Sri Matsya mahapuramu-2    Chapters   

ద్వావింశత్యుత్తర శతతమో7ధ్యాయః.

రాజధర్మాః- భేదోపాయ విచారః.

శ్రీ మత్స్యః: పరస్పరంచ యే దుష్టాః క్రుద్ధా భీతా విమానితాః |

తేషాం భేదం ప్రయఞ్జీత; భేదసాధ్యా హి తే మతాః. 1

యే తు యేనైవ దోషేణ పరస్మా న్నాపి బిభ్యతి | తే తు తద్ధోషపాతేన భేదనీయా భృశం తతః. 2

ఆత్మాయాం దర్శయే దాశాం పరస్మాద్దర్శయే ద్భయమ్‌ |

ఏవం హి భేదయే ద్భిన్నా న్యథావ ద్వశ మానయేత్‌. 3

సంహతా హి వినా భేదం శ##క్రేణాపి సుదుస్సహాః | భేదమేవ ప్రశంసన్తి తస్మా న్న

యవిశారదాః. 4

స్వముఖేనాశ్రయే ద్భేదం భేదం పరముఖేన చ పరీక్ష్య సాధు మన్యేత భేదం పరముఖా చ్ఛ్రుతమ్‌. 5

సద్య స్స్వకార్య ముద్దిశ్య కుశ##లై ర్యే హి భేదితాః | భేదినస్తే వినిర్దిష్టా నైవ రాజ్ఞా7ర్థవాదిభిః. 6

అన్తః కోపో బహిఃకోపో యత్ర స్యాతాం మహీక్షితామ్‌ | అన్తఃకోపో మహాం స్తత్ర నాశకః పృథివీక్షితామ్‌. 7

సామన్తకోపో బహ్యస్తు కోపః ప్రోక్తో మనీషిభిః| మహిషీయువరాజభ్యాం తథా సేనాపతే ర్నృప. 8

అమాత్యమన్త్రిణాం చైవ రాజపుత్త్రే తథైవ చ| అన్తః కోపో వినిర్దిష్ఠో దారుణః వృథివీక్షితామ్‌. 9

బాహ్యకోపే సముత్పన్నే సుమహత్యపి పార్థివః | శుద్దాన్తస్తు మహాభాగ శ్రీఘ్రమేవ జయీ భ##వేత్‌. 10

అపి శక్రసమో రాజా అన్తః కోపేన నశ్యతి | సో7న్తః కోపః ప్రయత్నేన తస్మా ద్‌క్ష్యో మహీక్షితా. 11

పరతః కోప ముత్పాద్య భేదేన విజిగీషుణా | జ్ఞాతీనాం భేదనం కార్యం పరేషాం విజిగీషుణా. 12

రక్ష్య స్సతు ప్రయత్నేన జ్ఞాతిభేద స్తథా77త్మనః | జ్ఞాతయః పరితప్యన్తే సతతం పరితాపితాః. 13

తథా7పి తేషాం కర్తవ్యం సుగమ్భీరేణ చేతసా | గ్రహణం దానమానాభ్యాం భేద స్తేభ్యో భయఙ్కరః. 14

*సజ్ఞాతి రనుగృహ్ణాతి న జ్ఞాతి ర్దగ్ధు మిచ్ఛతి | జ్ఞాతిభి ర్భేదనీయా స్స్యూ రిపవ స్తేన పార్థివైః. 15

భిన్నా హి శక్త్యా రిపవః ప్రభూతా స్స్వల్పేన సైన్యేన నిహస్తు మాజౌ |

సుసంహతానాం హి తతస్తు భేదః కార్యో రిపూణాం నయశాస్త్ర విద్భిః. 16

ఇతి శ్రీ మత్స్య మహాపురాణ రాజధర్మే భేదోపాయకథనం నామ

ద్వావింశత్యుత్తర ద్విశతతమో7ధ్యాయః.

రెండు వందల ఇరువది రెండవ అధ్యాయము.

భేదోపాయ విచారము.

శ్రీ మత్స్యుడిట్లు మనువుతో చెప్పెను: రాజు తనకు గల శత్రువులనేకులు పరస్పరము (ఒకరి విషయమున మరియొకరు) దుష్టులుగా క్రుద్ధులుగా ఒకరిని చూచి మరియొకరు భయపడువారుగా ఒకరివలన మరియొకరు అవమానితులుగా ఉన్నచో (వారొకరితో మరియొకరు కలియ కుండునట్లు) వారిపై భేదోపాయము ప్రయోగించవలెను: ఏలయన ఇట్టివారు భేదోపాయ సాధ్యులు; ఎవరు ఏ దోషము కలవారై యుండి గర్వించి ఇతరుల వలన భయపడరో వారియందా దోషమునే ప్రయోగింతి వారిని భేదోపాయముతే పరస్పరము విడదీయవలెను; అందులకై వానికి తనవలని ఆశనుగాని పరులనుండి భయమునుగాని చూపవలెను; ఇట్లు వారిని భేదపరచనిదే వారిని ఓర్చుకొనుట ఇంద్రునకు కూడ సాధ్యము కాదు; కావున నీతిశాస్త్ర విశారదులు భేదోపాయమునే ప్రశంసింతురు; భేదోపాయమును తాను స్వయముగనైన ప్రయోగించు వచ్చును: పరుల ద్వారముననైన ప్రయోగించవచ్చును. ఈ రెండవ విధమయిన దానిని తాను పరీక్షించి దాని ఔచిత్యమును నిర్ణయించుకొనవలెను ; ఇంతేకాదు; రాజు తన కార్యసిద్ధినుద్దేశించి తన శత్రువులను పరస్పరము భేద పరచిన తరువాత గూడ వారు భేదపడినారు లెమ్మని నమ్మియుండరాదని అర్థశాస్త్రకుశలురగు అర్థ (రాజనీతి) వాదులందురు.

రాజుపై కోపించియుండు వారి కోపము అంతఃకోపము బహిఃకోపమునని రెండు విధములు; ఈ రెండింటి యందును అంతఃకోపము బలవత్తరమగుటలో గొప్పది. అది రాజులకు నాశము కలిగించును. సామంతుల కోపము బాహ్య కోపము; మహిషీ- యువరాజ- సేనాపత్యమాత్య మంత్రి రాజపుత్త్రాదుల కోపమంతఃకోపమునని మనీషులందరు. ఇది రాజులకు దారుణతరమయినది; ఇందుచేతనే బాహ్యకోపము చాల గొప్పదిగా ఉత్పన్నమయియున్నను అంతఃకోపము శోధిత మయినచో ఈ రెండవ దానినతడు సులభముగా శీఘ్రముగా జయించును. ఇంద్రనముడగు రాజు కూడ అంతఃకోపముచే నశించును . కావున రాజెప్పుడును అంతఃకోపమును (నుండి) యత్నముతో రక్షించుకొనవలెను. భేదోపాయముతో శత్రువుల జయింపగోరు రాజు శత్రు పక్షమునందలి జ్ఞాతుల నడుమ మరి ఇతరులగు (మూడవ) వర్గము వారి ద్వారమున భేదము పుట్టించి వారిని చీలదీసి వశపరచుకొనవలెను. ఇట్లే- తన విషయమున శత్రువులు ఈ జ్ఞాతిభేదోపాయమును ప్రయోగింతురేమో యని ఎచ్చరికతో నుండవలయును; ఏలయన -జ్ఞాతులు ఎల్లప్పుడు మొదలే తమ జ్ఞాతుల విషయమున లోలోపల

* న జ్ఞాతి మనుగృహ్ణన్తి నజ్ఞాతిం వై(వి)శ్వసన్తిచ.

మండిపడుచుందురు. వారిని ఇంకను రెచ్చగొట్టిన మరింత పరితాప (మండి) పడుచుందురు. అయినను రాజు తన శత్రు రాజులు తనకును తన జ్ఞాతులకును నడుమ భేదము పుట్టించకుండుటకై అతి గంభీరచిత్తుడై దానముతో (సం) మానముతో వారిని తన వైపునకు త్రిప్పియుంచుకొనవలెను. ఏలయన వారినుండి తనకు భేదము కలుగుచో అది చాల భయంకరము అగును. ఏలయన జ్ఞాతి ఎల్లప్పుడును తన జ్ఞాతిని దహింపగోరునేకాని అనుగ్రహించడు. కావున రాజులెల్లప్పుడును తమ శత్రువులను వారి జ్ఞాతులనుండి భేదపరచవలెను.

శత్రువులు అధిక సంఖ్యాకులును ప్రబలురును ఐనను వారిని భేదపరచిన మీదట స్వల్ప సేనతోగూడ యుద్ధమున చంప( జయింప) సాధ్యులగుదురు. కావున నయ(రాజనీతి) శాస్త్రవేత్తలగు రాజులు తమ శత్రువుల సుసంహతులుగా (పరస్పరము దృఢమిత్రులుగా) ఉండినను వారిని భేదపరచవలయును.

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున రాజ ధర్మమున భేదోపాయ కథనమను

రెండు వందల ఐరువది రెండవ అధ్యాయము

Sri Matsya mahapuramu-2    Chapters