Sri Matsya mahapuramu-2    Chapters   

త్రయోవింశత్యుత్తరద్విశతతమో7ధ్యాయః

రాజధర్మాః- దానోపాయవిచారః.

శ్రీమత్స్య ః సర్వేషా మ ప్యుపాయానాం దానం శ్రేష్ఠతమం మహాత్‌ |

సుదత్తేనేహ భవతి దానేనోభయలోకజిత్‌. 1

న సో7స్తి రాజ న్దానేన వశగో యో న జాయతే | దానేన వశగా దేవా భవన్తీహ సదా నృణామ్‌. 2

దానమేవోపజీవన్తి ప్రజా స్సర్వా నృపోత్తమ | ప్రియో హి దానవా న్లోకే సర్వసై#్యవోపజాయతే. 3

దానవానచిరేణౖవ తథా రాజా పరాన్జయేత్‌ | దానవానేన శక్నోతి సంహతా న్భేదితుం పరా&. 4

యద్యప్యభేధ్యా (లుబ్దా) గమ్భీరాః పురుషా స్సాగరోపమాః |

న గృహ్ణన్తి తథా7ప్యేతే జాయన్తే పక్షపాతినః. 5

అన్యత్రాపి కృతం దానం కరోత్యన్యాన్యథా వశే | ఉపాయేభ్యః ప్రశంసన్తి దానం శ్రేష్ఠతమం జనాః. 6

దానం శ్రేయస్కరం పుంసాం దానం శ్రేష్ఠతమం పరమ్‌ | దానవానేన లోకేషు యత్నేన ధ్రియతే సదా. 7

న కేవలం దానపరా జయన్తి భూలోకం మేకం పురుష ప్రవీరాః |

జయన్తి తే రాజసురేన్ద్రలోకం సుదుర్జయం యో విబుధాధివానః. 8

ఇతి శ్రీ మత్స్య మహాపురాణ రాజధర్మే దానోపాయకథనం

నామ త్రయోవింశత్యుత్తరద్విశతతమో7ధ్యాయః.

రెండు వందల ఇరువది మూడవ అధ్యాయము.

దానోపాయ విచారము.

శ్రీ మత్స్యడు మనువునకు ఇట్లు చెప్పెను; సర్వోపాయములలో దానము శ్రేష్ఠతమమును- గొప్పదియును; అది చక్కగ ఇచ్చినచో (ఉభయ) ఇహపర లోకముల జయించగలుగును; రాజా! దానముచే వశవ ర్తికాని వాడెవడునులేడు; ఈ లోకమునందలి మానవులకును దేవతలు కూడ దానముతోనే సదా వశగులు అగుచున్నారు; నృపోత్తమా! సర్వ ప్రజలును దానమును అవలంబించియే జీవనము చేయగలుగుచున్నారు; (అందరకును దానమే జీవన సాధనము); ఏలయన దానము చేయు ప్రతియొకడును ప్రతియొకనికి ప్రీతిపాత్రుడగుచున్నాడు. అటులే దానపరుడగువాడు అచిరకాలముననే వరుల జయించగలుగును. దానవంతుడే సుసంహతులగు శత్రువులను కూడ భేదింపగలుగును. (కావున భేద ప్రయోగమున గూడ దానము ఉపయుక్తమగును;) అభేద్యులు- అలుబ్ధులు- గంభీరులు- సాగర సమానులునగు పురుషులు నుండవచ్చును. వారు ఇతరులిచ్చినది తీసికొనని మాట వాస్తవమే; అయినను అట్టివారు కూడ దానపరుడు ఉదారుడునగు రాజునందు పక్షపాతము వహింతురు; ఇతరుల విషయమున చేసిన దానము కూడ ఆదాన గ్రహీతలనేకాక ఇతరులను కూడ వశీకరించుకొనును. అందుచేతనే జనులు ఇతరోపాయములకంటె దానము శ్రేష్ఠతమమందురు. దానము పురుషులకు శ్రేయస్కరము. దానము మిగుల శ్రేష్ఠతమము. దానవంతుడే (ఇహపర) లోకములందు యత్నపూర్వకముగా నిలుపబడును. (దేవతలు అతనికి ఇహపర సుఖములనిచ్చు వానినున్నత స్థానమునందు నిలుపుదురు). దానపరులగు పురుష ప్రవీరులు కేవలము ఒక భూలోకమును మాత్రము జయించరు. రాజా! వారు విబుధులు (దేవతల) అధివాసమును జయింప (పొంద) సులభముగా అలవి కానిదియనగు సురేంద్ర లోకమునుగూడ జయింతురు.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున రాజ ధర్మమున భేదోపాయమ కథనమను

రెండు వందల ఇరువది మూడవ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters