేని కొంత దండము విధించవలయును. ఇష్టపడని కన్యను చెరచిన వానిని వెంటనే వధించవలెను.

సకామాం దూషయే ద్యస్తు ప్రాప్నుయా ద్ద్విశతం దమమ్‌. 125

భిక్షుకో7ప్యథావా నారీ యే7పి చాన్యే కురీతయః | ప్రవిశేత్ప్రతిషిద్ధస్తు ప్రాప్నుయా ద్ద్విశతం దమమ్‌. 126

యశ్చసంచారక స్తత్ర పురుష స్స తథా భ##వేత్‌ | పారదారికవద్దణ్ద్యో యో7పి స్యాదవకాశదః. 127

బలా త్సన్దూషయే ద్యస్తు పరభార్యాం నరః క్వచిత్‌ | వధో దణ్డో భ##వేత్తస్య నాపరాధో భ##వేత్త్స్రియః. 128

రజ స్తృతీయాం యా కన్యా స్వగృహే ప్రతిపద్యతే | అదణ్డ్యా సా భ##వేద్రాజ్ఞా వరయన్తీ పతిం స్వయమ్‌. 129

స్వదేశే కన్యకాం దత్వా తామాదాయ తథా వ్రజేత్‌ | పర దేశే భ##వే ద్వధ్యస్త్స్రీచోర స్స తదా భ##వేత్‌. 130

అద్రవ్యాం మృతపత్నీంతు సఙ్గృహ్ణ న్నాపరాధ్యతి |

సద్రవ్యాంతాం సఙ్గ్రహీతా దణ్ణ ముత్తమ మర్హతి. 131

ఉత్కృష్టం యా భ##జే త్కన్యా దేయా తసై#్యవ సా భ##వేత్‌ |

జఘన్యా న్త్సేవమానాం తాం సంయతాం వాసయే ద్గృహే. 132

ఉత్తమాం సేవమానస్తు జఘన్యో వధమర్హతి | జఘన్య ముత్తమా నారీ సేవమానా తథైవచ. 133

భర్తారం లఙ్ఘయే ద్యా స్త్రీ స్వజ్ఞాతిబలదర్పితా | తాం చ నిష్కాసయే ద్రాజా సంస్థానే బహుసంస్థితే. 134

హృతాధికారాం మలినాం పిణ్డమాత్రోపజీవినమ్‌ | వాసయే త్స్వైరిణీం నిత్యం సవర్ణేనాభిదూషితమ్‌. 135

జ్యాయసా దూషితా నారీ ముణ్డనం సమవాప్నుయాత్‌ |

వాసశ్చ మలినం నిత్యం శిఖాః సమ్ప్రాప్నుయా ద్దశ. 136

బ్రాహ్మణః క్షత్త్రియో వేశ్యః క్షత్త్రవిట్ఛూద్రయోషితః |

వ్రజ న్దణ్డ్యో భ##వే జ్రాజ్ఞా దణ్డ ముత్తమసాహసమ్‌. 137

ఇష్టపడు (కామయానయగు) కన్యను కూడిన వానిని రెండు వందల పణములతో దండించవలయును. ఇట్టి అకృత్యములకు అవకాశమిచ్చినవానికిని పరదార గమనము చేసిన వానికి వలెనే దండము విధించవలయును. స్త్రీయందు ఏమాత్రము దోషములేనిదే బలాత్కారమును పరస్త్రీని చెరచినవానిని వధించవలెను. మూడవమారు రజస్వలయైన తరువాత తాను పితృ గృహమందవివాహితయైయుండి తానే స్వయముగ పతిని వరించినచో రాజామెకు దండించవని లేదు. తన కుమా ర్తెను తన దేశమందాతనికిచ్చి పెండ్లిచేసి తరువాత ఆమెను తీసికొని పరదేశమునకేగినవాడు స్త్రీ చోరుడే యగును. కావున రాజు వానిని చంపవలయును. పతి మరణించిన ధనహీన స్త్రీని ఉంచుకొన్నవానిని దండించపనిలేదు. ఆమె ధనవతియగుచో ఇతనిని ఉత్తమ (వేయి పణముల) దండముతో దండించవలెను. తన యోగ్యతను బట్టి అంత కంటె ఉత్కృష్టుడగు వరుని తానై వరించిన కన్యను అతనికే ఇచ్చి పెండ్లి చేయవలెను. తక్కువ వానిని వలచినచో ఆ కన్యను ఇంట బంధించి ఉంచవలెను. తన వర్ణముకంటె ఉత్తమ వర్ణపుస్త్రీని కూడినవానిని వధించవలెను. ఉత్తమ వర్ణ స్త్రీ అధమవర్ణుని కూడినచో ఆమెను వధించవలయును. తన పుట్టినింటి వారి బలము చూచుకొని దర్పించి భర్తను ఎదిరించి స్త్రీని రాజు బహుజనులున్న సంస్థానమందవమానించి దేశమునుండి బహిష్కరించవలెను. సవర్ణునితో (తన జాతి పరపురుషునితో) కూడి అపవిత్రమయిన సై#్వరిణీ స్త్రీని (కుటుంబమందు) ఆమెకు గల అధికారములన్నియు తొలగించి పిండ( పొట్టకు చాలినంత అన్నము) మాత్రముతో జీవించుచుండునట్లు చేసి ఉంచవలెను. తనకంటె అధికవర్ణునిచే అపవిత్రమయిన స్త్రీకి మలిన వస్త్రము ధరింపనిచ్చి పది శిఖలుండునట్లు తల గొరిగించవలయును. బ్రాహ్మణుడు క్షత్త్రియ స్త్రీని క్షత్త్రియుడు వైశ్యస్త్రీని వైశ్యుడు శూద్రస్త్రీని పొందినచో ఇట్టివారిని ఉత్తమ (వేయి పణముల) దండముతో దండించవలయును.

వైశ్యాగమేతు విప్రస్య క్షత్త్రియ స్యాన్త్యజాగమే |

మధ్యమం ప్రథమం వైశ్యో దణ్డ్య శ్శూద్రగమా ద్భవేత్‌. 138

శూద్ర స్సవర్ణాగమనే శతం దణ్డ్యో మహీక్షితా | వైశ్యాస్చ ద్విగుణం రాజ నక్షత్త్రియా స్త్రిగుణం తథా. 139

బ్రాహ్మణశ్చ భ##వే ద్దణ్డ్య స్తథా రాజం శ్చతుర్గుణమ్‌ | అగుప్తాసు భ##వే ద్దణ్డ స్సుగుప్తా స్వధికో భ##వేత్‌. 140

మాతా పితృష్వసా శ్వశ్రూ ర్మాతులానీ పితృవ్యజా | పితృవ్యసఖిశిష్యస్త్రీ *భగినీ తత్సఖీ తథా. 141

భాగినేయీ తథా77త్రేయీ రాజపత్నీ తథైవ చ | తథా ప్రప్రజితా నారీ వర్ణోత్కృష్టా తథైవ చ. 142

ఏతా హ్యగమ్యా నిర్దిష్టా స్తాసాంతు గమనే నరః | శిశ్నస్య కర్తనం ప్రాప్య తతస్తు వధ మర్హతి. 143

భ్రాతృభార్యాగమే పూర్వా ద్దణ్డస్తు ద్విగుణో మతః |

చణ్డాలీం చ శ్వపాకీం చ గచ్ఛ న్వధ మవాప్నుయాత్‌. 144

తిర్యగ్యోనౌచ గోవర్జం మైతునం యో నిషేవతే |

వపనం ప్రాప్నుయా ద్దణ్డం తస్యాశ్చ యవసాదికమ్‌. 145

సువర్ణం చ భ##వేద్దణ్డ్యో గాం వ్రజ న్మనుజాధిప |

వేశ్యాగామీ ద్విజో దణ్డ్యో వేశ్యాశుల్కం సమం వణమ్‌. 146

గృహీత్వా వేతనం వేశ్యాలోభా దన్యత్ర గచ్ఛతి | వేతనం ద్విగుణం దద్యా ద్దణ్డంచ ద్విగుణం తథా. 147

అన్యముద్దిశ్య యో వేశ్యాం నయే దన్యస్య కారయేత్‌ |

తస్య దణ్డో భ##వే ద్రాజ స్త్సువర్ణస్య చ మాషకమ్‌. 148

నీత్వా భోగా న్న యో దద్యా ద్దాప్యో ద్విగుణవేతనమ్‌ |

రాజ్ఞశ్చ ద్విగుణో దణ్డ స్తథా ధర్మో న హీయతే. 149

బహునాం వ్రజతా మేకాం సర్వే తే ద్విగుణం దమమ్‌ |

దద్యుః పృథత్పృథ గ్గ్రాసం దణ్డంచ ద్విగుణం పరమ్‌. 150

విప్రునకు వైశ్య స్త్రీని క్షత్త్రియుడు శూద్ర స్త్రీని పొందినచో వారిని ద్వితీయ (మధ్యమ- ఐదువందల కార్షాపణముల) దండముతో దండించవలెను. వైశ్యుడు శూద్రస్త్రీని పొందినచో ప్రథమ (నూరు కార్షాపణముల) దండముతో దండించవలెను. (పర) శూద్ర స్త్రీని శూద్రుడు పొందినచో నూరును వైశ్యుడు పొందినచో రెండు వందలును- క్షత్త్రియుడు పొందినచో మూడు వందలును. బ్రాహ్మణుడు పొందినచో నాలుగు వందల కార్షాపణములు దండముగ విధించ

*గర్భిణి

వలయును. అంతగా రక్షణము లేని స్త్రీల విషయమున ఇది దండము. సురక్షితల విషయమునందలి ఈ అపరాధము లకు ఇంకను అధికమగు దండము విధించవలెను. తల్లి- మేనత్త- అత్త- మేనమామ భార్య- పినతండ్రి (పెదతండ్రి) వీరి కూతురు పినతండ్రి భార్య తన మిత్రుని భార్య శిష్యుని భార్య తన అక్క ఆమెకు మిత్రురాలు -అక్క కూతురు- ముట్టుత- రాజపత్ని -సంన్యాసిని-ఉత్తమ వర్ణస్త్రీ - వీరు పొందరాని స్త్రీలు. వీరిని పొందినవాని శిశ్నమును నరకి పిదప వానిని చంపవలెను. సోదరుని పత్నిని పొందినచో మొదట (లోగడ) చెప్పిన దండమునకు రెట్టింపు దండము విధించ వలయును. చండాలస్త్రీని శ్వపచస్త్రీని పొందినచో వధమే దండము. గోవుకాక ఇతర తిర్యక్ప్రాణియోనియందు మైథునమొనర్చినవాని తల గొరిగించి ఆ పశువునకు మేతను నీటిని వానిచే ఇప్పించవలయును. గోయోనియందు మైథునము చేసినచో సువర్ణము (సవరసు బంగారము) దండము. ద్విజుడు వేశ్యను కూడినచో వేశ్యకు ఎంత శుల్కమో అంత దండము; వేశ్య పొందికకై శుల్కము ఒకనికడ తీసికొని ధన లోభముచే మరియొకనితో కూడినచో ఈ మొదటి వానికి వాడిచ్చిన దానికి రెండింతలు తిరిగి ఇచ్చుచు అంతే ధనమును రాజునకు దండముగా చెల్లించవలెను. వేశ్యను ఒకనినుద్ధేశించి తీసికొనిపోయి మరియొకనితో కూర్చినవానికి మాషమాత్రపు సువర్ణము దండము. భోగించుటకై వేశ్యను పిలుచుకొనిపోయి ఆమెకు శుల్కమీయనివాడు తానామె కొప్పుకొన్న దానికి రెండింతలు తిరిగి ఇచ్చుటతోపాటు అంతే ధనమును రాజునకు దండము చెల్లించవలయును. ఒకే స్త్రీని అనేకులు పొందినచో వారందరును వేరువేరుగా ఆమెకు ద్విగుణ శుల్కమును చెల్లించవలయును. అంతే ధనమును రాజునకు దండ ముగా ఈయవలెను.

న మాతా న పితా న స్త్రీ న ఋత్విగ్యాజ్యమానవాః |

అన్యోన్యం పతితా స్త్యాజ్యా యోగే దణ్డ్యా శ్శతాని షట్‌. 151

పతితా గురవ స్త్యాజ్యా న తు మాతా కథఞ్చన | గర్భధారణ పోషాభ్యాం తేన మాతా గరీయసీ. 152

మన్దం చ హీనౌ కర్తవ్యౌ కూటాక్షేప నివేదినౌ | అధీయానో7ప్యనధ్యాయే దణ్డ్యః కార్షాపణత్రయమ్‌. 153

అధ్యాపకశ్చ ద్విగుణం తథా77చారస్య లఙ్ఘనే | అనుక్తస్య భ##వే ద్దణ్డ స్సువర్ణస్య. తు కృష్ణలమ్‌. 154

భార్యాపుత్త్రశ్చ దాసశ్చ శిష్యో భ్రాతా సహోదరః |

కృతాపరాధా స్తాఢ్యా స్స్యూ రజ్జ్వా వేణుదళేన వా. 155

పృష్ఠతస్తు శరీరస్య నో త్తమాఙ్గే కథంచన | అతో7వ్యథా ప్రహరతః ప్రాప్తస్స్యా చ్చోరకిల్భిషమ్‌. 156

దూతీం సమాహ్వయంశ్చైవ యో నిషిద్ధం సమాచరేత్‌ | ప్రచ్ఛన్నం వా ప్రకాశంవా స దణ్డ్యః పార్థివేచ్ఛయా. 157

వాసాంసి ఫలకై శ్ల్శక్షెణ ర్నిర్ణిజ్యా ద్రజక శ్శనైః |

అతో7న్యథా హి కుర్వంస్తు దణ్డ్య స్స్యా ద్రుక్మమాషకమ్‌. 158

రక్షాస్వధికృతై శ్చైవ ప్రదేయం యైర్విలుప్యతే | కర్షకేభ్యో7ర్థామాదాయ యః కుర్యా త్కర మన్యథా. 159

తస్య సర్వస్య మాదాయ రాజా తం విప్రవాసయేత్‌ |

యే నియుక్తాః స్వకార్యేషు హన్యుః కార్యాణి కార్యిణ్యామ్‌. 160

నిర్ఘృణాః క్రూరమనస స్సర్వే కర్మాపరాధినః |

ధనోష్మణా పచ్యమానా స్తా న్నిస్స్వా న్కారయే న్నృపః. 161

కూటశాసనకర్తౄంశ్చ ప్రకృతీనాం చ దూషకా& |

స్త్రీబాలసుబ్రాహ్మణఘ్నాంశ్చ వధ్యా ద్ద్విట్సేవిన స్తథా. 162

అమాత్యః ప్రాడ్వివాకోవా యః కుర్యా త్కార్య మన్యథా |

తస్య సర్వస్య మాదాయ రాజా తం విప్రవాసయేత్‌. 163

ఎవడును తన తల్లిని తండ్రిని తను ఆశ్రయించి జీవించుస్త్రీని తన ఋత్విజుని తనచే యజనము చేయిబడు యజమానుని అకారణముగా విడువరాదు; పతితులు మాత్రము తామొకరితో నొకరు కలియక ఒకరినింకరు విడిచి యుండవలెను; వారొకవేళ కలిసి జీవించుచో వారిని రాజు ఆరువందల పణములతో దండించవలెను; గురువులు పతితులైనచో వారినైన విడువవచ్చును కాని తల్లిని మాత్రము ఏవిధముగను ఎట్టిస్థితియందును విడువరాదు. గర్భమున ధరించుట అను హేతువులచే ఆమె అందరకంటెను గొప్పది; అనధ్యాయ దినమునందు అధ్యయనము చేయువానిని మూడు కార్షాపణములతోను అందులకు అవకాశమిచ్చిన అధ్యాపకుని అంతకు రెట్టింపుతోను దండించవలయును; ఇందు చెప్పని దానికి బంగారు కృష్ణలము దండమగును; భార్యపుత్త్రుడు దాసుడు శిష్యుడు సహోదరుడగు భ్రాత (తమ్ముడు)- వీరు అపరాధము చేసినచో త్రాటితోగాని వెదురు బ్రద్ధతో కాని వీపుపై కొట్టవచ్చును; కాని తలపై నెన్నడును కొట్టరాదు; ఇట్లు కాక వేరొక విధముగా వీరిని కొట్టినచో వీనిని దొంగను దండించినట్లు రాజు దండించవలెను; దూతిని పిలిచి ఆమెతో నిషిద్ధవర్తనముతో అనుచితముగ వ్యవహరించినచో అది అతడు ప్రచ్ఛన్నముగా చేసినను ప్రకాశముగా చేసినను రాజు వానిని తనఇచ్ఛానుసారము దండించవలెను; రజకుడు వస్త్రములను నున్ననయిన పలకలతో (ఉదికి) శుద్ధము చేయవలెను; మరొక విధముగా చేసినచో వానిని మాషపుతూకపు బంగారుతో దండించవలెను; రక్షాధికృతులు (కాపలావాండ్రు) దొంగలు దొంగిలునపుడు చూచి ఆ వస్తువును చోరులనుండి తీసికొని సొంతదారునకీయక తామే హరించినను కర్షకుల నుండి పన్ను తీసికొన్న అధికారులు దానిని ప్రభవునకీయక తామే హరించినను అట్టివారి సర్వస్వమును హరించి రాజు వారిని దేశబహిష్కృతుల చేయవలెను; తాము ఏ పనులయందు నియుక్తులైరో ఆస్వామికి చెందిన అయా కార్యములను సరిగా చేయకపోగా చెడగొట్టుచుండు వారును ధనపు వేడిమి (పొగరు)చే ఉడికిపోవుచుండు వారునగు జనులను రాజు ధనహీను లనుగా చేయవలెను. రాజు చెప్పెననుచు తప్పుడు శాసనములను జరుపు వారిని- ప్రజలనుఇట్టివానితో ఇబ్బంది పెట్టువారిని స్త్రీ బాల బ్రాహ్మణ హింస చేయువారిని రాజ శత్రువులను సేవించు వారిని వధించుటయే దండము; తాను చేయవలసిన కార్యమునన్యథాగా చేయు ప్రాడ్వివాకుని (న్యాయాధి కృతుని) అమాత్యుని రాజు సర్వస్వహరణముతో దేశబహిష్క్భతుని చేయవలయును.

బ్రహ్మఘ్నశ్చ సురాపశ్చ తస్కరో గురుతల్పగః | ఏతా న్త్సర్వా న్పృథిగ్ఘింస్యా న్మహాపాతకినోనరాన్‌.

మహాపాతకినో వధ్యా; బ్రాహ్మణంతు వివాసయేత్‌ | కృతచిహ్నం స్వదేశాచ్చ శృణు చిహ్నాకృతిం తతః.

గురుతల్పే భగః కార్య స్సురాపానే సురాధ్వజః |

స్తేనేతు శ్వపదం తద్వ ద్బ్రహ్మహణ్యశిరాః పుమా& . 166

అసమ్భోజ్యా హ్యాసమ్భాష్యా అసంవాహ్యా విశేషతః |

త్యక్తవ్యాశ్చ తతా రాజ& జ్ఞాతిసమ్భన్దిబాన్ధవైః. 167

మహాపాతకినో విత్త మాదాయ నృపతి స్స్వయమ్‌ | అప్సు ప్రవేశ##యే ద్దణ్డం వరుణాయోపపాదయేత్‌. 168

సహోఢం న వినా చోరం ఘాతయే ద్ధార్మికో నృపః | సహోఢం సోపకరణం ఘాతయే దవిచారయ& . 169

గ్రామేష్వపి చ యే కేచిచ్ఛోరాణాం భక్ష్యదాయకాః | భాణ్డావకాశదాశ్చైవ సర్వాం స్తానపి ఘాతయేత్‌. 170

రాష్ట్రేషు రాజ్ఞా7ధికృతాస్సా మన్తాశ్చైవ దూషకాః |

అభ్యాఘాతేషు మధ్యస్థాః క్షిప్రం వధ్యాశ్చ చోరవత్‌. 171

గ్రామఘాతే మఠాభ##ఙ్గే పథి ఘోషాదిమర్దనే | శ క్తిత శ్చాత్య (ప్య)ధావన్తో నిర్వాస్యా స్సపరిచ్చదాః. 172

రాజ్ఞ కోశాపహర్తౄంశ్చ ప్రతికూలేచ సంస్థితా& | అరీణా ముపజరప్తౄంశ్చ ఘాతయే ద్వివిధై ర్వధైః. 173

సన్ధిం కృత్వా తు యే చౌర్యం రాత్రౌ కుర్వన్తి తస్కరాః |

తేషాం ఛిత్త్వా నృపో హస్తౌ తీక్షణశూలే నివేశ##యేత్‌. 174

తటాకభేదకం హన్యా దప్సు శుద్ధవధేన తు | యస్తు పూర్వం నివిష్టం స్యా త్తటాకస్యోదకం హరేత్‌. 175

ఆగమం చాప్యసాం భిన్ద్యా త్స దాప్యః పూర్వసాహసమ్‌ |

బ్రాహ్మఘ్నని సురాపాయిని తస్కరుని గురుతల్పగుని మహాపాతకులగు వారినందరను రాజు వేరువేరుగా అపరాధానుగుణమగు చిత్రవధలతో వధించవలయును; ఈ మహాపాతకి బ్రాహ్మణుడయినచో వానిని చంపరాదు; వాని శరీరమున ఆ దోషపు చిహ్నములను ఏర్పరచి దేశమునుండి వెడల గొట్టవలయును. చిహ్నముల ఆ కృతులను చెప్పెదను; వినుము; గురుతల్పగునికి భగచిహ్నము- సురాపాయికి మద్యపాన గృహమున నుండు జెండా -చౌర్యమయినచో కుక్క పాదచిహ్నము బ్రహ్మహత్య అయినచో శిరములేని పురుషుడు - ఈ గుర్తులు ఇట్లు వాని దేహమందేర్పరచ వలెను; వీరితో ఎవరును మాటలాడరాదు; కలిసి భుజించరాదు; బాంధవ్యము జరుపరాదు; కలిసి ప్రయాణించరాదు; ఇట్లన్ని విధముల వాని జ్ఞాతిసంబంధి బాంధవులు విడువవలయును; మహాపాతకికి గల ధనమును రాజు లాగివేసికొని దానిని నీటముంచి వరుణున కర్పించవలయును; దొంగిలినసొమ్ము దొరకనిదే దొంగను ధార్మికుడగు రాజు చంపరాదు; దొంగలిన ధనమును వాని ఉపకరణములునువానికడనే దొరికినచో అవిచారితముగ వానిని చంపవలెను; గ్రామనగరాదులందు ఈ దొంగలకు ఆహారమునో పదార్థములనో ఇచ్చువారిని ఈ చౌర్యమునకు అవకాశమునిచ్చు వారినికూడ చంపవలయును; రాష్ట్ర (రాజ్యాంశ) మునందలి రాజాధికృతులు(రాజ్యోద్యోగులు) దేశముపై ముట్టడి మొదలగు శత్రు కృతములగు కీడులు జరుగునపుడు ప్రజల మనస్సులను తమ రాజునకు విరుద్ధముగా చెడగొట్టుటయో తాము తటస్థులై పట్టించుకొ నక ఊరకుండుటయో చేసినచో వారిని రాజు దొంగలనువలెనే వధించవలయును; ఊరి దోపిడులు(మఠాది) ధర్మ సంస్థల దోపిడులు దారిదోపిడులు జరుగునపుడు తమకు శక్తి ఉండియు ఆపద నివారించుటకు పరుగెత్తనివారిని సపరివారముగా దేశమునుండి వెడలగొట్టవలయును; రాజకోశమును హరించు వారిని చిత్రహింసలతో చంపవలయును; రాత్రివేళ కన్నమువేసి దొంగతనము చేయు దొంగల చేతులు నరకి తరువాత వాడికొరుత వేయవలెను; తటాకములు చెడగొట్టిన వానిని నీటముంచి చంపవలయును; ప్రజలకును పశువులు మొదలగు వానికి ఉపయోగించుటకై చెరువులందు నిలువచేసి యుంచిన నీటిని వ్యర్థముగా వదులుటో చెడగొట్టుటో చేసిన వానిని వేయి కార్షాపణముల ప్రథమ శ్రేణి దండముతో దండించవలయును; చెరువులోనికి నీరువచ్చు మార్గములను చెరచిన వానికిని ఇదే దండము.

కాష్ఠాగారాయుధాగార దేవాగదార విభేదకా& . 176

పాపా న్పాపసలమాచారాం త్సర్వాన్హన్యాత్‌ పృథక్పృథక్‌ |

సముత్సృజే ద్రాజమార్గే యస్త్వమేధ్య మనాపది. 177

సహి కార్షాపణం దణ్డ్య స్తత్త్వమేధ్యం చ శోధయేత్‌ | ఆపద్గతో7థవా వృద్ధో గర్భిణీ బాల ఏవచ. 178

పరిభాషణ మర్హన్తి తదశోధ్య మితి స్థితిః | ప్రథమం సాహసం దణ్డ్యః పశూ న్మిథ్యాచికిత్సితే. 179

పురుషో మధ్యమం దణ్డ్య ఉత్తమేచ తథోత్తమమ్‌ | ఛత్త్రస్య ధ్వజయష్టీనాం ప్రతిమానాం చ భేదకాః. 180

ప్రతికుర్యుశ్చ తత్సర్వే దణ్డః పఞ్చశతాని చ | అదూషితానాం ద్రవ్యాణాం దూషణ భేదనే తథా. 181

మణీనామపి భేదేన దణ్డ్యః ప్రథమసాహసమ్‌ | సమంచ విషణం చైవ చరతే మూల్యతో 7పివా. 182

సమాప్నుయాచ్చ తత్పూర్వం దమం మధ్యమ మేవచ | బన్ధనానిచ సర్వాణి రాజమార్గే నివేశ##యేత్‌. 183

క్లిశ్యన్తో యత్ర దృశ్యన్తే వికృతాః పాపకారిణాః | ప్రాకారస్య చ భేత్తారం పరిఘాణాం చ భేదకమ్‌. 184

ద్వారాణాం చైవ భేత్తారం క్షిప్రం నిర్వాసయే త్పుపాత్‌ |

ములకర్మాభిచారేషు కర్తవ్యో ద్విశతీ దమః. 185

అబీజవిక్రయీ యశ్చ భీజోత్కర్షక ఏవచ | మశ్యాదాభేదకశ్చైవ వికృతం బన్ధ మాప్నుయాత్‌. 186

సర్వసఙ్కరపాపిష్ఠం హేమకారం నరాధిపః | అన్యాయే వర్తమానంచ ఛేదయే ల్లవశః క్షురైః. 187

ద్రవ్య మాదాయ వణిజ మనర్ఘేనావరున్ధతామ్‌ | ద్రవ్యాణాం దూషకో యశ్చ ప్రతిచ్ఛన్నస్య విక్రయీ. 188

మధ్యమం ప్రాప్నుయా ద్దణ్డం కూటకర్తా తథో త్తమమ్‌ |

రాజా పృథక్పృథ క్కుర్యా ద్దణ్డం చో త్తమసాహసమ్‌. 189

కోష్ఠాగారా77 యుధాగార దేవాలయములను పాడుచేసిన పాపప్రవృత్తులగు పాపులను వేరువేరు రీతుల చంపవలయును; తనకే ఆపదయు లేనిదే రాజ మార్గమునందు మల విసర్జనముచేసిన వారిని కార్షాపణముతో దండించవలెను; వారిచేతనే ఆ అమేధ్యమును తీసి వేయించి శుద్ధి చేయించ వలెను; ఆపదయందున్న వాడు (రోగి) వృద్ధుడు గర్భిణి బాలుడు ఐనచో వారిని తిట్ట (చీవాట్లు వేయ) వలెను; వారిచే శుద్ధి చేయించనక్కరలేదు; పశువులకు తప్పుడు చికిత్స చేసినచో సాధారణ దండము (207దుడ్లు) మనుష్యునకు చేసినచో మధ్య దండము (504 దుడ్లు) ఉత్తమ పురుషునకు చేసినచో ఉత్తమ దండము విధించవలెను; రాజదేవ సంబంధులగు ఛత్త్రమునో ధ్వజయష్టినో (జెండా స్తంభమునో) ప్రతిమలనో చెడగొట్టిన వారిచే అవి సరిచేయించవలయును; లేదా వారికి ఐదు వందల కార్షాపణములు విధించవలెను; ఏ దోషములేని మంచి వస్తువులను అపవిత్ర పరచినను చెడగొట్టినను మణులు పగులగొట్టుటవంటి తప్పుతచేసినను ప్రథమ శ్రేణి (1008 కార్షాపణముల) దండముతో దండించవలయును, లేదా వానివెల ఇప్పించవలెను; ఆయా వస్తువుల వెలలను తారుమారుగా నిర్ణయించినను అట్టి వెలలతో అమ్మినను మొదటి విధమగు తప్పిదమును ప్రథమ శ్రేణి (1008 కార్షాపణముల) దండమును రెండవ విధమగు తప్పిదమునకు మధ్యమ (504 కార్షాపణముల) దండమును విధించవలయును; బంధన గృహములు (చెరసాలలు) అన్నియు రాజమార్గమునందు నిర్మించవలయును; అందుచే పాపకారులు వికృతులయి అనుభవించు శిక్షా క్లేశము లను జనులందరును చూతురు; ప్రాకారములను అగడితలను (దుర్గ) ద్వారములను చెడగొట్టు వానిని పురమునుండి వెడల గొట్టవలెను; అభిచార కర్మలతో ప్రజలను బాధించు వారిని రెండు వందల కార్షాపణములతో దండించ వలయును; విత్తనములు కాని వానిని విత్తనములని చెప్పి మోసగించి అమ్ము వానిని (విత్తిన) బీజములను అపహరించు వానిని పొలి మేర లను హద్దురాలను భంగపరచు వానిని వికృతములగు బంధనములతో చెరయందుంచ వలయును; కల్తీపనులు చేయు పాపిష్ఠుడగు బంగారు పని వానిని చురకత్తితో ముక్కలు ముక్కలుగా నరుకవలయును; అమ్మకమునకై పదార్థములు సేకరించి నిలువ ఉంచుకొని తక్కువ వెలగానున్నదని అవి ప్రజకకమ్మక వెలలు ఎక్కువ అగుటకై ఎదురు చూచుచుండు వానిని కలితీకలిపి ద్రవ్యములమ్ము వానిని రహస్యముగా వస్తువులను అధిక మూల్యమున కమ్ము వానిని మధ్యమ శ్రేణి (ఐదు వందల నాలుగు కార్షా పణముల) దండముతో దండించవలెను; ఇందుకై కుట్ర చేయు అధికారికి ఉత్తమ శ్రేణి (1008 కార్షాపణముల) దండము విధించవలెను.

శాస్త్రాణాం యజ్ఞతపసాం దేశానాం క్షేపకృ న్నరః | దేవతానాం సతీనాంతు ఉత్తమం దణ్డ మర్హతి. 190

ఏకస్య దణ్డపారుష్యే బహునాం ద్విగుణో దమః | కలహో యద్గతో దాప్యో దణ్డశ్చ ద్విగుణ స్తతః. 191

మధ్యమం బ్రాహ్మణం రాజా విషయా ద్విప్రవాసయేత్‌ |

లశునం చ పలాణ్డుం చ సూకరం గ్రామకుక్కుటమ్‌. 192

తథా పఞ్చనఖం సర్వం భక్ష్యాదన్యత్ర భక్షణమ్‌ | వివాసయే తిక్షప్రమేవ బ్రాహ్మణం విషయా త్స్వకాత్‌. 193

అభక్ష్యభక్షణ దణ్డ్య శ్శూద్రో భవతి కృష్ణలమ్‌ | బ్రాహ్మణ క్షత్త్రియవిశాం చతుస్త్రి ద్విగుణం స్మృతమ్‌. 194

యస్సాహసం కారయతి స దణ్డో ద్విగుణం దమమ్‌ |

యస్త్వేవముక్త్వా7హం దాతా కారయే త్స చతుర్గుణమ్‌. 195

సన్దిష్టస్యాప్యదాతా చ సముద్రగృహభేదకః | పఞ్చాశత్పణకో దణ్డ స్తయోః కార్యో మహీభృతా. 196

అస్పృశ్యం చ స్పృశ న్నార్యో హ్య యోగ్యో యోగ్యకర్మకృత్‌ |

పుంస్త్వహర్తా పశూనాం చ దాసీగర్భవినాశకృత్‌. 197

పఞ్చాశత్పణకో దణ్డ స్తయోః కార్యో మహీభృతా |

శూద్రః ప్రప్రజితానాం చ దైవే పిత్ర్యే చ భోజకః. 198

అవ్రజన్‌ బాఢ ముక్త్వాతు తథైవచ నిమన్త్రణ | ఏతే కార్షాపణశతం సర్వే దణ్డ్యా మహీభుజా. 199

దుఃఖోత్పాదిగృహే ద్రవ్యం క్షిపే ద్దణ్డ్యస్య కృష్ణలమ్‌ | పితాపుత్త్రవిరోధేచ సాక్షినాం ద్విశతో దమః. 200

స్యాన్నరస్య తయో ర్యస్స్యా త్తస్యాప్యష్టశతో దమః | తులాశాసనమానానాం కూటకృన్నాణకస్య చ.

ఏభిశ్చ వ్యవహార్తా య స్స దణ్డ్యో దమ ముత్తమమ్‌ | విషాగ్నిదా మ్పతిగురునిజాపత్యప్రమాపణీమ్‌. 202

వికర్ణనాసికాం వ్యోష్ఠీం కృత్వా గోభిః ప్రమాపయేత్‌ |

ఖలస్య (గ్రామస్య) దాహకా యేచ యేచ క్షేత్రస్య వేశ్మనః. 203

రాజపత్న్యిభిగామీచ దగ్ధవ్యాస్తే కటాగ్నినా | ఊనం వా7ప్యధికం వాపి లిఖేధ్యో రాజశాసనమ్‌. 204

పారదారికచౌరంతు ముఞ్చతో దణ్డ ఉత్తమః |

శాస్త్రములను యజ్ఞములను తపస్సులను దేశములను దేవతలను పతివ్రతలను నిందించు వానికి సహస్ర కార్షాపణముల దండము విధించవలయును; ఒకవ్యక్తి (ఒక రాజాధికారి) అనేకుల విషయమున దండపారుష్యము చూపి తప్పునకుమించి దండించినచో ఈ దండించిన వానికి అపరాధికి విధించవలసిన దండమునకు రెట్టింపు దండము విధించ వలయును; కలహమయిన చోట్ల ఆ కలహమునకు మూల భూతుడగు వానికి ఇతరాపరాధులకు విధించుదానికి ద్విగుణ దండము విధించవలెను; ఇట్టివాడు బ్రాహ్మణుడైనచో వానిని దేశమునుండి బహిష్కరించవలెను; వెల్లిఉల్లి పెద్దఉల్లి సూకరము ఊరకోడి ఐదు గోళ్లుకల ప్రాణులు- మొదలగు అభక్షణీయముల భక్షించిన బ్రాహ్మణుని శీఘ్రమే దేశమునుండి బహిష్కరించవలయును; అభక్ష్య భక్ష్యణము చేసిన శూద్రునకు కృష్ణలము దండము; వైశ్యునకును క్షత్త్రియునకును బ్రాహ్మణునకును వరుసగా దీనికి రెండింతలు మూడింతలు నాలుగింతలు దండమగును; సాహసపు పనులకు ప్రేరకుడగు వానికి ఆపని చేసిన అపరాధికి విధించు దానికి రెట్టింపు దండము విధించవలెను; ఎంత అయిన కానిమ్ము; నేనిత్తును; అని ఉబ్బించి ప్రాత్సాహించి అకృత్యము చేయించిన వానికి అపరాధికి కంటె నాలుగింతల దండము; ఇతనికి ఇది ఇమ్మని రాజు ఆదేశించగా అది అతనికి ఈయని వానికిని భీగముకాని ముద్రకాని వేసియున్న ఇంటి బీగమునో ముద్రనో పగులగొట్టి చెడగొట్టి ఇట్లు తెరపించిన వానికి ఏబది పణముల దండము విధించవలెను; ఆర్యుడు (త్రైవర్ణికులలోనివాడు) అంటరాని వానినంటినను అయోగ్యుడు యోగ్యమగు (తన యోగ్యతకు మించిన) పనిచేసినను పశువుల పుంస్త్వము హరించి నను దాసికి గర్భపాతము చేసినను దైవపైతృక కార్యములందు శూద్ర సంన్యాసిని భుజింపజేసినను దైవపైతృక కార్యము లందు నిమంత్రితుడై వత్తునని పోకున్నను వీరికందరకును (ప్రతియొక అధికారికిని) నూరు కార్షాపణములు దండము విధించవలెను; దుఃఖ (హాని) కరద్రవ్యములను ఇతరుల ఇండ్లలో ఉంచిన వానికి కృష్ణలము దండము; తండ్రి కొడుకు లకు కలిగిన కలహముతో సాక్ష్యము పలికిన వానికి రెండు వందల కార్షాపమములు దండము; ఇట్టివాడు శూద్రుడు కాక ఆర్యుడు (త్త్రెవర్ణికులలోని వాడు) అయినచో వారిలో వైశ్యునకు నాలుగువందలు క్షత్త్రియునకు ఆరువందలు- బ్రాహ్మణునకు ఎనిమిది వందలు- కర్షాపణముల దండమగును; తుల- శాసనము (చట్టము) మానము(తూకపు రాల్లు కొల తల పాత్రలు) నాణములు- ఇవి తప్పుడువి చేసినను వానితో వ్యవహరించినను వారికి వేరువేరుగ సహస్ర కార్షాపణముల దండము; విషము పెట్టి(ట్టు) నదియు ఇండ్లు మొదలగు వానికి నిప్పింటించి (చు) నదియు పతినో అత్తమామలనో తల్లి దండ్రులనో మరి ఇతరులగు పెద్దలనో తన సంతానమునో చంపి(పు)నదియు అగు స్త్రీని చెవులు ముక్కులు పెదవులు నరికించి ఎద్దులతో (త్రొక్కించియో పొడిపించియో) చంపవలెను; పంటకళ్లమునో గ్రామమునో పొలమునో ఇంటినో కాల్చు(ల్చిన) వారును రాజపత్నీగాములు కటాగ్నితో (చాపలు చుట్టి అంటించిన మంటలతో) చంపనర్హులు; రాజశాసనమును ఎక్కువయో తక్కువయో చేసి లిఖించినవాడును పరదారహణము చేసిన చోరుని దండించక వదలిన వాడునగు వానిని(రాజాధికృతుని) సహస్ర కార్షాపణములతో దండించవలయును.

అభ##క్ష్యేణ ద్విజం దూష్య దణ్డ ఉత్తమసాహసః. 205

క్షత్త్రియం మధ్యమో వైశ్యం ప్రథమ శ్శూద్రమర్దకః | మృతాఙ్గలగ్నవిక్రేతు ర్గాస్తు తాడయితు స్తథా. 206

రాజయానాసనారోఢు ర్దణ్డ ఉత్తమసాహసః | యో మన్యేతా7జితో7స్మీతి న్యాయేనాపి పరాజితః. 207

త మా యాన్తం పున ర్జిత్వా దణ్డయే ద్ద్విగుణం దమమ్‌ |

ఆహ్వానకారీ మధ్య స్స్యా దనాహుత్త స్తథా హ్వయ&. 208

దణ్డికస్యచ యో హస్తా దభియుక్తః పలాయతే | హీనఃపురుషకారేమ త ద్దద్యా ద్దణ్డికోధనమ్‌. 209

ప్రేష్యాపరాధా త్ప్రేష్యస్య స దణ్డ్యా (దండ్యశ్చా) చ్చార్దమేవచ |

దణ్డార్థం నియమార్థంచ నీయమానేషు బన్దనమ్‌. 210

యది కశ్చి త్పలాయేత దణ్డ శ్చాష్టగుణం భ##వేత్‌ | అనిన్దితవివాదేషు నఖరోమావతారణమ్‌. 211

కారయే ద్య స్స పురుషో మధ్యమం దణ్జ మర్హతి | బన్దనం చాప్యవధ్యస్య బలా న్మోచయితా భ##వేత్‌. 212

వధ్యం విమోచయే ద్యస్తు దణ్డా ద్ద్విగుణభా గ్భవేత్‌ |

దుష్టానాం వ్యవహార్తౄణాం సభ్యానాం ద్విగుణో దమః. 213

రాజ్ఞా త్రింశద్గుణో దణ్డః ప్రక్షేప్య ముదకే భ##వేత్‌ | అల్పదణ్డ7ధికం కుర్యా త్ప్రబలే చాల్పమేవచ. 214

అల్పాధికంతు తం దణ్డ్యం సభ్యో దద్యా త్స్వాకా ద్గృహాత్‌ |

యావా నవధ్యస్య వధే తావా న్వధ్యస్య రక్షణ. 215

అధర్మో నృపతే ర్దృష్ట స్తథా వధ్యస్య మోక్షతే | న జాతు బ్రాహ్మణం హన్యా త్సర్వపాపే ష్వవస్థితమ్‌. 216

ప్రవాసయే త్స్వకా ద్రాష్ట్రా త్సమగ్రధనసంయుతమ్‌ |

న జాతు బ్రాహ్మణం వధ్య త్పాప మప్యధికం భ##వేత్‌. 217

యస్మా త్తస్మా త్ప్రయేత్నేన బ్రహ్మహత్యాం వివర్జయేత్‌ |

అదణ్డ్యా న్దణ్డయే ద్రాజా దణ్డ్యాంశ్చైవాప్య దణ్డయ&. 218

అయశో మహాదాప్నోతి నరకం చైవ గచ్ఛతి |

జ్ఞాత్వా7పరాధం పురుషస్య రాజా కాలం తథా చానుమతం ద్విజానామ్‌. 219

దణ్డ్యషు దణ్డం పరికల్పయేత్తు పాపస్య యద్య చ్ఛమనంచ కుర్యాత్‌. 219u

ఇతి శ్రీమత్స్య మహాపురాణ రాజధర్మే రాజకర్తవ్య దణ్డవిధిర్నామ

షడ్వింశత్యుత్తర ద్విశతతమో7ధ్యాయః.

అభక్షణీయమగు పదార్థమును భక్షింపజేసి బ్రాహ్మమ క్షత్త్రియ వైశ్య శూద్రులను అపవిత్రపరచినచో వరుసగా వేయి- ఐదువందల- వంద -ఏబది- కార్షాపణములు డండము! చచ్చిన శవముల దేహములందలి పదార్థములనో సొమ్ములనో అమ్మువాడును గోవులను కొట్టువాడును రాజయానములనో ఆసనములనో ఆరోహించిన(చు) వాడును సహస్ర కార్షాపణములతో దండ్యులు: తాను న్యాయ్యముగ ఓడియు నేను ఓడలేదని తలచు (చివిర్రవీగు) వానిని మరల జయింపజేసి రెట్టింపు దండము విధించవలయును; ఒకడు మరియొకనిని తన ఇంట భోజన నిమంత్రణాదికమునకై మొదట (చాలముందుగా) ఆహ్వానించి యుంéడక ఆవశ్యకమగునాడు పోయి నేనిదివరకే నిన్ను సరిగా పిలిచి యుంటిని; వత్తువాలేదా! అని మాటలాడు వానిని మధ్యమ (ఐదువందల కార్షాపణముల) దండముతో దండించవలయును; అభియుక్తుడు (అపరాధియయి శిక్షకు పాత్రుడగుచు శిక్ష విధించబడినవాడు) శిక్షాదాతయగు దాండికుని (దండాధికృతుని) చేతినుండి తప్పించుకొని పారిపోవుచో అపుడు దండికుడు వానిని పట్టుకొనుటకును వాడు తప్పించుకొని పోకుండుటకును యత్నము చేయనట్లు ఋజువైనచో ఈ దండాధికృతుడు శిక్షాపాత్రుడు చెల్లించవలసిన దండమున చెల్లించవలెను; ఈ అపరాధి తప్పించుకొని పోవుటలో ఇతనిని పనియందుచుకొనిన వాడు హేతువని ఋజువయినచో దండధనములో సగము అతడే చెల్లించవలెను; పలువుర నపరాధులనొకేమారు నిగ్రహము (శిక్షాచరణము) చేయుటకో చెలయందు బంధించుటకో తీసికొని పోవుచుండగా వారిలో నొకడు తప్పించుకొని పోయినచో ఆ తప్పించుకొని పోయినవాడు వారందరతోపాటు వివాహితమయిన దండముకాక దానిలో ఎనిమిదవపాలు అధిక దండము చెల్లించవలయును; వివాదమునందు అనిందితుడయిన వానిని నిందితునిగా నిర్ణయించి వానికి శిక్షారూపమున కేశనఖములు కత్తిరింపించిన (రాజ పురుషుని) రాజాధికృతుని ఐదువందల కార్షాపణములతో దండించవలయును; అవధ్యుడగు (వధదండార్హుడు కాకున్నను అపరాధానుసారము చెరయందుంచబడిన వానిని) తప్పించి తన బలముతో విడిపించినను వధ్యుని వధమునుండి విడిపించినను అట్టివానిని (రాజ్యాధికృతుని) ద్విగుణ దండముతో దండించవలెను; లోభవశముననో ఇతర హేతువులతోనో న్యాయాధికృత సభాసభ్యులు వివాదములందు సరిగ వ్యవహరించనిచో వారికి ద్విగుణదండము; ఈ పొరబాటు రాజే చేసినచో ద్విగుణదండమును రాజు చెల్లించుటయేకాక దానిలో ముప్పదవ వంతు అధికముగాతీసి దానిని వరణార్పణమని నీటిలో వేయవలెను; సభ్యులు సరిగవ్యవహరించక అల్పదండ స్థానమున అధికదండమును గాని అధికదండ స్థానమున అల్పదండమునగాని విధించినచో అధికాంశమును సభ్యుడు తన ఇంటి నుండి చెల్లించవలయును; అవధ్యుని వధించుటయు వధ్యుని రక్షించుటయు విడిపించుటయు జరిగిన సందర్భములలో ఆదోషము రాజు పొందును. సర్వపాపకర్తయైనను బ్రాహ్మణునెప్పటికిని చంపరాదు; వాని సర్వధనములతో వానిని రాష్ట్రమునుండి వెడలగొట్టవలయును; ఇట్లు పాపమధికముగ చేసినను బ్రాహ్మణుని చంపరాదని నందున ప్రయత్నపూర్వకముగా రాజు బ్రహ్మ హత్యము విడువవలెను; (అనగా బ్రాహ్మణుడు వధార్హమగు పాపములు చేయకుండునట్లు రాజులు ముందుజాగ్రత్తగా పడవలయును.) రాజు అదండ్యులను దండించినను దండ్యులను దండించట విడిచినను అధికమగు అకీర్తిని పొందును ; పరలోకమున నరకమును పొందును.

కావున రాజు ఆయా పురుషులు (జనులు) చేసిన అపరాధమును గురుతించి దేశకాలస్థితుల నాలోచించి ద్విజుల అనుమతినికూడ గ్రహించి దండ్యులకు దండమును విధించవలయును; దీనిచే నతనికి పాపశాంతియగును.

ఇతి శ్రీ మత్స్య మహాపురాణమున రాజధర్మమున రాజ కర్తవ్యదండ విధియను

రెండు వందల ఇరువది ఆరవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-2    Chapters